అక్కడ ఏం జరిగిందో మీరు చూశారా?.. గుడ్లవల్లేరు విద్యార్థులకు బెదిరింపులు | Police Threatened Students In The Name Of Investigation In Gudlavalleru | Sakshi
Sakshi News home page

అక్కడ ఏం జరిగిందో మీరు చూశారా?.. గుడ్లవల్లేరు విద్యార్థులకు బెదిరింపులు

Published Sat, Aug 31 2024 4:05 PM | Last Updated on Sat, Aug 31 2024 4:40 PM

Police Threatened Students In The Name Of Investigation In Gudlavalleru

గుడ్లవల్లేరులో విచారణ పేరుతో విద్యార్థులపై పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారు.

సాక్షి, విజయవాడ: గుడ్లవల్లేరులో విచారణ పేరుతో విద్యార్థులపై పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారు. మేం చెప్తుంటే మీరెందుకు వినడంలేదంటూ విద్యార్థులు నిరసన చేయడంపై పోలీసులు వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఎస్పీ అధికారి వచ్చి చెప్తున్నా మీకు అర్థం కావడం లేదా?. తిండి తిప్పలు లేకుండా పడి ఏడుస్తున్నామంటూ చిందులు తొక్కుతున్నారు.

మీరు ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది.. మీకు బాధ్యత లేదా అంటూ పోలీసులను విద్యార్థులు ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా విద్యార్థులపై ఆగ్రహించిన మహిళా పోలీస్వీ డియో రికార్డ్ చేయడం నువ్వు చూశావా..? మీ దగ్గర వీడియో ఉందా?. నువ్వు కళ్లతో చూశావా..? కళ్లతో చూస్తేనే నమ్మాలి..?. అక్కడ ఏం జరిగిందో నువ్వు చూశావా..?.  అంటూ న్యాయం కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement