ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం
Published Fri, Nov 11 2016 7:46 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ యువకుడి వద్ద బుల్లెట్ లభించటం శుక్రవారం కలకలం సృష్టించింది. హైదరాబాద్‌కు చెందిన నాగ మురళి అమెరికా వెళ్లేందుకు వచ్చాడు. అతడిని ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేయగా ఒక బుల్లెట్ లభించింది. దీంతో అతడిని వెంటనే పోలీసులకు సరెండర్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అతడిని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గత నెలలో రవికుమార్ అనే వ్యక్తి కూడా కువైట్ కు వెళుతూ బుల్లెట్లతో పట్టుబడిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement