స్నేహితుడి ఎదుటే దారుణం..ఇద్దరి అరెస్టు | 2 Accused Arrested At Colva Beach Rape Incident In Goa | Sakshi
Sakshi News home page

Published Sat, May 26 2018 3:48 PM | Last Updated on Thu, Oct 4 2018 8:29 PM

2 Accused Arrested At Colva Beach Rape Incident In Goa - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పనాజి : ప్రేమ జంటకు ఊహించని పరిణామం ఎదురైంది. బీచ్‌లో సరదాగా గడుపుదామని స్నేహితుడితో వెళ్లిన ఇరవై ఏళ్ల యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన గోవాలోని కోవ్లా బీచ్‌లో శుక్రవారం రాత్రి జరిగింది. తన స్నేహితుడి ఎదుటే యువతిపై నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఘటనను తమ సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన నిందితులు విషయాన్ని బయటపెడితే ఇంటర్‌నెట్‌లో పెడతామని బెదిరించారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఇద్దరిని శనివారం అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేశామని పోలీసులు తెలిపారు.

‘అత్యాచార నిందితులు సంజయ్‌ ధనంజయ్‌ పాల్‌ (23), రామ్‌ సంతోష్‌ భారియా (19)ను అరెస్టు చేశాం.మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకోవడానికి లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేశాం. వీరంతా ఇండోర్‌కు చెందినవారు. గోవా పర్యటనకు వచ్చి ఈ అకృత్యానికి పాల్పడ్డార’ని గోవా (పశ్చిమం) ఎస్పీ అరవింద్‌ గవాస్‌ తెలిపారు. పరిసర గ్రామం నుంచి తన స్నేహితుడితో కోవ్లా బీచ్‌కు వచ్చానని బాధితురాలు తెలిపింది. కాగా, యువతి అత్యాచారానికి గురైనట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement