
ఎమ్మెల్యే భార్యపై కాల్పులు
బారక్పూర్: పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అర్జున్ సింగ్ భార్య నిరోజ్ సింగ్ (ఉషా సింగ్)పై కాల్పులు జరిగాయి. ఆమె కడుపులోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో వెంటనే ఆమెను కోల్కతా ఆస్పత్రికి తరలించారు. బంధువే ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఘటన జరిగిన వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించిన కుమారుడు పవన్ సింగ్.. తన సోదరుడు (బంధువు) సౌరవ్ సింగ్ ఈ దారుణానికి తెగబడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సౌరవ్ నేరుగా ఇంట్లోకి వచ్చి ఒక్కసారిగా తన తల్లిపై కాల్పులు జరిపి, పారిపోయినట్లు వివరించాడు. ఓ బుల్లెట్ ఆమె కడుపులోకి దూసుకెళ్లిందని తెలిపాడు.