'పుష్ప 2' మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. అల్లు అర్జున్ యాక్టింగ్‌తో రప్పా రప్పా చేశాడు. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే జాతర ఎపిసోడ్ అయితే వేరే లెవల్ అనేలా ఉంది. ముందు నుంచి చెబుతున్నట్లే ఆ పార్ట్ వచ్చినప్పుడు.. చూస్తున్న ఆడియెన్స్‌కి పునకాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆ ఎపిసోడ్లో వచ్చే పాటని రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: Pushpa 2 Review: ‘పుష్ప 2’ మూవీ రివ్యూ)
'గంగో రేణుక తల్లి' అని సాగే ఈ పాటలో అల్లు అర్జున్ చేసిన డ్యాన్స్ చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. చీరకట్టులో వేసిన స్టెప్పులు బాగున్నాయి. ప్రస్తుతానికైతే ఈ పాట లిరికల్ సాంగ్ మాత్రమే విడుదల చేశారు. ఒకవేళ వీడియో కావాలంటే కొన్నిరోజులు ఆగాలి. అప్పటివరకు ఆగాలేకపోతున్నామంటే బిగ్ స్క్రీన్‌పై మూవీ చూసి అనుభూతి చెందాల్సిందే.
(ఇదీ చదవండి: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట.. బన్నీ టీమ్‌పై కేసు నమోదు)
Comments
Please login to add a commentAdd a comment