Barbie
-
పింక్ డ్రస్‌లో మిల్కీ బ్యూటీ..ధర వింటే షాకవ్వుతారు!
మిల్కీబ్యూటీ తమన్నా భాటియాకి ఇప్పటికీ టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. కానీ బాహుబలి తర్వాత ఆమెకు సరైన హిట్ పడలేదు. ఒకప్పుడూ ఆమె టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్. ఆ టైంలో ఓ పక్క స్టార్ హీరోలతో నటిస్తూనే యంగ్ హిరోలతో కూడా నటించేది ఈ భామ. అయితే ఆమె కెరీర్లో హిట్ల కంటే ప్లాప్లే ఎక్కువ ఉన్నాయి. అయితేనేం ఆమె అందం, పర్సనల్ ఇమేజ్‌తో ప్రేక్షకుల ఆదరణ పొందుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో గ్లామర్ డోస్ పెంచి వివిధ హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు టాలీవుడ్లో నెంబర్ వన్ స్థానంలో ఉండేది. ప్రస్తుతం స్పీడ్ తగ్గించి బాలీవుడ్ వెబ్ సిరీస్‌లపై దృష్టిపెట్టింది. ఈమధ్య ప్రతి రోజూ ఓ డిఫరెంట్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్స్ తో కనిపిస్తోంది తమన్నా భాటియా. ముఖ్యంగా బాలీవుడ్, వెబ్ సిరీస్‌లతో బిజీ అయిన తర్వాత తమన్నా తన గ్లామర్ డోసు అమాంతం పెంచేసింది. తాజాగా పింక్ డ్రెస్‌లో అభిమానుల మనసులు గెలుచుకుంటోంది. తమన్నా ధరించిన ఈ డ్రెస్ లగ్జరీ వర్సెచె బ్రాండ్‌కి చెందింది. డ్రస్ ధర ఏకంగా రూ. 4.2 లక్షలు. ఈ పింక్ కలర్ లగ్జరియస్ డ్రెస్‌లో బార్బీ బొమ్మలా మెరిసిపోయింది. ఇన్‌స్టాగ్రాంలో అందుకు సంబంధించని ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులకు ట్రీట్ ఇస్తోంది. వీటికి ఓన్లీ ఫ్లవర్ ఎమోజీలతో క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ చేసింద. ఈ పింక్ డ్రస్‌లో తమన్నా ఫోటోలకు ఇచ్చిన ఫోజులు అదిరిపోయాయి. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) (చదవండి: రైల్లో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలో తెలుసా?) -
Tamannaah Bhatia: బార్బీ బొమ్మలా మెరిసిపోతున్న తమన్నా!
-
ఆస్కార్-2024 విన్నింగ్ సినిమాలు.. ఏయే ఓటీటీలో ఉన్నాయంటే?
ఆస్కార్ అవార్డుల వేడుక.. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈసారి అన్ని పురస్కారాలు హాలీవుడ్ సినిమాలకే దక్కాయి. వేరే భాషల చిత్రాల ఈ పురస్కారాన్ని అందుకోలేకపోయాయి. అందరూ ఊహించనట్లే ఈసారి 'ఓపెన్ హైమర్' చిత్రానికి ఏకంగా ఏడు పురస్కారాలు దక్కాయి. దీనితో పాటు పలు హిట్ చిత్రాలని కూడా ఈ అవార్డులు వరించాయి. మరి ఈ సినిమాలు చూడాలంటే ఎలా? ఏ ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయనేది ఇప్పుడు చూసేద్దాం. (ఇదీ చదవండి: ఆస్కార్-2024 విజేతల పూర్తి జాబితా.. ఆ సినిమాకు ఏకంగా ఏడు అవార్డ్స్) సాధారణంగా అవార్డ్ విన్నింగ్ సినిమా అంటే సినీ ప్రేమికులు చూసేందుకు ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా ఆస్కార్ వచ్చిందంటే ఆ మూవీలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. అందుకు తగ్గట్లే ఈసారి 'ఓపెన్ హైమర్', 'బార్బీ', 'అనాటమీ ఆఫ్ ఏ ఫాల్' తదితర చిత్రాలు ఆస్కార్ దక్కించుకున్నాయి. వీటితోపాటు 'అమెరికన్ ఫిక్షన్', 'ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్', 'ది హోల్డోవర్స్' లాంటి మనకు పెద్దగా తెలియని సినిమాలకు కూడా అవార్డులు వచ్చాయి. ఇంతకీ ఇవి ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే? ఓపెన్ హైమర్ - జియో సినిమా (తెలుగు-మార్చి 21) & అమెజాన్ ప్రైమ్ (రెంట్) పూర్ థింగ్స్ - హాట్‌స్టార్ (ఇంగ్లీష్) ది హోల్డోవర్స్ - అమెజాన్ ప్రైమ్ & ఆపిల్ టీవీ బార్బీ - జియో సినిమా అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ - అమెజాన్ ప్రైమ్ & ఆపిల్ టీవీ గాడ్జిల్లా మైనస్ వన్ - ప్రస్తుతం అందుబాటులో లేదు అమెరికన్ ఫిక్షన్ - అమెజాన్ ప్రైమ్ వీడియో ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ - అమెజాన్ ప్రైమ్ & ