అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాకు తొలిరోజు ఎన్ని కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయనేది మరికాసేపట్లో తెలుస్తుంది. ఎంతొస్తుందనే విషయం పక్కనబెడితే ఇప్పుడు బాలీవుడ్‌లో బన్నీ తనదైన బ్రాండ్ రికార్డ్ సెట్ చేశాడు. తొలిరోజు కలెక్షన్స్‌తో ఏకంగా దిగ్గజ షారుఖ్ ఖాన్‌నే అధిగమించేశాడట. నార్త్ అంతా ఇప్పుడు ఇదే టాక్.
(ఇదీ చదవండి: పుష్ప 2 'జాతర' సాంగ్ రిలీజ్ చేశారు!)
తెలుగుతో పోలిస్తే 'పుష్ప 2'కి ఉత్తరాదిలో బీభత్సమైన హైప్ ఉంది. పాట్నాలో ఈవెంట్ జరగ్గా.. దానికి వచ్చిన లక్షలాది జనమే ఇందుకు బెస్ట్ ఉదాహరణ. అందుకు తగ్గట్లే నార్త్‌లో తొలిరోజు ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అలా ఏకంగా హిందీ వెర్షన్‌కి తొలిరోజు రూ.67 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయట.
గతంలో షారుక్ 'జవాన్' మూవీకి రూ.64 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చాయి. ఇప్పుడు దీన్ని దాటేసిన అల్లు అర్జున్.. బాలీవుడ్‌లో తన జెండాని మరింత బలంగా పాతేశాడు. ఓ రకంగా చెప్పాలంటే బాలీవుడ్‌ని ఇకపై బన్నీవుడ్ అని పిలొచ్చేమో! తొలిరోజే ఈ రేంజులో ఉందంటే.. వీకెండ్ అయ్యేసరికి తెలుగు సంగతి పక్కనబెడితే హిందీలో సగం రికార్డులు 'పుష్ప 2' దెబ్బకు గల్లంతవడం గ్యారంటీ.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 19 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment