భూకబ్జాను అడ్డుకున్న దళితులపై హత్యాయత్నం | TDP Leaders Attacks On Dalit In Annamayya District, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

భూకబ్జాను అడ్డుకున్న దళితులపై హత్యాయత్నం

Published Tue, Oct 22 2024 6:14 AM | Last Updated on Tue, Oct 22 2024 9:52 AM

TDP Leaders Attacks On Dalit in  Annamaiya district

అన్నమయ్య జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు 

దాడిలో పలువురికి గాయాలు

ఓబులవారిపల్లె/రాజంపేట రూరల్‌: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెచ్చిపోతున్న టీడీపీ నేతలు సోమవారం అన్నమయ్య జిల్లాలో దళితులపై హత్యాయ­త్నానికి తెగబడ్డారు. భూకబ్జాను అడ్డుకు­న్నందుకు కర్రలతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. పెద్దఓరంపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 1150లో దాదాపు 221 ఎకరాల భూమిని పెరుమాళ్లపల్లె దళితవాడ గ్రామస్తులు తాతల కాలం నుంచి వినియోగించుకుంటున్నారు. చదును చేసుకుంటున్నారు. ఈ భూమిలో తమ­కు పట్టాలివ్వాలని గతం నుంచే అధికారుల్ని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల కాకర్లవారిపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు ఆ భూమిని అక్రమంగా ఆన్‌లైన్‌ చేయించుకున్నారు. సోమవారం జేసీబీ యంత్రాలతో చదును చేసి కబ్జా చేసేందుకు ప్రయ­త్నించారు. దీన్ని పెరుమాళ్లపల్లి దళితవాడ గ్రామ­స్తులు అడ్డుకున్నారు. దీంతో కాకర్లవా­రిపల్లికి చెందిన కస్తూరి వెంకటేష్‌నాయుడు తన అనుచరులతో కలిసి పథకం ప్రకారం తెచ్చు­కున్న కర్రలతో ఒక్కసా­రి­గా వారిపై విరు­చుకు­పడ్డారు. వీళ్లు తీవ్రంగా కొట్టడంతో పంట కృష్ణ­య్య, పంట నరసింహులు, మడగలం ప్రభు­దాస్, జనార్దన్, మరికొందరు గాయప­డ్డారు.

వీరిలో కృష్ణయ్య, నరసింహులు, ప్రభుదాస్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఓబులవారిపల్లె ఎస్‌ఐ మహేష్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కాకర్లవారిపల్లికి చెందిన కస్తూరి వెంకటేష్‌­నాయుడు, కస్తూరి ఉమా, కస్తూరి శివయ్య­నాయుడు, కస్తూరి కోటయ్య తదితరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 

ఈ భూములకు సంబంధించి సమన్వయం 
పాటించాలని, దాడులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని రైల్వేకోడూరు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

కార్యకర్తల కోసం ప్రాణమిస్తా.. మాజీ ఎమ్మెల్యే కొరముట్ల 
రైల్వేకోడూరు నియోజకవర్గంలోని వైఎ­స్సా­ర్‌సీపీ కార్యకర్తలకు సమస్యలొస్తే వాటి పరిష్కారం కోసం తన ప్రాణాలను సైతం అడ్డుపెడతానని మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు చెప్పారు. టీడీపీ నేతల హత్యాయత్నంలో తీవ్రంగా గాయపడిన రాజంపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతు­న్న వారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభు­త్వంలో ప్రజలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. భూ కబ్జాలు, దాడులు సర్వ­సాధారణం అయిపోయాయని వాపో­యారు. మహిళలకు సైతం రక్షణ లేకపో­వడం బాధిస్తుందన్నారు. టీడీపీ నాయ­కులు ఎస్సీలపై దాడి చేయటం హేయ­మైన చర్యగా అభిప్రాయ పడ్డారు. ఉన్న­త­స్థాయికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పా­రు. ఆయన వెంట పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఓబుల­వారిపల్లి మండల కన్వీనర్‌ వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి తదితరులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement