అక్రమంగా దాచిన తుపాకి స్వాధీనం
Published Thu, Feb 16 2017 12:32 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
ఆత్మకూరురూరల్: మండల పరిధిలోని నల్లకాల్వ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి ఆత్మకూరు పోలీసులు బుధవారం నాటు తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మకూరు సీఐ కృష్ణయ్యకు వచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య నల్లకాల్వలో అనుమానితుడి ఇల్లు సోదా చేశారు. ఈ సోదాలో కంచుతో చేసిన తుపాకి లభ్యమైనట్లు తెలిసింది. దీనితో ఒక తూటా మాత్రమే పేల్చడానికి వీలుంటుందని తెలిసింది. కాగా తుపాకిని దాచిన వ్యక్తి..దాన్ని తనకు ఓ గిరిజనుడు అమ్మి పెట్టమని ఇచ్చాడని పోలీసులతో చెప్పినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా పోలీసులు.. నిందితుడిని పూర్తిగా విచారించి గురువారం అరెస్టు చూపే అవకాశం ఉంది.
Advertisement
Advertisement