Thiruvananthapuram
-
షారన్ రాజ్ హత్య కేసులో గర్ల్ ఫ్రెండ్ గ్రీష్మకు ఉరిశిక్ష
-
బాయ్‌ఫ్రెండ్‌ను చంపిన గ్రీష్మకు ఉరిశిక్ష.. కోర్టు సంచలన తీర్పు!
తిరువనంతపురం : ప్రియుడిని చంపిన కేసులో కేరళ కేరళ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. షరోన్ రాజ్ ప్రేయసి గ్రీష్మకు ఉరిశిక్ష విధించింది. తీర్పును వెలువరించే సమయంలో ‘ఈ కేసు అరుదైన కేసుల్లోనే అరుదైన కేసు. కాబట్టి ఈ కేసులో వయస్సును పరిగణలోకి తీసుకోకుండా నిందితురాలు గ్రీష్మకు ఉరిశిక్ష విధిస్తున్నాం’ అంటూ కేరళ సెషన్స్ కోర్టు తీర్పిచ్చింది. కేరళ పరసాలలో మూడేళ్ల కిందట(2022లో) సంచలనం సృష్టించిన షరోన్ రాజ్ హత్య కేసులో తిరువనంతపురం జిల్లా అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి శుక్రవారం(జనవరి 17న) షరోన్ ప్రేయసి గ్రీష్మను, ఆమె మేనమామ నిర్మలాకుమారన్ నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు దోషులుగా ప్రకటించారు. సోమవారం (జనవరి 20న) ప్రేయసి గ్రీష్మకు మరణశిక్షను విధిస్తూ తీర్పును వెల్లడించారు. షరోన్‌ను హత్య చేసేలా గ్రీష్మకు సహకరించడంతో పాటు కేసులో కీలక ఆధారాల్ని ధ్వంసం చేసినందుకు ఆమె మేనమామ నిర్మలా కుమారన్ నెయ్యట్టింకరకు మూడేళ్ల జైలు శిక్షను విధించారు. నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు షరోన్ రాజ్ హత్య కేసును అరుదైన కేసుల్లో అరుదైనదని,అందువల్ల నిందితురాలు గ్రీష్మకు ఉరిశిక్షే సరైందని భావిస్తున్నట్లు తెలిపింది.కాబట్టే వయస్సును పరిగణలోకి తీసుకోలేదని స్పష్టం చేసింది.సెషన్స్ కోర్టు తుదితీర్పు వెలువరించక ముందు గ్రీష్మ తరుఫులు న్యాయవాదులు కోర్టుకు తమ వాదనల్ని వినిపించారు. తన వాదనలలో గ్రీష్మ ఉన్నత విద్యావంతురాలు. చిన్న వయస్సు. తాను మారేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ కోర్టు డిఫెన్స్ లాయర్ వాదనల్ని తోసిపుచ్చారు. గ్రీష్మ తీరు దారుణంతీర్పు వెలువరించే సమయంలో అదనపు సెషన్స్ కోర్టు గ్రీష్మ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. లైంగిక సాన్నిహిత్యాన్ని సాకుగా చూపి షరోన్‌ను గ్రీష్మను ఆహ్వానించింది. ఆ తర్వాత విషం కలిపిన కషాయాన్ని షరోన్ రాజ్‌కు తాపించి, ఆపై దారుణానికి ఒడిగట్టిన గ్రీష్మా చర్యను విస్మరించలేమని పేర్కొంది.అంతేకాదు, షరోన్ కలిసేందుకు వచ్చిన గ్రీష్మా వెంటన విషం కలిపిన కషాయాన్ని తెచ్చుకుంది. ఆ కషాయంపై షరోన్ అనుమానం వ్యక్తం చేస్తూ వీడియో రికార్డ్ చేయడం, వద్దని గ్రీష్మ వద్దని వారించడం వంటి ఆధారాలు ఉన్నాయి. గ్రీష్మ ఇచ్చిన కషాయం తాగిన షరోన్ 11 రోజుల పాటు చుక్క నీరు కూడా తాగకుండా ప్రాణాలతో పోరాడాడు ’ అని కోర్టును ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. గ్రీష్మపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుభారతీయ శిక్షాస్మృతి (IPC) కింద గ్రీష్మపై ఐపీసీ సెక్షన్లు 302 (హత్య), 364 (హత్య చేయాలనే ఉద్దేశ్యంతో అపహరణ), 328 (ప్రాణానికి హాని కలిగించే ఉద్దేశ్యంతో విషం ప్రయోగించడం), 203 (తప్పుడు సమాచారం అందించడం ద్వారా న్యాయాన్ని అడ్డుకోవడం) కింద కేసులు నమోదయ్యాయి. అసలేం జరిగిందంటే..పరసాలా ప్రాంతానికి చెందిన షరోన్ రాజ్(23), గ్రీష్మలు కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. అయితే ఆమెకు మరో వ్యక్తితో వివాహాం నిశ్చయమైంది. ఆ తర్వాత షరోన్-గ్రీష్మల మధ్య దూరం పెరిగింది. వృత్తి రిత్యా వేరే ఊర్లో ఉంటున్న షరోన్.. అక్టోబర్ 10న షరోన్ పరసాలాకు వచ్చాడు. అక్టోబర్ 14న ఉదయం షరోన్‌కు ఫోన్ చేసింది. కలవాలని ఉందని.. బయటకు వెళ్దామని చెప్పింది. దీంతో తన స్నేహితుడితో కలిసి రామవర్మంచిరై(కన్యాకుమారి, తమిళనాడు)లో గ్రీష్మ ఇంటికి వెళ్లాడు షరోన్.స్నేహితుడు బయటే ఎదురుచూస్తుండగా.. ఒక్కడే ఇంట్లోకి వెళ్లాడు. అయితే.. కాసేపటికే పొట్టచేత పట్టుకుని వాంతులు చేసుకుంటూ బయటకు వచ్చాడు షరోన్. దీంతో కంగారుపడ్డ స్నేహితుడు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ దారిలోనూ ఇద్దరూ చాట్ చేసుకున్నారు. ‘‘కషాయంలో ఏం కలిపావు?’’ అని షరోన్ గ్రీష్మను నిలదీశాడు. అయితే తానేం కలపలేదని.. బహుశా వికటించిందేమో అని సమాధానం ఇచ్చిందామె. అక్కడితో వాళ్లిద్దరి ఛాటింగ్ ఆగిపోయింది.నీలిరంగులో వాంతులు చేసుకున్న షరోన్‌ను పరసాలా ప్రభుత్వాసుపత్రిలో చేర్చాడు స్నేహితుడు. ఆపై మెరుగైన వైద్యం కోసం తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే.. అక్కడ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు నార్మల్ రావడంతో.. ఇంటికి పంపించేశారు. రెండు రోజుల తర్వాత షరోన్ పరిస్థితి విషమించింది. దీంతో తిరిగి తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్సలో షరోన్‌కు లంగ్స్, కిడ్నీ ఒక్కొక్కటిగా దెబ్బ తింటూ వచ్చాయి. ఈలోపు షరోన్ నుంచి మెజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం సేకరించారు పోలీసులు. మరోవైపు వైద్యులు.. అతను తాగిన డ్రింక్‌లో పురుగుల మందు కలిసిందని నిర్ధారించుకున్నారు. అవయవాలన్నీ పాడైపోయి అక్టోబర్ 25వ తేదీన గుండెపోటుతో షరోన్ ప్రాణం విడిచాడు.ఎస్కేప్.. అరెస్ట్..తమ బిడ్డ చావుకు గ్రీష్మ కుటుంబం కారణమంటూ షరోన్ పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న ఆ కుటుంబం కోసం గాలించారు. చివరకు.. అదే ఏడాది నవంబర్ 22న గ్రీష్మ కుటుంబాన్ని అరెస్ట్ చేశారు. అయితే పీఎస్‌లో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించడం నాటకీయ పరిణామాలకు దారి తీసింది.వాదనలు ఇలా.. ఇది అత్యంత అరుదైన కేసు అని ప్రాసిక్యూషన్ వాదించారు. ఆమె కేవలం ఓ యువకుడ్ని మాత్రమే చంపలేదు. ప్రేమ అనే భావోద్వేగాన్ని ప్రదర్శించి ఓ ప్రాణం బలి తీసుకుంది. అనుకున్న ప్రకారమే.. ఆమె ప్రేమను అడ్డుపెట్టి మరీ అతన్ని తన ఇంటికి రప్పించి ఘోరానికి తెగబడింది. అతని చంపడానికి ఆమె అన్నివిధాల ప్రయత్నించింది. ఆస్పత్రిలో చికిత్స పేరిట 11 రోజులపాటు అతను నరకం అనుభవించాడు. ఇదేదో హఠాత్తుగా జరిగింది కాదు. షరోన్ కూడా ఎన్నో కలలు కన్నాడు. కానీ, గ్రీష్మ వాటిని చెరిపేసింది. కాబట్టి, ఆమెపై కనికరం చూపించాల్సిన అవసరం లేదు. ఆమెకు ఉరే సరి అని వాదించారు.మరోవైపు.. గ్రీష్మ తరఫున వాదనలు వినిపించిన లాయర్ అజిత్ కుమార్.. కేసులో వాస్తవ ఆధారాలు(Circumstantial Evidence) లేనప్పుడు మరణశిక్ష విధించడం కుదరని వాదించారు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో గ్రీష్మ ఆత్మహత్యకు ప్రయత్నించింది. వాస్తవానికి ఆమె షరోన్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది. కానీ, ఆ యువకుడు ఆమెను వదల్లేదు. వ్యక్తిగత చిత్రాలు చూపించి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. బెడ్రూం వీడియోలు బయటపెడతానని బెదిరించాడు. మానసికంగా ఆమెను ఎంతో వేధించాడు. అలాంటప్పుడు ఏ మహిళ అయినా ఎందుకు ఊరుకుంటుంది. ఆమె మెరిట్ విద్యార్థిని. శిక్ష విషయంలో కనికరం చూపించాల్సిందే’’ అని వాదించారు.దాదాపు రెండేళ్లపాటు ఈ కేసు విచారణ జరిగింది. చివరకు.. జనవరి 17వ తేదీన గ్రీష్మను, ఆమె మేనమామ నిర్మలాకుమారన్‌ను దోషులుగా నిర్ధారించింది. అదే సమయంలో గ్రీష్మ తల్లి సింధును నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. మూఢనమ్మక కోణం!మూఢనమ్మకంతో గ్రీష్మ కుటుంబం తమ బిడ్డ ప్రాణం తీసిందని షరోన్ కుటుంబం ఆరోపించింది. ఆమెకు ఎంగ్మేజ్మెంట్ అయ్యాక మనసు విరిగిన షరోన్.. తన పనిలో తాను ఉన్నాడని, గ్రీష్మానే ఫోన్ చేసి అతన్ని పరసాలాకు రప్పించిందన్నారు. ‘‘గ్రీష్మ కుటుంబానికి షరోన్ రాజ్ నచ్చలేదు. అందుకే మరో వ్యక్తితో ఆమెకు పెళ్లి ఫిక్స్ చేసి.. ఎంగేజ్మెంట్ కూడా కానిచ్చేశారు. ఆపై పెళ్లిని అర్ధాంతరంగా వాయిదా వేశారు. అయితే.. గ్రీష్మకు పెళ్లైన వెంటనే భర్త మరణించే గండం ఉంది. ఆ దోషం పొగొట్టేందుకు షరోన్‌ను బలి పశువును చేశారు. బలవంతంగా ఆమె నుదుట కుంకుమ పెట్టించారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన షరోన్ నుదుటిపై కూడా కుంకుమ ఉందని, ఆ విషయాన్ని వెంట ఉన్న స్నేహితుడు సైతం నిర్ధారించాడని అంటోంది. పక్కా ప్లాన్‌తో ఆమెతో బలవంతపు వివాహం జరిపించి.. ఆపై పురుగుల మందు తాగించి షరోన్ మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ వచ్చింది. అయితే పోలీసులు ఈ వాదనను తోసిపుచ్చారు. -
రామాయణ, భారత, భాగవతాల తెలుగు ఆడియోలు ఆవిష్కరణ
సాక్షి, తిరువనంతపురం: గజల్ శ్రీనివాస్ గానం చేసిన రామాయణ, భారత, భాగవతాల తెలుగు ఆడియోలను జ్యోతిర్ మఠ్ శంకరాచార్య శ్రీ అవి ముక్తేశ్వరానంద సరస్వతి ఆవిష్కరించారు.పోతన విరచిత భాగవతంలోని ముఖ్య 108 పద్యాలు, కవిత్రయం రచించిన ఆంధ్ర మహాభారతంలోని ముఖ్య 108 పద్యాలు, డా.ముకుంద శర్మ వ్రాసిన గేయ రామాయణాల ఆడియోలను ఉత్తరాఖండ్ జ్యోతిర్ మఠ్ శంకరాచార్య శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీ తిరువనంతపురం (కేరళ) పద్మనాభ స్వామి వారి ఏకాంత దర్శన అనంతరం వేలాది మంది భక్తుల సమక్షంలో ఆవిష్కరించారు.మన సనాతన ధర్మంలో అతి ముఖ్యమైన రామాయణ, భారత, భాగవతాల తెలుగు ఆడియోలను ఒకే రోజు ఆవిష్కరించడం అతి గొప్ప ధార్మిక కార్యక్రమం అని, వీటిని స్వరపరచి సందర్భ, తాత్పర్య సహితంగా అందరికీ అర్ధమయ్యేలా గానం చేసిన డా.గజల్ శ్రీనివాస్ అభినందనీయుడని శంకరాచార్య అన్నారు. ఆడియో తొలి ప్రతులను సి.ఎల్.రాజం దంపతులకు, మిజోరమ్ పూర్వ గవర్నర్ కుమ్మనం రాజ శేఖర్‌లకు స్వామి అందించారు. -
ట్రాక్‌మ్యాన్ సమయస్ఫూర్తి.. రైలుకు తప్పిన పెను ప్రమాదం
న్యూఢిల్లీ: ట్రాక్‌మ్యాన్ సమయస్ఫూర్తి వల్ల పెద్ద రైలు ప్రమాదం తప్పింది. కొంకణ్ రైల్వే డివిజన్ పరిధిలోని కుమటా, హొన్నావర్ మధ్య రైల్వే లైన్లో పట్టాల మధ్య వెల్డింగ్ తొలగిపోయింది. శుక్రవారం విధుల్లో ఉన్న ట్రాక్‌మ్యాన్ మహదేవ్.. ట్రాక్ జాయింట్లో వెల్డింగ్ పోయి ఉండటాన్ని గమనించాడు.అయితే అదే మార్గంలో తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ వస్తుండటాన్నిఆపడానికి మహదేవ్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరగా పట్టాల వెంట పరుగులు తీయడంతో గమనించిన లోకో పైలట్ రైలును నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు.. అతడి సమయస్ఫూర్తిని అభినందించారు. నగదు బహుమతి అందిచారు. -
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు
ముంబై: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ముంబై నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానం ఉదయం 8 గంటలకు విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని, ఐసోలేషన్ బేకు తరలించామని తెలిపారు. వెంటనే విమానం నుంచి ప్రయాణికులను ఖాళీ చేయిస్తున్నామని అధికారులు తెలిపారు. విమానం తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకోగానే పైలట్‌కి బాంబు బెదిరింపు సమాచారం అందింనట్లు అధికారలు తెలిపారు. విమానంలో 135 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బాంబు బెదిరింపలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవటం కోసం దర్యాప్తుకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.#news #India #kerela #AirIndia #ndtv Thiruvananthapuram: A full emergency was declared at the Thiruvananthapuram International Airport today following a bomb threat on an Air India flight from Mumbai, airport sources said.The flight landed at the airport around 8 am. pic.twitter.com/BeSgwkJsRT— Manuj jha (@manuj_jha) August 22, 2024 -
కాంగ్రెస్ విజయంపై శశిథరూర్ వ్యాఖ్యలు
లోక్‌సభ ఎన్నికల యుద్ధం తుది దశకు చేరుకుంది. కేరళలోని తిరువనంతపురం స్థానం నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ వెనుకంజలో ఉన్నారు. తొలి ట్రెండ్‌లో బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ ముందున్నారు. ఈ నేపధ్యంలో శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.‘ఓటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు ఎలాంటి వాదనలకు, చర్చలకు తావులేదు. విజయంపై నమ్మకంతో ఉన్నాం. ఏప్రిల్ 26 నుండి మా అంచనాలు పెరిగాయి. ఎందుకంటే ఓటర్లు ఓటు వేశాక, ఆ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించాక, ఎటువంటి వాదనలకు లేదా చర్చలకు ఆస్కారం ఉండదు. ఇక క్రాస్ ఓటింగ్ విషయానికొస్తే దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ లాభం కలగలేదు. గత ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగలేదు. ఈసారి క్రాస్ ఓటింగ్ జరగాలని మేము ఆశించ లేదు. అయితే మేము గెలుస్తున్నామనే నమ్మకంతో ఉన్నాం’ అని శశిధరూర్ మీడియాతో అన్నారు. తిరువనంతపురంను గతంలో త్రివేండ్రం అని పిలిచేవారు. ఇది కేరళ రాజధాని. రాష్ట్రంలోని 20 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. తిరువనంతపురం కేరళలో అత్యధిక జనాభా కలిగిన నగరంగా పేరొందింది. ఈ నగరం దశాబ్దాలుగా వివిధ పార్టీలకు ప్రాతినిధ్యం వహించింది. ఐక్యరాజ్యసమితి మాజీ దౌత్యవేత్త శశి థరూర్ 2009 నుంచి తిరువనంతపురం ఎంపీగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. #WATCH | On exit polls, Congress MP & candidate from Kerala's Thiruvananthapuram, Shashi Tharoor says, "...Expectations were set on 26th April because once people have cast their votes and the boxes are sealed in the strong room then there is no further room for any argument or… pic.twitter.com/12jFp6Yiwm— ANI (@ANI) June 4, 2024 -
Shashi Tharoor: 400.. జోక్, 300.. అసాధ్యం, 200.. ఒక సవాలే
న్యూఢిల్లీ: ఈసారి 400 సీట్లు సాధిస్తామంటూ బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ నేత, తిరువనంతపురం అభ్యర్థి శశిథరూర్ జోక్‌గా అభివరి్ణంచారు. పీటీఐతో ఇంటర్వ్యూ సందర్భంగా పలు అంశాలపై ఆయన వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. కేరళలో బీజేపీ బోణీపై.. ‘‘ దేశవ్యాప్తంగా 400 చోట్ల గెలుస్తానని బీజేపీ నిజంగా జోక్ చేస్తోంది. 300 సీట్లు అసాధ్యమనుకోండి. కనీసం 200 నియోజకవర్గాలను గెల్చుకోవడం కూడా ఆ పారీ్టకి పెద్ద సవాలే. దిగువసభలో అధికారపార్టీ మెజారిటీ కోల్పోతుందనేది దాదాపు ఖరారైంది. కేరళలో ఈసారి కూడా బీజేపీ బోణీ కొట్టబోదు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే సీన్ రిపీట్ అవుద్ది. 2019నాటితో పోలిస్తే ఈసారి దక్షిణాదిన కమలం కమిలిపోవడం ఖాయం’’ కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమిపై.. ‘‘రెండు దశల్లో పోలింగ్ ముగిసిన 190 స్థానాల్లో విపక్షాల ‘ఇండియా’ కూటమికి అద్భుతమైన స్పందన వచ్చింది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ ఓటర్లు చూపిన ఎమోషన్స్, ఉత్సాహం ఈ సారి ఎన్నికల్లో కనిపించకపోవచ్చు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు సానుకూల పవనాలను బాగా నమ్ముతున్నారు. ఈసారి ఊహించిన దానికంటే ఎంతో ముందున్నాం’’ విపక్షాల విక్టరీ స్థానాలపై.. ఈసారి విపక్షాల కూటమి ఎన్ని సీట్లు గెలుస్తుందన్న ప్రశ్నకు ఆయన సరదాగా ‘‘ క్రికెట్‌కు వీరాభిమానిని అయినాసరే ఎంత స్కోర్ కొడతారనేది ఊహించలేను. కానీ గెలుపును ఊహిస్తా. బీజేపీ–ఎన్డీఏ ప్రభుత్వం మెజారిటీని కోల్పోతుంది. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగొచ్చు. ఇంకొన్ని రాష్ట్రాల్లో మా కూటమి సత్తా చాటొచ్చు. హరియాణాలో గతంలో కాంగ్రెస్ ఒక్కసీటు కూడా గెలవలేదు. కానీ ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఈసారి మాకు అక్కడ 5–7 సీట్లు రావచ్చు. కర్ణాటకలో ఒక్కటే గెలిచాం. ఈసారి 10–17 గెలుస్తామంటున్నారు. కొందరైతే 20 మావే అంటున్నారు’’ తెలంగాణలో బీజేపీ గెలుపుపై.. ‘ తెలంగాణలో ఈసారి బీజేపీ గెలవడం కష్టమే. బీజేపీ, కాంగ్రెస్ వీళ్లలో ఎవరు జనాన్ని ఆకట్టుకున్నారనేది తేలాల్సి ఉంది. ఇంకా 353 స్థానాల్లో పోలింగ్ మిగిలే ఉంది. ఈ లెక్కన ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముందుంది. నాదో ప్రశ్న. ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో ఒక యువకుడు 2014లో బీజేపీకి ఓటేశాడు. అదే యువకుడు పదేళ్ల తర్వాత కూడా అదే బీజేపీకి ఎందుకు ఓటేయాలి? 2014లో బీజేపీ ఆర్థికవ్యవస్థను చక్కబెట్టేందుకు కృషిచేశామని చెప్పింది. అయినా ఎకానమీలో మార్పు తేలేకపోయింది. 2019లో పుల్వామా దాడులు బాలాకోట్ ఘటనతో దేశ జాతీయభద్రత ప్రశ్నార్థకమైంది. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం బీజేపీకి చేతకాదు. ప్రజలకు ఉద్యోగాలు దక్కలేదు. అధిక ధరల వల్ల నచ్చినవి కొనలేకపోయారు. చైనాతో సరిహద్దు విషయంలోనూ బీజేపీ విఫలమైంది. సరిహద్దుల వెంట 65 పెట్రోలింగ్(గస్తీ) పాయింట్లలో 26 పాయింట్లను భారత్ కోల్పోయింది. ఛాతి విరిచి చెప్పుకునేంతగా మోదీ ఏం చేశారు?’’ -
మళ్ళీ ఆయనే గెలుస్తారు: నటుడు ప్రకాష్ రాజ్
తిరువనంతపురం: దేశంలో ఎన్నికల పోరు జోరుగా సాగుతున్న తరుణంలో సీనియర్ నేతలు సైతం నువ్వా.. నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఈ సమయంలో ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి మళ్ళీ 'శశిథరూర్' విజయం సాధిస్తారని అన్నారు. జరగబోయే 2024 లోక్‌సభ ఎన్నికలో శశిథరూర్ మళ్ళీ విజయం సాధిస్తారని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. తిరువనంతపురం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ నుంచి చాలా అందుకుంది. కాబట్టి మళ్ళీ ఆయనే గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. శశి థరూర్ నా స్నేహితుడు, గొప్ప నాయకుడు. అందుకే అతని అండగా నిలబడటానికి నేను వచ్చానని ప్రకాష్ రాజ్ అన్నారు. ప్రస్తుతం ఈయన (శశి థరూర్) కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నాయకుడు పన్నియన్ రవీంద్రన్‌లను ఎదుర్కొని పోటీకి నిలబడుతున్నారని అన్నారు. 2009 నుంచి గెలుస్తున్న శశి థరూర్‌కు వ్యతిరేకంగా బీజేపీ బలమైన నాయకున్ని బరిలోకి దింపింది. కాబట్టి ఈ సారి జరగబోయే ఎన్నికలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. 20 ఎంపీ స్థానాలకు కేరళ రాష్ట్రంలో 2019లో 19 స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకోగా.. ఒక స్థానంలో సీపీఎం గెలుపొందింది. బీజేపీ విఫలమైంది. 2016లో ఒక్కసారి మాత్రమే బీజేపీ నెమోమ్ అసెంబ్లీ స్థానంలో గెలిచింది. అయితే ఇప్పటివరకు బీజేపీ ఎంపీ స్థానాన్ని గెలుచుకోలేదు. కాగా కేరళలోని మొత్తం 20 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 26న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. #WATCH | Thiruvananthapuram, Kerala: Actor Prakash Raj says, " I find this (Thiruvananthapuram) constituency has received a lot from Shashi Tharoor. It is going to be his term again, I am here to just stand by him not because he is a great friend of mine, but because he has given… pic.twitter.com/J34XOJUQ7Y — ANI (@ANI) April 22, 2024 -
‘24 గంటల్లో శశిథరూర్ నాకు క్షమాపణ చెప్పాల్సిందే’
తిరువనంతపురం : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేరళ రాజకీయం వేడెక్కుతుంది. తిరువనంతపురం లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి రాజీవ్ చంద్రశేఖర్.. అదే స్థానం నుంచి బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ అభ్యర్ధి శశిథరూర్‌కు లీగల్ నోటీసులు పంపారు. శశిథరూర్ తనకు భేషరుతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టపర్యమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేరళకు మలయాళ మీడియా సంస్థ న్యూస్24 ఇంటర్వ్యూలో శశిథరూర్.. రాజీవ్ చంద్రశేఖర్ గురించి మాట్లాడారు. ఏప్రిల్ 6న సదరు టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో రాజీవ్ చంద్రశేఖర్ ఓటర్లను, ఓ వర్గానికి చెందిన మత పెద్దలకు డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురిచేస్తున్నారనే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాజీవ్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తరుపున లాయర్ ద్వారా శశిథరూర్‌కు లీగల్ నోటీసులు అందించారు. నేనే షాకయ్యా తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి తన గురించి అసత్య ప్రచారం చేస్తున్నారని, ఓటర్లకు డబ్బులిస్తూ ప్రలోభ పెడుతున్నారంటూ నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలు నన్ను షాక్‌కి గురి చేశాయని ఆ నోటీసుల్లో రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. క్షమాపణలు చెప్తారా? లేదంటే ఈ నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోపు శశిథరూర్ చేసిన వ్యాఖ్యల్ని తిరిగి వెనక్కి తీసుకోవాలని, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాలని అన్నారు. అంతేకాదు తనకు, ఓటర్లకు, ఓ కమ్యూనిటీని కించపరిచినందుకు ఆ వర్గానికి చెందిన ప్రజలకు, మత పెద్దలకు బహిరంగంగా క్షమాణలు చెప్పాలని హెచ్చరించారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శశిథరూర్‌కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. రాజకీయంగా లబ్ధి పొందాలనే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేలా దుర్మార్గపు ఉద్దేశ్యంతో తన క్లయింట్ రాజీవ్ చంద్రశేఖర్ పరువుకు నష్టం వాటిల్లేలా అసత్యప్రచారం చేశారు. తద్వారా ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని, శశిథరూర్ క్షమాపణలు చెప్పాలని రాజీవ్ చంద్రశేఖర్ తరుపు న్యాయవాది శశిథరూర్‌కు పంపిన నోటీసుల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. -
శశి థరూర్‌కు రూ. 55 కోట్ల ఆస్తులు
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ సీటును వరుసగా నాలుగోసారి కైవసం చేసుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ నేత శశి థరూర్ తనకు రూ.55 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ప్రకటించారు. ఇందులో చరాస్తుల విలువ రూ.49 కోట్లు కాగా, రూ.6.75 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.4.32 కోట్ల ఆదాయం వచి్చనట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. రెండు కార్లు ఉన్నట్లు చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో రూ.23 కోట్ల ఆస్తులు, 2019 ఎన్నికల అఫిడవిట్లో రూ.35 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు థరూర్ వెల్లడించారు. -
ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం ఎవరూ?..శశి థరూర్ సమాధానమిదే
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలన్ని ప్రచారంపై దృష్టి సారించాయి. ముచ్చటగా మూడోసారి ఆధిక్యం సాధించి కేంద్రంలో చక్రం తిప్పేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు తీవ్ర కృషి చేస్తోంది. ఎవరికి వారే గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న వ్యక్తి ఎవరో చెప్పాలంటూ జర్నలిస్టులు ఆయన్ను అడిగిన ప్రశ్నకు థరూర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘పార్లమెంటరీ వ్యవస్థలో ఈ ప్రశ్న అసంబద్ధమైనది. అధ్యక్ష వ్యవస్థల్లో మాదిరి మనం ఒక వ్యక్తిని ఎన్నుకోవడం లేదు. మన దేశ వైవిధ్యం, బహుళత్వం, సమ్మిళిత వృద్ధిని సంరక్షించడం కోసం రూపొందించిన విధివిధానాలను పాటించే పార్టీ లేదా సంకీర్ణ కూటమిని ఎన్నుకుంటాం. Yet again a journalist has asked me to identify an individual who is the alternative to Mr Modi. The question is irrelevant in the Parliamentary system. We are not electing an individual (as In a presidential system), but a party, or coalition of parties, that represents a set… — Shashi Tharoor (@ShashiTharoor) April 3, 2024 ఇక్కడ ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం మోదీకి ప్రత్యామ్నాయం అనుభవజ్ఞులైన, సమర్థులైన నాయకుల సమూహం. వారు తమ అహాన్ని పక్కన పెట్టి ప్రజల సమస్యలపై వాటిపై పోరాడతారు. అందులో నుంచి ప్రధానిగా ఎవరిని ఎన్నుకోవాలన్నది తర్వాతి విషయం. మన ప్రజాస్వామ్యాన్ని, వైవిధ్యాన్ని పరిరక్షించడమే ప్రథమ ప్రాధాన్యం’ అని శశిథరూర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. The beloved leader of Thiruvananthapuram @ShashiTharoor filed his nomination today. He is going to win with record margin to be on the forefront of restoring democracy and safeguarding the constitution.#TharoorForTVM #UDF #VoteForCongress pic.twitter.com/YTRyT2hZ4g — Congress Kerala (@INCKerala) April 3, 2024 కాగా కేరళలోని తిరువనంతపురం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న శశిథరూర్.. తాజా ఎన్నికల్లో మరోసారి అక్కడి నుంచే బరిలోకి దిగారు. ఈ క్రమంలో బుధవారం మరోసారి కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు తిరువనంతపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఇరకరడ బీఊసీ పేం,ఇచి కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. సీపీఐ నుంచి పన్నియన్ రవీంద్రన్ పోటీ చేస్తున్నారు. -
నాలుగు సార్లు ఎమ్మెల్యే, మాజీ ఆర్ధిక మంత్రి.. ఆయన ఆస్తులెంతో తెలుసా?
తిరువనంతపురం: ఎన్నికల నేపథ్యంలో కేరళ మాజీ ఆర్ధిక శాఖ మంత్రిగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఎల్డిఎఫ్ నేత, పతనంతిట్ట అభ్యర్థి డా. థామస్ ఐజాక్ వార్తల్లో నిలిచారు. అప్పుడప్పుడు అమెరికా పర్యటనలు, డిజైనర్ కుర్తాలంటే ఇష్టపడే థామస్ ఐజాక్ సాధారణ జీవనశైలితో తోటి నేతలకు ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నారు. నిబద్ధత కలిగిన కమ్యూనిస్ట్ నేతగా పేరొందిన థామస్ ఐజాక్ అఫిడవిట్‌ను సమర్పించారు. ఐజాక్ పేరిట రూ. 9.6 లక్షల విలువైన 20,000 పుస్తకాలు తప్ప మరే ఆస్తి లేదని తెలుస్తోంది. అద్దె ఇంట్లోనే బ్యాంక్ సేవింగ్స్‌లో రూ.6,000, సహా వివిధ బ్యాంక్ అకౌంట్లలో రూ.1.31 లక్షల డిపాజిట్లు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేత అయినప్పటికీ ఐజాక్ తిరువనంతపురంలో తన సోదరుడి ఇంట్లో అద్దెకి నివసిస్తున్నారు. 10వేల విలువ చేసే షేర్లు పెన్షనర్ల ట్రెజరీ ఖాతాలో రూ.68,000, ఎస్బీఐ సేవింగ్స్ ఖాతాలో రూ.39,000, కేఎస్ఎఫ్ఈ సుగమా ఖాతాలో రూ.36,000 ఉన్నాయి. అంతేకాకుండా, అతను కేఎస్ఎఫ్ఈలో చిట్ ఫండ్‌ను వివిధ వాయిదాలలో మొత్తంగా రూ.77వేలు చెల్లించారు. అదనంగా, మలయాళం కమ్యూనికేషన్స్‌లో రూ.10వేలు విలువ చేసే షేర్లు మాత్రమే ఆయన పేరు ఉండటం గమనార్హం. -
overthinkers club: అతిగా ఆలోచన ఆనందానికి శత్రువు
‘నేను చేసింది తప్పేమో’ ‘నేను చేసిన పని వల్ల ఇలా అవుతుందేమో’ ‘వాళ్లు అలా చేస్తే ఏం చేయాలి?’ ‘నా పరువు పోతుందేమో’... చిన్న చిన్న కారణాలకు కూడా ఎంతో ఆలోచిస్తూ బాధ పడుతూ ఉంటారు కొందరు. దీనిని ‘ఓవర్‌థింకింగ్’ అంటారు మానసిక నిపుణులు. ‘ఇలాంటివారిని ఒకచోట చేర్చి ఆలోచనలు పంచుకుంటే ధైర్యం వస్తుంది’ అంటుంది వర్షా విజయన్. ఈమె మొదలు పెట్టిన ‘ఓవర్‌థింకర్స్ క్లబ్’ ఇలాంటి క్లబ్‌ల అవసరాన్ని తెలియచేస్తోంది. ‘ఓ మీరూ అంతేనా?’ అంది ఒక మహిళ ఆ పార్క్‌కు వచ్చిన మరో మహిళతో. తిరువనంతపురానికి చెందిన 27 ఏళ్ల వర్షా విజయన్ ‘ఓవర్‌థింకర్స్ క్లబ్’ను ప్రారంభించింది. ఇదేదో ఒక భవంతో, క్లినిక్కో కాదు. పార్కులో కొంతమంది కలవడమే. సోషల్ మీడియా ద్వారా ఈ క్లబ్ గురించి ఆమె ప్రచారం చేసింది. ‘ప్రతి దానికీ తీవ్రంగా ఆలోచించే మనం ఈ ఆలోచనల నుంచి బయటపడదాం రండి’ అనే ఆమె పిలుపునకు స్పందించిన స్త్రీ, పురుషులు రకరకాల వయసుల వాళ్లు వారానికి ఒకసారో నెలలో రెండుసార్లు కలవసాగారు. ‘జీవితంలో మార్పులు సహజం. కాని జరగబోయే మార్పు గురించి చదువు, ఉద్యోగం, వివాహం, విడాకులు, పిల్లల ఆరోగ్యం లేదా తల్లిదండ్రుల చివరి రోజులు... వీటి గురించి రోజుల తరబడి ఆలోచిస్తూ ఉంటారు కొందరు. ఆ ఆలోచనలు పాజిటివ్ వైపు కాకుండా నెగెటివ్ వైపుగా వెళ్లడంతో ఆందోళన చెందుతుంటారు. దాని వల్ల డిప్రెషన్ వస్తుంది. అన్నింటికీ మించి ఏ నిర్ణయమూ జరక్క ఏ పనీ ముందుకు కదలదు. వర్తమానంలో ఉండే ఆనందాన్ని అనుభవించక ఎప్పుడో ఏదో నష్టం జరుగుతుందేమోనన్న ఆందోళనతో బాధ పడుతుంటారు ఓవర్‌థింకర్లు’ అంటుంది వర్షా విజయన్. ఆలోచన.. అతి ఆలోచన ‘ఆలోచన మంచిదే. కాని అతి ఆలోచన మంచిది కాదు’ అంటుంది వర్షా విజయన్. ఓవర్‌థింకర్ల క్లబ్‌కు హాజరైన వారు ఒకరి మాటల్లో మరొకరు తెలుసుకునే విషయం ఏమిటంటే తమ చేతుల్లో లేని వాటి గురించి కూడా అధికంగా ఆలోచించడం. ఉదాహరణకు ఎప్పుడో పెట్టుకున్న శుభకార్యం రోజు వాన పడితే... వాన పడితే... వాన పడితే అని ఆలోచించడం. వానను ఆపడం మన చేతుల్లో లేదు. పడితే పడుతుంది... లేకపోతే లేదు. పడినప్పుడు అందుకు తగ్గ సర్దుబాట్లతో పనులు అవసరం అవుతాయి. అలా అనుకుని వదిలేయాలిగాని అదే పనిగా ఆలోచించడం ఆరోగ్యం కాదు. దాని వల్ల ఇవాళ్టి ఆనందాలు మిస్ అవుతాయి. ధ్యాస మళ్లించాలి ఓవర్‌థింకర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మెరుగ్గా ఉండొచ్చు అంటుంది వర్షా విజయన్ ► అతిగా ఆలోచించే చాలా విషయాలు పడే భయాలు దాదాపుగా నిజం కావు. పిల్లల్ని స్కూల్‌బస్ ఎక్కించాక దానికి ప్రమాదం జరిగితే.. ప్రమాదం జరిగితే అని ఆలోచించడం మంచిది కాదు. అలా లక్షసార్లలో ఒకసారి జరుగుతుంది. ఆ ఒకసారి గురించి అతి ఆలోచన చేయకూడదు ► ఎక్కువ ఆత్మవిమర్శ చేసుకోకుండా ఏదో ఉన్నంతలో బెస్ట్ చేద్దాం... చేశాం అని ముందుకెళ్లాలి. ఏదో ఒక మేరకు సంతృప్తి చెంది పని జరిగేలా చూడాలి ► ఆలోచనలు శ్రుతి మించుతుంటే స్నేహితులతో మాట్లాడాలి. చెప్పుకోవాలి. కొత్త పనులేవైనా నేర్చుకుని ధ్యాస మళ్లించాలి ∙సోషల్ మీడియాలో పనికిమాలిన పరిజ్ఞానం, వీడియోలు తగ్గించాలి ► ఈ క్షణంలో ఉండటం ప్రాక్టీస్ చేయాలి. అందుకు యోగా ఉపయోగపడుతుంది ► అన్ని మనం అనుకున్నట్టుగా జరగవు అనే వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాలి. సమస్య ఎదురైనప్పుడు చూసుకుందాంలే అనుకుని ధైర్యంగా ఉండాలి. ఓవర్‌థింకర్ల లక్షణాలు ► ఆత్మవిమర్శ అధికంగా చేయడం ► ఒక పని పూర్తిగా లోపరహితంగా చేయాలనుకోవడం (పర్ఫెక్షనిజం) ► జరిగిపోయిన ఘటనలు, మాటలు తలచుకుని వాటిలో ఏమైనా తప్పులు జరిగాయా, పొరపాట్లు జరిగాయా, వాటి పర్యవసానాలు ఏమిటి అని తల మునకలు కావడం ► ప్రయాణాల్లో ప్రమాదాలు ఊహించడం ► శుభకార్యాలప్పుడు అవి సరిగ్గా జరుగుతాయో లేదోనని ఆందోళన చెందడం ► చిన్న చిన్న సమస్యలకు కూడా పెద్ద పర్యవసానాలు ఊహించడం ► ఎవరికీ చెప్పుకోక ఆ ఆందోళనల్లోనే రోజుల తరబడి ఉండటం. -
V R Lalithambika : వీఆర్ అంటే విజయ సంకేతం
ఉద్యోగంలో చేరిన తొలి రోజుల్లో ‘ఫెయిల్యూర్’ ఎదురొచ్చి భయపెట్టాలని చూసింది. ‘అంతా గందరగోళం’ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. సందేహం వచ్చినప్పుడు ఎవరిని అడిగితే ఏమనుకుంటారో అనే భయం ఉండేది. అయినా సరే... ‘ఇస్రో’ రహదారిలో లలితాంబిక ఎక్కడా తన ప్రయాణాన్ని ఆపలేదు. అడుగడుగునా పాఠం నేర్చుకుంది. సుదీర్ఘ ప్రయాణంలో ఇస్రో టాప్ ఇంజనీర్లలో ఒకరిగా ఎదిగింది. తాజాగా... అత్యున్నత ఫ్రెంచ్ పౌర పురస్కారం ‘ది లెజియన్ డి ఆనర్ ఆఫ్ ఫ్రాన్స్’ను అందుకుంది వీఆర్ లలితాంబిక... కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది లలితాంబిక. తండ్రితో సహా చుట్టాలలో ఎక్కువమంది ఇంజినీర్లు. గణితశాస్త్రంలో దిట్టగా పేరున్న తాత వల్ల లలితకు శాస్త్రీయ విషయాలపై ఆసక్తి మొదలైంది. ఆ ఆసక్తే ఇస్రో వరకు తీసుకువెళ్లింది.చదువు పూర్తికాగానే పెద్దలు పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్లి తరువాత కూడా చదువుకు విరామం ఇవ్వలేదు లలిత. ఎంటెక్ చేస్తున్న కాలంలో ఆమెకు కూతురు జన్మించింది. కాలేజీకి విరామం ఇచ్చినప్పటికి స్నేహితురాలు తెచ్చి ఇచ్చిన క్లాసులకు నోట్స్ ఇంట్లోనే చదువుకునేది. 1998లో తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో చేరింది. కొద్దిరోజుల్లోనే తాను పనిచేస్తున్న ఏరియాలో కంట్రోల్ సిస్టమ్‌కు సంబంధించిన సాఫ్ట్వేర్ ఎర్రర్ వల్ల ఫెయిల్యూర్ ఎదురైంది. ‘ఆ రోజుల్లో ప్రతిదీ కొత్తగానే అనిపించేది. ప్రతిరోజూ ఒక సవాలుగానే ఉండేది. ఒక సమస్యకు సంబంధించి పరిష్కారాన్ని అన్వేషించడానికి, అధ్యయనం చేయడానికి అవసరమైన పుస్తకాలు ఉండేవి కాదు. సీనియర్లను అడగాలంటే భయంగా ఉండేది. ఆత్మస్థైర్యం అంతంత మాత్రంగానే ఉండేది’ అని గతాన్ని గుర్తు చేసుకుంది లలిత. పీఎస్ఎల్వీ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నప్పుడు లలిత యంగ్ మదర్. ఒకవైపు... ఏ టైమ్‌కు ఇంటికి వెళతారో తెలియనంత ఊపిరి సలపని పని. మరోవైపు... పని విరామంలో పదే పదే గుర్తుకు వచ్చే బిడ్డ. 1993లో పీఎస్ఎల్వీ లాంచ్ ఫెయిల్ అయింది. అదే సంవత్సరం రెండో ప్రయత్నానికి సంబంధించిన షెడ్యూల్ వచ్చింది. పని ఒత్తిడి మరింత పెరిగింది. అలాంటి క్లిష్టమైన కీలక సమయంలోనూ ఎప్పుడూ ‘ఇక చాలు. ఈ ఉద్యోగం చేయడం మన వల్ల కాదు’ అనుకోలేదు. ‘ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అని మాత్రమే అనుకుంది. ‘ఆ సమయంలో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. తప్పులు పునరావృతం కాకుండా చూసుకున్నాం. తప్పుల నుంచి నేర్చుకోవడం అనేది ఇస్రో సంస్కృతిలో ఒకటి’ అంటుంది లలిత. సెకండ్ పీఎస్ఎల్వీ లాంచ్ సక్సెస్‌కు సంబంధించిన ఆనందం లలితకు ఆత్మస్థైర్యం, అంతులేని ఉత్సాహాన్ని ఇచ్చింది. ‘పీఎస్ఎల్వీలో ఆటోపైలట్ సిస్టమ్ విభాగంలో చాలాకాలం నుంచి ఉన్నాను. లాంచ్ రోజులు ఉత్కంఠభరితమైనవి. అదే సమయంలో సంతోషం రూపంలో ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు చేసేవి. ప్రతి ఫెయిల్యూర్ కొత్త పాఠం నేర్పేది. ప్రతి సక్సెస్ కొత్త శక్తిని ఇచ్చేది’ అంటుంది లలిత. ‘మీ విజయరహస్యం?’ అనే ప్రశ్నకు లలిత చెప్పే మాట... ‘ఫ్యామిలీ సపోర్ట్’ ‘లాంచ్‌కు సంబంధించిన రోజుల్లో పనే లోకంగా ఉండేవాళ్లం. ఏ టైమ్‌కు ఇంటికి చేరుతామో తెలియదు. ఇలాంటి సమయంలోనూ నాకు కుటుంబ మద్దతు రూపంలో ప్రోత్సాహం, బలం లభించాయి. వ్యక్తిగత త్యాగాలను కూడా ఇష్టపూర్వకంగా చేసే రోజులు అవి. స్త్రీ, పురుషులను వేరు వేరుగా చూడడం అనే సంస్కృతి ఇస్రోలో కనిపించేది కాదు. ఎవరైనా ఒక్కటే అన్నట్లుగానే ఉండేది. మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేవారు’ అంటుంది లలిత. ఫ్రెంచ్ అత్యున్నత పౌర పురస్కారం విషయానికి వస్తే... ఫ్రాన్సు, మన దేశం మధ్య అంతరిక్ష సహకారాన్ని పెంపొందించడంలో చేసిన విశేష కృషికి ఇస్రోలో డైరెక్టరేట్ ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగామ్ మాజీ డైరెక్టర్ అయిన వీఆర్ లలితాంబికను ఫ్రెంచ్ అత్యున్నత పౌరపురస్కారంతో సత్కరించారు. ఫ్రాన్స్ ప్రభుత్వం తరపున మన దేశంలోని ఫ్రాన్స్ రాయబారి మాథ్యూ నుంచి ఈ అవార్డ్ అందుకుంది లలిత. ‘అంతరిక్ష సాంకేతికతలో విశిష్ట శాస్త్రవేత్త’ అని మాథ్యూ లలితాంబికను కొనియాడారు. ‘ఈ గౌరవం మరింత మంది మహిళలు స్టెమ్ రంగాలలోకి రావడానికి, విజయాలు సాధించడానికి స్ఫూర్తిగా నిలుస్తుంది’ అంటుంది వీఆర్ లలితాంబిక. -
IND Vs AUS: బ్యాటర్ల ఊచకోత.. రెండో టీ20లోనూ టీమిండియాదే విజయం
బ్యాటర్ల ఊచకోత.. రెండో టీ20లో టీమిండియా ఘన విజయం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. బ్యాటర్లంతా రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. యశస్వి (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రుతురాజ్ (43 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ (10 బంతుల్లో 19; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (9 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (2 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. అనంతరం 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆదిలో కాస్త పోరాటపటిమ కనబర్చినప్పటికీ.. ఆతర్వాత భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో భిష్ణోయ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 3 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్, అర్షదీప్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో కూడా టీమిండియానే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఓటమి అంచుల్లో ఆసీస్ 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆదిలో కాస్త పోరాడినప్పటికీ, ఆతర్వాత భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఆ జట్టు 155 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది.అర్షదీప్ బౌలింగ్‌లో ఆడమ్ జంపా (1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నిప్పులు చెరుగుతున్న ప్రసిద్ద్ కృష్ణ టీమిండియా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ నిప్పులు చెరుగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను మూడో వికెట్ పడగొట్టాడు. 152 పరుగుల వద్ద నాథన్ ఇల్లిస్ (1)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఓటమి దిశగా ఆసీస్.. సీన్ అబాట్ క్లీన్ బౌల్డ్ ఆసీస్ జట్టు ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు 149 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో సీన్ అబాట్ (1) క్లీన్ బౌల్డయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్ 148 పరుగుల వద్ద ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. గుర్తింపు పొందిన ఆఖరి బ్యాటర్ స్టోయినిస్ (45) ఔటయ్యాడు. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి స్టోయినిస్ పెవిలియన్‌కు చేరాడు. ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్ 139 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ (37) ఔటయ్యాడు. 14 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 142/5గా ఉంది. స్టోయినిస్ (43), వేడ్ (2) క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 236.. భారత్‌కు ధీటుగా బదులిస్తున్న ఆసీస్ 236 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆసీస్.. టీమిండియాకు ధీటుగా బదులిస్తుంది.12 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. స్టోయినిస్ (40), టిమ్ డేవిడ్ (31) చెలరేగి ఆడుతున్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్ 53 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ (12) ఔటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 53/3గా ఉంది. స్టోయినిస్, స్టీవ్ స్మిత్ (17) క్రీజ్‌లో ఉన్నారు టార్గెట్ 236.. రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ 236 పరుగుల అతి భారీ లక్ష్యఛేదనకు దిగిన ఆసీస్ 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. రవి భిష్ణోయ్.. జోస్ ఇంగ్లిస్ (2), మాథ్యూ షార్ట్‌ను (19) పెవిలియన్‌కు పంపాడు. టీమిండియా బ్యాటర్ల మహోగ్రరూపం.. సిక్సర్ల సునామీ ఆసీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బ్యాటర్లు మహోగ్రరూపం దాల్చారు. టాప్-3 బ్యాటర్లు మెరుపు అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. యశస్వి (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రుతురాజ్ (43 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సూర్యకుమార్ (10 బంతుల్లో 19; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (9 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) , తిలక్ వర్మ (2 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) సైతం మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో ఇల్లిస్ 3 వికెట్లు పడగొట్టగా.. స్టోయినిస్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఇషాన్ ఔట్ 52 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. స్టోయినిస్ బౌలింగ్‌లో ఇల్లిస్‌కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన స్కై తొలి బంతికే సిక్సర్ బాదాడు. దంచికొడుతున్న ఇషాన్ యశస్వి జైస్వాల్ ఔటయ్యాక కూడా భారత బ్యాటర్లు జోరు కొనసాగిస్తున్నారు. ఇషాన్ కిషన్ (52) విధ్వంసం ఓ రేంజ్లో కొనసాగుతుండగా.. రుతురాజ్ (47) ఆచితూచి ఆడుతున్నాడు. 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 164/1గా ఉంది. 10 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసిన భారత్ టీమిండియా 10 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసింది. యశస్వి ధాటిగా ఆడి ఔటైనా రుతురాజ్ (29), ఇషాన్ కిషన్ (10) కూడా ఓ మోస్తరు షాట్లు ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 10 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 101/1గా ఉంది. విధ్వంసం సృష్టించి ఔటైన యశస్వి యశస్వి జైస్వాల్ క్రీజ్‌లో ఉన్నంత సేపు విధ్వంసం సృష్టించాడు. అయితే ఐదో ఓవర్ ఆఖరి బంతికి అతనికి అడ్డుకట్ట పడింది. ఇల్లిస్ బౌలింగ్ యశస్వి (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాడు. 5.5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 77/1గా ఉంది. రుతురాజ్ (15), ఇషాన్ క్రీజ్‌లో ఉన్నారు. యశస్వి ఊచకోత.. 24 బంతుల్లోనే..! యశస్వి జైస్వాల్ ఉగ్రరూపం దాల్చాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు ఎడాపెడా బాదేస్తున్నాడు. కేవలం 24 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ ఉగ్రరూపం సీన్ అబాట్ వేసిన నాలుగో ఓవర్లో యశస్వి జైస్వాల్ ఉగ్రరూపం దాల్చాడు. వరుసగా మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. తొలి బంతికే ఫోర్ బాదిన రుతురాజ్ తొలి టీ20లో బంతిని ఎదుర్కోకుండానే డైమండ్ రనౌట్‌గా వెనుదిరిగిన రుతురాజ్ ఈ మ్యాచ్‌లో తానెదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాదాడు. తొలి ఓవర్ తర్వాత టీమిండియా స్కోర్ 10/0గా ఉంది. రుతురాజ్ (5), యశస్వి జైస్వాల్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 26) రెండో టీ20 జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించగా.. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. బెహ్రాన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ స్థానాల్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా ఆసీస్ జట్టులోకి వచ్చారు. టీమిండియా: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ ఆస్ట్రేలియా: స్టీవెన్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ వేడ్(కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ -
ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత
చెన్నై: చెన్నై, తిరువనంతపురం ఎయిర్‌పోర్టులలో అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు ఘటనల్లో మొత్తం రూ.14 కోట్ల విలువగల బంగారాన్ని సీజ్ చేశారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తులను అరెస్టు చేశారు. చెన్నై ఎయిర్‌పోర్టులో 8.49 కేజీల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ 4.55 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో కూడా భారీ మొత్తంలో బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. రూ. 9.11 కోట్ల విలువ చేసే 16.86 కేజీల గోల్డ్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సింగపూర్, మలేషియా, దుబాయ్, అబుదాబీ ప్రయాణికుల నుంచి బంగారాన్ని పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో కస్టమ్స్ అధికారులు ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: సైనికులతో మోదీ దీపావళి వేడుకలు -
WC- Aus Vs Ned: నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. ఆస్ట్రేలియా స్కోరు 166-7
ICC Cricket World Cup Warm-up Matches 2023 - Australia vs Netherlands: వన్డే వరల్డ్‌కప్-2023లో తమ తొలి వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మెరుగైన స్కోరు సాధించింది. వర్షం కారణంగా 23 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కాగా ఐసీసీ ఈవెంట్ సన్నాహకాల్లో భాగంగా శనివారం ఆసీస్- నెదర్లాండ్స్ పోటీపడుతున్నాయి. కేరళలోని తిరువనంతపురంలో గల గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌కు వరణుడు అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో డచ్ బౌలర్ వాన్ బీక్ ఆరంభంలోనే కంగారూలకు షాకిచ్చాడు. స్టీవ్ స్మిత్‌తో పాటు ఓపెనింగ్‌కు వచ్చిన జోష్ ఇంగ్లిస్‌ను డకౌట్ చేశాడు. అయితే, స్మిత్ పట్టుదలగా నిలబడి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వాన్ డెర్ మెర్వె బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఇక నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్(5) పూర్తిగా నిరాశపరచగా.. కామెరాన్ గ్రీన్ 34, అలెక్స్ క్యారీ 28, మిచెల్ స్టార్క్ 24(నాటౌట్) పరుగులతో రాణించారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(1), మాథ్యూ షార్ట్(5) పూర్తిగా విఫలం కాగా.. లబుషేన్ 3 పరుగులతో అజేయంగా నిలిచాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్, వాన్ డెర్ మెర్వె, బాస్ డీ లీడే రెండేసి వికెట్లు పడగొట్టగా.. షారిజ్ అహ్మద్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఆస్ట్రేలియా విధించిన 167 పరుగుల లక్ష్యంతో డచ్ జట్టు తదుపరి బ్యాటింగ్‌కు దిగనుంది. ఆస్ట్రేలియా ప్లేయింగ్ టీమ్: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), మార్కస్ స్టొయినిస్, కామెరూన్ గ్రీన్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్, సీన్ అబాట్. నెదర్లాండ్స్ ప్లేయింగ్ టీమ్: విక్రమ్ జిత్ సింగ్, మ్యాక్స్ ఓడోడ్, వెస్లీ బారెసి, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్, వికెట్ కీపర్), షరీజ్ అహ్మద్, ఆర్యన్ దత్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వె, తేజ నిడమనూరు, పాల్ వాన్ మీకెరెన్, లోగాన్ వాన్ బీక్, ర్యాన్ క్లీన్, సిబ్రాండ్ ఎంగెల్ బ్రెచ్ట్, కొలిన్ అకెర్మాన్, సాకిబ్ జుల్ఫికర్, బాస్ డీ లీడే. -
వరుణుడి ఖాతాలో వరల్డ్‌కప్ మ్యాచ్.. టాస్ కూడా పడకుండానే రద్దు
వన్డే ప్రపంచకప్ 2023లో వరుణుడు బోణీ కొట్టాడు. తిరువనంతపురం వేదికగా సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (సెప్టెంబర్ 29) జరగాల్సిన వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. తిరువనంతపురంలో ఇవాల్టి ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో అంపైర్లు తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్‌ను రద్దు చేశారు. మైదానం చిన్న సైజు చెరువులా మారడంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే, వ్యక్తిగత కారణాల చేత సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా స్వదేశానికి తిరిగి వెళ్లడంతో వార్మప్ మ్యాచ్‌లకు ఎయిడెన్ మార్క్రమ్ నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. బవుమా వరల్డ్‌కప్‌లో తమ తొలి మ్యాచ్ సమయానికంతా జట్టుతో చేరతాడని సమాచారం. సౌతాఫ్రికా తమ వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 7న ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో సఫారీలు శ్రీలంకను ఢీకొంటారు. దీనికి ముందు ఆ జట్టు మరో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 2న సఫారీలు ఇదే తిరువనంతపురంలో న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ వరల్డ్‌కప్‌లో తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 7న ఆడనుంది. ధర్మశాలలో జరిగే ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు.. బంగ్లాదేశ్‌ను ఢీకొంటారు. దీనికి ముందు ఆఫ్ఘన్ టీమ్ మరో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 3న వీరు గౌహతిలో శ్రీలంకను ఢీకొంటారు. ఇదిలా ఉంటే, ఇవాళే మరో రెండు వార్మప్ మ్యాచ్‌లు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో పాకిస్తాన్-న్యూజిలాండ్.. గౌహతిలో శ్రీలంక-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాక్ 21 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 99 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. బాబర్ ఆజమ్ (41), మొహమ్మద్ రిజ్వాన్ (34) క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. 28 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. అసలంక (18), ధనంజయ డిసిల్వ (17) క్రీజ్‌లో ఉన్నారు. -
తల్లిగా లాలిస్తూ.. మేయర్‌గా పాలన చేస్తూ..
తిరువనంతపురం: తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు నెలన్నర శిశువును చంకనెత్తుకుని విధులు నిర్వర్తిస్తున్న ఆమె ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు తెగ స్పందించారు. ఒక్క అమ్మకు మాత్రమే ఉన్న కళ ఇది అని తల్లితనాన్ని కొనియాడుతున్నారు. ఆర్య రాజేంద్రన్ మేయర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో తన నెలన్నర శిశువును ఒడిలో లాలిస్తూ.. ఓవో ఫైల్స్‌పై సంతకాలు చేస్తున్నారు. ఈ ఫొటోలు బయటకు రాగా.. నెటిజన్లు ప్రశంసించారు. ఇటు.. వ్యక్తిగతంగా.. అటు.. వృత్తిపరమైన బాధ్యతలను మహిళలు మేనేజ్ చేయగలరని కామెంట్లు పెడుతున్నారు. మహిళలు తల్లితనం కోసం వృత్తిపరమైన లక్ష్యాలను పక్కకుపెట్టాల్సిన అవసరం లేదంటూ స్పందించారు. ఆర్య రాజేంద్రన్ ఫొటో బయటకు వచ్చిన నేపథ్యంలో పనిచేసే ప్రదేశాల్లో పిల్లల సంరక్షణ సెంటర్ల ప్రాధాన్యతల గురించి చర్చిస్తున్నారు. పనిచేసే ప్రదేశాల్లో తగినన్ని ఏర్పాట్లపై ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. అటు.. ప్రభుత్వ కార్యాలయాల్లోకి పిల్లల్ని తీసుకురాకూడదు కదా..? అంటు మరికొందరు ప్రశ్నించారు. కేవలం ఫొటో షూట్ స్టంట్స్‌గా పేర్కొన్న మరికొంత మంది నెటిజన్లు.. సాధారణంగా రోజూవారి కూలీ చేసుకునేవారికి ఇది సాధ్యమవుతుందా..?అంటూ కామెంట్లు పెట్టారు. ఆర్య రాజేంద్రన్(24) 2020లో 21 ఏళ్లకే మేయర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి దేశంలోనే అత్యంత పిన్న వయస్కులైన మేయర్‌గా రికార్డ్‌కెక్కారు. అదే రాష్ట్రానికి చెందిన సీపీఐఎమ్ ఎమ్మెల్యే సచిన్ దేవ్‌ను వివాహం చేసుకున్నారు. సచిన్ కూడా దేశంలోనే అత్యంత చిన్న వయస్సులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వారికి ఈ ఏడాది ఆగష్టు 10న ఓ ఆడ శిశువు జన్మిచింది. ఇదీ చదవండి: నూతన పార్లమెంట్: ఆరు దర్వాజలకు ఆరు జంతువులు కాపలా.. అవి దేనికి ప్రతీక.. -
ఎయిర్‌పోర్టులో కోట్లు విలువచేసే మాదకద్రవ్యాలు పట్టివేత
కొచ్చిన్: డీఆర్ఐ కొచ్చిన్ జోనల్ పరిధిలోని కాలికట్ రీజనల్ యూనిట్ మాదకద్రవ్యాల అక్రమ రవాణాను భగ్నం చేసింది. యూపీలోని ముసాఫర్ నగర్‌కు చెందిన రాజీవ్ కుమార్ నుండి రూ. 44 కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) తెలిపిన వివరాల ప్రకారం యూపీకి చెందిన రాజీవ్ కుమార్ వద్ద నుండి 3.5 కిలోల కొకైన్‌ను 1.3 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి ఖరీదు సుమారు రూ.44 కోట్లు ఉండవచ్చని వారు తెలిపారు. రాజీవ్ కుమార్ మొత్తం 4.8 కిలోల మాదకద్రవ్యాలను నైరోబీ నుండి షార్జా మీదుగా ఎయిర్ అరేబియా ఫ్లైట్‌లో కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చారని తెలిపారు. నిందితుడు మాదకద్రవ్యాలను ఎవ్వరికీ కనిపించకుండా బూట్లలోనూ. హ్యాండ్ బ్యాగులోనూ, హ్యాండ్ పర్సులోనూ, చెకిన్ లగేజీ బ్యాగ్ లోనూ వీటిని అమర్చి అక్రమ రవాణా చేసేందుకు యత్నించాడని డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని అన్నారు డీఆర్ఐ ప్రతినిధులు. ఇది కూడా చదవండి: ఎప్పటిలోపు జమ్మును రాష్ట్రంగా ప్రకటిస్తారు? -
కేరళలో దారుణం.. ఐదేళ్ల బాలిక రేప్, హత్య..
తిరువనంతపురం: కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఓ వలస కార్మికుడు ఐదేళ్ల చిన్నారిని రేప్ చేసి చంపి గోనుసంచిలో కుక్కిన ఘటన సంచలనం రేపింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అదేరోజు అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎర్నాకుళం ఎస్పీ వివేక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్ నుండి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటున్న ఓ జంట తమ కూతురు కనిపించడంలేదని శనివారం సాయంత్రం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వెంటనే రెండు బృందాలుగా విడిపోయి ఒక బృందం పాప కోసం గాలించగా మరో బృందం స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించే పనిలో పడ్డారు. కొద్దిసేపు పరిశీలించిన తరవాత సీసీటీవీ ఫుటేజిలో కీలక ఆధారాలు బయటపడ్డాయి. అందులో అదే ఇంటికి పై పోర్షన్లో ఉండే బీహార్ కు చెందిన అస్ఫాక్ అస్లామ్ పాపను శనివారం సాయంత్రం 6.30 ప్రాంతంలో ఎత్తుకెళ్ళడం గమనించడం జరిగింది. వెంటనే అదేరోజు రాత్రి 9.30 గంటలకు అతడిని అదుపులోకి తీసుకున్నాం. కానీ అతడు మద్యం మత్తులో పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నందున రాత్రంతా విచారించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆదివారం ఉదయాన్న అతడు నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. అస్ఫాక్ అస్లామ్ చిన్నారిని తీసుకుని వెళ్తుండడం స్థానికంగా ఉన్న మరొక వ్యాపారి కూడా చూశానని చెప్పడంతో తమ అనుమానం నిజమైందని.. మా శైలిలో విచారణ జరిపించగా మద్యం మత్తులో బాలికపై అమానుషంగా బలాత్కారం చేసి, చంపి పక్కనే ఉన్న బురదలో పడేసి పైకి కనిపించకుండా గోనె సంచులను కప్పినట్లు అతడు నేరాన్ని అంగీకరించాడన్నారు. బాలికను సజీవంగా ఇవ్వలేకపోతున్నందుకు ఆ కుటుంబానికి ఎస్పీ క్షమాపణ చెప్పారు. ఇది కూడా చదవండి: కాశ్మీర్లో సెలవుపై వచ్చిన భారత జవాను అదృశ్యం -
రాంగ్ రూటులో వచ్చి అంబులెన్సును ఢీకొట్టిన మంత్రి కాన్వాయ్
తిరువనంతపురం: మంత్రి కాన్వాయ్‌లోని వాహనం వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో పేషెంట్‌ను తీసుకుని వెళ్తోన్న అంబులెన్స్ తిరగబడింది. అందులో ఉన్న పేషెంట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రెండు వాహనాల డ్రైవర్ల మీద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు తిరువనంతపురం పోలీసులు. కేరళ రాజధానిలోని బిజీ కూడలిలో రెడ్ సిగ్నల్ పడటంతో విద్యాశాఖ మంత్రి వి. శివన్ కుట్టి కాన్వాయ్ రాంగ్ రూట్లో వచ్చింది. అక్కడి ట్రాఫిక్ పోలీసులు మంత్రి కాన్వాయ్‌కు దారిచ్చేందుకు ట్రాఫిక్స్ను మళ్లించే ప్రయత్నం చేశారు. అంతలో అటుగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పేషెంటును ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్ సరైన దారిలోనే వచ్చింది. కానీ రోడ్డు మధ్యలో ఒక బైకు ఆగి ఉండడంతో దానిని తప్పించుకుని వెళ్ళింది. అది గమనించని మినిస్టర్ కాన్వాయ్ వాహనం అంబులెన్సును బలంగా ఢీకొట్టింది. వెంటనే అంబులెన్స్ పల్టీ కొట్టింది. అదృష్టావశాత్తు అక్కడే ఉన్న పోలీసు తృటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకున్నారు. కాన్వాయ్ వాహనం తర్వాత మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో వారు కూడా ప్రమాదం నుండి తప్పించుకున్నారు. కానీ అంబులెన్స్‌లోని పేషెంటుకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు అక్కడి పోలీసులు. మంత్రి కాన్వాయ్ వాహనాన్నినడిపిన డ్రైవరును అంబులెన్స్ డ్రైవరును ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. The convoy of Kerala Education Minister V. Sivankutty hit an ambulance and bike, but a case has been registered against the ambulance driver as well. VIP culture and a sense of Entitlement aren't going anywhere. That's lip-service. pic.twitter.com/NYLjhiRjMI — BALA (@erbmjha) July 14, 2023 ఇది కూడా చదవండి: కునో పార్కులో మరో చిరుత మృతి.. ఇక మిగిలినవి పదే! -
సుధామూర్తి సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు
సుధామూర్తి.. భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్తాపకులు నారాయణమూర్తి భార్య, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అత్తగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. విద్యావేత్త, రచయితగా, సామాజిక సేవకురాలిగా అనేక కార్యక్రమాలను నిర్వహించి మంచి పేరును సంపాదించారు. అంతేగాక ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. వివిధ రంగాలలో ఆమె అందించిన సేవలకుగానూ భారత ప్రభుత్వం సుధామూర్తిని పద్మభూషన్, పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. అయితే సంపన్న కుటుంబం, వేల కోట్ల ఆస్తులు, ఉన్నత స్థాయిలో ఉన్న సూధామూర్తి ఎప్పుడూ గర్వాన్ని ప్రదర్శించుకోరు. మాటల్లోనూ, చేతల్లోనూ ఎంతో నిరాడంబరత ప్రదర్శిస్తూ అందరి మన్ననలు అందుకుంటారు. తాజాగా మరోసారి ఆమె తన సింస్లిసిటీతో వార్తల్లోకెక్కారు. కేరళ తిరువనంతపురంలోని అట్టుకల్ భగవతి ఆలయంలో మంగళవారం జరిగిన ప్రసిద్ధ పొంగళ(Pongala) పండుగకు వేలాది మంది మహిళలు తరలివచ్చారు. ఈ వేడుకలను తిలకించేందుకు సుధామూర్తి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆమె అనేకమంది మహిళల మధ్య కూర్చొని పొంగళి (బియ్యం,కొబ్బరి, బెల్లంతో చేసే తీపి వంటకం) తయారు చేసి దేవతకు సమర్పించారు. అంతేగాక భక్తులకు ప్రసాదం వడ్డించడంలోనూ సాయం చేశారు. అయితే సుధామూర్తి వద్ద భద్రత, వీఐపీ హడావిడి లేకపోవడంతో తనను ఎవరూ గుర్తించలేకపోయారు. మహిళలందరితోపాటే గుడి వద్ద మండుతున్న ఎండలో కూర్చొని నైవేద్యాన్ని సిద్ధం చేస్తున్న ఆమె ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. A totally humbling experience. This is Sudha Murthy, Rishi Sunak's(PM) mother in-law!!!#SudhaMurthy #RishiSunak pic.twitter.com/ZrEAAHnds7 — Viren Patel (@shaakbhaji) March 11, 2023 సుధామూర్తి ఇంత సింపుల్‌గా కనిపించడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. భర్త, అల్లుడు గొప్ప స్థానంలో ఉన్నా ఆమెలో ఒకింత కూడా గర్వం నిపించడం లేదని ప్రశంసిస్తున్నారు. కాగా అత్యధికంగా మహిళలు తరలివచ్చే అట్టుకల్ పొంగళ పండుగకు తాను రావడం ఇదే తొలిసారి అని మూర్తి తెలిపారు. ఎంతో మంది మహిళలు కలిసి ఈ వేడుకలు చేసుకుంటున్నారని, అంతా ఒక్కటే అనే సందేశమిచ్చేదే ఈ వేడుక అని పేర్కొన్నారు. అందరూ సమానమేనన్న ఈ భావన తనకెంతో నచ్చిందన్నారు. i am proudly say that the women empower of india sri sudha murthy to lead our generation to power missile her is the founder of infosys nd everyone learns alot from her how to respect our culture traditions simplicity 🙏 @AskAnshul @SriSri @NameisNani @imVkohli @narendramodi pic.twitter.com/VTxAHxEprO — Rakurthi Suresh (@SureshnaiduR) March 10, 2023 చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. అంతటితో ఆగకుండా.. -
మలయాళ మొదటి హీరోయిన్ ఆమెనే.. గుర్తు చేసిన గూగుల్
ఇప్పుడు సినిమా అంటే రంగుల ప్రపంచం. స్క్రీన్‌పై మాయ చేసే ఓ కలర్‌పుల్ ప్రపంచం. మరీ అప్పట్లో సినిమాలు ఎలా ఉండేవో తెలుసా. అప్పటి నటీనటులు బ్లాక్ అండ్ వైట్ తెరపై ఎలా కనిపించారో మీరు కూడా చూసే ఉంటారు. అయితే ఆ కాలంలోనూ అత్యంత అణగారిన వర్గాల నుంచి వెలుగులోకి వచ్చిన నటి పీకే రోజీ. దళితులపై కఠినమైన ఆంక్షలున్న ఆ రోజుల్లో తెరపై కనిపించిన మొట్ట మొదటి మలయాళ నటి ఆమెనే. ఇవాళ ఆమె 120 బర్త్‌డే సందర్భంగా గూగుల్ ఆమెను గౌరవించింది. గూగుల్ డూడుల్ మొదటి మలయాళ నటిని బర్త్ డే సందర్భంగా ప్రదర్శించింది. ఆ సమయంలో అనేక అడ్డంకులను అధిగమించి సినిమాల్లో నటించింది. పీకే రోజీ 1903లో కేరళలోని త్రివేండ్రంలో(తిరువనంతపురం) రాజమ్మగా జన్మించింది. ఆమెది పేద కుటుంబం. చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడే ఆమె తండ్రి మరణించారు. ఆమె సంగీతం, నటనను గుర్తించిన రోజీ మేనమామ ప్రోత్సాహం అందించారు. నాటకాలు వేస్తూ తనలోని ప్రతిభను చాటుకుంది. ఆ విధంగా కక్కరిసీ అనే నాటకంపై గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నాటకం ఎక్కడ ప్రదర్శించినా అపూర్వ స్పందన వచ్చేది. ఈ క్రమంలోనే అప్పటి ఫిల్మ్ మేకర్ జేసీ డేనియల్ దృష్టిని ఆకర్శించారామె. ఆ తర్వాత తాను తీయబోయే విగతుకుమారన్ అనే చిత్రానికి రోజీని తన సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు. దీంతో మొట్టమొదటి దళిత హీరోయిన్గా రోజీ నిలిచింది. అయితే ఈ సినిమాలో పీకే రోజీ అగ్ర వర్ణ కులానికి చెందిన మహిళగా నటించారు. దీన్ని ఆ వర్గం వారు కొందరు వ్యతిరేకించారు. అంతేకాదు కాకుండా సినిమా ప్రారంభోత్సవానికి ఆమెను ఆహ్వానించొద్దని కూడా నిరసన చేశారు. సినిమా ప్రదర్శన సమయంలో తెరపై కొందరు రాళ్లు విసిరేశారట. అప్పటికీ కోపం తగ్గని వారంతా కలిసి రోజీ ఏదో నేరం చేసిందన్నట్టుగా ఇంటికి నిప్పు పెట్టారు. ఆ తర్వాత రోజీ ఓ లారీలో తమిళనాడుకు పారిపోయారని.. అక్కడ లారీ డ్రైవర్ కేశవన్ పిళ్లైని పెళ్లి చేసుకొని రాజమ్మాళ్ పేరుతో అక్కడే స్థిరపడిపోయారని సమాచారం. ఆమె ఒక నటి అన్న సంగతి కూడా ఆమె పిల్లలకు తెలియదని చెబుతారు. తాజాగా ఇవాళ (ఫిబ్రవరి 10) ఆమె జయంతి సందర్భంగా గూగుల్ డూడుల్‌తో గుర్తుకు తెచ్చింది. -
సచిన్ రికార్డుకు చేరువలో కోహ్లి! మనసులో మాట చెప్పిన రికార్డుల రారాజు
India vs Sri Lanka, 3rd ODI- Virat Kohli: ‘‘నాకసలు ఈ రికార్డుల గురించి ఐడియా లేదు. ఆటను ఆస్వాదిస్తూ జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడటమే నా పని. టీమ్‌ను గెలిపించాలనే మైండ్‌సెట్‌తోనే బ్యాటింగ్ చేస్తాను. నా ఆటకు అదనంగా వచ్చేవే ఈ రికార్డులు. కుదిరన్నన్నాళ్లు ఆడుతూనే ఉంటాను. సుదీర్ఘ విరామం తర్వాత జట్టులో పునరగామనం చేసినప్పటి నుంచి నూతనోత్సాహంతో ముందుకు సాగుతున్నా. మైలురాళ్లను చేరుకోవాలని తహతహలాడే తత్వం కాదు నాది. రికార్డుల కోసం వెంపర్లాడేవాడిని కాదు. కేవలం ఆటను ఆస్వాదించమే నాకు తెలుసు. ప్రస్తుతం నేను కాస్త రిలాక్స్ అవ్వగలుగుతున్నాను. ఈ ఫామ్‌ను ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నా’’ అని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఆగని రన్ మెషీన్ శ్రీలంకతో జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో రెండు సెంచరీలు నమోదైన విషయం తెలిసిందే. యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్.. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 116 పరుగులు చేయగా.. కోహ్లి 110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 166 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా వన్డే కెరీర్లో 46వ శతకం, ఓవరాల్‌గా 74వ అంతర్జాతీయ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో ఎన్నో అరుదైన ఘనతలు తన ఖాతాలో వేసుకున్నాడు కింగ్ కోహ్లి. అదే విధంగా లంకతో స్వదేశంలో మూడు వన్డేల సిరీస్‌లో రెండు శతకాలు బాదిన ఈ రన్‌మెషీన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. తన సంతోషాన్ని పంచుకున్నాడు. సచిన్ రికార్డుకు చేరువలో రికార్డుల కన్నా జట్టు ప్రయోజనాల గురించే ఎక్కువగా ఆలోచిస్తానని రికార్డుల రారాజు కోహ్లి మరోసారి స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే.. కోహ్లి మరో 3 సెంచరీలు బాదితే వన్డేల్లో సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డు(49) బద్దలవుతుంది. ఈ నేపథ్యంలో కోహ్లి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక తిరువనంతపురంలో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా 317 పరుగుల భారీ తేడాతో గెలుపొంది శ్రీలంకతో వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అంతకు ముందు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. చదవండి: IND vs SL: గ్రౌండ్లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్.. విరాట్ ఏం చేశాడంటే? IND vs SL: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా 𝗕𝗶𝗴𝗴𝗲𝘀𝘁 𝘄𝗶𝗻 𝗯𝘆 𝗺𝗮𝗿𝗴𝗶𝗻 𝗼𝗳 𝗿𝘂𝗻𝘀 𝗶𝗻 𝗢𝗗𝗜𝘀!#TeamIndia register a comprehensive victory by 3️⃣1️⃣7️⃣ runs and seal the @mastercardindia #INDvSL ODI series 3️⃣-0️⃣ 👏👏 Scorecard ▶️ https://t.co/q4nA9Ff9Q2……… pic.twitter.com/FYpWkPLPJA — BCCI (@BCCI) January 15, 2023 -
పద్మనాభస్వామి ఆశీస్సులు తీసుకున్న భారత క్రికెటర్లు
తిరువనంతపురం వేదికగా ఆదివారం (జనవరి15) శ్రీలంకతో నామమాత్రపు మాడో వన్డేలో టీమిండియా తలపడనుంది. మూడో వన్డేలో కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని రోహిత్ సేన భావిస్తుంటే.. కనీసం ఆఖరి వన్డేలోనైనా విజయం సాధించి పరువు నిలబెట్టకోవాలని భావిస్తోంది. ఇక ఇప్పటికే తిరువనంతపురంకు చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నాయి. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు కొంతమంది శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించారు. వారిలో సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. వీరందరూ సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. మూడో వన్డేకు తుది జట్లు(అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్,, కేెెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, మహమ్మద్ షమీ. శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, నువానిడు ఫెర్నాండో, చరిత్ అసలంక, దసున్ శనక (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వా, చమిక కరుణరత్నే, వానిందు హసరంగా, కసున్ రజిత, లాహిరు కుమార, దునిత్ వెలాలెజ్. చదవండి: SL vs IND: శ్రీలంకతో మూడో వన్డే.. గిల్, శ్రేయస్‌కు నో ఛాన్స్! కిషన్, సూర్య ఎంట్రీ -
డెలివరీ ఫెయిల్: జొమాటోకు భారీ షాక్
న్యూఢిల్లీ: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్డర్‌ను డెలివరీ చేయనందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. తిరువనంతపురానికి చెందిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి ఆర్డర్ డెలివరీ చేయక పోవడంతో భారీ జరిమానా చెల్లించింది.(మునుగుతున్న ట్విటర్ 2.0? ఉద్యోగుల సంఖ్య తెలిస్తే షాకవుతారు!) యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో లా చివరి సంవత్సరం విద్యార్థి అరుణ్ జీ కృష్ణన్ తిరువనంతపురంలో జొమాటోలో రూ. 362 రూపాయలకు ఫుడ్ ఆర్డ్‌ర్ చేశారు. బ్యాంకు నుంచి మనీ కూడా డిడక్ట్ అయింది. కానీ అతనికి ఆర్డర్ డెలివరీ చేయడంలో జొమాటో విఫలమైంది. దీంతో వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీలో కూడా తనకు ఇలాంటి అనుభవమే ఎదురైందని కృష్ణన్ ఆరోపించారు. ఇందుకు తనకు రూ. 1.5 లక్షల నష్టపరిహారం, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ. 10వేలు చెల్లించాలని కోరారు.(ఉద్యోగుల ఝలక్, ఆఫీసుల మూత: మస్క్ షాకింగ్ రియాక్షన్) అయితే ఆర్డర్ ఎందుకు డెలివరీ చేయలేదనేదానిపై జొమాటో రెండు వివరణలిచ్చింది. కృష్ణన్ పేర్కొన్న చిరునామాలో ఆర్డర్ తీసు కోలేదని, చిరునామాలో సమస్య ఉందని తెలిపింది. తన యాప్‌లో సమస్యుందని దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీంతో కృష్ణన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చిన కోర్టు జొమాటోను దోషిగా ప్రకటించింది. వడ్డీ, కృష్ణన్ మానసిక వేదనకు పరిహారంగా 5వేల రూపాయలు, కోర్టు ఖర్చుల కింద 3వేల రూపాయలు మొత్తంగా రూ. 8,362 పెనాల్టీ విధించింది కొల్లాం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్. -
Hyderabad: రెస్టారెంట్ ఇన్ ఫ్లైట్.. పాత విమానాన్ని కొనుగోలు చేసి మరీ..
సాక్షి, హైదరాబాద్: గగన వీధుల్లో.. లోహ విహంగంలో కూర్చుని ఇష్టమైన ఆహారం భుజించడం ఎవరికైనా ఇష్టమే. అసలు విమాన ప్రయాణమే చేయనివారికైతే మరింత మధురానుభూతి. ఇలాంటి వారి కోసమే మన హైదరాబాదీలు సరికొత్త ఆలోచన చేశారు. ఆతిథ్య రంగంలో కొత్త ఆవిష్కరణలకు తెరలేపారు. ఆకాశంలో చుక్కల నడుమ రాకపోకలు సాగించే విమానాన్ని నేలమీద పెట్టి.. దీనినే ‘స్టార్’ హోటల్‌గా మార్చాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా షెడ్డుకు వెళ్లిన విమానాన్ని కొనుగోలు చేశారు. ఈ లైవ్ ఫ్లైట్ లోపలిభాగంలో మార్పులు, చేర్పులు చేసి.. రెస్టారెంట్‌గా మలచనున్నారు. ఆహార ప్రియులకు సరికొత్త ఆనుభూతిని మిగిల్చేలా.. దేశీయ, విదేశీ వంటకాలను వడ్డించనున్నారు. ఇప్పటివరకు కేవలం ఢిల్లీకి పరిమితమైన లైవ్ ఫ్లెయిన్ రెస్టారెంట్ త్వరలో సిటీజనులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే నగరవాసులకు హైదరాబాద్ స్టైల్ వంటకాల్లో పేరొందిన ‘పిస్తా హౌస్’ యాజమాన్యం.. ఈ రెస్టారెంట్‌ను త్వరలోనే నగర శివార్లలోని శామీర్‌పేట్‌లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. న్యూ ఇయర్ కానుకగా దీన్ని ప్రారంభించే అకాశముంది. కలల విమానంలో కడుపారా.. సామాన్యులకు విమానం అంటేనే పెద్ద వింత. దానిలో ప్రయాణించాలని చాలామంది కలలు కంటుంటారు. భోజనం చేసే అవకాశం దొరికితే ఎగిరి గంతేస్తారు. నిజమే విమానంలో కూర్చొని బిర్యానీ తింటూ.. విండో నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటే ఆ కిక్కే వేరు. ఇక శామీర్‌పేట చెరువు అందాలను వీక్షిస్తూ.. నచ్చిన ఫుడ్‌ను లొట్టలేసుకొని తింటుంటే ఈ మజానే వేరు. త్రివేండ్రంలో కొనుగోలు హోటల్రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వినూత్న ప్రయోగాలు చేసే పిస్తా హౌస్ యజమాని మహ్మద్ అబ్దుల్ మజీద్ మదికి విమాన రెస్టారెంట్ ఆలోచన తట్టింది. ఇప్పటికే లైవ్ ఫ్లైట్ కాకుండా.. మోడల్ విమానాల్లో రెస్టారెంట్లు నడుస్తున్నా ఆయన ఆలోచన లైవ్ ఫ్లెయిన్పైనే పడింది. దీంతో చెడిపోయిన, ఫిట్నెస్ లేని విమానాల కోసం ఆయన విమానయాన సంస్థలను సంప్రదించారు. ఈ క్రమంలోనే కేరళ త్రివేండ్రంలో ఎయిర్ ఇండియా వద్ద ఎ– 320 ఉందని తెలిసింది. దీన్ని వేలం ద్వారా కొనుగోలు చేసి.. ఇక్కడకు చేరుస్తున్నారు. ఇప్పటికే మార్గమధ్యలో ఉన్న ఈ లోహ విహంగం ఈ వారాంతానికి నగరానికి చేరుకోనుంది. ఈ విమానం కొనుగోలు, తరలింపు ఖర్చు రూ.కోటి. ఈ ఫ్లైట్‌ను సమూలంగా మార్చి లోపలిభాగంలో అధునాతన సీటింగ్, విమానంలోకి ప్రవేశించేందుకు ఎస్కలేటర్, విమానం ఆగిన ప్రదేశాన్ని రన్‌వే తరహాలో తీర్చిదిద్దనున్నారు. -
పక్కా ప్లాన్‌తో ప్రియుడి హత్య.. ఇప్పుడేమో మరో డ్రామా?!
క్రైమ్: సంచలనం సృష్టించిన షరోన్ రాజ్(23) హత్య కేసులో.. ఊహించని పరిణామం నెలకొంది. ప్రియుడ్ని పక్కా ప్లాన్‌తో హత్య చేసిందని భావిస్తున్న యువతి(22).. పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ పరిణామాన్ని కూడా డ్రామాగానే అనుమానిస్తుండడం గమనార్హం. తిరువనంతపురం పరసాలాకు చెందిన షరోన్ రాజ్(23)ను ప్రేమించిన ఉష అలియాస్ గ్రీష్మ(22)కు.. మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. అది తెలిసి ఆమెకు షరోన్ ఆమెకు కొన్నాళ్లు దూరంగా ఉన్నాడు. అయితే.. కావాలనే అతనికి మళ్లీ వాట్సాప్ ద్వారా దగ్గరైంది గ్రీష్మ. ఈ క్రమంలో అక్టోబర్ 14వ తేదీన ఇంటికి పిలిచి మరీ స్లోపాయిజన్ ఇచ్చి.. అతన్ని ఆస్పత్రిపాల్జేసింది. రెండు వారాల పాటు నరకం తర్వాత.. చికిత్స పొందుతూ గత సోమవారం అతను ఆస్పత్రిలోనే మరణించాడు. అయితే.. ఈ ఘటన తర్వాత నిందితురాలి కుటుంబం పరారు కాగా.. ఎట్టకేలకు ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్న ఉష.. అరెస్ట్ ముందర ఉత్కంఠకు తెర తీసింది. సోమవారం ఉదయం ఆత్మహత్యకు ప్రయత్నించిందని స్థానిక మీడియా ఛానెల్స్ కథనాలు వెలువరించాయి. ఆస్పత్రి బాత్రూంలో ఉన్న ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్‌ను తాగి.. ఆమె అపస్మారక స్థితికి వెళ్లిందని.. ఆపై వాంతులు చేసుకుంటూ పోలీస్ జీపు వైపు అడుగులేసిందని.. ఈ క్రమంలో ఆమెను గమనించిన సిబ్బంది వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగానే ఆమెను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే.. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గ్రీష్మ ఆత్మహత్యాయత్నాన్ని ఫేక్‌గా భావిస్తున్నారు. సింపథీ దక్కించుకోవడం, బయటకు వచ్చేందుకు ఆమె ఈ ప్రయత్నం చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు.. ఆమె కుటుంబానికి దగ్గరి బంధువైన వైద్యుడే.. ఆస్పత్రిలో ఆమెకు చికిత్స(డ్రామా) అందించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో.. గ్రీష్మ కస్టడీని పర్యవేక్షిస్తున్న అధికారులను సైతం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. రామవర్మంచిరై(కన్యాకుమారి, తమిళనాడు)కు చెందిన గ్రీష్మ అలియాస్ ఉష.. కేరళ తిరువనంతపురం పరసాలాకు చెందిన షరోన్ రాజ్‌తో ప్రేమలో ఉండేది. అయితే ఆమెకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయం కావడంతో.. షరోన్ ఆమెను కలిసి దిగిన ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు విషయం చెప్పి.. అంతా కలిసి పక్కా ప్లాన్‌తోనే షరోన్‌ను ఇంటికీ రప్పించి మరీ పురుగుల మందు లాంటి ద్రావణాన్ని బహుశా కషాయంలో కలిపి తాగించి హత్య చేశారు. అయితే.. గ్రీష్మకు పెళ్లైన కొన్నాళ్లకే భర్త చనిపోతాడని జ్యోతిష్యుడు చెప్పాడని, అందుకే వివాహాన్ని ఫిబ్రవరి దాకా వాయిదా వేసుకుందని షరోన్ కుటుంబం అనుమానం వ్యక్తం చేస్తోంది. దీంతో షరోన్ ద్వారా ఆ గండం తొలగించుకుందని ఆరోపిస్తోంది. ఈ మేరకు మూఢనమ్మకంతోనే తమ బిడ్డను హత్య చేయించిందని గ్రీష్మ కుటుంబంపై ఫిర్యాదు చేసింది. విశేషం ఏంటంటే.. కషాయంలో కలిపిన మందు ఏంటన్నదానిపై పోలీసులు ఇప్పటిదాకా ఒక నిర్ధారణకు రాకపోవడం!. -
ప్రేయసి కాదు.. ఆమె రాక్షసి!!
ప్రేమ మత్తులో మునిగిన యువకుడు.. అందులోంచి బయట పడలేకపోయాడు. ఆమె కోసం పరితపించిపోయి పిచ్చి ప్రేమను ప్రదర్శించాడు. చివరికి.. ప్రేమ పేరిట ఆమె ఆడిన నాటకంలో ఆ భగ్న ప్రేమికుడు కాస్త.. బలి పశువు అయ్యాడు. ప్రాణాల కోసం ఆస్పత్రిలో రోజుల తరబడి పోరాడి.. చివరకు కన్నుమూశాడు. కేరళ తిరువనంతపురంలో ఓ యువకుడి మరణం కేసు.. మిస్టరీగా మారింది. అతనెలా మరణించాడన్నది ఎటూ తేల్చలేకపోతున్నారు పోలీసులు. అయితే బాధిత కుటుంబం మాత్రం మూఢనమ్మకంతో.. ప్రియురాలే తమ బిడ్డ ప్రాణం తీసిందని అంటోంది. పరసాలాకు చెందిన షరోన్ రాజ్(23) గత కొంతకాలంగా ఉష అనే ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వృత్తి రిత్యా వేరే ఊర్లో ఉంటున్న షరోన్కి.. ఈమధ్య ఆమెకు మరో వ్యక్తితో ఎంగేజ్ మెంట్ అయ్యిందని విషయం తెలిసి షాకయ్యాడు. ఈలోపే ఉష అతనికి కాల్ చేసింది. తనకు ఇష్టం లేకుండా ఇంట్లో వాళ్ల బలవంతం మేరకు ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని చెప్పింది. దీంతో అప్పటి నుంచి అతను ఆమెకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే.. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు షరోన్ దగ్గర ఉన్నాయి. వాటి వల్ల ఎప్పటికైనా ప్రమాదం అనుకుందో ఏమో.. అతనితో వాట్సాప్ ఛాటింగ్ ద్వారా దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో.. అక్టోబర్ 10న షరోన్ పరసాలాకు వచ్చాడు. అక్టోబర్ 14న ఉదయం షరోన్‌కు ఉష ఫోన్ చేసింది. కలవాలని ఉందని.. బయటకు వెళ్దామని చెప్పింది. అయితే బైక్ సర్వీసింగ్‌కు ఇచ్చానని చెప్పడంతో ఫోన్ పెట్టేసింది. కాసేపు ఆగి మళ్లీ ఫోన్ చేసి ఇంట్లో ఎవరూ లేరు.. రమ్మని ఆహ్వానించింది. స్నేహితుడితో కలిసి రామవర్మంచిరై(కన్యాకుమారి, తమిళనాడు)లో ఉష ఇంటికి వెళ్లాడు షరోన్. స్నేహితుడు బయట ఎదురుచూస్తుండగా.. ఒక్కడే ఇంట్లోకి వెళ్లాడు. అయితే.. పావు గంటకు పొట్టచేత పట్టుకుని వాంతులు చేసుకుంటూ బయటకు వచ్చాడు షరోన్. ఆ తర్వాత కూడా ఇద్దరూ చాట్ చేసుకున్నారు. కషాయం, జ్యూస్‌ల్లో ఏం కలిపావని షరోన్ ఉషను నిలదీశాడు. అయితే తానేం కలపలేదని.. బహుశా పండ్ల రసం వికటించిందేమో అని సమాధానం ఇచ్చింది ఆమె. అక్కడితో వాళ్లిద్దరి ఛాటింగ్ ఆగిపోయింది. దారి పొడవునా నీలి రంగులో వాంతులు కావడంతో.. షరోన్‌ను పరసాలా ప్రభుత్వాసుపత్రిలో చేర్చాడు ఆ స్నేహితుడు. ఆపై తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. అక్కడ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు నార్మల్ రావడంతో.. ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత రెండు రోజులకు షరోన్ పరిస్థితి విషమించడంతో.. తిరిగి తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ ఆస్పత్రికి తరలించారు అతని పేరెంట్స్. 11 రోజుల పాటు చికిత్స పొందిన షరోన్‌కు లంగ్స్, కిడ్నీ ఒక్కొక్కటిగా దెబ్బ తింటూ వచ్చాయి. ఈలోపు షరోన్ నుంచి మెజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం సేకరించారు పోలీసులు. మరోవైపు వైద్యులు.. అతను తాగిన డ్రింక్‌లో యాసిడ్లాంటిది కలిసిందని నిర్ధారించారు. అయితే ఏం కలిపారనే దానిపై మాత్రం స్పష్టత రాలేదింకా. ఇక ఈ కేసులో పోలీసుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల దర్యాప్తు పూర్తిగా నిందితుల కుటుంబానికి అనుకూలంగా ఉందని ఆరోపిస్తోంది బాధిత కుటుంబం. అంతేకాదు.. పరారీలో ఉన్న ఉష కుటుంబాన్ని పోలీసులు ఇంతదాకా ట్రేస్ చేయలేకపోయారు. ఆ గండం గట్టెక్కేందుకే.. ఉష కుటుంబానికి షరోన్ రాజ్ నచ్చలేదు. అందుకే మరో వ్యక్తితో ఉషకు పెళ్లి ఫిక్స్ చేసి.. ఎంగేజ్మెంట్ కూడా కానిచ్చేశారు. పెళ్లి సెప్టెంబర్‌లోనే జరగాల్సి ఉండగా.. ఆఖరి నిమిషంలో ఎందుకనో ఫిబ్రవరికి వాయిదా వేశారు. దీంతో.. తమ బిడ్డ మరణం వెనుక మూఢనమ్మక కోణం కూడా ఉందని షరోన్ కుటుంబం ఆరోపిస్తోంది. ఉషకు పెళ్లైన వెంటనే భర్త మరణించే గండం ఉందని, ఆ దోషం పొగొట్టేందుకు తమ బిడ్డతో బలవంతంగా ఆమె నుదుట కుంకుమ పెట్టించారని షరోన్ కుటుంబం అంటోంది. ఉష ఇంటి నుంచి బయటకు వచ్చిన షరోన్ నుదుటిపై కూడా కుంకుమ ఉందని, ఆ విషయాన్ని కూడాఉన్న స్నేహితుడు సైతం నిర్ధారించాడని అంటోంది. ఇంటికి పిలిపించి మరీ పక్కా ప్లాన్‌తో ఉషతో బలవంతపు వివాహం జరిపించి.. ఆపై ఏదో తాగించి షరోన్ మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తోంది. ఇలాంటిదే మరో ఘటన.. షరోన్ రాజ్‌తో పాటు మరో చిన్నారి మృతి కేసు కూడా కేరళలో మిస్టరీగా మారింది. సెప్టెంబర్ 24వ తేదీన అథెన్కోడ్కు చెందిన ఓ స్కూల్ విద్యార్థి.. మరో విద్యార్థి ఇచ్చిన డ్రింక్ తాగి ఆస్పత్రి పాలయ్యాడు. ఆ డ్రింకులోనూ యాసిడ్ తరహా ఆనవాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మూడు వారాలపాటు చికిత్స పొందిన 11 ఏళ్ల ఆ బాలుడు.. చివరికి ఆర్గాన్ ఫెయిల్యూర్‌తోనే కన్నుమూశాడు. సుచింద్రమ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేపట్టగా.. షరోన్ రాజ్ మృతి కూడా అదే తరహాలో చోటు చేసుకోవడం గమనార్హం. -
Ind Vs SA: రోహిత్ శర్మ చెత్త రికార్డు.. మొదటి టీమిండియా బ్యాటర్‌గా..
India vs South Africa, 1st T20I- Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు టీ20 ఫార్మాట్లో ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విధ్వంసకర ఆట తీరుతో పొట్టి ఫార్మాట్లో హిట్‌మ్యాన్ ఇప్పటికే అనేక రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక పరుగుల వీరుడు సహా అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్(176)గా రోహిత్ కొనసాగుతున్నాడు. హిట్‌మ్యాన్ చెత్త రికార్డు అయితే, దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. కేరళలోని తిరువనంతపురం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఈ టీమిండియా ఓపెనర్‌గా డకౌట్‌గా వెనుదిరిగాడు. కగిసో రబడ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్వింటన్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రోహిత్ ఏకంగా.. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20లలో అత్యధికసార్లు డకౌట్ అయిన భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. హిట్‌మ్యాన్ ఇప్పటివరకు తొమ్మిదిసార్లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇక జాబితాలో రోహిత్ తర్వాతి స్థానంలో టీమిండియా మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(5 సార్లు) నిలవగా.. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి 4 సార్లు డకౌట్ అయ్యాడు. అర్ష్, చహర్ అద్భుతం.. శుభారంభం.. ఇదిలా ఉంటే.. టీమిండియా బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చహర్ సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఆరంభంలోనే అర్ష్ మూడు, చహర్ రెండేసి వికెట్లు పడగొట్టడంతో.. 106 పరుగులకే పరిమితమైంది పర్యాటక ప్రొటిస్ జట్టు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేఎల్ రాహుల్(51), సూర్యకుమార్ యాదవ్(50) అర్ధ శతకాలతో రాణించడంతో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ఆటగాళ్లు: రోహిత్ శర్మ- 9 కేఎల్ రాహుల్- 5 విరాట్ కోహ్లి- 4 చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. టీమిండియా అత్యంత చెత్త రికార్డు! IND vs SA: చాహర్ అద్భుతమైన ఇన్ స్వింగర్.. ప్రోటీస్ కెప్టెన్‌కు ఫ్యూజ్‌లు ఔట్ -
Ind Vs SA: అతడు లేడు.. టీమిండియా ఓడిపోతుంది: భారత మాజీ క్రికెటర్
India vs South Africa, 1st T20I: దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ ఆరంభం నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులో లేకపోవడం తీరని లోటు అని.. తొలి మ్యాచ్‌లో రోహిత్ సేనకు పరాజయం తప్పదని జోస్యం చెప్పాడు. ఎయిడెన్ మార్కరమ్, క్వింటన్ డికాక్ చేరికతో దక్షిణాఫ్రికా జట్టు పటిష్టంగా కనిపిస్తోందని.. మొదటి టీ20లో బవుమా బృందం విజయం సాధిస్తుందని అంచనా వేశాడు. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కేరళలోని తిరువనంతపురం వేదికగా బుధవారం(సెప్టెంబరు 28) భారత్- సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 జరుగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇరు జట్లు అక్కడికి చేరుకున్నాయి. ఇక టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న వేళ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అదరగొట్టిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు.. పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. అతడు లేని భారత జట్టు బలహీనం! ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. మ్యాచ్ ఫలితాన్ని అంచనా వేసే క్రమంలో.. ‘‘చివరిసారి దక్షిణాఫ్రికా జట్టు ఇక్కడికి వచ్చినపుడు ఎయిడెన్ మార్కరమ్ లేడు. డికాక్ కూడా ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. అందుకే అప్పుడు ప్రొటిస్ కాస్త బలహీనంగా కనిపించింది. కానీ ఇప్పుడు వాళ్లిద్దరూ జట్టులో ఉన్నారు. డెత్ ఓవర్లలోనూ.. ఇక టీమిండియా విషాయనికొస్తే హార్దిక్ పాండ్యా లేకపోవడంతో జట్టు కాస్త బలహీనపడిందని చెప్పొచ్చు. నాకు తెలిసి ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతుంది. ఈ సిరీస్‌కు పాండ్యా అందుబాటులో లేకపోవడం ఒక కారణం అయితే.. డెత్ ఓవర్లలో భారత్ బౌలింగ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇక భువనేశ్వర్ కుమార్ ఇటీవలి కాలంలో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అయితే, ఈ సిరీస్‌కు అతడు దూరంగా ఉన్నాడు. కానీ తర్వాత అతడు ఎలా ఆడతాడన్నది చూడాలి. నాకైతే భువీ విషయంలో నమ్మకం కాస్త సడలింది. ఇక గాయం నుంచి కోలుకున్న ఆటగాడు సర్దుకోవడానికి కాస్త సమయం పడుతుంది. హర్షల్ పటేల్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఆసీస్‌తో మూడో టీ20లో ఫైనల్ ఓవర్ అతడు బౌల్ చేసిన విధానం చూస్తే ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపిస్తోంది. ఏదేమైనా డెత్ ఓవర్లలో భారత బౌలింగ్ అంశం కలవరపెడుతోందన్నది వాస్తవం’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కాగా గాయం కారణంగా ఆసియా కప్-2022కు దూరమైన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. మూడోసారి! ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికాతో టీమిండియాకు ఇది మూడో ద్వైపాక్షిక సిరీస్. జనవరిలో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లగా.. జూన్‌లో ఆ జట్టు ఇక్కడికి వచ్చింది. తాజాగా మరోసారి దక్షిణాఫ్రికా భారత పర్యటనకు వచ్చింది. చదవండి: Ind Vs SA T20, ODI Series: దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20, వన్డే సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్! ఇతర వివరాలు Ind Vs SA 1st T20: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. సొంతగడ్డపై ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని భారత్! వరణుడు కరుణిస్తేనే! -
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్: సొంతగడ్డపై ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని భారత్! ఈసారైనా..
South Africa tour of India, 2022- India vs South Africa, 1st T20I: స్వదేశంలో మరో టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్- 2022 టోర్నీ ఆరంభానికి ముందు పటిష్టమైన దక్షిణాఫ్రికాతో పోటీకి సై అంటోంది. వరల్డ్‌కప్ డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించిన రీతిలోనే ప్రొటిస్‌ను మట్టికరిపించి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. సొంతగడ్డపై కూడా సౌతాఫ్రికాను ఓడించి ట్రోఫీ గెలవలేకపోతోందన్న అపవాదును చెరిపేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో కేరళలోని తిరువనంతపురం వేదికగా బుధవారం జరుగనున్న మొదటి టీ20లో శుభారంభం చేసేందుకు సన్నద్ధమవుతోంది రోహిత్ సేన. ఇక బవుమా బృందం సైతం గత రికార్డును కొనసాగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పిచ్, వాతావరణం, మ్యాచ్ ఆరంభ సమయం, ప్రత్యక్షప్రసారం, పొట్టి ఫార్మాట్లో భారత్- దక్షిణాఫ్రికా ముఖాముఖి రికార్డులు పరిశీలిద్దాం. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మొదటి టీ20(సెప్టెంబరు 28) వేదిక: గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం- తిరువనంతపురం- కేరళ మ్యాచ్ ఆరంభ సమయం: రాత్రి ఏడు గంటలకు ఆరంభం ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్ పిచ్, వాతావరణం ఈ గ్రీన్‌ఫీల్డ్ మైదానం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. ఇక్కడ రెండు టి20 మ్యాచ్‌లు జరిగాయి. 2017లో న్యూజిలాండ్‌తో ఎనిమిది ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్ గెలిచింది. 2019లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్లతో ఓడింది. బుధవారం వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశముంది. సొంతగడ్డపై ఒక్కసారి కూడా! స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు ద్వైపాక్షిక టి20 సిరీస్‌లు ఆడినా భారత్ ఒక్క సిరీస్‌నూ గెలవలేకపోయింది. 2015లో దక్షిణాఫ్రికా 2–0తో సిరీస్‌ను దక్కించుకోగా... 2019లో, 2022లో సిరీస్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ముఖాముఖి రికార్డులు.. డీకే ఒక్కడే! దక్షిణాఫ్రికాతో ఇప్పటివరకు భారత్ 20 టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 11 మ్యాచ్‌ల్లో భారత్, 8 మ్యాచ్‌ల్లో దక్షిణా ఫ్రికా గెలిచాయి. మరో మ్యాచ్ రద్దయింది. కాగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ 2006లో డిసెంబర్ 1న జరిగింది. ఆ మ్యాచ్‌లో ఆడిన ఆటగాళ్లలో ప్రస్తుతం దినేశ్ కార్తీక్ ఒక్కడే తాజా సిరీస్ లోనూ ఆడుతున్నాడు. చదవండి: T20 World Cup 2022: ఈ ముగ్గురిని ఎంపిక చేసి తప్పుచేశారా? వీళ్లకు బదులు.. Irfan Pathan: 'ధోని వల్లే కెరీర్ నాశనమైంది'.. ఇర్ఫాన్ పఠాన్ అదిరిపోయే రిప్లై Hello Thiruvananthapuram 👋 Time for the #INDvSA T20I series. 👍#TeamIndia | @mastercardindia pic.twitter.com/qU5hGSR3Io — BCCI (@BCCI) September 27, 2022 -
టీమిండియాకు నిరసన సెగ.. సంజూ అభిమానుల ఆందోళన
ఆస్ట్రేలియాతో సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. ఇప్పడు దక్షిణాఫ్రికాతో పోరుకు సిద్దమైంది. స్వదేశంలో ప్రోటీస్ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు భారత్ ఆడనుంది. బుధవారం(సెప్టెంబర్ 28) తిరువనంతపురం వేదికగా జరగనున్న తొలి టీ20తో దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది ఈ క్రమంలో ప్రోటీస్‌తో తొలి టీ20లో పాల్గొనేందుకు తిరువనంతపురంలో అడుగుపెట్టిన భారత జట్టుకు నిరసన సెగ తగిలింది. టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కని సంజూ శాంసన్‌కు మద్దతుగా అభిమానులు భారీ సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. భారత క్రికెటర్లు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే సంజూ సంజూ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. కాగా సంజూకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా అతడి సొంత రాష్ట్రం కేరళలో అయితే డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను భారత కెప్టెన్ రోహిత్ పాటు చాహల్, అశ్విన్ తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. కాగా టీ20 ప్రపంచకప్‌కు పంత్ స్థానంలో సంజూను ఎంపిక చేసి ఉంటే బాగుండేది అని అతడు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా అతడి అభిమానులు తిరువనంతపురంలో జరగనున్న భారత్-దక్షిణాఫ్రికా తొలి టీ20 సందర్భంగా బీసీసీఐకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని ముందుగానే నిర్ణయించకున్నారు. Sanju Samson is not just a player he is an emotion for all of us. pic.twitter.com/QT4alXGLT6 — Rockstar MK (@RockstarMK11) September 26, 2022 స్వదేశంలో న్యూజిలాండ్-ఏ తో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో భారత-ఏ జట్టు కెప్టెన్‌గా శాంసన్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే భారత్ సొంతం చేసుకుంది. చదవండి: IND vs SA: టీమిండియాతో టీ20 సిరీస్.. భారత్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టు -
టీమిండియాతో టీ20 సిరీస్.. భారత్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టు
టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడేందుకు దక్షిణాఫ్రికా జట్టు భారత గడ్డపై అడుగు పెట్టింది. భారత పర్యటనలో భాగంగా ప్రోటీస్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. బుధవారం( సెప్టెంబర్ 28) తిరువనంతపురం వేదికగా తొలి టీ20తో దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆదివారం తిరువనంతపురంకు చేరుకున్న ప్రోటీస్ ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సౌతాఫ్రికా క్రికెట్ ట్విటర్లో షేర్ చేసింది. ఇక తిరువనంతపురంకు చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టు సోమవారం తమ తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. సోమవారం తిరువనంతపురంకు చేరుకునే అవకాశం ఉంది. కాగా టీ20 ప్రపంచకప్-2022 సన్నాహాకాల్లో భాగంగానే ఈ సిరీస్‌ను ఇరు జట్ల క్రికెట్ బోర్డులు ప్లాన్ చేశాయి. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా. భారత్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు దక్షిణాఫ్రికా జట్టు: టీ20 జట్టు: తెంబా బవుమా(కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, జానేమన్ మలన్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, వానే పార్నెల్, పెహ్లుక్వాయో, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబడ, తబ్రేజ్ షంసీ. వన్డే జట్టు: తెంబా బవుమా(కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, వానే పార్నెల్, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబడ, రీలీ రోసోవ్, తబ్రేజ్ షంసీ, జోర్న్ ఫార్చూన్, పెహ్లుక్వాయో, మార్కో జాన్సేన్, ట్రిస్టన్ స్టబ్స్. Touchdown India 🇮🇳#INDvSA #BePartOfIt pic.twitter.com/17duazX1CP — Proteas Men (@ProteasMenCSA) September 25, 2022 చదవండి: Ind Vs SA T20, ODI Series: దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20, వన్డే సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్! ఇతర వివరాలు -
వార్తల్లోకెక్కిన శ్రీకార్యం బస్టాండ్.. కూల్చేసిన ప్రభుత్వం
తిరువనంతపురం: ఏమాత్రం సిగ్గుపడకుండా అబ్బాయి వడిలో అమ్మాయిలు కూర్చుని ఆ మధ్య సోషల్ మీడియాలో ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. స్థానికులు ఓ బస్టాండ్‌లో చేసిన పనితో.. మండిపోయిన కాలేజీ స్టూడెంట్స్ ఈ ట్రెండ్‌ను పుట్టించారు. అయితే వార్తల్లో చర్చనీయాంశంగా మారిన ఆ బస్టాండ్‌ను.. రెండు నెలల తర్వాత ఇప్పుడు కూల్చేయాలని అధికారులు నిర్ణయించారు. అమ్మాయిలు, అబ్బాయిలు పక్కపక్కనే కూర్చుంటున్నారంటూ తిరువనంతపురం శ్రీకార్యం బస్టాండ్ బెంచ్‌ను మూడు ముక్కలు చేశారు స్థానికులు. ఇది నచ్చని కొందరు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు.. ఆ మూడు ముక్కలపై ఒళ్లో కూర్చుని ఫొటోలు పెట్టి వైరల్ చేశారు. అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు కూర్చున్న ఫొటోలు తెగ ట్రెండ్ అయ్యాయి. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో ఆ బస్ షెల్టర్‌ను తాత్కాలికంగా సీజ్ చేశారు పోలీసులు. జులైలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ విషయం ప్రభుత్వం దాకా వెళ్లడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ బస్టాండ్‌ను పడగొట్టాలని నిర్ణయించడంతో విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆ స్థానంలో కొత్త బస్టాండ్‌ను, అదీ లింగ వివక్షకు తావు లేకుండా ఉండేలా చూస్తామని విద్యార్థులకు మాటిచ్చారు మేయర్ ఆర్య రాజేంద్రన్. స్థానికులు చేసిన ఆ పని అనవసరమైందని, ప్రొగ్రెసివ్ స్టేట్‌గా పేరున్న కేరళలలో ఇలాంటి ఘటనలు జరగడం మంచిది కాదని ఆమె పేర్కొన్నారు. అలాగే.. అబ్బాయిలు-అమ్మాయిలు కలిసి కూర్చోవడంపై రాష్ట్రంలో ఎలాంటి నిషేధం లేదన్న ఆమె.. అలా కనిపించిన వాళ్లను వేధించే సంస్కృతి ఏనాడో అంతరించిపోయిందని గుర్తు చేశారు. ఇదీ చదవండి: వాళ్లు చదువుకునేలా ఏదైనా సాయం చేయండి -
దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ భేటీ.. హాజరైన ఏపీ మంత్రులు బుగ్గన, పెద్దిరెడ్డి
సాక్షి, తిరువనంతపురం: దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ కేరళ రాజధాని తిరువనంతపురంలో శనివారం సమావేశమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో వివిధ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విభజన సమస్యలను మంత్రులు ప్రస్తావించారు. అలాగే తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు ఇవ్వాలని కోరారు. రెవెన్యూ లోటు గ్రాంట్, 7 జిల్లాల ప్యాకేజీ నిధులు, రామాయపట్నం పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టు గురించి సైతం ప్రస్తావించారు. మరోవైపు ఈ సమావేశానికి తెలంగాణ తరపున హోంమంత్రి మహమూద్ ఆలీ, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీరు ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్ బకాయిలు, విభజన సమస్యలు, కృష్ణా జలాల పంపిణీ, నీటిపారుదలకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. చదవండి: పులివెందులను టచ్ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా?: జోగి రమేష్ -
ఎనిమిదేళ్లుగా వీడని చిక్కుముడులు.. త్వరగా తేల్చండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లయినా సమస్యలు కొలిక్కి రాలేదని, వాటిని తక్షణమే పరిష్కరించాల్సిందిగా దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో డిమాండ్ చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. సమస్యలకు పరిష్కారాలను సూచించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరాలన్నారు. ఆ వ్యవస్థ కేవలం పరిష్కారాలను చూపడమే కాకుండా దక్షిణాది రాష్ట్రాల మండలి తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేదిగా ఉండాలని గట్టిగా డిమాండ్ చేయాలని సూచించారు. కేరళలోని తిరువనంతపురంలో సెప్టెంబర్ 3న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల మండలి భేటీ జరగనున్న నేపథ్యంలో భేటీలో చర్చించాల్సిన అంశాలపై సీఎం జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాప్యంతో మరింత నష్టం దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో రాష్ట్రం తరఫున 19 అంశాలను అజెండాలో పొందుపరచినట్లు అధికారులు వివరించారు. విభజన సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతున్నకొద్దీ రాష్ట్రానికి మరింత నష్టం జరుగుతోందనే అంశాన్ని సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇప్పటికే విభజన వల్ల రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని, హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోయిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సమస్యలను తక్షణమే పరిష్కరించడంపై దృష్టి సారించాల్సిందిగా సమావేశంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తగినన్ని నిధులు విడుదల చేసే అంశాన్ని కూడా అజెండాలో చేర్చాలని సీఎం ఆదేశించారు. బుగ్గన నేతృత్వంలో అధికారుల బృందం తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశానికి తాను హాజరుకావడం లేదని సీఎం జగన్ తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర అధికారుల బృందం ఈ సమావేశానికి హాజరవుతుందని చెప్పారు. ఈ సమీక్షలో విద్యుత్, గనులు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధిక, ప్రణాళిక, శాససనభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ కె.విజయానంద్, ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్.ఎస్.రావత్, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, జీఏడీ ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్.ప్రేమచంద్రారెడ్డి, ప్రణాళిక శాఖ కార్యదర్శి జి.విజయ్ కుమార్, న్యాయశాఖ కార్యదర్శి జి.సత్య ప్రభాకర్‌రావు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
యూట్యూబ్‌లో చూసి వైన్ తయారీ.. స్నేహితుడికి తాగించడంతో..
తిరువనంతపురం: మనకంటూ ఓ మొబైల్, అందులో ఇంటర్నెట్ ఉంటే చాలు.. ప్రపంచమంతా మన చేతిలో ఉన్నట్లే. ఏది కావాలన్న, ఏం తెలుసుకోవాలన్న క్షణంలో గూగుల్, యూట్యూబ్‌లో వెతికేస్తున్నారు. సాధారణంగా యూట్యూబ్ ద్వారా చాలామంది వంటలు, అల్లికలు వంటి వాటిని నేర్చుకుంటుంటారు. తాజాగా ఓ మైనర్ బాలుడు యూట్యూబ్‌లో చూసి మద్యం ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు. నేర్చుకున్నట్లే ద్రాక్ష పండ్లతో మద్యాన్ని కూడా తయారు చేశాడు. అయితే అక్కడే అతనికి దెబ్బకొట్టింది. అసలేం జరిగిందంటే కేరళలోని తిరువనంతపురం చిరాయింకీజుకు చెందిన 12 ఏళ్ల బాలుడు యూట్యూబ్‌లో వీడియోలు చూసి ద్రాక్ష పండ్లతో మద్యాన్ని తయారుచేశాడు. అంతేగాక ఈ వైన్‌ను రుచి చూడాలని చెప్పి తన స్నేహితులకు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకేముంది తాగిన కాసేపటికి స్నేహితుల్లోని ఓ యువకుడు అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు చేసుకొని ఆస్పత్రిలో చేరాడు. కల్తీ మద్యం తాగిన బాలుడిని వెంటనే చిరాయింకీజులోని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన తిరువనంతపురంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. పోలీసుల విచారణలో తన తల్లిదండ్రులు కొనుగోలు చేసిన ద్రాక్ష పండ్లతోనే మద్యం తయారు చేశానని బాలుడు చెప్పాడు. అందులో ఎలాంటి రసాయనాలు కలపలేదని తెలిపాడు. యూట్యూబ్‌లో చూపించిన విధంగా వైన్ తయారు చేసి దానిని ఒక సీసాలో నింపి.. కొన్ని గంటలు భూమిలో పాతిపెట్టినట్లు వివరించారు. ఆ తర్వాత స్నేహితుడికి ఇచ్చినట్లు చెప్పాడు. కాగా బాలుడు తయారు తయారు చేసిన వైన్ బాటిల్‌ను పోలీసులు స్థానిక కోర్టు అనుమతితో పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. అయితే వైన్‌లో మరేదైనా ఆల్కహాల్ కలిపినట్లు, ఇంకేదైనా రసాయనాలు కలిపినట్లు తేలితే బాలుడిపై జువెనల్ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
కేరళ సీఎం పినరయి విజయన్‌కు కోర్టు షాక్
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు షాక్ ఇచ్చింది స్థానిక కోర్టు. ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్‌తో పాటు సీఎం వ్యక్తిగత సిబ్బంది ఇద్దరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను బుధవారం ఆదేశించింది తిరువనంతపురం కోర్టు. ఇండిగో విమానంలో కాంగ్రెస్ నేతలతో జరిగిన తోపులాటకు సంబంధించి.. జయరాజన్‌పై ఎలాంటి చర్యలు అవసరం లేదని, తీసుకోబోమని అసెంబ్లీ సాక్షిగా సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. ఈ ప్రకటన ఇచ్చిన మరుసటి రోజే .. ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది కోర్టు. ఈ వ్యవహారానికి సంబంధించి బెయిల్ మీద బయటకు వచ్చిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇద్దరు.. జయరాజన్‌పై ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో బుధవారం విచారణ సందర్భంగా తిరువనంతపురం జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జయరాజన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని వలియాథుర పోలీసులను ఆదేశించింది. జయరాజన్‌తో పాటు సీఎం వ్యక్తిగత సిబ్బంది అనిల్ కుమార్, సునీష్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలని, బాధితులు పేర్కొంటున్నట్లు కుట్రపూరిత నేరం.. హత్యాయత్నం కింద నేరారోపణలు నమోదు చేయాలని పోలీసులకు న్యాయస్థానం స్పష్టం చేసింది. జూన్ 13వ తేదీన.. ఇండిగో విమానంలో సీఎం పినరయి విజయన్ సమక్షంలోనే నిరసన చేపట్టారు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఆ సమయంలో జయరాజన్, సీఎం సిబ్బంది తమ కార్యకర్తలపై దాడి చేశారన్నది కాంగ్రెస్ వాదన. నిరసనల వ్యవహారానికి సంబంధించి హత్యాయత్నం నేరం కింద ఇద్దరు కార్యకర్తలతో పాటు సూత్రధారిగా అనుమానిస్తూ మాజీ ఎమ్మెల్యే శబరినాథన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సరైన ఆధారాలు లేవంటూ వాళ్లకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. In a major security lapse, Youth Congress workers protest against Kerala Chief Minister Pinarayi Vijayan on the flight from Kannur to Trivandrum. Meanwhile, the Kerala CM has arrived in Trivandrum. More details awaited. @IndiaAheadNews pic.twitter.com/2oKyz20rsr — Korah Abraham (@thekorahabraham) June 13, 2022 ఇదిలా ఉంటే కోర్టు ఆదేశాలపై ఈపీ జయరాజన్ స్పందించారు. కోర్టులన్నాక ఇలాంటి ఆదేశాలు ఇస్తాయని, వాటిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారాయన. మరోవైపు జయరాజన్‌తో పాటు ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలపై నిషేధం విధించింది ఇండిగో. ఈ బ్యాన్పై స్పందించిన జయరాజన్.. జీవితంలో తానుగానీ, తన కుటుంబంగానీ ఇండిగో ఫ్లైట్ ఎక్కబోమంటూ శపథం చేశారు. అంతేకాదు ఈ మధ్యే రైలులో ప్రయాణించి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వదిలారు కూడా. అయితే జయరాజన్‌పై నిషేధం ప్రకటించిన కొన్నాళ్లకే.. ఇండిగోకు చెందిన ఓ బస్సును ఫిట్నెస్ లేదంటూ అధికారులు సీజ్ చేయడం విశేషం. -
ఉమెన్–ఓన్లీ: స్టార్ ట్రావెలర్
‘ప్రయాణం అంటే కొత్త ప్రదేశానికి వెళ్లి సెల్ఫీ దిగడం కాదు. మనలోకి మనం ప్రయాణించడం. కొత్త వెలుగుతో తిరిగి రావడం. కొత్తగా జీవించడం’ అంటున్న సజ్నా అలి ‘ఉమెన్–ఓన్లీ ట్రావెల్ గ్రూప్’తో గెలుపు జెండా ఎగిరేసింది. రెండు ఊళ్లు దాటి బయటికి వెళ్లని మహిళలకు కూడా ప్రయాణాలలో ఉండే మజాను పరిచయం చేసింది. వారిని ప్రయాణ ప్రేమికులుగా మార్చింది.... సజ్నా అలి (తిరువనంతపురం, కేరళ)కి ప్రయాణం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే తను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ట్రావెల్ ఏజెన్సీని మొదలు పెట్టేలా చేసింది. గతంలోకి వెళితే... సజ్నా నాన్న ట్రక్‌డ్రైవర్. తన వృత్తిలో భాగంగా ఎన్నో ఊళ్లు, ప్రదేశాలు తిరిగేవాడు. తాను చూసిన విశేషాలను రాత్రి పడుకునే ముందు పిల్లలకు కథలుగా చెప్పేవాడు. ఇక అప్పటి నుంచి మొదలైన ఆసక్తి తనతోపాటు ప్రయాణిస్తూనే ఉంది. ‘ఈ ప్రపంచం అంతా చుట్టి రావాలి’ అనే ఒక లక్ష్యాన్ని అయితే నిర్దేశించుకుంది గానీ, ఆర్థికపరిమితుల వల్ల అది సాధ్యం కాక ఒక్క దేశాన్ని కూడా చూడలేకపోయింది. తిరువనంతపురం టెక్నోపార్క్‌లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో తన మనసంతా ప్రయాణాల చుట్టే తిరిగేది. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ‘ఉమెన్–వోన్లీ ట్రావెల్ గ్రూప్’కు శ్రీకారం చుట్టింది. ‘ఇదేం చోద్యమమ్మా’ అన్నారు చాలామంది. ‘బంగారంలాంటి ఉద్యోగాన్ని వదిలి ట్రావెల్ ఏజెన్సీ నడపాలనుకోవడం తెలివైన పని కాదు’ అన్నారు. ‘ట్రావెల్ ఏజెన్సీ రంగంలో మహిళలు విజయం సాధించలేరు’ అని నిరాశ పరిచారు. కట్ చేస్తే... సజ్నా ట్రావెల్ ఏజెన్సీ కేరళలో అగ్రస్థానంలో ఉంది. తమ ట్రావెల్ ప్లాన్స్, ప్రత్యేకతలను ప్రచారం చేయడానికి సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను సమర్థవంతంగా వాడుకుంటుంది సజ్నా. 22 వాట్సాప్ గ్రూప్‌లకు తాను అడ్మినిస్ట్రేటర్. ‘నా యాభై ఏళ్ల జీవితంలో విందువినోదాలు, ఇతర శుభకార్యాలకు పక్కఊళ్లకు వెళ్లడం తప్ప, జిల్లా దాటింది లేదు. సోషల్ మీడియాలో సజ్నా పోస్ట్‌లు ఆసక్తి కలిగించేవి. అలా నాకు ప్రయాణాలపై ఆసక్తి మొదలైంది. తొలిసారిగా సోలో ట్రావెల్ చేసినప్పుడు ఎంత గర్వంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. ఆ ప్రయాణం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అంటుంది చందన. ఇప్పటివరకు సజ్నా ట్రావెల్ గ్రూప్ తరపున వందలాది మంది మహిళలు దేశంలోని వివిధ ప్రాంతాలకు ట్రావెల్ చేశారు. ఈ సంవత్సరం చివరిలోపు ట్రావెల్ ఏజెన్సీ 400 ట్రిప్ మైలురాయిని చేరుకోనుంది. ‘సంవత్సరం తిరక్కుండానే మీ ట్రావెల్ కంపెనీ మూత పడుతుంది... లాంటి మాటలను పట్టించుకోలేదు. నాపై నాకు ఉన్న నమ్మకమే తిరుగులేని విజయానికి కారణం అయింది. దీనిద్వారా ఎంతోమంది మహిళలు ఈ రంగంలోకి రావడానికి ఉపకరిస్తుంది’ అంటుంది సజ్నా. ‘మా ప్రథమ ప్రాధాన్యత మహిళా ట్రావెలర్స్ భద్రత. ఈ విషయంలో రాజీపడం’ అని చెబుతున్న సజ్నా రకరకాల సేఫ్టీ యాప్‌లను సమకూర్చుకోవడంతో పాటు ఆత్మ–రక్షణ పరికరాలను కూడా ట్రావెలర్స్‌కు అందిస్తుంది. బడ్జెట్–ట్రిప్స్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడానికి ముందు ఆ ప్రదేశాలకు స్వయంగా వెళ్లి పరిశీలించి రావడం సజ్నా అలవాటు. దీని ద్వారా ప్రయాణికులకు ఏవిధమైన ఇబ్బందులూ తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు అవుతుంది. ‘మనవంతుగా సమాజానికి ఇవ్వాలి’ అనే ఆదర్శ భావనతో ‘గివ్–బ్యాక్–టు–ది–కమ్యూనిటీ’ట్రిప్‌కు స్వీకారం చుట్టింది. ఇది ప్రయాణమే కాని సేవాప్రయాణం. ఇందులోని సభ్యులు వివిధ ప్రాంతాలకు వెళ్లి అట్టడుగు వర్గాల ప్రజలకు లాంగ్వేజ్ స్కిల్స్ నుంచి లైఫ్‌స్కిల్స్ వరకు ఎన్నో నేర్పిస్తారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. -
రికార్డ్: నజియ విజయం
ఎక్కడి కేరళ, ఎక్కడి మహారాష్ట్ర! కానీ కళకు దూరం ఎప్పుడూ భారం కాదు అని నిరూపించింది నజియ నవస్. తిరువనంతపురం(కేరళ)కు చెందిన నజియ ఇంటర్నెట్లో ఒకసారి వర్లీ పెయింటింగ్‌లను చూసి అబ్బురపడింది. మహారాష్ట్రలో ప్రసిద్ధి పొందిన వర్లీ ఆర్ట్ తనను ఎంత ఆకట్టుకుందంటే ఎలాగైనా సరే ఆ ఆర్ట్ నేర్చుకోవాలి అనుకునేంతగా! అనుకోవడానికేం... ఎన్నయినా అనుకుంటుంటాం. మహారాష్ట్రలోని గిరిజన ప్రాంతాలకు వెళ్లి వర్లీ నేర్చుకోవడం సాధ్యమయ్యే పనికాదు. అందుకే అంతర్జాలాన్నే గురువుగా భావించి సాధన మొదలు పెట్టింది. దానికి ముందు ఎన్నో విషయాలను చదివి తెలుసుకుంది. వర్లీ కళ అనేది అసామాన్య చిత్రకారుల సృష్టిలో నుంచి వచ్చింది కాదు. సామాన్య గిరిజనులే దాని సృష్టికర్తలు. మట్టిగుడిసెలను తమకు తోచిన కళతో అలంకరించేవారు. నిత్యం అందుబాటులో ఉన్న వస్తువులనే పెయింటింగ్స్ కోసం వాడేవారు. తరాలు మారుతున్న కొద్దీ ఈ కళ మరింత విస్తృతి పొందింది. విశేషం ఏమింటే వర్లీ చిత్రాలలో ప్రకృతి ప్రధాన వస్తువుగా కనిపిస్తుంది. ప్రకృతికి మనిషికి మధ్య ఉండే సంబంధాలను అవి చిత్రీకరిస్తాయి. వర్లీ కళకు సంబంధించి రకాల విషయాలు తెలుసుకునే క్రమంలో ఎలాగైనా నేర్చుకోవాలనే పట్టుదల నజియాలో పదింతలైంది. ఎట్టకేలకు తనకు ఇష్టమైన కళలలో పట్టు సాధించింది. ఇప్పటివరకు వందకు పైగా వర్లీ పెయింటింగ్స్ వేసింది. డిగ్రీ పూర్తి చేసిన నజియాకు తన అభిరుచి ఆదాయ మార్గంగా కూడా మారింది. ఆన్లైన్లో తన వర్లీ పెయింటింగ్‌లు అమ్ముతుంది. తాజాగా 5 అంగుళాల పొడవు, వెడల్పైన వర్లీ పెయింటింగ్‌తో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించింది నజియ. గతంలో ఉన్న పది అంగుళాల పొడవు, వెడల్పయిన వర్లీ పెయింటింగ్ రికార్డ్‌ను నజియ బ్రేక్ చేసింది. ‘నేర్చుకున్నది చాలు’ అని అనుకోవడం లేదు నజియ. ముంబైకి వెళ్లి ఆ కళలో మరిన్ని మెళకువలు నేర్చుకోవాలనుకుంటుంది. ‘కళను పట్టుదలగా నేర్చుకోవాలి. ఉదారంగా పంచాలి’ అంటారు. వర్లీ కళను సొంతంగా నేర్చుకున్న నజియ ఇప్పుడు ఆ కళను ఆసక్తి ఉన్నవాళ్లకు ఉచితంగా నేర్పించడానికి రెడీ అవుతుంది. -
ఆర్డర్ చేసిన ఫుడ్‌లో పాము చర్మం...షాక్‌లో కస్టమర్
Snake skin found in food: ఇటీవల కోవిడ్ -19 తర్వాత ప్రజలు నేరుగా రెస్టారెంట్‌కి వెళ్లి తినడాని కంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని తినడానికే ఇష్టపడుతున్నారు. అదీగాక జోమాటో, స్వీగ్గీ వంటి ప్రముఖ ఫుడ్ డెలివరీ యూప్‌లు ప్రజలకు వెసులుబాటు కలిగించేలా మంచి డిస్కోంట్లు ఇచ్చి మరీ సేవలందింస్తుంది. వీకెండ్ సమయాల్లో మరింత ఆకర్షీణీయమైన పుడ్ ఆఫర్లతో భోజనప్రియులకు మరింత చేరువవుతోంది. దీంతో ప్రజలు కూడా ఆన్లైన్లో ఫుడ్‌ని ఆర్డర్ చేసుకుని తినడానికే ఆసక్తి చూపిస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే వారికి ఊహించని భయంకరమైన చేదు అనుభవం ఎదురైంది. అంతేకాదు ఆ ఘటన మళ్లీ ఇంకెప్పుడు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసి తినడానికి జంకేలా చేసింది. వివరాల్లోకెళ్తే...కేరళలోని తిరువనంతపురంలో ప్రియా అనే ఒక మహిళ నెడుమంగడు ప్రాంతంలోని ఒక రెస్టారెంట్ నుంచి రెండు పరోటాలను ఆర్డర్ చేసింది. పైగా ఆర్డర్ కూడా సకాలంలోనే డెలివరీ అయింది. ఐతే ఆమె మొదటగా తమ కుమార్తెకు పరోటా పెట్టింది. కానీ ఆ తర్వాత ఆ పరోటా పార్మిల్ని ఫ్యాకింగ్ చేసిన కవర్ మీద సుమారు అరవేలు పొడవు అంతా పాము చర్శం చూసి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. దీంతో ఆమె ఆగ్రహం చెంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐతే సదరు రెస్టారెంట్ ఆహారాన్ని ప్యాకింగ్ చేసిన పేపర్ పై పాము చర్మం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఫుడ్ సేఫ్టీ అధికారి అర్షిత బషీర్ తెలిపారు. అంతేకాదు వంటగదిలో తగినంత వెలుతురు కూడా లేదని సరైన పరిశుభ్రత పాటించకుండా ఆహారం తయారు చేసున్నారని అన్నారు. సదరు రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేయడం తోపాటు ఆ రెస్టారెంట్ యజమానికి షాకాజ్ నోటీసులు కూడా పంపించినట్లు వెల్లడించారు. (చదవండి: నిమ్మకాయలతో మామూలుగా ఉండదు.. జైలు అధికారి సస్పెండ్!) -
దూరదర్శన్ కేంద్రం: మహిళల బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం దూరదర్శన్ కేంద్రంలోని మహిళల బాత్రుమ్‌లో సీక్రెట్ కెమెరాను కనిపించింది. ఈ కెమెరాను ఆదివారం ఓ మహిళ గుర్తించగా.. ఈ విషయంపై దూరదర్శన్ అధికారులు బుధవారం పోలీసులను సంప్రదించారు. దీనిపై తిరువనంతపురం సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వన్ డ్రైవ్ రెస్టారెంట్ కేసులో వెలుగులోకి కొత్త విషయాలు కాగా ఆఫీసులో తాత్కాలిక ఉద్యోగిగా జాయిన్ అయిన ఓ వ్యక్తి ఈ రహస్య కెమెరాను అరేంజ్ చేసినట్లు తెలిసింది. కెమెరాను తీసేయడంతో పాటు అక్కడ పెట్టిన ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. మెయిన్ స్టూడియోకి సమీపంలోని వాష్‌రూమ్‌లో ఈ కెమెరాను అమర్చినట్లు పేర్కొన్నారు. అయితే పోలీసులతోపాటు ఈ విషయాన్ని దూరదర్శన్ కేంద్రంలోని మహిళా కమిటీ, క్రమశిక్షణా కమిటీ అధికారులు అంతర్గతంగా విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ వన్ డ్రైవ్ ఇన్ ఫుడ్‌కోర్టులోని మహిళల టాయిలెట్లో సెల్‌ఫోన్ పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారనే విషయం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫుడ్‌కోర్టుకు తన స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ యువతి రెస్ట్రూమ్కు వెళ్లింది. అక్కడి బాత్రూమ్లో కెమెరా ఆన్‌చేసిన సెల్‌ఫోన్‌ను గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. -
ఈ పువ్వులు 12 ఏళ్లకు ఓసారి వికసిస్తాయి.. ఎక్కడో తెలుసా?
Neelakurinji Flowering Facts: ప్రకృతి విలయ తాండవం చేస్తే ఎంత భీకరంగా ఉంటుందో.. ప్రశాంతంగా ఉంటే అంత అందంగా ఉంటుంది. చుట్టూ కొండలు, పచ్చని గడ్డి, పరవశించే పైర గాలి, ఆదమరపించే చెట్లు, అందమైన పూలు. చేతితో తాకవచ్చు అనిపించే మేఘాలు.. ఆ ఊహ ఎంత అందంగా ఉంటుంది. అదే నిజమైతే ఒళ్లు పులకించి, ఆనంద తాండవం చేయని మనిషి ఉండడు. తిరువనంతపురం: కేరళలోని శాంతన్‌పర షలోమ్ హిల్స్‌లో పూసిని పువ్వులు నేలపై బ్లూ కార్పెట్‌ను పరిచినట్టు వికసించాయి. 12 ఏళ్లకు ఓసారి వికసించే నీలకురింజి పువ్వులు అక్కడకి వచ్చిన పర్యాటకులను మంత్ర ముగ్దులను చేస్తున్నాయి. ఈ సీజన్లో సేకరించిన తేనెకు యమ గిరాకీ..! స్ట్రోబిలాంథెస్ కుంతియానస్ అనే శాస్త్రీయ నామం కలిగిన నీలకురింజి పువ్వులు జూలై-అక్టోబర్ మధ్యలో వికసిస్తాయి. నీలకురింజి అంటే మలయాళంలో ‘నీలి పువ్వు’ అని అర్థం. నీలకురింజి పువ్వుల పరాగసంపర్కానికి చాలా కాలం అవసరం. అందువల్ల ఇవి వికసించడానికి 12 సంవత్సరాలు పడుతుంది. వృక్షశాస్త్రంలో, దీనిని మొక్కల‘‘సర్వైవల్ మెకనిజమ్(మనుగడ విధానం) గా సూచిస్తారు. పక్షులు, గడ్డి తినే క్షీరదాల నుంచి నీలకురింజి పువ్వులకు పెద్ద ముప్పు ఉంది. దాంతో అవి వికసించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఏఎన్ఐ ఇటీవల సంతన్పారా పంచాయితీలోని అందమైన కొండలలో పువ్వులు గాలికి ఊగుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇక నీలకురింజి పువ్వులు వికసించే ఈ సీజన్లో సేకరించే తేనె రుచి, పోషకాహార అంశాలలో అత్యున్నతమైనదిగా భావిస్తారు. దీంతో ఈ సీజన్లో తేనె ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కాగా, ప్రపంచంలో 250 జాతుల పువ్వులలో 46 భారతదేశంలో కనిపిస్తాయి. ఇవి ప్రధానంగా పశ్చిమ కనుమలలో వికసిస్తాయి. ఇక కోవిడ్-19 మహమ్మారి వల్ల పర్యాటకుల తాకిడి చాలా తగ్గింది. #WATCH | Shantanpara Shalom hills under Santhanpara Panchayat in Kerala's Idukki are covered in hues of blue as Neelakurinji flowers bloom, which occurs once every 12 years pic.twitter.com/DyunepahAv — ANI (@ANI) August 2, 2021 -
Coronavirus: కేరళలో కరోనా కలకలం.. మళ్లీ సంపూర్ణ లాక్డౌన్!
తిరువంతపురం: కేరళలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో 22వేల కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేరళ ప్రభుత్వం ఈ నెల(జూలై) 31, ఆగస్టు 1న రెండు రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 43,509 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో కేరళలోనే 22వేల కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో 4,03,840 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. కాగా, కేరళకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నుంచి ఆరుగురు సభ్యుల బృందాన్ని కేంద్ర ప్రభుత్వం పంపించనుంది. కేరళలో కరోనా కేసులు రోజూరోజుకు పెరుగుతున్నాయి. అయితే కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో కేరళ ప్రభుత్వానికి ఈ బృందం సహాయం చేస్తుదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఓ ట్వీట్లో పేర్కొన్నారు. -
చట్ట సభల్లో సభ్యులైతే తప్పు చేస్తారా?
న్యూఢిల్లీ: చట్టసభల సభ్యులకు ఉండే ప్రత్యేక హక్కులు, హోదాలు చట్టం నుంచి తప్పించుకునేందుకు ఉద్దేశించిన మార్గాలు కావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రతి పౌరుడి చర్యలను చట్టం నియంత్రిస్తుందని పేర్కొంది. 2015లో కేరళ అసెంబ్లీలో జరిగిన గొడవకు సంబంధమున్న 6గురు ఎల్డీఎఫ్ నేతలపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలన్న కేరళ ప్రభుత్వ విజ్ఞాపనను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ప్రజా ఆస్తుల ధ్వంసరచనను చట్టసభలో వాక్స్వాతంత్రం, ప్రతిపక్ష సభ్యుల నిరసన హక్కులాంటివాటితో పోల్చలేమని, ఆరోజు బడ్జెట్‌కు వ్యతిరేకంగా నిరసన పేరుతో చట్టసభలో సభ్యులు ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడాన్ని చట్టసభ్యుల విధుల్లో భాగంగా చూడలేమని కఠిన వ్యాఖ్యల చేసింది. ఈ సభ్యుల ప్రవర్తన రాజ్యాంగం విధించిన హద్దులను దాటిందని, అందువల్ల వీరికి రాజ్యాంగం కల్పించే ప్రత్యేక హక్కుల కింద రక్షణ లభించదని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని తేల్చిచెప్పింది. 2015లో కేరళ శాసనసభలో గొడవకు కారణమైన ఆరుగురు సభ్యులపై కేసును ఉపసంహరిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేరళ హైకోర్టు కొట్టివేయగా, దీనిపై ప్రభుత్వం సుప్రీంకు అప్పీలు చేసింది. ఏం జరిగింది? 2015 మార్చి 13న రాష్ట్ర అసెంబ్లీలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎల్డీఎఫ్ సభ్యులు అప్పటి ఆర్థిక మంత్రి మణి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా అడ్డుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా వారు స్పీకర్‌స్థానాన్ని అగౌరవపరచడమే కాకుండా, సభలోని ఎలక్ట్రానిక్ పరికరాలను డ్యామేజి చేశారు. దీనివల్ల దాదాపు రూ. 2.2 లక్షల నష్టం వాటిల్లింది. వీరిపై ఐపీసీ 447 సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అనంతరం వచ్చిన ప్రభుత్వం వీరిపై కేసును ఉపసంహరించుకునే యత్నాలు ఆరంభించింది. కానీ ప్రభుత్వ యత్నానికి కోర్టుల్లో ఎదురుదెబ్బ తగిలింది. అనంతరం ఈ అంశం సుప్రీంకోర్టు చెంతకు చేరింది. దీనిపై విచారణ జరుపుతూ, ఆందోళన పేరుతో ప్రజా ఆస్తుల ధ్వంసాన్ని సహించకూడదని కోర్టులు, పార్లమెంట్ భావిస్తున్నాయనితెలిపింది. చట్టసభ్యులకు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికిల్ 105, 194 అనేవి కేవలం చట్టసభ్యులు వారి విధులు సక్రమంగా నిర్వహించడం కోసం ఉద్దేశించినవని స్పష్టం చేసింది. ఈ విధుల్లో ఆందోళన పేరిట పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం రాదని తెలిపింది. -
కేరళ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగులంతా ఇకపై
Dowry.. సమాజంలో ఎన్నో అవరోధాలను కలిగిస్తోంది. తల్లిదండ్రులకు ఆడ పిల్ల పుడితే లక్షల కట్నాలు ఎక్కడ ఇవ్వాలని పురిట్లోనే ఆడపిల్లలను చంపేసిన ఘటనలు కోకొల్లలు. అయితే కాలం మారింది. కాలంతో పాటు సమాజంలో కట్టుబాట్లు, ఆచారాలు మారుతున్నాయి. ఆడ పిల్లలు తమకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటున్నారు. అది కూడా కట్నాలకు ఆశ పడని వాడికే తమ మనసు సొంతం అంటున్నారు. తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం వరకట్నానికి వ్యతిరేకంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేరళ ప్రభుత్వంలో పని చేస్తున్న వివాహం కాని పురుష ఉద్యోగులు తాము వరకట్నాన్ని ప్రొత్సహించడం లేదా తీసుకోకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా పెళ్లైన నెల రోజుల్లో తాము పని చేస్తున్న విభాగం అధిపతులకు డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ డిక్లరేషన్‌లో భార్య సంతకంతో పాటు వధువు, వరుడిల తండ్రి సంతకం ఉండాలని పేర్కొంది. మహిళ, శిశు సంక్షేమ శాఖ కొద్దిరోజుల క్రితం ఈ సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు, అటానమస్, ఇతర సంస్థలకు సంబంధించిన విభాగాల అధిపతులు సైతం ఈ మేరకు డిక్లరేషన్లు తీసుకోవాలని తెలిపింది. ఇక కేరళలో ప్రతి ఏడాది నవంబర్ 26న వరకట్న వ్యతిరేక దినోత్సవంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు స్కూల్స్, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు కట్నం తీసుకోమని ప్రతిజ్ఞ చేయాలని ప్రభుత్వం సూచించింది. గత నెలలో వరకట్నానికి వ్యతిరేకంగా విద్యార్థులందరూ తమ డిగ్రీ తీసుకోవడానికి ముందు బాండ్ ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ సూచించిన సంగతి తెలిసిందే. -
జికా వైరస్: హై అలర్ట్ ప్రకటించిన కేరళ ప్రభుత్వం
సాక్షి, తిరువనంతపురం: కరోనా మహమ్మారితో వణికిపోతున్న తరుణంలో కేరళలో జికా వైరస్ కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం జికా వైరస్‌పై హై అలెర్ట్ ప్రకటించింది. జికా వైరస్ బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అదేవిధంగా కేరళ పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కూడా జికా వైరస్ వ్యాప్తి విషయంలో అప్రమత్తమైంది. చామరాజనగర్, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. కేరళలో మొదట ఓ 24 ఏళ్ల గర్భిణిలో జికా వైరస్ లక్షణాలను గుర్తించారు. ఆమెతోపాటు మరికొందరి శాంపిళ్లను పుణే వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. ఆమె సహా 14 మందికి జికా ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా తేలింది. జికా ఇన్ఫెక్షన్ మరీ ప్రమాదకరమేమీ కాదని.. కానీ కొన్నేళ్లుగా మ్యుటేట్ అయి కొత్త వేరియంట్లు వస్తుండటంతో జాగ్రత్త తప్పనిసరని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం శుక్రవారం ఎయిమ్స్‌కు చెందిన ఆరుగురు నిపుణుల బృందాన్ని కేరళ రాష్ట్రానికి పంపించిన విషయం తెలిసిందే. ఈ బృందం కేరళలో పరిస్థితులను సమీక్షించడంతోపాటు, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందజేస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు. మరోవైపు కేరళ ప్రభుత్వం జికా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టింది. కేసులను గుర్తించిన తిరువనంతపురం జిల్లాల్లో విస్తృతంగా వైద్య పరీక్షలు చేపట్టింది. -
వెన్నుపూసకు తీవ్ర గాయాలు.. సర్జరీలు.. అయినా
రోడ్డు ప్రమాదాల గురించి మనం రోజూ వింటున్నాం. చూస్తున్నాం. కొన్నింటిని స్వయంగా ఎదుర్కొంటున్నాం. వీటిని ఎలా నివారించాలా అని ఎవరికి వారు అనుకుంటూ ఉంటారు. కానీ, చాలా మంది అజాగ్రత్తగానే ఉంటారు. రోడ్డు భద్రత అతి ముఖ్యమైనదని, తమ జీవితాన్నే ఉదాహరణగా చూపుతూ అవగాన పెంచుతున్నారు తిరువనంతపురంలో ఉంటున్న జార్జ్ కె థామస్, జాస్మిన్ ఐజాక్ దంపతులు. రోడ్డు సేఫ్టీ అంబాసిడర్లుగా తిరువనంతపురంలో తమదైన ముద్ర వేసిన థామస్, జాస్మిన్ జంట రహదారి ప్రాముఖ్యతను ప్రజలకు ముఖ్యంగా యువతలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రజా రవాణ, రహదారుల వల్ల కలిగే అసౌకర్యాల గురించి తెలియజేస్తూ రోడ్ సేఫ్టీ పై పుస్తకం రాశారు. రేపటి తరానికి కరోనా మన కళ్లపై ఉన్న ముసుగును అనేక విధాలుగా తొలగించిందని వివరిస్తారు థామస్. ప్రమాదం చేసిన పరిచయం కొన్ని అనుకోని సంఘటనలు జీవితాన్ని ఓ కొత్త దిశవైపుగా నడిపిస్తాయి. ఎనిమిదేళ్ల కిందట జరిగిన సంఘటనను 35 ఏళ్ల థామస్ ప్రస్తావిస్తూ ‘‘మోటార్ బైక్‌పై వెళుతుండగా ఆటో రిక్షా ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. అప్పుడు వెన్నుపూసకు తీవ్రమైన గాయలయ్యాయి. సర్జరీలు జరిగాయి. అయినా, వీల్‌చెయిర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అదే రోజు జాస్మిన్ తన సోదరితో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతున్నప్పుడు ప్రమాదం జరిగింది. తనూ వీల్‌చెయిర్‌కి పరిమితం అయ్యింది. ఇద్దరం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కలుసుకున్నాం. మా అభిరుచులు కలవడంతో 2014లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం అని వివరిస్తారు. జాస్మిన్ మాట్లాడుతూ ‘మా పెద్దవాళ్లు భయపడ్డారు. కానీ, మా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నాం. అయితే ఆరోగ్యంగా ఉన్న మేం రోడ్డు ప్రమాదాల కారణంగా ఇలా వీల్ చెయిర్‌కు అంకితమయ్యాం. ఈ పరిస్థితి మరెవ్వరికీ రాకూడదన్నదే మా ప్రయత్నం. అందుకే ప్రజల్లో రోడ్ సేఫ్టీ పట్ల అవగాహన కలిగించాలని తపిస్తున్నాం. ముఖ్యంగా రేపటి తరానికి మరింత అవగాహన అవసరం. అందుకే, చిన్నపిల్లలకు రోడ్డు భద్రత పట్ల జాగ్రత్తలు చెబుతున్నాం’ అని తమ ఆలోచనలను తెలియజేస్తారు ఈ జంట. -
11 ఏళ్ల క్రితం తప్పిపోయిందనుకుంటే.. రహస్యంగా ప్రియుడితో అక్కడే!
తిరువనంతపురం: కేరలోని పాలక్కాడ్‌లోని అయలూర్ గ్రామంలో 11 ఏళ్ల క్రితం సజిత అనే ఓ మహిళ తప్పిపోయింది. అయితే ఆమె తన తల్లిదండ్రులకు కేవలం 500 మీటర్ల దూరంలో నివసిస్తున్నట్లు ఇటీవల గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. సజిత తనకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ప్రేమించి వ్యక్తి కోసం ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు, పోలీసులు వెతకని చోటు లేదని అన్నారు. అయితే మూడు నెలల క్రితం అలిన్చువటిల్ రెహ్మాన్ కూడా (34) అకస్మాత్తుగా తప్పిపోడంతో.. అతని కుటుంబం ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. కాగా మంగళవారం రెహ్మాన్‌ను అతని అన్న బషీర్ అనుకోకుండా వేరో గ్రామంలో కలిశాడు. దీంతో రెహ్మాన్, సజిత వేరే గ్రామంలో అద్దెకుంటున్నట్టు గుర్తించి ఇంటికి తీసుకొచ్చారు. పోలీసులు ఈ జంటను స్థానిక కోర్టులో హాజరుపరచగా.. రెహ్మాన్‌తో కలిసి ఉంటానని సజిత చెప్పడంతో వారు కలిసి జీవించడానికి కోర్టు అనుమతించింది. ఇక ఈ ఘటనపై రెహ్మాన్ అన్న బషీర్ మాట్లాడుతూ.. హౌస్ పెయింటర్‌గా పనిచేసే రెహ్మాన్‌కు ప్రత్యేక గది ఉందని తెలిపాడు. అయితే అతడు ఆ గదిలోకి ఎవరూ రాకుండా తాళం వేసి ఉంచే వాడని వెల్లడించాడు. (చదవండి: వధువుకు వింత బహుమతులు.. వరుడుని ఉతకడానికేనా?) -
Kerala: అన్నీ కొత్త ముఖాలే.. శైలజ టీచర్‌కు నో ఛాన్స్!
తిరువనంతపురం: కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. రెండో దశ కోవిడ్ భారత్‌ను మరింతగా దెబ్బకొట్టింది. అయితే, కరోనా తొలి దశలో దేశంలోని చాలా రాష్ట్రాల్లో పరిస్థితి అదుపుతప్పింది. అయితే కోవిడ్ పోరులో కేరళ మాత్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని కేరళ సమర్ధంగా ఎదుర్కోవడంలో అప్పటి కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ (64) కృషి చేశారు. ఆమె పనితీరుపట్ల ఎందరో ప్రశంసలు కురిపించారు. ఈక్రమంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎల్డీఎఫ్ సంకీర్ణ ప్రభుత్వం ఆరోగ్య మంత్రిగా కేకే శైలజకే పగ్గాలు అప్పగిస్తుందని అందరూ భావించారు. ప్రస్తుత కేబినెట్లో ఆమెకు మొండి చేయే ఎదురవనుందని విశ్వసనీయ సమాచారం. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కేకే శైలజ కన్నూర్ జిల్లాలోని మత్తనూర్ నియోజకవర్గం నుంచి 60 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కోవిడ్ మొదటి దశలో వైరస్ వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కోవడంలో శైలజా టీచర్ "రాక్‌స్టార్" ఆరోగ్య మంత్రిగా ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా నిఫా వైరస్ సంక్షోభ కాలంలో కూడా ఆమె పనితీరుకు ప్రశంసలు దక్కాయి. గత ఏడాది సెప్టెంబరులో, యూకేకు చెందిన ప్రాస్పెక్ట్ మ్యాగజైన్ ఆమెను "టాప్ థింకర్ ఆఫ్ ది ఇయర్ 2020" గా కూడా ఎంపిక చేసింది. మరోవైపు ప్రస్తుత మంత్రివర్గంలో పినరయి విజయన్ తప్ప మిగతా అందరూ కొత్త వారేనని సమాచారం. ఆయన అల్లుడు పీఏ మహ్మద్ రియాస్, పార్టీ కార్యదర్శి ఏ విజయరాఘవన్ భార్య ఆర్.బిందు కూడా కొత్త మంత్రి వర్గంలో చోటు దక్కించుకోనున్నట్టు తెలిసింది. అయితే దీనిపై రాజకీయ విశ్లేషకుడు ఎన్ఎం పియర్సన్ స్పందిస్తూ... "పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడం కూడా ఓ కారణం. ఒక వేళ జట్టు మొత్తాన్ని మార్చితే... అది కెప్టెన్‌కు కూడా వర్తింపజేయాలి’’ అంటూ చురకలంటించారు. (చదవండి: Kerala: 20న విజయన్ ప్రమాణస్వీకారం) -
ఈ-పాస్ కోసం అప్లై..‘సిక్స్’ తెచ్చిన తంటాతో పరేషాన్
తిరువనంతపురం: ఒక్క పదం తప్పుగా రాయడంతో ఓ వ్యక్తి అష్టకష్టాలు పడ్డాడు. ఈ పాస్ కావాలని సిక్స్‌కు బదులు సెక్స్ అని రాశాడు దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేశారు. ఈ సంఘటన వైరల్‌గా మారింది. ‘‘సాయంత్రం సెక్స్ కోసం వెళ్లాలి’ పాస్ ఇవ్వండి అని ఈ పాస్ రిజిస్ట్రేషన్ ఓ వ్యక్తి చేసుకున్నాడు. పోలీసులు ఇది చూసి షాక్‌కు గురయ్యారు. ఆకతాయి పనిగా భావించి పోలీసులు అతడిని గుర్తించి ఇంటికెళ్లి స్టేషన్‌కు తరలించారు. విచారణ చేయగా అతడు చెప్పిన సమాధానం వింటే పోలీసులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం కేరళలో లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో బయటకు వెళ్లేందుకు కన్నూర్‌లోని కన్నాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎందుకోసం వెళ్లాలి? అనే కాలమ్‌లో మనోడు ‘సాయంత్రం సెక్స్ కోసం వెళ్లాలి’ (Need To Go For Sex) అని రాశాడు. దీన్ని చూసిన పోలీసులు అసిస్టెంట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా ఆయన విచారణ చేయమని ఆదేశించాడు. వెంటనే వల్లపట్టణం పోలీసులు అతడిని గుర్తించి విచారించారు. అప్పుడు ఆ వ్యక్తి తాను చేసిన తప్పును చూసి కంగారు పడ్డాడు. తాను తప్పు రాశానని.. ఆరు గంటలకు రాయబోయి సిక్స్ బదులు సెక్స్ అని రాసినట్లు తెలిపాడు. చూసుకోకుండా అలా పంపానని పోలీసులకు వివరణ ఇచ్చాడు. మొత్తం వివరాలు తెలుసుకుని అతడు చెప్పింది.. వాస్తవమేనని నమ్మి వదిలేశారు. అతడు క్షమాపణలు చెప్పడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ పాస్ రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా వినియోగించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. సరైన కారణాలు ఉంటేనే పాస్‌లు జారీ చేస్తున్నారు. చదవండి: కష్టకాలంలో ఉన్నాం.. విరాళాలివ్వండి: సీఎం పిలుపు చదవండి: కరోనా వేళ ఒక్క పిలుపు: కదిలొస్తున్న తారలు -
టికెట్ నిరాకరణ.. మహిళ శిరోముండనంతో నిరసన
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేరళలో రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఆదివారం విడుదల చేసింది. విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో తనకు సీటు కేటాయించకపోవడతో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లతికా సుభాష్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఎత్తిమన్నూర్ సీటును కేటాయిస్తారని ఆమె భావించారు. కానీ, అదిష్టానం నుంచి నిరాశ ఎదురవడంతో తనకు అన్యాయం జరిగిందంటూ లతికా ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా పార్టీ కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్లో శిరోముండనం చేసుకొని నిరసన తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ముల్లపల్లి రామచంద్రన్ నేడు ఢిల్లీలో అభ్యర్థు జాబితాను విడుదల చేశారు. కేరళ రాజకీయ చరిత్ర టికెట్ నిరాకరించడంతో ఇలా నిరసన వ్యక్తం చేయటం మొదటిసారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చదవండి: కేరళ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల -
కేరళ అసెంబ్లీ ఎన్నికలు: తొలి లిస్ట్‌ను ప్రకటించిన సీపీఐ!
తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీఐ తమ అభ్యర్థులను ప్రకటించింది. 25 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయించిన అధిష్టానం, 21 మందితో కూడిన జాబితాను ప్రకటించినట్లు సీపీఐ రాష్ట్రకార్యదర్శి కనమ్ రాజేంద్రన్ తెలిపారు. ‘‘తొలుత 21 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించాం. మరో నాలుగు శాసన సభ స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తాం’’ అని తెలిపారు. ఎన్నిస్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టామనేది కాకుండా, ఎన్నిచోట్ల గెలిచామన్నదే ప్రధానమన్నారు. అయితే పునలూర్ నుంచి, జిఎస్ జయలాల్ చత్తనూర్ నుంచి పోటీపడనున్నారు. కాగా, ఇకే విజయన్ నాదపురం బరిలో దిగారు. కాగా ఆయా అభ్యర్థులు తమకు కేటాయించిన స్థానాల నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. ఇక కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 6 ఎన్నికలు జరుగనున్నాయన్న విషయం తెలిసిందే. ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. చదవండి: కొత్త సీఎంపై వీడిన ఉత్కంఠ -
చేపకు.. ఆపరేషన్
చేపకు ఆపరేషన్ ఏంటి అనుకుంటున్నారా? అవును నిజంగా ఇది జరిగింది. అదీ మన దేశంలోని కేరళలోనే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చేపకు ఆపరేషన్ చేసి బతికించారు డాక్టర్లు. ఇది ఎలా? ఎందుకు? అంటే.. తిరువనంతపురం జూలో ఉన్న అక్వేరియంలో ఈల్ రకం చేప తీవ్రంగా గాయపడింది. దీనిని గుర్తించిన జూ సిబ్బంది. వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వెటర్నరీ డాక్టర్లను తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన డాక్టర్లు మూడు గంటల పాటు శ్రమించి చేపను బతికించారు. చేపల మధ్య ఫైట్ ఆ అక్వేరియంలో మూడు ఈల్ చేపలను వదిలారు. అందులోని 600 గ్రాముల బరువున్న ఆడ చేపపై ఇంకో ఈల్ చేప దాడి చేసింది. ఆ దాడిలో ఆడ చేప చర్మం చీరుకుపోయింది. ప్రేగులు కూడా బయటకు వచ్చేశాయి. దాని పరిస్థితి క్రిటికల్‌గా మారింది. సమాచారం అందుకుని వెంటనే వచ్చిన జూ వెటర్నరీ డాక్టర్ జాకోబ్ అలెగ్జాండర్ చేప పరిస్థితి అంచనా వేశారు. వెంటనే ఆపరేషన్ అవసరం అని చెప్పారు. ఈయనకు మరో ఇద్దరు డాక్టర్లు టిటు అబ్రహం, అమృత లక్ష్మి హెల్ప్ చేశారు. అయితే చేపకు మత్తుమందు ఇవ్వడమే వారికి పెద్ద ఆటంకంగా మారింది. ఎట్టకేలకు దానికి మత్తు ఇచ్చి ఆపరేషన్ చేశారు. చేపకు 30 కుట్లు వేశారు. దానిని ప్రత్యేక ట్యాంకులో ఉంచి పరిశీలిస్తున్నారు. ఇలాంటి ఆపరేషన్ చేయడం దేశంలోనే మొదటిగా భావిస్తున్నారు. చదవండి: గుండెతో సహా అమ్మకానికి 'అమ్మ' అవయవాలు హైవేపై కొండచిలువ.. ఒంటిచేత్తో -
హైకోర్టు జడ్జి కారుపై ఆయిల్ పోసి నిరసన
తిరువనంతపురం: కోర్టులో విచారణ ఆలస్యమవడం.. తీర్పు ఎంతకీ రాకపోవడంతో ఓ యువకుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా జడ్జి కారుపై ఆయిల్ వేసిన ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. హైకోర్టుకు వచ్చిన న్యాయమూర్తి కారుపై తీవ్ర నిరసనతో ఆయిల్ పోయడంతో తెల్లటి కారు నల్లగా మారింది. ఈ ఘటనతో వెంటనే అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. రెండేళ్ల కిందట ఇంటి నుంచి తప్పిపోయిన జస్నా మరియా అదృశ్యం కేసు హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే ఈ తీర్పు రోజురోజుకు ఆలస్యమవుతూ రెండేళ్లు గడవడంతో కొట్టాయం ప్రాంతానికి చెందిన ఓ యువకుడు విసుగుచెందాడు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి శిర్సి కారుపై వాహనాలకు వినియోగించే ఆయిల్ చల్లాడు. ఈ ఘటనతో షాక్‌కు గురయిన తోటి న్యాయమూర్తులు, న్యాయవాదులు వెంటనే అతడిని పట్టుకోవాలని ఆదేశించడంతో భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంది. జడ్జి సెక్యూరిటీ ఆఫీసర్ నిందితుడిని పట్టుకుని సెంట్రల్ పోలీసులకు అప్పగించాడు. అయితే ఆ యువకుడు జస్నా కేసును త్వరగా తేల్చాలంటూ కొన్ని రోజులుగా హైకోర్టు ముందు నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఆ నిరసనలో భాగంగా ఉదయం జడ్జి శిర్సి కారు హైకోర్టు గేటు లోపలికి వస్తుండగా కారుపై ఆయిల్ గుప్పాడు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. -
మలబార్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం
సాక్షి, కేరళ: తిరువనంతపురం జిల్లాలో మలబార్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. మలబార్ ఎక్స్‌ప్రెస్ లగేజ్ వ్యాన్‌లో మంటలు చెలరేగాయి. ఆదివారం ఉదయం వర్కాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలను ప్రయాణికులు గుర్తించి గార్డుకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రైలును నిలుపుదల చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
‘లాక్డౌన్ పొడిగించినా కరోనా వ్యాప్తి తగ్గలేదు’
తిరువనంతరపురం: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ రాజధాని తిరువనంతపురంలో లాక్డౌన్ పొడగించినప్పటకీ కరోనా వ్యాప్తి తగ్గలేదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. ఈ క్రమంలో ప్రజలు తమ పనులు చేసుకోవడానికి అనుమతించాలన్నారు. తిరువనంతపురంలో కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడం కోసం కేరళ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడగించిన విషయం తెలిసిందే. ‘తిరువనంతపురంలో పొడిగించిన లాక్‌డౌన్‌పై కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్ మెహతాతో మాట్లాడాను. మూడు వారాలపాటు లాక్డౌన్ పొడగించడం వల్ల కరోనా వ్యాప్తిలో ఎలాంటి తగ్గుదల కనిపించలేదు. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో లాక్డౌన్ ఎత్తివేసి తిరిగి ప్రజల కార్యకలాపాలకు అనుమంతించాలి’ అని శశిథరూర్ ట్విటర్లో అన్నారు. (14 లక్షలు దాటేశాయ్..!) లాక్డౌన్ నిబంధనలను సడలించే విషయమై ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం తెలిపారు. లాక్‌డౌన్‌పై ఆ కమిటీ పరిశీలిస్తోందన్నారు. తీవ్రమైన పరిస్థితుల కారణంగా తిరువనంతపురంలో లాక్డౌన్ విధించామన్నారు. సీఎస్ నేతృత్వంలోని కమిటీ లాక్డౌన్ మార్గదర్శకాలు, సడలింపులను పరిశీలిస్తోందన్నారు. ఇప్పటివరకు కేరళలో 19727 కరోనా వైరస్ కేసలు నమోదు కాగా, 63 మంది మృతి చెందారు. -
కరోనా నియంత్రణకు రంగంలోకి కమాండోలు
తిరువనంతపురం: కరోనా కేసుల నియంత్రణకు కేరళ ప్రభుత్వం కమాండోలను రంగంలోకి దించింది. వివరాల్లోకెళ్తే.. తిరువనంతపురంలోని పూంతారా గ్రామంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీనికితోడు ప్రజలు భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు పాటించకుండా రోడ్ల మీదకు వస్తుండటంతో కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం రోజున పూంతారా గ్రామ సరిహద్దులను మూసివేస్తూ.. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రజలను నియంత్రించడానికి 25 మంది స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్స్ కమాండోలను మొహరించారు. కాగా.. లాక్డౌన్ నిబంధనలు సడలించిన నాటినుంచి కరోనా కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉండటంతోనే తాజాగా కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేరళలో ఇప్పటిదాకా 6,195 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 2,609 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 3,559 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. చదవండి: మరణాల రేటు 2.72 శాతమే: కేంద్రం -
నిరాడంబరంగా సీఎం కుమార్తె వివాహం
సాక్షి, తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పెద్ద కుమార్తె టీ వీణ వివాహం సోమవారం నిరాడంబరంగా జరిగింది. సీపీఐఎం యువజన విభాగం డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు, న్యాయవాది మహ్మద్ రియాజ్ తిరువనంతపురంలో వీణను పెళ్లాడారు. లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహం జరిగింది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు జరిగిన ఈ వివాహ వేడుకలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రహీమ్ సహా మొత్తం 50 మంది అతిథులు పాల్గొంటారు. అనంతరం ట్విటర్లో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే. మొదటి వివాహంలో వీణకు ఒకరు, రియాజ్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా వీణ 2014లో బెంగళూరులో ఎక్సోలాజిక్ సొల్యూషన్స్ సంస్థను నెలకొల్పి దానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అబ్దుల్ ఖాదర్ కుమారుడు అయిన మహ్మద్ రియాజ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన 2009 లోక్‌సభ ఎన్నికల్లో కోజికోడ్ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎమ్) అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్కే రాఘవన్ చేతిలో కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. -
కేరళ: హెచ్‌సీఎల్ లైఫ్‌కేర్‌లో భారీ అగ్ని ప్రమాదం..
సాక్షి, తిరువనంతపురం: కేరళలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తిరువనంతపురంలోని హిందుస్తాన్ లాటెక్స్ లిమిటెడ్(హెచ్‌సీఎల్ లైఫ్‌కేర్) ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు.. డంపింగ్ యార్డ్ నుంచి మొదలైన మంటలు ఫ్యాక్టరీ అంతటా వ్యాపించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం కొంత ఉపశమనమిచ్చే విషయం. కాగా అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రెండేళ్ల చిన్నారితో ఓ ఏనుగు ఫ్రెండ్షిప్
-
సీఏఏకు వ్యతిరేకంగా 620కి.మీ. మానవహారం
తిరువనంతపురం: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ కేరళలోని తిరువనంతపురంలో ఆందోళనకారులు 620 కి.మీ పొడవున భారీ మానవహారాన్ని నిర్వహించారు. గణతంత్రదినోత్సవం సందర్భంగా సీపీఎం ఆధ్వర్యంలో ఉత్తర కేరళలోని కసరగడ్ నుంచి కళియక్కవిలై వరకు సుమారు 620 కి.మీ వరకు మానవహారాన్ని చేపట్టారు. మానవహారంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా సుమారు 60 లక్షలమంది ప్రజలు పాల్గొని ఉంటారని వామపక్ష కూటమి (ఎల్టీఎఫ్) అంచనా. -
మసీదులో హిందూ పెళ్లి
తిరువనంతపురం : హిందూ సంప్రదాయంలో జరిగే పెళ్లికి కేరళలోని ఓ మసీదు వేదిక కానుంది. ఈ పెళ్లి ఈ నెల 19న జరగనుంది. మసీదుకు సమీపంలో నివసించే పేద హిందూ కుటుంబానికి చెందిన బిందు, అశోకన్ల కుమార్తె అంజు (22)కు మసీదులో పెళ్లి జరగనుంది. 2018లో అశోకన్ మరణించినప్పటి నుంచి వీరి కుటుంబం ఆరి్థక ఇబ్బందులను ఎదుర్కుంటోంది. ఈ విషయాన్ని బిందు మసీదు పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో చెరువల్లి జమాత్ కమిటీ కార్యదర్శి నుజుముదీన్ అలుమూట్టిల్ ఈ పెళ్లిని జరిపిస్తామని చెప్పారు. పెళ్లి బహుమానంగా అంజుకు బంగారం, రూ. 2 లక్షలు ఇవ్వడంతో పాటుగా, పెళ్లిలో 1000 మందికి భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. అంజు చదువుకు తాను వ్యక్తిగతంగా సహాయం చేశానని నుజుముదీన్ చెప్పారు. ఈ భిన్నమైన పెళ్లి కార్డులు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. -
శశిథరూర్‌కు అరెస్ట్ వారెంట్
తిరువనంతపురం : కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు స్థానిక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయన రాసిన ‘ద గ్రేట్ ఇండియన్ నావెల్’ అనే పుస్తకంలో హిందూ మహిళలను అవమానపరిచాడని దాఖలైన కేసులో ఆయనకు ఈ వారెంట్ జారీ చేయబడింది. వారెంట్‌లో తన వాదనను వినిపించడానికి శశిథరూర్ గానీ, లేదా ఆయన లాయర్‌గానీ కోర్టు వాయిదాలకు హాజరు కాలేదని, అందుకోసం అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నట్టు తెలపబడింది. ఈ విషయంపై శశిథరూర్ అఫీస్ వర్గాలు వివరణనిస్తూ.. ‘వారెంట్ జారీ అయినట్టు మాకు మీడియా ద్వారానే తెలిసింది. అధికారికంగా మాకు ఎలాంటి సమాచారం రాలేదు. ఇంతకుముందు కోర్టుకు హాజరుకావాలని సమన్లు వచ్చాయి. అయితే అందులో ఏ తేదీన హాజరు కావాలో లేనందున ఆ విషయాన్ని మేం కోర్టు దృష్టికి తీసుకెళ్లాం. దీంత కోర్టు వారు తేదీతో సహా పేర్కొని మరోసారి నోటీసు జారీ చేస్తామన్నారు. దాని ఆధారంగా మా తదుపరి కార్యాచరణ ఉంటుంద’ని ఆఫీస్ వర్గాలు తెలిపాయి. ఈ పుస్తకం మొదటి ప్రచురణ 1989లో జరిగింది. కాగా, శశిథరూర్‌కు ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన విషయం తెలసిందే. చదవండి : (దేశ చిత్రపటంతో శశిథరూర్ వివాదాస్పద ట్వీట్) -
గెలిచినా.. మార్పులు తప్పేలా లేవు!
తిరువనంతపురం : తొలి టీ20లో పర్యాటక వెస్టిండీస్ జట్టుపై ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్‌పై కన్నేసింది. ఆదివారం స్థానిక మైదానంలో జరగబోయే రెండో టీ20లో తప్పక గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. దీనికోసం పక్కా ప్రణాళికలు రచిస్తోంది కోహ్లి సేన. తొలి మ్యాచ్‌లో గెలిచినప్పటికీ కొన్ని లోపాలు కూడా భయటపడ్డాయి. హైదరాబాద్ టీ20లో బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడంతో పాటు చెత్త ఫీల్డింగ్ టీమ్ మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. దీంతో రెండో మ్యాచ్‌లో ఈ లోపాలను సరిదిద్దుకోవడంతో పాటు జట్టులోనూ పలు మార్పులు చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అయితే విన్నింగ్ టీమ్‌ను మార్చకూడదని నిబంధనలను రూపొందించుకున్నప్పటికీ మార్పులు తప్పేలా లేవని సమాచారం. బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు లేవని తెలుస్తోంది. అయితే బౌలింగ్ విభాగంపైనే టీమ్ మేనేజ్మెంట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. పునరాగమనం మ్యాచ్‌లో భువనేశ్వర్ తేలిపోయాడు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న దీపక్ చహర్ విఫలమయ్యాడు. యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఫీల్డింగ్‌లో పూర్తిగా నిరుత్సాహపరిచాడు. దీంతో భువీ, చహర్‌లలో ఒకరిని పక్కకు పెట్టి మహ్మద్ షమీని తీసుకోవాలని భావిస్తున్నారు. అదేవిధంగా వాషింగ్టన్ సుందర్‌ను జట్టు నుంచి తప్పించి కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఫీల్డింగ్ వైఫల్యంపై కూడా మేనేజ్మెంట్ ప్రత్యేక దృష్టి సారించింది. ఆదివారం జరిగిన నెట్ ప్రాక్టీస్‌లో ఫీల్డింగ్ కోసం ఓ సెషన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక తొలి మ్యాచ్‌లో ఎక్కువగా క్యాచ్‌లు నేలపాలు చేసిన రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్లో ఈ అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. అదేవిధంగా మిగతా టీమిండియా ఆటగాళ్లు ఫీల్డింగ్ కోచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక డ్రిల్‌లో పాల్గొన్నారు. ఇక కరీబియన్లు కూడా తొలి మ్యాచ్ వైఫల్యాలను గుర్తించి సరిదిద్దుకోని తిరువనంతపురం మ్యాచ్‌లో అడుగుపెట్టాలని భావిస్తోంది. -
‘అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలి’
సాక్షి, తిరువనంతపురం : అయ్యప్ప భక్తుల సౌకర్యం కోసం పంబ సన్నిధిలో టోల్ ఫ్రీ సర్వీస్ ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సూచించారు. శబరిమలలోని శ్రీధర్మశాస్త దేవాలయంలో నవంబరు 17 నుంచి మండల, మకరవిల ఉత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో కేరళ సీఎం ఆహ్వానం మేరకు ఈ రోజు(మంగళవారం) ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేవదాయశాఖ మంత్రులతో జరిగే ఈ సమావేశానికి ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రతినిధిగా వెళ్లారు. ఈ సమావేశంలో కేరళ సీఎం, దేవాదాయ మంత్రికి ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రి వెల్లంపల్లి కొన్ని అంశాలు ప్రతిపాదించారు. అవి.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అయ్యప్ప స్వాముల కోసం కేరళ ప్రభుత్వాన్ని శబరిమలైలో కొండపైన, కొండ దిగువన అతిథి గృహం, వసతి నిర్మాణానికి స్థలం కేటాయించమని కోరినట్లు ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. రాష్ట్ర పోలీసులు, అధికారులతో కలిసి నీలకంఠ, పంబ బేస్ క్యాంపు వద్ద శబరిమల సమాచార వ్యవస్థతోపాటు తెలుగు అయ్యప్పలు సమాచారం ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కోరారు. పంబ మార్గంలో ప్రయాణించే బస్సు బోర్డులను తెలుగు భాషలో ఏర్పాటు చేయాలని సూచించారు. అయ్యప్ప భక్తులకు నీలకంఠ, పంబ సన్నిధి వద్ద తాగునీరు, విశ్రాంతి కేంద్రాలు, అల్పాహార కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని కోరారు. వీటిపై కేరళ సీఎం స్పందిస్తూ ప్రతి రాష్ట్రంలోనూ ఆయా రాష్ట ప్రభుత్వాల హెల్ప్ డెస్క్‌లకు అనుసంధానిస్తూ కేరళలో సెంట్రల్ హెల్ప్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కేరళ ముఖ్యమంత్రి ఐదు రాష్ట్రాల అయ్యప్ప భక్తులను ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని కోరినట్లు తెలిపారు. స్వామి అయ్యప్ప ఐదు రాష్ట్రాలను కలిపారని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన వివిధ రాష్ట్రాల ప్రతినిధులకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కనకదుర్గ అమ్మవారి ప్రసాదము అందజేసి వారిని సన్మానించారు. అనంతరం పద్మనాభ స్వామిని మంత్రి దర్శించుకొని ఆశీర్వాదములు తీసుకున్నారు. -
దేశంలోనే మొట్టమొదటి అంధ మహిళా ఐఏఎస్
తిరువనంతపురం: ‘ఓడిపోవడానికి అవకాశం ఇవ్వకండి.. ప్రయత్నాన్ని విరమించకండి. మనం చేసే కృషే మనకు కావాల్సింది సాధించి పెడుతుంది’ అంటూ దేశంలోనే మొట్టమొదటి అంధ మహిళా ఐఏఎస్‌గా నియమితురాలైన ప్రంజల్ పాటిల్ (30) పిలుపునిచ్చారు. సోమవారం ఆమె తిరువనంతపురం సబ్‌కలెక్టర్‌గా, రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌కు చెందిన ఆమె ఆరేళ్ల లేత ప్రాయంలోనే చూపును కోల్పోయారు. అయితే జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలనే ఆశను మాత్రం కోల్పోలేదు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి డిగ్రీపట్టా పొందారు. అనంతరం 2016లో జరిగిన యూపీఎస్సీ పరీక్షలు రాసి, 773వ ర్యాంక్ సాధించారు. దీంతో ఆమెకు భారత రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్ఏఎస్)లో ఉద్యోగం వచ్చింది. అయితే ఆమె అంధురాలని తెలియడంతో ఉద్యోగం ఇవ్వడానికి తిరస్కరించారు. పట్టు వదలని ప్రంజల్ తర్వాతి యేడు జరిగిన యూపీఎస్సీ పరీక్షలు మళ్లీ రాసి 124వ ర్యాంక్ సాధించారు. దీంతో ఆమె ఐఏఎస్‌గా ఎంపికై, యేడాది శిక్షణలో భాగంగా ఎర్నాకులం అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. రైల్వే ఉద్యోగం తిరస్కరణకు గురికావడంపై తానెంతో వేదనకు గురయ్యానని ఓ సందర్భంలో తెలిపారు. కళ్లకు చేసిన శస్త్రచికిత్స విఫలమైనందు వల్ల కూడా నొప్పిని అనుభవించానని తెలిపారు. తిరువనంతపురంలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తున్న కార్యక్రమంలో సామాజిక న్యాయ విభాగం సెక్రటరీ బిజు ప్రభాకర్ పాల్గొన్నారు. -
సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రాంజల్
తిరువనంతపురం : ప్రాంజల్ పాటిల్ తిరువనంతపురం జిల్లా సబ్ కలెక్టర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు అధికారులు ఘన స్వాగతం పలకగా, అభినందనలు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్ కే గోపాలకృష్ణన్, కలెక్టరేట్ సిబ్బంది సమక్షంలో ప్రాంజల్ సబ్ కలెక్టర్ట్గా బాధ్యతలు చేపట్టారు. కాగా చూపు లేకున్నా ప్రాంజల్ పాటిల్ తొలి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా 773 ర్యాంక్ సాధించారు. ప్రాంజల్ కంటిచూపు లేని తొలి భారతీయ మహిళా ఐఎఎస్ అధికారి కావడం గమనార్హం. ప్రాంజల్ పాటిల్‌కు ఆరేళ్ల వయసులో తరగతి గదిలో సహ విద్యార్థి పొరపాటున పెన్సిల్‌తో కంట్లో గుచ్చాడు. దాంతో ఆ కన్ను చూపు కోల్పోగా, ఆ గాయం తాలూకు ఇన్ఫెక్షన్ రెండో కన్నుకీ సోకింది. నెమ్మదిగా ఆ కన్ను చూపు కూడా కోల్పోయింది. అయితే ప్రాంజల్ అమ్మానాన్న మాత్రం ఆమెను ఎన్నడూ అంధురాలిగా చూడలేదు. జీవితం పట్ల ఓ దృక్ఫదంతో పాటు కలలు కనేలాగానే పెంచారు. దాదర్‌లోని కమలా మెహతా స్కూల్ ఫర్ బ్లైండ్‌లో పాఠశాల విద్య, చండీబాయి కాలేజ్‌లో ఇంటర్ చేసింది. 2015లో ఎమ్‌ఫిల్ చేస్తూ ఐఏఎస్‌కి ప్రిపరేషన్ మొదలుపెట్టిన ప్రాంజల్ తల్లిదండ్రులు, స్నేహితుల సాయంతో తాను ఐఏఎస్ కావాలనే కలను సాకారం చేసుకున్నారు. -
భారత్ ‘ఎ’ విజయం
తిరువనంతపురం: దక్షిణాఫ్రికా ‘ఎ’తో ఆరంభమైన ఐదు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్‌లో భారత్ ‘ఎ’ శుభారంభం చేసింది. 69 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’ను చిత్తు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ షోతో ఆదరగొట్టాడు. మొదట బ్యాటింగ్‌లో (36 బంతుల్లో 60 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి, అనంతరం కీలక సమయంలో రెండు వికెట్లు తీశాడు. యుజువేంద్ర చహల్ 5 వికెట్లతో రాణించాడు. 47 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత భారత్ 6 వికెట్లు కోల్పోయి 327 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (46), మనీశ్ పాండే (39), ఇషాన్ కిషన్ (37) రాణించారు. శివమ్ దూబే (60 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరిశాడు. అనంతరం దక్షిణాఫ్రికా ‘ఎ’ చహల్ స్పిన్ దెబ్బకు 45 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. రీజా హెండ్రిక్స్ (108 బంతుల్లో 110; 12 ఫోర్లు, సిక్స్) ఒంటరి పోరాటం వృథా అయింది. రెండో వన్డే ఈ నెల 31న జరగనుంది. -
తనయుడిపై లైంగిక ఆరోపణలు.. తండ్రి రాజీనామా!
తిరువనంతపురం: తన తనయుడు చేసిన నిర్వాకం కారణంగా కేరళ సీపీఎం చీఫ్ కొడియేరి బాలకృష్ణన్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. బాలకృష్ణన్ తన కుమారుడి అనైతిక ప్రవర్తనకు మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన కుమారుడు బినయ్ తనపై అత్యాచారం చేసినట్లు ఓ మహిళ ముంబైలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా సమర్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన రాజీనామా వార్తలపై పార్టీ వర్గాలు ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా ఘటనపై స్పందించిన బాలకృష్ణన్ .. నిందిడుడిని ఎవరూ రక్షించలేరని పేర్కొన్నారు. బాలకృష్ణన్ కుమారుడు బినయ్ తనపై అత్యాచారం చేసినట్లు బిహార్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల ముంబైలో ఫిర్యాదు చేశారు. తనను చాలా సంవత్సరాలుగా ఆయన లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. తన ఎనిమిదేళ్ళ బిడ్డకు తండ్రి ఆయనేనని పేర్కొన్నారు. ఈ వాస్తవాన్ని నిరూపించేందుకు ఎటువంటి పరీక్షలకైనా తాను సిద్ధమేనని చెప్పారు. బినయ్ దుబాయ్‌లో వ్యాపారం చేస్తుండగా.. ఆమెకూడా దుబాయ్‌లో బార్ డ్యాన్సర్‌గా చేసినట్లు పోలీసులు సమాచారం. -
తిరువనంతపురం విజేత ఎవరు?
సాక్షి, తిరువనంతపురం: తెల్లటి కద్దరు చొక్కా, దోవతి ధరించిన కుమ్మనం రాజశేఖరన్ బీజీపీ అభ్యర్థిగా తిరువనంతపురం కోక్‌సభ నియోజక వర్గంలో ఆదివారం వరకు విస్తతంగా పర్యటించారు. కచాని నుంచి కేశవదాసపురం వరకు సాగిన ఆయన ఎన్నికల యాత్రలో ఆయన ఎదురైన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగగా, ఆయన పార్టీ కార్యకర్తలు దారి పొడువున ఆయనకు కాషాయ, ఆకుపచ్చ కండువాలు కప్పుతూ ‘భారత మాతాకు జై’ అంటూ నినదించారు. ఈ సందర్భంగా ఆయన పలు చోట్ల మాట్లాడుతూ తాను నియోజకవర్గం అభివద్ధికి కృషి చేయడంతోపాటు సంస్కతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తానంటూ ‘వివాదాస్పద శబరిమల’ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల ఆడవాళ్లను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడానికి కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం కృషి చేయగా, బీజేపీ, ఆరెస్సెస్ సంస్థలు అందుకు వ్యతిరేకంగా ఆందోళన చేశాయి. తద్వారా బీజేపీ తిరువనంతపురం ప్రాంతంలో తన బలాన్ని పెంచుకుంది. తొలుత, సుప్రీం కోర్టు తీర్పును బీజేపీ సమర్థించింది. గణనీయ సంఖ్యలో సుప్రీం తీర్పును ప్రజలు వ్యతిరేకిస్తూ వీధుల్లోకి రావడంతో బీజేపీ తన వైఖరిని మార్చుకొని ప్రత్యక్షంగా ఆందోళనలకు దిగింది. గత 70 ఏళ్లుగా రాష్ట్రంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు ప్రతి ఐదేళ్లకోసారి మారుతూ వస్తున్నాయని, ఈసారి ఆ మార్పు తిరువనంతపురంలో బీజేపీకి అనుకూలంగా మారుతుందని రాజశేఖరన్ మీడియాతో వ్యాఖ్యానించారు. వరుసగా గత రెండు ఎన్నికల్లో తిరువనంతపురంలో కాంగ్రెస్ అభ్యర్థిగా శశిథరూర్ విజయం సాధిస్తూ వచ్చారు. మూడవ విడతగా తిరువనంతపురంలో ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ జరుగుతోంది. ఒక్క ఈ నియోజకవర్గంలోనే కాదు, మొత్తం కేరళలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏనాడు విజయం సాధించలేదు. ఈసారి శబరిమల వివాదం వల్ల బీజేపీకి లాభం చేకూరుతుందని ఆ పార్టీ భావిస్తోంది. అందుకని రాష్ట్రంలోని 20 లోక్‌సభ స్థానాలకుగాను బీజేపీ 14, మిత్రపక్షాలు ఆరు స్థానాలకు పోటీ చేస్తున్నాయి. మిత్రపక్షమైన భారత ధర్మసేన ఐదు, కేరళ కాంగ్రెస్ (థామస్) ఒక్క స్థానానికి పోటీ చేస్తున్నాయి. తిరువనంతపురం సీటును కైవసం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలోకి అడుగుపెట్టాలని ఉవ్యూళ్లూరుతున్న బీజేపీ, రాజశేఖరన్ విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. ఆయన విజయం కోసం భారీ ఎత్తున ఆర్థిక వనరులను సమకూర్చినట్లు తెల్సింది. మరో పక్క ఆయన ఎన్నికల ప్రచార బాధ్యతలను ఆరెస్సెస్ స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్యాడర్‌ను ఇక్కడికే పంపించింది. అయితే ఆయన విజయం అంత సులువుకాదు, కచ్చితమూ కాదు. కాంగ్రెస్ అభ్యర్థిగా శశిథరూర్యే కాకుండా ఎల్డీఎఫ్ తరఫున బలమైన అభ్యర్థి, మాజీ మంత్రి సీ. దివాకరన్ పోటీ చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో శశిథరూర్ మొదటిసారి 99,998 ఓట్ల మెజారిటీ తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి పీ. రామచంద్రన్ నాయర్‌పై విజయం సాధించారు. ఇక బీజేపీ అభ్యర్థి పీ. కష్ణదాస్ కేవలం 84,094 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. 2014 ఎన్నికల్లో కూడా శశిథరూర్ రెండోసారి విజయం సాధించగా, బీజేపీ అభ్యర్థి ఓ. రాజగోపాల్ రెండో స్థానంలో వచ్చారు. ఆ ఎన్నికల్లో శశిథరూర్ మెజారిటీ 15,470 ఓట్లకు పడి పోవడం గమనార్హం. ఈ నియోజకవర్గంలో బీజేపీ 1998 నుంచి తన పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచుకుంటూ వస్తోంది. 1998లో 12.39 శాతం ఓట్లురాగా, 1999లో 20.93 శాతం, 2004లో 29.86 శాతం ఓట్లు వచ్చాయి. 2005లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పోలింగ్ శాతం దారుణంగా 4.8 శాతంకు పడిపోయింది. అది 2009లో 11.4 శాతానికి, 2014లో 32.32 శాతానికి పెరిగింది. 2016లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తిరువనంతపురం జిల్లాలోని నిమామ్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీ గెలుచుకుంది. -
పద్మనాభుడిని దర్శించుకున్న ఎంపీ కవిత
తిరువనంతపురం : కేరళ రాష్ట్ర పర్యటనలో ఉన్న నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ ఉదయం అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ట్రావెన్కోర్ మహారాణి గౌరి లక్ష్మీభాయి, ప్రిన్స్ ఆదిత్యవర్మలను మర్యాదపూర్వకంగా కలిశారు. కౌడియర్ ప్యాలెస్‌కు వెళ్లిన ఎంపీ కవితను మహారాణి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పద్మనాభస్వామి ప్రతిమతో పాటు మహారాణి రాసిన అనంత పద్మనాభస్వామి ఆలయ చరిత్ర పుస్తకాన్ని కవితకు బహూకరించారు. అదేవిధంగా మహారాణికి ఎంపీ కవిత పోచంపల్లి శాలువాను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్‌సాగర్, ఎస్యూటీ మెడికల్ సైన్స్ సీఈఓ గౌరీ కామాక్షి, ప్యాలెస్ ఆడిటర్ గోపాల కృష్ణన్, కాంచీపురం శంకర్ పాల్గొన్నారు. కేరళ అసెంబ్లీలో.. డైమండ్ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ దేశంలోని వివిధ యూనివర్సిటీల విద్యార్థులను ఉద్దేశించి ఎంపీ కవిత ప్రసంగించనున్నారు. -
కెమిస్ట్రీ టీచర్ వెడ్డింగ్ కార్డు: వైరల్
తిరువనంతపురం: పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన వేడుక. అందుకే ఈ వేడుకను ఎప్పటికి గుర్తుండిపోయే విధంగా జరుపుకునేందుకు చాలా మంది యువతి, యువకులు ఉత్సహం కనబరుస్తున్నారు. ఫొటో సెషన్లు, సంగీత్‌లు, వెడ్డింగ్ కార్డులు.. ఇలా ప్రతిది ఆకట్టుకునేలా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ కెమిస్ట్రీ టీచర్ తన వివాహ ఆహ్వాన పత్రికను వినూత్నంగా రూపొందించడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని తిరువనంతపురానికి చెందిన విథున్ అనే కెమిస్ట్రీ టీచర్‌కు డిసెంబర్ 14న సూర్య అనే వ్యక్తితో పెళ్లి జరగనుంది. కెమిస్ట్రీ టీచర్ అయిన విథున్ తన పెళ్లి పత్రికను కూడా ఆమె బోధిస్తున్న సబ్జెక్ట్‌తో ముడిపడి ఉండేలా రూపొందించారు. ఈ వెడ్డింగ్ కార్డును ఆర్గానిక్ కెమిస్ర్టీలోని రసాయనబంధాలను గుర్తుకు తెచ్చేలా రూపొందించారు. అందులో లవ్(LOVE) అనే పదాలను కూడా అందంగా పొందుపర్చారు. వధువరుల పేర్లు కూడా కెమిస్ట్రీ లుక్‌లోనే డిజైన్ చేశారు. మరి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పెళ్లిని రియాక్షన్(చర్య)గా, కళ్యాణ వేదికను ల్యాబోరేటరిగా పేర్కొన్నారు. విథున్ సృజనాత్మకతపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శుభాకాంక్షలు తెలిపిన శశిథరూర్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వెడ్డింగ్ కార్డును కార్తీక్ వినోబా అనే వ్యక్తి కాంగ్రెస్ నేత శశిథరూర్‌ను ట్యాగ్ చేస్తూ ట్విటర్లో పోస్ట్ చేశాడు. మీ నియోజకవర్గంలోని ఓ కెమిస్ట్రీ టీచర్ వెడ్డింగ్ కార్డు ఇది అని కార్తీక్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. దీనిపై చమత్కారంగా స్పందించిన శశిథరూర్ ఆ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. Wishing them all the best for a happy married life! May the chemistry between them always sparkle, the physics feature more light than heat, and the biology result in bountiful offspring....! https://t.co/Y6aYMjFsPi — Shashi Tharoor (@ShashiTharoor) 13 December 2018 -
ఐదో వన్డేకు ఫుల్ గిరాకీ!
తిరువనంతపురం : భారత్-వెస్టిండీస్ మధ్య చివరిదైన ఐదో వన్డే టికెట్లకు ఫుల్ డిమాండ్ ఉందని కేరళ క్రికెట్ ఆసోసియేషన్(కేసీఏ) తెలిపింది. రేపు(గురువారం) తిరువనంతపురం వేదికగా ఈ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్.. సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. దీంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా కేసీఏ విద్యార్థులకు 50 శాతం డిస్కౌంట్ ప్రకటించడంతో టికెట్లు బాగా అమ్ముడుపోతున్నాయి. 40వేల సీటింగ్ కెపాసిటీ గల ఈ మైదానంలో మంగళవారానికే 30వేల టికెట్లు అమ్ముడుపోయాయని, మ్యాచ్ ప్రారంభమయ్యే రోజువరకు అన్ని టికెట్లు అమ్ముడుపోతాయని కేసీఏ అధికారులు పేర్కొన్నారు. (చదవండి : ఆటలో ‘అరటిపండు’!) టికెట్ల అమ్మకాల ద్వారా రూ.3 కోట్లు ఆదాయం వచ్చిందని, విద్యార్థులు ఆఫర్లో టికెట్లు కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా ఐడీకార్డులు తీసుకురావాలని సూచించారు. ఇప్పటికే ఇరు జట్లు అక్కడి చేరుకోని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇది కూడా బ్యాటింగ్ పిచ్ కావడంతో మరోసారి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో రోహిత్, రాయుడులు సెంచరీలతో చెలరేగి భారత్‌కు అతిపెద్ద విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. (చదవండి: భారత క్రికెట్ ప్రమాదంలో పడింది!) ధోని ‘మెరుపు’ చూశారా? -
నాకు తెలియాలి
సిటీ కార్పోరేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్, షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అన్నిటికీ సరోజమ్ దరఖాస్తు పెట్టింది.. ‘‘నా దుకాణం కూలగొట్టమని ఎవరు ఆర్డర్ ఇచ్చారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అని. ‘‘నేను ఇచ్చిన కంప్లయింట్ స్టేటస్ ఏంటి? దర్యాప్తు చేయడానికి పురమాయించారా? ఒకవేళ ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ కాపీ చూపించండి. దర్యాప్తు కోసం నియమించిన ఆఫీసర్ ఎవరు? దర్యాప్తు జరిగి ఉంటే దానికి సంబంధించిన రిపోర్ట్ కాపీని సంబంధిత అధికారికి అందచేశారా?..ఈ ప్రశ్నలతో దరఖాస్తు అందగానే ఆగమేఘాల మీద కదిలారు పోలీసులు ఆ కేస్ ఇన్వెస్టిగేషన్‌కు.ఈ ప్రశ్నలు సంధించిన వ్యక్తి పేరు సరోజమ్. ఓ సగటు మహిళ. షెడ్యూల్డ్ క్యాస్ట్‌కు చెందిన వ్యక్తి. ఏ విషయం పట్ల ఆ ఆగ్రహం? మామూలు ఆగ్రహం కాదు ధర్మాగ్రహం! మొదట పట్టించుకోలేదు సరోజమ్.. తిరువనంతపురం నివాసి. 20 ఏళ్లుగా అక్కడే ఎమ్ఎస్కె నగర్లో అట్టుకల్ దేవీ గుడి దగ్గర పాత ఇనుప సామాన్ల దుకాణం నడిపిస్తూ ఉంది. 2014 అక్టోబర్ 11న సిటీ కార్పొరేషన్‌కు చెందిన కొంతమంది మనుషులు వచ్చి ఆమె దుకాణాన్ని కూలగొట్టారు. అందులో ఉన్న వస్తువులన్నిటినీ ఊడ్చుకెళ్లారు. ఎందుకలా చేస్తున్నారు అని ఆ సరోజమ్ అడిగితే.. ఆ దుకాణం పక్కనే ఉన్న చెరువును శుభ్రం చేయమని ఆర్డర్స్ వచ్చాయని.. చెరువు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ క్లీన్ చేయమన్నారని.. పైగా ఆమె దుకాణం పోరంబోకు భూమిలో ఉంది కాబట్టి దాన్నీ తీసేశామని చెప్పారనీ అన్నారు. వెంటనే ఆమె భర్త నాగరాజన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి, వాళ్లపై కంప్లయింట్ ఇచ్చాడు. ఎప్పటిలాగే పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఓ నెల అయినా వ్యవహారం అంగుళం ముందుకు సాగలేదు. ఈసారి సరోజమ్ వెళ్లి ఇంకోసారి కంప్లయింట్ ఇచ్చింది. రిసీట్ ఇవ్వమనీ డిమాండ్ చేసింది. అయినా పోలీసులు స్పందించలేదు. తరచుగా పోలీస్ స్టేషన్ వెళ్తూనే ఉంది. దాదాపు పదినెలలు గడిచాయి. బతుకు దెరువు పోయింది. చేతిలో ఇంకో పనిలేదు. పోలీసుల తీరులో మార్పులేదు. తర్వాత పరుగులు తీశారు సరోజమ్ వాళ్లుండే ప్రాంతంలో ‘ది సేవా’ (సెల్ఫ్ ఎంప్లాయ్డ్ విమెన్స్ అసోసియేషన్) ఆర్టీఐ (రైట్ టు ఇన్ఫర్మేషన్) మీద అవగాహనా తరగతులను నిర్వహించింది. దానికి సరోజమ్ కూడా వెళ్లింది. అంతా విని తన సమస్య గురించి తను ఇచ్చిన పోలీస్ కంప్లయింట్ కథాకమామీషు కూడా ఈ ఆర్టీఐ ద్వారా తెలుసుకోవచ్చా? అని నిర్వాహకులను అడిగింది. తెలుసుకోవచ్చని చెప్పారు. ఎలాగో కూడా వివరించారు. అలా వాళ్ల సలహా ప్రకారం తను ఇచ్చిన కంప్లయింట్‌కు సంబంధించి పైన ప్రశ్నలతో పోలీస్‌స్టేషన్‌లో ఆర్టీఐ దరఖాస్తును ఫైల్ చేసింది. మీడియా వాళ్లొచ్చారు ఆ రోజు వరకు ఎప్పుడు సరోజమ్ వెళ్లినా.. అసలు ఎమ్ఎస్కె నగర్లో.. అట్టుకల్ దేవీ గుడి దగ్గరున్న చెరువు ఒడ్డున పాత ఇనుప సామాన్ల షాపే లేదని.. అదంతా పోరంబోకు ల్యాండ్ అని సరోజమ్‌ను బెదిరించి పంపిన పోలీసులు ఆమె ఆర్టీఐ దరఖాస్తు చూసి అంతకుమించిన బెదురుతో హుటాహుటిన కదిలారు.. కేస్ సాల్వ్ చేయడానికి! దాంతో అప్పటిదాకా నిద్రాణంగా ఉన్న ఆ కేస్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. నిరుపేదల, షెడ్యూల్డ్ కులాల ప్రజల అజ్ఞానాన్ని ప్రభుత్వోద్యోగులు ఎలా ఆసరాగా మలచుకుంటున్నారో సరోజమ్ కేసుతో ప్రజలకు చూపించింది స్థానిక మీడియా. పదినెలలుగా సరోజమ్ కుటుంబం పడ్డ అవస్థ వార్తగా వైరల్ అయింది. వార్తా చానెళ్లు కెమెరా, మైక్‌లతో ఆమె ముందు ప్రత్యక్షమయ్యారు. కూల్చినవాళ్లే కట్టించారు సిటీ కార్పొరేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్, షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అన్నిటికీ సరోజమ్ దరఖాస్తు పెట్టింది.. ‘‘నా దుకాణం కూలగొట్టమని ఎవరు ఆర్డర్ ఇచ్చారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అని. ‘‘సరోజమ్ దుకాణం కూల్చివేతతో మాకు ఎలాంటి సంబంధం లేదని, మేమెలాంటి ఆర్డర్స్నూ పాస్ చేయలేదు’’ అని కార్పొరేషన్, జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. మరెవరు ఆదేశాలు ఇచ్చారో తెలపమని సంబంధిత ప్రభుత్వ శాఖలకు నోటీసివ్వమని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌కు మరో దరఖాస్తు పెట్టుకుంది సరోజమ్. చెరువును శుభ్రం చేయమనే ఉత్తర్వు షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ శాఖ నుంచి వచ్చినట్టు తేలింది. ‘‘స్వయం పర్యాప్త గ్రామం’ (సెల్ప్ సఫీషియెంట్ విలేజ్) ప్రాజెక్ట్ కింద చెరువును శుభ్రం చేసే పనిని చేపట్టాం తప్ప, ఒడ్డున ఉన్న షాప్‌ను కూల్చమనే ఉత్తర్వులు అయితే ఇవ్వలేదు’’ అని వివరణ ఇచ్చాడు ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇక్కడి నుంచి కథ ఇంకా చకచకా కదలడం మొదలైంది. ఎవరు కూల్చమన్నారు? ఎందుకు కూల్చారు నుంచి అసలు ఎమ్ఎస్కె నగర్ స్వరూప స్వభావాల మీద అధ్యయనం దాకా వెళ్లింది వ్యవహారం. చివరికి ఈ ఏడాది ముప్పయ్ అంటే ముప్పయ్ రోజుల్లో.. సరోజమ్ ఆర్టీఐ దరఖాస్తుతో ఆమె దుకాణాన్ని ఎక్కడైతే కూల్చారో.. అక్కడే కొత్త దుకాణాన్ని కట్టి ఇచ్చారు. ఎమ్ఎస్కె నగర్‌ను కూడా అత్యవసర సదుపాయాలతో కొత్తగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆ కాలనీ వాసులంతా సరోజమ్‌ను విజేతగా.. నేతగా అభిమానిస్తున్నారు. – శరాది -
గర్ల్‌ఫ్రెండ్‌తో సంజూ శాంసన్ పెళ్లి ఫిక్స్
తిరువనంతపురం: టీమిండియా యువ క్రికెటర్ సంజూ శాంసన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న తన గర్ల్‌ఫ్రెండ్ చారును డిసెంబరులో పెళ్లి చేసుకోనున్నట్టు ఈ కేరళ బ్యాట్స్‌మన్ ప్రకటించాడు. 23 ఏళ్ల సంజూ తన కళాశాల క్లాస్మేట్ అయిన చారును ఐదేళ్లక్రితం కలిశాడు. అప్పటినుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పటికీ, ఈ విషయం ఎప్పుడూ బహిర్గతం కానివ్వలేదు. అయితే, తమ ప్రేమకు ఇప్పుడు పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించిన విషయాన్ని సంజూ వెల్లడించాడు. ‘మేము ఇద్దరం కలిసి గడిపాం. కానీ ఎప్పుడూ బహిరంగంగా కలిసి మాత్రం తిరగలేదు. ఈరోజు మాత్రం మా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ లభించింది. మా పెళ్లిని సంతోషంగా ఒప్పుకున్న తల్లిదండ్రులకు చాలా చాలా థాంక్స్. చారు వాళ్ల కుటుంబంతో మాట్లాడి పెళ్లిని కుదిర్చారు. మా పెళ్లికి డిసెంబర్ 22వ తేదీన ముహూర్తం కుదిరింది’ అని సంజూ శాంసన్ తెలిపాడు. చారు తండ్రి తిరువనంతపురంలో సీనియర్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ‘2013, ఆగస్టు 22వ తేదీన చారుకు తొలిసారి ‘హాయ్’ చెప్పా. ఆ తర్వాత నుంచి మా బంధం క్రమేపీ బలపడుతూ వచ్చింది. ఇన్నాళ్లకు మా పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది’ అని శాంసన్ పేర్కొన్నాడు. -
‘హిందూపాకిస్తాన్’గా మార్చేస్తారు!
తిరువనంతపురం: బీజేపీకి మళ్లీ అధికారమిస్తే దేశాన్ని ‘హిం దూ పాకిస్తాన్’గా మారుస్తుందంటూ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ వ్యాఖ్యానించారు. ‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేసి కొత్త రాజ్యాంగాన్ని లిఖిస్తుంది. దేశాన్ని హిందూ దేశంగా మారుస్తుంది. అప్పుడు మైనారిటీలకు హక్కులుండవు. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా ఆజాద్ వంటి మహామహులు సాగించిన స్వాతంత్య్ర పోరాట లక్ష్యాలకు వ్యతిరేకంగా దేశం ‘హిందూపాకిస్తాన్’గా మారుతుంది’ అని తిరువనంతపురంలో అన్నారు. -
రెడ్ ఎఫ్ఎం మాజీ ఆర్జే హత్య
త్రివేండ్రం : గత రెండు రోజులుగా జర్నలిస్టుల వరుస హత్యలతో కలకలం రేగుతున్న నేపథ్యంలో... కేరళకు చెందిన ఆర్జే, మిమిక్రీ కళాకారుడు రాజేశ్(36)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. మదావూర్లోని తన స్టూడియో నుంచి స్నేహితునితో కలిసి బయల్దేరిన రాజేశ్ వాహనాన్ని రెడ్ కలర్ స్విప్ట్ కారులో కొందరు వ్యక్తులు వెంబండించారు. తమ వద్దనున్న పదునైన ఆయుధాలతో రాజేశ్, అతని స్నేహితునిపై దాడి చేశారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రాజేశ్, అతన్ని స్నేహితున్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా తీవ్రంగా గాయపడిన రాజేశ్ మరణించాడు. అతని స్నేహితుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. హంతకులను పట్టుకునేందుకు విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు. కాగా రాజేశ్ గతంలో చాలా ఏళ్ల పాటు ప్రముఖ రేడియో చానెల్ రెడ్ ఎఫ్ఎంలో ఆర్జేగా పని చేశాడు. తర్వాత దోహాలోని వాయిస్ ఆఫ్ కేరళ ఎఫ్ఎం స్టేషన్లో పని చేశాడు. ప్రస్తుతం మిమిక్రి ట్రూప్‌ను ఏర్పాటు చేసుకుని ప్రదర్శనలు ఇస్తున్న నేపథ్యంలో హత్యకు గురయ్యాడు.