బుల్లెట్ కంటే బ్యాలెట్ పవర్ ఫుల్ అయందని జాయింట్ కలెక్టర్ బి. రామారావు అన్నారు. గురువారం ఆయన జిల్లా పరిషత్ సమావేశ మం దిరంలో జరిగిన మీట్ ది ప్రెస్‌లో మాట్లాడారు.
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్: బుల్లెట్ కంటే బ్యాలెట్ పవర్ ఫుల్ అయందని జాయింట్ కలెక్టర్ బి. రామారావు అన్నారు. గురువారం ఆయన జిల్లా పరిషత్ సమావేశ మం దిరంలో జరిగిన మీట్ ది ప్రెస్‌లో మాట్లాడారు. బ్యాలెట్ ద్వారా నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవచ్చునన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మీడి యా వారధిగా పని చేస్తుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, శాంతిభధ్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతున్నా మని చెప్పారు.
ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు 34 ప్లెయిం గ్ స్క్వాడ్స్ నియమించామన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 66 శాతం మంది మాత్రమే ఓ టుహక్కు వినియోగించుకున్నారని, ఈసారి శత శాతం ఓటరు నమోదు జరిగేలా చర్య లు తీసుకున్నామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఉదయం 7 నుంచి సాయంత్రం5 గంటలు వరకు పోలింగ్ ఉంటుందన్నారు. దీనిపై ఓటర్లకు అవగాహాన కల్పించేం దుకు స్వీప్ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు.
ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో ప్రజలు స్వేచ్ఛ గా ఓటు వేసేందుకు ఎస్‌ఐ, సీఐలతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏఓబీలో ఎన్నికల బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్, మావోయిస్టు ప్రాంతాల్లో ముమ్మురంగా తనిఖీ చేరుుస్తున్నామన్నారు.
ఇప్పటివరకు అక్ర మంగా తరలించిన రూ. 1.35 కోట్ల సీజ్ చేశామని, 370 బైండోవర్ కేసులు నమోదు చేశామని చెప్పారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సురేందర్‌కుమార్ మా ట్లాడుతూ ఇప్పటివరకు 533 మద్యం కేసులు నమోదు చేశామని, 247 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు. 1543 లీటర్ల నా టుసారా, 57 వేల లీటర్ల బెల్లం ఊటను సీజ్ చేశామన్నారు. అలాగే 35 కిలోల గంజాయి సీజ్ చేసి, ఆరుగురిని కో ర్టుకు తరలించామన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ ఎన్. మోహనరావు, ఆర్‌టీఓ అబ్ధుల్ రవూఫ్, పాల్గొన్నారు.