assault
-
వాడో వికృత జీవి, చచ్చేదాకా జైల్లోనే!
అమాయకులైన మైనర్బాలికలను మభ్యపెట్టి అత్యంత అమానుషంగా అత్యాచారాలకు పాల్పడుతున్న వైనానికి అద్దం పట్టిన ఘటన ఇది. అంతేకాదు సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులను నమ్మడం, ప్రయాణాల్లో అపరిచితుల మాటలకు మోసపోవడం వల్ల జరిగే అనర్థాలకు నిదర్శనం కూడా. అసలు స్టోరీ ఏంటంటే..! వివరాలు ఇలా ఉన్నాయిఅది 2021, అక్టోబరు 18.. ఒక టీనేజ్ బాలికను మాయ చేసి, నీచాతి నీచంగా అత్యాచారానికి పాల్పడిన ఘటనకు మౌన సాక్ష్యంగా నిలిచిన రాత్రి అది. ఈ కేసులో నేరస్తుడు పేరు 35 ఏళ్ల మహమ్మద్ సాదిక్ ఖత్రీ. ఏడు నెలలకు తనతో షేర్ చాట్‌లో మాట్లాడుతున్న స్నేహితుడిని కలవడానికి ముంబై బయలుదేరింది 16 ఏళ్ల బాధిత బాలిక. వల్సాద్‌లోని పార్డి తాలూకాలో నివసిస్తుంది . మహారాష్ట్రలోని భివాండికి చెందిన అబ్బాయితో షేర్‌చాట్‌లో పరిచయమైంది. ఇద్దరూ ఏడు నెలల పాటు మాట్లాడుకున్నారు. తనను కలవాలని పట్టుబట్టడంతో ముంబైకి బయలుదేరింది. ఇక్కడే అమాయకంగా, బెరుకు బెరుకుగా కనిపించిన ఆ ‘లేడిపిల్ల’ పై కన్నేశాడు సాదిక్. ఆమెతో మాట కలిపి మాయ చేశాడు. బాలికను నమ్మించాడు.వసాయ్ రైలు స్టేషన్లో ఆగినప్పుడు, అతను ఆమెను బలవంతంగా రైలు నుండి దింపేశాడు. ముంబైకి తాను దగ్గరుండి తీసుకెడతానంటూ హామీ ఇచ్చాడు. వెనుకా ముందూ ఆలోంచకుండా అతగాడిని నమ్మడమే ఆమె జీవితంలో తీరని బాధను మిగిల్చింది. ఖత్రీ బాలికను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. సెక్స్ ఉద్దీపన మాత్రలు వేసుకొని మరీ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఐదు గంటల్లో మూడుసార్లు అత్యాచారం చేశాడు. ఆ తరువాత బాలికను అక్కడే వదిలేసి పారి పోయాడు. చివరకు ఆమె తన బంధువుకు సమాచారం ఇవ్వడంతో విషయం పోలీసులదాకా వెళ్లింది. ఫిర్యాదు అందిన వెంటనే నవ్సారి రూరల్ పోలీసులు అక్టోబర్ 24న ఖత్ర్ అరెస్టు చేశారు. ఆ సమయంలో అతని దగ్గర సిల్డెనాఫిల్ డ్రగ్స్ దొరికాయి. అతని దుస్తులపై రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఘటనా స్థలంలో పోలీసులు ఫోరెన్సిక్ బృందం బాలిక జుట్టుతో పాటు ,హెయిర్‌పిన్ తదితర కీలక సాక్ష్యాలను కూడా సేకరించింది. దీంతో ప్రాసిక్యూషన్ సాదిక్‌ను నేరస్తుడిగా తేల్చింది. తన కామాన్ని నెరవేర్చుకోవడానికి ఈ కేసు నిస్సహాయులను లేదా మైనర్లను వేటాడే వికృత మనస్తత్వాన్ని ప్రదర్శించిన వైనమని విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. సాదిక్‌కు చివరి శ్వాసదాకా జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఇలాంటి కేసుల (మైనర్ బాలికపై అత్యాచారం కేసు) విచారణ సందర్భంగా న్యాయస్థానం శిక్షాస్మృతిలో మెతక వైఖరిని అవలంబించకూడదని కోర్టు పేర్కొంది. అంతేకాదు బాధితురాలు తరచూ తల్లిదండ్రులకు, పోలీసులకు, న్యాయవాదులకు, కోర్టుకు తాను పడిన శారీరక బాధను, కష్టాన్ని అనేకసార్లు వివరించవలసి వస్తుంది, ఇది ఆమెకు తీవ్ర మనోవేదనకు గురిచేస్తుందని కూడా, సున్నితంగా వ్యవహరించాలని కూడా కోర్టు సూచించింది. సమాజంలో మైనర్లపై లైంగిక వేధింపుల కేసులు పెరుగు తున్నప్పుడు, బాధితుల బాధను, ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. -
బాలికలపై ఆగని అత్యాచారాలు
చాగలమర్రి/నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వ పాలనలో.. రాష్ట్రంలో అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలాంటి అత్యాచారం వార్త వినాల్సి వస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లాలో ఒక పాఠశాలలో ఐదేళ్ల చిన్నారిపై ఇద్దరు బాలురు అత్యాచార యత్నం చేయగా, నెల్లూరులో పదేళ్ల బాలికపై యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. నిందితులపై పోక్సో కేసులు నమోదు చేశారు. ఈ దారుణం గురించి తెలిసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల కరస్పాండెంట్‌పైనా కేసు నమోదైంది.నంద్యాల జిల్లాలో మండల కేంద్రం చాగలమర్రిలోని శ్రీరాఘవేంద్ర ఉన్నత పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఐదేళ్ల బాలికపై అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు లైంగికదాడికి యత్నించారు. మూత్ర విసర్జనకు టాయిలెట్‌కు వెళ్లిన చిన్నారిపై వారు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన బయటకు పొక్కకుండా పాఠశాల యాజమాన్యం దాచిపెట్టింది. చిన్నారి తల్లిదండ్రులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 12వ తేదీ సాయంత్రం బడి నుంచి ఇంటికెళ్లిన చిన్నారికి జ్వరం వచ్చింది.పొత్తి కడుపులో నొప్పిగా ఉందని ఏడవడంతో తల్లిదండ్రులు స్థానిక కేరళ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యురాలు బాలికపై లైంగికదాడియత్నం జరిగినట్లు చెప్పారు. దీంతో బాలికను మెరుగైన చికిత్స కోసం వైఎస్పార్ జిల్లా ప్రొద్దుటూరులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా కేసు నమోదు చేయాలని సూచించారు. భయపడిన తల్లిదండ్రులు అక్కడి నుంచి కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా విషయం తెలిపి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.దీంతో తల్లిదండ్రులు వెంటనే చాగలమర్రికి వెళ్లి పాఠశాల కరస్పాండెంట్‌ను ప్రశ్నించగా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో బాధితులు బంధువుల సహాయంతో నంద్యాల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ విచారణ చేయాలని ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్‌ను ఆదేశించారు. డీఎస్పీ రవికుమార్ శనివారం ఎస్ఐ రమేష్‌రెడ్డి, సిబ్బందితో కలిసి శ్రీరాఘవేంద్ర పాఠశాలకు వెళ్లి సిబ్బందిని విచారించారు. అనంతరం పోలీసు స్టేషన్లో బాధిత చిన్నారి కుటుంబసభ్యులను విచారించి, వారి ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులపై పోక్సో కేసు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల కరస్పాండెంట్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలికను మాయచేసి అత్యాచారంశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో పదో తరగతి బాలిక (16)కు మాయమాటలు చెప్పి ఒక యువకుడు అత్యాచారం చేశాడు. నెల్లూరు రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. మెడికవర్ హాస్పిటల్ వెనుక పాతమెట్టపాళెంలో ఉండే బాలిక స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. అదే ప్రాంతానికి చెందిన పెంచలయ్య (23) బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని నెలలుగా తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బాలికకు మాయమాటలు చెబుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీన బాలికను మాయచేసి లొంగదీసుకుని అత్యాచారం చేశాడు. ఈ విషయమై బాలిక తల్లిదండ్రులు శనివారం నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పొక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Mohamed Al Fayed 421 మందిపై లైంగిక వేధింపులు,బాధితుల్లో ప్రముఖుల బిడ్డలు
లైంగిక వేధింపులు ,అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దివంగత ఈజిప్షియన్ బిలియనీర్ మొహమ్మద్ అల్ ఫయెద్పై కేసులో షాకింగ్ సంఖ్యలో ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 421 మందికి పైగా బాధితులు ఫిర్యాదు చేశారని న్యాయవాద డీన్ ఆర్మ్‌స్ట్రాంగ్ వెల్లడించారు.30 ఏళ్ల కాలంలో అల్ ఫయేద్ అఘాయిత్యాలను సంబంధించిన చిట్టా పెరుగుతూనే ఉందని ఆర్మ్‌స్ట్రాంగ్ లండన్‌లో ఒక మీడియా సమావేశంలో అన్నారు .మరో న్యాయవాది బ్రూస్ డ్రమ్మాండ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 400కి పైగా బ్రిటన్‌కు చెందిన మహిళలతోపాటు, అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, స్పెయిన్, దక్షిణాఫ్రికా , ఇతర దేశాల మహిళలు తమ న్యాయవాద బృందాన్ని ఆశ్రయించారని తెలిపారు. ఈ ఆరోపణలు తమకు విభ్రాంతికి గురి చేశాయని వ్యాఖ్యానించారు. ‘వాడొక రాక్షసుడు’ అంటూ బాధితులకు క్షమాపణలు చెప్పారు.బ్రిటన్ లోని అత్యంత సంపన్న కుటుంబాల్లో హారోడ్స్ డిపార్ట్ మెంటల్ స్టోర్ యజమాని మహమ్మద్ అల్ ఫాయిద్ ఒకరు. తన లండన్ డిపార్ట్మెంట్ స్టోర్ హారోడ్స్‌లో మహిళా సిబ్బందిపై లైంగికంగా వేధింపులు, అత్యాచారాలకు పాల్పడ్డాడు. అంతేకాదు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే పరిణామాలు తప్పవని బెదిరించాడు. దీనికి సంబంధించిన ఆరోపణలపై ఇటీవల బీబీసీ అల్ ఫాయిద్ అత్యాచారాలపై ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే "ది జస్టిస్ ఫర్ హారోడ్స్ సర్వైవర్స్ గ్రూపు" నుంచి చట్టపరమైన చర్యలు మొదలు కావడంతో తాజాగా మరింతమంది బాధితులు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. బాధితుల్లో బ్రిటన్‌లోని మాజీ యుఎస్ రాయబారి కుమార్తె , ప్రసిద్ధ సాకర్ క్రీడాకారిణి కుమార్తె కూడా ఉన్నారు. కాగా మహమ్మద్ అల్ ఫాయిద్ 94 ఏళ్ల వయసులో గత ఏడాది మరణించాడు. అల్ ఫయీద్ తన మరణానికి ముందు ఈ ఆరోపణలను ఖండించాడు. -
ఆగని అఘాయిత్యాలు: ఇద్దరు విద్యార్థినులపై గ్యాంగ్‌రేప్
కాశీబుగ్గ: కూటమి ప్రభుత్వహయాంలో అత్యాచారాలు, మహిళలపై అఘాయిత్యాలు ఆగడంలేదు. నిన్న తెనాలిలో కేంద్రమంత్రి అనుచరుడి దురాగతం.. మొన్న బద్వేలులో ఉన్మాది దారుణం.. అంతకుముందు అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం ఇలా అత్యాచారాలు, వేధింపులు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మరో దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. పుట్టినరోజు వేడుకల పేరిట స్నేహితురాళ్లను తీసుకెళ్లిన యువకులు గ్యాంగ్‌రేప్ చేశారు. ఈ సంఘటన పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో సోమవారం బయటకు వచ్చింది.పట్టణానికి చెందిన ముగ్గురు ఇంటర్ విద్యార్థినులు, ఇంటర్ తప్పి ఖాళీగా తిరుగుతున్న ముగ్గురు యువకులు స్నేహితులు. ఈ నెల 19న వారిలో ఒక యువకుడి పుట్టినరోజు కావడంతో అందరూ కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నారు. పలాస సినిమా థియేటర్ సమీపంలో ఉన్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వద్ద బిర్యానీలు, స్వీట్‌షాప్‌లో కేక్‌లు, గిఫ్ట్‌లు కొనుక్కుని ద్విచక్ర వాహనాలపై పలాస–కాశీబుగ్గ జంటపట్టణాలకు ఐదు కిలోమీటర్ల దూరంగా ఉన్న కాలనీకి చేరుకున్నారు.అక్కడ కేక్‌కట్ చేసి భోజనాలు చేసిన తరువాత ఇద్దరు విద్యార్థినులపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. తనపై జరిగిన లైంగిక దాడి నుంచి మరో విద్యార్థిని తప్పించుకోగలిగింది. తప్పించుకున్న విద్యార్థని తల్లిదండ్రులకు విషయం చెప్పింది. అత్యాచారానికి గురైన విద్యార్థినుల తల్లిదండ్రులకు విషయం తెలిసినా పరువు పోతుందని మిన్నకుండిపోయారు. బాధిత విద్యార్థిని ఒకరు సోమవారం అనారోగ్యానికి గురవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
రెడ్బుక్కే సెల్యూట్..!
సాక్షి, అమరావతి: ‘రెడ్‌బుక్’ రాజ్యాంగానికి సెల్యూట్ చేయడంతోనే పోలీసులకు సరిపోతోంది! రాష్ట్రంలో చిన్నారులు వరుసగా అఘాయిత్యాలు, అపహరణకు గురవుతున్నా పట్టించుకునే తీరుబడి లేకుండా పోయింది. రాజకీయ కుట్రలకు వత్తాసు పలకడం, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు అక్రమ కేసులు నమోదే పోలీసు శాఖ కర్తవ్యంగా మారింది. వెరసి టీడీపీ అరాచకాలు, అక్రమాల అమలే పోలీసుల ఏకైక అజెండాగా మారిపోయింది.రెడ్బుక్కే పోలీస్ సెల్యూట్కక్ష సాధింపు చర్యలే ఏకైక అజెండాగా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న టీడీపీ కూటమి సర్కారు తమ రాజకీయ కుట్రలకు వత్తాసు పలకాల్సిందేనని పోలీసు శాఖకు నిర్దేశించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులపై పచ్చ ముఠాలు దాడులకు తెగబడ్డాయి. దాదాపు నెల రోజులపాటు యథేచ్ఛగా మారణహోమం కొనసాగినా పోలీసు శాఖ చేష్టలుడిగి చూస్తుండిపోయింది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులపై అక్రమ కేసులు బనాయిస్తూ రెడ్‌బుక్ అరాచకాలకు కొమ్ముకాసింది. టీడీపీ గూండాల స్వైర విహారంతో ఏకంగా 3 వేల కుటుంబాలు కట్టుబట్టలతో స్వస్థలాలను వీడి వెళ్లినా పోలీసులకు ఏమాత్రం పట్టలేదు.టీడీపీ కార్యాలయంపై దాడి ఉదంతాన్ని వక్రీకరిస్తూ వైఎస్సార్సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్, దేవినేని అవినాశ్ తదితరులపై అక్రమ కేసులు బనాయించిన పోలీసుశాఖ విచారణ పేరుతో వేధిస్తూ కాలయాపన చేస్తోంది. ఇక చంద్రబాబు నిర్లక్ష్య వైఖరితో విజయవాడను వరదలు ముంచెత్తగానే పోలీసు శాఖ రంగంలోకి దిగి బోటు రాజకీయానికి వత్తాసు పలికింది. అయినా సరే ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చలేకపోవడంతో ముంబై నటి కాదంబరి జత్వానీని తెరపైకి తెచ్చారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనను వక్రీకరిస్తూ డీజీపీ, సీఐడీ చీఫ్‌ను ప్రభుత్వ పెద్దలు హుటాహుటిన హెలికాఫ్టర్‌లో పంపించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా తప్పుడు ఫిర్యాదులు ఇవ్వాలని పోలీసు, రెవెన్యూ శాఖలు పలువురిపై ఒత్తిడి తెచ్చాయి. పుంగనూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పలపై టీడీపీ గూండాలు పట్టపగలు దాడికి తెగబడితే పోలీసు యంత్రాంగం చోద్యం చూసింది. అక్రమ కేసులతో మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను అరెస్ట్ చేసింది. ఇక తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసే కుట్రకు పోలీసు శాఖ వత్తాసు పలకడం దీనికి పరాకాష్ట. ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు కొమ్ము కాసిన గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నియామకం అందులో భాగమే. సుప్రీంకోర్టు అడ్డుకోవడంతో ఈ కుట్రకు అడ్డుకట్ట పడింది.మహిళల భద్రత పట్టని పోలీసులుగత నాలుగు నెలల్లో రాష్ట్రంలో ఏకంగా 74 మంది మహిళలపై లైంగిక దాడుల ఘటనలు వెలుగులోకి వచ్చినా పోలీసు శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. బాధితుల ఫిర్యాదును స్వీకరించేందుకు సైతం పోలీసులు సుముఖత చూపకపోవడం రాష్ట్రంలో దిగజారిన పరిస్థితులకు నిదర్శనం. నంద్యాల జిల్లా ముచ్చుమర్రులో తమ చిన్నారి అపహరణకు గురైనట్లు ఓ నిరుపేద కుటుంబం మొరపెట్టుకున్నా పోలీసులు రెండు రోజులపాటు పట్టించుకోలేదు. ఆ చిన్నారి హత్యాచారానికి గురైనట్లు 15 రోజుల తరువాత ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. మూడు నెలలు గడిచినా మృతదేహాన్ని అప్పగించలేకపోయారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓ బాలికను నిందితులు అపహరిస్తే పోలీçÜులు కనీసం 5 కి.మీ. పరిధిలో కూడా గాలింపు చేపట్టపోవడం విస్మయకరం. నాలుగు రోజుల తరువాత పుంగనూరుకు 4 కి.మీ. దూరంలో ఆ బాలిక మృతదేహం లభించింది.తాజాగా హిందూపురంలోఅత్తా కోడళ్లపై సామూహిక లైంగిక దాడి కేసును నీరుగారుస్తూ మూడు రోజులపాటు కాలయాపన చేశారు. రాయచోటిలో టీడీపీ నేత ఖాదర్ బాషా పెన్షన్, ఇంటి స్థలం ఇప్పిస్తానని నమ్మబలికి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బయటపెట్టిన అనంతరం ఓ బాధితురాలు కనిపించకుండా పోవడం గమనార్హం. శాంతి భద్రతలు దారుణంగా దిగజారడంతో బద్వేలులో ఓ విద్యార్థినిపై నిందితుడు లైంగిక దాడికి తెగబడి నిప్పంటించి దారుణంగా హతమార్చాడు. కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడు తెనాలిలో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడి పాశవిక దాడికి తెగబడ్డాడు. -
దివ్యాంగ బాలికపై లైంగిక దాడి.. ఆపై ఆత్మహత్య
ఎన్పీకుంట: దివ్యాంగ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి.. ఆపై తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీసత్యసాయి జిల్లా ఎన్పీకుంట మండలం సారగుండ్లపల్లిలో జరిగింది. కదిరి డీఎస్పీ శ్రీలత, రూరల్ సీఐ నాగేంద్ర కథనం ప్రకారం... సారగుండ్లపల్లికి చెందిన పి.జనార్దన (36) తన భార్యను పుట్టినిల్లు అయిన తనకల్లు మండలం కొక్కంటిక్రాస్లో వదిలి ఆదివారం రాత్రి స్వగ్రామానికి బైక్‌పై తిరుగు పయనమయ్యాడు. మార్గమధ్యంలోని కొత్తమిద్ది గ్రామంలో వినాయక మండపం వద్ద రాత్రి 8 గంటల సమయంలో ఆడుకుంటున్న దివ్యాంగురాలైన 17 ఏళ్ల బాలికను కంపచెట్లలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న చిన్న పిల్లలు కేకలు వేయడంతో పారిపోయాడు. బాధితురాలి తండ్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో జనార్దనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతని ఆచూకీ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే..జనార్దన తన స్వగ్రామంలో నిర్మాణంలో ఉన్న తన ఇంట్లోని వంట గదిలో ఉరి వేసుకుని మృతి చెంది ఉండటాన్ని సోమవారం ఉదయం తల్లి గమనించింది. కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఎన్పీకుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా పోలీసులు మృతుడిని పరిశీలించగా చేతికి, వేలుకు ఇంకు అంటి ఉండటాన్ని గమనించి ఘటన స్థలంలో వెతకగా సూసైడ్‌నోట్ లభించింది. తన మృతికి ఎవరూ కారణం కాదని అందులో రాసి ఉన్నట్లు ధ్రువీకరించారు. ఇరువురి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
ఆత్మహత్య చేసుకుంటా
సాక్షి, టాస్క్‌ఫోర్స్: తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేయడమే కాకుండా.. తన వర్గీయులతో వేధిస్తున్నారంటూ కేవీబీ పురం మండల టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి ఆరోపించింది. బాధిత మహిళ పట్ల సానుభూతి చూపించకుండా.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారంటూ వాపోయింది. ఫిర్యాదు చేసినా చంద్రబాబు, లోకేశ్ న్యాయం చేయకపోవడంతో.. ఇక ‘ఆత్మహత్య చేసుకుంటున్నా’నంటూ సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేసింది. దీంతో నియోజకవర్గ టీడీపీలో తీవ్ర దుమారం రేగింది. చంద్రబాబు, లోకేశ్ వల్లే..వరలక్ష్మికి టీడీపీలోని యాదవ సామాజికవర్గ నాయకులు మద్దతుగా నిలిచారు. వరలక్ష్మికి న్యాయం చేయడం మానేసి.. తిరిగి ఆమెనే వేధింపులకు గురిచేస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర భాషతో నీచాతినీచంగా తిడుతూ.. ఫోన్‌కాల్స్ చేసి వేధిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ వెంటనే స్పందించి.. కఠిన చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదన్నారు. బలవంతపు మరణానికి దారితీసేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. బాధితురాలి ప్రాణానికి హాని జరిగితే ఊరుకునేది లేదని వారు హెచ్చరిస్తున్నారు.దళిత ఎమ్మెల్యేపై కుట్ర చేశారంటూ ఆందోళనటీడీపీలోని అగ్రకుల నాయకులు కుట్ర పన్ని ఎమ్మెల్యే ఆదిమూలాన్ని ఈ కేసులో ఇరికించారంటూ స్థానిక దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆదివారం సత్యవేడులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. వరలక్ష్మిపై కేసు నమోదు చేసి, ఆమె వెనుక ఎవరున్నారో విచారించి.. శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే నారాయాణవనం మండలంలో కూడా ఆదిమూలం వర్గీయులు రెండు రోజులుగా ధర్నా చేస్తున్నారు. దళిత ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఓ మాజీ ఎమ్మెల్యేను ఇన్చార్జ్గా నియమించి పెత్తనం చెలాయించేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఆదిమూలం వర్గీయులు కొందరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహయాదవ్‌కు ఫోన్ చేసి.. వరలక్ష్మి కేసు ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. -
నివిన్‌పై ఆరోపణలు అవాస్తవం
సినిమా అవకాశం ఇప్పిస్తానంటూ దుబాయ్‌లో తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఓ ఆరుగురి గురించి ఇటీవల ఒక మహిళ ఫిర్యాదు చేశారు. ఆ ఆరుగురిలో మలయాళ నటుడు నివిన్ పౌలీ ఒకరు. అయితే ఏ తేదీల్లో (గత డిసెంబరు 14 నుంచి 16) అయితే తనతో నివిన్ అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆ మహిళ పేర్కొన్నారో అదే తేదీల్లో ఆయన ‘వర్షంగళుక్కు శేషమ్’ అనే మలయాళ సినిమా షూట్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ చిత్రంలో నటించినపార్వతీ ఆర్. కృష్ణ తెలిపారు. అలాగే ఈ చిత్రదర్శకుడు వినీత్ శ్రీనివాసన్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. నివిన్‌పై ఆరోపణలు అవాస్తవం అంటున్నారు ఈ ఇద్దరూ. ‘‘ఆ మహిళ చెప్పిన తేదీలో కేరళలోని కొచ్చిలో ‘వర్షంగళుక్కు శేషమ్’ షూటింగ్లో ఉన్నారు నివిన్. అక్కడి న్యూక్లియస్ మాల్ లోపల, బయట కూడా చిత్రీకరణ జరిపాం. అలాగే మా సినిమా షూటింగ్ ముగించుకుని ‘ఫార్మా’ అనే వెబ్ సిరీస్ షూట్‌కి వెళ్లారు. ఇక నివిన్ మా టీమ్‌తోనే ఉన్నారనడానికి సీసీటీవీ ఫుటేజ్, మా యూనిట్లోనిపార్వతీ ఆర్. కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్ సాబూ రామ్, మా నిర్మాత విశాఖ్ సుబ్రమణియం తదితరులు సాక్ష్యం’’ అని పేర్కొన్నారు వినీత్ శ్రీనివాసన్. ‘‘వర్షంగళుక్కు శేషమ్’లో నేనో చిన్నపాత్ర చేశాను. డిసెంబర్ 14న మా షూటింగ్‌కి సంబంధించిన వీడియో చూపిస్తాను. ఆ రోజు నివిన్ కాంబినేషన్లో నేను కొన్ని సీన్స్‌లో నటించాను’’ అంటూ ఇన్‌స్టాలో వీడియోను షేర్ చేశారుపార్వతీ ఆర్. కృష్ణ. -
విమానంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై మహిళ దాడి
ముంబై: విమానంలో ఓ మహిళ.. తోటి ఇద్దరు ప్రయాణికులు, సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై దాడికి తెగపడ్డారు. ఈ ఘటన శనివారం పుణెలోని లోహెగావ్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. ఉదయం 7. 45 గంటలకు పుణె నుంచి ఢిల్లీకి బయలుదేరే.. ఓ ప్రైవేటు విమానంలో బోర్డింగ్ ప్రాసెస్ సమయంలో ఓ మహిళ దాడికి తెడపడ్డారు. మొదట ఆ మహిళ ముందు సీట్లో ఉన్న ఇద్దరు ప్రయాణికులపై దాడి చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి విమాన సిబ్బంది, సీఐఎస్ఎఫ్ కానిస్టెబుల్స్ ఆమె వద్దకు వచ్చారు. దీంతో ఆమె మరింత రెచ్చిపోయి.. సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై దాడి చేసింది. అనంతరం ఆ మహిళను, ఆమె భర్తను విమానం నుంచి దింపేశారు. ఆ మహిళను ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించగా.. కేసు నమోదు చేశారు.సీనియర్ ఇన్స్పెక్టర్ అజయ్ సంకేశ్వరి మాట్లాడుతూ.. విచారణ కోసం సదరు మహిళకు నోటీసు ఇచ్చి విడిచిపెట్టాం. ఎయిర్‌లైన్ సిబ్బంది, సీఐఎస్ఎఫ్ సిబ్బంది,సహ ప్రయాణీకులు వాంగ్మూలాలను రికార్డు చేశాం’ అని చెప్పారు. వ్యక్తిగత అత్యవసర పరిస్థితి కారణంగా ఆమె తీవ్రమైన బాధలో ఉన్నట్లు గమనించామని, అందుకే ఆమె తోటి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగారని ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ తెలిపారు. -
మహిళపై అత్యాచారయత్నం : వీధి కుక్క అలర్ట్...దెబ్బకి..!
ఇటీవలి కాలంలో వీధికుక్కలు చిన్నపిల్లలపై దాడిచేస్తూ స్వైరవిహారం చేస్తున్న వార్తలు చదివి చాలా ఆందోళన చెందాం కదా. విశ్వాసానికి మారుపేరైన పెంపుడు కుక్కలు కూడా స్వయంగా యజమానిపై దాడి ఘటనలూ చేశాం. కానీ సాధారణంగా కుక్కలు యజమానులను ప్రేమిస్తాయి. ఆ మాటకొస్తే కాస్త గంజి పోయినా చాలు బోలెడంత విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. చిన్న పిల్లలంటే ఇంకా మక్కువ చూపిస్తాయి. అవసరమైతే తమ ప్రాణాలకు తెగించి మరీ మనుషులను ఆదుకుంటాయి. తాజాగా కుక్కల మీద మనుషులకు విశ్వాసాన్ని పెంచే ఘటన ఒకటి మహరాష్ట్రలోని ముంబై చోటు చేసుకుందిఅత్యాచారానికి యత్నించిన వ్యక్తినుంచి 32 ఏళ్ల మహిళను వీధి కుక్క రక్షించిన ఘటన జూన్ 30న ముంబైలోని వసాయ్‌లో జరిగింది. మాణిక్పూర్ సందులో నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై సందీప్ ఖోట్ అనే వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించాడు. అకౌంటెంట్ అయిన మహిళ ఇంటికి వస్తుండగా సందీప్ ఆమె వెంబడించాడు. నిర్మానుష్య ప్రదేశానికి వచ్చాక చంపేస్తాని బెదిరించి, నోరు నొక్కి కిందపడేశాడు. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. ఇంతలో ప్రమాదాన్ని పసిగట్టిన ఓ వీధికుక్క గట్టిగా అరవడం మొదలు పెట్టింది. దెబ్బకి భయపడిన అతగాడు, లేచి అక్కడినుంచి ఉడాయించాడు. అయితే పోతూ పోతూ ఆమె ఐఫోన్‌ను లాక్కొని పారిపోయాడు. దీంతో బాధిత మహిళ తప్పించుకుంది. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీని ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడిని అరెస్టు చేశారు. -
అనకాపల్లి జిల్లాలో దారుణం..
-
అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళపై టీడీపీ నేత అఘాయిత్యం
సాక్షి, అన్నమయ్య జిల్లా: వీరబల్లి మండలం ఒదివీడు గ్రామంలో దారుణం జరిగింది. ఓ మహిళపై టీడీపీ నేత పెద్ద రెడ్డయ్య అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్నానం చేయడానికి బాత్రూంకి వెళ్ళగా అదే గ్రామానికి చెందిన పెద్ద రెడ్డయ్య బాత్రూంలో దూరి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి రావడంతో అక్కడ నుండి నిందితుడు పరారయ్యాడు.బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ వీరబల్లి పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది. న్యాయం చేయకపోగా, ఆమె పట్ల ఎస్ఐ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. తనకు న్యాయం జరగకపోతే చావేశరణ్యమని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
నేరేడ్మెట్లో బాలికపై గ్యాంగ్ రేప్.. 10 మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నేరేడ్మెట్లో తీవ్ర సంచలనం సృష్టించిన బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో కీలక సూత్రధారులైన నరేష్, విజయ్‌లతో పాటు మరో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ నెల 22న కాచిగూడ నుంచి 12 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన నిందితులు.. కూల్‌డ్రింక్‌లో గంజాయి కలిపి తాగించారు. బాలిక మత్తులోకి వెళ్లిన తర్వాత నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. -
ఆ ఘటనలపై సీఎం రేవంత్ సీరియస్.. డీజీపీకి ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన అమానుష ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేయాలని డీజీపీని ఆదేశించారు. వెంటనే ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు.మరో వైపు, నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలంలో పట్టపగలు గువ్వల సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపైనా ముఖ్యమంత్రి ఆరా తీశారు. భౌతిక దాడులకు దిగి అరాచకాలు, హత్యలకు పాల్పడే శక్తులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే, అక్కడి బాధ్యులైన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. -
డెన్మార్క్ ప్రధానిపై దాడి
కోపెన్‌హగన్: డెన్మార్క్ ప్రధాని ఫ్రెడ్రిక్సెన్పై దాడి జరిగింది. కోపెన్హాగన్ స్క్వేర్ వద్ద ప్రధానిపై దుండగుడు ఒక్కసారిగా దాడికి దిగాడు. ఈ ఘటనతో ప్రధాని షాక్‌కు గురైనట్లు ఆమె కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దాడికి దిగిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దాడి జరిగిన వెంటనే ప్రధానిని సెక్యూరిటీ సిబ్బంది అక్కడి నుంచి తీసుకెళ్లారని ఘటనకు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.ప్రధానిపై దాడి తమను కలిచివేసిందని పర్యావరణ మంత్రి ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. మూడు వారాల క్రితమే యూరప్ దేశం స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. -
‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
ఢిల్లీ: తనపై దాడి జరిగిన సమయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ అన్నారు. ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. దాడికి సంబంధిచి పలు విషయాలు పంచుకున్నారు.‘‘ మే 13న సీఎం ఆరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ నాపై దాడి చేస్తున్నప్పుడు నేను అరుస్తునే ఉన్నారు. కానీ, నన్న రక్షించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాడి జరిగిన సమయంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఇంట్లోనే ఉన్నారు. ఈ దాడి విషయలో నేను ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేను. నేను 9 గంటలకు సీఎం నివాసానికి వెళ్లితే డ్రాయింగ్ రూంలో నన్ను వేచి ఉండాలని ఇంటి సిబ్బంది తెలిపింది. కేజ్రీవాల్ ఇంట్లోనే కూర్చొని ఉన్నారు. సీఎం నన్ను కలవడానికి వస్తారని సిబ్బంది చెప్పింది. ఒక్కసారిగా బిభవ్ నేను ఉన్న గదిలోకి దూసుకువచ్చారు. ఏం అయింది? కేజ్రీవాల్ వస్తున్నారు. ఏం అయింది? అని ఆయన్ను అడిగాను. అంతలోనే ఆయన నాపై దాడి చేయటం మొదలు పెట్టాడు. ఏడెనిమిది సార్లు నా చెంప మీద కొట్టారు. నేను ఆయన్ను వెనక్కి నెట్టేయాలని ప్రయత్నం చేశాను. తన కాలుతో నన్ను లాగి మధ్యలో ఉన్న టెబుల్‌కు నా తలను బాదారు’’ అని స్వాతి మలివాల్ తెలిపారు.‘‘బిభవ్ కుమార్ వేరే వాళ్ల సూచన మేరకే నాపై దాడి చేశారు. దాడి కేసులో నేను ఢిల్లీ పోలీసులకు సంపూర్ణంగా సహకరిస్తా. ఈ విషయంలో నేను ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వను. నాపై దాడి జరుగుతున్న సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు. నేను బాధతో ఎంత అరిచినా నన్ను ఎవరూ పట్టించుకోలేదు. నాపై జరిగిన దాడిలో విషయంలో నేను గళం ఎత్తుతాను.దాని వల్ల నా కెరీర్‌కు ఇబ్బందైనా వదిలిపెట్టను. సత్యానికి, నిజమైన ఫిర్యాదులకు మద్దతుగా ఉండాలని చెప్పే నేను నా విషయంలో అంతే ధైర్యంగా ఉండి పోరాడుతాను’’ అని స్వాతి మలివాల్ అన్నారు. ఈ కేసులో అరెస్టైన బిభవ్ కుమార్ ఫోన్ ఫార్మాట్, సీఎం నివాసం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ దాడికి సంబంధించి స్వాతి మలివాల్ వెనక బీజేపీ కుట్ర ఉందని ఆప్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
మలీవాల్‌పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహయకుడు దాడికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. మలీవాల్‌పై దాడిని ఆప్ సైతం ధృవీకరించింది. నిందితుడు బిభవ్ కుమార్‌పై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కాగా కేజ్రీవాల్ సొంత ఇంట్లో ఈ దాడి జరగడం గమనార్హంఈ ఘటనపై కేజ్రీవాల్‌ను మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేదు. దీంతో సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఆయన మౌనం కూడా ఎంతో చెస్తోందని, జైలు నుంచి విడుదలయ్యాక సీఎంగా కంటే గూండాలా వ్యవహరిస్తున్నారని బీజేపీ మండిపడింది. తాజాగా ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ స్పందించారు.తన నివాసంలోనే స్వాతి మలీవాల్‌పై జరిగిన దాడిపై కేజ్రీవాల్ మౌనం వహించడం దిగ్బ్రాంతికి సిగ్గుచేటని అన్నారు. అంతేగాక లక్నోలో నిందితుడైన బిభవ్ కుమార్‌తో సీఎం సిగ్గులేకుండా తిరుగుతున్నాడని ఆరోపించారు. ఇందుకు కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన ఆమెకు ఈ పరిస్థితి ఎదురుకావడం దారుణమని అన్నారు.‘సొంత నివాసంలోనే పార్టీ ఎంపీపై దాడి జరిగితే.. కేజ్రీవాల్ మాట్లాడకపోవడం షాక్‌కు గురిచేస్తోంది. దీనిపై ఆయన క్షమాపణలు చెప్పాలి. లక్నో పర్యటనలో సీఎం వెంట నిందితుడు బిభవ్ కూడా ఉన్నాడని నాకు తెలిసింది. ఆమెకు ఎదురైన పరిస్థితి సిగ్గుచేటు. ఫిర్యాదు చేయడానికి రోజుల సమయం పట్టిందంటే.. ఆమెపై ఒత్తిడి ఉందని అనిపిస్తోంది’ అని సీతారామన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.చదవండి: ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు -
ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్‌పై జరిగిన దాడి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై విచక్షణరహితంగా దాడి చేసినట్లు తాజాగా స్వాతి మలీవాల్ ఆరోపించారు. సీఎం నివాసంలోని డ్రాయింగ్ రూమ్‌లో ఉన్న కుమార్ తనపై భౌతిక దాడికి పాల్పడ్డాడని, చెంపదెబ్బ కొట్టాడని, ఛాతిపై తన్నాడని, లాగి పడేసినట్లు ఆమె ఆరోపించారు. ఆసమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారని పేర్కొన్నారు.కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను సోమవారం ఆయన నివాసంలో కలిసేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి ఆరోపించిన ఉదంతం తెలిసిందే. దీన్ని ఆప్ కూడా ధ్రువీకరించి, బిభవ్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపింది.ఈ విషయంలో స్వాతి మలీవాల్ పోలీసులకు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బిభవ్ కుమార్‌ను నిందితుడిగా పేర్కొంటూ గురువారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఇంటికి వెళ్లి వాంగ్మూలాన్ని కూడా రికార్డుచేశారు.పోలీసులు ఎఫ్ఐఆర్లో ఆమె వాంగ్మూలాన్ని పొందుపరిచారు. దీని ప్రకారం.. సివిల్ లైన్స్‌లోని మలివాల్ సోమవారం సాయంత్ర ఆరు గంటలకు సీఎం నివాసానికి చేరుకుంది. ముఖ్యమంత్రి సహాయకుడిని సంప్రదించడానికి ప్రయత్నించగా. ఎలాంటి స్పందన రాలేదు. అనంతరం డ్రాయింగ్ రూమ్‌లో వేచి ఉన్న సమయంలో బిభవ్ కుమార్ గదిలోకి చొరబడి తనను దూషించడం ప్రారంభించాడని ఆమె ఆరోపించారు.‘కుమార్ నా ముఖంపై ఏడు,ఎనిమిది సార్లు కొట్టాడు. ‘నన్ను వెళ్లనివ్వండి’ అని చెప్పినప్పటికీ ఆయన వదలకుండా ఛాతీ, పొట్ట, సున్నితమైన భాగాలపై పలుమార్లు కొట్టాడు. హిందీలో దుర్భాషలాడాడు. 'నీ సంగతి చూస్తాం’ అంటూ బెదిరించాడు. కడుపులో నొప్పి వస్తుందని, నన్ను వదిలేయాలని వేడుకున్నాను.బిభవ్ చర్యలతో పూర్తిగా షాక్‌కు గురయ్యాను. సహయం కోసం గట్టిగా అరిచాను. నన్ను నేను రక్షించుకోవడానికి అతన్ని కాలితో తన్ని దూరంగా నెట్టేశాను. నేను బయటక పరుగెడుతుంటే నాపైకి దూసుకొచ్చాడు. నా చొక్కా పట్టుకొని వెనక్కి లాగాడు. ఛాతీ, కడుపు వంటి సున్నితమైన శరీరభాగాలపై పలుమార్లు దాడి చేశాడు. పొత్తి కడుపులో విపరీతమైన నొప్పితో నడవలేకపోయా. ఎలాగో తన నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేశా’’ అని స్వాతి మలీవాల్వె ల్లడించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.ఈ ఘటనపై మలీవాల్ గురువారం తొలిసారి స్పందిస్తూ.. ఈ దాడితో తాను తీవ్ర దిగ్భ్రాంతికి, మనోవేదనకు గురయ్యాను పేర్కొన్నారు. 112 నంబర్‌కు కాల్ చేసి సంఘటనను నివేదించానని చెప్పారు. తనకు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని, ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. దాడి ఆరోపణల నేపథ్యంలో ఆప్ ఎంపీకి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు ఈ పరీక్షలో తేలిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. -
సీఎం ఇంట్లో నాపై దాడి చేశారు: ‘ఆప్’ ఎంపీ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) రాజ్యసభ ఎంపీ స్వాతిమలివాల్ సొంత పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అంతర్గత వ్యవహారాన్ని పోలీస్‌స్టేషన్‌కు ఈడ్చినట్లు తెలుస్తోంది. సోమవారం(మే13) ఉదయం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లినపుడు తనపై దాడి జరిగిందని ఎంపీ స్వాతిమలివాల్ పోలీసుల ఎమర్జెన్సీ నెంబర్‌కు రెండుసార్లు ఫోన్ చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బైభవ్ కుమార్ తనపై దాడి చేసినట్లు ఆమె పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఇంతలోనే పోలీసు బృందం ఒకటి కాల్ వచ్చిన లొకేషన్‌కు వెళ్లి ఎంపీని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు తెలిసింది. అయితే పోలీసులు మాత్రం సీఎం నివాసంలోకి వెళ్లేందుకు అనుమతి లేనందున ప్రవేశించలేదని సమాచారం. ‘ఢిల్లీ సివిల్ లేన్స్ పోలీస్ స్టేషన్‌కు సోమవారం ఉదయం 9.34 గంటలకు ఒక మహిళ ఫోన్ చేసి తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు.ఆ తర్వాత కొంత సేపటికి ఎంపీ స్వాతిమలివాల్ మేడం నేరుగా పీఎస్‌కు వచ్చారు. తర్వాత ఫిర్యాదు చేస్తానని చెప్పి వెళ్లిపోయారు’ అని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కాగా,సీఎం కేజ్రీవాల్‌ను కలవడానికి ఎంపీ స్వాతిమలివాల్ ఆయన నివాసానికి వెళ్లగా సీఎం వ్యక్తిగత సిబ్బంది అనుమతి నిరాకరించారని, ఈ క్రమంలోనే గొడవ జరిగినట్లు చెబుతున్నారు. -
సీబీఐ కస్టడీకి షాజహాన్ షేక్
కోల్‌కతా: సందేశ్‌ఖాలీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత షాజహాన్ షేక్‌ను సీబీఐ అధికారులు ఎట్టకేలకు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. అతడిని తక్షణమే సీబీఐకి అప్పగించాలంటూ కలకత్తా హైకోర్టు రెండుసార్లు ఉత్తర్వులు జారీ చేయడంతో పశి్చమ బెంగాల్ సీఐడీ అధికారులు స్పందించక తప్పలేదు. బుధవారం సీబీఐ అధికారులకు అప్పగించారు. వాస్తవానికి ఈడీ అధికారులపై దాడి కేసులో దర్యాప్తును, నిందితుడు షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించాలంటూ మంగళవారమే కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. అయినా పశి్చమ బెంగాల్ ప్రభుత్వం లెక్కచేయలేదు. ఈ ఉత్తర్వును నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బెంగాల్ ప్రభుత్వ పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. మరోవైపు కలకత్తా హైకోర్టులో ఈడీ బుధవారం మరో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మంగళవారం నాటి ఉత్తర్వును అమలు చేయాలని, షాజహాన్ షేక్‌ను సాయంత్రం 4.15 గంటలకల్లా సీబీఐకి అప్పగించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ బృందం బుధవారం సాయంత్రం 4 గంటలకు సీఐడీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. సీఐడీ అధికారులు సాయంత్రం 6.48 గంటలకు షాజహాన్ షేక్‌ను సీబీఐ బృందానికి అప్పగించారు. అంతకంటే ముందు అతడిని ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షలు చేయించారు. కరడుగట్టిన నేరగాడిగా ముద్రపడిన షాజహాన్ షేక్‌పై సందేశ్‌ఖాలీలో దళిత, గిరిజన మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తీవ్రంగా స్పందించారు. -
మహిళ కనిపిస్తే.. వేధింపులేనా? మీరేం మనుష్యులు
మహిళలకు సంబంధించి ఓ ముఖ్యమైన విషయాన్ని సోషల్‌మీడియాలో ప్రస్తావించారు డాక్టర్ శ్రీకాంత్ మిరియాల. ఆయన ట్విట్టర్ వేదికగా రాసిన పోస్టు యథాతధంగా.. నేను వైద్యం చేసిన ఎంతోమంది ఆడవాళ్లు (వయసు నిమిత్తం లేకుండా), నా స్నేహితురాళ్ల అనుభవాలు ఇవి. ఈ దురదృష్ట అనుభవాలు అన్ని దేశాల్లో ఉన్నప్పటికీ మనదేశంలో బాగా ఎక్కువ. ఏమిటివి? వీధుల్లో, బస్సుల్లో,రైళ్లలో, ఇళ్లలో,ఆడుకునే స్థలాల్లో, పనిచేసే ప్రదేశాల్లో, గుళ్లలో సమయం సందర్భం ఏదైనాగానీ ఆడవాళ్ళ వెంటబడటం, తేరిపార చూడటం, సైగలు చెయ్యటం, ఫోటోలు తీయటం మాత్రమే కాకుండా కావాలని రాసుకుని వెళ్ళటం, ఇంకా మితిమీరి తాకటం, ముట్టటం, పట్టుకోవడం, కొట్టటం, హఠాత్తుగా మీద పడడం లాంటివి చేసి చాలా ఇబ్బంది పెడతారు. ఇలా ఎందుకు చేస్తారు అన్నదానికి మానసిక శాస్త్ర పరంగా చాలా కారణాలున్నప్పటికీ ఇది చెడ్డ ప్రవర్తన. ఒకసారి చేసి పట్టుబడనప్పుడు వీళ్లలో ధైర్యం పెరిగి మళ్లీ మళ్లీ చేస్తూ, వారి చర్యల తీవ్రత కూడా పెరుగుతుంది. ముందు భయంతో చేసి, చేశాక ఆనందాన్ని పొందే వీళ్లు తర్వాత తర్వాత దాడికి గురైన ఆడవాళ్ల ముఖంలో ఉండే భయాన్ని, షాక్ ని చూసి ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు. వీళ్లని నియంత్రించే ఒకే ఒక్క మార్గం ఎదిరించటం, పట్టుకుని ప్రశ్నించడం. అలా జరిగిన చాలా సందర్భాల్లో అందరూ కలిసి దేహశుద్ధి చేస్తారు. ఒకసారి పట్టుబడ్డాక చాలామంది మానేస్తారు కానీ కొంతమంది కొనసాగిస్తారు. వీళ్లని కఠినంగా శిక్షించటం ద్వారా ఈ నేరాల తీవ్రత కొంతవరకు తగ్గించవచ్చు. ఈమధ్య వచ్చే కొన్ని సినిమాలు కూడా ఇటువంటి ప్రవర్తనని ఎగదోస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పెడతాయి. వాళ్లని చాలా బాధకి గురిచేస్తాయి. కోపం, దిగులు, బయటికెళ్లాలంటే భయం, వణుకు, నిస్సహాయత మొదలైన అనుభూతులకి గురవ్వటమే కాకుండా ఆత్మన్యూనత, తమనితాము నిందించుకోవడం, తమ వస్త్రాలంకరణని ప్రశ్నించుకోవడం, తోడు లేనిదే బయటికి వెళ్లకపోవడం చేస్తుంటారు. పైగా ఈబధని ఎవరితో చెప్పుకోలేక సతమతమౌతుంటారు. చెప్పినా కూడా కొన్నిసార్లు వీళ్లే నిందలకు గురవుతుంటారు. కొన్ని గుర్తుపెట్టుకోండి. 1. ఈ అనుభవాలు మీ ఒక్కరికే కాదు, దాదాపు అందరి ఆడవాళ్లలో ఉంటాయి. ఒకసారి మీ అమ్మాయి/సోదరి/భార్య/స్నేహితురాళ్లతో చర్చించండి. వారికి సాంత్వన చేకూర్చి ధైర్యాన్ని ఇచ్చినవాళ్లవుతారు. 2. తప్పు ఎప్పుడూ దాడి చేసినవాళ్లదే. మీరు ఒంటరిగా బయటికి వెళ్ళటం, మీ వస్త్రాలంకరణ, మీ మాటలు ఇవేవీ కూడా వారు మీతో అలా ప్రవర్తించడానికి పచ్చజెండా కాదు. 3. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. రోడ్డుపై వెళ్ళేటప్పుడు జాగరూకతతో ఉండండి, ఎదుటివాళ్లపై అనుమానం ఉంచి వాళ్లు మిమ్మల్ని దరి చేరేటప్పుడు బ్యాగ్ ఒక చేతి నుంచి ఇంకో చేతికి మార్చటం, చేతులు విదల్చటం వంటి హఠాత్చర్యల వలన దాడిచేసేవాళ్లు దూరం జరుగుతారు. 4. దాడి జరిగినప్పుడు వెంటనే పట్టుకుని ప్రశ్నించండి. వాళ్లు హెడ్లైట్ల కింద దొరికిన కుందేలులా స్థాణువైపోతారు. 5. ఇటువంటి అనుభవాలు మిమ్మల్ని తీవ్ర మానసిక ఇబ్బందికి గురిచేసినా లేక మీ లైంగిక జీవితాన్ని అస్తవ్యస్తం చేసినా మానసిక నిపుణుల్ని కలవండి. డాక్టర్ శ్రీకాంత్ మిరియాల -
కీచక టీచర్.. విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన నిందితునికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పవిత్రమైన ఉపాధ్యాయుడి స్థానంలో ఉండి.. పదో తరగతి చదువుతున్న బాలికపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడిన జనకేశ్వరరావుకి 25 ఏళ్లు జైలు శిక్షతో పాటు, 50 వేల రూపాయలు జరిమానాను కోర్టు విధించింది. విశాఖలోని నాలుగోవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020 ఏడాదిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి ఆధారాలతో కేసును పోలీసులు దర్యాప్తు చేశారు. బాధితురాలికి 4 లక్షల 50 వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు తీర్పు చెప్పింది. బాధితులకు న్యాయం జరిగేలా వాదనలు వినిపించిన స్పెషల్ పోక్సో పీపీ కరణం కృష్ణకి బాధితులు ధన్యవాదాలు తెలిపారు. ఇదీ చదవండి: సినిమా స్టోరీలా.. పరువు హత్య -
వ్యాపారి భార్యపై దొంగల అఘాయిత్యం: సిగరెట్లతో కాల్చి టార్చర్
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దుండగులు అతని భార్యను గ్యాంగ్ రేప్ చేసి, సిగరెట్లతో కాల్చిన ఘటన సంచలనం రేపింది. యూపీ బిజోర్లోని నగీనా దేహత్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల సమాచరం పెయింట్-హార్డ్‌వేర్ హోల్‌సేల్ వ్యాపారి తన తల్లి ,పిల్లలతో కలిసి మందులు కొనడానికి బయటకు వెళ్లారు. అదును చూసిఇంట్లోకి చొరబడిన ఐదుగురు దొంగలు మహిళపై దాడి చేసి, ఆమెను కట్టేసి, సిగరెట్ పీకలతో కాల్చి టార్చర్ పెట్టారు. అంతటితో వారి ఆగడాలు ఆగలేదు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె స్పృహ తప్పడంతో ఇంట్లోని అల్మారాల తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి, సుమారు రూ. 1.5 లక్షల విలువైన నగదును దోచేశారు. అనంతరం ఇంట్లో ఉన్న స్కూటర్‌తో అక్కడినుంచి పరారయ్యారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు వైద్య పరీక్షల కోసం పంపించామని రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ రామ్ అర్జ్ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు మూడు బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. -
రౌడీమూకపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: అసాంఘిక శక్తులను ఏమాత్రం ఉపేక్షించొద్దని పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విస్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో కావలిలో ఆర్టీసీ డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసు శాఖ 14 మంది నిందితులను గుర్తించడంతోపాటు ఏడుగురిని 24 గంటల్లోనే అరెస్ట్ చేయడం గమనార్హం. నిందితులకు అధికార వైఎస్సార్సీపీతో ఏమాత్రం సంబంధం లేదని, వారిపై గతంలోనే పలు కేసులు నమోదైనట్లు వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనను రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకునేందుకు విపక్ష టీడీపీ – జనసేన వేసిన ఎత్తుగడలు పారలేదు. పరారీలో ప్రధాన నిందితుడు ఆర్టీసీ డ్రైవర్ రామ్‌సింగ్‌పై రౌడీమూకల దాడిని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. దాడికి పాల్పడ్డవారిని ఏమాత్రం ఉపేక్షించకుండా తక్షణం కఠిన చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసు శాఖను ఆదేశించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసు శాఖ దాడి దృశ్యాల వీడియో ఫుటేజీని పరిశీలించి 14 మంది నిందితులను గుర్తించింది. కావలి – తుమ్మలపెంట మార్గంలో రాష్ట్రం దాటేందుకు ప్రయత్నిస్తున్న ఏడుగురు నిందితులను శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. బండి విల్సన్, పుట్టా శివకుమార్‌రెడ్డి, షేక్ ఖాజావలి, కుప్పాల వంశీ, షేక్ కలీమ్ చోటు, షేక్ ఇలియాజర్, షేక్ బాజీలను అరెస్ట్ చేసినట్టు ఆదివారం ప్రకటించారు. 24 గంటల్లోనే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఏడుగురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్‌తోపాటు మిగిలినవారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాతోపాటు అన్ని చోట్లా విస్తృతంగా గాలిస్తున్నారు. గతంలోనే నేర చరిత్ర.. రామ్‌సింగ్‌పై దాడికి పాల్పడిన నిందితులకు గతంలోనే నేర చరిత్ర ఉంది. కావలి ప్రాంతంలో ఈ ముఠా ఎన్నో ఏళ్లుగా రౌడీయిజం, సెటిల్మెంట్లు చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోంది. అమాయకులను మోసగిస్తున్న నిందితులపై గతంలోనే పోలీసులు సస్పెక్ట్ షీట్లు తెరిచారు. బండి విల్సన్‌పై 14 కేసులు, శివకుమార్‌రెడ్డిపై 8 కేసులు ఉండటం గమనార్హం. మిగిలిన ఐదుగురిని వీరి అనుచరులుగా గుర్తించారు. ఆర్టీసీ డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడికి పాల్పడిన నిందితులపై పోలీసులు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 143, 341, 332, 307, 323, 427 రెడ్‌విత్ 34 సీఐపీ సెక్షన్ల కింద కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. రాజకీయ రాద్ధాంతం డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడిని అధికార వైఎస్సార్ సీపీతోపాటు అంతా ఖండించినా టీడీపీ – జనసేన రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాడికి పాల్పడిన నిందితులతో అధికార పార్టీకి ఎలాంటి సంబంధం లేకున్నా లోకేశ్ సహా టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారు. 24 గంటల్లోనే వాస్తవాలు బహిర్గతం కావడంతో విపక్ష నేతలు తోక ముడిచారు. ఆర్టీసీ యూనియన్ల హర్షం ఘటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించిన విధానం, ఏడుగురు నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేయడం పట్ల ఆర్టీసీ యూనియన్లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌తోపాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాయి. ఈ ఉదంతం వెలుగులోకి రాగానే నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆర్టీసీ సంఘాలకు ఎండీ భరోసానిచ్చారు. సుధీర్ ముఠా మోసాలపై ఫిర్యాదు చేయాలి వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించాం. కావలికి చెందిన ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్ కుమారుడి నిశ్చితార్థం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లడంతో పరారయ్యాడు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. త్వరలోనే మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేస్తాం. రూ.1.5 కోట్ల విలువైన రెండు వాహనాలను జప్తు చేశాం. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. సుధీర్ ముఠా చేతిలో మోసపోయిన వారు ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని కోరుతున్నాం. – తిరుమలేశ్వరరెడ్డి, ఎస్పీ, నెల్లూరు జిల్లా -
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. ఆరుగురి అరెస్ట్
కావలి/సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి వద్ద ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన కేసులో పోలీసులు శనివారం ఆరుగురిని అరెస్టు చేశారు. మిగిలినవారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు 24 గంటల్లోపే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసిన ఆరుగురిని ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగిలిన నిందితులను వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకునేందుకు ఏఎస్పీ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. కాగా దాడి ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు(ఏపీ16జెడ్0702) డ్రైవర్ బి.రామ్‌సింగ్ కావలి ట్రంక్‌రోడ్డు వద్ద కారును పక్కకు తీయాలంటూ హారన్ మోగించాడు. దీంతో కారు యజమాని ఆర్టీసీ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. స్థానికులతో పాటు అక్కడే ఉన్న కానిస్టేబుల్ సర్దిచెప్పడంతో అతడు అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయాడు. అనంతరం తన స్నేహితుడైన దేవరకొండ సుధీర్‌తో పాటు మరికొందరికి ఫోన్ చేశాడు. వారంతా కారు, ద్విచక్రవాహనాల్లో బస్సును వెంబడించి మద్దూరుపాడు వద్ద అడ్డుకున్నారు. డ్రైవర్ రామ్సింగ్ను బస్సు నుంచి కిందకు దించి విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం నిందితులంతా అక్కడి నుంచి పారిపోయారు. అటుగా వెళ్తున్న కావలి రూరల్ సీఐ ఎం.రాజేశ్ ప్రయాణికులు రోడ్డుపై ఉండటాన్ని గమనించి వివరాలు ఆరా తీశారు. గాయపడిన డ్రైవర్ రామ్సింగ్ను చికిత్స నిమిత్తం వెంటనే కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడితో మాట్లాడి నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఎం.వెంకటరమణ మాట్లాడుతూ.. దాడి ఘటనకు సంబంధించి దేవరకొండ సుధీర్, విల్సన్, శివారెడ్డి, మల్లి, కిరణ్ సహా మొత్తం 10 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా ఏఎస్పీ హిమవతి నేతృత్వంలో కావలి డీఎస్పీ, ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, 50 మంది కానిస్టేబుళ్లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో నిందితుల కోసం తీవ్రంగా గాలించారు. కావలిలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన కాగా ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. కావలిలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన నిర్వహించి.. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడిని పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) వేర్వేరు ప్రకటనల్లో ఖండించాయి. దాడికి నిరసనగా ఆదివారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలపనున్నట్టు పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు చంద్రయ్య, ఈయూ నేతలు పలిశెట్టి దామోదరరావు, వై.శ్రీనివాసరావు, అప్పారావు ప్రకటించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు వినతిపత్రం సమర్పిసా్తమన్నారు. అంతకుముందు విజయవాడలో చికిత్స పొందుతున్న రామ్సింగ్ను ఈయూ నేతలు పరామర్శించారు. -
ఆస్తి కోసం అమానుషం
వనపర్తి: ఆస్తి ముందు అన్నదమ్ముల అనుబంధం, చిన్నప్పటి నుంచి కలసి ఉన్న సోదర ప్రేమ చిన్నబోయాయి. నడిరోడ్డుపై సొంత తమ్ముళ్లే తోడబుట్టిన అన్నను కత్తులతో వేటాడి హత్య చేశారు. బుధవారం వనపర్తి జిల్లాకేంద్రంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి మండలం రాజపేట పెద్దతండాకు చెందిన మంగ్లీ, పూల్య నాయక్‌లకు ఐదుగురు కుమారులున్నారు. 20 ఎకరాల భూమిని తండ్రి తన కుమారులకు సమానంగా పంచి ఇచ్చాడు. రెండో కుమారుడు బద్రీనాథ్ నాయక్ (51) వీపనగండ్లలో ఏపీఓగా పనిచేస్తున్నారు. ఆయనకు ముగ్గురూ ఆడపిల్లలే ఉండడంతో వంశోద్ధారకుడు లేడని.. తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిని పేదలైన తమ్ముళ్లకు ఇవ్వాలనే ప్రతిపాదన కుటుంబంలో తెచ్చారు. అందుకు బద్రీనాథ్ ఒప్పుకోకపోవడంతో, తాను పంచి ఇచ్చిన భూమిని తిరిగి ఇవ్వాలని తండ్రి డిమాండ్ చేయడంతో పాటు కోర్టుకు సైతం వెళ్లాడు. దీంతో అప్పటి నుంచి అన్నదమ్ముల మధ్య విభేదాలు మొదలయ్యాయి. పదేళ్లుగా ఈ ఆస్తి వివాదం కోర్టులో కొనసాగుతుండగానే.. చాలాసార్లు ఘర్షణపడ్డారు. సోదరుల నుంచి ప్రాణభయం ఉండటంతో బద్రీనాథ్ కొంతకాలంగా బయట తిరిగే సందర్భంలో హతీరాం అనే వ్యక్తిని వెంటబెట్టుకునేవారు. బుధవారం విధి నిర్వహణలో భాగంగా కలెక్టరేట్‌కు వచ్చిన బద్రీనాథ్ తిరిగి వెళుతుండగా.. ఇద్దరు తమ్ముళ్లు సర్దార్ నాయక్, కోట్యా నాయక్‌తో పాటు సర్దార్ నాయక్ కుమారుడు పరమేశ్‌లు కాపుకాసి మరికుంట సమీపంలో కత్తులతో దాడి చేశారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా విచక్షణారహితంగా నరకడంతో బద్రీనాథ్ అక్కడికక్కడే మృతి చెందారు. పక్కనే ఉన్న హతీరాంకు కత్తి గాయం కావడంతో భయంతో పరారయ్యాడు. అనంతరం రెండు బైక్‌లపై నిందితులు అక్కడి నుంచి పారిపోయి.. వనపర్తి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, నిందితులు తమ అదుపులో ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ మహేశ్వర్‌రావు తెలిపారు. -
దారుణం: ప్రైవేటు ట్యూటర్‌ను పేపర్ కట్టర్‌తో..
ఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ మైనర్ తన ప్రైవేట్ ట్యూటర్ని పేపర్ కట్టర్‌తో కిరాతకంగా హత్య చేశాడు. లైంగికంగా వేధింపులకు గురి చేశాడని అందుకే తాను ఈ ఘటనకు పాల్పడ్డానని మైనర్ తెలిపాడు. దేశ రాజధానిలోని జామియా నగర్లో ఈ ఘటన జరగగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాకిర్ నగర్లో కుటుంబంతో కలిసి ఉంటున్న వసీమ్(28) ఓ ప్రైవేట్ ట్యూటర్‌గా పనిచేస్తున్నారు. పక్కనే జామియా నగర్లో ఉన్న ఓ విద్యార్థికి పాఠాలు బోధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆగష్టు 30న వసీమ్‌ను మైనర్ విద్యార్థి పేపర్ కట్టర్‌తో హత్య చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వసీమ్‌ను విద్యార్థి తండ్రి గుర్తించి, పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేయగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వసీమ్‌ను మైనర్ విద్యార్థే కిరాతకంగా హత్య చేసినట్లు గుర్తించారు. నేరం అంగీకరించిన విద్యార్థి.. తనను లైంగికంగా పలుమార్లు వేధించాడని, ఆ వీడియోలు తీసి, వాటిని బయటపెడతానని బెదిరించినట్లు ఆరోపించాడు. ఈ ఘటనలో మైనర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇదీ చదవండి: సోనియాగాంధీకి ఆస్వస్థత.. గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స.. -
రంగారెడ్డి: వీడిన మైనర్ రాజా కేసు మిస్టరీ
సాక్షి, రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లి మైనర్ బాలుడు రాజా పాశ్వాన్(17) హత్య కేసు మిస్టరీ వీడింది. హౌసింగ్ బోర్డ్ కాలనీలో బాలుడిని గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి.. నిందితుడు పంకజ్ పాశ్వాన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో ఇప్పుడు విస్తుపోయే విషయాలు పోలీసులు వెల్లడించారు. నిందితుడు పంకజ్ భార్యపై మైనర్ పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు గుర్తించారు. ఆ కోపంతోనే పథకం ప్రకారమే బాలుడిని పంకజ్ హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించుకున్నారు. కాగా, బీహార్‌కు చెందిన సంజయ్ పాశ్వాన్ భార్య, కుమారుడితో కలిసి బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చాడు. కాటేదాన్ లక్ష్మిగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటూ స్థానిక పరిశ్రమలో పని చేస్తున్నాడు. అతడి కుమారుడు ఇదే ప్రాంతంలోని స్క్రాప్ దుకాణంలో పని చేసేవాడు. శనివారం ఉదయం పనికి వెళ్లిన కుమారుడు సాయంత్రం ఇంటికి వచ్చాడు. శనివారం కావడంతో షాప్‌కు వెళ్తి బత్తా తెచ్చుకుంటానని చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. దుకాణ యజమాని వద్దకు వెళ్లి ఆరా తీయగా డబ్బులు తీసుకుని వెళ్లిపోయినట్లు చెప్పాడు. ఆదివారం ఉదయం హౌసింగ్ బోర్డు కాలనీలోని నిర్మాణుష్య ప్రాంతంలో బండరాయిపై బాలుడు పడి ఉన్నట్లు గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. పంకజ్ భార్యను బెదిరించి రాజా పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు తేలింది. ఆ విషయం తెలిసి కోపంతో రగిలిపోయిన పంకజ్.. పథకం ప్రకారమే కూరగాయలు కోసే కత్తితో రాజాని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. చదవండి: ఉరేసుకుందా.. గుండెపోటా? -
పోలీసులపై దాడి కేసులో టీడీపీ కొత్త ఎత్తులు
సాక్షి, అమరావతి: న్యాయస్థానాల్లో సానుకూల ఉత్తర్వులు పొందేందుకు తమకే సాధ్యమైన అనైతిక ఎత్తుగడలను రచించే టీడీపీ పెద్దలు మరోసారి అలాంటి దారినే ఎంచుకున్నారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఇటీవల పోలీసులపై దాడి ఘటనలపై నమోదైన కేసుల్లో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తులు వేశారు. హైకోర్టులో ఇప్పటికే కొందరు నాయకులతో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయించిన టీడీపీ అధినాయకత్వం... పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ మరి కొందరితో క్వాష్ పిటిషన్లు దాఖలు చేయించింది. హైకోర్టులో రోస్టర్ ప్రకారం ముందస్తు బెయిల్ పిటిషన్లు ఓ న్యాయమూర్తి, క్వాష్ పిటిషన్లు మరో న్యాయమూర్తి వేర్వేరుగా విచారిస్తున్నారు. ఓ చోట సానుకూల ఉత్తర్వులు రాకపోయినా మరోచోట సానుకూల ఉత్తర్వులు పొందవచ్చనే ‘దూరాలోచన’తో టీడీపీ నాయకత్వం ఇలా వేర్వేరు రకాల పిటిషన్లు దాఖలు చేయించింది. రెండు పిటిషన్లలోనూ వారికి కావాల్సింది అరెస్ట్ నుంచి తప్పించుకోవడమే. అందుకే వ్యూహాత్మకంగా రెండు రకాల పిటిషన్లు దాఖలు చేయించింది. నేతల తరఫున పిటిషన్లు దాఖలు చేసిన న్యాయవాదులందరూ దాదాపుగా ఆ పార్టీ లీగల్ సెల్‌కు చెందిన వారే. ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన నేతలు మధ్యంతర ఉత్తర్వుల కింద తమకు తాత్కాలిక మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతుండగా, క్వాష్ పిటిషన్లో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లలో తమ అరెస్ట్‌తో సహా తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని అభ్యర్థి స్తున్నారు. హత్యాయత్నం లాంటి తీవ్రమైన నేరం కింద కేసులు నమోదు కాగా, ఆ సెక్షన్‌ను పట్టించుకోకుండా తమకు సీఆర్సీపీ సెక్షన్ 41 కింద నోటీసు ఇచ్చి సరిపెట్టాలని వారు క్వాష్ పిటిషన్లో కోరారు. హత్యాయత్నం నేరాన్ని తేలికగా చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడేలా పోలీసులను కొట్టడమే కాకుండా, వారిని చంపండిరా అంటూ ఉసిగొల్పిన టీడీపీ నేతలు సీఆర్సీపీసీ సెక్షన్ 41 కింద నోటీసు ఇచ్చి సరిపెట్టాలని కోర్టును కోరడంపై న్యాయవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ నేతల దాడిలో ఓ పోలీసు ఏకంగా కళ్లు కోల్పోయిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. కేసు నమోదైన వారం రోజులకే కొట్టేయాలని కోరడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని న్యాయవర్గాలు చెబుతున్నాయి. టీడీపీ నేతల కుయుక్తులు అందరికీ తెలుసు. ముఖ్యంగా న్యాయమూర్తులందరికీ బాగా తెలుసు. గతంలో టీడీపీ పెద్దలు ఇలాంటి కుయుక్తులతో విజయం సాధించినా, ఇప్పుడు వారి బాగోతం అందరికీ తెలిసిపోయింది. అలాంటి అనైతిక ఎత్తులు పనిచేసే అవకాశం లేదన్నది న్యాయవర్గాల మాట. గతంలో నాట్ బిఫోర్, బెంచ్ హంటింగ్.... గతంలో టీడీపీ నాయకత్వం నాట్ బిఫోర్ , బెంచ్ హంటింగ్ వంటి దుష్ట పన్నాగాలను అమలు చేసి విజయం సాధించింది. నాట్ బిఫోర్, బెంచ్ హంటింగ్ వంటి వాటి గురించి సాధారణ ప్రజలకు తెలియదు. కేవలం న్యాయవాదులకు మాత్రమే తెలిసిన నాట్ బిఫోర్, బెంచ్ హంటింగ్ వంటి వాటి గురించి జన బాహుళ్యానికి తెలియచేసింది తెలుగుదేశం పార్టీనే. న్యాయమూర్తుల నైతిక విలువలను అలుసుగా తీసుకుని ఎన్నో సార్లు అనైతిక పద్ధతుల్లో ప్రయోజనం పొందింది. అయితే ప్రస్తుతం అలాంటి లబ్ధి పొందే అవకాశం లేదు.ఇలాంటి ఎత్తుగడలతో విసిగిపోయిన న్యాయమూర్తులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాదాపు నాట్ బిఫోర్కు చెల్లు చీటీ పాడారు. నాట్ బిఫోర్ లేని న్యాయమూర్తుల వద్దకు తమ కేసు వస్తే దానిని తప్పించేందుకు టీడీపీ పలు ఎత్తుగడలు వేసేది. చీటికీ మాటికీ గొడవ పెట్టుకునే కొందరు పెయిడ్ న్యాయవాదులను ఇందుకోసం ఎంపిక చేసుకునేది. వారిని ఆ న్యాయమూర్తి కోర్టుకు పంపి అక్కడ న్యాయమూర్తి ఎంత సహనంగా ఉన్నా ఏదో రకంగా రెచ్చగొట్టి ఆ న్యాయవాదిని నాట్ బిఫోర్ చేయించేది. తద్వారా తమ కార్యం సాధించుకునేది. తరువాత కాలంలో కూడా ఏదైనా కేసు ఆ న్యాయమూర్తి వద్దకు వస్తే అప్పటికే నాట్‌బిఫోర్‌గా ఉన్న ఆ న్యాయవాది చేత వకాలత్ దాఖలు చేయించేది. ఇలా ఎన్నో కేసుల్లో నాట్ బిఫోర్ ఎత్తుగడలతో టీడీపీ నెగ్గుకొచ్చిది. పలు సందర్భాల్లో బెంచ్ హంటింగ్‌కు పాల్పడ్డారు. న్యాయమూర్తులపై నిరాధార ఆరోపణలు.. ఇటీవల టీడీపీ మరింత బరి తెగించింది. ఎల్లో మీడియా చర్చా వేదికల్లో కొందరు పెయిడ్ ఆర్టీస్టులను కూర్చోబెట్టి వారితో న్యాయమూర్తులపై విషం చిమ్ముతోంది. ఇటీవల ఓ కేసులో హైకోర్టు న్యాయమూర్తిపై ఇలాగే నిరాధార ఆరోపణలు చేయించింది. చట్ట ప్రకారం ఆ న్యాయమూర్తి కేసు విచారణ నిర్వహించగా, ఆయన డబ్బు తీసుకున్నట్లు టీవీ లైవ్ చర్చలోనే ఆరోపణలు చేయించింది. తద్వారా ఆ న్యాయమూర్తి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. అయితే ఆయన చలించలేదు. చట్టప్రకారమే తీర్పు చెప్పారు. ఎల్లోమీడియా చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణిస్తూ తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తికే వదిలేశారు. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం పోలీసులపై జరిగిన దాడిని వైఎస్ జగన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కళ్లు కోల్పోయేలా పోలీసులపై దాడికి ఉసిగొల్పిన వారిని చట్టం ముందు నిలబెట్టాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఈ దాడి ఘటనపై నమోదైన కేసుల్లో పోలీసుల తరఫున వాదించే బాధ్యతను అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి అప్పగిస్తూ ప్రత్యేక జీవో ఇచ్చిది.అవసరమైతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి పోలీసులకు న్యాయం జరిగేలా చూడాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. తద్వారా పోలీసుల్లో మనోస్థైర్యాన్ని నింపాలని భావిస్తోంది. పోలీసులపై జరిగిన దాడి విషయంలో తెర వెనుక జరిగిన కుట్రకు సంబంధించిన పలు కీలక ఆధారాలను దర్యాప్తు అధికారులు ఇప్పటికే సాధించారు. మరింత లోతుగా దర్యాప్తు జరిపితే ఈ కుట్ర వెనుక దాగిన పెద్ద తలకాయలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపై పోలీసు చెప్పు దెబ్బలు.. వీడియో వైరల్..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తిపై స్థానిక పోలీసు విచక్షణా రహితంగా దాడి చేశాడు. సివిల్ డ్రస్‌లో ఉన్న పోలీసు మద్యం సేవించిన వ్యక్తిని బహిరంగ ప్రదేశంలోనే షూతో చెంప దెబ్బలు కొట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సదరు పోలీసును విధుల నుంచి సస్పెండ్ చేశారు. రాష్ట్ర రాజధాని లక్నోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్ధొయ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వీడియో ప్రకారం.. పోలీసు మార్కెట్ ప్రదేశంలోకి సివిల్ డ్రెస్‌లో వచ్చిప్పుడు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కనిపించాడు. బాధితునిపై పోలీసు షూతో దాడి చేశాడు. కేవలం 4 నిమిషాల వ్యవధిలో షూతో ముఖంపై 38 దెబ్బలు కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. Watch: UP Cop In Trouble After Shocking Assault On "Drunk" Man https://t.co/6RthUUmPPZ pic.twitter.com/DSGEyQTWo3 — NDTV (@ndtv) July 23, 2023 దీనిపై స్పందించిన పోలీసులు బాధితుడు మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించినట్లు చెప్పారు. బాధిత వ్యక్తిపై దాడి చేసిన సదరు పోలీసుని విధుల నుంచి తప్పించారు. ప్రజలతో గౌరవంగా నడుచుకోవాలని పోలీసులకు తెలిపారు. అయితే.. ఆ వ్యక్తి స్థానికంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్న కారణంగానే తాను కొట్టాల్సి వచ్చిందని సస్పెన్ష్‌కు గురైన పోలీసు చెప్పారు. ఇదీ చదవండి: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి.. చివరకు.. -
బాలికపై బీఆర్ఎస్ నాయకుడి అత్యాచారం.. ఎమ్మెల్యే రియాక్షన్ ఇదే..
బోధన్‌టౌన్(బోధన్): నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్ కాలనీకి చెందిన 13 ఏళ్ల బాలికపై అదే కాలనీకి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కొత్తపల్లి రవీందర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శక్కర్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్న మైనర్ బాలికకు తండ్రి లేకపోవడంతోపాటు తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం రవీందర్ ఆ బాలికను వారి ఇంటి సమీపంలోని తన మేకల షెడ్డులోకి లాక్కెళ్లి కాళ్లు, చేతులు బంధించి నోట్లో గుడ్డలు కుక్కి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. కాగా, బాలిక ఈ విషయాన్ని మంగళవారం బంధువులతో తెలిపింది. వారు రవీందర్ సోదరుడైన బీఆర్ఎస్ బోధన్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ రాధాకృష్ణ ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. దీంతో రవీందర్‌తో పాటు రాధాకృష్ణ.. విషయం బయటకు చెబితే చంపేస్తామని బాధితులను బెదిరించారు. అత్యాచారం విషయం బుధవారం బయటకు పొక్కడంతో పోలీసులు వెంటనే రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రవీందర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రేమ్‌కుమార్ తెలిపారు. నిందితుడి సోదరుడు రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్యే షకీల్ బాలికపై అత్యాచారం జరిగిన విషయం తెలియటంతో ఎమ్మెల్యే షకీల్ దంపతులు బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. నిందితుడు రవీందర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని, అతని సోదరుడు రాధాకృష్ణను కూడా ఫ్లోర్‌లీడర్ పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రకటించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఇది కూడా చదవండి: నర్సింగ్ విద్యార్థి కావ్య ఆత్మహత్య.. కారణం ఏంటి? -
కోడలిపై మామ అరాచకం.. పొట్టి షార్ట్ వేసుకుందని వేడి వేడి సూప్ పోసి..
ఆధునిక కాలంలో అనేక మార్పులు వచ్చాయి. అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారు. అయినా కొంతమంది ప్రజల ఆలోచన విధానాల్లో మార్పు రావడం లేదు. టెక్నాలజీ అభివృద్ధి చెందుత్ను ఇంకా పితృస్వామ్య మూస ధోరణిలోనే జీవిస్తున్నారు. మా మాటే వినాలి, మేము చెప్పిందే చేయాలనే విధంగా స్త్రీలపై అధిపత్యం చెలాయిస్తున్నారు. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో అలాంటి ఓ సంఘటనే తాజాగా వెలుగు చూసింది. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తన కోడలిని వేధింపులకు గురిచేశాడు. పొట్టి బట్టలు వేసుకుందని ఆమెపై వేడి వేడి సూప్ పోసి దాడి చేశాడు. ఈ ఘటన జూన్ 12 న జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. కోడలు సరైన బట్టలు వేసుకోలేదని మామ ఆమెపై అరిచాడు. ఆమె ధరించిన హాట్ ప్యాంట్( పొట్టి షార్ట్) చాలా చిన్నగా ఉందని తిట్టాడు. ఇలాగే బయటకు వెళ్తే ఇరుగు పొరుగు వారు చూస్తే తమ పరువు పోతుందని అన్నాడు. దీనిపై కోడలు స్పందిస్తూ.. ‘నా డబ్బులతో నేను దుస్తులు కొనుకున్నాను. నాకు నచ్చినట్లు వేసుకుంటాను’ అని సమాధానం చెప్పింది. ఈ మాటలు విన్న ఆమె మామయ్య ఒక్కసారిగా హింసాత్మకంగా మారాడు. కోడలు ముఖంపై వేడి సూప్ గిన్నెను విసిరాడు. అంతటితో ఆగకుండా ఈ గొడవను పెద్దది చేస్తూ ఆమె జుట్టు పట్టుకొని లాగి ‘ నేను నిన్ను ఈరోజు చంపేస్తాను’ అంటూ బెదిరించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన మహిళ కొడుకు.. తల్లిని రక్షించేందుకు ఆమెను బెడ్రూంలోకి తీసుకెళ్లి తాళం వేశాడు. ఈ విషయం పోలీసుల వరకు చేరుకుంది. వారు ఇంటికి చేరుకొని మహిళ దుస్తుల వల్ల ఎవరికి ఏ నష్టం లేదని దుస్తుల పేరుతో ఆమెను వేధించడం మానేయాలని మామను హెచ్చరించారు. అయితే ఈ విషయం అక్కడితో ఆగలేదు. మామ వేధింపుల గురించి భర్తకు తెలియజేయగా అతను సైతం తండ్రి వైపే నిలిచాడు. అలాంటి దుస్తులు ధరించవద్దని భార్యను వారించాడు. తనకు అండగా ఉంటాడనున్న భర్త సైతం తండ్రి వైఖరితోనే ఉండటంతో తాను విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సదరు మహిళ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలో ఆమె ముఖంపై గాయాలు, మచ్చలు ఉన్నాయి. వీటిని చూస్తుంటే మామ ఆమెను తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు మామ ప్రవర్తనపై మండిపడుతున్నారు. ‘ఆమెను చంపేస్తానని బెదిరించడానికి అతనికి ఎంత ధైర్యం? చాలా భయంకరంగా ఉంది ఇది. మనం ఇంకా రాజుల కాలంలో జీవించడం లేదు. ఆమె ఆ దుస్తులు ఎందుకు ధరించవద్దంటూ ప్రశ్నిస్తున్నారు. -
‘గట్టు’ కోసం గొడ్డళ్లతో దాడి..
అడ్డగూడూరు: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మానాయికుంటలో భూ వివాదం భగ్గుమంది. రెండెకరాల భూమి గట్టు పంచాయితీ సోదరుల మధ్య చిచ్చురేపడంతో ఒకరిపై ఒకరు గొడ్డళ్లతో దాడి చేసుకోగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. మానాయికుంటకు చెందిన మార్త బుచ్చయ్య, లచ్చమ్మ దంపతులకు వీరయ్య, సైదులు కుమారులు. గ్రామ శివారులో తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమిని సోదరులిద్దరూ చెరో ఎకరం పంచుకుని సాగుచేసుకుంటున్నారు. కొంతకాలంగా వీరి మధ్య గట్టు పంచాయితీ నడుస్తోంది. అరకతో అచ్చుతోలుతుండగా.. వీరయ్య తన కుమారుడు ప్రభాస్‌తో కలసి బుధవారం ఉద యం పొలంలో అరకతో అచ్చుతోలుతున్నాడు. విషయం తెలుసుకున్న చిన్నకుమారుడు సైదులు, తన కు మారుడు శేఖర్‌తో కలసి భూమి వ ద్దకు వెళ్లి వీరయ్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో నలుగురి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతుండగా సైదులు కుమారుడు శేఖర్ గొడ్డలితో పెదనాన్న కుమారుడు ప్రభాస్‌పై దాడి చేశాడు. దీంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో సైదులు ఎడమచెయ్యి తెగిపోవడంతో పాటు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక రైతులు దాడిని అడ్డుకున్నారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. -
లైంగిక వేధింపుల కేసు.. హీరోకు షాకిచ్చిన హైకోర్టు!
మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌కు కేరళ హైకోర్టు బిగ్ షాకిచ్చింది. లైంగిక వేధింపుల కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ కేసుపై ఫిబ్రవరి 2023లో విధించిన స్టేను తాజాగా కేరళ హైకోర్టు ఎత్తివేసింది. ఈ కేసులో ఫిర్యాదుదారుతో సెటిల్మెంట్ కుదిరిందని ఊహగానాలు కూడా వచ్చాయి. (ఇది చదవండి: 'డింపుల్‌తో డీసీపీ ర్యాష్‌గా మాట్లాడారు.. అందుకే కాలితో తన్నారు') కాగా.. 2017 ఆగస్టు 23న సినిమా ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకు కొచ్చిలోని ఎడపల్లిలోని తన నివాసానికి వచ్చిన ముకుందన్.. తనపై దాడికి పాల్పడ్డాడని బాధితురాలు సెప్టెంబరు 15, 2017లో పోలీసులకు ఫిర్యాదులో చేశారు. అయితే ఆమె ఆరోపణలను ఉన్ని ముకుందన్ ఖండించారు. అంతేకాకుండా ఆమెపై పరువు నష్టం కేసును దాఖలు చేశారు. సెటిల్మెంట్లో ఆమె రూ.25 లక్షలు డిమాండ్ చేసిందని కూడా ఆరోపించాడు. ఉన్ని ముకుందన్ ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఆయనకు కోర్టుల్లో చుక్కెదురైంది. దీంతో నటుడు తనను నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టుకు వెళ్లాడు. (ఇది చదవండి: ఊర్వశి రౌతేలా నెక్లెస్.. ధరపై నెటిజన్స్ ట్రోల్స్!) కాగా.. నటుడు చివరిసారిగా 'మలికాపురం చిత్రంలో కనిపించారు. 2011లో 'సీడన్' అనే తమిళ సినిమాతో ముకుందన్ తెరంగేట్రం చేశారు. అతను మలయాళం, తమిళం, తెలుగు సినిమాలలో నటించారు. 2020లో ఉన్ని ముకుందన్ ఫిల్మ్స్‌ని ప్రొడక్షన్ బ్యానర్ నడుపుతున్నాడు. -
వీడియో: నడిరోడ్డుపై కారుని ఆపి దౌర్జన్యం
-
హైదరాబాద్‌లో దారుణం.. మాజీ ప్రియురాలి ఇంట్లోకి దూరి..
సాక్షి, హైదరాబాద్: ప్రేమికులుగా విడిపోయిన తర్వాత తన మాజీ బాయ్ ఫ్రెండ్ అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించడమే కాకుండా లైంగికదాడికి యత్నించాడంటూ ఓ యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల సమాచారం మేరకు.. పబ్‌లలో గిటారిస్ట్‌గా పని చేస్తున్న లలిత్ సెహెగల్‌కు 2016లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న యువతి (36)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ 2021 వరకు స్నేహితులుగా ఉన్నారు. అదే ఏడాది ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగి.. ఎవరికి వారే వేర్వేరుగా ఉంటున్నారు. కొంత కాలంగా సదరు యువతి లలిత్ సెహగల్ స్నేహితుడితో సన్నిహితంగా మెలుగుతోందని, ఈ విషయంపై నిలదీసేందుకు గచ్చిబౌలిలోని హాస్టల్లో ఉంటున్న లలిత్ సెహెగల్.. యువతి ఉంటున్న ఫ్లాట్‌కు వచ్చాడు. చదవండి: పెళ్లయ్యాక ఆమెతో భర్త ఒక్కరోజు గడపలేదు.. మరో మహిళతో రీల్స్.. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు అరుపులు కేకలతో గొడవపడ్డారు. ఈ సమయంలోనే తన దుస్తులను చించేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించి లైంగికదాడికి యత్నించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడు లలిత్ సెహగల్‌పై ఐపీసీ సెక్షన్ 376 రెడ్‌విత్ 511, 323, 354, 509ల కింద కేసు నమోదు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసులపై బాలల హక్కుల సంఘం చీఫ్ సంచలన ఆరోపణలు
బాలల హక్కుల సంఘం చీఫ్ ప్రియాంక కనూంగో పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. తనపై దాడి చేసి దుర్భాషలాడరని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చారు అధికారులు. తాము ఆయనకు సహకరించామని, అతనే తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. ఈ వారంలో కోల్‌కతాలోని తిల్జాలా ప్రాంతంలో ఒక మైనర్ తన పొరుగింటి వారి చేతిలోనే హత్యకు గురయ్యింది. ఈ విషయమైన తాను అక్కడకు వచ్చానని నేషనల్ కమిషన్ ప్రోటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(ఎన్సీపీసీఆర్) చైర్ పర్సన్ ప్రియాంక కనూంగో చెప్పారు. అప్పుడే కోల్‌కతా పోలీసులు తనపై దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు. పోలీసులు మాపై జరుపుతున్న దర్యాప్తు ప్రక్రియలను రహస్యంగా రికార్డు చేస్తున్నారని, దీన్ని వ్యతిరేకించినందుకే తనపై దాడి చేరని కనూంగో సోషల్ మీడియా వేదికగా హిందీలో ట్వీట్ చేశారు. దీనిపై పశ్చిమ బెంగాల్ కమీషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(డబ్ల్యూసీపీసీఆర్) చీఫ్ సుదేష్నా రాయ్ స్పందిస్తూ..తనను, తమ సహోద్యోగులను కనూంగో అవమానించాడని అన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆలోచిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అసలు ఎన్సీపీసీఆర్ బృందం మాకు సమాచారం ఇవ్వకుండా ఆ బాలిక కుటుంబం వద్దకు వెళ్లిందన్నారు. నిజానికి ఆ ప్రతిపాదిత పర్యటన అవసరం లేదని చెప్పారు. ఈ విషయాన్నే పేర్కొంటూ రాయ్ ఎన్‌సీపీసీఆర్‌కి లేఖ కూడా రాశారు. (చదవండి: విమానంలో మరో అనుచిత ఘటన: తాగిన మత్తులో 62 ఏళ్ల ప్రయాణికుడి వీరంగం) -
భార్యకు చిత్రహింసలు.. మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు
నిత్యం వివాదాల్లో నిలిచే టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. భార్యను చిత్రహింసలకు గురిచేస్తూ ఆమెపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కాంబ్లీని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాంబ్లీ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకే తాము కాంబ్లీని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. విషయంలోకి వెళితే.. ప్రస్తుతం వినోద్ కాంబ్లీ తన భార్య ఆండ్రియా, కుమారుడితో కలిసి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నివసిస్తున్నాడు. శుక్రవారం ఇంట్లోనే మద్యం తాగిన మత్తులో భార్య ఆండ్రియాతో గొడవపడ్డాడు. ఆ తర్వాత మద్యం మత్తులో పాన్ హ్యాండిల్‌తో తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు ఆండ్రియా తెలిపింది. ఈ క్రమంలో తలకు బలమైన గాయం అయిందని ఆరోపించింది. ఆండ్రియా ఇచ్చిన సమాచారం మేరకు నివాసానికి చేరుకున్న పోలీసులు వినోద్ కాంబ్లీని అదుపులోకి తీసుకొని అతని భార్య ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 324, సెక్షన్ 504 కింద కేసు నమోదు చేశారు అయితే 51 ఏళ్ల కాంబ్లీకి వివాదాలు కొత్తేం కావు. గతేడాది ఫిబ్రవరిలో తను నివాసముండే హౌసింగ్ సొసైటీలో గొడవ కారణంగా ముంబై పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలం క్రితం కాంబ్లీ మద్యం తాగి వాహనం నడిపి కారును ఢీకొట్టడంతో మారోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఇటీవలి కాలంలో ఆయన ఒక స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాధను వ్యక్తం చేశాడు. తనకు సంపాదన లేదని, కేవలం బీసీసీఐ ఇస్తున్న పెన్షన్ పైనే ఆధారపడి జీవించాల్సి వస్తుందని తెలిపాడు. 1991లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన వినోద్ కాంబ్లీ సచిన్ టెండూల్కర్‌కు మంచి సన్నిహితుడు. అయితే అతని వ్యక్తిగత ప్రవర్తనతో జట్టులో చోటు కోల్పోయాడు. టీమిండియా తరపున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. చదవండి: 'తెల్లబంతి పని పట్టా.. ఎరుపు బంతి కోసం వెయిటింగ్' 'ప్రైవసీకి భంగం'.. ఫోటోలు లీకవడంపై ఆగ్రహం -
సాధువులపై దాడి...పిల్లలను ఎత్తుకుపోతున్నారనే అనుమానంతో కర్రలతో...
ముంబై: పిల్లలను ఎత్తుకుపోతున్నారనే అనుమానంతో కొంతమంది వ్యక్తులు ఆయుధాలతో సాధువులపై దాడి చేశారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని లవణ గ్రామంలో చోటు చేసుకుంది. ఐతే వీడియోలో ఒక కిరాణ దుకాణం వెలుపల కొందరూ సాధువులను కొట్టడం కనిపించింది. కానీ పోలీసులు మాత్రం ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. వీడియోని పరిసీలించి వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు. ఈ మేరకు పోలీసుల విచారణలో...ఉత్తరప్రదేశ్‌కు చెందిన నలుగురు సాధువులు కర్ణాటకలో బీజాపుర్ నుంచి ఆలయ పట్టణం పండర్‌పూర్‌కు వెళ్తుండగా బాలుడిని దారి అడిగారు. వాళ్లు పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాకు చెందిన వారిగా అనుమానించి స్థానికులు ఈ దాడికి పాల్పడ్డారు. వాస్తవానికి ఆ సాధువులు ఒక ఆలయం వద్ద ఆగిపోయి తిరిగి తమ ప్రయాణాన్ని పునః ప్రారంభిస్తున్నప్పుడూ ఈ ఘటన జరిగిందని. అదీకూడా ఎటువెళ్లాలని దిశ కోసం అడగడంతోనే ఈ ఘటనకు దారితీసినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే ఈ ఘటనను ఖండిస్తూ సాధువులతో ఇలాంటి అనుచిత ప్రవర్తనను రాష్ట్ర ప్రభుత్వం సహించదని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒక వీడియో సందేశంలో తెలిపారు. ఆయన 2020 ఘటనను ప్రస్తావిస్తూ...పాల్ఘర్లో సాధువుల హత్య కేసులో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వ అన్యాయం చేసిందని, ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వం అలాంటి అన్యాయాన్ని సహించదని చెప్పారు. (చదవండి: అత్తారింటికి వెళ్లి కాల్పులు.. ఘరాన భర్త హల్చల్) -
యూకేలో సౌతాఫ్రికా క్రికెటర్‌పై దాడి.. పరిస్థితి విషమం
సౌతాఫ్రికా క్రికెటర్ మొండ్లీ ఖుమాలోపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతానికి అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. మరొక రోజు గడిస్తే కానీ ఖుమాలో పరిస్థితి చెప్పలేమన్నారు. విషయంలోకి వెళితే.. సౌతాఫ్రికాకు చెందిన మొండ్లీ ఖుమాలో యూకేలో కౌంటీ క్రికెట్ ఆడేందుకు వచ్చాడు. అతను నార్త్ పెర్తర్టన్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా మొండ్లీ ఖుమాలో మే 29(ఆదివారం) మ్యాచ్ ముగించుకొని ఇంటికి బయల్దేరాడు. బ్రిడ్జ్‌వాటర్ సమీపంలోకి రాగానే ఫ్రియర్న్ స్ట్రీట్‌లో గ్రీన్ డ్రాగన్ పబ్ వద్ద కొందరు వ్యక్తులు మొండ్లీ ఖుమాలోకు అడ్డువచ్చారు. తనకు ఎందుకు అడ్డువచ్చారని అడిగేలోపే ఖుమాలోపై దాడికి పాల్పడ్డారు. అతన్ని విచక్షణారహితంగా కొట్టిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో తీవ్ర గాయాలపాలైన మొండ్లీ ఖుమాలోను అక్కడి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దెబ్బలు బాగా తగలడంతో ఖుమాలో పరిస్థితి సీరియస్‌గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా ఖుమాలో స్నేహితుడు.. తోటి క్రికెటర్ టియాన్ కోకెమోర్ ట్విటర్ వేదికగా తన స్నేహితుడు కోలుకోవాలని.. అందుకు మీరంతా ప్రార్థించాలంటూ ట్వీట్ చేశాడు.''మనం నీచమైన ప్రపంచంలో బతుకు జీవనం సాగిస్తున్నాం. నా స్నేహితుడు.. జట్టు సభ్యుడు మొండ్లీ ఖుమాలో త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. గత ఆదివారం ఇంటికి వస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని.. ప్రస్తుతం యూకేలోని ఆసుపత్రిలో మృత్యువు నుంచి తప్పించుకోవడానికి పోరాటం చేస్తున్నాడు''. అంటూ పేర్కొన్నాడు. కాగా విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ఖుమాలోపై దాడికి దిగిన వారిలో ఒక 27 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా ఖుమాలోపై దాడి విషయాన్ని పోలీసులు సౌతాఫ్రికాలో ఉన్న తన కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఖుమాలో ప్రాతినిధ్యం వహిస్తున్న నార్త్ పెర్తర్టన్ క్రికెట్ క్లబ్ దాడిని ఖండించింది. ''దుండగుల చేతిలో గాయపడి ఆసుపత్రిలో కోలుకుంటున్న మొండ్లీ ఖుమాలోకు మా మద్దతు ఉంటుంది. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.'' అని తెలిపింది. కాగా 20 ఏళ్ల మొండ్లీ ఖుమాలో 2018లో క్వాజులు-నాటల్ ఇన్లాండ్ తరపున టి20 అరంగేట్రం చేశాడు. 2020 అండర్-19 ప్రపంచకప్ సౌతాఫ్రికా జట్టులో మొండ్లీ ఖుమాలో చోటు దక్కించుకున్నాడు. ఇక 2020 మార్చి 7న లిస్ట్-ఏ, 2021 మార్చి 4న ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, రెండు లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 4 టి20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: Darren Sammy: వెస్టిండీస్ మాజీ కెప్టెన్‌కు పాకిస్తాన్ ప్రతిష్టాత్మక అవార్డు What a sick world we live in! 😡Please pray for my teammate Mondli Khumalo! 🙏🏻🙏🏻❤️🐘 He was brutally assaulted while heading home from a night out and he is currently fighting for his life in hospital in the UK. pic.twitter.com/94MrXhArs4 — Tian Koekemoer (@TianKoekemoer07) May 30, 2022 -
ప్రేమించాడని నజీర్ అనే యువకుడిపై కత్తులతో దాడి
-
బాలికపై అఘాయిత్యం కేసులో నలుగురి అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం/కడప అర్బన్/సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారానికి సంబంధించిన కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు.. పఠాన్ సాధక్, షేక్ అబ్దుల్ రసూల్, బత్తల సిమోన్, బి.సిపాయి చిన్నయ్య ఎర్రగుంట్ల బైపాస్‌రోడ్డులో ఉండగా అదుపులోకి తీసుకున్నట్టు ఏఎస్పీ నీలం పూజిత తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు ఆమె వివరాలను వెల్లడించారు. విచారణలో భాగంగా తనపై నలుగురు అత్యాచారం చేసినట్లు బాలిక వెల్లడించిందన్నారు. చదవండి: కాకినాడ: సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు. కాగా, నిందితులపై కేసు నమోదు చేశాక మీడియాలో స్క్రోలింగ్ వచ్చిందని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశాక అసత్యాలు ప్రసారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం కడపలో ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 4న ప్రొద్దుటూరు వన్‌టౌన్ సీఐ నాగరాజుకు ఫోన్ కాల్ వచ్చిందన్నారు. ఆ ప్రాంత అంగన్వాడీ టీచర్ ద్వారా సమాచారం అందుకున్న మహిళా పోలీసు మల్లేశ్వరి ఒక మైనర్ బాలిక గర్భంతో ఉండి వీధుల్లో తిరుగుతోందని సీఐకి సమాచారం ఇచ్చారని తెలిపారు. దీనిపై స్పందించిన సీఐ బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులను స్టేషన్‌కు తీసుకురమ్మని మహిళా పోలీసుకు సూచించారన్నారు. అయితే బాలిక మానసికస్థితి సరిగా లేకపోవడంతో తన వివరాలను పోలీసులకు వెల్లడించలేకపోయిందన్నారు. ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఎవరో తేలకపోవడంతో సంరక్షణ నిమిత్తం బాలికను మైలవరంలోని డాడీహోంకు తరలించామన్నారు. తండ్రి మానసిక స్థితి కూడా సరిగా లేదు.. ఈ నెల 9న త్రీటౌన్ పరిధిలో ఉన్న బాలిక తండ్రిని గుర్తించి సమాచారం ఇచ్చామని ఎస్పీ అన్బురాజన్ చెప్పారు. అయితే అతడి మానసిక స్థితి కూడా సరిగా లేకపోవడంతో ఫిర్యాదు ఇవ్వలేకపోయాడన్నారు. దీంతో ఐసీడీఎస్ సీడీపీవో హైమావతి ఫిర్యాదు మేరకు ఈ నెల 11న ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ క్రమంలో బయటి వ్యక్తులకు వెళ్లిన పలు వీడియోలను పరిశీలించి కేసులో సంబంధం ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. బాలిక తల్లి ఏడాది క్రితం అనారోగ్యంతో మరణించిందని చెప్పారు. బాలికకు ఆరు నెలలుగా ఒక వ్యక్తితో పరిచయం ఉందని.. అతడు అనుభవించి మోసం చేశాడన్నారు. అంతేకాకుండా అతడి ఇద్దరు బంధువులు కూడా బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపారు. నాలుగు నెలల క్రితం ఇంకో వ్యక్తి 20 రోజుల పాటు బాలికను పనిమనిషిగా పెట్టుకొని మోసం చేశాడన్నారు. దర్యాప్తును వేగవంతం చేయండి: వాసిరెడ్డి పద్మ కాగా, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ.. ఎస్పీ అన్బురాజన్‌తో గురువారం ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. దర్యాప్తును వేగంగా పూర్తి చేయాలని కోరారు. బాలిక ఆరోగ్యం కుదుటపడేవరకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్షి్మని హుటాహుటిన బాధిత బాలిక వద్దకు పంపారు. ఈ కేసును కమిషన్ సుమోటోగా స్వీకరిస్తుందని.. బాధితురాలికి అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. -
అమ్మాయిపై దాడి.. రెండోసారి అరెస్టయిన హీరో..
The Flash Hero Ezra Miller Arrested For Second Time In Assault Case: సూపర్ హీరో పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ హీరో ఎజ్రా మిల్లర్. ఈ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 'ది ఫ్లాష్' హీరో అంటే మాత్రం సినీ ప్రియులు టక్కున గుర్తు పట్టేస్తారు. ప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీ ప్రొడ్యూస్ చేసిన 'జస్టీస్ లీగ్' చిత్రంలోని ఓ పాత్ర పేరే 'ది ఫ్లాష్'. ఈ క్యారెక్టర్లో నటించిన ఎజ్రా మిల్లర్ సినీ అభిమానులను, ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ప్రస్తుతం ఈ హీరో న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాడు. పహోవాలోని ఒక ప్రైవేట్ నివాసంలో ఓ పార్టీలో జరిగిన సంఘటనపై నమోదైన కేసులో మంగళవారం (ఏప్రిల్ 19) మిల్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 19న ఉదయం ఒంటి గంటకు ఒక ప్రైవేట్ పార్టీ జరిగింది. ఆ పార్టీలో ఓ 26 ఏళ్ల మహిళ మిల్లర్‌ను అక్కడి నుంచి వెళ్లమని కోరింది. దీంతో కోపోద్రిక్తుడైన మిల్లర్ ఆమెపై కుర్చీ విసరగా.. ఆమె తలకు దెబ్బ తగిలింది. ఈ ఘటనపై ఆమె ఫిర్యాదుతో మిల్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై ఉదయం 4 గంటలకు విడుదల చేశారు. అయినప్పటికీ ఆ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉందని పోలీసులు తెలిపినట్లు సమచారం. ఇదిలా ఉంటే ఇదివరకూ కూడా మిల్లర్ ఇలాగే అరెస్ట్ అయ్యాడు. చదవండి: ఇప్పటికే 9 మంది భార్యలు, మరో ఇద్దరు కావాలట.. ఆ కోరిక తీర్చుకోవాలట మార్చి 28న హవాయిలో ఉన్న హోనోలులులోని ఒక బార్లో 23 ఏళ్ల మహిళా సింగర్‌తో అసభ్యంగా ప్రవర్తించడం, ఓ వ్యక్తిపై దాడికి ప్రయత్నించిన కారణంగా ఎజ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం 500 డాలర్ల ఫైన్‌తో విడుదల చేశారు. ఇది జరిగి నెల గడవకముందే మరోసారి అరెస్టయ్యాడు ఈ ఫ్లాష్ హీరో. ఎజ్రా మిల్లర్ హ్యారీపోటర్ సిరీస్‌కు ప్రీక్వేల్గా తెరకెక్కిన 'ఫెంటాస్టిక్ బీస్ట్: ది సీక్రెట్స్ ఆఫ్ డంబుల్ డోర్' సినిమాతో వరల్డ్‌వైడ్‌గా గుర్తింపు పొందాడు. చదవండి: ఐఎమ్‌డీబీ రేటింగ్ ఇచ్చిన 10 బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్‌లు.. -
'సూపర్' హీరోయిన్‌కు చేదు అనుభవం.. ఎయిర్‌పోర్టులో లైంగిక వేధింపులు
బాలీవుడ్ హీరోయిన్ అయేషా టాకియాకు చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌పోర్టులో ఓ అధికారి అయేషాను అసభ్యంగా తాకాడని స్వయంగా ఆమె భర్త ఫర్హన్ అజ్మీ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. సొంత దేశంలోనే ఇలా జరగడం అవమానంగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేస్తూ..'డియర్ ఫ్రెండ్స్, నేను నా ఫ్యామిలీతో 'ఇండిగో 6E 6386' విమానంలో గోవా నుంచి ముంబైకి ప్రయాణించేందుకు సిద్దమయ్యాం. ఎయిర్‌పోర్టులో ఆర్పీసింగ్, ఏకే యాదవ్ అనే ఇద్దరు సీనియర్ ఆఫీసర్లు నన్ను, నా కుటుంబాన్ని అడ్డగించారు. నా పేరు గట్టిగా పలుకుతూ వాళ్ల టీమ్ మెంబర్స్‌తో వెకిలిగా ప్రవర్తించారు. సెక్యూరిటీ చెక్ కోసం లైన్లో నిలబడితే సెక్యూరిటీ డెస్క్‌లోని ఓ పురుష అధికారి నన్ను, నా ఫ్యామిలీని వేరువేరు లైన్లో నిలబడమని సూచిస్తూ ఆయేషా ఒంటిని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళలను టచ్ చేయడానికి నీకు ఎంత ధైర్యం అని నేను అడిగాను. దూరంగా ఉండాలని కోరాను. ఈ గొడవ తర్వాత మళ్లీ నన్ను తనిఖీ చేస్తున్నప్పుడు కూడా డర్టీగా సెక్సువల్ కామెంట్స్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి మాకు న్యాయం అందించాలని డిమాండ్ చేస్తున్నా అంటూ ట్వీట్లో వివరించాడు. ఇది కాస్తా వైరల్ కావడంతో స్పందించిన ఎయిర్పోర్ట్ అధికారులు.. 'ప్రయాణంలో మీకు, మీ కుటుంబ సభ్యులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ విషయాన్ని విచారించి తగిన చర్యలు తీసుకుంటాం' అని హామీ ఇచ్చారు. కాగా ఆయేషా తెలుగులో సూపర్ సినిమాతో గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. Altercation started when an armed male officer at the security desk tried to physically touch & tell my wife, son to stand in another line while all other families were standing together for sucurity.All I said to him is to dare touch any female her & maintain distance @CISFHQrs — Farhan Azmi (@abufarhanazmi) April 4, 2022 -
లైంగిక దాడి, ఆపై వీడియోలు తీశారు : నటి
తిరువొత్తియూరు: ఏకేఆర్ ప్రాంతంలో ఓ సహాయ నటిపై సామూహిక లైంగిక దాడి చేసిన వ్యవహారంలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వివరాలు.. చెన్న వలసరవాక్కుంకు చెందిన ఓ సహాయ నటి. భర్త నుంచి విడిపోయి ఒంటరిగా నివాసం ఉంటోంది. మంగళవారం అర్థరాత్రి సమయంలో తన ఇంటిలోకి చొరబడి ఇద్దరు కత్తి చూపించి 10 గ్రాముల బంగారు నగలు లాక్కుని రూ. 50వేలు నగదు చోరీ చేశారని ఫిర్యాదు చేశారు. అలాగే వారిద్దరూ తనపై లైంగిక దాడి చేశారని, వీడియోలు తీశారని ఆరోపించారు. పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా చెన్నై రామాపురం ప్రారంతానికి చెందిన కన్నదాసన్, ఆయుపాకం ప్రాంతానికి చెందిన సెల్వకుమార్‌ను అరెస్ట్ చేశారు. -
రెచ్చిపోయిన ఆకతాయిలు.. విద్యార్థినులు ట్యూషన్ నుంచి వస్తుండగా..
ధర్మవరం అర్బన్(అనంతపురం జిల్లా): మద్యం మత్తులోనున్న ఆకతాయిలు రెచ్చిపోయారు. ఐదుగురు విద్యార్థినులపై అత్యాచారానికి ప్రయత్నించారు. వివరాలు... స్థానిక ఎస్బీఐ కాలనీలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థినులు బుధవారం రాత్రి 8 గంటలకు ట్యూషన్ ముగించుకుని ఇంటి దారి పట్టారు. రైలు పట్టాల సమీపంలో మద్యం మత్తులో ఉన్న నలుగురు ఆకతాయిలు వారిని అటకాయించి నిర్మానుష్య ప్రాంతంలోకి లాక్కెళ్లారు. చదవండి: పక్కింటి యువకుడితో భార్య చనువుగా ఉంటుందని.. విద్యార్థినులతో పాటు ఉన్న ఏడేళ్ల చిన్నారిని ఎత్తుకుని చంపుతామంటూ బెదిరించి మిగిలిన వారిపై అత్యాచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో విద్యార్థినుల కేకలు విని ఓ వ్యక్తి అటుగా వెళ్లాడు. ఆకతాయిలతో గొడవపడి విద్యార్థినులను అక్కడి నుంచి పారిపోవాలని సైగ చేయడంతో వారు తప్పించుకున్నారు. కత్తులతో దాడి చేయబోగా విద్యార్థినులను కాపాడిన వ్యక్తి చాకచక్యంగా తప్పించుకున్నాడు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు వెంటనే అర్బన్ సీఐ కరుణాకర్‌కు ఫిర్యాదు చేశారు. ఆకతాయిల కోసం గాలింపు చేపట్టారు. -
ఫేస్బుక్ ద్వారా పరిచయం.. ప్రేమించానని నమ్మించి..
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): ప్రేమించానని నమ్మించి యువతిపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా పెళ్లి చేసుకోవాలని అడిగేందుకు వెళ్లిన బాధితురాలి కుటుంబ సభ్యులను కులం పేరుతో దూషించిన వారిపై కొత్తపేట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నవరానికి చెందిన వేము శిరీష (25)కు వన్‌టౌన్‌కు చెందిన రాయన రవితేజ ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడు చదవండి: టాటూలు వేస్తానని ఏడుగురు మహిళలతో ఒంటరిగా స్టూడియోలో.. కొంత కాలం తర్వాత రవితేజ శిరీషను ప్రేమిస్తున్నాని చెప్పడంతో ఇద్దరు శారీరకంగా కలిశారు. తీరా పెళ్లి చేసుకోమని అడిగే సరికి కాదనడమే కాకుండా ఈ విషయం అడిగేందుకు వెళ్లిన శిరీష తల్లి, బంధువులను కులం పేరుతో దూషించినట్లు బాధితురాలు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై రవితేజతో పాటు చెల్లి, బావ, స్నేహితుడైన హేమంత్పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
రూ. 70 వేల చొక్కా.. రూ.25 లక్షల వాచీ.. సమీర్‌పై మాటల దాడి
ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ దాడిని మరింత తీవ్రతరం చేశారు. వాంఖెడే రూ.70 వేల విలువైన షర్టు, రూ.25–50 లక్షల విలువైన వాచీలు వాడుతుంటారని ఆరోపించారు. నీతి నిజాయితీగల ఒక అధికారి అంతటి ఖరీదైన వస్తువులు ఎలా కొనుక్కోగలడని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసుల్లో ప్రముఖుల్ని తప్పుడుగా ఇరికించి వారి నుంచి కోట్లు దండుకోవడమే అతను చేస్తున్న పని అని ఆరోపించారు. డ్రగ్స్ కేసుల్లో ఇరికించడానికి ఎన్సీబీకి ఒక ప్రైవేటు బృందం ఉందని మాలిక్ ఆరోపించారు. మాఫియాతో తనకి సంబం« దాలు ఉన్నాయని మాజీ సీఎం ఫడ్న వీస్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. (చదవండి: చైన్ స్నాచింగ్తోనే రూ.48 లక్షలు విలువ చేసే ఫ్లాట్, కారు కొన్నా!) -
శ్మశానవాటికలో మైనర్ బాలిక హత్యాచారం: ఆధారాల్లేవ్!
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో ఇటీవల 9 ఏళ్ల బాలిక హత్యాచారానికి గురైన ఘటనలో బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు ధ్రువపరిచే ఆధారాలు ఇప్పటివరకు లభ్యం కాలేదని పోలీసులు శుక్రవారం కోర్టుకు తెలిపారు. అయితే, నలుగురు నిందితులకుగాను శ్మశాన వాటికలో పూజారి రాధేశ్యామ్, శ్మశానవాటిక ఉద్యోగి కుల్దీప్ సింగ్ మాత్రం అత్యాచారం చేసి, బాలికను చంపినట్లు వెల్లడించారని కోర్టుకు అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. మిగతా ఇద్దరు నిందితులు సలీం అహ్మద్, లక్ష్మీనారాయణ బాలిక మృతదే హాన్ని దహనం చేయడంలో వారికి సహకరించారన్నారు. హత్యకు ముందు రేప్‌నకు గురైనట్లు ఆధారాల్లేవు ‘హత్యకు ముందు బాలికపై అత్యాచారం జరిగిందా లేదా అని నిర్ధారించేందుకు ఏ విధమైన ఆధారాలు లభించలేదు. అందుకే ఈ సమయంలో బాలిక అత్యాచారానికి గురైందీ లేనిదీ స్పష్టంగా చెప్పలేం. ఇలా, ఏ విధమైన ఆధారాలు లేకుండా నిందితులు పోలీసుల ఎదుట ఇచ్చిన వాంగ్మూలాలను చట్టం అంగీకరించదు’ అని స్పెషల్ జడ్జి అశుతోష్ కుమార్ తన తీర్పులో పేర్కొన్నారు. అయితే, కూతురును కోల్పోయిన బాలిక తల్లికి తాత్కాలిక సాయంగా రూ.2.5 లక్షలను అందించాలని ఆయన ఆదేశించారు. పోలీసులు అత్యాచారం జరిగినట్లు ధ్రువీకరించిన తర్వాత.. చట్ట ప్రకారం అందాల్సిన రూ.10 లక్షల్లో మిగతా పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిందితులు నలుగురికీ 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించారు. బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నలుగురు నిందితులు కుటుంబసభ్యుల అనుమతి లేకుండానే మృతదేహాన్ని దహనం చేసినట్లు ఈ నెల ఒకటో తేదీన ఢిల్లీ పోలీసులు హత్య, అత్యాచారం పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. -
దారుణం: కానిస్టేబుల్‌పై ట్రాన్స్ జెండర్ల దాడి.. పరిస్థితి విషమం
భువనేశ్వర్: ట్రాన్స్ జెండర్లు రైళ్లలో ప్రయాణికులను బెదిరిస్తూ డబ్బులను వసూలు చేసే సంఘటనలను చూస్తూ ఉంటాం. అదే విధంగా తమను అల్లరి చేసిన వారిని నడిరోడ్డు మీదనే చితకబాదిన వార్తలు విన్నాం. కానీ, తాజాగా ఆరుగురు ట్రాన్స్ జెండర్లు ఏకంగా ఓ పోలీసు కానిస్టేబుల్‌పై దాడి చేశారు. ఈ ఘటన ఒడిశాలోని భరత్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ట్రాన్స్ జెండర్ల దాడిలో తీవ్రంగా గాయపడిని కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు.. రిని బెహరా, సాలిని దాస్, లోపా సేథి, దీపాలి నాయక్, సుని జెనాగా పోలీసులు గుర్తించారు. వారి మీద హత్య కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు వెల్లడించారు. కానిస్టేబుల్‌పై ఎందుకు దాడి చేశారనే కోణంలో ట్రాన్స్ జెండర్లపై విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
విమానంలో వెకిలి చేష్టలతో రచ్చరచ్చ.. సీటుకు కట్టేసి దేహశుద్ధి
వాషింగ్టన్: మహిళలపై వేధింపులు ఎక్కడా ఆగడం లేదు. చివరకు విమానంలో కూడా మహిళలకు భద్రతా లేకుండాపోయింది. విమాన సిబ్బందితో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రైవేటు భాగాలపై అసభ్యంగా తాకుతూ వేధించడంతో సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసి అతడి ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. అతడిని సీటుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. అమెరికాకు చెందిన 22 ఏళ్ల యువకుడు మాక్స్వెల్ బెర్రీ ఫిలడెల్ఫియా నుంచి మియామీకి వెళ్లేందుకు ఫ్రంట్టైర్ విమానం ఎక్కాడు. అనంతరం మాక్స్వెల్ విమానంలో నానా హంగామా చేశాడు. విమాన మహిళా సిబ్బందిని ఇష్టమొచ్చినట్టు తిడుతూ వాగ్వాదానికి దిగాడు. తోటి ప్రయాణికులతో గొడవకు దిగాడు. మరింత రెచ్చిపోయి మహిళా సిబ్బంది ఛాతీపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. జననాంగాలపై చేయి వేసేందుకు ప్రయత్నించగా సిబ్బంది పైఅధికారులకు సమాచారం ఇచ్చారు. అతడి తీరుతో విసుగెత్తిన విమాన సిబ్బంది వెంటనే రెండు చేతులు పట్టుకుని అతడిని సీటుకు కట్టేశారు. నోటికి ప్లాస్టర్ వేశారు. అయినా కూడా అతడి నోరు అదుపులోకి రాలేదు. పచ్చి బూతులు తిడుతూనే ఉన్నాడు. కాపాడండి అంటూ అరుస్తూ కూర్చున్నాడు. ఈ వీడియోను రికార్డ్ చేసిన ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియోకు దాదాపు 4 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. -
భగ్గుమంటున్న దేశ రాజధాని.. కేసు క్రైం బ్రాంచ్‌కు బదిలీ
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 వసంతాలు. మరి సామాన్యుల జీవితాల్లో మార్పు వచ్చిందా? బడుగు జీవుల బతుకుల్లో వెలుగు నిండిందా? ఆడ వారిపై అత్యాచారాలు, అఘాయిత్యాలు తగ్గాయా? ఓ పేదవానికి వెంటనే న్యాయం అందుతుందా? ఒకటా.. రెండా.. వందలు.. వేలు.. లక్షల ప్రశ్నలు. ఇలా లెక్కించుకుంటూ పోతే రామయాణ, మహాభారత గ్రంథాలను మించి రాయాల్సి ఉంటుంది. సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన 9 ఏళ్ల మైనర్ బాలికపై హత్యాచార ఘటన దేశంలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా బాలిక తల్లిదండ్రుల అనుమతి లేకుండానే రాత్రికి రాత్రే అంత్యక్రియలు పూర్తి చేసిన వైనం ప్రకంపనలు పుట్టిస్తోంది. దీనిని పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, ప్రముఖులు ఖండిస్తున్నారు. అయితే తాజాగా ఈ కేసును వేగంగా దర్యాప్తు చేయడానికి క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 1న నైరుతి ఢిల్లీలో తొమ్మిదేళ్ల మైనర్ బాలికపై దాడి చేసి సామూహిక అత్యాచారం, హత్య చేసి, రాత్రికి రాత్రే దహనం చేశారు. కాగా ఈ కేసును ఆగస్టు 4న నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీసీసీఆర్) సుమోటోగా తీసుకుంది. అంతేకాకుండా 48 గంటల్లో దీనిపై సరియైన నివేదికను సమర్పించాలని ఢిల్లీ సౌత్ వెస్ట్ డీసీపీకి ఎన్సీసీసీఆర్ లేఖ రాసింది. కాగా ఢిల్లీ పోలీసు కమిషనర్, రాకేశ్ ఆస్థానా ఈ కేసు బదిలీకి దిశానిర్దేశం చేశారు. తక్షణ చర్యలు తీసుకోవాలి: అరవింద్ కేజ్రీవాల్ ఈ ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బుధవారం ఆయన బాధితురాలి తల్లిదండ్రులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఇక నిందితులకు కఠిన శిక్షలు పడేలా ఉన్నత న్యాయవాదులను నియమిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన సిగ్గుచేటు అని పేర్కొన్నాడు. ఢిల్లీలో శాంతిభద్రతలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ అన్నారు. కాగా బాధితురాలి తల్లి తల్లి స్టేట్మెంట్ ఆధారంగా ఢిల్లీ పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. -
మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో హోంగార్డుకు జైలుశిక్ష ఖరారు
-
మైనర్ బాలికపై అత్యాచారం, హత్య..! పెల్లుబికిన నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 9 ఏళ్ల మైనర్ బాలికపై స్థానిక పూజారి (55) మరో ముగ్గురితో కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. అంతేకాదు బాలిక తల్లిదండ్రుల అనుమతి లేకుండానే రాత్రికి రాత్రే అంత్యక్రియలు పూర్తి చేసిన వైనం ప్రకంపనలు పుట్టిస్తోంది ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన దాదాపు 200 మంది స్థానికులు భారీ నిరసనకు దిగారు. సీసీటీవీ పుటేజీని పరిశీలించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. పూజరితోపాటు, శ్మశాన వాటికలో పనిచేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు డీసీపీ ఇంగిత్ ప్రతాప్‌సింగ్ ప్రకటించారు. ఫోరెన్సిక్ సైన్స్ లాబ్ అధికారులు క్రైమ్ బృందం దర్యాప్తు కోసం నమూనాలను సేకరించారని దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. మరోవైపు బాధిత కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని ఢిల్లీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ హామీ ఇచ్చారు. పోలీసులు న్యాయమైన దర్యాప్తు చేపట్టాలన్నారు. లేదంటే ఢిల్లీ ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ట్వీట్లో తెలిపింది. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పోలీసులు అందించిన సమాచారం ఢిల్లీ కంటోన్మెంట్ పరిధిలోని శ్మశానవాటికు సమీపంలో మోహన్ లాల్, సునీతా దేవి దంపతులు ఇంట్లో నివసిస్తున్నారు. వీరి కుమార్తె బాలిక శ్మశాన ప్రాంగణంలోకి వెడుతూ వుంటుంది. అలాగే ఫ్రిజ్‌లో నీళ్లు తాగేందుకు ఆదివారం సాయంత్రం కూడా వెళ్లింది. ఆ తరువాతనుంచి కనిపించకుండా పోయింది. కుమార్తెకోసం వెదుకుతున్న తల్లి అక్కడికెళ్లి చూడగా మృతదేహం కనిపించింది. దీంతో ఫ్రిజ్ వాటర్ తాగుతున్న సమయంలో బాలిక విద్యుత్ షాక్‌కి గురై చనిపోయిందని ఆ పూజారి, అక్కడే పనిచేసే మరో ముగ్గురు సిబ్బంది నమ్మ బలికారు. అంతేకాదు పోస్టుమార్టం పేరుతో భయపెట్టి, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని బెదిరించారు. పోలీసులు అమ్మాయి అవయవాలను అమ్ముకుంటారంటూ కల్లబొల్లి మాటలతో మభ్య పెట్టారు. కుటుంబ సభ్యులంతా ఈ అమోమయంలో ఉండగానే హడావిడిగా బాలిక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో బాలిక శరీరంపై పలుచోట్ల గాయాలను గమనించిన తల్లిదండ్రులకు తమ అనుమానం మరింత బలపడింది. చివరకు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కుమార్తెను అత్యాచారం చేసి చంపేసారంటూ పూజారి సహా నలుగురిపై ఆరోపణలు నమోదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు పూజారి రాధేశ్యామ్, సలీమ్, లక్ష్మీ నారాయణ్, కుల్దీప్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. -
కొత్త డ్రెస్ కొనిస్తానని తీస్కెళ్లిన అంకుల్.. రైలు పట్టాల చాటున
న్యూఢిల్లీ: బాలికకు కొత్త బట్టలు కొనిస్తానని నమ్మించి బయటకు తీసుకెళ్లిన ఓ వ్యక్తి బట్టలు ఇప్పించకుండా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన కూతురి వయసు ఉన్న బాలికను రైలు పట్టాల సమీపంలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఇంట్లో వారికి చెప్పొద్దని బెదిరించాడు. ఇంటికొచ్చిన బాలిక ముభావంగా ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన 27 ఏళ్ల ఓ వ్యక్తి ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లో నివసిస్తున్నాడు. ఈ ఆదివారం (జూలై 25) ఓ వస్తువు కొనేందుకు ఇంటికెళ్లి బయటకు వచ్చిన తొమ్మిదేళ్ల బాలికను అతడు పరిచయం చేసుకున్నాడు. బాలికను మాటల్లోకి దించి నీకు కొత్త దుస్తులు కొనిస్తానని చెప్పి నమ్మించాడు. మాయ మాటలను నమ్మిన బాలిక అతడి వెంట వెళ్లింది. శాంతి అనే ప్రాంతానికి తీసుకెళ్లి రైలు పట్టాల సమీపంలో బాలికపై బలత్కారం చేశాడు. అనంతరం ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. బాలిక విచిత్రంగా ప్రవర్తించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఆమె అత్యాచారానికి గురయ్యిందని తెలిపారు. వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సీసీ ఫుటేజీ పరిశీలించగా అతడి ఆచూకీ లభించింది. వాజీర్‌పూర్ ప్రాంతంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ ఉష రంగనాని తెలిపారు. ఆ వ్యక్తి పలు కర్మాగారాల్లో స్వీపర్‌గా పని చేసేవాడని తెలిసింది. అతడిపై పలు కేసులు నమోదై ఉన్నాయి. స్వగ్రామం రాంపూర్‌లో ఉన్నప్పుడు కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రి నుంచి తప్పించుకుని ఢిల్లీ చేరాడు. దీనిపై అజీమ్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
భార్య ఫిర్యాదుతో ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
ముంబై : ప్రముఖ హిందీ టెలివిజన్ నటుడు కరణ్ మెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. గతరాత్రి భార్య నిషా రావల్ దాఖలు చేసిన ఫిర్యాదుపై కరణ్‌ను అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. అయితే ఆ వెంటనే ఆయనకు బెయిల్ మంజూరయ్యింది. వివరాల ప్రకారం..యే రిష్తా క్యా కెహ్లతా హై సీరియల్‌తో కరణ్ మెహ్రా పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆ సీరియల్ ద్వారా విపరీతమైన గుర్తింపు సంపాదిచుకున్న కరణ్ ఆ తర్వాత పలు టీవీ షోలలో పాల్గొన్నాడు. చాలా కాలం డేటింగ్ అనంతరం 2012 లో కరణ్-నిషాలు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వీరికి కవిష్ అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. కరణ్-నిషాలు జంటగా నాచ్ బలియే సీజన్-5లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉంటున్న వీరి వైవాహిక జీవితంలో గత కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. దీంతో వీరిద్దరు విడిపోనున్నారని పలు వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేసినా నిషా వాటిని ఖండించింది. తామిద్దరం బాగానే ఉన్నామని, ఇలాంటి వార్తలు అవాస్తవమని తేల్చేసింది. మరోవైపు నటుడు కరణ్ గత రెండు వారాల క్రితం కరోనా బారిన పడ్డాడు. ఆ సమయంలో మానసికంగా ఎంతో కుమిపోయానని, అయితే తన భార్య నిషా ఎంతో ధైర్యం చెప్పిందని, తనను చాలా జాగ్రత్తగా చూసుకుందని తెలిపాడు. అయితే అనూహ్యంగా కొన్ని వారాల నుంచి వీరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. సోమవారం రాత్రి కూడా తమ మధ్య గొడవ జరిగిందని, ఆ సమయంలో కరణ్ తన తలను గోడకు నెట్టేసినట్లు నిషా తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సెక్షన్ 336, 337 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముంబైలోని అతని నివాసంలో కరణ్‌ను అరెస్ట్ చేశారు. Maharashtra | Actor Karan Mehra arrested after his wife & actor Nisha Rawal filed a complaint in Goregaon area last night. Rawal filed a complaint against Mehra following a brawl. A case has been registered: Mumbai Police — ANI (@ANI) June 1, 2021 View this post on Instagram A post shared by ɴɪsʜᴀ ʀᴀᴡᴀʟ (@missnisharawal) చదవండి : అనుమానాస్పద స్థితిలో ప్రముఖ నటుడి భార్య మృతి.. మా అమ్మ ముందే నిర్మాత అసభ్యంగా మాట్లాడాడు: నటి -
ఆటో డ్రైవర్ పాడుపని.. యువతి కేకలు వేయడంతో..
మంగళగిరి(గుంటూరు జిల్లా): చినకాకాని సర్వీసు రోడ్డులో ఆటో డ్రైవర్, అతని స్నేహితుడు ఓ యువతిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన యువతి గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తుంటుంది. శుక్రవారం నైట్ డ్యూటీ కావడంతో యువతి రాత్రి 7 గంటల సమయంలో మంగళగిరి నుంచి ఆటోలో గుంటూరు బయలుదేరింది. ఆటోలో అప్పటికే ఉన్న ఓ పెద్ద వయస్సు వ్యక్తి పట్టణంలోని ఆటోనగర్‌లో ఉన్న ఏపీఐఐసీ వద్ద దిగిపోయాడు. ఇక ఆటోలో డ్రైవర్‌తో పాటు యువతి మాత్రమే ఉంది. చినకాకాని గ్రామం వద్దకు వచ్చేసరికి సర్వీసు రోడ్డులో డ్రైవర్ చీకట్లో ఆటోను ఆపాడు. యువతి ఇక్కడెందుకు ఆపావని అడగ్గా వెనుక ప్రయాణికులు వస్తున్నారని చెప్పాడు. ఇంతలో ఆటో వద్దకు మరో యువకుడు చేరుకున్నాడు. అనుమానం వచ్చిన యువతి కేకలు వేయబోగా ఇద్దరూ కలిసి నోరు నొక్కి, కాళ్లు చేతులు పట్టుకుని ఆటోలోకి నెట్టారు. యువతి మెడలోని బంగారు గొలుసును లాగిపడేసి యువతిపై లైంగిక దాడికి యత్నించారు. ఆమె మరింత పెద్దగా కేకలు వేయడంతో అటుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరికి అనుమానం వచ్చి ఆటో వద్దకు రావడంతో ఆటో డ్రైవర్‌తో పాటు అతని స్నేహితుడు పరారయ్యారు. ఆటో వద్దకు వచ్చినవారి సహాయంతో బాధితురాలు మంగళగిరి రూరల్ పోలీస్టేషన్‌కు చేరుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అర్ధరాత్రి హైవేపై.. సినిమాను తలపించే రీతిలో బావిలో నుంచి కేకలు.. అసలు ఏం జరిగిందంటే..? -
తల్లి ఇంటికి వచ్చేసరికి కన్న కూతురిపైనే..
సోన్ (నిర్మల్): నిర్మల్ జిల్లా సోన్ మండలం గాంధీ నగర్ గ్రామంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. తాగిన మైకంలో ఓ తండ్రి కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం ఈ సంఘటన చోటుచేసుకోగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. శనివారం ఉదయం తల్లి కూలీ పనులకు వెళ్లింది. అప్పటికే తాగిన మైకంలో ఉన్న తండ్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆరేళ్ల కూతురిపై అత్యాచారం చేశాడు. పనులకు వెళ్లిన తల్లి తిరిగి వచ్చేసరికి కూతురు నడవలేని స్థితిలో తీవ్ర రక్తస్రావంతో కనిపించింది. అనుమానం వచ్చిన తల్లి కూతురును అడగగా, తండ్రే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పింది. విషయం తెలిసి ఆగ్రహించిన గ్రామస్తులు రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన ఆ తండ్రిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆదివారం ఉదయం డీఎస్పీ ఉపేందర్ రెడ్డి గ్రామంలో వివరాలు సేకరించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆసిఫ్ తెలిపారు. ( చదవండి: బాలికపై సవతి తండ్రి లైంగికదాడి ) -
గుంటూరులో దారుణం: వృద్ధురాలిపై లైంగిక దాడి
పట్నంబజారు(గుంటూరు): 80 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై కేసు నమోదైంది. గుంటూరు నగరంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లూరు మండలం కిష్కిందపాలేనికి చెందిన వృద్ధురాలు 15 సంవత్సరాల క్రితం కూలీ పనుల నిమిత్తం వచ్చి కామాక్షి నగర్లో నివాసం ఉంటోంది. ఏడాది క్రితం భర్త మృతి చెందాడు. ఆమెకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారిలో ఇద్దరు కుమారులు మృతి చెందారు. ప్రస్తుతం ఉన్న కుమారుడు, కుమార్తెలకు వివాహం కావడంతో వారు వేర్వేరుగా ఉంటున్నారు. దీంతో ఒంటరిగా నివశిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంటి తలుపులు కొట్టినట్లు శబ్ధం రావడంతో కుమారుడు వచ్చాడనుకుని తలుపులు తీసింది. గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై దాడి చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కేకలు వేస్తున్నప్పటికీ నోరు మూసి చిత్రహింసలకు గురి చేశాడు. ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత స్పృహలోకి వచ్చిన సీతమ్మ స్థానికులకు విషయాన్ని తెలిపింది. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి దారుణం: కామంతో కళ్లు మూసుకుపోయి.. -
అమెరికాలో ‘రెడ్‌ఫ్లాగ్ లా’ అమలుకు బైడెన్ కసరత్తు!
వాషింగ్టన్: అమెరికాలో తరచూ చోటుచేసుకుంటు న్న కాల్పుల ఘటనలు మహమ్మారిలా మారాయని అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఇవి అంతర్జాయతీయంగా ఇబ్బందికరంగా తయార య్యాయని పేర్కొన్నారు. దేశంలో తుపాకీ హింస ను అరికట్టేందుకు ఆయన పలు చర్యలను ప్రకటిం చారు. ఇందులోభాగంగా దేశీయంగా తయారయ్యే కొన్ని రకాల తుపాకులపై నియంత్రణలను విధిం చడంతోపాటు అసాల్ట్ రైఫిళ్లపై గతంలో అమలైన నిషేధాన్ని తిరిగి కొనసాగించాలని కాంగ్రెస్‌పై ఒత్తిడి తేనున్నారు. ‘ఈ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై పలువురు కాంగ్రెస్ సభ్యులు సూచనలు చేశారు. కానీ, తుపాకీ సంస్కృతికి చెక్ పెట్టేలా ఒక్క చట్టాన్ని కూడా ఆమోదించలేదు. కాంగ్రెస్ ఈ విష యంలో సానుకూలంగా స్పందించినా లేకున్నా తుపాకీ హింస నుంచి అమెరికా ప్రజలకు రక్షణ కల్పించేందుకు అవసరమైన అన్ని రకాల ప్రత్యా మ్నాయాలను ఉపయోగించుకుంటాను’అని బైడెన్ గురువారం వైట్‌హౌస్ వద్ద మీడియా సమావేశంలో ప్రకటించారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి వంటి కేసులపై విచారణ చేపట్టిన మాజీ అధికారి డేవిడ్ చిప్‌మ్యాన్‌ను బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్ ఆరŠమ్స్, ఎక్స్‌ప్లోజివ్స్(ఏటీఎఫ్) చీఫ్‌గా నియమించనున్నట్లు ప్రకటించారు. ‘తుపాకీ కాల్పుల ఘటనలు మహమ్మారిలా మారాయి. అంతర్జాతీయంగా ఇబ్బందికరంగా, మనకు మాయని మచ్చలా తయారయ్యాయి. ఇది ఆగిపోవాలి’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రతి రోజూ 316 కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటుండగా 106 మంది చనిపోతున్నారు. ఆసియన్ అమెరికన్లపై జార్జియాలో జరిగిన కాల్పుల్లో 8 మంది చనిపోగా కొలరాడోలో 10 మంది మృతి చెందారు. ఈ రెండు ఘటనలకు మధ్యలో కేవలం వారం వ్యవధిలోనే 850 కాల్పుల ఘటనలు సంభవించాయి. ఈ ఘటనల్లో 250 చనిపోగా 500 మంది గాయపడ్డారు’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘యుద్ధాల్లో వాడే 100 రౌండ్లు, 100 బుల్లెట్ల సామర్థ్యం కలిగిన ఆయుధాలను పౌరులు కలిగి ఉండటంలో అర్థం లేదు. వాస్తవానికి వీటి అవసరం ఎవరికీ ఉండదు’ అని బైడెన్ తెలిపారు. ఈ సమావేశం అనంతరం కొద్దిసేపటికే టెక్సాస్‌లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోగా ఐదుగురు గాయపడటం గమనార్హం. ఈ ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఓ పోలీస్ కూడా కాల్పుల్లో గాయాలపాలయ్యాడు. బుధవారం సౌత్ కరోలినాలో ఒక వ్యక్తి ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురిని కాల్చి చంపాడు. విభేదిస్తున్న ప్రతిపక్షం ‘తాజా నిబంధనలు రాజ్యాంగం రెండో సవరణ ప్రకారం తుపాకీ కలిగి ఉండే అమెరికన్ల హక్కులకు ఎలాంటి ఆటంకం కలిగించవు, వారి హక్కుకు హామీ ఇస్తుంది’ అని బైడెన్ తెలిపారు. తుపాకులపై గట్టి నియంత్రణలుండాలని అధికార డెమోక్రటిక్ పార్టీ సభ్యులు వాదిస్తుండగా, ప్రతిపక్ష రిపబ్లికన్లు మాత్రం ప్రజలకు తుపాకీ యాజమాన్య హక్కులుండాలని వాదిస్తున్నారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ కూడా బైడెన్ ఉత్తర్వులను వ్యతిరేకిస్తోంది. భారీ సంఖ్యలో మరణాలు సంభవించిన కాల్పుల ఘటనల్లో పలుమార్లు నిందితులు అసాల్ట్ రైఫిళ్లనే వాడారు. వీటి విక్రయంపై 1994 నుంచి 2004 వరకు నిషేధం అమల్లో ఉంది. అనంతరం ఈ నిషేధాన్ని పొడిగించకపోవడంతో ప్రస్తుతం అసాల్ట్ రైఫిళ్లపై ఎలాంటి నియంత్రలు లేవు. ఘోస్ట్ గన్స్కు చెక్ కిట్లలో సులువుగా మార్కెట్లలో లభించే ఏఆర్–15 వంటి పిస్టళ్లను ఇంటి వద్దే అసెంబుల్ చేసుకుని, యథేచ్ఛగా వాడేసుకునే వీలుంది. రైఫిళ్లతో పోలిస్తే వీటిపై నియంత్రణలు తక్కువ. వీటి వినియోగం సులువు. తక్కువ పొడవుండే బారెళ్లతో ఉండే వీటిని వేగంగా రీలోడ్ చేయడం చేయెచ్చు. కొలరాడో ఘటనలో నిందితుడు వీటినే వినియోగించారు. ఇటువంటి వాటిని అధికారులు ఘోస్ట్ గన్స్‌గా పిలుస్తున్నారు. వీటిపై ఎలాంటి నంబర్లు కానీ, ఇతర గుర్తింపు కానీ ఉండవు. ఎవరైనా వీటిని నేరాలకు పాల్పడేందుకు ప్రయోగిస్తే వాస్తవ యజమానులను గుర్తించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఇకపై వీటి లభ్యతను అడ్డుకునేందుకు వెంటనే నిబంధనలు తయారు చేయాలని అధ్యక్షుడు బైడెన్ న్యాయశాఖను ఆదేశించారు. దీంతోపాటు రాష్ట్రాలు కూడా తమ అవసరాలకు అనుగుణంగా సొంత చట్టాలను అమలు చేసేందుకు ‘రెడ్‌ఫ్లాగ్ లా’ ముసాయిదా తయారు చేయాలని కోరారు. ఇది అమల్లోకి వస్తే ప్రమాదకరమైన వ్యక్తుల వద్ద నుంచి ఈ ఆయుధాలను స్వాధీనం చేసుకునే అధికారం కోర్టులు, అధికారులకు దఖలు పడుతుంది. -
'అత్యాచారం చేసి నగ్నంగా ఉన్న నన్ను'..
ప్రముఖ పాప్ సింగర్, నటి డెమి లోవాటో షాకింగ్ విషయాలను బయటపెట్టింది. 2018లో ఓ సినిమా షూటింగ్లో పాల్గొని ఇంటికి వస్తుండగా, తనపై అత్యాచారం జరిగిందని, చాలా క్లోజ్ ఫ్రెండ్‌గా భావించిన వ్యక్తే తనపై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పేర్కొంది. పీపుల్స్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డెమి ఈ విషయాలను వెల్లడించింది. ఆ ఘటన జరిగినప్పుడు తన వయసు కేవలం 15 ఏళ్లేనని, దాని తర్వాత దాదాపు చనిపోదామని నిర్ణయించుకున్నానని, అయితే సన్నిహితుల సహకారంతో దాన్నుంచి బయటపడగలిగానని తెలిపింది. అతి తక్కువ కాలంలో పాప్ సింగర్‌గా డెమి రాణించిన సంగతి తెలిసిందే. 'ఓ రోజు షూటింగ్ ముగించుకొని వస్తుండగా, సిరా మిచెల్ అనే ఫ్రెండ్ నాకు అతిగా హెరాయిన్ (డ్రగ్) ఇచ్చాడు. దీంతో అపస్మారక స్థితిలోకి జారుకున్నాను. దీన్ని అవకాశంగా మార్చుకొని నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పూర్తి నగ్నంగా ఉన్న నన్ను అక్కడే రోడ్డుపై వదిలేసి పారిపోయాడు. ఈ ఘటన నన్ను మానసికంగా చాలా కుంగిపోయేలా చేసింది. ఎన్నో రోజులు దాని గురించే భాదపడుతూ..ఆఖరికి తిండి, మంచి నీళ్లు కూడా తీసుకునేదాన్ని కాదు. ఇంట్లోనే ఎప్పుడూ చీకటి గదిలోనే ఉండేదాన్ని.స్నేహితులు వచ్చినా కలిసేదాన్ని కాదు. ఆ సంఘటన గురించి మర్చిపోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. లక్కీగా దాన్నుంచి బయటపడగలిగాను' అని డెమి పేర్కొంది. తన టాలెంట్‌తో ఇక్కడిదాకా వచ్చానని, ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అమ్మాయిలు ఏదో ఒక సమయంలో ఇలాంటివి ఎదుర్కొని ఉంటారని ఆ సమయంలో మానసికంగా కుంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగాలని తెలిపింది. అయితే లైంగిక వేధింపులపై డెమి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. చదవండి : (ట్రాన్స్‌జెండర్‌గా మారిన హాలీవుడ్ స్టార్) (దర్శకుడు టవల్ తీసేయమన్నాడు : నటి) -
డబ్బుల కోసం అమ్మ, అక్కను చితకబాదిన యువకుడు
ఉదయం డబ్బులు అడగ్గా తల్లి ఇచ్చింది.. మళ్లీ సాయంత్రం వచ్చి ఇంకా డబ్బులు ఇవ్వమని అడగడంతో లేవని తల్లి చెప్పగా ఆ యువకుడు వాగ్వాదానికి దిగాడు. తల్లితో గొడవపడుతుందని తెలుసుకుని అతడి అక్క రాగా ఆమెపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. అహ్మదాబాద్ వెజాల్పూర్ ప్రాంతంలోని ఉదయ్ సొసైటీలో చైతలి శ్రీమలి నివసిస్తోంది. ఆమె భర్త, తండ్రి మూడు నెలల కిందట మృతిచెందారు. ఒక్కతే ఇంట్లో నివసిస్తోంది. ఆమెకు కూతురు మధు, కుమారుడు జిగర్ ఉన్నారు. అయితే ఆదివారం ఉదయం తల్లి వద్దకు కుమారుడు జిగర్ వచ్చి రూ.10 వేలు అడిగాడు. తల్లి కాదనకుండా ఇచ్చింది. అయితే సాయంత్రానికి వచ్చి మళ్లీ రూ.10 వేలు కావాలని కోరాడు. దీంతో తల్లి లేవని చెప్పింది. లేవని ఎంత చెప్పినా వినకుండా తల్లితో జిగర్ గొడవపడ్డాడు. దీంతో కోపంతో తల్లి శ్రీమలిపై గొడవపడుతూ కొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి సోదరి మధు ఇంటికి వచ్చింది. తల్లిని అతడి బారి నుంచి కాపాడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అతడు అక్కపై కూడా దాడికి పాల్పడ్డాడు. తల్లి, అక్కపై జిగర్ తీవ్రంగా దాడి చేశాడు. తల్లిని అద్దాలకేసి కొట్టాడు. ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో తల్లి, అక్క ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. కిటికీలకేసి బాదాడు. విచక్షణ రహితంగా దాడి చేయడంతో వారిద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఈ విషయం చుట్టుపక్కల వాళ్లు విషయం తెలుసుకోవడంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే స్థానికుల సమాచారంతో అంబులెన్స్ వచ్చి ఆస్పత్రికి వారిని తీసుకెళ్లింది. ప్రస్తుతం వారిద్దరూ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. నిందితుడు జిగర్‌పై కుటుంబసభ్యులు వెజాల్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మైనర్‌తో బూట్లు నాకించి.. సిగరెట్ తాగించి..
భోపాల్ : రెండు వేల రూపాయల విషయంలో చోటుచేసుకున్న గొడవలో ఓ మైనర్ తీవ్రంగా గాయపడ్డాడు. నలుగురు వ్యక్తులు అతడ్ని విచక్షణా రహితంగా కొట్టి.. అమానుషంగా ప్రవర్తించారు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం జబల్పూర్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల మైనర్‌కు అదే ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులతో 2 వేల రూపాయల విషయంలో గొడవైంది. ఈ నేపథ్యంలో వారు మైనర్‌ను నయాగావ్ ఏరియాలోని పొలంలోకి తీసుకెళ్లారు. అనంతరం విచక్షణా రహితంగా కొట్టారు. బూట్లు నాకించారు. బలవంతంగా సిగరెట్ కూడా తాగించారు. కుమారుడు ఎంతకీ ఇంటికి రాకపోవటంతో మైనర్ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం రోజున మైనర్ ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి : మీ ఇంట్లో భూతం ఉంది.. ఎద్దుతో తరిమేస్తాం! ఇష్టం లేని పెళ్లి.. కాబోయే భర్తను చంపమని.. -
మైనర్ బాలికపై లైంగిక దాడి..కామాంధుడు అరెస్ట్
భవానీపురం(విజయవాడ పశి్చమ): విద్యాధరపురం లేబర్ కాలనీలో ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని దిశ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న బాధితురాలి వైద్య పరీక్షల నివేదికను బట్టి సోమవారం రిమాండ్‌కు పంపించనున్నట్లు తెలిసింది. స్థానికుల కథనం మేరకు.. బాలిక ఇంట్లో కేబుల్ రాకపోవడంతో స్థానికంగా కేబుల్ ఆపరేటర్‌గా ఉంటున్న నిందితుడు ఎస్కే అయాజ్ ఇంటికి శనివారం వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అయాజ్ ఈ దురాగతానికి పాల్పడ్డాడు. బయటకు వెళ్లిన కుమార్తె ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లి వెతుకులాట మొదలు పెట్టింది. విషయం తెలుసుకున్న నిందితుడు బాలికను తన ఇంటి భవనం నుంచి రెండు భవనాలపై నుంచి తీసుకువెళ్లి మూడో ఇంటి భవనంలో దించాడు. అది చూసిన ఎదురింటివారు బాలిక తల్లికి చెప్పారు. గబగబా వచ్చిన ఆమె కుమార్తె పరిస్థితి చూసి గాబరాపడి ఇంటికి తీసుకువెళ్లి ఏం జరిగిందని అడిగి తెలుసుకోవడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. దీనిపై తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు.. నిందితుడిపై గతంలో పలు కేసులు ఉన్నాయని, అందులో అత్యాచారం కేసులు కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే బాధితులతో రాజీ చేసుకుని మహిళా సెషన్స్ కోర్టులో నాలుగు కేసులు కొట్టేయించుకున్నట్లు సమాచారం. నిందితుడు పశి్చమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు కావడం, బాధితురాలి మేనమామ టీడీపీ నాయకుడు కావడంతో టీడీపీ వర్గాలు రాజీ చేసేందుకు ప్రయతి్నస్తున్నట్లు తెలిసింది. -
పబ్జీ ముసుగులో బాలికపై దారుణం
భోపాల్: ఆన్లైన్ గేమ్ ముసుగులో మధ్యప్రదేశ్ లో చోటుచేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్లో పరిచయమైన అమ్మాయిని (12) మభ్యపెట్టి లైంగికంగా దాడి చేయడంతో పాటు బ్లాక్ మెయిల్ చేసి, పదేపదే అత్యాచారం చేసిన ఉదంతం కలకలం రేపింది. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన ముగ్గురు యువకులు ఈ అఘాయిత్యానికి తెగబడ్డారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం పబ్జీ గేమ్ పేరుతో బాలికతో ఆన్లైన్లో స్నేహం నటించారు. ఈ క్రమంలో గత నెలలో, నిందితులు బాలికను రంభ నగర్ కు ఆహ్వానించి ఆమెపై అత్యాచారం చేశారు. దాన్ని వీడియో తీశారు. అనంతరం ఎవరికైనా చెబితే ఈ వీడియోను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని బెదిరించి మరీ ఆమెపై పలుమార్లు దురాగతానికి పాల్పడ్డారు. చివరకు తల్లిదండ్రుల సాయంతో బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించింది. దీంతో విషయం వెలుగు చూసింది. బాలిక కుటుంబం ఇచ్చిన పోలీసు ఫిర్యాదు మేరకు రంభ నగర్ ప్రాంతానికి చెందిన18 -19 సంవత్సరాల మధ్య వయస్సున్నముగ్గురు నిందితులను బుధవారం రాత్రి అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి అలోక్ శ్రీవాస్తవ తెలిపారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. కాగా డేంజర్ పబ్జీ గేమ్ ను కేంద్రం బ్యాన్ చేసినా, డౌన్ లోడ్ పై నిషేధం ఉన్నా ఇప్పటికే దీనికి యాక్సెస్ ఉన్న వారితోపాటు, కొత్తగా డౌన్ లోడ్ కూడా అవుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. -
పబ్లిక్‌గా మూత్రం పోయోద్దన్నందుకు..
బెంగళూరు : బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేయోద్దన్నందుకు ఓ మహిళపై దాడికి తెగబడ్డాడో వ్యక్తి. ఈ సంఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరు కాదుబీసనహల్లి రెసిడెంట్‌కు చెందిన ఓ మహిళ ఈ నెల 10న పని మీద బయటకు వెళ్లి ఇంటికి తిరిగివస్తోంది. ఆ సమయంలో రోడ్డు పక్కన ఆరుగురు మందు తాగుతూ ఉన్నారు. ఆమె వారిని అక్కడ మందు తాగొద్దని హెచ్చరించింది. అయితే వారు ఆమె మాటలను లెక్క చేయలేదు. దీంతో ఆమె వారి ఫొటోలు, వీడియోలు తీసుకుని వాటిని స్థానిక రెసిడెంట్స్ అసోషియేషన్ గ్రూపులో షేర్ చేసింది. ‘డేటింగ్ ఫ్రెండే’ దోచేసింది ఆ తర్వాత ఇంటికి వెళుతుండగా జయరామ్ నాయుడు అనే వ్యక్తి బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తూ కనిపించాడు. ఆమె అతడ్ని ప్రశ్నించగా ఆగ్రహించిన అతడు ఆమెపై దాడి చేశాడు. ఆమె జట్టుపట్టుకుని కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
రెచ్చిపోయిన టీడీపీ నేతలు
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఓటమి భయంతో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు జరుపుతున్నారు. హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం మద్దిపి గ్రామంలో వైఎస్సార్సీపీ నేత శ్రీనివాస్‌రెడ్డిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. శ్రీనివాసరెడ్డికి చెందిన మల్బరీ తోట, బోరు బావిని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండాలని పచ్చనేతలు హెచ్చరించారు. బాధితుడు శ్రీనివాసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. (ఓటమి భయంతో.. టీడీపీ దాడులు) ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలంలో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో బుధవారం టీడీపీ కార్యకర్త చెన్నకేశవులు దుర్భాషలాడి వైఎస్సార్సీపీ మండల ఇన్చార్జ్పై దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే.. అలాగే పుట్లూరు మండలం అరకటివేములలో ఎన్నికల కోడ్ సందర్భంగా బస్‌షెల్టర్‌పై ఉన్న పరిటాల రవి చిత్రపటానికి ఎన్నికల అధికారులు ముసుగు వేశారు. దీంతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. చిత్రపటం మీద ఉన్న ముసుగును తొలగించి రాద్ధాంతం చేశారు. కళ్యాణదుర్గం మండలం గోళ్లలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి మోహన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేసి తిరిగి వెళుతుండగా.. పార్టీ కార్యకర్తలు ధనుంజయ, గురుగప్పలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారు.(అరాచకమే.. టీడీపీ నైజం) -
మైనర్‌పై అమానుషం: కాపాడాల్సిన తల్లే
భావనగర్ : గుజరాత్లో అమానుషం చోటు చేసుకుంది. మైనర్ బాలిక (12) పై ఏడాది పాటు ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. స్వయంగా బాలిక తల్లే ఈ కీచకులకు సహకరించడం విషాదం. బిడ్డను కంటికి రెప్పలా కాపాడ్సాలిన తల్లే కన్నకూతురి పట్ల పరమ నీచంగా ప్రవర్తించింది. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో పాలితానా తాలూకా భూటియా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన బాలిక తండ్రిపోలీసులు ఫిర్యాదు చేశాడు. తన భార్యే ఈ ఘాతుకానికి పాల్పడిందని ఆరోపించారు. అటు తండ్రి బయటికి వెళ్లినపుడు తనపై అత్యాచారం చేశారని పోలీసులకు తెలిపింది. దీంతో శనివారం కేసు నమోదు చేసిన అధికారులు శాంతి ధంధుకియా (46), బాబుభాయ్ సర్తాన్‌పారా (43), చంద్రేష్ సర్తాన్‌పారా (32) అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలి తల్లి పరారీలో ఉన్నట్టు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ కేసులో తండ్రి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన అధికారులు, ఈ వ్యవహారంలో తల్లిపాత్ర పై పూర్తి వివరాలను ఆరా తీస్తున్నామన్నారు. -
పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యం
సాక్షి, అనంతపురం: మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు. కురుగుంట గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని పేదల నుంచి పరిటాల వర్గీయులు డబ్బులు వసూలు చేశారు. తమ డబ్బు వెనక్కి ఇవ్వాలని కోరిన వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో బాధితులు అనంతపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితులను పరామర్శించిన తోపుదుర్తి చందు.. కురుగుంట గ్రామస్తులను ఆదివారం వైఎస్సార్సీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు చందు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయుల ఆగడాలు అధికమయ్యాయని మండిపడ్డారు. కౌంటర్ కేసులతో బాధితులను భయపెడుతున్నారన్నారు. పరిటాల వర్గీయులపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. -
నీ ఇష్టమొచ్చినోడికి చెప్పుకో !
సాక్షి, అనంతపురం : నగరంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అనుచరుల దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. గత ప్రభుత్వంలో చిరుద్యోగుల నుంచి కమిషనర్ స్థాయి అధికారులను సైతం చౌదరి అనుచరులు లెక్కచేయకుండా దాడులకు యత్నించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడం తెలిసిందే. అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్న తీరు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కోవలోనే టౌన్ బ్యాంకు అధ్యక్షుడు జేఎల్ మురళీధర్ టీపీఎస్ సాయిప్రసాద్‌ను నడిరోడ్డుపై బండబూతులు తిట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి పట్ల టీడీపీ నేత వ్యవహరించిన తీరు చూస్తే అధికారంలో ఉండగా ఏ స్థాయిలో పెత్తనం చెలాయించారో అర్థమవుతోంది. ఆగని ఆగడాలు నగరపాలక సంస్థ అధికారులు టీడీపీ నాయకుల దౌర్జన్యాలతో భయాందోళనకు గురవుతున్నారు. టౌన్ బ్యాంకు అధ్యక్షుడు జేఎల్ మురళీధర్ టీపీఎస్ సాయిప్రసాద్‌పై నోరు పారేసుకున్నాడు. అదే విధంగా 27వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సరిపూటి రమణ జీసస్‌నగర్‌లో టీడీపీ కార్యాలయం పేరిట తన కారు పార్కింగ్ ఏర్పాటు చేశాడు. దీనిపై టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడికి వెళితే.. అక్రమ కట్టడాలన్నింటికీ కొలతలు వేసి మా వద్దకు రావాలని దురుసుగా సమాధానమివ్వడం గమనార్హం. ఇంకా నగరంలో టీడీపీ చోటామోటా నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. పోలీసులు అధికారులను వేధిస్తున్న ఘటనలూ కోకొల్లలు. జిల్లా ఎస్పీ స్పందించి ఇలాంటి నేతలపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. టీడీపీ నేత బూతుపురాణం టీపీఎస్ సాయిప్రసాద్ : అన్నా.. వంకలో నిర్మాణం చేపట్టకూడదు. జేఎల్ మురళి : ‘నా స్థలాన్ని వంకంటావా? నువ్వెవడయ్యా. ల..బాల్‌గాడివి. నా గురించి తెలుసుకో ఫస్ట్ నీవు. వంకంటావా. ఏమనుకున్నావ్. నాకు మెంటల్ తేవద్దు. పోవయ్యా నీకిష్టమొచ్చినోనికి చెప్పుకో. నా దగ్గర గాన్నకరాలు చేస్తావా? నా పని ఆపు చేయిస్తావా? గు..పగలకొడుతా. ఏం పేరు నీ పేరు. ఏమనుకున్నావ్. నీ కథలు నా దగ్గర పడద్దు చెబుతున్నా. టీపీఎస్ సాయిప్రసాద్ : ఏసీపీ ఇసాక్ సార్ చెబితేనే వచ్చాం. జేఎల్ మురళి : అతి చేయొద్దు. (వెంటనే ఏసీపీ ఇస్సాక్‌కు ఫోన్ చేసి) నేను మురళి అన్నా. కాదు వంక గింక అంటున్నాడేంది నా సైట్‌ని. వీఎల్టీ కోసం రామ్మోహన్‌కు పంపిస్తా. చూడు. నీకు ఇబ్బంది లేదు. నీకేమున్నా నాకు చెప్పు. కాదు ఇతనెవరు సాయిప్రసాద్.. చాలా టూమచ్ చేస్తున్నాడు.. టీపీఎస్ సాయిప్రసాద్ : అన్నా.. వంకలో నిర్మాణం చేపట్టకూడదు. జేఎల్ మురళి : ‘నా స్థలాన్ని వంకంటావా? నువ్వెవడయ్యా. ల..బాల్‌గాడివి. నా గురించి తెలుసుకో ఫస్ట్ నీవు. వంకంటావా. ఏమనుకున్నావ్. నాకు మెంటల్ తేవద్దు. పోవయ్యా నీకిష్టమొచ్చినోనికి చెప్పుకో. నా దగ్గర గాన్నకరాలు చేస్తావా? నా పని ఆపు చేయిస్తావా? గు..పగలకొడుతా. ఏం పేరు నీ పేరు. ఏమనుకున్నావ్. నీ కథలు నా దగ్గర పడద్దు చెబుతున్నా. టీపీఎస్ సాయిప్రసాద్ : ఏసీపీ ఇసాక్ సార్ చెబితేనే వచ్చాం. జేఎల్ మురళి : అతి చేయొద్దు. (వెంటనే ఏసీపీ ఇస్సాక్‌కు ఫోన్ చేసి) నేను మురళి అన్నా. కాదు వంక గింక అంటున్నాడేంది నా సైట్‌ని. వీఎల్టీ కోసం రామ్మోహన్‌కు పంపిస్తా. చూడు. నీకు ఇబ్బంది లేదు. నీకేమున్నా నాకు చెప్పు. కాదు ఇతనెవరు సాయిప్రసాద్.. చాలా టూమచ్ చేస్తున్నాడు. -
జేఎన్టీయూకేలో.. వేధింపుల పర్వం
సాక్షి, కాకినాడ: సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)లో వేధింపుల పర్వం సాగుతోంది. గత టీడీపీ ప్రభుత్వ అండతో ఉన్నతాధికారులు ప్రొఫెసర్లపై వేధింపులకు దిగారు. తమ మాట వింటే.. తాము చెప్పినట్టు నడుచుకుంటే ఓకే.. లేదంటే అనవసర ఆరోపణలు అంటగడుతూ సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురిచేసేవారు. ఈ తంతు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై అత్యధికంగా జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కొందరు ప్రొఫెసర్లు ఎన్సీఎస్టీ, ఎన్‌సీఎస్సీలను ఆశ్రయించారు. వీటిపై విచారణ జరిపిన కమిషన్ వీసీ డాక్టర్ రామలింగరాజు, రిజిస్ట్రార్ డాక్టర్ వైవీ సుబ్బారావులకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని ఎన్సీఎస్టీ కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు సమాచారం. ఏం జరిగిందంటే..! జేఎన్టీయూకేలో సివిల్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ కోటేశ్వరరావును సదరు వీసీ, రిజిస్ట్రార్లు వేధించారన్న ఆరోపణ ఉంది. తాను చేయని తప్పులకు తనను బాధ్యుడి చేస్తూ.. అనవసర ఆరోపణలు చూపి తనను ఉద్యోగం నుంచి తొలగించారని ప్రొఫెసర్ కోటేశ్వరరావు ఎన్సీఎస్టీ (నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్)కు తన గోడు వెళ్లబోసుకున్నారు. ప్రొఫెసర్ విన్నపాన్ని స్వీకరించిన కమిషన్ వేధింపులపై వివరణ ఇవ్వాలని వీసీ, రిజిస్ట్రార్లకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కమిషన్ కార్యాలయంలో కమిషన్ ఎదుట హాజరయ్యారు. కమిషన్‌లో దక్షిణ రాష్ట్రాల జాతీయ కమిషన్ మెంబర్ శ్రీమతి మాయ చింతమన్ గిన్వటే సమక్షంలో ఆరోపణలపై సమావేశం నిర్వహించారు. సమావేశంలో వీసీ, రిజిస్ట్రార్లపై కమిషన్ తీవ్రంగా మండిపడినట్టు సమాచారం. ఇలాంటి ఘటనలు వర్సిటీలో మంచివి కాదని, పునరావృతం అయితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్టు తెలిసింది. గతంలోనూ ఇంతే.. గతంలో సైతం ఇలాంటి సంఘటనలు వర్సిటీలో అనేకం చోటు చేసుకున్నాయన్న విమర్శలున్నాయి. అప్పట్లో ముగ్గురు ప్రొఫెసర్లు కమిషన్‌ను ఆశ్రయించగా వీసీ, రిజిస్ట్రార్లకు మందలింపులు తప్పలేదు. అయినా పద్ధతిలో ఏ మాత్రం మార్పు రాలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేతలు అండగా ఉన్నారన్న ధైర్యంతో ఇలాంటి కార్యక్రమాలకు పాల్ప డుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరో ఇద్దరు ప్రొఫెసర్లదీ అదే బాట.. వేధింపుల పర్వం కేవలం కాకినాడ జేఎన్‌టీయూకేకే పరిమితం కాలేదు. విజయనగరం కళాశాలకు సైతం పాకింది. తాజాగా జేఎన్టీయూ విజయనగరం కళాశాలలో తమను ప్రిన్సిపాల్, వైఎస్ ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని ఇద్దరు ప్రొఫెసర్లు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యుల్ క్యాస్ట్ (ఎన్సీఎస్సీ)ను ఆశ్రయించారు. తమకు జరిగిన అన్యాయాన్ని క్లుప్తంగా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. తమను వేధిస్తున్నారని గత ఎనిమిది మాసాలుగా వీసీ, రిజిస్ట్రార్ల దృష్టికి తీసుకెళుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా అసలు ఏం జరిగిందన్న విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, ఈ అంశంలో తమకు న్యాయం చేయకపోతే ఉద్యోగాల్లో కొనసాగడం కష్టమవుతుందని ఆవేదన చెందారు. ఈ విషయమై సైతం వీసీ, రిజిస్ట్రార్లు మరోసారి విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. దిగజారుతున్న వర్సిటీ ప్రతిష్ట సాంకేతిక విశ్వ విద్యాలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉన్నత పౌరులను తీర్చి దిద్దే ఇలాంటి దేవాలయంలో రాజకీయాలు, రాగద్వేషాలకు ఆస్కారం లేకుండా ఉం డాలి. కానీ కొందరు కీలక అధికారులు చేస్తున్న చేష్టలకు వర్సిటీ ప్రతిష్ట దిగజారే పరిస్థితి తలెత్తుతుతోంది. ఇప్పటికే వీసీల నియామకం కోర్టులో ఉన్న విషయం తెలి సిందే. ఆ విషయం మరవకముందే వేధిం పుల పర్వం తెరపైకి రావడం దారుణం. -
డబ్బులు చెల్లించమన్నందుకు దాడి
సాక్షి, ఎర్రగుంట్ల(కడప) : పొదుపు సంఘానికి చెందిన బకాయి డబ్బులు చెల్లించాలని అడిగినందుకు డ్వాక్రా సంఘాల సీసీ ఇబ్రహీం, హెడ్‌డీసీసీ రామ్మోహన్‌లపై పొదుపు సంఘం లీడర్ వరలక్ష్మితో పాటు ఆమె బంధువులు దాడి చేసి గాయపరిచారని వెలుగు అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి (ఏపీఎం) అపర్ణ దేవి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ శ్రీనివాసులు కథనం మేరకు... మండల పరిధిలోని చిలంకూరు గ్రామంలో సాయిచందన గ్రూపు పొదుపు సంఘం లీడర్ డి. వరలక్ష్మి తన అవసరాల నిమిత్తం రూ.2.70 లక్షలు అప్పుగా తీసుకుంది. ఆ అప్పును చెల్లించకపోవడంతో ఆ గ్రూపులోని సభ్యులందరూ బకాయి డబ్బులు చెల్లించాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. దీంతో చిలంకూరు పొదుపు సంఘాలకు చెందిన కమ్యూనిటీ కో ఆర్డినేటర్ ఇబ్రహీం, హ్యూమన్ డెవలప్మెంట్ కమ్యూనిటీ కో ఆర్డినేటర్ రామ్మోహన్‌లు డబ్బులు చెల్లించాలని ఆమెను అడిగారు. ఆగ్రహించిన వరలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులతో పాటు మరి కొందరు ఎర్రగుంట్లలోని వెలుగు కార్యాలయానికి వచ్చి విధి నిర్వహణలో ఉన్న సీసీ ఇబ్రహీం, హెచ్‌డీసీసీ రామ్మోహన్‌లపై కర్రలు, వాటర్‌పైపు, వైర్లతో దాడి చేసి గాయపరిచారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
చొడవరంలో టీడీపీ నేతల దౌర్జన్యం
-
మైనింగ్ మాఫియా దాడిలో ఎమ్మెల్యేకు గాయాలు
-
ఎమ్మెల్యేపై మైనింగ్ మాఫియా దాడి
సాక్షి, న్యూఢిల్లీ: మైనింగ్ మాఫియా దాడిలో ఆప్ ఎమ్మెల్యేకు గాయాలయ్యాయి. పంజాబ్‌లోని బైహరా గ్రామంలో ఇల్లీగల్ మైనింగ్ వ్యవహారం కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న రోపార్ నియోజకవర్గ ఆప్ ఎమ్మెల్యే అమర్జీత్ సింగ్ సందోవా తన అనుచరులతో గురువారం మధ్యాహ్నాం అక్కడికి వెళ్లారు. మీడియాతోపాటు ఆయన్ని గమనించిన ముఠా సభ్యులు ముందుగా వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆయనపై చెయ్యి కూడా చేసుకున్నారు. పక్కనే ఉన్న సిబ్బంది నిలువరించే యత్నం చేసినప్పటికీ మైనింగ్ మాఫియా ముఠా అస్సలు వెనక్కి తగ్గలేదు. కాసేపటికే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. కర్రలు, ఇనుపరాడ్లతో ఎమ్మెల్యే బృందంపై ముఠా సభ్యులు విరుచుకుపడ్డారు. రాళ్లు విసిరి చెదరగొట్టే యత్నం చేశారు. ఈ క్రమంలో రాళ్ల దాడిలో ఎమ్మెల్యే గాయపడ్డారు. ఛాతీకి బలమైన గాయం కావటంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. దాడికి సంబంధించిన దృశ్యాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ ఘటనపై ఆప్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స్పందించారు. పంజాబ్‌లో మైనింగ్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అమరీందర్ సింగ్ ప్రభుత్వం కళ్లు తెరవాలని.. మాఫియా ఆగడాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే, జర్నలిస్టులపై దాడిని ఖండిస్తున్నామన్న సిసోడియా తక్షణమే నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
స్నేహితుడి ఎదుటే దారుణం..ఇద్దరి అరెస్టు
పనాజి : ప్రేమ జంటకు ఊహించని పరిణామం ఎదురైంది. బీచ్‌లో సరదాగా గడుపుదామని స్నేహితుడితో వెళ్లిన ఇరవై ఏళ్ల యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన గోవాలోని కోవ్లా బీచ్‌లో శుక్రవారం రాత్రి జరిగింది. తన స్నేహితుడి ఎదుటే యువతిపై నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఘటనను తమ సెల్ఫోన్లో వీడియో తీసిన నిందితులు విషయాన్ని బయటపెడితే ఇంటర్నెట్లో పెడతామని బెదిరించారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఇద్దరిని శనివారం అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామని పోలీసులు తెలిపారు. ‘అత్యాచార నిందితులు సంజయ్ ధనంజయ్ పాల్ (23), రామ్ సంతోష్ భారియా (19)ను అరెస్టు చేశాం.మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకోవడానికి లుక్ ఔట్ నోటీసులు జారీ చేశాం. వీరంతా ఇండోర్‌కు చెందినవారు. గోవా పర్యటనకు వచ్చి ఈ అకృత్యానికి పాల్పడ్డార’ని గోవా (పశ్చిమం) ఎస్పీ అరవింద్ గవాస్ తెలిపారు. పరిసర గ్రామం నుంచి తన స్నేహితుడితో కోవ్లా బీచ్‌కు వచ్చానని బాధితురాలు తెలిపింది. కాగా, యువతి అత్యాచారానికి గురైనట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. -
గుజరాత్లో ఘోరం
మోర్బీ: కామ పిశాచాలకు మరో చిన్నారి బలైంది. గుజరాత్‌లోని మోర్బీ పారిశ్రామిక వాడలో బుధవారం సాయంత్రం తప్పిపోయిన రెండేళ్ల చిన్నారి అత్యాచారం, హత్యకు గురైంది. పోలీసుల వివరాల ప్రకారం.. మోర్బీలోని సిరామిక్ ఫ్యాక్టరీలో పనిచేసే వలస కూలీ దంపతుల కూతురు బుధవారం రాత్రి కిడ్నాప్‌కు గురైంది. బాలిక తల్లిదండ్రులు ఆమె కోసం ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఆ రోజు రాత్రంతా గాలించినా ఆచూకీ లభించలేదు. కాగా, అపహరణకు గురైన చిన్నారి దగ్గర్లోని చెరువు వద్ద శవమై కనిపించిందని గురువారం సాయంత్రం పోలీసులు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో చిన్నారి అత్యాచారానికి గురైనట్లు తెలుస్తోందని వారు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత బాలిక మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు అన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ఆగంతకులను పట్టుకునేందుకు ముమ్మర దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు. వలస కార్మికుల సిరామిక్.. సౌరాష్ట్ర ద్వీపకల్పంలో మోర్బీ ఒక పారిశ్రామిక పట్టణం. ఇక్కడ ప్రధానంగా సిరామిక్, గడియారాల పరిశ్రమలు ఉన్నాయి. సిరామిక్ ఫ్యాక్టరీల్లో వలస కార్మికులే ఎక్కువగా పని చేస్తుంటారు. పొట్టచేత పట్టుకొని ఇక్కడికి వస్తే తమ గారాల కూతురుకు ఈ గతి పట్టిందని ఆ వలస కూలీలు కన్నీరు మున్నీరవుతున్నారు. 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వారికి మరణదండన విధిస్తూ కేంద్రం పోక్సో చట్టానికి సవరణలు తెచ్చి 15 రోజులు గడుస్తున్నా దేశంలో అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. -
బాలికపై మైనర్ లైంగిక దాడి
సాక్షి, కందుకూరు: బాలికపై మైనర్ బాలుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చిప్పలపల్లిలో 8 ఏళ్ల వయస్సు గల బాలికను శుక్రవారం ఒంటరిగా ఇంటి వద్ద వదిలి తల్లి పొలం పనులకు, తండ్రి ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. కాగా తిరిగి మధ్యాహ్నం 2 గంటల సమయంలో తల్లి ఇంటికి రాగా తలుపులు సగం తెరిచి ఉండడం గుర్తించి ఇంట్లోకి వెళ్లి చూడగా తన కుమారైపై వారి బంధువు, వరుసకు ఆ బాలికకు అన్న అయ్యే మైనర్ బాలుడు(16) లైంగిక దాడి చేస్తూ కనిపించాడు. ఆమెను చూడగానే వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయమై బాధితులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నాలుగేళ్ల చిన్నారిపై ఆయా దాష్టీకం...
ముంబై : లింగ బేధం లేదు, వయసు తేడా లేదు.. పసివాళ్లన్న జాలి, దయ ఏమాత్రం లేకుండా మానవ మృగాలు రెచ్చిపోతుంటే భద్రతకు తావేది..? గుడి కన్నా బడి పదిలం అన్నారు. కానీ బడిలోనూ రక్షణ లేదు. ఓ వైపు చిన్నారులపై అకృత్యాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలని చట్టాలు తెస్తుంటే మరో పక్క పసివాళ్లపై జరిగే దారుణాలు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇలాంటి ఉదంతమే మరొకటి వెలుగులోకి వచ్చింది. ముంబైలోని ఉన్నత వర్గాల వారు నివసించే మజగావ్ ప్రాంతంలోని ఓ కిండర్‌గార్డెన్ స్కూల్లో ఆయాగా పని చేసే 60 ఏళ్ల మహిళ నాలుగేళ్ల చిన్నారి పై లైంగిక దాడికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిండర్‌గార్డెన్ స్కూల్లో చదువుతున్న ఓ చిన్నారి గత రెండు నెలల నుంచి పాఠశాలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. బడి అంటేనే వణికిపోతుంది. నిన్న ఆదివారం రాత్రి పాప తల్లిదండ్రులు చిన్నారిని బుజ్జగించి కారణాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆ చిన్నారి చెప్పిన విషయాలు వారికి వణుకు పుట్టించాయి. వైద్య పరీక్షల్లో చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు తేలడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లి పరిక్షించగా చిన్నారి వ్యక్తిగత శరీర భాగాల వద్ద గాయాలు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పాప తల్లిదండ్రులు పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలికి ఫోను చేసి విషయం చెప్పారు. దాంతో సోమవారం విధులకు హజరయిన ఆయను అదుపులోకి తీసుకుని బైకుల్లా పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా తానే ఆ చిన్నారిపై లైంగిక దాడి చేసినట్లు ఒప్పుకున్నది. పోలీసులు ఆ మహిళ మీద కేసు నమోదు చేశారు. -
భయంకరంగా టీటీడీ ఉద్యోగి వీరంగం.. వైరల్
సాక్షి, తిరుపతి: పవిత్రమైన ఆలయంలో పనిచేస్తోన్న ఉద్యోగి ఒకరు.. పూటుగా మద్యం సేవించి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశాడు. అర్ధనగ్నంగా తిరుగుతూ రోడ్లపై వీరంగం సృష్టించాడు. వివరాల్లోకి వెళితే... తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో వాహన బేరర్‌గా పనిచేస్తున్న కుమార్.. ఆదివారం రాత్రి జనంపై దౌర్జన్యానికి దిగాడు. దుకాణాల్లోని కూరగాయలు, వస్తువులను రోడ్డుపైకి విసిరేశాడు. అటుగా వెళ్లే వాహనదారులపై దాడికి యత్నించాడు. అడ్డం వచ్చిన కానస్టేబుల్పైనా దౌర్జన్యం చేశాడు. అర్ధనగ్నంగా రోడ్లపై తిరుగుతూ, నిలిపిఉంచిన ద్విచక్రవాహనాలను ఎత్తిపడేసే యత్నం చేశాడు. వీడియో కెమెరాలకు చిక్కిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీటీడీ అధికారులకు సమాచారం: విచ్చలవిడిగా ప్రవర్తించిన కుమార్‌ను దాదాపు అరగంట తర్వాత పోలీసులు పట్టుకున్నారు. తెలిసినవారి ద్వారా కుమార్ ఆచూకీ కనిపెట్టిన పోలీసులు అతని కుటుంబీకులను పిలిపించారు. ఉద్యోగి వ్యవహారంపై టీటీడీ అధికారులకు సైతం సమాచారం అందించినట్లు తెలిసింది. కుమార్‌పై టీటీడీ చర్యలు తీసుకుంటుదా, లేదా తెలియాల్సిఉంది.