hidden camera
-
దొంగ కెమెరాలపై ఓ కన్నేద్దాం
టెక్నాలజీ యుగంలో వ్యక్తుల గోప్యత, భద్రతకు రక్షణ లేకుండా పోతోంది.రహస్య కెమెరాల ద్వారా వ్యక్తిగత జీవితాన్ని చిత్రీకరించి.. తద్వారా బ్లాక్మెయిల్ చేసే సంస్కృతి ఏటేటా పెరిగిపోతోంది. రహస్య కెమెరాలను గుర్తించడం కొంత కష్టమైనా.. అసాధ్యం మాత్రం కాదు. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు, లేదా నిత్యం సంచరించే ప్రాంతాల్లో కూడా వాటి పట్లఅలెర్ట్గా ఉండటం మేలు. కొంత జాగ్రత్త వహిస్తే రహస్య కెమెరాల కంట్లో పడకుండా సులువుగా తప్పించుకోవచ్చు. సాధారణంగా గదుల్లో రహస్య కెమెరాలు ఎక్కడెక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి » మంచం ఫ్రేములు, మంచానికి ఉండే హెడ్ బోర్డులలో.. » గోడ గడియారాలు, బల్బులు, లైట్ల స్విచ్‌బోర్డులు, ఇతర ఎలక్ట్రికల్ డివైజ్‌లలో.. » డ్రస్సింగ్ టేబుల్స్ అద్దాల్లో, ఇతర టేబుల్స్ పైన ఉండే వస్తువుల్లో.. » పిక్చర్ ఫ్రేమ్‌లు, వాల్ హ్యాంగింగ్, డెకరేటివ్ ఐటమ్స్, ప్లాంట్లలో.. » బాత్రూమ్లు, టాయ్లెట్లలో ఉండే డెకరేటివ్ ఐటమ్స్‌లో, షవర్ హెడ్స్, అద్దాల వెనుక.. » గది సీలింగ్ మూలల్లో.. కిటికీల ఫ్రేముల్లో, అనుమానాస్పదంగా కనిపించే వైర్లలో.. » డోర్ హ్యాండిల్స్,డోర్ బెల్స్, యూఎస్బీ చార్జింగ్ పాయింట్లు,స్రూ్కలు, క్లాత్ హ్యాంగర్లలో.. ఎలా గుర్తించాలిక్షుణ్ణంగా పరిశీలన: కొత్త రూమ్‌లోకి అడుగుపెట్టినప్పుడు లోపల అంతా క్షుణ్ణంగా పరిశీలించాలి. బెడ్రూమ్లోనూ, బాత్రూంలోనూ అసాధారణంగా ఉండే వస్తువులను పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వస్తువులను చెక్ చేయాలి: రోజువారీ వినియోగించే సామగ్రిలో రహస్య కెమెరాలు ఉంచే అవకాశం కూడా ఉంటుంది. స్విచ్ బోర్డులు, అద్దాల వెనక, స్మోక్ డిటెక్టర్లు ఉంటే వాటిలో, ల్యాంప్స్, డెకరేటివ్ వస్తువులను చెక్ చేయాలి. ఫ్లాష్ లైట్‌తో గుర్తింపు: రూమ్‌లో ముఖ్యంగా చీకటిగా ఉండే ప్రాంతాల్లో ఫ్లాష్ లైట్ వేయాలి. దీనివల్ల ఇతర వస్తువులపై పడే లైట్ కన్నా కెమెరాల లెన్స్‌పై పడిన లైట్ విభిన్నంగా ప్రతిబింబిస్తుంది. అలాగే రూమ్‌లో లైట్లు ఆర్పేసి ఫ్లాష్‌లైట్ ఆన్ చేస్తే రహస్య కెమెరాల నుంచి వచ్చే రిఫ్లెక్షన్ ద్వారా వాటిని గుర్తించవచ్చు. స్మార్ట్‌ఫోన్ యాప్స్: రహస్య కెమెరాల ఇన్ఫ్రారెడ్ లైట్‌ను గుర్తించే స్మార్ట్ ఫోన్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్స్‌ను వినియోగించడం ద్వారా రహస్య కెమెరాలను గుర్తించవచ్చు. ఆర్ఎఫ్ డిటెక్టర్స్: కెమెరాల నుంచి వచ్చే వైర్లెస్ సిగ్నల్స్‌ను పోర్టబుల్ రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్ఎఫ్) డిటెక్టర్స్ ద్వారా గుర్తించవచ్చు. ఇతర నిఘా పరికరాల ఫ్రీక్వెన్సీలను కూడా ఆర్ఎఫ్ డిటెక్టర్ల ద్వారా గుర్తించవచ్చు. వైర్లు, కేబుల్స్: సాధారణంగా ఉండే వైర్లు, కేబుల్స్ కాకుండా.. అనుమానాస్పదంగా ఉండే కేబుళ్లు, వైర్లను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇవి రహస్య కెమెరాలకు ఎలక్ట్రిసిటీని అందించేవి లేదా డేటా ట్రాన్స్ఫర్ చేసేవి కావచ్చు. వైఫై నెట్వర్క్ స్కానర్లు: పబ్లిక్ ప్లేసుల్లో ఉచితంగా లబించే వైఫై నెట్వర్క్ వినియోగించడం అంత మంచిది కాకపోయినా.. వైఫై స్కానర్ ఓపెన్ చేసి అనుమానాస్పదంగా ఉండే నెట్‌వర్క్‌లు కనిపిస్తే జాగ్రత్తగా ఉండటం మంచిది. భౌతిక పరిశీలన: రహస్య కెమెరాలు పెట్టే అవకాశం ఉన్న ప్రాంతాల్లో సున్నితంగా తట్టినప్పుడు అక్కడ డొల్ల శబ్దం కనుక వస్తే అనుమానించాలి. ఫోన్ ఇన్ఫ్రారెడ్ కెమెరా: మన ఫోన్ కెమెరా ఇన్ఫ్రారెడ్ కెమెరా అయితే.. దాని ద్వారా రహస్య కెమెరాలను గుర్తించవచ్చు. ఆ కెమెరాను ఓపెన్ చేసి రూమ్‌ను స్కాన్ చేస్తే చిన్న చిన్న బరస్ట్‌లు, ఫ్లాష్ లైట్ కనబడితే అక్కడ రహస్య కెమెరా ఉందని గుర్తించవచ్చు. రహస్య కెమెరాలను గుర్తించే కొన్ని యాప్స్ » హిడెన్ కెమెరా అండ్ డివైజ్ ఫైండర్: రహస్య కెమెరాలను వేగంగా, సులువుగా గుర్తించగలం అని యాప్ డెవలపర్లు చెబుతున్నారు. ఎలాంటి రహస్య కెమెరానైనా యాప్‌లో వైఫై, బ్లూటూత్ టెక్నాలజీతో గుర్తించవచ్చు. » హిడెన్ స్పై కెమెరా డిటెక్టర్: ఈ యాప్‌లో ఆల్ ఇన్ వన్ నెట్వర్క్ స్కానర్ ఉంది. దీనితో జీపీఎస్ ట్రాకర్లు, రహస్య కెమెరాలను వేగంగా గుర్తించే సామర్థ్యం దీని సొంతం. » హిడెన్ కెమెరా డిటెక్టర్– స్పై సీ: ఏదైనా అనుమానాస్పదంగా ఉన్న వస్తువు వద్దకు కెమెరాను తీసుకెళితే యాప్ ద్వారా దానిలో రహస్య కెమెరా ఉందో, లేదో గుర్తించవచ్చు. దీనికి అదనంగా దీనిలో మేగ్నెటోమీటర్ కూడా ఉంది. దీనితో కెమెరాలు, స్పీకర్ల నుంచి వెలువడే అయస్కాంత తరంగాలను సులువుగా గుర్తించవచ్చు. » హిడెన్ స్పై కెమెరా డిటెక్టర్: ఈ యాప్ రహస్య కెమెరాలను, ఇన్ఫ్రారెడ్ కెమెరాలను గుర్తించడానికి సహాయ పడుతుంది. » హిడెన్ కెమెరా డిటెక్టర్ ప్రో: రహస్య కెమెరాలనే కాకుండా, రహస్య మైక్రోఫోన్లను కూడా ఈ యాప్ ద్వారా గుర్తించవచ్చు. ఇన్ఫ్రారెడ్ కెమెరాలను గుర్తించడమే కాకుండా, యూజర్ల రక్షణ కోసం టిప్స్, మెలకువలు కూడా అందిస్తామని యాప్ చెబుతోంది. » హిడెన్ పిన్‌హోల్ కెమెరా డిటెక్టర్: రహస్యంగా రికార్డు చేసే కెమెరాల విషయంలో ఈ యాప్ యూజర్లను ముందస్తుగా అలెర్ట్ చేస్తుంది. నిఘాకు అనువుగా ఉండే ప్రాంతాల విషయంలో ముందస్తు హెచ్చరికలు చేస్తుంది. –ఏపీ సెంట్రల్ డెస్క్ -
భయమేస్తోంది.. చచ్చిపోవాలనిపిస్తోంది
సాక్షి, మచిలీపట్నం: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలోని బాలికల హాస్టల్ వాష్‌రూమ్‌లో హిడెన్ కెమెరాల ఏర్పాటు ఘటనలో ఒక్కొక్క విద్యార్థినిదీ ఒక్కొక్క ఆవేదన. బంధువుల ఎదుట కొందరు తమ బాధను వెళ్లగక్కుతుండగా.. మరికొందరు స్నేహితులకు చెప్పుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. తాజాగా శనివారం ఓ విద్యార్థిని తన స్నేహితురాలికి ఫోన్ చేసి బాధతో ఏడ్చిన వాయిస్ బయటకు వచ్చింది. అందులో విద్యార్థిని చెప్పిన మాటలను పరిశీలిస్తే.. ‘ఆ అక్క ఎవరో తెలిసిందే. ఫోర్త్ ఇయర్ ఈసీఈ. ఆ అక్క ఫొటో కూడా చూశాం. ఆ అక్క అంటోంది రండి చూసుకుందాం అని. విత్ ప్రూఫ్‌లు ఉన్నాయని తెగేసి చెబుతోంది.గ్రౌండ్ ఫ్లోర్, పై ఫ్లోర్లో ఏదేదో అంటున్నారే. భయం వేస్తోందే. రెండు నెలల నుంచి పెడుతున్నారట. 300 వీడియోలు బయటకు వచ్చాయంటా. అందరూ అడుగుతున్నారే భయం వేస్తోంది. మా ఫ్లోర్లోనూ పెట్టారట ఏడుపొస్తోంది. చచ్చిపోవాలనిపిస్తోందే బాబు. మేడంకు చెబితే బయటకు వస్తే డ్రగ్ కేసులో ఇరికిస్తామని అంటున్నారే. అలా.. ఇలా మాట్లాడుతున్నారే. రవీంద్రబాబేమో చూసి చెబుతాడంటే.. వీడియోస్ చూసినాక చెబుతాడంట. ఇప్పటికి 300 వీడియోలు బయటకు వచ్చాయని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు. సీనియర్స్ ఏమో గొడవ పెడుతున్నారు.మేడమ్, వార్డెన్స్ కర్రలు పట్టుకుని వెంటపడుతున్నారు. కానీ సీనియర్స్ చాలామంది ఏడుస్తున్నారే. రెండు నెలలనుంచి జరుగుతోదంట. అవతలేమో పొలిటీషియన్స్ అంట. మరి తెలియట్లా. అందుకనే భయపడుతున్నారు అడగటానికి. ప్లీజే ఎవరి దగ్గరైనా వీడియో ఉంటే ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తేనే మమ్మల్ని పట్టించుకుంటారంట. లేకపోతే పట్టించుకోరంట. అసలు ఏడుపొచ్చేస్తోంది మా ఫ్లోర్‌లోనే కెమెరా దొరికిందంటే. ఓసే వీడియో పెడితే ఏదైనా చేస్తారంటే. లేకపోతే ఏమీ చేయరంటే. అడుగుతుంటే కర్రలు పెట్టి కొడుతున్నారు. అంత ఉందే మా హాస్టల్లో సిట్యువేషన్. అందరూ ఏడుస్తున్నారు’ అంటూ ఆమె కూడా ఏడుస్తూ తన బాధను చెప్పుకుంది. -
‘అందరినీ పంపించాక ఎవరిని విచారిస్తారు?’
కృష్ణా, సాక్షి: రహస్య కెమెరా ఉదంతంతో వార్తల్లోకెక్కిన గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు నిన్న తాత్కాలికంగా ఆందోళన విరమించగా.. ఇవాళ మరోసారి ఆందోళన చేపడతారేమోననే అనుమానంతో కాలేజ్ యాజమాన్యం భయపడింది. విషయాన్ని పక్కదారి పట్టించేందుకు.. హాస్టల్ నుంచి విద్యార్థులను పంపించేస్తోంది.ఈ క్రమంలో విద్యార్థులు ఎదురుతిరగారు. అందరినీ బయటకు పపించాక ఎవరిని విచారణ చేపడతారని యాజమాన్యాన్ని నిలదీశారు. తాము హాస్టల్లోనే ఉంటామని భీష్మించుకుని కూర్చుకున్నారు. మరోవైపు.. విషయం తెలిసి విద్యార్థి సంఘాలు కాలేజీ బయట ఆందోళనకు దిగాయి. విద్యార్థులను తరలించేందుకు ఏర్పాటు చేసిన బస్సులను అడ్డుకుని నిరసన చేపట్టాయి. వాళ్లను ఎక్కడికి తరలిస్తున్నారని నిలదీశారు.ఇదీ చదవండి: రాక్షస రాజ్యంలో 'గుడ్ల' గూబలు! -
300 మంది అమ్మాయిల జీవితాలు నాశనం..
-
దూరదర్శన్ కేంద్రం: మహిళల బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం దూరదర్శన్ కేంద్రంలోని మహిళల బాత్రుమ్‌లో సీక్రెట్ కెమెరాను కనిపించింది. ఈ కెమెరాను ఆదివారం ఓ మహిళ గుర్తించగా.. ఈ విషయంపై దూరదర్శన్ అధికారులు బుధవారం పోలీసులను సంప్రదించారు. దీనిపై తిరువనంతపురం సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వన్ డ్రైవ్ రెస్టారెంట్ కేసులో వెలుగులోకి కొత్త విషయాలు కాగా ఆఫీసులో తాత్కాలిక ఉద్యోగిగా జాయిన్ అయిన ఓ వ్యక్తి ఈ రహస్య కెమెరాను అరేంజ్ చేసినట్లు తెలిసింది. కెమెరాను తీసేయడంతో పాటు అక్కడ పెట్టిన ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. మెయిన్ స్టూడియోకి సమీపంలోని వాష్‌రూమ్‌లో ఈ కెమెరాను అమర్చినట్లు పేర్కొన్నారు. అయితే పోలీసులతోపాటు ఈ విషయాన్ని దూరదర్శన్ కేంద్రంలోని మహిళా కమిటీ, క్రమశిక్షణా కమిటీ అధికారులు అంతర్గతంగా విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ వన్ డ్రైవ్ ఇన్ ఫుడ్‌కోర్టులోని మహిళల టాయిలెట్లో సెల్‌ఫోన్ పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారనే విషయం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫుడ్‌కోర్టుకు తన స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ యువతి రెస్ట్రూమ్కు వెళ్లింది. అక్కడి బాత్రూమ్లో కెమెరా ఆన్‌చేసిన సెల్‌ఫోన్‌ను గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. -
మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి..
కోల్‌కతా : మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన వ్యక్తిపై కఠిన చర్యలు చేపట్టాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా కలైచక్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహ్మద్ ఇమ్రాయుల్ కయేస్ అనే నిందితుడు తన పొరుగున ఉండే వివాహిత మహిళ ఇంట్లోని బాత్రూమ్లో రహస్య కెమెరాను ఏర్పాటు చేశాడు. బాధిత మహిళ స్నానం చేసే దృశ్యాలను ఈ కెమెరా రికార్డు చేయగా, సదరు దృశ్యాలను నిందితుడు ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఘటన వెలుగుచూసింది. బాధిత మహిళ కలైచక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితుడిపై ఇంతవరకూ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. మరోవైపు కేసు ఉపసంహరించుకోవాలని నిందితుడితో పాటు కుటుంబ సభ్యులు ఒత్తిడి తెస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. ఈ ఘటన జరగకముందు ఇరు కుటుంబాలు సన్నిహితంగా ఉండేవారని, ఈ చనువు కారణంగానే నిందితుడు బాధితురాలి వాష్‌రూమ్‌లో కెమెరా ఏర్పాటు చేశాడని పోలీసులు చెబుతున్నారు. -
ఫ్యాబ్ ఇండియా షోరూమ్ ఎండీ, సీఈవోకు సమన్లు జారీ
గోవా: గోవాలోని ఫ్యాబ్ ఇండియా షోరూమ్ లో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి ఎదురైన చేదు అనుభవం ఘటనకు సంబంధించి ఆ షోరూమ్ ఎండీ, సీఈవోలకు సమన్లు జారీ చేశారు. ఈ ఘటనపై స్మృతీ ఇరానీ ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తాజాగా ఆ షోరూమ్ కు సమన్లు జారీ చేశారు. దర్యాప్తులో భాగంగా మరో ఏడుగురి ఉద్యోగులపై కూడా సమన్లు అందాయి. త్వరలో వీరిని పోలీసులు ప్రశ్నించనున్నారు. అంతకుముందు ఈ కేసులో అరెస్టయిన నలుగురికి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. -
‘కెమెరా’ వివాదం ఎందుకు చల్లారింది?
