
ప్రతీకాత్మక చిత్రం
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): ప్రేమించానని నమ్మించి యువతిపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా పెళ్లి చేసుకోవాలని అడిగేందుకు వెళ్లిన బాధితురాలి కుటుంబ సభ్యులను కులం పేరుతో దూషించిన వారిపై కొత్తపేట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నవరానికి చెందిన వేము శిరీష (25)కు వన్‌టౌన్‌కు చెందిన రాయన రవితేజ ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు
చదవండి: టాటూలు వేస్తానని ఏడుగురు మహిళలతో ఒంటరిగా స‍్టూడియోలో..
కొంత కాలం తర్వాత రవితేజ శిరీషను ప్రేమిస్తున్నాని చెప్పడంతో ఇద్దరు శారీరకంగా కలిశారు. తీరా పెళ్లి చేసుకోమని అడిగే సరికి కాదనడమే కాకుండా ఈ విషయం అడిగేందుకు వెళ్లిన శిరీష తల్లి, బంధువులను కులం పేరుతో దూషించినట్లు బాధితురాలు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై రవితేజతో పాటు చెల్లి, బావ, స్నేహితుడైన హేమంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment