‘అందరినీ పంపించాక ఎవరిని విచారిస్తారు?’ | AP Gudlavalleru Hidden Camera Incident: Student Union Protests At College, More Details Inside | Sakshi
Sakshi News home page

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు

Published Sat, Aug 31 2024 12:21 PM | Last Updated on Sat, Aug 31 2024 1:01 PM

AP Gudlavalleru Hidden Camera Incident: Student Union Protests At College

కృష్ణా, సాక్షి: రహస్య కెమెరా ఉదంతంతో వార్తల్లోకెక్కిన గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు నిన్న తాత్కాలికంగా ఆందోళన విరమించగా.. ఇవాళ మరోసారి ఆందోళన చేపడతారేమోననే అనుమానంతో కాలేజ్‌ యాజమాన్యం భయపడింది.  విషయాన్ని పక్కదారి పట్టించేందుకు.. హాస్టల్‌ నుంచి విద్యార్థులను పంపించేస్తోంది.

ఈ క్రమంలో విద్యార్థులు ఎదురుతిరగారు. అందరినీ బయటకు పపించాక ఎవరిని విచారణ చేపడతారని యాజమాన్యాన్ని నిలదీశారు. తాము హాస్టల్‌లోనే ఉంటామని భీష్మించుకుని కూర్చుకున్నారు. మరోవైపు.. విషయం తెలిసి విద్యార్థి సంఘాలు కాలేజీ బయట ఆందోళనకు దిగాయి. విద్యార్థులను తరలించేందుకు ఏర్పాటు చేసిన బస్సులను అడ్డుకుని నిరసన చేపట్టాయి. వాళ్లను ఎక్కడికి తరలిస్తున్నారని నిలదీశారు.

ఇదీ చదవండి: రాక్షస రాజ్యంలో 'గుడ్ల' గూబలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement