పుట్టింగల్ ఆలయ దుర్ఘటన తర్వాత కేరళలోని దేవాలయాల్లో బాణసంచా నిషేధించాలని హైకోర్టు ఆదేశించినా.. స్థానికులు మాత్రం వెనక్కు తగ్గటం లేదు.
తిరువనంతపురం: పుట్టింగల్ ఆలయ దుర్ఘటన తర్వాత కేరళలోని దేవాలయాల్లో బాణసంచా నిషేధించాలని హైకోర్టు ఆదేశించినా.. స్థానికులు మాత్రం వెనక్కు తగ్గటం లేదు. పుట్టింగల్ గుళ్లో ఇకపైనా బాణసంచా పేలుస్తామని, అయితే భద్రతా ప్రమాణాలను పాటిస్తామని చెబుతున్నారు. తక్కువ పేలుడు సామర్థ్యమున్న బాణసంచా వాడాలంటున్నారు.
ప్రమాదం జరిగిందని దశాబ్దాలనుంచి చేపడుతున్న కార్యక్రమాలను ఆపలేమని తేల్చిచెప్పారు. కాగా, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి శరీరంలోనుంచి అరకిలో కాంక్రీట్ ముక్కలను డాక్టర్లు ఆపరేషన్ చేసి తొలగించారు. మెదడులోకి కాంక్రీట్ గుండు దూసుకుపోయిన మరో యువకుడినీ ఆపరేషన్ చేసి ప్రమాదం నుంచి తప్పించారు.