స్మృతి వ్యవహారంలో బీజేపీ కావాలనే అంటీముట్టనట్టు వ్యవహరించిందా పణజి: గుడ్‌ఫ్రైడే రోజు దేశం దృష్టిని ఆకర్షించిన ఆ వివాదం ‘ఈస్టర్ సండే’కల్లా ఎందుకు చప్పున చల్లారింది? గోవాలోని ఫ్యాబ్ ఇండియా వస్త్ర దుకాణం ట్రయల్ రూంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రహస్య కెమెరాను గుర్తించడంతో రోజంతా దానిపైనే తీవ్ర చర్చ జరిగింది. ప్రసార సాధనాలు దీనికి అత్యంత ప్రాముఖ్యం ఇచ్చాయి. కానీ సొంత ఎంపీ, కేంద్రమంత్రికి ఈ చేదు అనుభవం ఎదురవడంపై బీజేపీ నాయకత్వం పెద్దగా స్పందించలేదు. ఈ వ్యవహారంలో అంటీముట్టనట్టుగానే వ్యవహరించింది. అదే రోజు (శుక్రవారం) బెంగళూరులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవడం ఇందుకు కారణమని మీడియాలో కథనాలు వచ్చాయి. సమావేశాలకు మీడియాలో దక్కాల్సిన ప్రాధాన్యాన్ని ఈ ‘కెమెరా’ వివాదం లాగేసుకుంటుందని భావించిన బీజేపీ.. కావాలనే దీనిపై అంతగా స్పందించలేదన్నది ఆ కథనాల సారాంశం. వాస్తవానికి శుక్రవారం స్మృతి ఇరానీ కండోలిమ్‌లోని ఫ్యాబ్ ఇండియాలో కెమెరాను గుర్తించగానే పోలీసులొచ్చి నలుగురు ఉద్యోగులను అరెస్టు చేశారు. షాపును సీజ్ చేశారు. కఠిన చర్యలు తీసుకుంటామంటూ గోవా సీఎం పార్సేకర్ దర్యాప్తునకు ఆదేశించారు. తెల్లారేసరికి సీన్ మారింది! కెమెరాల ఉదంతం వెలుగులోకి వచ్చిన తెల్లారే సీన్ మారింది. బీజేపీ సమావేశాలకు మీడియాలో ప్రాధాన్యం తగ్గిపోతుందని బీజేపీ నేతలు ఈ విషయానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడమే మంచిదని భావించారు. సీఎం పార్సేకర్ గొంతు సవరించుకున్నారు. ‘‘ రూంలోకి స్మృతి కంటే ముందు కొందరు మహిళలు వెళ్లారు. కావాలని కెమెరాలు పెట్టినట్టు లేదు. అనుకోకుండా అలా జరిగి ఉండొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. గోవా పేరును చెడగొట్టవద్దంటూ మీడియాకు ఉచిత సలహా ఇచ్చారు. ఆ తర్వాత సీన్లోకి బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి వచ్చారు. ఈ ఘటనలో బీజేపీ వైఖరిని ఆమె పరోక్షంగా బయటపెట్టారు. ‘‘పనికిరాని అంశాలను ముందుకు తీసుకువచ్చి పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా..’’ అని ఆమె ట్వీటర్లో పేర్కొన్నారు. గోవాలోనూ గప్‌చుప్.. అదే రోజు గోవాలో కూడా ఈ ఘటన ప్రాధాన్యాన్ని తగ్గించి వేసే పరిణామాలు చకచకా చోటుచేసుకున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నలుగురు ఫ్యాబ్ ఇండియా ఉద్యోగులకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.5వేల పూచీకత్తుతో వారికి బెయిలిచ్చింది. స్మృతి ఇరానీకి ఫ్యాబ్ ఇండియా క్షమాపణలు తెలిపింది. గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు దుకాణంపై సానుకూలంగా స్పందించారు. షాపు ప్రతినిధులు తమకు సహకరిస్తున్నారని, తమ ముందు హాజరయ్యేందుకు కొంత సమయం అడిగారని ప్రకటించారు. అలా వివాదం శనివారం కల్లా కోమాలోకి వెళ్లిపోయింది!