gudlavalleru
-
గుడ్లవల్లేరు ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుడ్లవల్లేరు ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఘటనలో వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాలను అమర్చి వీడియోలను చిత్రీకరించడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఎన్నో రోజులుగా వ్యవహారం జరుగుతున్నా బయటకెందుకు రాలేదని ప్రశి్నంచింది. అర్థరాత్రి వరకూ విద్యార్థినులు ధర్నా చేయడం.. ఘటనపై వివిధ పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈ విషయం తమ దృష్టికి వచి్చనట్లు ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది.పత్రికా కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసినట్లు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీచేసింది. విద్యార్థినుల వీడియోలను రహస్య కెమెరాలతో రికార్డ్ చేసి, వాటిని అమ్మడం వంటి వ్యవహారాలు జరగడం అత్యంత దుర్మార్గమంటూ మండిపడింది. ఈ విషయంలో కళాశాల యాజమాన్యం ఎందుకింత నిర్లక్ష్యంగా ఉందని తీవ్రస్థాయిలో ప్రశి్నంచింది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలంటూ ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సైతం తమకు వివరించాలని అందులో పేర్కొంది. -
‘గుడ్లవల్లేరు’లో ఏం జరగలేదట!.. మీడియాపై లోకేష్ చిందులు
సాక్షి, కృష్ణా జిల్లా: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఏం జరగలేదంటూ మీడియాపై మంత్రి నారా లోకేష్ చిందులు తొక్కారు. విచారణ జరగక ముందే ఆ కాలేజీ ఏం జరగలేదని ఆయన తేల్చేశారు. ఈ విషయాన్ని సెన్సేషన్ చేయొద్దని మీడియాకు వార్నింగ్ కూడా ఇచ్చేశారు. ‘‘గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్ కెమెరాలు లేవు. ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదు. విద్యాశాఖ మంత్రిని కాబట్టే నా మీద ఫోకస్ పెట్టారు. కావాలని రచ్చ చేస్తున్నారు’’ అని మీడియా ప్రతినిధులపై లోకేష్ ఆగ్రహం వెళ్లగక్కారు.మరోవైపు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాలికల వాష్ రూమ్‌ల్లో రహస్య కెమెరాల వ్యవహారంలో యాజమాన్యం, చంద్రబాబు ప్రభుత్వం దొంగాటపై ప్రజలు, మేధావులు మండిపడుతున్నారు. విద్యార్థినుల ఆరోపణల్లో వాస్తవాలు తెలుసుకుని, మనోధైర్యం నింపాల్సిన యాజమాన్యం, ప్రభుత్వం ఎందుకు నిర్బంధంగా వ్యవహరిస్తున్నాయి? అనే దానిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.కాగా, ప్రతిపక్ష నేతను పట్టుకుని వాడు, వీడు అంటూ వెకిలిగా మాట్లాడే హోంమంత్రి అనిత గుడ్లవల్లేరు ఎందుకు వెళ్లలేకపోయారు?. చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో నడిచే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు ఈ వ్యవహారాన్ని వైఎస్సార్సీపీ మీదకు నెట్టేయడానికి ఎందుకు ప్రయత్నించాయి? ఇది ఎవరి ప్రయోజనం కోసం? అని ప్రశ్నిస్తున్నారు.కాలేజీ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారనే ఇంగితం కూడా ఎల్లో బ్యాచ్‌కు లేకపోవడం శోచనీయం కాదా? రాష్ట్రంలో ఐపీఎస్‌లపై కక్షసాధింపులకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికి వదిలేసిందనేది వాస్తవం కాదా?అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
గుడ్లవల్లేరు విద్యార్థులను బెదిరించిన ఎస్ఐ శిరీష బదిలీ
-
రాజ్యమా...సిగ్గుపడు పెను ప్రమాదంలో ఏపీ మహిళల మానప్రాణాలు
-
రహస్య కెమెరాలు.. ఆధారాలు మాయం!.. బయటపడుతున్న గుడ్లవల్లేరు గుట్టు
-
గుడ్లవల్లేరు కాలేజీ యాజమాన్యం దాష్టీకం
సాక్షి, కృష్ణా జిల్లా: వేలాది మంది విద్యార్థినులు చదువుతున్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వాష్ రూమ్‌లలో రహస్య కెమెరాలు అమర్చిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. గుడ్లవల్లేరు కాలేజీ యాజమాన్యం దాష్టీకానికి దిగింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై భౌతిక దాడికి పాల్పడింది. మీడియా సిబ్బందిపైనా కాలేజీ యాజమాన్యం దాడి చేసింది. సాక్షి ప్రతినిధి సురేంద్రపై కాలేజీ యాజమాన్యం దాడికి దిగింది. విద్యార్థినులకు అండగా నిలబడుతున్నారనే అక్కసుతో దాడి చేసింది.వాష్ రూమ్‌లో రహస్య కెమెరాలు అమర్చి వీడియోలను చిత్రీకరించారంటూ విద్యార్థినులు గురువారం రాత్రి నుంచి నిద్రాహారాలు లేకుండా తల్లడిల్లుతుండగా.. అర్ధరాత్రి హాస్టల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేసి పోలీసులు గుట్టుగా తనిఖీలు నిర్వహించడం.. స్నానాల గదిలో షవర్లు ఊడదీసి తరలించడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది.సీక్రెట్ కెమెరాలపై ఓ విద్యార్థిని వారం క్రితమే ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం... ఎదురు కేసులు పెడతామని బెదిరించడం.. సాహసించి మీరు ఫిర్యాదు చేసినా ఉదయానికల్లా ఆ వార్త ఫేక్ న్యూస్ అవుతుందని విద్యార్థులను వార్డెన్ హెచ్చరించడం.. మర్నాడు ఉదయం అధికారులు కూడా అది ఫేక్ న్యూస్ అని తొలుత బుకాయించడం గమనార్హం. ఇంత దారుణంజరిగితే సమస్యను చిన్నదిగా చూపేందుకు ప్రభుత్వ పెద్దలు యత్నించడం నివ్వెరపరుస్తోంది. దాదాపు 1,500 మంది విద్యార్థినులు ఉంటున్న చోట జరిగిన ఈ దారుణం వెనుక అధికార పార్టీకి చెందిన ముఖ్యులు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. -
రెడ్ ఐ పై కన్నెర్ర చేద్దాం!
‘గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్ బాత్రూంలో 29వ తేదీ సాయంత్రం హిడెన్ కెమెరా పట్టు బడింది’. రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన ఇది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అసాంఘిక కార్యకలాపాలకు దుర్వినియోగం చేస్తున్న వాళ్లు కూడా విద్యావంతులే. ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు వ్యవస్థ మొత్తం నిద్రలేవడం, ఆ తర్వాత మర్చిపోవడమే జరుగుతోంది. స్పై కెమెరాల దుర్వినియోగం మీద నిఘా వ్యవస్థ రోజూ పని చేయాల్సిందేనన్నారు ‘యాంటీ రెడ్ ఐ’ యాక్టివిస్ట్ వరలక్ష్మి. ఈ డేగకన్ను గురించి సామాన్యుల్లో అవగాహన కల్పించడానికి సినిమా హాళ్లలో ప్రకటనల రూపంలో స్పై కెమెరాలు ఎన్ని రకాలుగా అమర్చే అవకాశం ఉంటుందో బొమ్మలతో చూపిస్తూ న్యూస్ రీల్ వేయాలన్నారు. తరచూ తనిఖీలు తప్పనిసరి! విద్యాసంస్థలకు అనుమతులిచ్చేటప్పుడే అమ్మాయిలు, అబ్బాయిల హాస్టల్ భవనాలు ఏ దిశలో ఉన్నాయి. రెండు భవనాల్లో బాత్రూమ్లు ఒకరికొకరు కనిపించని విధంగా నిర్మాణం ఉండాలి. షీ టీమ్స్, భరోసా టీమ్ సభ్యులు ప్రతి విద్యాసంస్థ నుంచి కొందరు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఉమెన్ క్యాడెట్లను సమీకరించి వర్క్‌షాపులు నిర్వహించాలి. ఆ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు తమ విద్యాసంస్థలో వర్క్‌షాపులు నిర్వహిస్తూ స్పై కెమెరాలను గుర్తించడం, గుర్తించిన వెంటనే ఇంటర్నల్ కమిటీలకు తెలియచేయడం మీద చైతన్యవంతం చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ పట్టణం, నగరంలోని విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, హాస్పిటళ్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్‌లో తనిఖీలు చేసి ‘ఫలానా తేదీన, ఫలానా టైమ్‌లో తనిఖీ జరిగింది. అసాంఘికంగా ఎటువంటి స్పై కెమెరాలు లేవు’ అనే స్టిక్కర్ అతికించాలి. స్పై కెమెరాను గుర్తిస్తే ఆ విద్యాసంస్థ, వ్యాపార సంస్థ ఏదైనా సరే తక్షణమే మూసివేయడం, యజమాని మీద నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం వంటి కఠినచర్యలు ఉండాలి. రోజూ నగరంలో ఏదో ఒక చోట తనిఖీలు జరుగుతుంటే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు కళ్లెం పడుతుంది. వ్యాపార సంస్థల ప్రకటనల హోర్డింగ్‌లో స్పై కెమెరా లోగో, ‘మహిళల భద్రత మా బాధ్యత’ అనే క్యాప్షన్ ముద్రించడం తప్పనిసరి చేయాలి. స్పై కెమెరాలు లక్షల్లో అమ్ముడవుతున్నాయి! స్పై కెమెరాల అమ్మకం మీద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్పై కెమెరా కొంటున్న వారి ఆధార్ నంబరు, స్పై కెమెరా కొంటున్న అవసరం ఏమిటో స్పష్టంగా తెలియచేయాలనే నిబంధన పెట్టాలి. ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో లోకల్ కమిటీలున్నాయి. జిల్లా కలెక్టర్, షీ టీమ్స్ సేవలను విస్తృతం చేయడంతోపాటు బాధితులు సమాచారం అందించడానికి జిల్లాకో ఫోన్ నంబరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. అప్పుడే ఇలాంటి దుశ్చర్యలకు అడ్డుకట్ట పడుతుంది. కెమెరా లేదనే భరోసానిద్దాం! హెవెన్ హోమ్స్ సొసైటీ ద్వారా ఆపదలో ఉన్న అమ్మాయిలను రక్షించడం, వారికి సాధికారమైన ఉ΄ాధి కల్పించడం, వివిధ సామాజికాంశాలపై అవగాహన కోసం సదస్సులు, శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ‘యాంటీ రెడ్ ఐ’ పేరుతో స్పై కెమెరాల మీద యుద్ధం మొదలు పెట్టాం. ఈ దుర్మార్గాన్ని అరికట్టడానికి ఒక నియమావళిని రూపొందించాను. ఆ సూచనలతో తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15న స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా మహిళల భద్రత కోసం ‘నో హిడెన్ కెమెరా ఇన్సైడ్’ అనే ప్రోగ్రామ్ మొదలు పెట్టింది. సీసీటీవీలున్న చోట ‘మీరు సర్వేలెన్స్ కెమెరా నిఘాలో ఉన్నారు’ అనే హెచ్చరిక ఉన్నట్లే... ‘స్పై కెమెరా లేదా హిడెన్ కెమెరా లేదు, మీరు ధైర్యంగా ఉండవచ్చు’ అని భరోసా కలిగించే క్యాప్షన్ కూడా ఉండాలి. నిర్భయ నిధులు ప్రతి రాష్ట్రానికీ విడుదలవుతుంటాయి. కానీ ఖర్చు చేయకుండా ఉండి పోతుంటాయి. ఆ నిధులను ఇలా సద్వినియోగం చేయాలి. – అడపా వరలక్ష్మి, సామాజిక కార్యకర్త – వాకా మంజులారెడ్డి,సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అక్కడ ఏం జరిగిందో మీరు చూశారా?.. గుడ్లవల్లేరు విద్యార్థులకు బెదిరింపులు
సాక్షి, విజయవాడ: గుడ్లవల్లేరులో విచారణ పేరుతో విద్యార్థులపై పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారు. మేం చెప్తుంటే మీరెందుకు వినడంలేదంటూ విద్యార్థులు నిరసన చేయడంపై పోలీసులు వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఎస్పీ అధికారి వచ్చి చెప్తున్నా మీకు అర్థం కావడం లేదా?. తిండి తిప్పలు లేకుండా పడి ఏడుస్తున్నామంటూ చిందులు తొక్కుతున్నారు.మీరు ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది.. మీకు బాధ్యత లేదా అంటూ పోలీసులను విద్యార్థులు ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా విద్యార్థులపై ఆగ్రహించిన మహిళా పోలీస్వీ డియో రికార్డ్ చేయడం నువ్వు చూశావా..? మీ దగ్గర వీడియో ఉందా?. నువ్వు కళ్లతో చూశావా..? కళ్లతో చూస్తేనే నమ్మాలి..?. అక్కడ ఏం జరిగిందో నువ్వు చూశావా..?. అంటూ న్యాయం కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘అందరినీ పంపించాక ఎవరిని విచారిస్తారు?’
కృష్ణా, సాక్షి: రహస్య కెమెరా ఉదంతంతో వార్తల్లోకెక్కిన గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు నిన్న తాత్కాలికంగా ఆందోళన విరమించగా.. ఇవాళ మరోసారి ఆందోళన చేపడతారేమోననే అనుమానంతో కాలేజ్ యాజమాన్యం భయపడింది. విషయాన్ని పక్కదారి పట్టించేందుకు.. హాస్టల్ నుంచి విద్యార్థులను పంపించేస్తోంది.ఈ క్రమంలో విద్యార్థులు ఎదురుతిరగారు. అందరినీ బయటకు పపించాక ఎవరిని విచారణ చేపడతారని యాజమాన్యాన్ని నిలదీశారు. తాము హాస్టల్లోనే ఉంటామని భీష్మించుకుని కూర్చుకున్నారు. మరోవైపు.. విషయం తెలిసి విద్యార్థి సంఘాలు కాలేజీ బయట ఆందోళనకు దిగాయి. విద్యార్థులను తరలించేందుకు ఏర్పాటు చేసిన బస్సులను అడ్డుకుని నిరసన చేపట్టాయి. వాళ్లను ఎక్కడికి తరలిస్తున్నారని నిలదీశారు.ఇదీ చదవండి: రాక్షస రాజ్యంలో 'గుడ్ల' గూబలు! -
వీడియోలు లీక్ ఘటన.. పక్కదారి పట్టించే కుట్ర
-
300 మంది అమ్మాయిల వీడియోలు లీకైతే పట్టించుకోము.. ముంబై నటికీ మాత్రం న్యాయం చేస్తాం
-
కళాశాలలో కీచకులు
-
విచారణ చేయకుండానే.. ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం
-
గుడ్లవల్లేరు ఘటన.. విద్యార్థుల మాన ప్రాణాలతో ఆటలా?: శివశంకర్
సాక్షి, గుంటూరు: గుడ్లవల్లేరు ఘటనపై ప్రభుత్వ ఘోర వైఫల్యం కనిపించిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. వాష్ రూముల్లో కెమెరాలు పెట్టినట్టు విద్యార్థినులు గుర్తించి ఫిర్యాదు చేసినా కాలేజీ యాజమాన్యం ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.‘‘పోలీసులు వెంటనే స్పందించలేదు. లక్షలాది రూపాయలు ఫీజులు తీసుకుని విద్యార్థినుల మానంతో ఆటలాడుకుంటారా?. అనేక ఐఐటీల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెయ్యి మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయితే నో పోలీస్. గుడ్లవల్లేరులో రాత్రి నుంచి విద్యార్థినులు ఆందోళన చేస్తుంటే నో పోలీస్. గుడ్లవల్లేరు వెళ్లటానికి హోంమంత్రికి తీరిక లేదా?. సకల శాఖా మంత్రి లోకేష్ ఏం చేస్తున్నారు?’’ అంటూ శివశంకర్ ప్రశ్నించారు.‘‘విద్యార్థులను వేధించిన విజయ్ అనే యువకుడు జనసేన పార్టీ. అతని సోషల్ మీడియా పోస్టులు అన్నీ అవే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యావ్యవస్థ నాశనం అయింది. విద్యార్థుల మాన, ప్రాణాలను కాపాడాలి. పోలీసు విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. తర్వాత రెండు నిమిషాలకే కెమెరాలు లేవని పోలీసులు ఎలా ప్రకటించారు?. రెండు నిమిషాల్లోనే విచారణ పూర్తి చేశారా?. విద్యార్థినుల ఆందోళన కనపడటం లేదా?. వెంటనే కాలేజీని మూసేసి పూర్తి స్థాయి విచారణ జరపాలి’’ అని శివశంకర్ డిమాండ్ చేశారు. -
Pedapalem: పచ్చని పల్లె.. కరోనాకు హడలే
గుడ్లవల్లేరు (గుడివాడ): ఇంటి పట్టునే ఉంటే కరోనా సోకదని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో పెదపాలెం గ్రామస్తులు అదే మాటను కట్టుబాటుగా చేసుకున్నారు. ఊరి పట్టునే ఉంటే కరోనా సోకదని నిరూపిస్తున్నారు కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు శివారు పెదపాలెంలో 125 కుటుంబాలుండగా.. గ్రామ జనాభా 300కు పైగానే ఉంది. ఆకు పచ్చ చీర కట్టినట్టుగా ఉండే ఆ పల్లె కరోనా నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తూ.. మహమ్మారిని దరిచేరకుండా గ్రామస్తుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. పొలం పనులు చేసే సమయంలోనూ కరోనా నియమావళిని బాధ్యతగా పాటిస్తోంది. కఠిన నిబంధనలే శ్రీరామరక్షగా.. ఎలాంటి అవసరం ఉన్నా ఎవరూ ఊరు దాటి వెళ్లకూడదనే కఠిన నియమాన్ని పెట్టుకున్నారు. గ్రామం నుంచి బయటకు.. బయటి నుంచి గ్రామంలోకి ఎలాంటి రాకపోకలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. బంధుమిత్రులను కూడా ఊరిలోకి రానివ్వడం లేదు. తమ వారందరికీ ముందే ఈ విషయం తెలియజేశారు. తప్పనిసరి అవసరాల కోసం బయటకు వెళ్లినా నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నారు. గ్రామంలో ఉన్న వనరులతోనే ఆహార అవసరాలు తీర్చుకుంటున్నారు. గ్రామస్తులంతా అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతో కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు గ్రామంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఎవర్నీ రానివ్వటం లేదు ఎవర్నీ ఊరిలోకి రానివ్వడం లేదు. మేం కూడా ఊరు దాటి వెళ్లకుండా లాక్డౌన్ పెట్టుకున్నాం. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మాస్కులు, శానిటైజర్లను వాడుతున్నాం. – గుమ్మడి నరసింహారావు, గ్రామస్తుడు బయట అవసరాలకు మాత్రమే మా గ్రామం నుంచి దాదాపుగా ఎవరూ బయటకు వెళ్లడం లేదు. బయట అవసరాలకు తప్పనిసరి పరిస్థితుల్లో ఒకరిద్దరు మాత్రమే జాగ్రత్తలు పాటిస్తూ వెళ్తున్నారు. – విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్ శానిటేషన్ ఒక కారణమే... కరోనా వచ్చిన నాటి నుంచి పెదపాలెంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నాం. గ్రామస్తులు కట్టుబాట్లతోనే వైరస్‌కు దూరంగా ఉన్నారు. – కనుమూరి రామిరెడ్డి, కొండాలమ్మ ఆలయ చైర్మన్ ప్రజల సహకారంతోనే.. ప్రజలు ఇంటి పట్టునే ఉండటం వల్ల గ్రామంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా రాలేదు. చేతుల్ని శుభ్రం చేసుకోవటం, మాస్కులు ధరించటం, పారిశుధ్య పనులను చేపట్టడం ద్వారా కరోనాను కట్టడి చేస్తున్నాం. – ఓగిరాల వెంకటరత్నం, గ్రామ కార్యదర్శి -
అమెరికాలో కృష్ణాజిల్లా యువతి మృతి
-
అమెరికాలో కృష్ణాజిల్లా యువతి మృతి
సాక్షి, గుడ్లవల్లేరు: సెల్ఫీ సరదా మరో నిండుప్రాణాన్ని బలి తీసుకొంది. కోటి ఆశలతో సప్త సముద్రాలు దాటి వెళ్లిన యువతి నూరేళ్ళ జీవితాన్ని చిదిమేసింది. ఉన్నత చదువుల కోసం వెళ్ళిన కూతురిని జలరక్కసి మింగేయటంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అమెరికాలోని ఓ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి కృష్ణా జిల్లా యువతి దుర్మరణం చెందారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె కమల (27) గుడ్లవల్లేరులో ఇంజినీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్లారు. ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం కొలంబియాలో ఉద్యోగం చేస్తున్నారు. ఒహాయోలోని మేఫీల్డ్ హైట్స్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొస్తూ అట్లాంటా సమీపంలోని జలపాతం వద్ద ఆగారు. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృతి చెందారు. నాట్స్ సహకారంతో ఆమె మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చెన్నైలోని పెద్దకుమార్తె వద్దకు వెళ్లిన తల్లితండ్రులు విషయం తెలిసి తల్లడిల్లిపోతున్నారు.అందరినీ ఆప్యాయంగా పలకరించే కమల ఇక లేదన్నా విషయాన్ని కుటుంబ సభ్యులు ,గ్రామస్థులు జీర్ణించుకోలేకున్నారు. -
ప్యాసింజర్ రైలుకు తప్పిన ప్రమాదం
కృష్ణా జిల్లా: విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తున్న ప్యాసింజర్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. గుడ్లవల్లేరు మండలం వడ్లమానాడు వద్ద ప్యాసింజర్ రైలు, పట్టాలపై ఉన్న గేదెలను ఢీకొట్టడంతో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. అదృష్టం బాగుండి ప్రయాణికులకు ఏంకాలేదు. రైలు వేగం తక్కువగా ఉండటం వల్ల ప్రమాదం తప్పినట్లు రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటన గురించి రైల్వే అధికారులకు సమాచారమిచ్చారు. -
వంటనూనె ప్యాకెట్లో మాంస వ్యర్థాలు!
గాదేపూడి (గుడ్లవల్లేరు) : ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే జంతువులు, పక్షుల కళేబరాల వ్యర్థాలతో తయారు చేస్తున్న నకిలీ వంటనూనె, నెయ్యి ముఠాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఒక ప్రముఖ ఆయిల్ కంపెనీ పేరిట మార్కెట్లోకి విడుదలైన పొద్దుతిరుగుడు నూనె ప్యాకెట్లో పేగులు, కొవ్వు వ్యర్థాలు వచ్చిన సంఘటన కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం గాదేపూడి గ్రామంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన అప్పినీడి భాస్కరరావు చెబుతున్న మేరకు ఆయన కొనుగోలు చేసిన కిలో వంట నూనె ప్యాకెట్లో ఈ వ్యర్థాలు వచ్చాయి. ఈ విషయాన్ని శుక్రవారం ఆయన విలేకరులకు తెలిపారు. వడ్లమన్నాడులో ఓ దుకాణంలో కొని తెచ్చానన్నారు. ఇంటికొచ్చి కత్తిరించగా ఆయిల్ బాగా దుర్వాసన వచ్చిందని, దానిలో నుంచి పేగులు, కొవ్వు ముక్కలు పడ్డాయని తెలిపారు. నూనె రక్తం రంగులో ఎర్రగా ఉందన్నారు. ఆ వంటనూనెను వాడలేక పక్కన పెట్టేశామన్నారు. ఒక ప్రముఖ కంపెనీ పేరిట ముద్రించిన ఆయిల్ కవర్లను కల్తీ ముఠాలు ఉపయోగించుకున్నాయని స్థానికులు అనుమానిస్తున్నారు. ప్రముఖ కంపెనీ అయితే వినియోగదారులకు అనుమానం లేకుండా నమ్మకంతో కొనుగోలు చేస్తారని ఇలా అక్రమార్కులు తెగబడ్డారని చెబుతున్నారు. ఇంకా ఎన్ని బ్రాండెడ్ కంపెనీల పేర్లతో నకిలీ సంస్థలు ఇలాంటి ఘరానా మోసాలకు పాల్పడుతున్నాయోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫుడ్ కంట్రోల్, విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేసే కల్తీరాయుళ్ల గుట్టు బయటపడుతుందని కోరుతున్నారు. -
టీడీపీ నేతల వేధింపులపై వితంతువు ఫిర్యాదు
చిత్రం (గుడ్లవల్లేరు) : రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును తనకు ఇష్టమైన నాయకుడికి వేసినందుకు గుడ్లవల్లేరు మండలం చిత్రం గ్రామంలో బొప్పా రమాదేవి అనే వితంతువును టీడీపీ నేతలు వేధింపులకు గురి చేస్తున్నారు. దీనిపై బాధితురాలు సోమవారం కలెక్టర్, డీపీవోకు సోమవారం ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీకి ఓటేశాననే తనకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయం నుంచే తననరు ఇబ్బందులు పెడుతున్నారని ఆమె పేర్కొన్నారు. తన భర్త మూడేళ్ల కిందట జరిగిన ప్రమాదంలో చనిపోయారని తెలిపారు. పంచాయతీ పోరంబోకు ఇంటి స్థలం సెంటున్నర తమ కుటుంబానికి మిగిలిందని తెలిపారు. గ్రామంలోనే వేరే ప్రాంతంలో ఉన్న ఇంటి స్థలానికి చెందిన కరెంట్ బిల్లు, ఇంటిపన్ను రశీదును అడ్డం పెట్టి తన స్థలాన్ని చేజిక్కించుకునేందుకు తెగబడుతున్నారని ఆమె ఆరోపించారు. టీడీపీ నేతల ప్రోద్బలంతో ఇదే ఇంటికి సర్పంచ్ లెటర్‌ను కూడా ఇచ్చారని చెప్పారు. తన స్థలాన్ని కాజేసేందుకు టీడీపీ నేత ఒకరు గట్టిగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారులు జోక్యం చేసుకుని తన ఇంటి స్థలాన్ని తనకు అప్పగించాలని ఆమె కోరుతున్నారు. -
లెవల్ క్రాసింగ్‌ల వద్ద భయం.. భయం
గుడ్లవల్లేరు మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న రైల్వే లెవల్ క్రాసింగులు ప్రమాదభరితంగా మారాయి. వీటి వద్ద రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రజలు భయంభయంగా రాకపోకలు సాగిస్తున్నారు. మామిడికోళ్ల - కౌతవరం, గాదేపూడి, గుడ్లవల్లేరు బీరయ్య చెరువు డొంక రోడ్డు, నాగవరం, వడ్లమన్నాడు గ్రామాల్లో ఈ రైల్వేక్రాసింగ్‌ల వద్ద రైళ్లు ఢీకొని పశువులు చనిపోతున్నాయి. అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. - , గుడ్లవల్లేరు -
హెల్త్ అసిస్టెంట్ల ఆకలి కేకలు
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : గ్రామీణ ప్రజలకు ఏ చిన్న అనారోగ్యం తలెత్తినా అందుబాటులో ఉండి మందులు ఇచ్చేదిమల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లే. అయితే జిల్లాలో పనిచేస్తున్న 165 మంది హెల్త్ అసిస్టెంట్ల కుటుంబాలు ఏడు నెలలుగా ఆకలితో అలమటిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యమే తమ దుస్థితికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. ప్రజావాణి వంటి కార్యక్రమాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ బడ్జెట్‌ను తమ శాఖలో పనిచేస్తున్న ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులకు కేటాయిస్తున్నారని, ఫలితంగా తాము పస్తులు ఉండాల్సిన పరిస్థితి తలెత్తిందని పేర్కొంటున్నారు. డెరైక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ త్రైమాసిక బడ్జెట్లో తమ వేతనాలకు నిధులు కేటాస్తారని, అవి చాలకపోతే జిల్లా బడ్జెట్లో మిగిలిన నిధుల్ని కేటాయించి ఒక్కొక్కరికి నెలకు రూ.17 వేల చొప్పున జీతం ఇవ్వాల్సి ఉందని, అయినా అమలు కావడం లేదని హెల్త్ అసిసెట్లు విమర్శిస్తున్నారు. మళ్లీ బడ్జెట్ వచ్చే వరకూ తమకు ఆకలి కేకలు తప్పవా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా డీఎం అండ్ హెచ్‌వో సరసిజాక్షిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా బడ్జెట్ లేకపోవటం వల్లనే జిల్లాలోని 165 మంది హెల్త్ అసిస్టెంట్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. అప్పు కూడా పుట్టడంలేదు ఏడు నెలలుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోతే కుటుంబం ఎలా గడవాలి. రోజూ ఇంటి నుంచి వచ్చి పని చేస్తున్నామే తప్ప పైసా వేతనం ఇవ్వడం లేదు. మా పిల్లల చదువులు ఫీజుల చెల్లించక అటకెక్కుతున్నాయి. మా స్థితి తెలిసి నిత్యావసరాల వస్తువులను కూడా ఎవరూ కూడా అప్పుగా ఇవ్వడం లేదు. - ఎస్.రమేష్, హెల్త్ అసిస్టెంట్, వడ్లమన్నాడు క్షేత్రస్థాయి వైద్యానికి దెబ్బ గ్రామీణ ప్రాంత ప్రజలకు జ్వరమొస్తే మందుబిళ్ల ఇవ్వాల్పిన బాధ్యత మాదే. మాకే జీతం ఇచ్చే దిక్కు లేకుండా పోతే ఎలా? ఇంటింటికీ వెళ్లి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయించేంది మేమే. ప్రభుత్వ పథకాలను నలుగురిలోకి తీసుకెళ్తున్న మాకే జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందిపెడుతోంది. - సిహెచ్.మహంకాళీరావు, హెల్త్ అసిస్టెంట్, కౌతవరం ఉద్యమం తప్పదు హెల్త్ అసిస్టెంట్లకు జీతాలు చెల్లిం చకుండా కాలం గడిపితే ప్రభుత్వంపై ఉద్యమం తప్పదు. సంక్రాంతి పండుగ జరుపుకోకుండా మా ఉద్యోగులను ఇబ్బంది పెట్టారు. మాట్లాడితే బడ్జెట్ రావాలంటున్నారు. మాకు కేటాయిం చిన బడ్జెట్‌ను ఏం చేశారు? ఆ బడ్జెట్లో మా వేతనాలు ఎందుకు ఇవ్వలేదు? - కోటా బుజ్జిబాబు, హెల్త్ అసిస్టెంట్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
పోస్ట్.. పోస్ట్
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : తంతి తపాలాశాఖలో మళ్లీ పూర్వవైభవం కనిపిస్తోంది. కంప్యూటర్లు, సెల్ఫోన్ల పుణ్యమా అని ఒక్కసారిగా దాదాపు కనుమరుగైన తపాలా సేవలు ఇప్పుడు కొంతమేరకు పుంజుకున్నారుు. ఈ సేవలపై గ్రామాల్లోని ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు సరికొత్త పద్ధతులు అందుబాటులోకి తీసుకురావడంతో సంస్థ వ్యాపార సంబంధాలు ఇటీవల బాగానే పెరిగారుు. స్పీడ్పోస్టులకు భలే డిమాండ్ సాంకేతిక విప్లవం రావటంతో స్పీడ్ పోస్టులు బాగా వాడుకలోకి వచ్చాయి. స్పీడ్‌పోస్టు దేశంలో ఏ మూలకైనా నిమిషాల్లో వెళ్లే పరిజ్ఞానం రావడంతో చాలామంది వీటిపై ఆధారపడుతున్నారు. స్పీడుపోస్టు ఎప్పుడు, ఎక్కడికి వెళ్లింది.. ప్రస్తుతం ఎక్కడుంది వంటి విషయూలను అధికారులు ఆన్లైన్లో చూసి చెప్పేస్తున్నారు. తక్కువ కమీషన్‌తో మనియూర్డరు గతంలో మనియార్డరు చేయాలంటే నూటికి ఐదు రూపాయల కమీషన్ తీసుకునేవారు. ఇందుకు రోజులు, వారాలు పట్టేది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మనియార్డరు, ఇన్స్టెంట్ మనియార్డర్లు అందుబాటులోకి వచ్చారుు. దేశంలో ఎక్కడికైనా నిమిషాల్లో పంపించే సాంకేతిక పరిజ్ఞానం పోస్టల్‌కు అందుబాటులోకి వచ్చింది. సుమారు రూ.50వేలకు కేవలం రూ. 120 కమీషన్‌తో ఇన్స్టెంట్ మనియార్డరు వెళ్లిపోతోంది. వీటితో పాటు బిజినెస్ పోస్ట్, ఎక్స్‌ప్రెస్ పార్శిల్, అడ్వర్టైజ్మెంట్ పోస్ట్, గ్రీటింగ్ పోస్ట్, సామాన్ల భట్వాడా పోస్టు, లాజిస్టిక్ పోస్టుతో పాటు వ్యాపార సేవలకు అనువైన సంస్థగా తపాలా శాఖ మారిపోరుుంది. తక్కువ ప్రీమియం-ఎక్కువ బోనస్ ‘పీఎల్ఐ’ 1884లో ప్రవేశపెట్టిన పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్ఐ)కు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఈ విధానం 1995లో గ్రామాల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఆ తరువాత జిల్లాలోని అవనిగడ్డ మండలాన్ని సంపూర్ణ పీఎల్ఐ మండలంగా ఇండియా పోస్టల్ గుర్తించింది. దీనిద్వారా ఏజెంట్ల పద్ధతి లేకుండా తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ కల్పించింది. ఇవికాక.. మనీ ట్రాన్స్ఫర్ సేవల ద్వారా ప్రపంచ దేశాల నుంచి మారుమూల ప్రాంతాల ప్రజలకు లబ్ధి చేకూరుతోంది. విద్య, వ్యాపారం, వివాహాలకు రికరింగ్ డిపాజిట్లు ఎంతో ఉపయోగపడుతున్నారుు. రూ.50కే రోజువారీ లావాదేవీలకు పోస్టల్ ఖాతాను తెరిచే అవకాశం అమలులో ఉంది. అన్ని పోస్టాఫీసులు ఏటీఎంలు కూడా ఇస్తున్నారుు. సేవింగ్స్ ఖాతాలకు ప్రజాదరణ అధికమైంది. టీటీడీ నుంచి శ్రీవారి అక్షింతలతో ఆశీర్వచనాన్ని కూడా రూ.11కే అందిస్తున్నారు.