caste abuse
-
కులదూషణ ఏ సంస్కృతికి ప్రతీక?
ఎన్నికైన ప్రజాప్రతినిధులు పదవీ స్వీకారం రోజున చేసే ప్రమాణాలకు కట్టుబడి ప్రజలకు కుల మతాలకు అతీతంగా సేవలు చేయాలి. బాధ్యతలూ నిర్వర్తించాల్సి ఉంటుంది. రాగద్వేషాలకు అతీతంగా వారు ఉండి తీరాల్సిందే. ఏ ఒక్కరిపై విద్వేషపూరితంగా వ్యవహరిస్తూ అనుచిత వ్యాఖ్యలు సైతం చేయకూడదు. అలా చేస్తే రాజ్యాంగాన్ని ధిక్కరించిన వారు అవుతారు. ఇటీవల ఒక ప్రజా ప్రతినిధి ఒక కులాన్ని ఉద్దేశపూర్వకంగా దూషించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఆ ప్రజాప్రతినిధి అలా మాట్లాడవచ్చా? ఎవరో ఏదో చేశారని మొత్తం ఆ కులాన్ని టార్గెట్ చేయడం విస్మయం కలిగిస్తున్నది. ఈ విధానాన్ని అన్ని రాజకీయ పక్షాలూ ముక్తకంఠంతో ఖండించాలి. అప్పుడే ఇలాంటి వారి వైఖరిలో మార్పు వస్తుంది. ఓ సామాజిక వర్గానికి చెందిన నేత 10 ఏండ్లు పాలించిన మాత్రాన ఆయనపై కోపంతో ఈ ప్రజాప్రతినిధి ఆ నేత కులస్థుల నందరినీ దూషించడం భావ్యమేనా? ఈ ప్రజాప్రతినిధి సొంత పార్టీలో కూడా ఆయన తిట్టిన సామాజిక వర్గానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన ముగ్గురు అసెంబ్లీ నియోజకవర్గ నేతలకు కూడా ఈ సంబోధన వర్తిస్తుందా అనేది స్పష్టం చేయాలి. అదే పార్టీకి చెందిన పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన ఒక అభ్యర్థి విషయంలో కూడా ఆయన అభిప్రాయం ఇదే అయితే పార్టీని, పార్టీ నిర్ణయాన్ని తప్పు పట్టినట్టే కదా! ఈ విషయంలో వెంటనే స్పందించి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆ ప్రజాప్రతినిధిని వివరణ ఇవ్వాలని ఆదేశించడం శుభపరిణామం. అడ్డదిడ్డంగా మాట్లాడే ప్రజాప్రతినిధులకు ఒక గుణపాఠం కావాలని కోరుకోవడం ఎంతైనా అవసరం.అన్ని కులాలు, జాతుల వారితోపాటు చివరకు ఆయన దూషించిన కులం వారు కూడా ఆయనకు ఓట్లు వేస్తేనే కదా గెలిచింది? ఆ నియోజకవర్గంలో ఉన్న అన్ని కులాలకూ ఆయనే కదా ప్రజాప్రతినిధి! అలాంటిది ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు దిగడం దేనికి సంకేతం? ఇదేనా ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణాలు. ఆయనే ఆత్మవిమర్శ చేసుకోవాలి. దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఆ ఒక్క కులాన్నే కాదు... ఏ కులాన్ని దూషించే హక్కూ ఎవరికీ లేదు. ఇలా చేస్తే రాజ్యాంగం మీద ఏ మాత్రం గౌరవం లేనట్టే లెక్క. గౌరవం ఉన్న వారు ఇలా ప్రవర్తించరు.కులాలపై దూషణలకు దిగినా, ద్వేషించినా అన్ని రాజకీయ పార్టీలూ అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలి. ఈ విధమైన సంస్కృతిని ఎవరూ ప్రోత్సహించవద్దు. ఎవరైనా ప్రోత్సహించినా తగిన శాస్తి చేయాలి. ప్రజల్లో హీరోయిజం చూపించేందుకు ఇలాంటి మార్గాన్ని ఎన్నుకోవడం దుందుడుకు చర్య అవుతుంది. అరవై, డెబ్భై ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీతో అత్యంత అనుబంధం ఉన్న ఆ కులానికి చెందిన నేతలు పెద్ద పెద్ద హోదాల్లో పని చేశారు. కులరహితంగా సేవలందించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా నిత్యం పాటుపడ్డారు. కులాలను ఎప్పుడూ తక్కువగా చూడలేదు. అందరికీ తోడుగా, నీడగా వ్యవహరించారు. ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా భరోసా కల్పించేవారు. దేశం, తెలంగాణ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించారు. అదే విధంగా మరో జాతీయ పార్టీలో ఆ కులానికి చెందిన నేతలకు ప్రజాప్రతినిధులుగా, గవర్నర్లుగా పనిచేసిన అనుభవం ఉన్నది. ఏతావతా చెప్పొచ్చేదేమిటంటే... అన్ని పార్టీల్లోనూ ఈ కులస్థులు ఉన్నారనే! ఈ ఇంగితాన్ని మరచి ఒక నేత పట్ల ఉన్న ఆక్రోశంతో అతడి కులస్థుల నందరినీ తిట్టి బాధపడేలా చేయడం సరికాదు కదా! మొత్తం రాజకీయ వాతావరణమే ఈ చర్యతో దెబ్బతిన్నదనేది వాస్తవం. కుల సంఘాల వారు ఇదే రకమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండి, రాజ్యాంగబద్ధంగా వారి హక్కుల కోసం పోరాడడం మంచి పద్ధతి. అలా కాకుండా సోషల్ మీడియా వేదికలపై ఒకరి కులాన్ని మరో కులంవారు తిడుతూ రెచ్చగొట్టుకోవడం సరికాదు. ఈ విషయంలో అందరూ సంయమనాన్ని పాటించాలి. ప్రజాప్రతినిధుల పైన ఒత్తిడి తెచ్చి, తమ గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేసిన ఇటువంటి ప్రజాప్రతినిధులపైన ఆ పార్టీ పెద్దలు చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేయడం సరైన మార్గం. ప్రజల చేత ఎన్నికై, ప్రజల కోసం పని చేసే నేతలు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. వెలమ జాతి ఒక్కరి సొత్తు కాదు. వారు ఒక్కరి దిక్కు ఒరిగి లేరు. నిజానికి ఆ కులాన్ని తిట్టిన ప్రజాప్రతినిధి పార్టీలోనే ఎక్కువ మంది వెలమలు ఉన్నారు అనే విషయం మరిచిపోకూడదు. గత ఏడు దశాబ్దాలుగా వారు కాంగ్రెస్ వెన్నంటే ఉన్నమాట జగమెరిగిన సత్యం కాదా? ఇవన్నీ మర్చిపోయి ఈ దూషణతో వ్యక్తిగతంగా దిగజారుతూ, పార్టీకి కూడా ఆయన చేసిన పాపం అంటగట్టడం ఎందుకు? దేశానికి ఆపద వస్తే కులమతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా నిలిచిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. పార్టీల మధ్య ఎన్ని వైరుద్ధ్యాలు ఉన్నా భారతీయులందరూ దేశ రక్షణ, అభివృద్ధిలో ఏకతాటిపై ఉండడం సహజం. ఇది మన లక్ష్యం. ఈ విషయంలో అది తెలంగాణ అయినా, మన సొంత జిల్లా అయినా, పక్క జిల్లా అయినా అక్కడ ప్రజలు ఆపదలో ఉంటే కులమతాలకు అతీతంగా ఆదుకొని తీరుతాం. సమాజంలో మనుషులంతా సమానమే. కులాలు వేరు వేరు ఉంటాయి. ఆ కులంలో పుట్టాం... ఈ కులంలో పుట్టాం... అని చింతించుకుంటూ పోతే లాభం లేదు. ఒక చిన్న కులంలో పుట్టడం నేరం కాదు. పెద్ద కులంలో పుట్టానని పొంగిపోవడం మంచిది కాదు. ఒక కులంపై విద్వేషం చిమ్మే విధంగా మరొకరు మాట్లాడడం భావ్యం కూడా కాదు. అసలు కుల ప్రస్తావన తేవడం నేరం కిందకే వస్తుంది. కులం పేరిట దూషిస్తూ స్వలాభం పొందడం రోతపుట్టిస్తుంది.అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సర్కారు కులగణనను ఓ వైపు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ప్రజాప్రతినిధి ఓ కులంపై విషం చిమ్మడం దారుణం. అసలు కులగణన ఎందుకు జరిపిస్తున్నారన్న ఎరుక ఈ ప్రజాప్రతినిధికి ఉందా? వివిధ కులాల వారు ఎవరెవరు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని వారి వారి జనాభాల నిష్పత్తుల ప్రకారం సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడానికే కదా! అంటే అన్ని కులాలనూ సమానదృష్టితో చూడడానికే కదా! మరి ఈ ప్రజాప్రతినిధి ఒక కులంపై ఇంత దారుణ వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? భవిష్యత్తులో ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సభ్యసమాజంపై ఉంది. ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీలూ, పౌర సమాజం మొత్తం ఇది అర్థం చేసుకొని వ్యవహరించాలి. అప్పుడే సమాజ శ్రేయస్సుకు తోడ్పాటు అందించిన వారు అవుతారు. లేకపోతే సమాజానికే ప్రమాదం. వ్యాసకర్త కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ‘ 9849061481వెలిచాల రాజేందర్రావు -
కులం పేరుతో దూషణ.. ఆపై బాలుడిని మంటల్లో తోసేసిన తోటి విద్యార్థులు
చెన్నై: సమాజంలో జరుగుతున్న ఘోరాలలో వ్యక్తిని కులం పేరుతో దూషించడం ఒకటి. గతంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా పెద్దల మధ్య చోటు చేసుకునేవి. ఇటీవల ఇవి పిల్లలకు కూడా పాకినట్లు ఉంది. తాజాగా ఒక విద్యార్థిని కొందరు విద్యార్థులు కులం పేరుతో దూషించారు. అంతటితో ఆగకుండా అతన్ని మంటల్లోకి తోసేశారు. ఈ హేయమైన ఘటన తమిళనాడులోని విలుపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే....తిండివనం పట్టణంలోని కట్టుచివిరి ప్రభుత్వ పాఠశాలలో ఓ దళిత విద్యార్థి 6వ తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలానే ఆ బాలుడు స్కూల్ అయ్యాక తిరిగి ఇంటికి బయలుదేరాడు. అయితే అక్కడే చదువుతున్న ముగ్గురు అగ్ర కులానికి చెందిన విద్యార్థులు ఒంటిరిగా వెళ్తున్న అతడ్ని ఆటపట్టించారు. అంతటితో ఆగకుండా కులం పేరుతో కూడా దూషించారు. దీంతో వారి మధ్య వాగ్వివాదం రావడంతో వాళ్ళు ఆ బాలుడిని కాలుతున్న పొదల్లోకి తోసేశారు. దీంతో ఆ విద్యార్థి కాలిన గాయాలతో ఇంటికి వెళ్ళాడు. ఒంటి పై గాయాలతో ఉన్న కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులు తల్లపోయారు. వెంటనే చికిత్స కోసం కుమారుడ్ని తిండివనం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చివరకి ఈ దారుణం ఎలా జరిగిందో తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు ఆ ముగ్గురి విద్యార్థుల పై పోలీసులకు ఫిర్యాడు చేశారు బాధిత విద్యార్థి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు ముగ్గురు విద్యార్థులపై హత్యాయత్నంతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. చదవండి: షాకింగ్ వీడియోను పోస్ట్ చేసిన కిరణ్ బేడి... మండిపడుతున్న నెటిజన్లు -
ఫేస్బుక్ ద్వారా పరిచయం.. ప్రేమించానని నమ్మించి..
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): ప్రేమించానని నమ్మించి యువతిపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా పెళ్లి చేసుకోవాలని అడిగేందుకు వెళ్లిన బాధితురాలి కుటుంబ సభ్యులను కులం పేరుతో దూషించిన వారిపై కొత్తపేట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నవరానికి చెందిన వేము శిరీష (25)కు వన్‌టౌన్‌కు చెందిన రాయన రవితేజ ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడు చదవండి: టాటూలు వేస్తానని ఏడుగురు మహిళలతో ఒంటరిగా స్టూడియోలో.. కొంత కాలం తర్వాత రవితేజ శిరీషను ప్రేమిస్తున్నాని చెప్పడంతో ఇద్దరు శారీరకంగా కలిశారు. తీరా పెళ్లి చేసుకోమని అడిగే సరికి కాదనడమే కాకుండా ఈ విషయం అడిగేందుకు వెళ్లిన శిరీష తల్లి, బంధువులను కులం పేరుతో దూషించినట్లు బాధితురాలు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై రవితేజతో పాటు చెల్లి, బావ, స్నేహితుడైన హేమంత్పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కులం నుంచి వెలివేశారని వస్తే.. ఎస్సై బూతులు తిట్టారు..
సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్): తమను కులం నుంచి వెలివేశారని, న్యాయం చేయాలని ఠాణా మెట్లెక్కిన ఓ మహిళకు సుల్తానాబాద్ పోలీస్‌స్టేషన్‌లో రెండో ఎస్సై లింగారెడ్డి నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఫిర్యాదు స్వీకరించకపోగా నానా బూతులు తిట్టి కుల పెద్దల వద్దే తేల్చుకోవాలని ఉచిత సలహా కూడా ఇచ్చారని సదరు మహిళ పోలీస్‌స్టేషన్ ఎదుటే ఆందోళనకు దిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన బోయవాల్మీకి కులానికి చెందిన ముస్తే సునీత కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరించారు. అప్పటినుంచి ఆ కులంలోని ఎవ్వరి ఇళ్లలో శుభకార్యాలు జరిగినా వీరిని పిలవడం లేదు. తమ తప్పులేదని మొత్తుకున్నా కులపెద్దలు వినడం లేదు. దీంతో సదరు మహిళ ఫిర్యాదు చేసేందుకు శనివారం సుల్తానాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన గోడును రెండో ఎస్సై లింగారెడ్డితో చెప్పుకుంటుండగా ఒక్కసారిగా దుర్భాషలాడారని ఆరోపించింది. ఆయన తిట్టిన బూతులకు మనస్తాపం చెందిన ఆమె పోలీస్‌స్టేషన్ ఎదుటే బైఠాయించింది. ఎస్సై ఉపేందర్‌రావు బాధితురాలితోపాటు రెండో ఎస్సైని పిలిచి మాట్లాడారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, కుల పెద్దల నుంచి తన కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంది. దీనిపై లింగారెడ్డి స్పందిస్తూ.. తాను కించపరిచేలా మాట్లాడలేదని పేర్కొన్నారు. చదవండి: RS Praveen kumar: సీఎంగా కేసీఆర్ ఏడేళ్లు ఏం చేశారు..? -
దారుణం: పంచాయితీకి రాలేదని కుల, గ్రామ బహిష్కరణ
సాక్షి, శాలిగౌరారం(నల్లగొండ): పంచాయితీకి పిలిస్తే రాలేదని ఓ కుటుంబాన్ని కుల, గ్రామ బహిష్కరణ చేశారు పెద్దమనుషులు. ఈ తీర్పును సదరు కులానికి చెందిన ప్రజలు అమలు చేయాలని, వారితో ఎవరైనా మాట్లాడినా, ఎలాంటి సహాయ సహకారాలు అందించినా రూ.10 వేల జరిమానా విధిస్తామని ఒప్పంద పత్రాలు రాశారు. ఈ ఘటన శాలిగౌరారం మండలం బైరవునిబండలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. భైరవునిబండ గ్రామానికి చెందిన పులిగిల్ల అంజయ్య కుటుంబానికి అదే సామాజిక వర్గానికి చెందిన మరో కుటుంబానికి మధ్య ప్రభుత్వ ఇంటి స్థల విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవ కులపెద్దమనుషుల వద్దకు చేరింది. ఈ నెల 26న కొంతమంది కులపెద్దలు పంచాయితీ మాట్లాడేందుకని ఇరు కుటుంబీకులకు కబురు పంపారు. దీనికి అంజయ్య కుటుంబీకులు వెళ్లలేదు. దీంతో కోపోద్రిక్తులైన కులపెద్దలు మా మాట వినకుండా కులధిక్కరణ చేశాడని అంజయ్య కుటుంబాన్ని కులంతోపాటు గ్రామ బహిష్కరణ చేశారు. ఈ కుటుంబీకులతో సదరు కులానికి చెందిన వ్యక్తులు మాట్లాడినా, ఎలాంటి సహాయ సహకారాలు అందించినా రూ.10వేల జరిమానా విధిస్తూ హుకుం జారీ చేశారు. దీనిపై ఒప్పంద పత్రాలు రాసి ప్రచారం చేశారు. ఈ క్రమంలో మరుసటి రోజు (27న) అంజయ్య సొంత పనిపై సాయంత్రం వేళలో వీధిలోనుంచి వెళ్తుండగా గ్రామానికి చెందిన కులపెద్దలు గ్రామంలో కూడా తిరగవద్దని అతన్ని బెదిరించారు. దీంతో తీవ్ర అవమానానికి గురైన అంజయ్య అదేరోజు రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. కులపెద్దలు పులిగిల్ల పోశయ్య, పులిగిల్ల బిక్షమయ్య, నరిగె శంభయ్య, దుప్పెల్లి నరేశ్‌లపై ఫిర్యాదు చేశాడు. దీంతో కుల పెద్దమనుషులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఆ చెన్నై రోజులు తిరిగిరావు -
నాలుగేళ్ల ప్రేమ, పెళ్లి.. ఇప్పుడు కులం చిచ్చు!
ఇల్లందకుంట(హుజూరాబాద్): ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఇతరుల మాటలు విని కాపురానికి తీసుకెళ్లక పోవడం, అత్తింటివారు కులం పేరుతో దూషించడంతో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. బాధితురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లికి చెందిన చిట్యాల సంధ్యకు కేశవపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన అన్నె సంతోష్‌తో నాలుగేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. వేర్వేరు కులాలు కావడంతో 2020 మార్చి 16న ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం ఇప్పలపల్లికి వెళ్లారు. దాదాపు 10 నెలలు సజావుగా సాగిన వీరి కాపురంలో కులం చిచ్చు రగిలింది. సంతోష్ తండ్రి సమ్మయ్య, వారి బంధువులు గుంటి తిరుపతి, కొండయ్యలు కులం పేరుతో సంధ్యను దూషించడం మొదలుపెట్టారు. దీనికితోడు సంతోష్ సంధ్యను పట్టించుకోవడం మానేశాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. సంతోష్ తనను కాపురానికి తీసుకెళ్లడం లేదని సంధ్య ఇల్లందకుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. సోమవారం ఇల్లందకుంటలో పంచాయితీ చేసుకుందామని చెప్పిన సంతోష్ కుటుంబీకులు అక్కడికి రాకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందింది. దీంతో ఠాణాకు కొద్ది దూరంలో వారు పెళ్లి చేసుకున్న ఆలయం ఎదుటే నిద్రమాత్రలు మింగింది. కుటుంబసభ్యులు జమ్మికుంటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు. హుజూ రాబాద్ ఫస్ట్ క్లాస్ అడిషనల్ జడ్జి స్వాతిభవాని సంధ్య నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. చదవండి: నా కూతుర్నే ప్రేమిస్తావా.. యువకుడిపై దారుణం -
కార్యకర్తను కులం పేరుతో దూషించిన జనసేన నేత
సాక్షి, చిత్తూరు (రేణిగుంట): జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నగరం వినుత భర్త కోట చంద్రబాబు తనను కులం పేరుతో దూషించి, ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఆ పార్టీ కార్యకర్త శివ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథనం... రేణిగుంట సమీపంలోని మర్రిగుంటకు చెందిన శివ జనసేన పార్టీలో క్రియాశీలక కార్యకర్త. ఎల్ల మండ్యం సర్పంచ్ అభ్యర్థిగా పార్టీ నుంచి అవకాశం కల్పిస్తానని వినుత భర్త హామీ ఇచ్చాడు. అయితే కొన్ని సమస్యలపై శుక్రవారం ఉదయం రేణిగుంటలోని నగరం వినుత ఇంటికి శివ వెళ్లాడు. తనపై పోలీస్ స్టేషన్లో కేసు ఉందని, వారితో మాట్లాడాలని కోట చంద్రబాబును ప్రాధేయపడ్డాడు. (ప్రియురాలి ప్రవేశం.. మొదటిరాత్రి భగ్నం!) అయితే కులం పేరిట అతను దూషించి గెంటేయడంతో ఆగ్రహించిన శివ అక్కడున్న వారి కారు అద్దాలను పగలగొట్టాడు. కులం పేరిట తనను దూషించారని చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే, కారు అద్దాలు ధ్వంసం చేశాడని శివపై నగరం వినుత ఫిర్యాదు చేశారు. కాగా, రాజకీయ లబ్ధి కోసం ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై వారు విమర్శలు చేయడం సరికాదని శివ ఖండించాడు. ఇక, రేణిగుంట పోలీసులు ఇరువురి ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (ప్రచారానికే పరిమితమైన జనసేన) -
ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించినవారిని అరెస్ట్ చేయాలి
సాక్షి, విజయవాడ: తాడికొండ ఎమ్మెల్యే,దళిత నాయకురాలు ఉండవల్లి శ్రీదేవిని వినాయక చవితి వేడుకల సందర్భంగా ఘోరంగా అవమానించిన వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం దళిత సంఘాల నేతలు విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళ్ళం భాగ్యరావు మాట్లాడుతూ.. ఏపీ రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేపై అగ్రవర్ణ కుల అహంకారుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇది కుల వివక్షకు పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. 40 శాతం దళితులు ఉన్న రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేకే రక్షణ కరువైందని.. ఇక అక్కడ ఉండే దళిత సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెట్పీటీసీ నేతలకు రక్షణ ఎక్కడుంది అని ఎద్దేవా చేశారు. ఒక మహిళా ఎమ్మెల్యే, దళిత నాయకులు, డాక్టరైన ఆమెను గౌరవించకుండా కులం పేరుతో దూషించడం హేయమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యపై సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చర్య తీసుకోవాలని అన్నారు. దళితులపై ఎటువంటి వివక్ష చూపని ఎట్రాసిటీ ప్రో గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఈ సందర్బంగా భాగ్యరావు కోరారు. గతంలో టీడీపీ నాయకులు, సొంత పార్టీకి చెందిన దళిత నాయకుడిని అవమానించారని గుర్తు చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. కులవివక్ష వ్యతిరేక ప్రచార సంఘం అధ్యక్షులు పరిశపోగు రాజేష్ మాట్లాడుతూ.. దళిత మహిళ, శాసన సభ్యురాలైన శ్రీదేవిపై దాడిని ఖండిస్తున్నామని అన్నారు. కులం పేరుతో దూషించి, ఉన్మాదం సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే అన్ని దళిత సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మైనార్టీ నాయకులు ఇర్ఫాన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే సామాన్యులకు రక్షణేది? అని ఆవేదన వ్యక్తం చేశారు. కుల అహంకారంతో పెట్రేగిపోతున్న వారి దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. -
ప్రేమన్నాడు.. పెళ్లన్నాడు.. కులం అడ్డంటున్నాడు
బంజారాహిల్స్: ప్రేమించాడు... పెళ్లి చేసు కుంటానని నమ్మించి సహజీవనం చేశాడు.. .పెళ్లి చేసుకోవాలని కోరగా కులం తక్కువని నిరాకరించాడు. తనను మోసం చేసిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జవహర్‌నగర్‌కు చెందిన యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. 2009లో ఎస్ఆర్నగర్లో ఇంటర్ చదువుతున్న సమయంలో ఉదయ్‌శంకర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఏడాదిగా వారు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో సహజీవనం చేసింది. ఈ నెల 6న పెళ్లి విషయమై ఒత్తిడి చేయగా ఆమె ఇంటికి వచ్చిన అతను తప్పకుండా పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులకు చెప్పి వెళ్లిపోయాడు. ఆ తెల్లవారే తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. బాధితురాలు ఫోన్ చేయగా నేను ‘ కులం కారణంగా నేను నిన్ను పెళ్లి చేసుకోలేనని ఓ సారి, అంత కట్నం మీరు ఇచ్చుకోగలరా అంటూ మరో సారి జవాబిస్తూ పెళ్లికి నిరాకరించాడు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కులం పేరుతో దూషించారని వివాహిత ఆత్మహత్య
సాక్షి, హిందూపురం అర్బన్ : కులం పేరుతో దూషించారని మనస్తాపం దళిత సామాజిక వర్గానికి చెందిన అరవింద (24) అనే వివాహిత బుధవారం ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ సీఐ చిన్నగోవిందు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని వీవర్స్కులానికి చెందిన ప్రసాద్, దళిత అరవింద(24)ను కులాంతర వివాహం చేసుకున్నాడు. ఆరు నెలల కలిసిబాగానే ఉన్నప్పటికి సీమంతం సమయంలో అరవిందను కులంపేరుతో భర్త వేధింపులకు గురిచేశాడు. మనస్తాపానికి గురైన అరవింద బుధవారం ఇంటి పైకప్పునకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి వెంకటేశులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎస్పీ జిల్లా నాయకులు వెంకటరాముడు, గంగాధర్, శివశంకర్‌లు మృతురాలి ఇంటికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. వివాహిత మృతికి కారకులైన భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
ఏపీ భవన్ సాక్షిగా బయటపడ్డ కులోన్మాదం
న్యూఢిల్లీ : ఏపీ భవన్ సాక్షిగా కులోన్మాదం బయటపడింది. అధికారుల మధ్య వాట్స్ అప్ గ్రూపులో మాటల యుద్ధం మొదలైంది. దళిత, అగ్రవర్ణ వర్గాల అధికారులుగా ఏపీ భవన్ చీలిపోయింది. ఈనెల 17న తనకు పదోన్నతి దక్కకుండా కొందరు అగ్రకుల అధికారులు అడ్డుకున్నారని ఏపీ భవన్ దళిత ఉద్యోగి ఆనంద రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఏకే సింఘాల్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న సమయంలో 3 సహాయ కమిషనర్లు, ఒక జాయింట్ కమిషనర్ పోస్ట్ మంజూరు చేయాలని సిఫార్సు చేశారని, అయితే సహాయ కమిషనర్ పోస్టులు రెండుకు కుదించేలా అగ్రకుల అధికారులు ఒత్తిడి చేశారని, తద్వారా తనకు ఆ పదోన్నతి దక్కకుండా అడ్డుకున్నారని ఆనందరావు మెసేజ్ పెట్టారు. ప్రాప్తం లేనప్పుడు ఏమి చేసినా ఉపయోగం లేదని, క్షీరసాగర మధనంలో రాక్షసులు ఎంత కష్టపడ్డా ప్రాప్తం లేకపోయింది అని డిప్యూటీ కమిషనర్ సూర్యనారాయణ ఎద్దేవా చేస్తూ మెసేజ్ చేశారు. సూర్యనారాయణ మెసేజ్‌తో దళిత ఉద్యోగులు మనస్తాపం చెందినట్లు తెలిసింది. తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు దళిత ఉద్యోగి ఆనంద రావు ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. -
కారులో ఎక్కించుకుని.. కాళ్లు మొక్కించుకుని..
ముషీరాబాద్: తనను కులం పేరుతో దూషించడమే కాకుండా కారులో ఎక్కించుకుని నగరంలో తిప్పుతూ, కొట్టుకుంటూ కాళ్లు మొక్కించుకున్నారని, దాన్ని వీడియో కూడా తీశారని దోమలగూడకు చెందిన విద్యార్థి పల్లె భాగ్యరాజు మాదిగ తెలిపారు. బుధవారం విద్యానగర్‌లోని ఎంఆర్పిఎస్ కార్యాలయంలో జాతీయ కన్వీనర్ దేవయ్య మాదిగ, జన్ను కనకరాజు మాదిగలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 15న గాంధీనగర్ జగదాంబ ఆస్పత్రి వద్ద తన స్నేహితుడు రమేష్ కారు కుమార్ అనే వ్యక్తికి ఢీ కొనడంతో అతడికి గాయాలయ్యాయన్నాడు. వైద్య ఖర్చుల కోసం రూ.5వేలు ఇస్తానని రమేష్ చెప్పగా కుమార్ కుమారుడు శ్రీధర్‌రెడ్డి, అతడి స్నేహితులు రమేష్‌తో బలవంతంగా రూ.30వేలకు కాగితం రాయించుకున్నట్లు తెలిపాడు. రమేష్ వద్దకు రాగా వైద్య ఖర్చులు ఇస్తామని, కావాలంటే కేసు పెట్టుకోమని చెప్పానన్నాడు. దీంతో 17న రాత్రి శ్రీధర్‌రెడ్డి తనకు ఫోన్ చేసి చిక్కడపల్లిలోని మధురాలయ బార్ వద్దకు రమ్మని చెప్పాడన్నారు. అక్కడ శ్రీధర్‌రెడ్డి మరో ఆరుగురు వ్యక్తులు తనను బలవంతంగా కారులో ఎక్కించుకుని వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ దాడి చేశారని, కులం పేరుతో దూషించడమేగాక కాళ్లు మొక్కించుకుని దానిని వీడియో తీసినట్లు తెలిపాడు. తాను చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా మరుసటి రోజు రమ్మన్నారని, 18న ఎస్ఐ నాగుల్‌మీరా ఇద్దరితో మాట్లాడుదామంటూ రాజీ ధోరణిలో మాట్లాడారని తెలిపాడు. తన కేసు నమోదు చేయాలని, తనకు ఎఫ్ఐఆర్ కాపీ కావాలని కోరడంతో శ్రీధర్‌రెడ్డితో పాటు సాయికుమార్, రమేష్, మరో నలుగురిపై నమోదు చేసినట్లు చెప్పారు. నిందితులను అరెస్ట్ చేయాలి భాగ్యరాజుపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎంఆర్పిఎస్ జాతీయ కో ఆర్డినేటర్ దేవయ్య మాదిగ అన్నారు. నిజామాబాద్‌లో భరత్‌రెడ్డి చేసిన ఘోరం మరవకముందే నగరం నడిబొడ్డున ఓ దళిత విద్యార్థిపై అగ్రకులస్తులు దాడి చేయడం దారుణమన్నారు. న్యాయం కావాలని పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే పట్టించుకోని ఎస్ఐ నాగుల్‌మీరాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
నలుగురిపై అట్రాసిటి కేసు
శంషాబాద్ రూరల్: కులం పేరుతో దూషించిన నలుగురు వ్యక్తులపై పోలీసులు అట్రాసిటి కేసు నమోదు చేశారు. ఎస్ఐ అహ్మద్‌పాషా కథనం ప్రకారం.. నగరానికి చెందిన రాందాస్‌కు మండలంలోని పెద్దతూప్రలో వ్యవసాయం పొలం ఉంది. గ్రామానికి చెందిన ఎం.నర్సింహా కొంత కాలం పాటు ఆయన పొలంలో పనిచేశాడు. అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో రాందాస్ పనిలోనుంచి తొలగించాడు. దీంతో గ్రామానికి చెందిన జాన్‌రెడ్డి, అంజయ్య, కుమార్, సాయిలు, మరికొందరు వచ్చి రాందాస్‌ను కులంపేరుతో దూషించడమే కాకుండా బెదిరించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు బుధవారం నలుగురిపై అట్రాసిటి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.