
దిల్లీ వీధుల్లో పరుగులు తీస్తున్న మినియేచర్ మోటర్ సైకిల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 4.6 మిలియన్‌ల వ్యూస్‌ను దక్కించుకుంది. ‘మినీ బుల్లెట్ వోన్లీ ఫస్ట్ ఇన్ ఇండియా’ అనే కాప్షన్‌తో ఈ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సింగిల్ సీట్ ఉన్న ఈ బైక్‌కు టియర్ షేప్‌డ్ ఫ్యూయెల్ ట్యాంక్ ఆకర్షణ.
తన కూతురు కోసం ఈ మోటర్‌సైకిల్‌ను రైడరే తయారు చేసి ‘పింకీ’ అని పేరు పెట్టాడు. నెటిజనులు మాత్రం దీనికి ‘బార్బీ బుల్లెట్’ అని పేరు పెట్టారు. ఇక రెండో వీడియోలో బార్బీ బుల్లెట్ రోడ్ల మీద పరుగులు తీస్తున్నప్పుడు జనాల రియాక్షన్ కళ్లకు కడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment