న్యూఢిల్లీ : ఏపీ భవన్ సాక్షిగా కులోన్మాదం బయటపడింది. అధికారుల మధ్య వాట్స్ అప్ గ్రూపులో మాటల యుద్ధం మొదలైంది. దళిత, అగ్రవర్ణ వర్గాల అధికారులుగా ఏపీ భవన్ చీలిపోయింది. ఈనెల 17న తనకు పదోన్నతి దక్కకుండా కొందరు అగ్రకుల అధికారులు అడ్డుకున్నారని ఏపీ భవన్ దళిత ఉద్యోగి ఆనంద రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఏకే సింఘాల్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న సమయంలో 3 సహాయ కమిషనర్లు, ఒక జాయింట్ కమిషనర్ పోస్ట్ మంజూరు చేయాలని సిఫార్సు చేశారని, అయితే సహాయ కమిషనర్ పోస్టులు రెండుకు కుదించేలా అగ్రకుల అధికారులు ఒత్తిడి చేశారని, తద్వారా తనకు ఆ పదోన్నతి దక్కకుండా అడ్డుకున్నారని ఆనందరావు మెసేజ్ పెట్టారు.
ప్రాప్తం లేనప్పుడు ఏమి చేసినా ఉపయోగం లేదని, క్షీరసాగర మధనంలో రాక్షసులు ఎంత కష్టపడ్డా ప్రాప్తం లేకపోయింది అని డిప్యూటీ కమిషనర్ సూర్యనారాయణ ఎద్దేవా చేస్తూ మెసేజ్ చేశారు. సూర్యనారాయణ మెసేజ్‌తో దళిత ఉద్యోగులు మనస్తాపం చెందినట్లు తెలిసింది. తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు దళిత ఉద్యోగి ఆనంద రావు ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
Comments
Please login to add a commentAdd a comment