
ఆత్మహత్యకు పాల్పడ్డ అరవింద
సాక్షి, హిందూపురం అర్బన్ : కులం పేరుతో దూషించారని మనస్తాపం దళిత సామాజిక వర్గానికి చెందిన అరవింద (24) అనే వివాహిత బుధవారం ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ సీఐ చిన్నగోవిందు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని వీవర్స్‌కులానికి చెందిన ప్రసాద్, దళిత అరవింద(24)ను కులాంతర వివాహం చేసుకున్నాడు. ఆరు నెలల కలిసిబాగానే ఉన్నప్పటికి సీమంతం సమయంలో అరవిందను కులంపేరుతో భర్త వేధింపులకు గురిచేశాడు. మనస్తాపానికి గురైన అరవింద బుధవారం ఇంటి పైకప్పునకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి వెంకటేశులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎస్పీ జిల్లా నాయకులు వెంకటరాముడు, గంగాధర్, శివశంకర్‌లు మృతురాలి ఇంటికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. వివాహిత మృతికి కారకులైన భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment