Bullet
-
గన్ బ్యాక్‌ఫైర్.. జవాన్ మృత్యువాత!
పిట్టలవానిపాలెం (కర్లపాలెం): పంజాబ్‌లోని సూరత్ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం పంచాయతీ గౌడపాలెం గ్రామానికి చెందిన జవాన్ పరిశా మోహన్ వెంకటేష్ (27) గన్‌లోని బుల్లెట్ బ్యాక్‌ఫైర్ అయ్యి రాజస్థాన్‌లో మృత్యువాత పడ్డారు. ఈ మేరకు సైనిక అధికారుల నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో ఆయన భార్య, తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పరిశా శ్రీనివాసరావు, శివపార్వతి దంపతులకు కుమారులు మోహన్ వెంకటేష్, గోపీకృష్ణ ఉన్నారు. ఇంటర్ వరకు చదివిన మోహన్ వెంకటేష్ 2019 డిసెంబర్లో ఆర్మీలో చేరారు. రాజస్థాన్‌లో సోమవారం జరిగిన ఆర్మ్డ్ గన్ ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తల్లిదండ్రులతో మోహన్ వెంకటేష్ ఫోన్లో మాట్లాడారు. మధ్యాహ్నం 2 గంటలకు భార్యకు వీడియోకాల్ చేసి ముచ్చటించాక, పాపను కూడా చూశారు. మళ్లీ రాత్రికి ఫోన్ చేస్తానని చెప్పారు. కానీ మధ్యాహ్నం 3.30 గంటలకు గన్ క్లియర్ చేస్తుండగా బ్యాక్ ఫైర్ అయ్యి బుల్లెట్ తలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం ఆయన భౌతికకాయం స్వగ్రామానికి రానుందని సైనికాధికారులు తెలిపారు. -
బైరాగిగూడలో మరోసారి బుల్లెట్ కలకలం
మణికొండ: నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధి బైరాగిగూడ విద్యానగర్ కాలనీలో మంగళవారం తుపాకీ తూటా కలకలం రేపింది. పద్మ అనే మహిళ కాలును తాకుతూ వెళ్లింది. త్రుటిలో ప్రాణాపాయం నుంచి ఆమె బయటపడింది. బాధితురాలు పద్మ, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో పద్మ తమ ఇంటి ముందు దుస్తులు ఆరేస్తుండగా కాలుకు అకస్మాత్తుగా ఏదో వస్తువు తగిలినట్లయ్యింది. కాలును గీసుకుని వెళ్లి రక్త్రస్తావమైంది. ఆ ప్రాంతంలో వెతకగా బుల్లెట్ కనిపించింది. కాలికి కాకుండా శరీరం పైభాగంలో అది తగిలి ఉంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని పద్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వెంటనే నార్సింగి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు బుల్లెట్‌ను స్వా«దీనం చేసుకుని బాధితురాలిని గోల్కొండ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆర్మీ బుల్లెట్‌గా గుర్తింపు.. గంధంగూడకు ఒకవైపు మిలిటరీ, మరోవైపు పోలీస్ ఫైరింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఇటీవల ఫైరింగ్‌లో శిక్షణ ఇస్తుండటంతో బుల్లెట్లు చుట్టు పక్కల ఉన్న జవావాసాల్లోకి వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంధంగూడలో మహిళకు తగిలిన బుల్లెట్ ఆరీ్మదిగా గుర్తించామని, వారికి ప్రజలకు హాని కలిగే పరిస్థితులు వివరిస్తూ నోటీసు పంపుతామని పోలీసులు తెలిపారు. క్లూస్ టీంతో ఆదారాలను సేకిరించామని, తగు చర్యలు తీసుకుంటామన్నారు. -
హైదరాబాద్: మహిళ కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్
సాక్షి, రంగారెడ్డి: నార్సింగ్‌లో గన్ మిస్‌ఫైర్ అయ్యింది. ఓ ఇంట్లో ఉన్న మహిళ కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో మహిళ కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టిస్ చేస్తుండగా ఘటన జరిగింది. ఈ నెలలోనే ఇది రెండో ఘటనకాగా, ఈ నెల 13న నార్సింగి బైరాగిగూడలో బులెట్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఓ అపార్ట్మెంట్లోకి బులెట్ దూసుకొచ్చింది. ఐదో అంతస్తులో ఉన్న ప్లాట్ కిటికీ అద్దాలు పగిలి.. బెడ్ రూమ్‌లో బులెట్ పడింది. ఫ్లాట్ యజమాని ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఎవ్వరికీ ఏమి కాకపోవడంతో యజమాని ఊపిరి పీల్చుకున్నారు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్లో ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, గన్ మిస్ ఫైర్ కావడంతో అపార్ట్మెంట్ ఐదో అంతస్తులోకి బులెట్ దూసుకొచ్చింది. -
తలలోకి బుల్లెట్లు చొచ్చుకుపోయి.. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతి
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పటాన్‌చెరులోని బీడీఎల్ కంపెనీలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో బస్సులో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి మృతిచెందాడు. సీఐఎస్‌ఎఫ్‌ఎస్ యూనిట్ లైన్ బ్యారెక్‌లో బస్సు దిగే క్రమంలో అతని వద్ద ఉన్న ఇన్సస్ రైఫిల్ పేలి తూటా తలలోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడిని నంద్యాల జిల్లా అవుకు మండలం జూనూతల గ్రామానికి చెందిన జవాను వెంకటేష్‌గా గుర్తించారు. కాగా వెంకటేష్ ఏడాదిన్నర క్రితం ట్రాన్స్ ఫర్ కింద హైదరాబాద్ వచ్చి సీఐఎస్ఎఫ్ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మృతునికి భార్య లక్ష్మీదేవి, తొమ్మిదేళ్ల కొడుకు సాయి, ఎనిమిదేళ్ల పాప సాయి పల్లవి ఉన్నారు. తుపాకీ పేలిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ప్రమాదమా.. లేక ఆత్మహత్య అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. -
Hyderabad: అపార్ట్మెంట్లోకి దూసుకొచ్చిన తూటా
మణికొండ: బైరాగిగూడలో ఓ అపార్ట్మెంట్ బెడ్రూం కిటికీ అద్దాల్లోంచి దూసుకువచ్చి గోడకు తగిలిన ఘటన శనివారం చోటుచేసుకుంది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బైరాగిగూడలోని ఓ అపార్ట్మెంట్ అయిదో అంతస్తులో సాఫ్ట్వేర్ ఉద్యోగి సిద్ధార్థ్ ఉంటున్నారు. శనివారం ఆయన ఉదయం తన భార్యతో కలిసి కిందకు వెళ్లి వాకింగ్ చేస్తున్నారు. ఇంతలోనే ఓ తూటా వీరి ఇంట్లోని బెడ్రూం కిటికీ అద్దాలను చీల్చుకుంటూ వచ్చి గోడకు తగిలింది. ఆ శబ్దానికి ఇంట్లోని పెంపుడు కుక్క పెద్దగా అరవటంతో వాకింగ్ చేస్తున్న సిద్ధార్థ్ ఇంట్లోకి వచ్చారు. కిటికీకి రంధ్రం ఉండటం, బెడ్రూంలో తుపాకీ తూటా కింద పడి ఉండటాన్ని గమనించి ఎవరో తన ఇంటిపై కాల్పులు జరిపారని భయాందోళనకు గురయ్యారు. నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి సీఐ హరికృష్ణారెడ్డి పరిశీలించారు. పక్కనే ఉన్న తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి వచ్చి ఉంటుందని, వారు శుక్రవారం నుంచి ఫైరింగ్ శిక్షణ ఇస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. పక్కనే ఉన్న ఇబ్రహీంబాగ్ మిలిటరీ ఫైరింగ్ రేంజ్ నుంచి బుల్లెట్ వచ్చి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఫైరింగ్ రేంజ్‌లకు సమీపంలో అపార్ట్మెంట్లకు అనుమతులు ఇవ్వటం, ఇలాంటి సంఘటనలు జరిగితే ప్రాణనష్టం జరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ ఇదే తరహాలో ఇబ్రహీంబాగ్ రెజిమెంట్ నుంచి మణికొండ క్వార్టర్స్‌లోకి బుల్లెట్లు వచ్చి పడ్డాయని స్థానికులు గుర్తు చేశారు. -
హైదరాబాద్: అపార్ట్మెంట్లోకి దూసుకెళ్లిన బులెట్
సాక్షి, హైదరాబాద్: నార్సింగి బైరాగిగూడలో బులెట్ కలకలం రేపింది. ఓ అపార్ట్మెంట్లోకి బులెట్ దూసుకొచ్చింది. ఐదో అంతస్తులో ఉన్న ప్లాట్ కిటికీ అద్దాలు పగిలి.. బెడ్ రూమ్‌లో బులెట్ పడింది.ఫ్లాట్ యజమాని ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఎవ్వరికీ ఏమి కాకపోవడంతో యజమాని ఊపిరి పీల్చుకున్నారు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్లో ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, గన్ మిస్ ఫైర్ కావడంతో అపార్ట్మెంట్ ఐదో అంతస్తులోకి బులెట్ దూసుకొచ్చింది. -
జపాన్ బుల్లెట్ రైలు తలరాతని మార్చిన కింగ్‌ఫిషర్!
శాస్త్రవేత్తలు, మహామహా మేధావులు ఎన్నో కొంగొత్త ఆవిష్కరణలు చేయడం గురించి విన్నాం. అవన్నీ పూర్తి స్థాయిలో ఫలవంతమయ్యేందుకు దేవుడు వైపు(ప్రకృతి వైపు) చూడక తప్పేది కాదు. ఆయన చేసిన సృష్టి అద్భుతమే ఓ గొప్ప మేథస్సు. దాని సాయంతోనే ఆవిష్కరణలు ఫలమంతమయ్యేవి. అలాంటి ఘటనే జపాన్ బుల్లెట్ రైలు విషయంలో చోటు చేసుకుంది. అదేంటంటే..జపాన్ శాస్త్రవేత్తలు సాంకేతికతో కూడిన అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైళ్లను రూపొందించారు. అవి ప్రజల దూరాలను దగ్గర చేసి సమయాన్ని ఆదా చేసేలా అత్యంత నాణ్యతతో రూపొందించారు. అయితే జపాన్‌లో రైలు మార్గం చాలా వరకు టన్నెళ్లతో కూడినది. దీంతో గంటక సుమారు 240 నుంచి 320 కిలోమీటర్లు దూరం ప్రయాణించే ఈ బల్లెట్ రైళ్లు ఈ టన్నెల్ గుండా వెళ్లగానే భారీ శబ్దాలు వచ్చేవి. ఎంతలా అంటే ఇవి దాదాపు 400 మీటర్లు దూరంలో ఉన్న నివాసితులకు వినిపించేంత పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేవి. దీంతో ఈ రైళ్లపై ఫిర్యాదులు రావడం మొదలయ్యింది. నిజంగానే ఆ శబ్దాలు భరిచలేనంత పెద్దగా వచ్చేవి. దీంతో శాస్త్రవేత్తలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటని వెతకడం ప్రారంభించారు. పలు సమావేశాల్లో చర్చల్లో దీనికి పరిష్కారం ప్రకృతిని పరిశీలించే కనుగొనగలమని ఒక శాస్త్రవేత్త సూచించడంతో..ఈ బుల్లెట్ ట్రెయిన్ని ఆవిష్కరించిన ఇజీ నకాట్సు ఆ దిశగా ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇక్కడ బుల్లెట్ రైలు అత్యంత వేగంతో టన్నెల్ గుండా వెళ్తుండటంతో దాని ముందున్న అట్మాస్పియరిక్ ప్రెజరే ఈ బారీ శబ్దానికి కారణమని గుర్తించాడు. ఇలా ఆకాశం నుంచి వేగవంతంగా పయనించి భూమ్మీదకు వచ్చే జీవి ఉందా అనే దిశగా ఆలోచించడం ప్రారంభించాడు. అప్పుడే కింగ్ ఫిషర్ బర్డ్ జ్ఞప్తికి వచ్చింది. అది ఆకాశ నంచి అత్యంత వేగంగా వచ్చి నీటిలోకి శబ్దం లేకుండా తల ముంచి చేపలను లటుక్కున పట్టుకునే తీరు నకాట్సని సరికొత్త ఆలోచనను రేకెత్తించింది. దాని ముక్కు అత్యంత సూదిగా పొడుగుగా ఉండటంతోనే కదా నీటిపై శబ్దం చేయకుండా లోపలకు ముంచి చేపను పట్టుకోగలుగుతుంది అని గుర్తించాడు. దీన్నే బుల్లెట్ రైలుకి అప్లైచేసి దాని రూపురేఖలు మార్పు చేస్తాడు. అనుహ్యాంగా అది టన్నెల్ గుండా వెళ్లినప్పుడూ ఎలాంటి శబ్ద కాలుష్యాన్ని సృష్టించకుండా నిశబ్దంగా వెళ్తుంది. ఈ కొత్త డిజైన్ శబ్దాన్ని తగ్గించడమే కాకుండా, రైళ్లను 15% వేగంగా, 15% శక్తిని ఆదాచేసేలా చేసింది. దేవుడి అద్భత సృష్టిని కాపీ కొట్టడం ద్వారా ఇది సాధ్యం అయ్యిందని ఆయన మేథస్సు ముందు మానవ మేథస్సు చిన్నదేనని నకాట్సు అన్నారు. Japan's famous bullet train used to make a loud boom when it travelled through tunnels. But, thanks to a spot of bird-watching, an engineer was able to fix the problem after he was inspired by a kingfisher.#biomimicry #designthinking #uxRead more at: https://t.co/MzROXEt3aV pic.twitter.com/2HZd9P8FIy— Black Bee (@BlackBeeCoIndia) June 27, 2021 (చదవండి: భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగేస్తున్నారా? నిపుణులు ఏమంటున్నారంటే..) -
'బుల్లెట్ అలా ఎలా బయటికి వస్తుంది బ్రో'.. ఆ సీన్‌పై సైంధవ్ డైరెక్టర్ క్లారిటీ!
టాలీవుడ్ హీరో వెంకటేశ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సైంధవ్. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. వెంకటేశ్ నటిస్తోన్న 75వ మూవీకి శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 13న విడుదలవుతోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెంచేసింది. ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ చిత్రంగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే ట్రైలర్లో ప్రతి సీన్లో బుల్లెట్ల వర్షం కురిపించారు వెంకీమామ. ఇందులో ఓ సీన్ అయితే ఏకంగా పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. బుధవారం మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ సీన్స్‌ను తలపించింది. అయితే ఒక్క సెకన్ కూడా చూపించని ఆ సీన్ పైనే ఇప్పుడు చర్చ మొదలైంది. ట్రైలర్లో ఓ రౌడీ నోట్లో తుపాకీ పెట్టిన వెంకటేశ్ అతన్ని కాల్చగా.. ఆ బుల్లెట్ ఏకంగా అతని మలద్వారం నుంచి బయటకు వచ్చినట్లు చూపించారు. తల వెనుక భాగం నుంచి రావాల్సిన బుల్లెట్ అలా ఎలా వెళ్లిందటూ నెటిజన్స్ షాకింగ్‌కు గురయ్యారు. అంతే కాకుండా ఆ సీన్‌పై మీమ్స్ ఇక చెప్పాల్సిన పనిలేదు. గ్రాఫిక్స్ చేసి మరీ సీన్స్ వైరల్ చేస్తున్నారు. అయితే తాజాగా నెట్టింట వస్తున్న డైరెక్టర్ శైలేశ్ కొలను స్పందించారు. ఆ వీడియోను చూసిన ఆయన చాలా ఫన్నీగా ఉందంటూ ట్వీట్ చేశారు. బుల్లెట్ మలద్వారం నుంచి బయటకు వచ్చే విషయమై పూర్తి వివరణ ఇచ్చారు. శైలేశ్ తన ట్వీట్లో రాస్తూ.. 'హాహ్హా.. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఏ విషయమైనా చెప్పడానికి నేను ఇష్టపడతా. మామూలుగా నోట్లో తుపాకీ పెట్టి కాలిస్తే బుల్లెట్ తల వెనుక వైపు నుంచి బయటకు వస్తుంది. కానీ ఒక వ్యక్తిని ఒక కచ్చితమైన దిశలో కూర్చోబెట్టి.. గన్ బ్యారెల్‌ను వీలైనంతగా అతడి నోటి లోపలికి పెట్టి.. సుమారు 80 డిగ్రీల కోణంలో కాలిస్తే.. అతని అవయవాలను చీల్చుకుంటూ బుల్లెట్ బయటకు వస్తుంది.' అని రాసుకొచ్చారు. అంతే కాకుండా.. 'మీరు ఆ బొమ్మలో చూపించినట్లు బుల్లెట్ శ్వాస కోశం, అన్నవాహిక, కాలేయం, పాంక్రియాస్, కొన్నిసార్లు గుండెను గాయం చేస్తుంది. ఆ తర్వాత పెద్ద, చిన్న ప్రేగులను చీల్చుకుంటూ మలద్వారం నుంచి బయటకు వస్తుంది. ఇలా షూట్ చేయడానికి చాలా నేర్పు కావాలి. సైకో స్పెషల్ స్కిల్ ఇది. థియేటర్లో ప్రేక్షకులను అలరించేందుకు మాత్రమే ఈ మాస్ మూమెంట్ క్రియేట్ చేశాం. కానీ మీరు షేర్ చేసిన వీడియో చాలా ఫన్నీగా ఉంది బ్రదర్..' అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మరోవైపు డైరెక్టర్ శైలేశ్ వివరణకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Hahaha this is funny af. Since I like explaining things, let me start this, generally if you shoot someone in the mouth the bullet should exit from the back of the head, but if you make the person sit in a specific angle and shove the barrel of the gun enough into the mouth and… https://t.co/BLrZXrK7Da — Sailesh Kolanu (@KolanuSailesh) January 4, 2024 -
భళారే బార్బీ బుల్లెట్
దిల్లీ వీధుల్లో పరుగులు తీస్తున్న మినియేచర్ మోటర్ సైకిల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 4.6 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ‘మినీ బుల్లెట్ వోన్లీ ఫస్ట్ ఇన్ ఇండియా’ అనే కాప్షన్‌తో ఈ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సింగిల్ సీట్ ఉన్న ఈ బైక్‌కు టియర్ షేప్డ్ ఫ్యూయెల్ ట్యాంక్ ఆకర్షణ. తన కూతురు కోసం ఈ మోటర్‌సైకిల్‌ను రైడరే తయారు చేసి ‘పింకీ’ అని పేరు పెట్టాడు. నెటిజనులు మాత్రం దీనికి ‘బార్బీ బుల్లెట్’ అని పేరు పెట్టారు. ఇక రెండో వీడియోలో బార్బీ బుల్లెట్ రోడ్ల మీద పరుగులు తీస్తున్నప్పుడు జనాల రియాక్షన్ కళ్లకు కడుతుంది. -
బుల్లెట్ నడిపిన సీఎం ఖట్టర్
చంఢీగర్: ఎలాంటి భద్రత లేకుండా బైక్ రైడ్ చేశారు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై సీఎం ముందు వెళుతుండగా.. భద్రతా సిబ్బంది, అధికారులు ఆయనను అనుసరించారు. కర్నాల్ ఎయిర్‌పోర్టు వరకు బైక్ ప్రయాణం చేశారు. హరియాణాలో 'కార్ ఫ్రీ డే' సందర్భంగా సీఎం బైక్ ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్‌ను తగ్గించే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. వారంలో ఓ రోజు కార్లను ఉపయోగించకుండా ప్రజలను ప్రోత్సహించే సంకల్పంతో బైక్ రైడ్ నిర్వహించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్(ఎక్స్) ఖాతాలో తెలిపారు. తన సొంత నియోజకవర్గమైన కర్నాల్‌లో ఈ ర్యాలీ చేపట్టారు. "कार फ्री डे" हो या "नशामुक्त हरियाणा" बनाने का संकल्प हो बिना जनसहयोग के पूरा नहीं हो सकता! “कार फ्री डे” पर करनाल एयरपोर्ट तक की यात्रा बाइक द्वारा करके, आज के दिन कार ट्रैफिक कम करने का एक छोटा सा प्रयास मेरा भी रहा। मुझे आशा है कि प्रदेश के जागरूक लोग इस सन्देश को आगे… pic.twitter.com/a5DQeDn1ky — Manohar Lal (@mlkhattar) September 26, 2023 ఇదీ చదవండి: బీజేపీ నేతపై లుక్అవుట్ నోటీసులు -
బైక్‌కి గుడి గట్టి పూజలు - భారతదేశంలో మరెక్కడా లేదు (ఫోటోలు)
-
బైక్‌కు గుడి కట్టించి పూజలు - సినిమాను తలపించే ఇంట్రెస్టింగ్ స్టోరీ!
ఎక్కడైనా దేవునికి గుడి కట్టి పూజలు చేయడం ఆనవాయితీ.. హిందూ సంప్రదాయం ప్రకారం పంచ్ భూతాలను కూడా పూజిస్తారు. అయితే వీటన్నింటికి భిన్నంగా రాజస్థాన్‌లో ఒక 'బైకు'కి గుడి కట్టి పూజలు చేస్తున్నారు. ఇంతకీ ఆ బైకుకి ఎందుకు గుడి కట్టారు. దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, 1980 చివరలో 'ఓం సింగ్ రాథోడ్' అనే యువకుడు తనకు ఎంతగానో ఇష్టమైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిల్‌పై ప్రయాణించేటప్పుడు ఒక చెట్టుకు ఢీ కొట్టి ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన పాలీ జిల్లాలోని చోటిలా గ్రామ సమీపంలో జరిగింది. బుల్లెట్ బాబా.. ప్రమాదం జరిగిన తరువాత పోలీసులు ఆ బైకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అయితే ఆశ్చర్యకరంగా ఆ బుల్లెట్ బైక్ మరుసటి రోజు వెళ్లి ప్రమాదం జరిగిన చోటుకే చేరినట్లు తెలిసింది. ఇది ఎవరో ఆకతాయిల పని అని భావించి పోలీసులు మళ్ళీ ఆ బైకుని స్టేషన్‌కి తీసుకెళ్లారు. మళ్ళీ మునుపటి మాదిరిగానే ప్రమాదం జరిగిన చోటుకే చేరింది. ఈ సంఘటన మొదట్లో అందరిని భయానికి గురిచేసింది. ఆ తరువాత ఇందులో ఏదో దైవత్వం ఉందని గ్రహించి స్థానికులు ఓం సింగ్ రాథోడ్‌కు నివాళులర్పించాలని నిర్ణయించుకున్నారు. ఓం సింగ్ రాథోడ్ ఆత్మ బుల్లెట్ బైకు మీద తిరుగుతుందని భావించి స్థానికులు ప్రమాదం జరిగిన స్థలాన్నే స్థానికులు దేవాలయంగా మార్చారు. ఆ ప్రదేశంలో బుల్లెట్ బైకుకి పూజలు చేయడం ప్రారంభించారు. బుల్లెట్ మోటార్‌సైకిల్‌కు ఓం సింగ్ రాథోడ్ గౌరవార్థం 'బుల్లెట్ బాబా' అని పేరు పెట్టారు. ప్రతి రోజూ ఎంతో మంది భక్తులు ఈ మందిరాన్ని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు. (ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 10 వేల జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు కోట్ల సామ్రాజ్యం - ఒక టీచర్ కొడుకు సక్సెస్ స్టోరీ..) ఈ బుల్లెట్ బాబా ఆలయంలో అగరవత్తులు వెలిగించడం, మోటార్ సైకిల్ చుట్టూ ప్రదక్షిణలు చేయడం, మద్యం పోయటం వంటివి అక్కడి ఆచారం. ఈ విధంగా చేస్తే భక్తులకు ప్రయాణ సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగవని ఘాడంగా విశ్వసిస్తారు. ఈ గుడికి కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి కూడా భక్తులు, సందర్శకులు వస్తుంటారు. కొంతమంది మోటార్‌సైకిల్‌దారులు, సాహస యాత్రికులు మరియు ఆధ్యాత్మిక ఔత్సాహికులు తమ ప్రయాణ ప్రయాణంలో భాగంగా ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. (ఇదీ చదవండి: ఆ రెండు యాప్స్ ఉంటే మీ వివరాలు చైనాకే.. వెంటనే డిలీట్ చేయండి!) View this post on Instagram A post shared by Royalenfieldholic® 𝟮𝟬𝟬𝗸🎯 (@royalenfieldholic) -
బుల్లెట్ మాయం
తూర్పు గోదావరి: ఇంటి ముందు పార్కు చేసిన బుల్లెట్ చోరీకి గురైంది. స్థానిక మఠంసెంటర్లోని గంపల వారి వీధిలో నివాసం ఉంటున్న జి.సాయికృష్ణ పెద్దాపురంలో తన బావ బుల్లెట్ (ఏపీ05 ఈడీ 3534) తీసుకువచ్చి శనివారం రాత్రి ఇంటి ముందు పార్కు చేశాడు. ఊరు వెళ్లడం కోసం ఆదివారం ఉదయం చూడగా కనిపించలేదు. వెంటనే ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా, ఆదివారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ముసుగు వేసుకున్న ఇద్దరు దొంగలు బుల్లెట్‌ను చోరీ చేసినట్టు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ కె.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
లైవ్ షోలో సింగర్‌కు బుల్లెట్ గాయం.. ఆస్పత్రికి తరలింపు!
ప్రముఖ భోజ్‌పురి సింగర్ నిషా ఉపాధ్యాయకు బుల్లెట్ తగిలింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బీహార్‌లోని పాట్నాలో ఓ లైవ్ షోలో బుల్లెట్ తగిలినట్లు తెలుస్తోంది. అయితే వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. బీహార్‌లోని సరన్‌లో ఓ కల్చరల్ ప్రోగ్రామ్‌లో ప్రదర్శన ఇచ్చేందుకు నిషా రాగా.. యజ్ఞం జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. (ఇది చదవండి: అమ్మాయిలపై అత్యాచారం.. నటుడికి 30 ఏళ్ల జైలు శిక్ష) కాగా.. నిషా ఉపాధ్యాయ్ బీహార్‌కి చెందిన సింగర్. ఆమెది సరన్ జిల్లాలోని గౌర్ బసంత్ స్వస్థలం కాగా.. పాట్నాలోనే ఉంటున్నారు. నిషా ఎక్కువగా సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. ఆమె పాటల్లో లే లే ఆయే కోకా కోలా, నవకర్ మంత్ర, ధోలిదా ధోల్ రే వగడ్, హసి హసి జాన్ మారెలా లాంటి హిట్ సాంగ్స్ ఉన్నాయి. (ఇది చదవండి: రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే!) స్పందించిన పోలీసులు.. నిషా ఉపాధ్యాయ్‌పై బుల్లెట్ తగలడంపై పోలీసులు స్పందించారు. ఈ సంఘటన గురించి మాకు సమాచారం అందింది.. కానీ ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కాల్పులు ఎవరు జరిపారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నాం అని తెలిపారు. -
బీటెక్ అమ్మాయి.. బుల్లెట్‌పై హైజీనిక్ పానీపూరి
ఈ మధ్య చదువులకు, చేసే పనికి సంబంధం ఉండటం లేదు. డిగ్రీలున్నా ఉద్యోగ అవకాశాలు లేక కొందరు చిరు వ్యాపారాలతో స్వయం ఉపాధి చూసుకుంటుంటే మరికొందరు మాత్రం డిగ్రీ చేసినా ప్రత్యేకమైన లక్ష్యంతో చిరువ్యాపారాల బాట పడుతున్నారు. 21 ఏళ్ల తాప్సీ ఉపాధ్యాయ్.. బీటెక్ పానీపూరి వాలీగా ప్రసిద్ధి చెందారు. బుల్లెట్ బండికి ఏర్పాటు చేసుకున్న చిన్న బండిపై ఆమె పానీపూరీలను విక్రయిస్తున్నారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఆమె ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతోనే తాను ఈ వ్యాపారాన్ని ప్రారంభినట్లు తాప్సీ చెబుతున్నారు. (జీవితాంతం ఒంటరిగానే ఉంటా కానీ! హోలీ యాడ్‌పై దుమారం: అసలేమైంది?) ఇదీ చదవండి: టాప్ సీక్రెట్ చెప్పిన గూగుల్ మాజీ వైస్ ప్రెసిడెంట్... ఇది ఉంటే జాబ్ పక్కా! View this post on Instagram A post shared by Are you hungry (@are_you_hungry007) తాజాగా ఆమె బుల్లెట్ వాహనానికి పానీపూరి బండిని కట్టుకుని తీసుకెళ్తున్న వీడియోను ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. అంత చదువు చదువుకుని ఇలా పానీపూరీ అమ్ముకుంటున్నావేంటి అని చాలా మంది ప్రశ్నించారని, కొందరైతే భద్రంగా ఉండాలంటే ఇంటికి తిరిగి వెళ్లాలని సలహా ఇచ్చారని తాప్సీ చెప్పారు. ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి దాదాపు మూడు లక్షల లైక్‌లు వచ్చాయి. ఆ యువతి స్ఫూర్తిని అభినందిస్తూ పలువురు కామెంట్లు పెట్టారు. -
చూపులో సైకిల్.. రేటులో బుల్లెట్
సాక్షి, ఫిఠాపురం: చూడటానికి అది సైకిలే కానీ రేటులో మాత్రం బుల్లెట్‌తో పోటీ పడుతోంది. సామాన్యుడి వాహనం సైకిల్ అసామాన్యంగా మారిపోయింది. కాకినాడకు చెందిన ఓ ఫర్నిచర్ వ్యాపారి తన కుమారుడు చైతన్య కోసం ఏకంగా విదేశాల నుంచి సైకిల్ కొనుగోలు చేశారు. ఇటలీకి చెందిన ఈ సైకిల్ రేటు అక్షరాలా రూ.1.40 లక్షలు. మోటారు సైకిల్ మాదిరిగా రిజిస్ట్రేషన్ నంబరుతో పాటు లైసెన్సు కలిపి అంత ధర అయ్యిందని చెబుతున్నారు. చూడటానికి మామూలు సైకిల్లానే ఉన్నా నిర్మాణంలో కొత్తదనం కనిపిస్తోంది. బుల్లెట్ బండి రేటుతో పోటీ పడుతున్న ఈ సైకిల్ ప్రస్తుతం పిఠాపురం రోడ్డులో ఆకర్షణగా నిలుస్తోంది. (చదవండి: రిపోర్ట్‌లో అసలు గుట్టు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని..) -
బుల్లెట్: రూ. 1.5 లక్ష నుంచి రూ. 3.5 లక్షల వరకు.. నాడు మిలిట్రీ బైక్, కానీ.. నే
వైరారూరల్ (ఖమ్మం): బుల్లెట్.. దానిపై వెళ్తుంటే ఉండే ఆ రాజసం.. దాని నుంచి వచ్చే ఫైరింగ్.. జనాలు చూసే తీరూ ప్రతీది ప్రత్యేకమే.. బుల్లెట్ అంటేనే ఒకప్పుడు ఉన్నత వర్గాల వాహనంగా చలామణి అయ్యింది. కానీ ఇప్పుడు మధ్య తరగతి ప్రజలు కూడా బుల్లెట్‌పై రయ్.. రయ్.. మంటూ దూసుకుపోతున్నారు. ఇది వరకు గ్రామాల్లో అయితే పలుకుబడి ఉన్నవారు, రాజకీయంగా మంచి పట్టున్నవారు వీటిని ఎక్కువగా వాడేవారు. ఇక పట్టణ ప్రాంతాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. మార్కెట్లోకి ఇలా.. ఈ బుల్లెట్ ద్విచక్ర వాహనాన్ని 1955లో ఇండియాన్ ఆర్మీ బోర్డర్ సెక్యూరిటీ కోసం ఇంగ్లాండ్ నుంచి తెప్పించారు. అనంతరం 1960 నుంచి స్పేర్ పార్ట్స్‌ను ఇంగ్లాండ్ నుంచి తెప్పించి ఇండియాలోనే బుల్లెట్ ద్విచక్రవాహనాన్ని ఫిటింగ్ చేసే వారు. ఇవన్నీ గతంలో పెట్రోల్‌తో నడిచేవి. దాని తర్వాత కొన్నేళ్ల పాటు కొంత మంది మెకానిక్‌లు పెట్రోల్ ఇంజన్ తొలగించి డీజిల్ ఇంజన్‌తో రీమోడలింగ్ చేసి మార్కెట్లో విక్రయించేవారు. ఆ సమయంలో డీజిల్ బుల్లెట్లకు భారీ డిమాండ్ ఉండేది. అనంతరం 1994–2000 వరకు బుల్లెట్ కంపెనీ వారే డీజిల్ బుల్లెట్‌ను విడుదల చేశారు. కాలక్రమేణా పొల్యూషన్ కారణంగా 2000 సంవత్సరంలో డీజిల్ బుల్లెట్ వాహనాలు పూర్తిస్థాయిలో బ్యాన్ అయ్యాయి. దాని తర్వాత పలు రకాల బుల్లెట్ ద్విక్రవాహనాలు కొత్త వర్షన్ మోడల్స్‌తో మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఇప్పటి వరకు రాయల్ ఎన్ఫీల్డ్లో కాస్ట్‌ఐరన్ స్టాండర్డ్, ఎలక్ట్రా, క్లాసిక్, థండర్బాడ్, ఇంటర్‌స్పెక్టర్, కాంటినంటల్ జీటీ, హిమాలయం, హంటర్ వంటి మోడల్స్ వాహనాలు మార్కెట్లోకి విడుదలై యువతతో పాటు మధ్య వయస్సు గల వ్యక్తులను సైతం ఆకర్షిస్తున్నాయి. (చదవండి: సర్వేలో బయటపడ్డ షాకింగ్ విషయాలు.. తెలంగాణలో మరీ ఇంత ఘోరమా?) బుల్లెట్ వాహనాన్ని కొనుగోలు చేస్తున్న యువకులు సీసీలపై యువత మోజు.. ప్రస్తుతం మార్కెట్లో 100 నుంచి 180 సీసీ గల ద్విచక్రవాహనాలే అధిక శాతం ఉన్నాయి. ఇటువంటి ద్విచక్రవాహనాలపై మక్కువ లేని యువత బుల్లెట్ ద్విచక్ర వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. బుల్లెట్ వాహనం ఒక్కొక్క మోడల్ ఒక్కో విధంగా సీసీ కలిగి ఉంటుంది. బుల్లెట్ వాహనాలలో 350, 411, 500, 650 సీసీ సామర్థ్యంతో కూడినవి దొరుకుతున్న నేపథ్యంలో.. వీటిని కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. అంతేకాకుండా బుల్లెట్ వాహనానికి అనుగుణంగా ఉండేందుకు షోరూంతో వచ్చిన సైలెన్సర్‌ను తొలగించి బుల్లెట్‌పై ఉన్న మోజుతో అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్ అమర్చుకోని ప్రయాణిస్తూ బుల్లెట్ బైక్‌లను ఆస్వాదిస్తున్నారు. ధర లెక్కచేయకుండా.. బుల్లెట్ ధరతో కారు కొనుగోలు చేయవచ్చు. కానీ యువతతో పాటు మధ్య వయస్సు గల వ్యక్తులు సైతం కారుపై ఆసక్తి కనబర్చకుండా బుల్లెట్ వాహనాలపై మక్కువ చూపుతున్నారు. బుల్లెట్ బండ్ల ధరలు మోడల్‌ను బట్టి వాటి ధర ఉంటుంది. రూ. 1.50 లక్ష నుంచి రూ. 3.50 లక్షల వరకు బుల్లెట్ బైకుల ధరలు ఉన్నాయి. ఇంతటి ధరను కూడా లెక్క చేయకుండా యువత ఈ బుల్లెట్ కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారంటే.. వీటి క్రేజ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితులోనే బుల్లెట్ ధర రూ. 3.50 లక్షలు వరకు ఉన్న నేపథ్యంలో.. భవిష్యత్తులో వీటి ధర కొంత శాతం మేర పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ బుల్లెట్ కొనుగోలుపై యువత వెనుకడుగు వేయకపోవడం కొసమెరుపు. బుల్లెట్ రైడ్.. బుల్లెట్ ద్విచక్రవాహనాలు గంటకు 80 నుంచి 100 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. దీంతో దూర ప్రాంతాల్లో ఉన్న విహారయాత్రలకు ఈ బుల్లెట్ వాహనాలపై ప్రయాణాలు చేయడం పరిపాటిగా మార్చుకున్నారు. రవాణా సౌకర్యార్థం బుల్లెట్ బండ్లు అనుకూలంగా ఉండడం వలన అధికశాతం మంది బుల్లెట్‌ను కొనుగోలు చేసుకుంటూ.. వీటిపై తమకు ఉన్న మక్కువను చూపుతున్నారు. (చదవండి: వరంగల్‌లో విషాదం.. బాలుడిని చంపేసిన ‘చాక్లెట్’) -
నేలపై నుంచి కాల్పులు.. విమానంలోకి దూసుకెళ్లిన బుల్లెట్
మయన్మార్‌లో షాకింగ్ ఘటన జరిగింది. నేషనల్ ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి బుల్లెట్ తగిలింది. దీంతో అతనికి తీవ్ర గాయమైంది. నేలపై నుంచి ఎవరో కాల్పులు జరపడంతో విమానం పైకప్పుకు రంద్రంపడి బుల్లెట్ లోనికి దూసుకెళ్లింది. అనంతరం లోయికావ్ నగరంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికుడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బ్రిటీష్ వార్త సంస్థ వివరాల ప్రకారం విమానం 3,500 అడుగుల ఎత్తులో, విమానాశ్రయానికి నాలుగు మైళ్ల దూరంలో ప్రయాణిస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే లోయికావ్ విమానాశ్రయానికి రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే విమానంపై కాల్పులు జరిపింది కచ్చితంగా రెబల్ గ్రూప్‌కు చెందిన వారే అని మయన్మార్ సైన్యం తెలిపింది. కరెన్ని నేషనల్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన ఉగ్రవాదులే ఈ చర్యకు పాల్పడినట్లు వెల్లడించింది. రెబల్స్ గ్రూప్స్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించాయి. మయన్మార్‌లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని సాయుధ దళాలు, సంప్రదాయ తెగలు పోరాటం చేస్తున్నాయి. పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ అనుబంధ సంస్థలే విమానంపై కాల్పులు జరిపాయని మయన్మార్ మిలిటరీ కౌన్సిల్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ జామ్ మిన్ టున్ తెలిపారు. మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధ్యక్షురాలు ఆంగ్ సాన్ సూకీని జైలుకు తరలించిన నాటి నుంచి ఆ దేశంలో అనేక చోట్ల సాయుధ దాళాలు పోరాటం చేస్తున్నాయి. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు విమానంపై కాల్పులు జరిగిన కాయా రాష్ట్రంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. చదవండి: ఉక్రెయిన్ వ్యూహంతో రష్యా ఉక్కిరిబిక్కిరి.. ఆ నగరం వదిలి పరార్! -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం.. తూటా రూట్ మారెన్
సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం చోటు చేసుకున్న రోజు జరిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) బలగాల కాల్పులపై స్పష్టత వచ్చింది. ఇవి నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. సాంకేతిక అంశాలు పరిశీలించిన నేపథ్యంలో బలగాలు గాల్లోకి కాల్పులు జరిపినప్పటికీ రికోచెట్ కారణంగానే పిల్లెట్లుగా మారిన బుల్లెట్లు ఆందోళన కారులపైకి దూసుకువెళ్లినట్లు తేల్చారు. ఈ మేరకు సమగ్ర నివేదికను రూపొందించారు. ఆందోళనకారులను చెదరగొట్టాలనే.. విధ్వంసానికి దిగిన ఆందోళనకారులతో ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకూడదనే ఉద్దేశంతోనే ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు వారిని చెదరగొట్టాలని భావించారు. దీనికోసం గాల్లోకి కాల్పులు జరపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. రైల్వే స్టేషన్లో ఇంజిన్లకు విద్యుత్ సరఫరా చేసే 220 కేవీ విద్యుత్ తీగలు ప్రతి ప్లాట్‌ఫాంపైనా ఉంటాయి. అలాంటప్పుడు తుపాకులు పైకెత్తి, నేరుగా గాల్లోకి కాల్పులు జరిపితే బుల్లెట్లు తగిలి విద్యుత్ తీగలు తెగే ప్రమాదం ఉంది. అదే జరిగి ఆ తీగలు కింద ఉన్న ఆందోళనకారులు, అధికారులుపై పడితే ప్రాణనష్టం భారీగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఆర్పీఎఫ్ బలగాలు నేరుగా పైకెత్తి కాకుండా తుపాకులను కాస్త వాలుగా ఉంచి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల కోసం ఆర్పీఎఫ్ బలగాలు వినియోగించిన తుపాకులు ఇన్సాస్ రైఫిళ్లు. వీటిలో 5.56 క్యాలిబర్ తూటాలను వాడతారు. ఇది కనిష్టంగా 400 మీటర్ల దూరం దూసుకుపోతుంది. దీన్నే ఆ తుపాకీ రేంజ్‌గా పిలుస్తారు. లెడ్తో తయారైన ఈ తూటాకు కాపర్ జాకెట్ (పై పొర) ఉంది. మ్యాగ్జైన్లో ఉండే తూటా తుపాకీ కాగ్ అయినప్పుడు ఛాంబర్లోకి చేరుతుంది. అక్కడ ఫైర్ అయ్యాక బ్యారెల్‌గా పిలిచే ముందు భాగం నుంచి అతి వేగంగా దూసుకువస్తుంది. ఈ బ్యారెల్ లోపలి భాగం రింగులతో కూడి ఉండటంతో బుల్లెట్ తన చుట్టూ తాను తిరుగుతూ.. వేగాన్ని పెంచుకుంటూ బయటకు వస్తుంది. ఇలా వచ్చిన తూటా ఎదురుగా గోడ ఉంటే తగిలి కిందపడుతుంది. సాంకేతిక పరిభాషలో ‘రికోచెట్’.. అదే చెక్క, ఫ్లైవుడ్ వంటి ఉంటే వాటిలోకి దూసుకుపోతుంది. గాజు, అద్దాలు ఉంటే వాటినీ ఛిద్రం చేస్తూ తన ‘దారి’లో ముందుకు వెళ్లిపోతుంది. గన్‌పౌడర్, బ్యారెల్‌లోని రింగుల ద్వారా వచ్చిన వేగం తగ్గే వరకు ఇలా వెళ్తూనే ఉంటుంది. రైల్వేస్టేషన్లో ఇనుప స్తంభాలు, ఉక్కుతో తయారైన రైలు ఇంజిన్లు, పెట్టెలు ఉంటాయి. అత్యంత వేగంగా ప్రయాణిస్తూ వెళ్తే తూటా ఇలాంటి లోహాలతో చేసిన వస్తువులు, ప్రత్యేకంగా పటిష్టంగా నిర్మించిన గోడలకు తాకితే పరిస్థితి మారుతుంది. ఆ ధాటికి తన తన దిశను మార్చుకుంటుంది. దీన్నే సాంకేతిక పరిభాషలో రికోచెట్ అంటారు. వేగంగా ప్రయాణిస్తున్న మార్గంలో అడ్డు తగిలిన గట్టి వస్తువు కారణంగా దాని దిశను మార్చుకుని, ఒక్కోసారి ఫైర్ చేసిన దిశలోకి మారి దూసుకు వచ్చేస్తుంది. ముక్కలై.. పిల్లెట్లుగా.. వాటిని తాకిన ప్రభావంతో కొన్నిసార్లు లెడ్ బుల్లెట్ ముక్కలై పిల్లెట్లుగానూ మారిపోతుంది. ఇవి దాదాపు తూటా అంత వేగంగానూ దూసుకుపోతాయి. వీటి కారణంగానే రైల్వేస్టేషన్లో అనేక మంది ఆందోళనకారులు గాయపడ్డారు. పరిమాణంలో పెద్దగా ఉన్న పిల్లెట్ దూసుకువచ్చి శరీరంలోకి వెళ్లి ఊపిరితిత్తుల్ని ఛిద్రం చేయడంతోనే రాకేశ్ కన్నుమూశాడని అధికారులు తేల్చారు. గదులు వంటి క్లోజ్డ్ ఏరియాల్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు రికోచెట్ నష్టం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. రికోచెట్ అయిన తూటా ఏ దిశలో వెళ్తుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. తూటా పేలేది ఇలా... ఇన్సాస్ రైఫిల్ కింది భాగంలో ఉండే మ్యాగ్జైన్లో తూటాలు ఉంటాయి. సేఫ్టీ లివర్ రిలీజ్ కావడంతో మ్యాగ్జైన్లో ఉండే తూటా ఛాంబర్లోకి వెళిపోతుంది. ఇన్సాస్ మ్యాగ్జైన్ కెపాసిటీ 20 రౌండ్లు (తూటాలు) కాగా.. స్ప్రింగ్ మూమెంట్ కోసం 18 లేదా 19 మాత్రమే పెడుతుంటారు. చూపుడు వేలితో ట్రిగ్గర్ను నొక్కితే తుపాకీ వెనుక ఉండే హ్యామర్... ఫైరింగ్ పిన్ను ప్రేరేపిస్తుంది. దీంతో తూటా పేలి ముందు ఉండే బ్యారెల్ నుంచి దూసుకుపోతుంది. ఈ బుల్లెట్ బలమైన లోహం, వస్తువులను తాకినప్పుడు పిల్లెట్లుగా మారడం, రికోచెట్ కావడం జరుగుతుంది. (చదవండి: ‘సికింద్రాబాద్ విధ్వంసం’ కేసులో నిందితులకు రిమాండ్) -
రామ్ పోతినేని 'బుల్లెట్టు' సాంగ్ రికార్డు.. ఏంటో తెలుసా ?
Ram Pothineni The Warrior Movie Bullet Song Gets 100 Million Views: రామ్ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి 'కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెటు..' సాంగ్ రిలీజై తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ కొత్త రికార్డ్‌ను నమోదు చేసింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ పాట మొత్తంగా 100 మిలియన్ క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం తెలిపింది. ఈ సాంగ్‌ను కోలీవుడ్ స్టార్ హీరో శింబు, హరిప్రియ ఆలపించారు. తెలుగులో శ్రీమణి, తమిళంలో వివేక సాహిత్యమందించిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాగా ఈ సినిమాలో ఈ ఒక్క పాట కోసం రూ. 3 కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. చదవండి: 13 ఏళ్ల పిల్లల నుంచి అత్యాచార బెదిరింపులు, తట్టుకోలేకపోయాను: నటి ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి #BulletSong Spark Causing the Wildfire on YouTube 💥 Continues to make whole India groove with 100 Million+ Views 🕺💃 Telugu: https://t.co/XiPpHzsESj Tamil: https://t.co/amuQsznXC2@ramsayz @SilambarasanTR_ @AadhiOfficial @dirlingusamy @ThisisDSP @IamKrithiShetty @SS_Screens pic.twitter.com/HU9lVFA1Z1 — Srinivasaa Silver Screen (@SS_Screens) June 15, 2022 -
Russia War: ఉక్రెయిన్ సైనికుడిని కాపాడిన ఫోన్.. ఎలాగో తెలుసా..?
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రష్యా సేనల బాంబు దాడుల్లో ఉక్రెయిన్‌లో భారీగా ప్రాణ నష్టం చోటుచేసుకుంది. అటు ఉక్రెయిన్ సైన్యంతో పాటుగా రష్యా సైనికులు కూడా వేల సంఖ్యలో మృతి చెందారు. ఇదిలా ఉండగా.. యుద్ధం ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తోంది. ఇక, యుద్ధంలో ఓ ఉక్రెయిన్ సైనికుడి వైపు బుల్లెట్ దూసుకొచ్చింది. ఆ బుల్లెట్ నుంచి ఓ స్మార్ట్ ఫోన్ ఉక్రెయిన్ వీరుడి ప్రాణాలను కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో గడ్డకట్టే చలిలో ఇద్దరు ఉక్రెయిన్ సైనికులు మాట్లాడుకుంటున్నారు. ఓ సైనికుడు.. తన షర్ట్ పాకెట్లో స్మార్ట్ మొబైల్ ఉంచుకొని... యుద్ధం చేస్తున్నాడు. ఇంతలో ఎటు నుంచి వచ్చిందో తెలియదు. ఓ బుల్లెట్ తన వైపు దూసుకొచ్చింది. అతనికి తెలియకుండానే అది అతని మొబైల్‌కి గుచ్చుకొని అక్కడ ఆగిపోయింది. బుల్లెట్ కరెక్ట్‌గా ఫోన్లో ఇరుక్కుపోయింది. ఒకవేళ ఆ ఫోన్ కనుక అక్కడ పాకెట్లో లేకపోతే సదరు సైనికుడు బుల్లెట్ తగిని చనిపోయే పరిస్థితి ఎదురయ్యేది. అలా ఆ మొబైల్ ఫోన్ సైనికుడి ప్రాణాలను కాపాడింది. -
పూజ చేస్తుండగా పేలిపోయిన బుల్లెట్
అనంతపురం: వేసవి తాపం మనుషులకే కాదు.. బైక్‌లకు శాపంలా మారింది. ఇటీవల కాలంలో రోజూ ఏదో మూలన బైక్‌లు, స్కూటర్లు ‘వేడి’కి ఆహుతి అవుతున్న సందర్భాల్లో తరచు చూస్తున్నాం. తాజాగా బుల్లెట్ బండి ఉన్నపళంగా పేలిపోయిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది గుంతకల్లు మండలం కసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఓ బుల్లెట్ పేలిపోయింది. నూతనంగా కొనుగోలు చేసిన బుల్లెట్‌కు పూజ చేస్తుండగా బైక్ పేలిపోయింది. దాంతో స్థానికంగా ఆందోళన చోటు చేసుకుంది. కాగా, ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బైక్ మాత్రం దాదాపు దగ్ధమైంది. -
వాహనాల ధ్వని కాలుష్యంపై ట్రాఫిక్ పోలీసుల నజర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో వాహనాల కారణంగా నానాటికీ పెరిగిపోతున్న ధ్వని కాలుష్యం తగ్గింపుపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. దీని నిరోధానికి చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వీటిని అమలు చేసేందుకు అవసరమైన విధి విధానాలను ఖరారు చేసేందుకు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లతో పాటు సిటీ ట్రాఫిక్ అదనపు సీపీ సభ్యులుగా ఉన్నారు. మార్గదర్శకాలు రూపొందించడంపై ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ దృష్టి పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న, భయంకరమైన శబ్ధాలు చేసే సైలెన్సర్లు, హారన్లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన విధి విధానాల కోసం కసరత్తు చేస్తున్న సిటీ ట్రాఫిక్ పోలీసులు సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. ఏవీ రంగనాథ్ నేతృత్వంలో ట్రాఫిక్ కమిషనరేట్‌లో జరిగిన సమావేశంలో ఆర్టీఏ, కాలుష్య నియంత్రణ మండలితో పాటు వివిధ విభాగాల అధికారులు, వ్యాపారులు పాల్గొన్నారు. రాజధానిలో సంచరిస్తున్న వాహనాల హారన్లతో పాటు సైలెన్సర్ల మార్పు చేర్పుల ద్వారా తీవ్రమైన ధ్వని కాలుష్యం ఏర్పడుతోందని పోలీసులు గుర్తించారు. మోటారు వాహనాల చట్టం నిబంధనల ప్రకారం ఓ వాహనం హారన్ గరిష్టంగా 93 నుంచి 100 డెసిబుల్స్ మధ్య మాత్రమే శబ్ధం చేయాలి. అలాగే ఆయా వాహనాల ఇంజిన్లు, సైలెన్సర్లు సైతం ఎంత శబ్ధం చేయవచ్చనేది స్పష్టంగా నిర్ధేశించి ఉంది. (క్లిక్: కేబీఆర్ పార్కు: చీకటి పడితే భద్రత దైవాధీనం) అయితే ఈ నిబంధనల్ని తుంగలో తొక్కుతున్న వాహనచోదకులు పరిమితికి మించి శబ్దాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కేవలం ప్రైవేట్ వాహనాలు, ట్రావెల్స్ బస్సులు, బుల్లెట్ వంటి వాహనాలు మాత్రమే కాదు.. చివరకు ఆర్టీసీ బస్సులు, కాలేజీలు, స్కూళ్ళకు విద్యార్థుల్ని తరలించే వాహనాలు సైతం కర్ణకఠోరమైన శబ్ధాన్ని విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. ఫ్యాన్సీ హారన్లు, ఎయిర్ హారన్స్, మల్టీ టోన్ హారన్స్, మోడిఫైడ్ సైలెన్సర్ల కారణంగా, అనవసరంగానూ మోగిస్తున్న హారన్ల వల్లే ఇలా జరుగుతోందని అధికారులు గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం రంగనాథ్ నేతృత్వంలో రోడ్లపైకి వచ్చిన అధికారులు వివిధ వాహనాలతో పాటు ప్రధానంగా బస్సులపై దృష్టి పెట్టారు. సౌండ్ లెవల్ మీటర్ల సాయంతో ఏఏ వాహనాలు, ఏ స్థాయిలో ధ్వనికి కారణమవుతున్నాయో గుర్తిస్తున్నారు. (క్లిక్: సీఎం కేసీఆర్ నిర్ణయంపై పర్యావరణ వేత్తల ఆందోళన.. అసలేంటి జీవో 111?) సమగ్ర నివేదికలు సమర్పిస్తాం: హాకింగ్ ఫ్రీ సిటీ అమలే మా లక్ష్యం. ప్రస్తుతం నగరంలో సంచరిస్తున్న వాహనాలకు కంపెనీలు అందిస్తున్న హారన్లు, సైలెన్సర్ల వద్ద వెలువడుతున్న శబ్ధంతో పాటు పాటు మార్పుచేర్పుల ద్వారా వస్తున్నదీ అధ్యయనం చేస్తున్నాం. కార్ డెకార్స్ సంస్థల యజమానులు, మార్పులు చేసే మెకానిక్స్, వివిధ కార్లు, బైకులు విక్రయించే డిస్ట్రిబ్యూటర్లు, ట్రావెల్ ఏజెన్సీలతో సోమవారం సమావేశమయ్యాం. జాతీయ రహదారులపై ఎయిర్ హారన్లు తప్పనిసరని కొందరు చెబుతున్నారు. వారు సిటీలోనూ వినియోగిస్తున్నారు. ఈ ధ్వని కాలుష్య అంశాన్ని వివిధ కోణాల్లో పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందించి కమిటీకి సమర్పిస్తాం. దాని నిర్ణయం మేరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఖరారు చేస్తాం. ప్రస్తుతం సిటీ ట్రాఫిక్ పోలీసుల వద్ద ఐదు సౌండ్ లెవల్ మీటర్లు ఉన్నాయి. త్వరలో మరిన్ని ఖరీదు చేయనున్నాం. – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ చీఫ్ -
మానవ గమనంలో ఒక మజిలీ
తుపాకి గుండు చేసిన కన్నాల ఆధారంగా నేరం ఎలా జరిగిందో ఊహించి, అన్వేషించి నిర్ధారణ చేయడం వంటిది – సైంటిఫిక్ మెథడ్! తొలిసారి సైన్స్ మెథడ్‌ను ప్రతిపాదించింది ఫ్రాన్సిస్ బేకన్! వైజ్ఞానిక పరిశోధనకు, అప రాధ పరిశోధనకూ సామ్యముంది. శాస్త్రవేత్త ఇన్వెస్టిగేటివ్ ఇన్స్పెక్టర్ లాంటి వాడే కానీ, అపరాధ పరిశోధక కథారచయిత వంటివాడు కాదు. కథా రచయిత ముందుగానే తన కథా పరిణామాన్ని మనస్సులో ఉంచుకుని, తదనుకూలంగా ఆధారాలనూ, సన్నివేశాలనూ సృష్టించుకుంటాడు. విజ్ఞాన శాస్త్ర ప్రపంచంలో ‘ఫ్రాన్సిస్ బేకన్’ పూర్వపు విజ్ఞానవేత్తలందరూ ఈ తరగతికి చెందినవారు. ఒక భావాన్ని ముందుగానే సిద్ధాంతీకరించుకుని తన దృక్పథంలోకి వచ్చిన అంశాలను తదనుగుణంగా సమర్థించుకోవడం వారి పద్ధతి. ఆ విధంగా పొందు కుదరనివి అసహజమనీ, అసంబద్ధాలనీ తోసిపుచ్చడం వారి ఆచారం– ఇదీ 1955లో ‘సైన్స్ ఇన్ అవర్ లైవ్స్’ అనే పుస్తకంలో సైన్స్ రచయిత రిచ్చీ కాల్డర్ అభిప్రాయం! కనుకనే మానవ గమనంలోనే ఫ్రాన్సిస్ సైన్స్ పద్ధతి ఒక మజిలీగా మలుపు తిప్పింది. ప్రకృతిని, ప్రపంచాన్ని పరిశీలించే దృష్టి మారిపోయింది ఆయన కారణంగానే. ఆధునిక విజ్ఞాన పద్ధతికి ఆద్యుడుగా ఫ్రాన్సిస్‌ను పరిగణి స్తారు. బేకన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. లాయర్ చదువు తర్వాత రాజకీయాలలో రాటుదేలి జీవిత చరమాంకంలో ‘నేచురల్ ఫిలాసఫీ’ మీద దృష్టి పెట్టి చిరస్మరణీయమైన కృషి చేశారు. (చదవండి: అణచివేతను ధిక్కరించిన అరుణపతాక) 1561 జనవరి 22న లండన్‌లో జన్మించిన ఫ్రాన్సిస్ బేకన్ మతం, న్యాయం, రాజకీయాలలోనే కాకుండా సైన్స్ విషయాలలో కూడా నిష్ణాతులు. తండ్రి పొందిన ఛాన్స్లర్ పదవి సాధించినవాడు ఫ్రాన్సిస్. ఆయన తల్లి గ్రీకు, లాటిన్, ఇటలీ, ఫ్రెంచి భాషలలో నిష్ణాతులు. 1581లో హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడై, తర్వాత హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో కూడా సభ్యుడై మొత్తంమీద 37 ఏళ్లు పార్లమెంటు మెంబ ర్గా కొనసాగారు. రాజకీయంగా ఎత్తు పల్లాలు బాగా ఎరి గిన ఫ్రాన్సిస్ బేకన్ ఆర్థికంగా కూడా సమస్యలు ఎదు ర్కొన్నారు. అటార్నీ జనరల్ (1613–17)గా, లార్డ్ ఛాన్సలర్ (1617–21)గానూ ఆయన వ్యవహరించారు. ఆలోచనా ధోరణిలో, పరిశీలనా పద్ధతిలో అంతకు ముందున్న ప్లేటో, అరిస్టాటిల్ వంటి వారిని బేకన్ విభేదించి తన మార్గంలో ముందుకు పోయారు. చాలా రకాలుగా కృషి చేసిన ఫ్రాన్సిస్ బేకన్ ప్రతిపాదించిన ‘కో ఆపరేటివ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూషన్’ భావన తర్వాత కాలంలో రాయల్ సంస్థ ఏర్పడటానికి దోహదపడింది. చివరి దశలో ప్రయోగాలు చేస్తూ న్యూమోనియా సోకి 1626 ఏప్రిల్ 9న కన్ను మూశాడు. వారు ప్రతిపాదించిన సైన్స్ పద్ధతి తర్వాతి కాలంలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. (చదవండి: సైన్సును మతం నుంచి వేరుచేసిన శాస్త్రవేత్త) - డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి పూర్వ సంచాలకులు -
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్న మరో సినిమా
దేవరాజ్, సోనాక్షీ వర్మ జంటగా మదుగోపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బుల్లెట్ సత్యం’. లక్ష్మీ నారాయణ సమర్పణలో సాయితేజ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దేవరాజ్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. నటుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ–‘‘దేవరాజ్‌కు ఇది మొదటి సినిమా అయినా హీరోగా, నిర్మాతగా చక్కగా చేశాడు. గ్రామీణ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో రాజకీయ నేపథ్యం ఉన్న పాత్ర చేశాను’’ అన్నారు. ‘‘మా సినిమా రియలిస్టిక్‌గా ఉంటుంది. యాజమాన్య మంచి సంగీతం అందించారు’’ అన్నారు హీరో, నిర్మాత దేవరాజ్. ‘‘ఒక ఎంపీటీసీ స్థానం కోసం ఎలా పరితపిస్తారు? ఆ పదవి కోసం హీరో జీవితంలో ఏం కోల్పోయాడు? ఎవరితో తలపడాల్సి వచ్చింది అనేదే చిత్రకథ’’ అన్నారు మధు గోపు. -
బుల్లెటు బండెక్కి డుగ్గుడుగ్గుమని వచ్చేత్తపా... వచ్చేత్తపా
బుల్లెటు బండి ఎక్కి డుగ్గు డుగ్గుమని వచ్చేత్తపా...వచ్చేత్తపా పాట ఎంత వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ పాటలో కొన్ని చరణాలు ఇలా ఉంటాయి... నువ్వు యాడంగ వస్తావురో/ చెయ్యి నీ చేతి కిస్తారో ఈ చరణాలను కొట్టాయంకు తీసుకువెళితే అక్కడ మస్త్‌గా సూట్ అవుతాయి. అయితే అక్కడ పాడుతున్నది పెళ్లికూతురు కాదు. ఎదురు చూస్తుంది పెళ్లికొడుకు కోసం కాదు. స్వయంగా బుల్లెట్ బండే! కొట్టాయంలో ఏ బుల్లెట్ బండికి ఏ ట్రబుల్ వచ్చినా బుల్లెట్ బండిపై రయిరయ్యిమని వచ్చి ట్రబుల్ షూట్ చేసి వెళుతుంటుంది ఆమె. అందుకే ‘బుల్లెట్ దివ్య’ అని కూడా ఆమెను పిలుచుకుంటారు. ‘నా బుల్లెట్ బండి తరచుగా ట్రబులిస్తోంది. మంచి మోకానిక్ ఉంటే చెప్పు...’ కొద్దిసేపటి తరువాత: ‘ఇదిగో బాబాయ్ మంచి మెకానిక్. ఈ అమ్మాయి చేయిపడితే ఇక తిరుగే ఉండదు’ ‘ఈ పాప బుల్లెట్‌బండి ఏం బాగుచేస్తుందయ్యా...నీ పిచ్చిగానీ....పదా వేరే మెకానిక్ దగ్గరికి’ ‘బాబాయ్... నా మాట విని కొద్దిసేపు ఓపిక పట్టు’ కొద్దిసేపటి తరువాత.... ‘నిజమే సుమీ...టకీమనీ చేసి పారేసింది. ఏదో మంత్రం వేసినట్లుగానే ఉంది. పేరేంటి పాపా నీది? దివ్యా! వెరీగుడ్నేమ్’ కేరళలోని కొట్టాయంలో ఇలాంటి సంభాషణలు వినిపించడం కొత్తేమీ కాదు. కమల్‌హాసన్ పాట గుర్తుంది కదా... రాజా చేయివేస్తే అది రాంగై పోదులేరా! దివ్య జోసెఫ్ చేయి పడితే చాలు రాంగ్గా మొరాయిస్తున్న బండ్లు రైటైపోతాయి. మళ్లీ ఫామ్‌లోకి వస్తాయి. ఇంతకీ దివ్య జోసెఫ్ మెకానిక్ ఎందుకు అయింది? తన కుటుంబ భారాన్ని మోయడానికి మాత్రం కాదు. మెకానిజం అంటే ఆమెకు పాషన్! నాన్న పులిక్కపరంబిల్ జోసెఫ్ మెకానిక్. ఆయనకు కొట్టాయంలో వర్క్‌షాప్ ఉంది. బడి అయిపోగానే దివ్య వచ్చేది ఇక్కడికే. ఇది తనకు మరో బడి. అక్కడ ఉన్న బుల్లెట్ బండ్లు తన తోబుట్టువులుగానే అనిపించేవి. చూస్తూ చూస్తూనే ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ నుంచి ఆయిల్ అండ్ కేబుల్ ఛేంజెస్ వరకు ఏ టూ జెడ్ అన్నీ నేర్చేసుకుంది. యంత్రవేగంతో బుల్లెట్ బండ్లను బాగుచేస్తుంది. ఒకానొక దశలో తల్లిదండ్రులు భయపడ్డారు, మెకానిజం ధ్యాసలో పడి చదువులో వెనకబడిపోతుందేమోనని! కానీ అలా ఎప్పుడూ జరగలేదు. చదువులో దివ్య ఎక్కడా తగ్గలేదు. దీంతో వారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ప్రస్తుతం దివ్యా జోసెఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతోంది. బుల్లెట్ బండ్ల సర్వీస్ ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని సోషల్ సర్వీస్ కు కూడా వెచ్చించాలని నిర్ణయించుకుంది. శభాష్ దివ్యా! -
‘యుద్ధం శరణం గచ్చామి’ అని చాటి చెప్పేలా..
రవి వర్మ, సంజనా సింగ్, అలోక్ జైన్, మనీషా దేవ్, జీవ ముఖ్య పాత్రల్లో చౌడప్ప దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బుల్లెట్’. సోమిశెట్టి హరికృష్ణ సమర్పణలో ఎంసీ రావు, జి. గోపాల్, ఎమ్.వి మల్లికార్జునరావు, కోసూరి సుబ్రహ్మణ్యం, మణి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌లో విడుదలకానుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని నిర్మాత ఏయం రత్నం విడుదల చేశారు. చౌడప్ప మాట్లాడుతూ– ‘‘దేశానికి పట్టిన చీడ పురుగులను ఏరేసే ప్రయత్నంలో బుద్ధుడు కూడా రుద్రుడౌతాడు. ‘బుద్ధం శరణం గచ్చామి’ కాదు.. ‘యుద్ధం శరణం గచ్చామి’ అని చాటి చెప్పే సినిమా ఇది. రవి వర్మ కొత్తవాడైనా బాగా చేశాడు’’ అన్నారు. ‘‘హీరోగా నాకిది తొలి చిత్రం. ప్రేక్షకుల ఆదరణ కావాలి’’ అన్నారు రవి వర్మ. -
ఆకట్టుకుంటున్న బుల్లెట్‌బండి గణపతి
-
బుల్లెట్ బండి: వైరల్ అవుతున్న ఎన్నారై బేబీ వీడియో
-
బుల్లెట్టు బండి: సూపర్.. జూనియర్ సాయి పల్లవిలా..
నార్త్ కరోలినా: సోషల్ మీడియాలో బుల్లెట్ బండి పాట ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ప్రముఖ గాయని మోహన భోగరాజు ఆలపించిన ఈ పాట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారిని ఆకట్టుకుంటోంది. మంచిర్యాలకు చెందిన నవ వధువు సాయి శ్రీయ బుల్లెట్టు బండెక్కి వచ్చెత్త.. పా అంటూ భర్తతో డ్యాన్స్ చేసిన వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు నైనిక అనే ఎన్నారై బేబీ సింగిల్ టేక్‌లో ఈ జానపదానికి తనదైన శైలిలో డ్యాన్స్ చేసి అదరహో అనిపించింది. లిరిక్స్ ఆలపిస్తూ.. జోష్‌గా స్టెప్పులేస్తూ పురివిప్పిన నెమలిలా వీక్షకులకు కనువిందు చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ‘‘నువ్వు సూపర్ బుజ్జీ.. అచ్చమైన.. స్వచ్ఛమైన పల్లె పదాలకు ఎంతో అందంగా ఆడిపాడావు. హ్యాట్సాఫ్’’ అంటూ నెటిజన్లు ఆమెను ఆశీర్వదిస్తున్నారు. జూనియర్ సాయిపల్లవి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా నైనిక అమెరికాలోని నార్త్ కరోలినాలో నివసిస్తున్నట్లు సమాచారం. -
Viral: బుల్లెట్టు బండి పాటొస్తేనే.. పాలు తాగుతోంది!
మహబూబాబాద్ రూరల్: ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం సంతరించుకున్న ‘బుల్లెట్టు బండెక్కి’ పాటకు అందరూ ఆకర్షితులవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడది జంతువులకూ పాకింది. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామంలో ఓ కొండెంగ(కోతి) మొబైల్ ఫోన్లో బుల్లెట్టు బండి పాట పెడితేనే పాలు తాగుతోంది. ఈ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మొబైల్ ఫోన్లో పాటను చూస్తూ ఆ కొండెంగ పాలు తాగడాన్ని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. -
చిక్కుల్లో పడ్డ పరిటాల సిద్దార్థ
-
పరిటాల సిద్ధార్థ్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్థ్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్‌తో పట్టుబడ్డ సిద్ధార్థ్‌ను వివరణ ఇవ్వాల్సిందిగా ఎయిర్‌పోర్టు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సిద్ధార్థ్ లైసెన్స్డ్ గన్‌కు బ్యాగులో దొరికిన బులెట్‌కు వ్యత్యాసం ఉంది. గతంలో పాయింట్ 32 క్యాలిబర్ గన్‌కు లైసెన్స్ పొందిన సిద్ధార్థ్ బ్యాగులో.. 5.56 క్యాలిబర్ బుల్లెట్ లభ్యం అయ్యింది. (చదవండి: పరిటాల సిద్ధార్థ్ వద్ద అక్రమ ఆయుధం?) అయితే సిద్ధార్థ్ వద్ద సాయుధ బలగాలు వాడే ఇన్సాస్ రైఫిల్స్ బుల్లెట్ గుర్తించారు పోలీసులు. ఈ బుల్లెట్ సిద్ధార్థ్‌కు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై విచారణ జరుపుతున్నారు. అనంతపూర్‌కు చెందిన ఇండో టిబెటెన్ బోర్డర్లో పని చేస్తున్న కానిస్టేబుల్ తూటాగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్‌తో పరిటాల కుటుంబానికి పరిచయాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
పరిటాల సునీత కుమారుడి బ్యాగ్‌లో బుల్లెట్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్ధ్‌పై శంషాబాద్ విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రత నిబంధనలకు విరుద్ధంగా బ్యాగ్‌లో బుల్లెట్‌తో విమానం ఎక్కడానికి ప్రయతి్నంచిన నేపథ్యంలో ఆయనపై ఆయుధ చట్టం కింద కేసు నమోదైంది. తెలుగుదేశం పారీ్టలో యువ నాయకుడిగా ఉన్న సిద్ధార్థ్ బుధవారం ఉదయం తన కుటుంబసభ్యులతో శ్రీనగర్ వెళ్లడానికి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఉదయం 5.26కి ఇండిగో విమానం ఎక్కడానికి వచి్చన ఆయన తన బ్యాగేజ్‌ను కౌంటర్లో అప్పగించారు. విమానాశ్రయ అధికారులు బ్యాగ్‌ను స్కానింగ్ చేసిన నేపథ్యంలో అందులో 5.56 ఎంఎం క్యాలిబర్ బుల్లెట్ ఉన్నట్లు గుర్తించి స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదుచేసిన హోల్డ్ బ్యాగేజ్ స్క్రీనింగ్ ఇన్చార్జ్ ఎ.సన్యాసినాయుడు బుల్లెట్‌తో పాటు సిద్ధార్థ్‌ను వారికి అప్పగించారు. పోలీసులు ప్రశ్నించిన నేపథ్యంలో తనకు అనంతపురంలో లైసెన్డ్స్ ఆయుధం ఉందని, ఇది దానికి సంబంధించిన బుల్లెట్ అని సిద్ధార్థ్ తెలిపారు. బ్యాగ్‌లో ఉందన్న విషయం తెలియకే విమానం ఎక్కడానికి ప్రయత్నించినట్లు వెల్లడించారు. ఆయనతో ఆయుధ లైసెన్సుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ సీఆర్పీసీ 41–ఏ కింద నోటీసులు జారీ చేశారు. దీనిపై మూడ్రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, ఆయుధ లైసెన్సుకు సంబంధించిన పూర్తి పత్రాలు అందించాలని ఆదేశించి పంపేశారు. చదవండి: నకిలీ చలాన్ల వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్ -
బైక్‌పై తల్లీకూతురు..కేరళ To కాశ్మీర్
డ్రైవింగ్ రాని ఆమెకు పెళ్లిరోజు కానుకగా భర్త బుల్లెట్‌ను బహుమతిగా ఇచ్చాడు. దాంతో ముచ్చటపడి డ్రైవింగ్ నేర్చుకుంది. అది మామూలుగా కాదు... లాంగ్ డ్రైవ్‌కు వెళ్లగలిగేంతగా. ఇక ఊరుకోలేదు. కూతురును తీసుకుని కాశ్మీర్ యాత్రకు బయల్దేరింది. తల్లీ కూతుళ్లు ఇద్దరూ ఒంటరి మహిళలు చేసే పర్యటన గురించి, ముందస్తు ప్రణాళికల గురించి, జాగ్రత్తల గురించి అందరితో పంచుకుంటూ మరీ వెళుతున్నారు. కేరళలోని మణియారాలో ఉంటున్న అనీష స్థానిక పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. కొత్తగా నేర్చుకున్న బైక్‌పై తిరుగుతున్న రుతుపవనాల ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకుంది. అనుకున్నదే ఆలస్యం... కేరళ నుంచి కాశ్మీర్ వరకు బైక్‌పై సాగే ప్రయాణాన్ని డిగ్రీ చదువుతున్న తన కూతురు మధురిమతో కలిసి రైడింగ్ ప్రారంభించింది. జులై 14న మొదలుపెట్టిన ఈ ప్రయాణం రోజూ 300 కిలోమీటర్లు కవర్ చేస్తోంది. మహిళల ప్రయాణం ‘ఒంటరి మహిళలు పర్యటనలను ఆనందించాలనే అభిలాష ఉండగానే సరిపోదు... అందుకు ముందస్తు యాత్రను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి.. అనే ఆలోచనతోనే ఈ ట్రిప్ చేస్తున్నాం’ అని చెబుతుంది అనీషా. ఎవరైనా మహిళలు ఒంటరిగా పర్యటనలు చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, వాటి గురించి తమ అనుభవాలతో వివరిస్తుంది అనీషా. వారం దాటాకే సమాచారం రెండు వారాలకు పైగా కొనసాగిన ప్రయాణంలో తాము ఎదుర్కొన్న సంఘటనలను, ఇతరులు ఎవరైనా తమలా ప్రయాణించాలనుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది అనీష. మహిళలు తాము ఒంటరిగా పర్యటించేటప్పుడు Ðð ళ్లే మార్గం, బస చేసే స్థలం ముందే ఎంచుకోవాలి. సూర్యుడు అస్తమించే సమయానికి ఏ ప్రదేశానికి చేరుకోవాలో ముందే గమనింపు ఉండాలి. ఉండే స్థలం, హోటల్ లేదా ఇతర ప్రదేశాలు నచ్చకపోయినా రాత్రి అవడానికి ముందే ప్లానింగ్‌లో మార్పులు చేసుకోవచ్చు. భద్రత కోసం ఆయుధం, పెప్పర్ స్ప్రే వంటి వాటిని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. అలాంటప్పుడే కష్టసమయాలను సులువుగా ఎదుర్కోవడం అవుతుంది. అంతేకాదు, వెళ్లే మార్గం, ఫొటోలు.. వివరాలేవైనా ఎప్పటికప్పుడు కాకుండా వారం రోజులు దాటాకే వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం మంచిది. దీని వల్ల పర్యటన లో పెద్దగా ఇబ్బందులు ఎదురుకావు’ అంటూ తాము తీసుకున్న జాగ్రత్తలను, సమస్యలను ఎదుర్కొన్న విధానాన్ని వివరిస్తుంది అనీష. -
అక్కడ బుల్లెట్ తగిలినా బతికేసింది
చావు తప్పి కన్ను లొట్టబోవడం అంటే ఇదేనేమో..! గుండెకు దగ్గరగా తూటా వచ్చినప్పటికీ ఆమె బతికి బట్టగట్టింది. కారణం ఆమె చేయించుకున్న "బ్రెస్ట్ ఇంప్లాంట్". ఈ అరుదైన ఘటన కెనడాలో చోటు చేసుకుంది. సేజ్ (ఎస్‌ఏజీఈ) మెడికల్ జర్నల్ ప్రచురించిన కథనం ప్రకారం.. 2018లో కెనడాలోని టోరంటోకు చెందిన మహిళపై కొందరు కాల్పులు జరిపారు. అందులో ఓ బుల్లెట్ నేరుగా గుండెమీదకు గురి పెట్టినప్పటికీ అది ఎడమవైపు వక్షోజం నుంచి కుడి వక్షోజానికి తాకింది. కానీ గుండెలోకి వెళ్లకుండా పక్క నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. అయితే బుల్లెట్ అలా పక్కకు తప్పుకోడానికి కారణమేంటని లోతుగా పరిశీలించగా ఆమె వక్షోజాలే ఆమెను కాపాడాయని తెలుసుకుని వైద్యులు ఆశ్చర్యపోయారు. (వైరల్ వీడియో: ఇలాంటి వ్యక్తిని మీరు చూశారా!) కాకపోతే ఆమె వక్షోజాలు సహజమైనవి కావు. అందంగా, ఎత్తుగా కనిపించేందుకు సిలికాన్ బెలూన్లు అమర్చుకుంది. దీన్నే "బ్రెస్ట్ ఇంప్లాంట్" సర్జరీ అంటారు. అయితే ఇలా సిలికాన్ బెలూన్లు మహిళ ప్రాణాలను కాపాడటం ఇదే తొలిసారని వైద్యులు పేర్కొంటున్నారు. ఇవి బుల్లెట్ దిశను మార్చివేయడాన్ని అరుదైన ఘటనగా అభివర్ణిస్తున్నారు. ఈ ఘటనలో ఆమె పక్కటెముకలు విరిగాయని పేర్కొన్నారు. మరోవైపు బుల్లెట్ దాడికి సిలికాన్ ఇంప్లాంట్ దెబ్బతిన్నందున వాటిని తీసివేశామని తెలిపారు. కాగా అమెరికాలో రెండు రకాల బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒకటి అవతలి పొర సిలికాన్‌తో, మరొకటి సెలైన్‌తో నిండి ఉంటుంది. ఇవి వివిధ సైజుల్లో, వివిధ ఆకారాల్లో లభిస్తాయి. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఎందరో నటీమణులు బ్రెస్ట్ ఇంప్లాంట్ చేసుకున్న విషయం తెలిసిందే. (రొమ్ము క్యాన్సర్ తొలి దశలో) -
ఆస్మాబేగం బుల్లెట్ : ఏ తుపాకీ నుంచి వెలువడింది?
సాక్షి, హైదరాబాద్: ప్రాపర్టీ అఫెన్సులుగా పిలిచే చోరీలు, దోపిడీల కంటే బాడీలీ అఫెన్సులుగా పరిగణించే దాడులు, హత్య, హత్యాయత్నాల దర్యాప్తునకు పోలీసులు ప్రాధాన్యం ఇస్తారు. అందునా..తుపాకీ వాడిన కేసులను ఆఘమేఘాల మీద కొలిక్కి చేరుస్తూ ఉంటారు. నిమ్స్ ఆస్పత్రి కేంద్రంగా రెండు నెలల క్రితం వెలుగులోకి వచ్చిన ఆస్మా బేగం కేసులో మాత్రం పోలీసులు ఆ స్థాయి ఆసక్తి చూపట్లేదు. ఆమె శరీరం నుంచి బయటకు తీసిన బుల్లెట్ ఏ తుపాకీ నుంచి వెలువడింది? ఆ గన్ను కాల్చింది ఎవరు? తదితర అంశాలను వెలికితీయడానికి అవసరమైన స్థాయి ప్రాధాన్యం ఇవ్వట్లేదు. మొదట వారం రోజుల పాటు హడావుడి చేసిన అధికారులు ఆపై మిన్నకుండిపోయారు. ఫలితంగా కేసు కొలిక్కి రాకపోవడం మాట అటుంచితే..ఓ దశలో ఆ యువతి కుటుంబీకులుపోలీసులపైనే నెపం నెట్టే ప్రయత్నాలు చేశారని సమాచారం. ఇలా బయటపడిన బుల్లెట్... పాతబస్తీలోని జహనుమ ప్రాంతానికి చెందిన అబ్దుల్ ఖాదర్ కుమార్తె ఆస్మాబేగం కొన్నాళ్లు నడుమునొప్పితో బాధపడింది. వైద్యం కోసం తల్లిదండ్రులతో కలిసి నిమ్స్ ఆస్పత్రికి వచ్చింది. తొలుత సాధారణ పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు కొన్ని మందులు ఇచ్చి పంపారు. దాదాపు నెల రోజుల పాటు వీటిని వాడినా ఫలితం లేకపోవడంతో ఆమెను కుటుంబీకులు గత ఏడాది డిసెంబర్ 21న మరోసారి నిమ్స్‌కు తీసుకువచ్చారు. ఆ రోజు ఎక్స్‌రే తీసిన నిమ్స్ వైద్యులు ఆమె వెన్నెముకలోని ఎల్–1, ఎల్–2 సమీపంలో ఏదో అనుమానిత వస్తువు ఉన్నట్లు తేల్చారు. దీంతో ఆ మరుసటి రోజు శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఆమె శరీరం నుంచి ఓ తూటాను బయటకు తీశారు. ఆందోళనకు గురైన వైద్యులు ఈ విషయంపై పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేను దర్యాప్తు చేయడానికి అటు శాంతిభద్రతల విభాగం అ«ధికారులు, ఇటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి వివిధ కోణాల్లో ఆరా తీశారు. ఆస్మా బేగంతో పాటు ఆమె తల్లిదండ్రులు సైతం తమకు ఏమీ తెలియదని చెప్పడంతో మిస్టరీని ఛేదించడానికి వారం రోజుల పాటు హడావుడి చేశారు. ఆస్మా బేగం శరీరంపై ఉన్న గాయాన్ని బట్టి ఆ తూటా సుదీర్ఘకాలం ఆస్మా బేగం శరీరంలో ఉండిపోయిందని వైద్యులు తేల్చారు. ఆ బుల్లెట్‌ను పరిశీలించిన నిపుణులు .32 క్యాలిబర్‌కు చెందినదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మైలార్‌దేవ్‌పల్లి కేసుతో పోల్చినా... కేసు దర్యాప్తు అంటూ తొలినాళ్లల్లో హడావుడి చేసిన పోలీసులు ఆస్మా కుటుంబీకులతో పాటు వారి ఇంటి చుట్టుపక్కల వారినీ ప్రశ్నించారు. కొన్నాళ్ల క్రితం సైబరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో చోటు చేసుకున్న హతాయత్నం కేసుతో ఈ ఉదంతాన్ని ఉన్న లింకులను పోలీసులు అధ్యయనం చేశారు. ఆస్మాబేగం తండ్రి దాదాపు 20 ఏగా పాతబస్తీకి చెందిన ఓ బడాబాబు వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అప్పట్లో ఆయన కుమారుడిపై ఓ కాల్పుల కేసులో ఆరోపణలు వచ్చాయి. పాతబస్తీకి చెందిన ఈ బడాబాబు కుమారుడు, మరో వ్యక్తి కలిసి నగర శివార్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. కింగ్స్ కాలనీలో ఉన్న బడాబాబు కుమారుడి కార్యాలయంలో 2017 నవంబర్‌లో ఓ విందు జరిగింది. ఆ సందర్భంలో అక్కడ కాల్పులు చోటు చేసుకుని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పట్లో కేసు నమోదు చేసుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సదరు బడాబాబు కుమారుడితో పాటు అతడి తుపాకీ కోసమూ కొన్ని రోజులు ముమ్మరంగా గాలించారు. అప్పట్లో అతగాడు తన తుపాకీని తన తండ్రి వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్న ఆస్మాబేగం తండ్రి ఇంట్లో దాచి ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సందర్భంలో జరిగిన మిస్‌ఫైర్‌తోనే తూటా ఆస్మా బేగం శరీరంలోకి దూసుకుపోయి ఉంటుందని అంచనా వేశారు. అర్థాంతరంగా ఆగిపోయిన దర్యాప్తు... కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టుకుపోయినట్లు..కొత్త కేసుల రొదలో ఈ కాల్పుల కేసుకు చెద పట్టింది. కొన్ని రోజులు దర్యాప్తు పేరుతో హడావుడి చేసిన పోలీసులు ఆపై మిన్నకుండిపోయారు. మైలార్‌దేవ్‌పల్లిలో కేసు ఉన్న సందర్భలో ఈ మిస్‌ఫైర్ విషయం బయటకు వస్తే మరింత ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో దుండగులు రహస్యంగా ఉంచి, స్థానికంగా వైద్యం చేయించి ఉండవచ్చని అనుమానించిన అధికారులు ఆ కోణంలో ఒక్క ఆధారాన్నీ సేకరించలేకపోయారు. ఓ దశలో ఆస్మా కుటుంబీకులు పోలీసుల పైనే ఎదరుదాడికి దిగారని ఓ అధికారి వ్యాఖ్యానించారు. నిమ్స్‌లో శస్త్రచికిత్స చేసినప్పుడు ఆస్మా శరీరం నుంచి బుల్లెట్‌ను బయటకు తీయలేదని, పోలీసులు ఎక్కడి నుంచో తీసుకువచ్చి పెట్టారని, శరీరం నుంచి తీసినట్లు కట్టుకథ అల్లారని ఆరోపించినట్లు ఆయన వివరించారు. దీంతో పాటు కొన్ని ఒత్తిళ్ల నేపథ్యంలో పోలీసులు ఆస్మాబేగం కేసును అటకెక్కించారని తెలుస్తోంది. -
నాటి కాల్పుల ఘటనతో లింకు?
-
బుల్లెట్ మ్యాన్స్!
సాక్షి, సిటీబ్యూరో: ప్రజా గాయకుడు గద్దర్... కానిస్టేబుల్ దాసరి రాజేంద్ర ప్రసాద్... ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ..కాంగ్రెస్ నేత విక్రమ్ గౌడ్... జహనుమ ప్రాంతానికి చెందిన ఆస్మా బేగం... ఈ ఐదుగురిలో ఉన్న సారూప్యత శరీరంలో బుల్లెట్స్ ఉండడం. ఆస్మా బేగం సుదీర్ఘ కాలం తన శరీరంలో బుల్లెట్‌తోనే బతికినా... వెన్నుపూస ఉదరకోశ భాగం మధ్యలో ఉన్న దాన్ని నిమ్స్ వైద్యులు ఆదివారం శస్త్ర చికిత్స చేసి తీసేశారు. మిగిలిన నలుగురూ మాత్రం ఇప్పటికీ ‘బుల్లెట్ మ్యాన్స్’గానే కొనసాగుతున్నారు. సాధారణంగా ప్రాణహాని కలిగించే తూటాను వీరంతా తమ శరీరంలో భాగంగా ఉంచుకోవాల్సి వచ్చింది. ప్రజాగాయకుడు గుమ్మడి విఠల్‌రావ్ అలియాస్ గద్దర్‌పై 1997లో కాల్పులు జరిగాయి. ఆల్వాల్ వెంకటాపురంలోని ఆయన ఇంటి వద్దే జరిగిన ఈ ఉదంతంలో ఆయన శరీరంలోకి ఐదు తూటాలు దూసుకుపోయాయి. నాలుగింటిని ఆపరేషన్ ద్వారా తొలగించిన వైద్యులు ఆయన వెన్నెముక సమీపంలో ‘స్థిరపడిపోయిన’ ఐదో దాన్ని మాత్రం తీస్తే ప్రమాదమని వదిలేశారు. నగర పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న దాసరి రాజేంద్రప్రసాద్‌పై 2009లో కాల్పులు జరిగాయి. మక్కా మసీదు వద్ద జరిగిన పోలీసు కాల్పులకు ప్రతీకారంగా అంటూ తెహరీక్ గుల్బా ఏ ఇస్లాం (టీజీఐ) పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి ఉగ్రవాదబాట పట్టిన వికారుద్దీన్ అహ్మద్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పాతబస్తీలోని ఫలక్‌నుమ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న నాలుల్చింత వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులపై వికార్ కాల్పులు జరిపాడు. హోంగార్డు బాలస్వామి అక్కడిక్కడే చనిపోగా... పక్కనే ఉన్న కానిస్టేబుల్ రాజేంద్ర తలలోకి తూటా దూసుకుపోయింది. మెదడుకు సమీపంలో ఉన్న దీన్ని తొలగించే ప్రయత్నం చేసినా, తొలగించినా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని చెప్పిన వైద్యులు అలానే ఉంచేశారు. ఎంఐఎం శాసనసభాపక్ష నేతగా ఉన్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై 2011లో హత్యాయత్నం జరిగింది. పాతబస్తీలోని బార్కస్ ప్రాంతంలో పహిల్వాన్ అండ్ గ్యాంగ్ ఆయనపై విరుచుకుపడింది. కత్తులు, తుపాకులతో దాడికి తెగపడటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సుదీర్ఘకాలం ఆస్పత్రిలో ఉన్న ఆయనకు పలు శస్త్రచికిత్సలు జరిగాయి. శరీరంలో ఉన్న ఇతర బుల్లెట్స్ తొలగించినా మూత్రపిండం, వెన్నెముక సమీపంలో ఉన్న తూటా జోలికి మాత్రం వైద్యులు పోలేదు. దీన్ని తీసే ప్రయత్నం చేస్తే అక్బర్ కాళ్ళు చచ్చుబడిపోయే ప్రమాదం ఉందని అలానే ఉంచేశారు. ఈ ముగ్గురి పైనా గుర్తుతెలియని వ్యక్తులు, ఉగ్రవాదులు, ప్రత్యర్థులు విరుచుకు పడటంతో వారు ‘బుల్లెట్ మ్యాన్స్’గా మారారు. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్ కథ వేరు. తనపై దాడికి తానే వేసుకున్న సెల్ఫ్ స్కెచ్‌లో బుల్లెట్ మ్యాన్‌గా మారాడు. 2017లో బంజారాహిల్స్‌లోని ఇతడి ఇంట్లో హైడ్రామా చోటు చేసుకుంది. తాను ఏర్పాటు చేసుకున్న మనుషులతో తనపైనే కాల్పులు చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ తూటా ఆయన వెన్నుముక సమీపంలోకి వెళ్లి ఆగింది. దీన్ని కదిలించినా ప్రమాదమే కావడంతో వైద్యులు అలానే ఉంచేశారు. తుపాకులు నాటువైతే ఎగ్జిట్ కావు: నిపుణులు ఓ వ్యక్తిపై జరిగిన కాల్పుల ఉదంతంలో రెండు రకాలైన గాయాలు ఉంటాయి. తూటా లోపలకు దూసుకుపోయిన దాన్ని ఎంట్రీ ఊండ్ అని... శరీరం ద్వారా బయటకు దూసుకువచ్చిన దాన్ని ఎగ్జిట్ ఊండ్ అని అంటారు. నాటు తుపాకుల నుంచి వెలువడిన తూటాలు శరీరంలోకి దూసుకుపోతాయి తప్ప రెండో వైపు నుంచి బయటకు దూసుకురావు. గద్దర్, రాజేంద్ర ప్రసాద్, అక్బరుద్దీన్, విక్రమ్గౌడ్లపై కాల్పులకు వాడింది నాటు తుపాకులు కావడంతో తూటాలు ఎగ్జిట్ కాలేదు. దీనికి తోడు ఇవన్నీ పాయింట్–32 క్యాలిబర్ బుల్లెట్స్ కావడమూ ఓ కారణమే. కంపెనీ మేడ్‌గా ఉండే లైసెన్డ్స్ ఆయుధాలు లేదా పోలీసులు వినియోగించే సర్వీస్ రివాల్వర్స్లో కాల్పులు జరిపితే తూటా శరీరంలోకి వెళ్ళడంతో పాటు రెండో వైపు నుంచి దూసుకుని బయటకు వచ్చేస్తుంది. ఇవి అత్యంత ప్రమాదకర ఆయుధాలు. బుల్లెట్స్ అన్నిలెడ్తోనే తయారీ తుపాకుల్లో వాడే తూటాలను లెడ్తో తయారు చేస్తారు. కొన్ని పూర్తిగా లెడ్తోనే ఉండగా... మరికొన్న రకాలైన బుల్లెట్స్‌కు పైన కాపర్ లేదా బ్రాస్‌తో చేసిన జాకెట్ ఉంటుంది. శరీరంలోని దిగిన బుల్లెట్స్లో కొన్నింటిని వైద్యులు అలానే ఉంచేస్తారు. వీటివల్ల తొలినాళ్ళల్లో ఇబ్బంది ఉన్నా... ఆపై టిష్యూ సర్దుకుపోయి తూటాను తనలో ఇముడ్చుకుంటుంది. ఎముకలు విరిగినప్పుడు ఐరన్ ప్లేట్స్ వేస్తుంటారు. వీటినీ టిష్యూ తనలో ఇముడ్చుకున్న మాదిరిగానే తూటాలకూ ఎడ్జెస్ట్ అవుతుంది. శరీరంలోని కొన్ని సున్నిత ప్రాంతాల్లో తూటాలు ఉండిపోతే మాత్రం జీవితకాలం వైద్యుల సలహాసూచనల మేరకు ఔషధాలు వాడాల్సి ఉంటుంది. – డాక్టర్ వెంకన్న, హైదరాబాద్ క్లూస్ ఇన్చార్జ్ -
అంతుచిక్కని తూటా రహస్యం!
సాక్షి, సిటీబ్యూరో/పంజగుట్ట /చాంద్రాయణగుట్ట: పాతబస్తీలోని జహనుమ ప్రాంతానికి చెందిన ఆస్మాబేగం శరీరం నుంచి బుల్లెట్ బయటపడిన ఘటన మిస్టరీగా మారింది. దీనిపై ఆస్మా కుటుంబీకులు నోరిప్పడం లేదు. శాంతిభద్రతల విభాగం, టాస్క్‌ఫోర్స్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా తూటాను పేల్చినప్పుడు దానిపై రైఫ్లింగ్ మార్క్స్ పడతాయి. వీటి ఆధారంగా సదరు ఆయుధం ఎటువంటిదనేది తెలుస్తుంది. అయితే తూటా సుదీర్ఘకాలం ఆస్మాబేగం శరీరంలో ఉండిపోవడంతో దానిపై ఎలాంటి రైఫ్లింగ్ మార్క్స్ లేవు. దీంతో బుల్లెట్‌ను పరిశీలించిన నిపుణులు .32 క్యాలిబర్‌కు చెందినదని అభిప్రాయపడుతున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించి బాలిస్టిక్ నిపుణులతో పరీక్ష చేయించాలనీ అంటున్నారు. నాటి కాల్పుల ఘటనతో లింకు? తూటా గుట్టు తేల్చేందుకు పోలీసులు ఆస్మా కుటుంబీకుల కాల్ డిటైల్స్‌ను సేకరిస్తున్నారు. మరోపక్క రెండేళ్ల క్రితం మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో చోటు చేసుకున్న హత్యా యత్నం కేసుతో ఈ ఉదంతానికి ఉన్న లింకును పోలీసులు అధ్యయనం చేస్తున్నారు. ఆస్మాబేగం తండ్రి 20 ఏళ్లుగా పాతబస్తీకి చెందిన ఓ బడాబాబు వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఈ బడాబాబు కుమారుడు, మరొకరు కలిసి నగర శివార్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. కింగ్స్ కాలనీలో ఉన్న బడాబాబు కుమారుడి కార్యాలయంలో 2017 నవంబర్‌లో విందు జరిగింది. అప్పుడు కాల్పులు జరిగి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కేసు నమోదు చేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు బడాబాబు కుమారుడితో పాటు అతడి తుపాకీ కోసం కొన్ని రోజులు గాలించారు. అప్పట్లో అతగాడు తన తుపాకీని తన తండ్రి వద్ద వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఆస్మా తండ్రి ఇంట్లో దాచి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన మిస్‌ఫైర్‌తోనే తూటా ఆస్మాబేగం శరీరంలోకి దూసుకుపోయి ఉంటుందని, ఘటన బయటపడకుండా ఆస్మాకు రహస్యంగా వైద్యం చేయించి ఉండొచ్చని అనుకుంటున్నారు. తాజాగా ఆమె నొప్పితో నిమ్స్‌లో చేరగా, శస్త్రచికిత్సలో తూటా బయటపడిందని భావిస్తున్నారు. కాగా, బడాబాబు కుమారుడి ఆయుధాన్ని మళ్లీ బాలిస్టిక్ పరీక్షలకు పంపాలని భావిస్తున్నారు. జహనుమాలో కలకలం ఆస్మాబేగం ఘటనతో ఫలక్‌నుమా జహనుమాలో కలకలం రేగింది. జహనుమాలో ఉండే వజీర్, నూర్జహా దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఆస్మాబేగం (18) సంతానం. మూడేళ్లుగా ఆస్మా వెన్నునొప్పితో బాధపడుతోంది. శనివారం నిమ్స్‌కు వెళ్లగా, సర్జరీ చేసి తూటాను బయటకు తీసిన విషయం తెలిసిందే. కాగా వైద్యులు చెప్పినట్లు ఆస్మాబేగం కడుపులో ఎలాంటి బుల్లెట్ లేదని కుటుంబసభ్యులు అంటున్నారు. అయితే, యువతి తల్లిదండ్రులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం విచారించారు. ఘటనపై కేసు నమోదు మొదట సాధారణ పేషంట్ కింద ఆస్మాకు సర్జరీ చేసిన నిమ్స్ వైద్యులు.. ఆమె వెన్నుపూస (ఎల్ 1, ఎల్ 2) ప్రాంతంలో బుల్లెట్ ఉండడంతో వెంటనే కేసును మెడికో లీగల్ కేసు (ఎమ్ఎల్సీ) కింద మార్చి ఉన్నతాధికారులకు, పోలీసులకు తెలిపారు. పోలీసులు ఐపీసీ 307 హత్యాయత్నం, 27 ఆఫ్ ఆరŠమ్స్ యాక్ట్ ఆయుధ చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా సర్జరీ అయిన మర్నాడే ఆస్మాబేగంను నిమ్స్ వైద్యులు డిశ్చార్జ్ చేయడంపైనా పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. -
యువతి శరీరంలో బుల్లెట్
-
యువతి శరీరంలో మూడేళ్లుగా బుల్లెట్!
సాక్షి, హైదరాబాద్ : వెన్నునొప్పి చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన ఓ యువతి శరీరంలో బుల్లెట్ బయటపడటం నిమ్స్ ఆస్పత్రిలో కలకలం రేపింది. వివరాలు.. ఫలక్‌నుమా జహ్నుమా ప్రాంతంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి కుమార్తె(18) స్థానికంగా కుట్టుమిషన్ పనిచేస్తోంది. 3 నెలలుగా వెన్నునొప్పితో బాధపడుతుండటంతో చికిత్స కోసం ఆమె నిమ్స్‌లో చేరింది. వైద్యులు ఎక్స్‌రేతోపాటు పలు వైద్య పరీక్షలు నిర్వహించి వెన్నుపూస, ఉదర కోశం భాగంలో గాయమున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో సదరు యువతికి శస్త్రచికిత్స నిర్వహించగా బుల్లెట్ బయటపడింది. దీంతో కంగుతిన్న వైద్యులు బుల్లెట్ ఎక్కడ నుంచి వచ్చిందని యువతి కుటుంబ సభ్యులను ప్రశ్నించగా వారు తెలియదని సమాధానం ఇచ్చారు. యువతి శరీరంలో బుల్లెట్ రెండు, మూడేళ్ల క్రితం నుంచి ఉన్నట్లుగా వైద్యులు భావిస్తున్నారు. దీనిపై నిమ్స్ ఉన్నతాధికారులు పంజగుట్ట పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ మేరకు ఫలక్‌నుమా పోలీసులకు సమాచారం ఇచ్చారు. గతంలో వీరు ఎక్కడ నివాసం ఉన్నారు..? ఆ ప్రాంతంలో ఏదైనా ఫైరింగ్ పాయింట్ ఉందా? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
బుల్లెట్ల కోసం పోలీసుల గాలింపు
సాక్షి, షాద్‌నగర్ : దిశ హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసిన ప్రదేశంలో పోలీసులు ఉపయోగించిన బుల్లెట్ల కోసం ప్రత్యేక బృందాలు శనివారం ఉదయం గాలించాయి. చటాన్‌పల్లి బ్రిడ్జి సమీపంలోని ఘటనా స్థలంలో మెటల్ డిటెక్టర్ల సాయంతో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు వెతికారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో నలుగురు నిందితులకు మొత్తం 12 బుల్లెట్ గాయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే పోలీసులు వారిపై మొత్తం 15 రౌండ్ల కాల్పులు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. ఘటనా స్థలంలో పడిన బుల్లెట్లను స్వాధీనం చేసుకునేందుకు వాటి కోసం చుట్టుపక్కల ప్రాంతాన్ని జల్లెడపట్టారు. ఎన్ని బుల్లెట్లు లభించాయనే వివరాలు మాత్రం పోలీసులు వెల్లడించలేదు. -
2 మైళ్లు ప్రయాణించి.. తలలో ఇరుక్కుంది
బుకారెస్ట్ : రొమానియాలోని జార్జ్ కౌంటీ. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతం. 22ఏళ్ల కాంస్టాటిన్ వోచినోయి రోడ్డు పక్కన కారు పార్క్ చేసి డోరు మూయబోతున్నాడు. ఇంతలో అతని తలలో ఏదో దిగబడ్డట్టు అనిపించింది. విపరీతమైన నొప్పితో అతడు కూలబడ్డాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకుని అద్దంలో చూసుకున్నాడు. షాక్! ఓ బుల్లెట్ అతడి తలలో ఇరుక్కుని ఉంది. పైగా బయటకు బాగా కనిపిస్తోంది. నొప్పి భరించలేక అతడు వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లాడు. అయితే అక్కడి వైద్యులు బుల్లెట్ బయటకు తీయటం చాలా కష్టమని, అలాచేస్తే ప్రాణానికి ప్రమాదమని చెప్పారు. తలలో దిగిన బుల్లెట్ దీంతో అతడు క్రయోవాలోని ఓ పెద్ద ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు అతడికి ఆపరేషన్ చేసి బుల్లెట్‌ను బయటకు తీశారు. వోచినోయి ఆ తర్వాత దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బుల్లెట్ ఎవరు పేల్చారా అని దర్యాప్తు చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు కారు పార్క్ చేసిన ప్రాంతం నుంచి సరిగ్గా రెండు మైళ్ల దూరంలో పోలీసులు ఫైరింగ్ నేర్చుకునే ప్రదేశం ఉందని, అక్కడ వాళ్లు పేల్చిన ఓ తుపాకి గుండు రెండు మైళ్లు ప్రయాణించి అతడి తలలో దిగబడిందని పోలీసులు తెలిపారు. అంతదూరం ప్రయాణించటం వల్లే అది తలలోకి దూరకుండా పుర్రెలో ఇరుక్కుపోయిందని వెల్లడించారు. ఈ సంఘటనపై పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఫైరింగ్ ట్రైనింగ్‌లో భాగంగా ఉపయోగించే కొన్ని మిషన్ గన్నుల రేంజ్ మూడు కిలోమీటర్లు(1.87మైళ్లు) వరకు ఉంటుందని తెలిపారు. ట్రైనింగ్ ఉన్న సమయంలో అన్ని రక్షణా చర్యలు తీసుకుంటామని, ఆ ప్రాంతంలో ఎవరూ ఉండకుండా జాగ్రత్త పడతామని చెప్పారు. అయితే ఈ సంఘటన సరిగ్గా ఎప్పుడు జరిగిందన్నది తెలియరాలేదు. -
బుల్లెట్ బాబు..70 చలాన్లు!
నల్లకుంట: నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణకు సంబంధించి 77 పెండింగ్ చలానాలు ఉన్న ఓ ద్విచక్ర వాహనం నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు చిక్కింది. వివరాల్లోకి వెళితే.. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా సోమవారం నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు ఎస్సై రమేష్ నేతృత్వంలో ఫీవర్ ఆస్పత్రి చౌరస్తా సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో జుజ్జువారపు సువర్ణరాజు తన బుల్లెట్ (టీఎస్ 07ఎఫ్హెచ్ 1245) వాహనంపై శంకరమఠం నుంచి ఫీవర్ ఆస్పత్రి వైపు వెళ్తుండగా పోలీసులు ఆపారు. తమ వద్ద ఉన్న ట్యాబ్‌లో ఆ బండి నెంబర్‌తో చెక్ చేయగా ఆ వాహనంపై మొత్తం 77 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ చలానాలకు సంబంధించి బకాయిలు రూ.12,725 ఉండటంతో ఎస్సై రమేష్ ద్విచక్రవానహనాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ విషయాన్ని సీఐ రాజేంద్ర కులకర్ణికి తెలియజేయడంతో ఆయన నగర పోలీసు కమిషనరేట్‌కు సమాచారం ఇచ్చారు. పెండింగ్ చలానాలు క్లియర్ చేస్తే వాహనాన్ని అప్పగిస్తామని ఎస్సై చెప్పారు. కాగా .. పెండింగ్ చలానాల్లో ఎక్కువగా హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకే ఉండటం గమనార్హం. ఇంతగా ట్రాఫిక్ వాయిలెన్స్‌కు పాల్పడిన సదరు వాహనదారుడికి ఏమైనా శిక్ష విధిస్తారా, లేక లైసెన్స్ రద్దు చేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. -
ఎన్ఫీల్డ్.. బుల్లెట్ ట్రయల్స్
న్యూఢిల్లీ: లగ్జరీ బైక్‌ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్.. బుల్లెట్ ట్రయల్స్ 350, 500 వెర్షన్లను బుధవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. 1948–1965 మధ్యకాలంలో 50కి మించి ఛాంపియన్‌షిప్‌లు గెలుచుకున్న జానీ బ్రిటెన్ ట్రయల్స్ మోటార్‌సైకిల్ ప్రేరణతో ఈ బైక్‌లను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. 350 వెర్షన్ ధర రూ.1.62 లక్షలు కాగా, 500 వెర్షన్ ధర రూ.2.07 లక్షలు. డ్యుయల్ ఛానల్ యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), లగేజ్ M -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బులెట్ కలకలం
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారుల సోదాల్లో ఓ వ్యక్తి వద్ద బుల్లెట్లు లభ్యమయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఇండిగో విమానంలో (6ఈ 7201) విజయవాడ వెలుతున్న సత్యదుర్గ అనే వ్యక్తి వద్ద 9ఎమ్ఎమ్ బులెట్లను సీఐఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. -
పూలకు వెళితే.. ప్రాణం పోయింది
సాక్షి, కల్లూరు రూరల్: తంగేడు పూల కోసం వెళ్లిన అతడు.. శవమై తిరిగొచ్చాడు. కల్లూరు మండలం కొర్లగూడెం గ్రామస్తుడు గడ్డం శ్రీనివాసరెడ్డి(47), తన స్నేహితులైన బండి వెంకటేశ్వర్లు, కాకర్ల నర్సింహారావుతో కలిసి బుధవారం తెల్లవారుజామున కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం చిక్కులగూడెం (కనుమూరి అడవి) గ్రామానికి తంగేడు పూల కోసం వెళ్లాడు. సరిగ్గా అక్కడే, అడవి జంతువులను బలిగొనేందుకు బుల్లెట్ మైన్‌ను వేటగాళ్లు అమర్చారు. జంతువులు అటువైపు రాగానే ఆ మైన్ నుంచి విషపూరితమైన బుల్లెట్ దూసుకెళ్లి చంపుతుంది. ఈ విషయం వీరికి తెలియదు. అక్కడ పూలు కోస్తున్న తూటా గడ్డం శ్రీనివాసరెడ్డి వైపునకు బుల్లెట్ దూసుకొచ్చింది. తొడలో నుంచి వెళ్లింది. అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది జరిగిన వెంటనే ఆ ఇద్దరు స్నేహితులు భయాత్పాతానికి లోనయ్యారు. పరుగు పరుగున గ్రామంలోకి వెళ్లారు. ఆ బుల్లెట్ మైన్ అమర్చింది కావేటి దుర్గారావు. అతడొక వేటగాడు. అక్కడకు కొంచెం దగ్గరలోనే కాపుగాశాడు. బుల్లెట్ దూసుకెళ్లడంతో జంతువు చనిపోయిందనుకుని వచ్చేసరికి... రక్తస్రావంతో మనిషి కనిపించాడు. భయంతో పారిపోయాడు. శ్రీనివాసరెడ్డి స్నేహితులు ఇచ్చిన సమాచారంతో కొర్లగూడెం గ్రామస్తులు, కుటుంబీకులు, పోలీసులు వచ్చారు. ప్రమాద కారణాలను తెలుసుకున్నారు. బుల్లెట్ మైన్ ఏర్పాటు చేసిన వేటగాడు కావేటి దుర్గారావు, కృష్ణా జిల్లా కొండూరు గ్రామస్తుడని, పోలీసులకు లొంగిపోయాడని తెలిసింది. శ్రీనివాసరెడ్డికి భార్య కృష్ణకుమారి, కుమారుడు, కుమార్తె సుష్మ, అల్లుడు ఉన్నారు. కొర్లగూడెం గ్రామంలో చిన్నపాటి బడ్డీకొట్టు నడుపుతున్నాడు. అదే, ఇతడి జీవనాధారం. కృష్ణా జిల్లా తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు పోలీసులు అప్పగించారు. గంపలగూడెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డమ్మీ పిస్తోల్.. ఒరిజినల్ బుల్లెట్..!
వరంగల్ క్రైం : హన్మకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ లాకర్ వ్యవహారం బ్యాంకును ఒక కుదుపు కుదిపింది. బ్యాంక్ లాకర్ 27/2లో లభ్యమైన డమ్మీ పిస్తోల్.. ఒరిజినల్ బుల్లెట్ వ్యవహారానికి ప్రస్తుత బ్యాంకు మేనేజర్ అయుబ్ ఔట్ అయ్యారు. ఈనెల 8న బ్యాంక్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ చేసిన లాకర్ వ్యవహారం ఎట్టకేలకు బ్యాంకు మేనేజర్ మెడకు చుట్టుకుంది. బ్యాంక్‌లో తుపాకీ విషయం వెలుగుచూసిన తర్వాత డీసీసీబీ ప్రత్యేక పరిపాలన అధికారి, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం.హరిత హన్మకొండ జిల్లా కోపరేటివ్ అధికారి కరుణాకర్‌ను బ్యాంక్‌లో జరుగుతున్న పరిణామాలపై విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో వరంగల్ అర్బన్ డీసీఓ కరుణాకర్ బ్యాంకులో 8న లాకర్ 27/2 కలిగిన బొద్దిరెడ్డి ప్రకాశ్‌రెడ్డిని బ్యాంకు మేనేజర్ పిలిపించి లాకర్‌ను అద్దెకు తీసుకోకుండా, లాకర్ తాళంచెవి పోయినందుకు, దాన్ని ఓపెన్ చేయడానికి టెక్నీషియన్ చార్జీలకు సంబంధించిన డబ్బులను ఆగస్టు 8న బ్యాంకులో జమచేయలేదు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని విచారణ అధికారులు భావించారు. టెక్నీషియన్ లాకర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో పిస్తోల్, బుల్లెట్ బయటపడిన తర్వాత సమాచారాన్ని బ్యాంకు ఉన్నతాధికారులకు మాత్రమే ఇచ్చారు. కానీ ఆ విషయాన్ని పోలీసులకు ఎందుకు చేరవేయలేదు? అనే విషయంపై విచారణ అధికారులు అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. బ్యాంకు లావాదేవీల్లో అధికారులు నిబంధనలు పాటించకపోవడంపై కూడా విచారణ అధికారులు తమ నివేదికల్లో పేర్కొన్నట్లు తెలిసింది. బ్యాంకు లాకర్ విషయంలో జరిగిన అంశాలతోపాటు ప్రస్తుత పరిస్థితులపై డీసీఓ కరుణాకర్ వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్, డీసీసీబీ ప్రత్యేక అధికారి ఎం.హరితకు ఈనెల 24న నివేదిక అందజేశారు. దీంతో వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం.హరిత బ్యాంకు వ్యవహారంలో నిబంధనలు పాటించనందుకు బ్యాంకు మేనేజర్‌ను సస్పెండ్ చేయాలని బ్యాంకు ఉన్నత అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో గురువారం బ్యాంకు సీఈఓ అంజయ్య ప్రస్తుత మేనేజర్ ఎండీ.అయూబ్బేగ్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. కొనసాగుతున్న పోలీసుల విచారణ బ్యాంకు లాకర్లో బయటపడ్డ డమ్మీ పిస్తోల్ వ్యవహారంలో సుబేదారి పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. లాకర్లో తుపాకీ ఎవరు పెట్టారు?, అందులో బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఎంత? బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగి బొద్దిరెడ్డి ప్రకాశ్‌రెడ్డి పాత్ర ఏ మేరకు ఉంది? రాజకీయ నేతలు ఎవరెవరికి ఈ వ్యవహారంతో సంబంధం ఉందనే విషయాలపై ఓ వైపు విచారణ సాగుతుండగా, మరోవైపు శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో ఒక్కసారిగా బ్యాంకు ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. బ్యాంకు లావాదేవీల విషయంలో నిబంధనలు పాటించనందుకు మేనేజర్ అయూబ్ బేగ్ సస్పెండ్ అయ్యారు. డమ్మీ పిస్తోల్ విషయంలో పోలీసులు ఎవరిని దోషులుగా గుర్తిస్తారో వేచిచూడాల్సి ఉంది. ఈ వ్యవహారంలో మరి కొంత మంది అధికారులపై కూడా వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ దొరకడం కలకలం రేపింది. విమానాశ్రయ పోలీసులు గురువారం తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్నఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రయాణికుడి వివరాలు తెలియరాలేదు. -
బుల్లెట్లను కూడా అడ్డుకోగలకొత్త పదార్థం!
గ్రాఫీన్ గురించి మీరెప్పుడైనా విన్నారా? వినకపోయినా ఫర్వాలేదు లెండి... పెన్సిల్ తీసుకుని కాగితాన్ని నలుపు చేయండి... ఆ నలుపు రంగు పొరనే గ్రాఫీన్ అంటారు. అయితే ఏంటి అంటారా? చాలానే ఉంది. ఈ రకమైన గ్రాఫీన్ పొరలు రెండింటిని సక్రమంగా అతికిస్తే చాలు... బుల్లెట్లను కూడా తట్టుకోగల వినూత్న పదార్థం రెడీ అయిపోతుంది! ఆశ్చర్యంగా ఉందా? కొంచెం వివరంగా చూద్దాం. వజ్రం మాదిరిగానే గ్రాఫీన్ కూడా కార్బన్‌తోనే తయారవుతుంది. ఒక పొర గ్రాఫీన్‌ను చూస్తే... అందమైన డిజైన్‌తో కూడిన ఇనుప ఫెన్సింగ్ మాదిరిగా ఉంటుంది. ఈ ఆకారం కారణంగానే గ్రాఫీన్‌కు కొన్ని అద్భుతమైన లక్షణాలు అలవడతాయి. అదలా ఉంచితే.. దీంట్లో మూడు ఎలక్ట్రాన్లు గట్టిగా బంధం ఏర్పరచుకుని ఉంటే.. నాలుగో ఎలక్ట్రాన్ విడిగా ఉంటుంది. ఇది కూడా ఇంకో కార్బన్ పరమాణవుతో ముడిపడితే... గ్రాఫీన్ కాస్తా వజ్రంగా మారుతుంది! ఈ నేపథ్యంలో సిటీ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్ శాస్త్రవేత్తలు.. తగినంత బలంతో కొడితే రెండు పొరల గ్రాïఫీన్ కాస్తా వజ్రం వంటి దృఢమైన పదార్థంగా మారిపోయేలా చేశారు. అకస్మాత్తుగా వచ్చిపడే బలం కారణంగా గ్రాఫీన్‌లో విడిగా ఉన్న ఎలక్ట్రాన్లు ఇతర పరమాణవులతో బంధం ఏర్పరచుకోవడం దీనికి కారణం. ఇప్పుడు... రెండు గ్రాఫీన్ పొరల పూత ఉన్న ఓ జాకెట్‌ను ఊహించుకుందాం. దాని పైకి రయ్యిమని ఒక బుల్లెట్ దూసుకొచ్చిందనుకుందాం. ఆ శక్తి కాస్తా గ్రాఫీన్ పొరలను దృఢంగా మార్చేస్తుంది కాబట్టి... బుల్లెట్ లోపలికి దిగకుండా అక్కడే ఆగిపోతుంది! అతి పలుచగా ఉండటమే కాకుండా బుల్లెట్లను కూడా తట్టుకోగల జాకెట్ రెడీ అవుతుందన్నమాట! సూపర్ ఐడియా కదూ! -
చైన్ స్నాచర్ అరెస్ట్: బుల్లెట్ స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: కీసర పోలీసు స్టేషన్ పరిధిలో స్కూటర్‌పై వెళ్తున్న యువతిని అనుసరించిన ఓ దొంగ చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. అక్కడే ఉన్న వృద్ధ దంపతులు గమనించి చైన్ స్నాచర్‌ను పట్టుకోబోగా అతను బైక్, చెప్పులు వదిలి పరారయ్యాడు. బైక్‌లో ఉన్న ఒక తపంచా, ఒక రౌండ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. తర్వాత చైన్‌స్నాచర్ మనోజ్ స్వైన్‌ను అరెస్టు చేశామని, ఇతను చిన్నప్పటి నుంచి నేరాలకు పాల్పడుతున్నాడని, జువైనల్ హోమ్ నుంచి పరారయ్యాడని వివరించారు. ఇతనికి సహకరించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనిల్, హకీమ్ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని, గతంలో ఇతనిపై ఎనిమిది కేసులున్నాయని చెప్పారు. నిందితుడి నుండి ఒక కంట్రీమేడ్ తపంచా, బటన్ కత్తి, తొమ్మిది తులాల బంగారంను స్వాదీనం చేసుకున్నట్టు సీపీ తెలిపారు. ఉద్యోగాల ముఠా అరెస్టు రైల్వే, ఎన్టీపీసీలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న ముఠా గుట్టును ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. నకిలీ ఐడి కార్డులతో నిరుద్యోగులకు ఈ ముఠా కుచ్చు టోపీ పెట్టింది. ఏడుగురు సభ్యులు గల ముఠా బోగస్ లెటర్ హెడ్స్ సృష్టించి అపాయింట్ మెంట్ లెటర్స్ తయారు చేస్తోంది. ముఠాలో ఓ మహిళ కూడా ఉంది. ముఠాను పట్టుకున్న ఎస్ఓటీ పోలీసులు వారి నుంచి రూ. 20 లక్షల నగదు, 7 సెల్ఫోన్లు, ఐడీ కార్డులు, బోగస్ అపాయింట్మెంట్లు, ల్యాప్‌టాప్, ప్రింటర్లను సీజ్ చేశారు. బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నిరుద్యోగులు నమ్మొద్దని, అలాంటి వారిపై పోలీసులకు తెలియజేయాలన్నారు. -
రైల్వేశాఖ యూ టర్న్
సాక్షి, ముంబై : బుల్లెట్ ట్రయిన్ విషయంలో రైల్వే శాఖ యూ టర్న్ తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పుకునే బుల్లెట్ ట్రయిన్ అంత లాభదాయం కాదని పేర్కొన్న రైల్వ శాఖ తాజాగా మాట మార్చింది. భారత్‌లో పరుగులు తీయనున్న మొదటి బుల్లెట్ ట్రయిన్ పూర్తిగా పూర్తిగా లాభదాయకమని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఆఫ్ సీజన్లోనూ బుల్లెట్ ట్రయిన్‌కు నష్టాలు వచ్చే అవకాశం తక్కువని ఆయన తెలిపారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య నడిచే బుల్లెట్ ట్రయిన్ 100 శాతం ఆకుపెన్సీ కలిగి ఉండడమే కాక.. భారీగా లాభాలను గడిస్తుందని గోయల్ ట్విటర్లో ట్వీట్ చేశారు. దేశంలోని మొదటి బుల్లెట్ ట్రయిన్ 2023న పట్టాలు ఎక్కనుంది. జులై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ ట్రయిన్‌కు సుమారు 30 కోట్ల రూపాయలు నష్టాలు వచ్చే అవకాశం ఉందని ఆర్టీఐ ద్వారా తెలిసిన సమాచారం. దీనిపై వశ్చిమ రైల్వే శాఖ వివరణ ఇస్తూ.. ముంబై-అహ్మదాబాద్ రూట్ అత్యుత్తమ వ్యాపార మార్గాల్లో ఒకటి తెలిపింది. ఆఫ్ సీజన్లోనే రైల్వే శాఖ ఈ రూట్లో 233 కోట్ల రూపాయలను ఆర్జిస్తోందని రైల్వే శాఖ పబ్లిక్ రిలేషన్ అధికారి రవీందర్ భాస్కర్ వెల్లడించారు. -
అది హత్యే!
సాయంత్రం ఆరు అవుతోందప్పుడు. ఫ్రెండ్ శ్రీరామ్‌ను కలిసేందుకు అతడు ఉండే ఫ్లాట్‌కు వచ్చాడు రాజ్. ఇద్దరూ కలసి చాలాసేపు ముచ్చటించుకున్నారు. శ్రీరామ్ రాజ్‌ను పిలిపించడానికి ఒక కారణం ఉంది. వాళ్లిద్దరూ కలసి నడిపిస్తోన్న కంపెనీలో రాజ్ చేసిన మోసం శ్రీరామ్‌కు తెలిసింది. కంపెనీ 25 లక్షలు మోసపోయింది రాజ్ వల్లే! ఈ విషయం గురించి మాట్లాడడానికే రాజ్‌ను పిలిపించాడు శ్రీరామ్. రాజ్‌కూ ఈ విషయం అర్థమవుతూనే ఉంది. మెల్లిగా మాటల మధ్యలో ఎక్కడా తన మోసం సంగతి బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక అది బయటకు రావడమే ఆలస్యం, తనతో పాటు తెచ్చుకున్న ఓ తుపాకీని శ్రీరామ్‌కు గురిపెట్టాడు రాజ్. ఠప్మంటూ బుల్లెట్ బయటకొచ్చింది. శ్రీరామ్ అక్కడికక్కడే కూలబడిపోయాడు. సాక్ష్యాలేవీ లేకుండా చూసుకున్నాడు రాజ్. అంతకుముందు రోజు ఒక షో కోసం వాళ్లు రెడీ చేసి పెట్టుకున్న సూసైడ్ ఆడియో క్యాసెట్ ఒకటి వెతికిపట్టి టేప్ రికార్డర్లో వేశాడు. ఆ టేప్ రికార్డర్‌ను శ్రీరామ్ ఎడమ చేతిలో పెట్టాడు. కుడిచేతిలో గన్ పెట్టాడు. అందరూ ఆత్మహత్య అనుకునేలా సెటప్ చేసి పెట్టుకున్నాడు. తర్వాతి రోజు ఉదయం పేపర్ బాయ్ శ్రీరామ్‌ను శవంలా చూసి పోలీసులకు ఫోన్ చేశాడు. ఇన్స్పెక్టర్ భరత్, అతడి టీమ్ సాక్ష్యాధారాలు వెతకడం ప్రారంభించింది. టేప్ రికార్డర్‌ను ఆన్ చేయగానే, వారికి శ్రీరామ్ గొంతు వినిపించింది. ‘‘నా చావుకు ఎవరూ కారణం కాదు. ఈ జీవితం నాకు నచ్చడం లేదు. ఇక్కడ ఉండటం అస్సలు నచ్చడం లేదు. భరత్.. టేప్ రికార్డర్లో వినిపించేదంతా శ్రద్ధగా విన్నాడు. సూసైడ్ నోట్ అయిపోగానే బుల్లెట్ బయటకొచ్చిన శబ్దం వినిపించింది. ‘‘ఇది ఆత్మహత్య కాదు. హత్య’’ అన్నాడు భరత్. అతడి టీమ్ అంతా వింతగా చూస్తూ నిలబడింది. రాజ్ ఏడుస్తూ.. ‘‘అయ్యో! ఆత్మహత్య చేసుకునే అవసరం ఏమొచ్చిందిరా?’’ అంటూ అప్పుడే ఇంట్లోకి వచ్చాడు. భరత్‌కు వెంటనే రాజ్‌ను విచారించాలన్న ఆలోచన వచ్చింది. అసలు శ్రీరామ్ది ఆత్మహత్య కాదు, హత్య అని భరత్ ఎలా గ్రహించాడు? జవాబు: శ్రీరామ్ స్వయంగా టేప్ రికార్డర్లో తన సూసైడ్ నోట్‌ను రికార్డు చేసి ఉంటే, ఆ క్యాసెట్ మొదట్నుంచీ ప్లే అయ్యే అవకాశమే లేదు. చనిపోయిన వ్యక్తి రివైండ్ చేయడమైతే కుదరని పని. కాబట్టి ఎవరో ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశారని భరత్ అంచనాకు వచ్చేశాడు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్ కలకలం
రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్ కలకలం రేగింది. హైదరాబాద్ నుంచి లక్నో వెళ్తున్న సతీష్ కుమార్ అనే ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభించింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లక్నో వెళ్తున్న సతీష్ లగేజీలో బుల్లెట్ ఉన్నట్లు గుర్తించిన ఎయిర్పోర్ట్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సతీష్ నగరంలోని ఎల్బీ నగర్ వాసిగా గుర్తించారు. బుల్లెట్ సైజ్ 7.65 ఎమ్ఎమ్గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
బుల్లెట్ దిగింది..! 67 రోజులు బతికాడు
పాయింట్ బ్లాంక్ మీద గన్పెడితే అవతలి వ్యక్తి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటాడు. ఎందుకంటే గురి తప్పదు.. క్షణాల్లో తలకాయ పుచ్చకాయలా పగిలిపోతుంది. ఒక్కసారి బుల్లెట్ తలలోకి వెళ్లిందంటే ఆ వ్యక్తి బతికి బట్టకడుతాడని ఎవరూ ఊహించరు. కానీ, ఓ వ్యక్తి తలలోకి బుల్లెట్ దూసెకెళ్లినా అతనికి ఏమీ కాలేదు. తలలో బుల్లెట్ దిగిన రెండునెలల తర్వాత కానీ అతను మరణించలేదు. తలలో బుల్లెట్ ఉన్నప్పటికీ ఆయన తనరోజువారీ కార్యకలాపాలలో ఎలాంటి అవాంతరాలు చోటుచేసుకోలేదు. అన్ని రోజులు ఎలా బతికి ఉన్నాడో వైద్యులకు సైతం అంతుచిక్కలేదు. మరి ఆ విశేషాలేంటో ఈ రోజు తెలుసుకుందామా.....! ఐర్లాండ్‌లో పుట్టిన కాన్ స్టాప్లెటన్ 1872లో న్యూయార్క్‌లో అడుగుపెట్టాడు. 1876లో అక్కడ మార్షల్ ఉద్యోగాన్ని సంపాదించాడు. విధి నిర్వహణలో స్టాప్లెటన్ అంకితభావంతో పనిచేసేవాడు. డేవిడ్ లంట్ స్టాప్లెటన్ ఇద్దరు మంచి స్నేహితులు. లంట్ కూడా చాలా మంచివాడని, నెమ్మదస్తుడని అందరూ అంటుండేవారు. అతిని చుట్టుపక్కలవారు లంట్ను ఎక్కువగా ఇష్టపడుతుండేవారు. ఒకరోజు హత్యకేసులో నిందితుడైన హరీ విలియమ్స్‌కు కోర్టు 20 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. అతన్ని జైలుకు తరలిస్తుండగా తప్పించుకున్నాడు. మార్షల్ స్టాప్లెటన్ ఈ విషయాన్ని కెప్టెన్ హర్దిక్‌కు తెలియజేశాడు. అతని సాయంతో రెండురోజుల తర్వాత ఒక క్యాబిన్లో తలదాచుకుంటున్న విలియమ్స్‌ను స్టాప్లెటన్ అరెస్టు చేసి జైలుకు తరలించాడు. పెనుగులాట... కొన్ని రోజుల తర్వాత అనగా 14 జనవరి 1877న స్టాప్లెటన్, డెవిడ్ లంట్, మరికొద్ది మంది కలిసి ఒక సెలూన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. స్నేహితులు అందరూ కలిసి సెలూన్లో కూర్చొని కూల్‌డ్రింక్‌లు తాగుతూ సంభాషించుకోవడం వారికి అలవాటే. ఇంతలోనే సెలూన్ డోర్ పగులకొట్టుకుంటూ ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. సెలూన్ లోపలికి వచ్చిన విలియవస్ సహచరుడు టామ్ స్మిత్... ఎవరైనా కదిలితే కాల్చి పడేస్తానని బెదిరించాడు. స్టాప్టెటన్ దగ్గరికి వెళ్లిన స్మిత్ అతని నుదుటిపై రివాల్వర్‌ను పెట్టాడు. ఇది చూసిన డెవిడ్ లంట్ బిగ్గరగా అరుచుకుంటూ స్మిత్ దగ్గరికి వెళ్లి ఆపేందుకు ప్రయత్నించాడు. స్టాప్లెటన్, స్మిత్, డేవిడ్ లంట్ ముగ్గురి పెనుగులాటలో రివాల్వర్ పేలింది. ఆ రివాల్వర్ నుంచి వెళ్లిన బుల్లెట్ నేరుగా డేవిడ్ లంట్ తలలోకి వెళ్లింది. అయితే అక్కడున్నవారంతా డేవిడ్ చనిపోతాడని భావించారు. ఏకంగా తలలోకే బుల్లెట్ దూసుకెళ్లడంతో అతడు బతకడం అసాధ్యమని అక్కడున్న వారందరూ భావించారు. కానీ, ఆయన ఎలాంటి స్పృహ తప్పకపోవడంతో బుల్లెట్ ఆయనకు తగలలేదని అనుకున్నారు. బహుశా.. అది డేవిడ్ తలను రాసుకుంటూ ఎటోవెళ్లిపోయి ఉంటుందని, అందుకే డేవిడ్ బతికి బట్టగలిగాడని ఎవరికి వారు సమాధాన పరుచుకున్నారు. అందుకే, స్నేహితులంతా కలిసి డేవిడ్‌కు ప్రాథమిక చికిత్స చేయించారు. స్మిత్‌ను... అరెస్టుచేసి కోర్టులో హజరుపరుచారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అతన్ని కోర్టు నిందితుడిని విడుదల చేసింది. 67 రోజుల తర్వాత... నిజానికి సెలూన్లో జరిగిన కాల్పుల్లో డెవిడ్ లంట్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. బుల్లెట్ తగిలినా.. డెవిడ్ కుప్పకూలలేదు. తీవ్ర రక్తస్రావం జరగలేదు. కనీసం స్పృహ కూడా తప్పలేదు. చిన్నగాయం తగిలినంత నొప్పే తప్పా.. ఎలాంటి ఇబ్బంది డేవిడ్‌కు కలగలేదు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులకు కూడా డేవిడ్ తలలో బుల్లెట్ ఉందన్న అనుమానం రాలేదు. పైగా డేవిడ్ తన రోజువారీ కార్యకలాపాలకు వెళుతుండటంతో డేవిడ్‌కు కూడా ఎలాంటి సందేహం కలగలేదు. సెలూన్ దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత డెవిడ్కు తలనొప్పిరావటం మొదలైంది. చిన్నగా మొదలైన నొప్పి భరించలేని స్థాయికి చేరడంతో ఆసుపత్రికి వెళ్లాడు. ఆయనను పరీక్షించిన వైద్యులు తలలో బుల్లెట్ ఉందన్న విషయాన్ని గమనించారు. ఈ తీవ్రమైన తలపోటుకు బుల్లెట్టే కారణమని డాక్టర్లు ధృవీకరించారు. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. 1877 మార్చి 22న అంటే.. దాడి జరిగిన 67 రోజుల తర్వాత డేవిడ్ లంట్ ప్రాణాలు విడిచాడు. అర ఇంచు రంధ్రం చేసిన బుల్లెట్ డెవిడ్ మృతదేహానికి డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. దాడి జరిగిన రోజున ఆయన తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్ పుర్రెకు అరఇంచుమేర, మెదడుకు సమీపంలో రంధ్రం చేసిందని డాక్టర్లు గుర్తించారు. దానివల్ల ఇన్ఫెక్షన్ మొదలై.. చీము ఏర్పడి ఆ ప్రాంతమంతా కుళ్లిపోయేలా చేసింది. దాంతో డేవిడ్ మరణించినట్లు డాక్టర్ల పరిశోధనలో తేలింది. బుల్లెట్ తలలోకి దూసుకెళ్లిన ఇన్నాళ్లు ఎలా బతికున్నాడని డాక్టర్లుకు సైతం అంతు చిక్కలేదు. ఇలా జరగడం వైద్య చరిత్రలో ఎన్నడూ లేదని డాక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆ రోజున కోర్టు విడుదల చేసిన డేవిడ్‌ను హత్యకేసులో మళ్లీ అరెస్టు చేశారు. కోర్టు అతన్ని నేరస్తుడిగా పరిగణిస్తూ శిక్ష విధించింది.– సాక్షి స్కూల్ ఎడిషన్ -
'చైనాపై ఒక్క బుల్లెట్ కూడా పేల్చలేదు'
సెయింట్ పీటర్స్బర్గ్: తీవ్ర సరిహద్దు వివాదం ఉన్నా గత 40 సంవత్సరాల్లో చైనా సరిహద్దులో ఒక్క బుల్లెట్ కూడా పేల్చలేదని భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రష్యా పర్యటనలో భాగంగా ఆయనపై వ్యాఖ్యలు చేశారు. ఓబీఓర్ ప్రాజెక్టు భారత్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని చెబుతూ కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై ఎదురైన ప్రశ్నకు 'చైనాతో మాకు సరిహద్దు వివాదం ఉన్న మాట నిజమే. కానీ గత 40 ఏళ్లుగా సరిహద్దు వివాదం కారణంగా ఒక్క బుల్లెట్ కూడా పేలలేదు' అని సెయింట్ పీటర్స్బర్గ్ ఎకనమిక్ ఫోరమ్‌లో మోదీ సమాధానమిచ్చారు. ఒకప్పటిలా అమెరికా పంచనో లేక సోవియట్ యూనియన్ పంచనో దేశాలు చేరే కాలం పోయిందని అన్నారు. నేడు ప్రతి దేశం మిగిలిన ప్రపంచదేశాలతో సత్సంబంధాలను కోరుకుంటోందని చెప్పారు. కొద్ది దేశాలతో సమస్యలు ఉన్నా సంబంధాలు మాత్రం చెడిపోవడం లేదని అన్నారు. అందుకు వ్యాపార ధోరణేనని చెప్పారు. భారత్-రష్యాల మధ్య ఉన్న సంబంధం నమ్మకంతో కూడుకున్నదని చెప్పారు. ఎన్నో కఠిన సమయాల్లో కూడా ఈ సంబంధం చెడిపోలేదని తెలిపారు. భారత్-రష్యాల మధ్య కుదిరిన సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ గురించి ప్రస్తావిస్తూ.. ఒప్పందంలో ఉన్న ప్రతి అక్షరాన్ని ప్రపంచదేశాలు పరిగణలోకి తీసుకుంటాయని తనకు తెలుసునని అన్నారు. -
ఐదు తూటాలు ‘మిస్సింగ్’!
⇒బీహార్‌లో తుపాకీ, ఆరు తూటాలు కొనుగోలు చేసిన అక్రమ్ ⇒గురువారం పోలీసులకు దొరికింది ఒక తూటానే ⇒మిగిలినవి హత్యల కోసం వాడినట్లు అనుమానం ⇒హైదరాబాదీ పాత్రపై దర్యాప్తు సిటీబ్యూరో: రాజస్థాన్‌కు చెందిన వ్యాపారి నుంచి రూ.20 లక్షలు రంగురాళ్లు చోరీ చేసిన ధీరజ్‌సింగ్ అలియాస్ అక్రమ్ భాయ్ వద్ద ఉండాల్సిన ఐదు తూటాలు మిస్ అయ్యాయి. అటెన్షన్ డైవర్షన్ చేయడంలో ప్రత్యేక పంథాను అనుసరిస్తున్న అక్రమ్ గ్యాంగ్‌ను దక్షిణ మండల పోలీసులు గురువారం అరెస్టు చేసిన విషయం విదితమే. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న చార్మినార్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్రమ్ నుంచి ఒక తూటా, తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. వాస్తవానికి ఇతడు బీహార్‌లో ఆరు తూటాలు ఖరీదు చేయగా, మిగిలినవి ఏమయ్యాయనే కోణంలో ఆరా తీస్తున్నారు. ‘మాల్’ను ఇట్టే గుర్తుపట్టేస్తారు... ఉత్తరాదిలోని వివిధ చెందిన ఆరుగురితో ముఠా ఏర్పాటు చేసిన అక్రమ్ భాయ్ ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఢిల్లీ, మహారాష్ట్రతో పాటు కర్ణాటక రాష్ట్రంలోనూ వీరు పలు నేరాలకు పాల్పడ్డారు. వీరు ఏ నగరంలో అడుగుపెట్టినా హోటల్/లాడ్జ్/అద్దె ఇంట్లో బస చేసి, వరుసగా ఐదారు నేరాలు చేసి పత్తా లేకుండా పారిపోతారు. ఆయా నగరాల్లో బంగారం, వజ్రాలు, రంగురాళ్ల వ్యాపారం జరిగే ప్రాంతాల్లో కాపుకాసే ఈ ముఠా... విలువైన వస్తువులు, డబ్బుతో వస్తున్న వారిని ఇట్టే గుర్తుపట్టి టార్గెట్ చేస్తుంది. ఈ నెల 20న ముంబై నుంచి సిటీ నుంచి బయలుదేరిన ఈ గ్యాంగ్ మార్గమధ్యంలో 21న బెంగళూరులో ఆగి అక్కడో నేరం చేసింది. అదే రోజు బయలుదేరి 22న సిటీకి చేరుకుంది. లక్డీకాపూల్‌లోని హిల్‌పార్క్ ఇన్ హోటల్ గదితో పాటు ఉప్పర్‌పల్లిలో ఇంటిని అద్దెకు తీసుకుంది. ఖరీదు చేసింది ఆరు తూటాలు... అక్రమ్ భాయ్ స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని. అక్కడ తన పూర్వీకుల భూమికి సంబంధించి వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థుల్ని బెదిరించేందుకుగాను ఓ తుపాకీ ఖరీదు చేయాలని నిర్ణయించుకున్నాడు. గత ఏడాది బీహార్ వెళ్లిన అక్రమ్ హాజీపూర్‌కు చెందిన సంజయ్ కుమార్‌ను సంప్రదించాడు. రూ.35 వేలతో అతడి నుంచి నాటు తుపాకి, ఆరు తూటాలు ఖరీదు చేశాడు. ఈ తుపాకీ చూపి బెదిరించి తన భూమిని సొంతం చేసుకున్నాడు. గురువారం పోలీసులు అరెస్టు చేసిన సందర్భంలో అక్రమ్ దగ్గర తుపాకీతో పాటు ఒక తూటానే లభించింది. మిగిలిన ఐదింటినీ ఏ నేరంలో వాడాడనేది అంతుచిక్కట్లేదు. నిందితుడు ప్రాక్టీస్ చేయడానికి వాటిని వాడానని చెప్తున్నా, ఇతడి నేర చరిత్రను దృష్టిలో ఉంచుకుని నేరాల కోసమే వాడినట్లు అనుమానిస్తున్నామని డీసీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. అక్రమ్ గ్యాంగ్ నాలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో నేరాలు చేసినట్లు భావిస్తున్నామన్నారు. రషీద్‌కు తెలిసే సహకరించాడా? ఈ గ్యాంగ్ సంజయ్ కుమార్ షా నుంచి తస్కరించిన రంగురాళ్లను ఉప్పర్‌పల్లిలోని డెన్లోనే పంచుకుంది. తన వద్ద ఉన్న వాటిని విక్రయించడం కోసం అక్రమ్ ప్రయత్నాలు చేశాడు. తన రెండో భార్యకు పరిచయస్తుడైన చంద్రాయణగుట్ట వాసి రషీద్‌కు వాటిని ఇచ్చి మార్కెట్లో విలువ కనుక్కుని, మంచి రేటుకు అమ్మమని చెప్పాడు. తొలుత కొన్ని దుకాణాలు తిరిగిన రషీద్ ఆ రాళ్లను చూపించగా... ఎక్కడా రూ.2 వేల నుంచి రూ.3 వేలకు మించి రేటు పలకలేదు. ఇదే విషయాన్ని అక్రమ్‌కు చెప్పగా... తానూ వస్తానంటూ బుధవారం రాత్రి చార్మినార్ ఠాణా పరిధిలో ఉన్న ఆకాష్ అగర్వాల్ దుకాణం వద్దకు చేరుకున్నాడు. అప్పటికే చార్మినార్ పోలీసులు చోరీ, ఆ రాళ్ల వివరాలను అందరు వ్యాపారులకు వివరించారు. దీంతో అది చోరీ సొత్తుగా గుర్తించిన ఆకాష్ అగర్వాల్ దుకాణదారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వీరిద్దరూ చిక్కారు. విచారణలో మిగిలిన వారి వివరాలు వెలుగులోకి రావడంతో పట్టుకున్నారు. రషీద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడికి చోరీ సొత్తని తెలిసి సహకరించాడా? తెలియకుండా చేశాడా? అన్నదానిపై ఆరా తీస్తున్నారు. నగర యువతితో రెండో వివాహం.. ఉప్పర్‌పల్లికి చెందిన ఓ మహిళ తన సోదరిని కలవడానికి ముంబై వెళ్తుండేది. ఈ నేపథ్యంలో అక్రమ్ భాయ్‌తో ఈమెకు పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారడంతో అక్రమ్ ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లు ముంబైలోనే ఉన్న ఈ యువతి ప్రస్తుతం ఉప్పర్‌పల్లిలో నివసిస్తోంది. చార్మినార్ ఠాణా పరిధిలోని పత్తర్‌గట్టీ కమాన్ ప్రాంతంలో జైపూర్ వాసి సంజయ్ కుమార్ షా నుంచి ఈ నెల 23న రూ.20 లక్షలు విలువైన రంగురాళ్లు ఉన్న బ్యాగ్‌ను తస్కరించిన అక్రమ్ గ్యాంగ్ అదే రోజు అఫ్జల్‌గంజ్ పరిధిలో మరో వ్యక్తి నుంచి నగదు ఉన్న బ్యాగ్ అపహరించింది. గ్యాంగ్ సభ్యులు హోటల్లో ఉంటుండగా... అక్రమ్ ఉప్పర్‌పల్లిలో భార్య వద్దే ఉండేవాడు. -
అక్రమంగా దాచిన తుపాకి స్వాధీనం
ఆత్మకూరురూరల్: మండల పరిధిలోని నల్లకాల్వ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి ఆత్మకూరు పోలీసులు బుధవారం నాటు తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మకూరు సీఐ కృష్ణయ్యకు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ వెంకటసుబ్బయ్య నల్లకాల్వలో అనుమానితుడి ఇల్లు సోదా చేశారు. ఈ సోదాలో కంచుతో చేసిన తుపాకి లభ్యమైనట్లు తెలిసింది. దీనితో ఒక తూటా మాత్రమే పేల్చడానికి వీలుంటుందని తెలిసింది. కాగా తుపాకిని దాచిన వ్యక్తి..దాన్ని తనకు ఓ గిరిజనుడు అమ్మి పెట్టమని ఇచ్చాడని పోలీసులతో చెప్పినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా పోలీసులు.. నిందితుడిని పూర్తిగా విచారించి గురువారం అరెస్టు చూపే అవకాశం ఉంది. -
చిన్నగాటుతో కాలేయం సమీపంలోని బుల్లెట్ తొలగింపు
సోమాలియావాసికి అపోలో ఆస్పత్రిలో చికిత్స..డిశ్చార్జ్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అపోలో ఆస్పత్రి వైద్యులు ఓ వ్యక్తి కాలేయం సమీపంలో ఉన్న బుల్లెట్‌ను చిన్నగాటుతో విజయవంతంగా తొలగించారు. సర్జరీ చేసిన 24 గంటల్లోనే బాధితుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యులు సోమవారం మీడియాకు విడుదల చేశారు. సోమాలియా దేశానికి చెందిన మహమూద్(50)కు తొమ్మిది నెలల క్రితం బుల్లెట్ గాయమైంది. అది ఛాతీ నుంచి దూసుకెళ్లి కాలేయం సమీపంలో ఉండిపోయింది. స్థానిక ఆస్పత్రిలో వైద్యులు చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. కానీ, ఛాతీలో ఉన్న బుల్లెట్‌ను తీయలేకపోయారు.అప్పటి నుంచి అతడు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం ఇటీవల హైదరాబాద్ అపోలోలోని కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పి.శివచరణ్‌రెడ్డిని సంప్రదించాడు. తక్కువ కోత(0.5 సెంటీమీటర్లతో కూడిన రెండు చిన్న రంధ్రాలు)తో బుల్లెట్‌ను విజయవంతంగా బయటికి తీశారు. సాధారణంగా ఇలాంటి చికిత్సల్లో ఛాతీపై 15–20 సెంటీమీటర్ల గాటు పెట్టి సర్జరీ చేయాల్సి ఉంటుంది. కానీ, అపోలో వైద్యులు అధునాతన ల్యాప్రోస్కోపిక్ చికిత్స ద్వారా ఛాతీలోని బుల్లెట్‌ను బయటికి తీశారు. ‘ఈ తరహా చికిత్స వల్ల ఛాతీపై తక్కువ గాటు, తక్కువ రక్తస్రావం ఉంటాయి. నొప్పి, ఇన్ఫెక్షన్ వంటివి ఉండవు. రోగి త్వరగా కోలుకుంటారు.’ అని డాక్టర్ శివచరణ్‌రెడ్డి తెలిపారు. -
ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం
హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ యువకుడి వద్ద బుల్లెట్ లభించటం శుక్రవారం కలకలం సృష్టించింది. హైదరాబాద్‌కు చెందిన నాగ మురళి అమెరికా వెళ్లేందుకు వచ్చాడు. అతడిని ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేయగా ఒక బుల్లెట్ లభించింది. దీంతో అతడిని వెంటనే పోలీసులకు సరెండర్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అతడిని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గత నెలలో రవికుమార్ అనే వ్యక్తి కూడా కువైట్ కు వెళుతూ బుల్లెట్లతో పట్టుబడిన విషయం తెలిసిందే. -
గోపీచంద్ టైటిల్ బలం కాదు బుల్లెట్..?
మాస్ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ జనరేషన్ యాక్షన్ హీరో గోపీచంద్. ఇటీవల స్టైలిష్ క్యారెక్టర్లతో ఆకట్టుకుంటున్న ఈ మ్యాన్లీ స్టార్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న స్టైలిష్ ఎంటర్టైనర్తో పాటు, ఏఎమ్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆక్సిజన్ సినిమా షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బి గోపాల్ చిత్రాన్ని కూడా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలో రమేష్ నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. దీపావళి సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న చిత్ర యూనిట్ టైటిల్ వేటలో బిజీగా ఉంది. ముందుగా బలం అనే టైటిల్ ఫిక్స్ చేసినా.. ప్రస్తుతం బుల్లెట్ లేదా ఆరడుగుల బుల్లెట్ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారట. త్వరలోనే టైటిల్‌ను ఫైనల్ చేసి దీపావళికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. -
లేడీ సింగమ్ సవారీ!
అది చెన్నైలోని ఓ రోడ్. తెల్లవారుజాము కావడంతో పెద్దగా రద్దీగా లేదు. స్టార్ కపుల్ సూర్య, జ్యోతికలు ఆ రోడ్ మీదున్నారు. వచ్చే పోయేవాళ్లు ఈ జంటను ఆసక్తిగా చూడటం మొదలుపెట్టారు. బ్రాండ్ న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ మీద లేడీ సింగమ్లా జ్యోతిక సవారీ చేస్తున్నారు. జ్యోతికకు బండి నడపడం వచ్చా.. వంటి సందేహాలు అవసరం లేదు. పక్కనున్న దర్శకుడు ఎవరనుకున్నారు? సింగమ్ సూర్య. బండి ఎలా నడపాలో దగ్గరుండి మరీ శ్రీమతికి ట్రైనింగ్ ఇస్తున్నారు. జ్యోతిక ఇంటిలిజెంట్ స్టూడెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే సునాయాసంగానే నేర్చేసుకున్నారు. రయ్.. రయ్.. మంటూ జ్యోతిక సవారీ చేస్తుంటే, ఆమెను గమనిస్తూ సూర్య వెనకాలే నడుచుకుంటూ వెళ్లారు. శ్రీమతి ముచ్చటపడిందని సూర్య బైక్ రైడింగ్ నేర్పారో? లేదా ఏదైనా కొత్త సినిమా కోసం జ్యోతిక ట్రైనింగ్ తీసుకున్నారో? త్వరలోనే తెలుస్తుంది. ఆ విషయం పక్కన పెడితే.. సూర్య, జ్యోతికలు ఎంత హ్యాపీ కపుల్ అనేది ఈ ఫొటోలు చూస్తే అర్థమవుతోంది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సోమవారం ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ దొరకడం కలకలం సృష్టించింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఈరోజు ఉదయం కువైట్ వెళ్తున్న ముషీర్ అహ్మద్ అనే వ్యక్తిని తనిఖీలు చేయగా బుల్లెట్ బయటపడింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ముషీర్ అహ్మద్ నగరంలోని పాతబస్తీ తలాబ్‌కట్టకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
బుల్లెట్ ఫైరింజన్
కృష్ణాపుష్కరాల సందర్భంగా శ్రీశైలంలో అగ్నిమాపకదళ సిబ్బంది ఏర్పాటు చేసిన అత్యాధునిక బుల్లెట్ ఫైరింజన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీని గురించి జిల్లా అగ్నిమాపక అధికారి భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ‘దీనిని మిస్ట్ బుల్లెట్‌గా పిలుస్తారు. జిల్లాలో ఇలాంటివి రెండు ఉన్నాయి. ఎక్కడైనా చిన్న సందుల్లో అగ్ని ప్రమాదం జరిగితే ఈ బైక్‌పై వేగంగా వెళ్లి మంటలను అదుపు చేస్తోంది. బైక్ వెనుక భాగంలో రెండు సిలిండర్లు అమర్చబడి ఉంటాయి. ఒకSసిలిండర్‌లో తొమ్మిది లీటర్ల నీరు, మరొ సిలిండర్‌లో ఫోమ్ (సబ్బు నురుగు) ఉంటుంది. మొదటి సిలిండర్‌లో ఉన్న నీటితో గుడిసెలు, గడ్డివాములు దగ్ధమైనప్పుడు ఒక చుక్క నీరు 1600 బిందువులుగా విడిపోయి మంటలను అదుపు చేస్తోంది. పెట్రోల్, డీజీల్ వంటి అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఫోమ్ చల్లడంతో అక్కడ పొర ఏర్పడి ఆక్సిజన్ లేకుండా చేసి మంటలు వ్యాపించకుండా చేస్తోంది. – శ్రీశైలం (బండి ఆత్మకూరు) -
ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్ కలకలం
శంషాబాద్: శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఓ ప్రయాణికుడి దగ్గర బుల్లెట్ కనిపించడం కలకలం రేగింది. నాగాలాండ్ నుంచి వచ్చిన విద్యార్థిని భద్రతా సిబ్బంది తనిఖీ చేయగా బుల్లెట్ లభించింది. దీంతో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ప్రయాణికుడి వివరాలు, ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం
శంషాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభించటం సోమవారం కలకలం రేపింది. దుబాయి నుంచి విమానంలో వచ్చిన కృష్ణప్రసాద్ అనే వ్యక్తిని భద్రతాసిబ్బంది తనిఖీ చేయగా 9 మిమీ బుల్లెట్ లభ్యమైంది. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కృష్ణప్రసాద్ స్వస్థలం విశాఖపట్టణం అని సమాచారం. -
బుల్లెట్ ట్రైన్ కు ట్రయిల్ రన్!
బరేలి : హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కల త్వరలో సాకారం కానుంది. ఇండియన్ రైల్వే అందుకోసం మరో అడుగు ముందుకేసింది. ఇజత్ నగర్, భోజీపురా స్టేషన్ల మధ్య శనివారం స్పానిష్ కు చెందిన టాల్గో కంపెనీ హైస్పీడ్ రైలు కోచ్ లకు సెన్సార్ ట్రయల్ నిర్వహించింది. ట్రయల్ రన్ లో భాగంగా సూపర్ లగ్జరీ కోచ్ లను ఇండియన్ ఇంజన్ తో పట్టాలపై నడిపించినట్లు అధికారులు తెలిపారు. బుల్లెట్ లా దూసుకుపోయే హైస్పీడ్ రైలు దేశంలో అతి త్వరలో పట్టాలెక్కనుంది. (చదవండి...మనకూ స్పానిష్ హైస్పీడ్ రైలు) టాల్గో కంపెనీ ఈ కోచ్ లను సుమారు 30 ఏళ్ళ క్రితం తయారు చేసింది. ఇప్పటివరకూ తజకిస్తాన్ తో సహా 12 దేశాల్లో ట్రయల్ నిర్వహించి సక్సెస్ అయ్యింది. అనేక సెన్సార్ల ఆధారంగా నడిచే కోచ్ లు సరైన రీతిలో పనిచేస్తున్నాయా లేదా తెలుసుకునేందుకు రైల్వే బోర్డ్ మెకానికల్ ఇంజనీర్ సెన్సార్ ట్రయల్ నిర్వహించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఆదివారం బరెలీ నుంచి మొరాదాబాద్ వరకూ ప్రారంభించే బోగీల స్పీడ్ ట్రయల్ జూన్ 12 వరకూ కొనసాగుతుందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ప్రస్తుత ట్రయల్ సందర్భంలో ఈ కోచ్ లు గంటకు 115 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయని, త్వరలో న్యూఢిల్లీ ముంబై మార్గంలోని మధుర పాల్వాల్ సెక్షన్ లో జరిగే ట్రయల్ రన్ లో గంటకు 180 నుంచి 200-220 కిలోమీటర్ల వేగంతో నడిచే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం నిర్వహించిన కోచెస్ సెన్సార్ ట్రయల్ విజయవంతమైందని ఈశాన్య రైల్వే ఇజత్ నగర్ డివిజన్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రాజేంద్ర సింగ్ తెలిపారు. బుధవారం రైల్వే బోర్డులోని ముగ్గురు సభ్యుల బృదం వర్క్ షాప్ కు చేరుకొని, టాల్గో కోచెస్ కు సంబంధించిన వివరాలను అందించిందని, అనంతరం స్పానిష్ టీమ్ దానికి సంబంధించిన ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు, కోచ్ లలోని ప్రతి వస్తువుకు చెందిన పూర్తి సమాచారాన్ని విపులంగా వివరించినట్లు రాజేంద్ర సింగ్ తెలిపారు. -
బుల్లెట్ దిగిన సోయి కూడా లేదు
రాయ్కడ్: ముళ్లు గుచ్చుకుంటేనే అబ్బా అని గట్టిగా అరిచి దాన్ని తీసేస్తాం.. గాయమైందేమో చూసుకుంటాం. అలాంటిది తన బాడీలోకి బుల్లెట్ దిగినప్పటికీ అసలు ఆ విషయమే గుర్తించలేదంటే ఎలా ఉంటుంది. కనీసం రక్తం కారుతున్న విషయంగానీ, గాయమైన విషయంగానీ తెలుసుకోలేకపోతే పరిస్థితి ఏమిటి? గుజరాత్లో మహిళకు ఈ అనుభవాన్ని చూసింది. ఆమె విషయంలో జరిగిన ఈ ఘటన అటు వైద్యులకు, పోలీసులకు ఒక పెద్ద మిస్టరీగా మారింది. ఈ వివరాలు ఒకసారి పరిశీలిస్తే.. అసలేం జరిగింది? గుజరాత్‌లోని రాయ్ ఖడ్ ప్రాంతానికి చెందిన హన్సా చౌదరీ అనే 28 ఏళ్ల మహిళ నిద్రలో ఉండగా సడెన్‌గా ఛాతీ నొప్పి మొదలైంది. దీంతో ఆమెకు గుండెపోటు వచ్చిందనుకొని ఆస్పత్రిలో చేరింది. ఆ రాత్రికి ప్రాథమిక పరీక్షలతోపాటు ఈసీజీ తీసిన వైద్యులు గుండెపోటు కాదని తేల్చి చెప్పారు. అయితే, పరిశీలించేందుకు ఒకరోజు ఆస్పత్రిలో ఉండమన్నారు. మరుసటి రోజు ఉదయం ఆస్పత్రిలోనే స్నానం చేసేందుకు ఆమె వెళ్లిన ఆమె తన ఛాతీ కుడివైపు భాగంలో చిన్నరంధ్రంలాంటిదాంట్లో నుంచి రక్తం కారుతుందని వైద్యులకు తెలిపింది. దీంతో వైద్యులు ఆమెకు ఎక్స్ రే తీశారు. దీంతో ఆమె ఛాతీలో ఏదో వస్తువు ఉన్నట్లు గుర్తించారు. దీంతో రేడియాలజిస్ట్‌ను సంప్రదించి ఆమెకు హెఆర్ సీటీ థరాక్స్ టెస్ట్ చేశారు. ఈ పరీక్షలో ఆమె ఛాతీలో బుల్లెట్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వైద్యులకు షాక్.. పోలీసులకు మిస్టరీ తొలుత ఛాతీ నొప్పి అని చెప్పి ఆస్పత్రిలో చేరిన ఆమెకు బుల్లెట్ దిగిందని, ఆ విషయం కనీసం ఆమెకు కూడా తెలియకుండా పోయిందని వైద్యులు షాక్ అయ్యారు. బుల్లెట్ తగిలినప్పుడు ఆమెకు అసలు చలనం లేకుండా ఉండటం ఎలా సాధ్యమైందని వారు ఆశ్చర్యపోతున్నారు. దాదాపు ఐదుగంటపాటు శ్రమించి ఆమె ఛాతీ నుంచి బుల్లెట్ తొలగించారు. కాగా, ఈ వివరాల ప్రకారం కేసు నమోదుచేసుకున్న పోలీసులకు ఈ కేసు మిస్టరీగా మారింది. అసలు ఆమె చాతీలోకి బుల్లెట్ ఎలా వచ్చింది? ఎవరు ఈ పనిచేశారు? బుల్లెట్ శరీరంలోకి దూసుకెళ్లినా మహిళకు కనీసం తెలియకపోవడం ఏమిటి? అని రకరకాల ప్రశ్నల్లో మునిగిపోయారు. ఆమె, భర్త ఏం చెబుతున్నారంటే.. 'నేను నా మూడేళ్ల కుమారుడు జయ్ దీప్ తో కలిసి నిద్రపోతున్నాను. సరిగ్గా 11.30గంటల ప్రాంతంలో ఛాతీనొప్పి వచ్చింది. నేను గుండెపోటు అని అనుకున్నాను. కాదని వైద్యులు చెప్పారు. స్నానం చేసేందుకు బ్లౌజ్ తీయగానే నాకు చిన్న గాయంలో నుంచి రక్తం కారుతుందన్న విషయం తెలిసింది. నేను షాక్ అయ్యాను. బహుషా ఎప్పటి నుంచో అది కారుతుందేమో.. కానీ అప్పటికే ఇంట్లో బాగా చెమటపట్టి కారుతుండటంతో నేను అది కూడా చెమటే అనే భ్రమలో ఉన్నాను. నా బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ కావడంతో రక్తాన్ని గుర్తించలేకపోయాను' -బాధితురాలు హన్సా చౌదరీ వాంగ్మూలం 'మా ఇంటిపక్కన వారి గోడ కూలిపోయి కొందరికి గాయాలు కావడంతో నేను వారితో ఆస్పత్రిలో ఉన్నాను. ఈ లోగా నా భార్యకు అనారోగ్యంగా ఉందని ఫోన్ చేస్తే వెంటనే మా ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొని వెళ్లి పరీక్షలు చేయించాను. ఆమె ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లిందని తెలిసి ఇప్పుడు ఆశ్చర్య పోతున్న' -బాధితురాలి భర్త జగదీశ్(ఆటో డ్రైవర్) -
బుల్లెట్ రూ. 2లక్షలు.. నంబరుకు రూ. 4.51 లక్షలు
నూజివీడు : వాహనదారులకు ఫ్యాన్సీ నంబర్లపై క్రేజ్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. రేటు ఎక్కువైనా సరే ఇష్టమైన నంబర్లను దక్కించుకుని అందరి దృష్టిని తమవైపు తిప్పుకొంటున్నారు. ఫ్యాన్సీ నంబర్లను స్టేటస్ సింబల్‌గా భావిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం కూడా దండిగానే వస్తోంది. నూజివీడులోని రవాణా యూనిట్ కార్యాలయంలో ఏపీ 16డీజీ 6666 నంబరుకు గురువారం బిడ్డింగ్ జరగ్గా రూ.4,51,832కు పట్టణ పరిధిలోని గొడుగువారిగూడేనికి చెందిన ఆకుల వెంకటరాజు దక్కించుకున్నారు. నంబరుకే ఇంత ధర పెడితే.. అదేదో ఆడి కారు అనుకోవడానికి లేదు.. బుల్లెట్ కోసం ఆయన ఈ నంబరు తీసుకున్నారు. 500 సీసీ బుల్లెట్ ధర రూ.2లక్షలు కాగా, నంబరుకే ఆయన రూ.4.51 లక్షలు కేటాయించడం ఆశ్చర్యమే. ఇదే నంబరు కోసం నూజివీడుకు చెందిన బి.వేణుగోపాలరావు రూ.2,65,750కు, బాపులపాడు మండలం మడిచర్లకు చెందిన సీహెచ్ అహల్య రూ.1.23లక్షలకు బిడ్ వేశారు. నూజివీడు రవాణా యూనిట్ కార్యాలయం చరిత్రలో అత్యధిక ధర పలికిన నంబరు ఇదే. -
ప్రతి బుల్లెట్ మీదా ఒక పేరు
కవర్ స్టోరీ జలియన్‌వాలా బాగ్ బ్లడ్ స్టోరీ ఏప్రిల్ 13 - జలియన్‌వాలా బాగ్ మారణకాండ జరిగిన దినం పసిపిల్లలు, పాలు మరువని శిశువులు, బాలింతలు, వృద్ధులు, వికలాంగులు అనే విచక్షణ లేకుండా, అసలు కారణమే లేకుండా కేవలం అధికార దురహంకారంతో డయ్యర్ జరిపించిన కాల్పులకు అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్ ప్రత్యక్ష సాక్షి. వందలాది మంది భారతీయుల ఉసురు తీసిన డయ్యర్ కూడా చివరిదశలో ఆ బుల్లెట్ దెబ్బకే కుప్పకూలిపోయాడు. అయితే అది తుపాకీ బుల్లెట్ కాదు. అంతరాత్మ అనే బుల్లెట్! జలియన్‌వాలా బాగ్‌లో తను చేసింది కరెక్టా కాదా అనే అంతర్మథనంతో సతమతమై, అనారోగ్యాల బారిన పడి, 62 ఏళ్ల వయసులో 1927లో అతడు మరణించాడు. అనేకసార్లు అతడికి స్ట్రోక్ వచ్చింది. కాళ్లూ చేతులూ చచ్చు పడిపోయాయి. మాట పడిపోయింది. మెదడులో రక్తనాళాలు చిట్లిపోయాయి. చివరికి గుండెపోటుతో చనిపోయాడు. ‘‘ఆ రోజు అమృత్‌సర్‌లో నేను చేసింది ‘సరైన పనే’ అనేవారు ఉన్నారు. ‘కాదు. తప్పు పని చేశాడు’ అనేవారూ ఉన్నారు. నేను చేసింది కరెక్టా కాదా అని ఆ దేవుడిని అడిగేందుకు నేను నా మరణం కోసం నిరీక్షిస్తున్నాను’ అని డయ్యర్ అన్నట్లు ‘ది బుచర్ ఆఫ్ అమృత్సర్ : జనరల్ రెజినాల్డ్ డయ్యర్’ గ్రంథంలో నిగెల్ కొలెట్ రాశారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ‘కాలం’ అనే సాక్షిని అడుగుదాం. 1919 ఏప్రిల్ 13... ఆదివారం. బైశాఖీ పర్వదినం. పంజాబీలకు సంవత్సర ఆరంభం. తూర్పు, పడమర.. ఉత్తరం, దక్షిణం... దేశంలోని నాలుగు దిశలూ అప్పుడప్పుడే చిగురిస్తున్నాయి. ఏ వైపు చూసినా పచ్చని కచేరీలు. ఏ రాగాన్నీ మెచ్చని గడుసు కోయిలలు. అవి పాడిందే పాట. అవి తీసిందే రాగం మరి! నింగి తేటగా ఉండే కాలం కదా.. హరివిల్లులకు ఆ సమయంలో పెద్దగా పని ఉండదు. అన్నీ కిందికి వచ్చేస్తాయి. చిన్నారుల లేత పెదవులపై విరబూస్తాయి. దివిలోని పూలతోట ఎలా ఉంటుందో... భువిని చూస్తూ వైశాఖంలో ఊహించుకోవచ్చు. పంట చేతికి వచ్చి ఉంటుంది. పాట గొంతులో ఆడుతుంటుంది. పెద్దవాళ్లు పిల్లల్లో కలిసిపోతారు. అంతా ప్రకృతి బిడ్డల్లా పరవశించి ఆడిపాడుతారు. ఆ రోజు కూడా చిన్నా పెద్దా అందరూ ఇళ్లల్లోంచి వచ్చారు. కొత్త బట్టలు వేసుకుని వచ్చారు. కొత్త ఆశలతో కళకళలాడుతూ బంధుమిత్రులతో కలిసి వచ్చారు. ఒక్కొక్కరూ అమృత్‌సర్‌లోని ‘జలియన్‌వాలా బాగ్’కి చేరుకుంటున్నారు. బాగ్ అంటే తోట. అందులోనే ఆటలు, పాటలు. అందులోనే వన భోజనాలు. సూర్యుడు అలసిపోవాల్సిందే కానీ పంజాబ్ ప్రజల ఉల్లాసం చీకటి పడినా సరే.. ‘బల్లే బల్లే’మని సాగుతూనే ఉంటుంది. సిక్కులు, హిందువులు, ముస్లింలు.. ఆ రోజు అందరి మతమూ, అభిమతమూ ఒక్కటే. ఉల్లాసం... ఉత్సాహం. ఉదయం 9 గంటలు : నాలుగు భాషల్లో చాటింపు అమృత్సర్ లేవడమే పండగ కళతో లేచింది. కానీ ఆ కళలో ఏదో ఆందోళన. ఓ వ్యక్తి హడావుడి చేస్తున్నాడు. ఆ వ్యక్తి కల్నల్ రెజినాల్డ్ డయ్యర్. బ్రిటిష్ ఆర్మీ అధికారి. అమృత్‌సర్‌కు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు మిలిటరీ కమాండర్. ముందురోజు రాత్రి నుంచే అతడు.. ‘అనుమతి లేకుండా ఎవరూ ఊళ్లోకి రావడానికి లేదు. ఎవరూ ఊళ్లోంచి పోవడానికి లేదు’ అని ఆజ్ఞలు జారీ చేయించాడు. ‘పండగ చేస్కోండి. కానీ ఎవరికి వారే చేస్కోండి. బయట తిరక్కండి. బంధువులతో కలవకండి. ఊరేగింపులు జరపకండి. ముచ్చట్లు పెట్టకండి. చెట్ల కిందికి, రచ్చబండల కిందికి చేరకండి’ అని చాటింపు వేయించాడు. ఇంగ్లిష్‌లో, ఉర్దూలో, హిందీలో, పంజాబీలో.. వీధివీధికీ చెప్పించాడు. అయినా ప్రతి వీధిలోనూ ఇళ్లలోంచి బయటికి వస్తున్న మహిళలే, చిన్న పిల్లలే. డయ్యర్ డప్పు ఎంత మంది విన్నారో, ఎంతమందికి అర్థమయిందో! మధ్యాహ్నం 12 గంటలు : బాగ్‌లోకి డయ్యర్ మనుషులు అమృత్సర్ వీధుల్లో ఎవ్వరూ ఒకరుగా కనిపించడం లేదు! ఎక్కడ చూసినా గుంపులే. ఎటు చూసినా కోలాహలమే. డయ్యర్ గుండె దడదడమంది. ఒక శక్తిమంతమైన మిలిటరీ ఆఫీసర్.. సామాన్య జనాన్ని చూసి భయపడుతున్నాడంటే చేయకూడనిదేదో అతడు చేయబోతున్నాడనే! ఆ గుంపుల్లోకి మెల్లిగా తన మనుషుల్ని వదిలిపెట్టాడు డయ్యర్. వాళ్లంతా తెల్లచొక్కాల్లో ఉన్నారు. జనం ఏం మాట్లాడుకుంటున్నారో విని డయ్యర్‌కు చేరవేయడం వాళ్ల పని. కానీ వాళ్లు డయ్యర్ మెప్పు కోసం తప్పుడు సమాచారం అందించారు. జలియన్‌వాలా తోటలో ప్రభుత్వాన్ని కూల్చివేయబోయే కుట్ర జరగబోతోందని లేనిది కల్పించి చెప్పారు! మధ్యాహ్నం 2 గంటలు : తెరిచి ఉన్నది ఒకటే దారి వేలాదిమంది స్థానికులు హర్మందిర్ సాహిబ్ (ఇప్పటి స్వర్ణాలయం) దగ్గర్లో ఉన్న జలియన్‌వాలా బాగ్ చేరుకున్నారు. వాళ్లలో చాలామంది స్వర్ణాలయంలో ప్రార్థనలు ముగించుకుని వచ్చినవారు. అంతా నిరాయుధులు. అమాయకులు. భక్తులు. సామాన్య ప్రజలు. యువతీ యువకులు, స్త్రీలు, పిల్లలు. బాగ్‌లో వేడుకలయ్యాక ఎవరిళ్లకు వారు చేరుకోవలసినవారు. బాగ్ సువిశాల ప్రదేశం. ఆరేడు ఎకరాల స్థలం. చతురస్రాకారంలో 200 గజాల విస్తీర్ణం. బాగ్ బయట చుట్టూ ఇళ్లు, భవనాలు. బాగ్ చుట్టూ 10 మీటర్ల ఎత్తున ప్రహారీ గోడలు. ఐదు చోట్ల ఇరుకైన ద్వారాలు. ఆ రోజు మాత్రం ఒక ద్వారం తెరిచి ఉంది. మధ్యాహ్నం 2.30 గంటలు : వేడుకలు ముగించాలని ఆదేశం బాగ్‌లో నిత్యం ఆధ్యాత్మిక ప్రసంగాలు. ప్రవచనాలు. కష్టసుఖాల కలబోతలు. బాగ్ మధ్యలో సమాధులు. వాటి మధ్యలో 20 మీటర్ల వ్యాసంలో నీళ్లు ఉండీ లేనట్లుండే బావి. అప్పుడప్పుడూ బాగ్‌లో సంత కూడా జరుగుతుంది. రైతులు, వ్యాపారులు వస్తారు. పశువుల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి. అలా బాగ్ ఏళ్లుగా అమృత్సర్ సాంస్కృతిక కూడలి అయింది. మామూలు రోజుల్లోనే నిండుగా ఉండే బాగ్... పండగ రోజు నిండు పున్నమిలా ఉంటుంది. ఆరోజూ అలాగే ఉండాల్సింది కానీ.. అక్కడేదో జరగబోతోందని సిటీ పోలీసులకు అనుమానం రాగానే మధ్యాహ్నం రెండు కల్లా అందర్నీ బయటికి వచ్చేయమన్నారు. వచ్చినవారు వచ్చారు. మిగిలినవారు మిగిలారు. పండగ ఇంకా మొదలే కాలేదు.. మధ్యలో ముగుస్తుందని ఎవరనుకుంటారు? సాయంత్రం 4.30 గంటలు : బాగ్పైన విమానం చక్కర్లు డయ్యర్ పంపిన విమానం బాగ్ పైన ఒక రౌండ్ వేసి లోపల ఎంతమంది ఉన్నారో ఒక అంచనాకు వచ్చింది. ఇరవై ఇరవై ఐదు వేలు. పెద్ద మొత్తమే. ఆ సంగతి కల్నల్ డయ్యర్‌కి, అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ ఇర్విన్‌కి చేరింది. అంతమంది అక్కడ గుమిగూడతారని వారికి ముందే తెలుసు. అయితే అంతమంది గుమికూడకుండా ముందుగా వారేం చర్యలు తీసుకోలేదు. ఎంతమంది చేరతారు చేరనిద్దాం అన్నట్లు ఉండిపోయారు. బాగ్ లోపల సమావేశం నాలుగున్నరకు మొదలైంది. గంట తర్వాత గుట్టు చప్పుడు కాకుండా బాగ్ దగ్గరికి వచ్చాడు డయ్యర్. అతడితో పాటు తొంభై మంది సైనికులు ఉన్నారు. వాళ్లలో యాభై మంది దగ్గర రైఫిల్స్ ఉన్నాయి. నలభై మంది దగ్గర పిడిబాకులు ఉన్నాయి. వాళ్లంతా బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయులైన భారతీయ సైనికులు. సిక్కులు ఎక్కువగా ఉండే దళాల నుంచి కాకుండా వేరే రెజిమెంట్ల నుంచి రప్పించిన వాళ్లు. వాళ్ల వెనుక రెండు వాహనాల నిండా ఆయుధాలు. మెషీన్ గన్లు. బాగ్‌లోకి వాహనాలు పట్టేంత దారులు లేకపోవడంతో వాటిని బాగ్ బయటే నిలిపివేసి, సైనికులు ముందుకు కదిలారు. బాగ్ ద్వారాలన్నీ ఎప్పటిలా మూసే ఉన్నాయి. ప్రధాన ద్వారం ఒక్కటే తెరిచి ఉంది. మిగతావాటితో పోలిస్తే అది కొంచెం వెడల్పుగా ఉంటుంది. డయ్యర్‌తో పాటు వచ్చిన సాయుధ దళాలు, వాహనాలు ఆ ద్వారం బయట ఆగాయి. సాయంత్రం 4.30 - 5-30 మధ్య : ఆకస్మాత్తుగా కాల్పులకు ఆదేశం నిజానికైతే డయ్యర్ చేయవలసిన పని... లోపల ఉన్నవాళ్లందరినీ బయటికి వచ్చేయమని హెచ్చరించడం. కానీ అతడు ఆ పని చేయలేదు! పైగా లోపల ఉన్నవారు బయటికి వచ్చే ప్రధాన ద్వారపు తలుపులను మూసేయించాడు! ఆ తర్వాత కాల్పులు జరపమని సైనిక దళాలను ఆదేశించాడు. పది నిమిషాల పాటు ఆపకుండా కాల్పులు జరుపుతూనే ఉన్నాయి దళాలు. మొత్తం 1650 రౌండ్ల కాల్పులు జరిపినట్లు ఆ తర్వాత లెక్క తేలింది. కానీ కాల్పులలో మరణించివారి లెక్కే తేలలేదు. కాల్పులలో కొంతమంది, ఇరుకు సందులలో జరిగిన తొక్కిసలాటలో కొంతమంది, కాల్పుల నుంచి తప్పించుకో డానికి బావిలో దూకి కొంతమంది చనిపోయారు. బావిలోంచి 120 మృతదేహాలను బయటికి తీసినట్లు స్వాతంత్య్రం వచ్చాక ఇక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంలో రాశారు. అప్పటివరకు కచ్చితమైన లెక్క ఎవరికీ తెలీదు. తీవ్రంగా గాయపడిన వారిని ఆ రాత్రి కర్ఫ్యూలో బయటికి తీసుకెళ్లే పరిస్థితి లేకపోవంతో వారిలో కొంతమంది చనిపోయారు. అయితే నిజానికి కాల్పుల్లో ఎంతమంది చనిపోయారన్న లెక్క ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ తేల్లేదు! బ్రిటిష్ ప్రభుత్వం 379 మంది అంటోంది. ఆ లెక్కను కూడా చాలా అన్యాయంగా రాబట్టింది. మారణకాండ జరిగిన మూడు నెలల తర్వాత ఇంటింటికీ వెళ్లింది. మీ వాళ్లెవరైనా ఆనాటి దుర్ఘటనలో చనిపోయారా అని వివరాలు రాసుకుంది. చాలామంది నిజం చెప్పలేదు. చెబితే తమ మీద నిఘా ఉంటుందన్న భయంతో ఇంట్లో వ్యక్తి చనిపోయిన విషయాన్ని వారు దాచిపెట్టారు. చిత్రం ఏమిటంటే ఈ కాల్పుల సంగతి బ్రిటిష్ ప్రభుత్వానికి ఎనిమిది నెలల తర్వాత గానీ తెలియలేదు. దేశంలోనే ఉన్న రవీంద్రనాథ్ టాగూర్‌కి ఈ సంగతి మే 22 వరకు తెలియదు. గాంధీకీ వెంటనే తెలియలేదు. తెలిసిన వెంటనే ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం మొదలు పెట్టారు. ఆ ఉద్యమంతోనే స్వతంత్ర భారత సమరానికి బీజాలు పడ్డాయి. అవి తెల్ల దొరల గుండెల్లో బుల్లెట్లై పేలాయి. -
స్పెషల్ ఎఫెక్ట్.. అదుర్స్
నుదిటిన బుల్లెట్ గాయం.. ధారాళంగా కారుతున్న రక్తం.. మంటల్లో కాలిన ముఖం.. అక్కడక్కడా కత్తిగాట్లు.. గాయాలు.. ఇదేంటి ఎక్కడైనా రోడ్డు ప్రమాదం గానీ, అగ్నిప్రమాదం గానీ సంభవించిందా అనుకుంటున్నారా? కంగారు పడకండి. అలాంటిదేమీ లేదు. ఎప్పుడూ మనం సినిమాల్లో చూసే ఇలాంటి ఉత్తుత్తి గాయాలను ప్రత్యక్షంగా స్పెషల్ ఎఫెక్ట్ మేకప్ వేసి చూపించారు సినీ పరిశ్రమకు చెందిన ఈశ్వర్, రాజు. నాటి స్టార్ వార్స్, జురాసిక్ పార్క్ వంటి హాలీవుడ్ చిత్రాల నుంచి నేటి బాహుబలి, ఐ వంటి చిత్రాల్లో కీలకంగా మారిన ఈ స్పెషల్ ఎఫెక్ట్ మేకప్‌ను కళ్లకు కట్టినట్టు చూపించారు. నగరంలోని ఓ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు శనివారం వర్క్‌షాపు నిర్వహించారు. కత్తిగాటు నుంచి గ్రహాంతర వాసి వరకూ ఈ మేకప్‌తో సంచలనం సృష్టించవచ్చంటూనే వాటిని ఎలా వేయాలో చూపించారు. బాహుబలి లోని కాలకేయ పాత్ర మేకప్ గురించి విద్యార్థులు అడగ్గా, వెంటనే దానిని సృష్టించి ఆకట్టుకున్నారు. భార త సినీ పరిశ్రమలో వీఎఫ్ఎక్స్, స్పెషల్ ఎఫెక్ట్ మేకప్‌తో అద్భుతాలను సృష్టిస్తున్నట్లు ఈశ్వర్ తెలిపారు. ఇప్పటివరకు తాను 150కు పైగా చిత్రాలకు స్పెషల్ ఎఫెక్ట్స్ మేకప్‌ను అందించినట్లు తెలిపారు. - విజయవాడ (లబ్బీపేట) -
భద్రత గ‘గన్’మే!
సాక్షి, సిటీబ్యూరో: ‘వెపన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ’... పోలీసు శిక్షణలో... అందులోనూ భద్రత అధికారులుగా విధులు నిర్వర్తించే వారికి పదే పదే చెప్పే అంశమిది. ప్రముఖుల భద్రతకు జారీ చేసే ఆయుధాన్ని శరీరంలో ఓ భాగంగా పరిగణించాలన్నది దీని ఉద్దేశం. ప్రజాప్రతినిధులతో పాటు కీలక వ్యక్తుల వెంట ఉండే గన్‌మెన్ ఈ విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఆయుధాన్ని ఇష్టం వచ్చినట్లు ప్రదర్శించడం... ఎక్కడపడితే అక్కడ పెట్టి వెళ్లిపోవడం... సాధారణ వ్యక్తులకు ఇవ్వడం సర్వ సాధారణ విషయంగా మారిపోయింది. మంగళవారం నారాయణగూడ ఠాణా పరిధిలో డ్రైవర్ అక్బర్ ప్రాణాలు తీసిందీ గన్‌మెన్ రవీందర్ నిర్లక్ష్యమే. గన్‌మెన్‌కు ప్రతి నెలా నిర్వహించే రిఫ్రెషర్ కోర్సుల్లోనూ ఇవే అంశాలను పునరుద్ఘాటిస్తున్నా... పట్టించుకునే దాఖలాలే లేవు. గన్‌మెన్ నిర్లక్ష్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నా... పట్టించుకునే పరిస్థితి ఉన్నతాధికారులకు లేదు. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పిలిచే గన్‌మెన్ నిబంధనల ప్రకారం ఆయుధ నిర్వహణలో ఎలా చేయాలంటే... * పోలీసులు, గన్‌మెన్‌కు ఇచ్చే శిక్షణలో వెపన్ హ్యాండ్లింగ్ అనేది ఓ ప్రధానమైన సబ్జెక్ట్. * విధుల్లోకి వచ్చే ముందు వారి కార్యాలయాల్లో ఉండే బెల్ ఆర్మ్స్ నుంచి ఆయుధంతో పాటు తూటాలను తీసుకుంటారు. * ప్రతి పీఎస్ఓ 24 గంటల పాటు విధుల్లో ఉంటే... మరో 24 గంటల పాటు ఆఫ్ తీసుకుంటారు. * ఈ నేపథ్యంలోనే 24 గంటలూ తనకు కేటాయించిన ఆయుధాన్ని కచ్చితంగా శరీర భాగంగానే భావిస్తూ దగ్గర ఉంచుకోవాల్సిందే. * దీన్ని రిలీవర్‌కు లేదా అత్యవసరమైతే ఆయా ప్రాంతాల్లో ఉండే గార్డ్స్‌కు మాత్రమే ఇచ్చి, మళ్లీ తీసుకోవాలి. * మిషన్ గన్లు, ఏకేలు, కార్బైన్లు మినహా సార్ట్ వెపన్స్‌గా పిలిచే రివాల్వర్, పిస్టల్‌ను గన్‌మెన్ బయటకు కనిపించే విధంగా ధరించకూడదు. * దాన్ని కచ్చితంగా సేఫ్టీ మోడ్‌లో పౌచ్‌లో పెట్టి దుస్తులకు లోపలి భాగంలోనే భద్రపరుచుకోవాలి. * విధుల్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనూ ఆయుధాన్ని శరీరం నుంచి తీసి విడిగా ఎక్కడా పెట్టకూడదు. * ఆయుధాన్ని ఎవరికైనా (అధికారిక వ్యక్తులు) ఇచ్చేటప్పుడు, బెల్ ఆఫ్ ఆర్మ్‌లో డిపాజిట్ చేసేప్పుడు కచ్చితంగా తూటాలు ఉండే మ్యాగజైన్‌ను బయటకు తీయాలి. * చాంబర్లోకి తూటా లోడ్ అయిందో లేదో పరిశీలించడానికి ఒకటి, రెండుసార్లు పైన ఉండే స్లైడర్‌ను కాగ్ చేయాలి. * ఇలా చేస్తే చాంబర్లోడ్లో తూటా ఉంటే ఇంజెక్షన్ పోర్ట్ నుంచి బయటకు పడిపోతుంది. * కాగ్ చేసిన తర్వాత కూడా నేల వైపు గురిపెట్టి రెండు మూడుసార్లు ట్రిగ్గర్ను నొక్కినతర్వాతే ఎదుటి వారికి అప్పగించాలి. * ఆయుధాన్ని ఎదుటి వ్యక్తులకు (అధికారిక) ఇస్తున్నప్పుడు కచ్చితంగా తూటా బయటకు వచ్చే బ్యారెల్ భాగం తన వైపే ఉండేలా చూడాలి. ఏం జరిగిందంటే..? 1. పీఎస్ఓ రవీందర్ వద్ద ఉన్న పిస్టల్‌ను వెంకట్ పరిశీలిస్తున్న క్రమంలో సేఫ్టీ లివర్ రిలీజ్ కావడంతో పాటు మ్యాగజైన్లో ఉండే తూటాల్లో ఒకటి చాంబర్లోకి వెళ్లిపోయింది. పిస్టల్ మ్యాగజైన్ కెపాసిటీ 12 రౌండ్లు (తూటాలు) కాగా... స్ప్రింగ్ మూవ్మెంట్ కోసం 10 లేదా 11 మాత్రమే పెడుతుంటారు. 2. ఈ ఆయుధాన్ని తీసుకున్న అక్బర్ పిస్టల్ పైభాగంలో ఉండే స్లైడర్‌ను లాగడానికి యత్నించాడు. 3. దీంతో కంగారుపడిన రవీందర్ ఆయుధాన్ని తన చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. పిస్టల్ రవీందర్ చేతుల్లోకి వస్తుండగానే.. అతడి వేలు పొరపాటున ట్రిగ్గర్‌పై పడింది. 4. ఈ పరిణామంతో తుపాకీ వెనుక ఉండే హ్యామర్ ఫైరింగ్ పిన్ను ప్రేరేపించడంతో తూటా పేలి బ్యారెల్ నుంచి దూసుకుపోయింది. 5. అక్బర్ ఛాతీలోకి దూసుకుపోయిన తూటా వీపు భాగం నుంచి బయటకు వచ్చి... గోడను తాకి కింద పడింది. * ఆయుధం.. శరీరంలో భాగం * శిక్షణలో పదే పదే చెప్పే అంశమిది * అయినా నిత్యం గన్‌మెన్ నిర్లక్ష్యం * పట్టించుకోని అధికారులు సంఘటన స్థలంలో దృశ్యమిదీ.. 1. గోడను బుల్లెట్ తాకిన ప్రాంతం 2. పేలిన పిస్టల్ 3. అక్బర్‌కు గాయమైన ప్రాంతం 4. పిస్టల్ పేలిన సందర్భంలో రవీందర్ కూర్చున్న ప్రాంతం -
నీటిలో బుల్లెట్ దిగదు...!
గురిచూసి టార్గెట్ చేస్తే బుల్లెట్ గాలిని చీల్చుకుంటూ వెళ్లి దిగిపోతుంది. మరి నీటి లోపల ఏం జరుగుతుంది? బుల్లెట్ తుస్సుమంటుంది. బ్రిటన్‌కు చెందిన ఫిజిక్స్ నిపుణుడు అండ్రియాస్ వాల్ ఇదే విషయాన్ని జనాన్ని పోగేసి మరీ నిరూపించాడు. అంతేనా దీన్ని వీడియో తీసి యూ ట్యూబ్‌లో పెట్టాడు. ఓ స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఇతను స్టాండ్‌పై రైఫిల్‌ను అమర్చాడు. దాని ట్రిగర్కు తాడును కట్టి దాన్ని తనకు అందేలా చూసుకున్నాడు. కౌంట్‌డౌన్ మొదలైంది. అండ్రియాస్ తాడుతో ట్రిగర్కు లాగాడు. తుపాకీ పేలిన శబ్దం బయట ఉన్నవారికి స్పష్టంగా వినపడింది. అందరిలోనూ ఉత్కంఠ. కొద్ది క్షణాల తర్వాత అండ్రియాస్ స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయిన బుల్లెట్‌ను వెతికి ఓ చేతిలో పట్టుకొని పైకి తేలాడు. విషయమేమిటంటే గాలి కంటే నీరు 800 రెట్లు మందంగా ఉంటుందట. నీటిలో తుపాకీని పేలిస్తే బుల్లెట్ రెండు మీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లలేదు. బుల్లెట్ పేలగానే ముందుభాగంలో అధిక పీడనం, వెనకవైపు అల్పపీడనం ఏర్పడతాయట. వీటికారణంగా బుల్లెట్ వేగం క్షణంలో తగ్గిపోతుంది. రెండు మీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లలేదు. -
పల్లకిలో కాదు... బుల్లెట్ పై వచ్చింది!
పెళ్లితంతులో అనేక సంప్రదాయాలు కొనసాగడం మనం చూస్తుంటాం. అందులో ముఖ్యంగా వధువును పెళ్ళిమండపంలోకి తీసుకు రావడంలోనూ విభిన్న రీతులు కనిపిస్తాయి. ముత్తైదువులంతా చేతులు పట్టుకొని మండపంలోకి తీసుకొచ్చే సంప్రదాయం కొందరు పాటిస్తే... మరోచోట వధువును బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు మోసుకొని తీసుకొస్తారు. అలాగే పల్లకీలోనూ తెస్తారు. ఇవన్నీ మనం ఇంతకు ముందు చూసినవే. అయితే అహ్మదాబాద్ కు చెందిన ఓ వధువు పెళ్లి మండపంలోకి వచ్చిన తీరు అక్కడి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇంతకూ ఆమె మండపంలోకి ఎలా వచ్చిందో ఊహించగలరా? అహ్మదాబాద్ కు చెందిన అయేషా ఉపాధ్యాయ తాను పెళ్లిలో విభిన్నంగా కనిపించాలనుకుంది. అదే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. పెళ్లి మండపంలోకి తాను కొత్త స్టైల్ లో ఎంటర్ అవుతానంటూ వారివద్ద ముందే పర్మిషన్ తీసుకుంది. 26 ఏళ్ళ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ అయిన అయేషా... 13 ఏళ్ళ వయసు నుంచే మోటర్ బైక్ లపై ఎంతో ఇష్టాన్ని పెంచుకుంది. అంతేకాదు ఉమెన్ బైకర్స్ గ్రూప్ లో సభ్యురాలుగా కూడ చేరింది. సాధారణంగా వధువులు పల్లకిలోనో, డోలీలోనో మండపంలోకి వచ్చే ట్రెండ్ ను తన కోసం మార్చుకుంది. తాను స్వయంగా వచ్చేందుకు రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ ను ఎంచుకుంది. తనకు కాబోయే భర్త లౌకిక్ కు బైక్ నడపడం రాదని తెలిసిన ఆమె... బైక్ పై విభిన్నంగా పెళ్లికి ఎంటరవ్వడమే కాక.. త్వరలో భర్తను బుల్లెట్ పై రైడ్ కు తీసుకెడతానంటూ సరదాగా ప్రామిస్ కూడ చేసింది. -
పెళ్లి మండపానికి బుల్లెట్‌పై వచ్చిన అయేషా
-
బరువైన 'బుల్లెట్' ప్రాణం తీసింది
న్యూఢిల్లీ: ఢిల్లీలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం బీభత్సం సృష్టించింది . ఒకవైపు అతి వేగం, మరోవైపు బరువైన వాహనం మానిక్ గౌర్(32) ప్రాణాలు తీసింది. సౌత్ వెస్ట్ ఢిల్లీలోని శంకర్ విహార్ దగ్గర చోటు చేసుకున్న ఈ ఘటనతో ప్రత్యక్ష సాక్షులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. క్రేజీ బైక్ బుల్లెట్ పై రైడ్ అంటే యువకులకు మహా ఉత్సాహం. ఈ ఉత్సాహంలోనే మానిక్ మితిమీరిన వేగంతో బుల్లెట్ పై వెడుతూ పక్కనే ఉన్న టెంపోను ఢీకొట్టాడు. అక్కడితో అది ఆగలేదు.. కొన్నిమీటర్ల దూరం వాహనాన్ని ఈడ్చుకెళ్లి పోవడంతో మంటలు చెలరేగాయి. బండి పూర్తిగా అదుపు తప్పి, అతను కిండపడిపోయాడు. అతనిపై బుల్లెట్ పడిపోయింది. పెట్రోల్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో మానిక్ మంటల్లో చిక్కుకు పోయాడు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక దళాలు అతణ్ని ఆసుపత్రి తరలించినా లాభం లేకపోయింది. అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే బుల్లెట్ బరువు ఎక్కువగా ఉండడంతో అతను తప్పించుకోలేకపోయాడని పోలీస్ అధికారులు తెలిపారు. సుమారు 200 కిలోల వెయిట్ వున్న వాహనాన్ని లేపలేకపోయాడని , మంటలు బాగా వ్యాపించడంతో తాము కూడా ఏమీ చేయలేకపోయామని ప్రత్యక్ష సాక్షులు వాపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతునికి భార్య, రెండేళ్ల కూతురు ఉన్నారు. -
కలకలం సృష్టించిన 'మిస్ ఫైర్'
సీఎం భద్రతా సిబ్బందిలో కమాండోకు బుల్లెట్ గాయం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పట్టణ పోలీసులు మంగళగిరి : సీఎం భద్రత కోసం రాత్రి వేళలో నిఘా పర్యవేక్షించే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) సిబ్బందిలో ఓ కమాండోకు బుల్లెట్ గాయమైన ఘటన కలకలం సృష్టించింది. పట్టణంలోని ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్‌లో గురువారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు నివాసం ఉండటంతో పాటు పలువురు అగ్రనేతలు పర్యటిస్తుంటారు. వారి భద్రతా చర్యల నిమిత్తం ఎన్ఎస్జీ సిబ్బంది 140 మందితో కూడిన బృందం పట్టణంలోని ఆరవ ఏపీఎస్పీ బెటాలియన్‌లో బస చేస్తోంది. వీరు రాత్రి వేళ గస్తీ తిరుగుతూ విధులు నిర్వహిస్తుంటారు. అగ్రనేతల భద్రత నిమిత్తం రాత్రివేళ కొండ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ ఇంటిలిజెన్స్‌కు నివేదిక ఇచ్చే నిమిత్తం నాలుగు రోజులుగా 140 మంది కమాండో బృందం మంగళగిరితో పాటు రాజధాని ప్రాంతాల్లో గస్తీ తిరుగుతున్నారు. ఈ క్రమంలో విధులలో భాగంగా గురువారం విజయవాడలోని ఓ వాణిజ్య సముదాయంలో శిక్షణ పొందేందుకు వెళ్తుండగా ఎన్ఎల్కే శ్రీనివాస్ అనే కర్ణాటకకు చెందిన కమాండో జాకెట్లో వున్న 9 ఎంఎం పిస్టల్ ప్రమాదవశాత్తూ పేలింది. దీంతో అతని కుడి కాలులోకి బుల్లెట్ దూసుకుపోయింది. వెంటనే తోటి సిబ్బంది, అధికారులు ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స చేయించి హుటాహుటిన వారి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లారు. కాగా, కర్ణాటక రాష్ట్రంలోని మిద్యానగర్కు చెందిన శ్రీనివాస్ 2002లో ఆర్మీలో చేరి ఏడాది క్రితం హర్యానా రాష్ట్రం తరఫున ఎన్ఎస్జీలో శిక్షణ పొందుతున్నాడు. సీఎం తదితర ప్రముఖుల భద్రతకు నియమించిన కమాండోలే నిర్లిప్తంగా ఉండటాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఈ ఘటనపై పట్టణ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కల్వర్ట్‌లోకి దూసుకెళ్లిన బుల్లెట్.. ఒకరి మృతి
మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలో ఓ బుల్లెట్ మోటార్ సైకిల్ అదుపుతప్పి కల్వర్ట్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బుల్లెట్ నడుపుతున్న వ్యక్తి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మానవపాడు మండలం బొంకూరు సమీపంలో గురువారం అర్ధరాత్రి బుల్లెట్ మోటారు సైకిల్ అదుపుతప్పి కల్వర్ట్‌లోకి పడింది. మృతుడు అయిజ మండల వాసిగా తెలిసింది. నూతనంగా నిర్మించిన ఈ రాయిచూర్ రోడ్డులో ఎలాంటి సూచికలు లేకపోవడం ప్రమాదాలకు దారితీస్తోందని స్థానికులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మేనల్లుడికి బుల్లెట్ తగిలిందని షూట్ చేసుకున్నాడు..
గోపేశ్వర్(ఉత్తరాఖండ్): వేటకెళ్లిన ఓ వ్యక్తి జంతువనుకొని కాల్పులు జరపగా దురదృష్టవశాత్తు తన మేనల్లుడికి బుల్లెట్ తగిలింది. తప్పుచేశానని మనస్తాపం చెంది తనను తానే కాల్చుకొని దుర్మరణం చెందాడు. ఈ ఘటన చమోలి జిల్లాలోని థరలి ప్రాంతంలో మారుమూల గ్రామమైన రుసన్లో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం గోవర్ధన్లాల్ అనే వ్యక్తి వేటకై అడవికి వెళ్లాడు. ఈ క్రమంలో పొదల చాటున శబ్దం వినిపించడంతో జంతువు అనుకొని ఆ దిశగా కాల్పులు జరిపాడు. తీరా దగ్గరికెళ్లి చూసి నిర్ఘాంతపోయాడు. తన సొంత మేనల్లుడు దర్శన్లాల్కు బుల్లెట్ తగిలి పడి ఉండటాన్ని గమనించాడు. తీవ్ర మనస్తాపం చెందిన గోవర్ధన్.. తనకు తానే కాల్చుకొని దుర్మరణం చెందాడని థరలి ఎస్డీఎం అనూప్ నౌతియాల్ తెలిపారు. అతని మేనల్లుడు దర్శన్‌లాల్ కర్ణప్రయాగ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, ఆయనకు ప్రాణాపాయం తప్పిందని అధికారులు వివరించారు.