దూరదర్శన్‌ కేంద్రం: మహిళల బాత్రూమ్‌లో సీక్రెట్‌ కెమెరా | kerala: Hidden Camera Found In Woman Washroom at Doordarshan Centre | Sakshi
Sakshi News home page

Kerala: దూరదర్శన్‌ కేంద్రంలోని మహిళల బాత్రూమ్‌లో సీక్రెట్‌ కెమెరా

Published Thu, Nov 11 2021 4:38 PM | Last Updated on Thu, Nov 11 2021 5:43 PM

kerala: Hidden Camera Found In Woman Washroom at Doordarshan Centre - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం దూరదర్శన్‌ కేంద్రంలోని మహిళల బాత్రుమ్‌లో సీక్రెట్‌ కెమెరాను కనిపించింది. ఈ కెమెరాను ఆదివారం ఓ మహిళ గుర్తించగా.. ఈ విషయంపై దూరదర్శన్‌ అధికారులు బుధవారం పోలీసులను సంప్రదించారు. దీనిపై తిరువనంతపురం సైబర్‌ సెల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: వన్‌ డ్రైవ్‌ రెస్టారెంట్‌ కేసులో వెలుగులోకి కొత్త విషయాలు

కాగా  ఆఫీసులో తాత్కాలిక ఉద్యోగిగా జాయిన్ అయిన ఓ వ్యక్తి ఈ రహస్య కెమెరాను అరేంజ్ చేసినట్లు తెలిసింది. కెమెరాను తీసేయడంతో పాటు అక్కడ పెట్టిన ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. మెయిన్‌ స్టూడియోకి సమీపంలోని వాష్‌రూమ్‌లో ఈ కెమెరాను అమర్చినట్లు పేర్కొన్నారు. అయితే పోలీసులతోపాటు ఈ విషయాన్ని దూరదర్శన్ కేంద్రంలోని మహిళా కమిటీ, క్రమశిక్షణా కమిటీ అధికారులు అంతర్గతంగా విచారణ జరుపుతున్నారు.

ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ వన్‌ డ్రైవ్‌ ఇన్‌ ఫుడ్‌కోర్టులోని మహిళల టాయిలెట్‌లో సెల్‌ఫోన్‌ పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారనే విషయం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫుడ్​కోర్టుకు తన స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ యువతి రెస్ట్​రూమ్​కు వెళ్లింది. అక్కడి బాత్‌రూమ్‌లో కెమెరా ఆన్‌చేసిన సెల్‌ఫోన్‌ను గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement