
ప్రముఖ భోజ్‌పురి సింగర్ నిషా ఉపాధ్యాయకు బుల్లెట్ తగిలింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బీహార్‌లోని పాట్నాలో ఓ లైవ్ షోలో బుల్లెట్ తగిలినట్లు తెలుస్తోంది. అయితే వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. బీహార్‌లోని సరన్‌లో ఓ కల్చరల్ ప్రోగ్రామ్‌లో ప్రదర్శన ఇచ్చేందుకు నిషా రాగా.. యజ్ఞం జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
(ఇది చదవండి: అమ్మాయిలపై అత్యాచారం.. నటుడికి 30 ఏళ్ల జైలు శిక్ష)
కాగా.. నిషా ఉపాధ్యాయ్ బీహార్‌కి చెందిన సింగర్. ఆమెది సరన్ జిల్లాలోని గౌర్ బసంత్ స్వస్థలం కాగా.. పాట్నాలోనే ఉంటున్నారు. నిషా ఎక్కువగా సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. ఆమె పాటల్లో లే లే ఆయే కోకా కోలా, నవకర్ మంత్ర, ధోలిదా ధోల్ రే వగడ్, హసి హసి జాన్ మారెలా లాంటి హిట్ సాంగ్స్ ఉన్నాయి.
(ఇది చదవండి: రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే!)
స్పందించిన పోలీసులు..
నిషా ఉపాధ్యాయ్‌పై బుల్లెట్ తగలడంపై పోలీసులు స్పందించారు. ఈ సంఘటన గురించి మాకు సమాచారం అందింది.. కానీ ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కాల్పులు ఎవరు జరిపారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నాం అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment