కులం పేరుతో దూషణ.. ఆపై బాలుడిని మంటల్లో తోసేసిన తోటి విద్యార్థులు | Tamilnadu: Case Filed Three Students Caste Slur Minor Push Burning Garbage | Sakshi
Sakshi News home page

కులం పేరుతో దూషణ.. ఆపై బాలుడిని మంటల్లో తోసేసిన తోటి విద్యార్థులు

Published Wed, May 11 2022 7:53 PM | Last Updated on Wed, May 11 2022 8:33 PM

Tamilnadu: Case Filed Three Students Caste Slur Minor Push Burning Garbage - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చెన్నై: సమాజంలో జరుగుతున్న ఘోరాలలో వ్యక్తిని కులం పేరుతో  దూషించడం ఒకటి. గతంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా పెద్దల మధ్య చోటు చేసుకునేవి. ఇటీవల ఇవి పిల్లలకు కూడా పాకినట్లు ఉంది. తాజాగా ఒక విద్యార్థిని కొందరు విద్యార్థులు కులం పేరుతో దూషించారు. అంతటితో ఆగకుండా అతన్ని మంటల్లోకి తోసేశారు. ఈ హేయమైన ఘటన తమిళనాడులోని విలుపురం జిల్లాలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే....తిండివనం పట్టణంలోని కట్టుచివిరి ప్రభుత్వ పాఠశాలలో ఓ దళిత విద్యార్థి 6వ తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలానే ఆ బాలుడు స్కూల్ అయ్యాక తిరిగి ఇంటికి బయలుదేరాడు. అయితే అక్కడే చదువుతున్న ముగ్గురు అగ్ర కులానికి చెందిన విద్యార్థులు ఒంటిరిగా వెళ్తున్న అతడ్ని ఆటపట్టించారు. అంతటితో ఆగకుండా కులం పేరుతో కూడా దూషించారు. దీంతో వారి మధ్య వాగ్వివాదం రావడంతో వాళ్ళు ఆ బాలుడిని కాలుతున్న పొదల్లోకి తోసేశారు.

దీంతో ఆ విద్యార్థి కాలిన గాయాలతో ఇంటికి వెళ్ళాడు. ఒంటి పై గాయాలతో ఉన్న కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులు తల్లపోయారు. వెంటనే చికిత్స కోసం కుమారుడ్ని తిండివనం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చివరకి ఈ దారుణం ఎలా జరిగిందో తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు ఆ ముగ్గురి విద్యార్థుల పై పోలీసులకు ఫిర్యాడు చేశారు బాధిత విద్యార్థి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన పోలీసులు ముగ్గురు విద్యార్థులపై హత్యాయత్నంతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

చదవండి: షాకింగ్‌ వీడియోను పోస్ట్‌ చేసిన కిరణ్‌ బేడి... మండిపడుతున్న నెటిజన్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement