తిరువనంతపురం:ఓ ప్రయాణికుని లగేజీలో తుపాకీ గుండు లభించడంతో తిరువనంతపురం విమానాశ్రయంలో కలకలం రేపింది. శివ అనే ప్రయాణికుడు దమ్మమ్ కు వెళ్లే క్రమంలో లగేజీ చెక్ చేస్తుండగా తుపాకీ గుండు దొరికింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న సీఐఎస్ఎఫ్ అధికారులు పోలీసులకు అప్పగించారు.
ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తాను తమిళనాడులోని కొవిళ్ పట్టి కి చెందిన వాడినని, ఆ బుల్లెట్ ను తన స్నేహితుడు ఇచ్చాడని అతను పోలీసులకు తెలిపాడు. అయితే అతని వ్యాఖ్యలకు సంబంధించి తగిన ఆధారాలు ఏమీ లేవని పోలీసులు తెలిపారు.