కొందరూ నయం కానీ జబ్బులతో నరకయాతన అనుభవిస్తారు. వారికి సేవలు చేసే కుటుంబసభ్యులు సైతం వారి బాధను చూడలేక దేవుడు తీసుకుపోయినా బావుండేది అనేలా ఉంటుంది పరిస్థితి. అలా అని ఆత్మహత్య చేసుకుంటే నేరం కాబట్టి చట్టబద్దంగా చనిపోయేలా అనాయస మరణంకై కోర్టుని ఆశ్రయిస్తుంటారు. సమగ్ర స్థాయిలో విచారణ జరిపి తీర్పు ప్రకారం బాధితుడి సునాయస మరణానికి మార్గం సుగమం అవుతుందని తెలిసిందే. అలాంటి ఇబ్బందులు పడకుండా కనీసం వైద్య పర్యవేక్షణ కూడా లేకుండా చనిపోయేలా సార్కో అనే కొత్త 3డి-ప్రింటెడ్ 'సూసైడ్ పాడ్'ని తీసుకొచ్చింది ఓ స్విస్ కంపెనీ. ఇప్పుడూ ఈ పాడ్ కాస్త వివాదాస్పదమై హాట్‌టాపిక్‌గా మారింది.
లాస్ట్ రిసార్ట్ ఆర్గనైజేషనికి సంబంధించిన సహాయక సూసైడ్ గ్రూప్ ఎగ్జిట్ ఇంటర్నేషనల్ అనే స్విట్జర్లాండ్ సంస్థ ఈ సూసైడ్ పాడ్‌ని రూపొందించింది. దీన్ని సార్కోఫాగస్ లేదా సార్కోపాడ్ అని పిలుస్తారు. ఇందులో త్రీడి ప్రింటెడ్ అనే చిన్న ఛాంబర్‌లాంటి గది ఉంటుంది. దీన్ని నైట్రోజన్ వాయువుతో నింపేస్తారు. ఈ పాడ్‌లోకి వెళ్లిన వ్యక్తి ఎమర్జెన్సీ బటన్ నొక్కితే చాలు..క్రమంగా ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోయి క్షణాల్లో వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి చనిపోతాడు. చెప్పాలంటే పది నిమిషా వ్యవధిలో మనిషి చనిపోతాడు.
అయితే ఇప్పుడూ ఈ పాడ్ వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే గుర్తు తెలియని ఓ అమెరికన్ మహిళ సోమవారం స్విట్జర్లాండ్‌లో ఈ పోర్టబుల్, 3డి – ప్రింటెడ్ సూసైడ్ పాడ్‌ని ఉపయోగించి ప్రాణాలను తీసుకుంది. ఈ ఘటన స్విస్ – జర్మన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న మెరిచౌసెన్ ప్రాంతంలోని అటవీప్రాంతంలో చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. అంతేగాదు ఆమె ఆత్మహత్యకు సహకరించిన వారందర్నీ అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అయితే లాస్ట్ రిసార్ట్ సహ-అధ్యక్షుడు ఫ్లోరియన్ విల్లెట్ ఈ ఘటనకు ప్రతక్ష సాక్షి. అతడు ఆ మహిళ మరణాన్ని వేగవంతంగా జరిగిన అత్యంత శాంతియుతమైన మరణంగా పేర్కొనడం గమనార్హం.
అలాగే సదరుబాధిత మహిళ తీవ్ర రోగ నిరోధక వ్యవస్థతో బాధపుడుతున్నట్లు సమాచారం. కానీ స్విట్జర్లాండ్‌లో సహాయక మరణం దశాబ్దలుగా చట్టబద్ధమే. అయితే దీన్ని వైద్యుని సహాయంతో చేయకూడదు. అందువల్లే ఇక్కడ ఇలా వైద్య పర్యవేక్షణ లేకుండా జస్ట్ బటన్ నొక్కి ఆపరేట్ చేసే ఈ పాడ్‌పై పలు సంశయాలు వ్యక్తమయ్యాయి.
నెదర్లాండ్స్‌లో వైద్య సహాయంతో కూడిన అనాయస మరణం చట్టబద్ధమైతే.. స్విస్ చట్టం మాత్రం ఇలాంటి అనాయసాన్ని పూర్తిగా నిషేధిస్తుంది. అలాగే స్విస్ ఆరోగ్య మంత్రి ఎలిసబెత్ బామ్-ష్నైడర్ ఈ సార్కోపాడ్ ఆమోదానికి సంబంధించి పలు అనుమానాలు లేవెనెత్తారు. ఇలాంటి పాడ్‌లను వినియోగానికి అనుమతించకూడదని, రసాయనాల చట్టం ప్రకారం నైట్రోజన్ వాడకం సరైనది కాదనేది స్విస్ ఆరోగ్య మంత్రి వాదన. ఏదీఏమైనా ఇలాంటి వాటి వల్ల బాధలేని అనాయాస మరణం వస్తుందన్నది ఎంత సరైనదో దీని వల్ల దుష్పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం లేదనేది కఠిన సత్యం కదూ..!
(చదవండి: పని ఒత్తిడి పనిపడదాం..! హ్యాపీ వర్క్‌ప్లేస్‌గా మార్చేద్దాం ఇలా..!)
Comments
Please login to add a commentAdd a comment