బంజారాహిల్స్: ప్రేమించాడు... పెళ్లి చేసు కుంటానని నమ్మించి సహజీవనం చేశాడు.. .పెళ్లి చేసుకోవాలని కోరగా కులం తక్కువని నిరాకరించాడు. తనను మోసం చేసిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జవహర్‌నగర్‌కు చెందిన యువతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. 2009లో ఎస్‌ఆర్‌నగర్‌లో ఇంటర్ చదువుతున్న సమయంలో ఉదయ్‌శంకర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.
ఏడాదిగా వారు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో సహజీవనం చేసింది. ఈ నెల 6న పెళ్లి విషయమై ఒత్తిడి చేయగా ఆమె ఇంటికి వచ్చిన అతను తప్పకుండా పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులకు చెప్పి వెళ్లిపోయాడు. ఆ తెల్లవారే తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. బాధితురాలు ఫోన్ చేయగా నేను ‘ కులం కారణంగా నేను నిన్ను పెళ్లి చేసుకోలేనని ఓ సారి, అంత కట్నం మీరు ఇచ్చుకోగలరా అంటూ మరో సారి జవాబిస్తూ పెళ్లికి నిరాకరించాడు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment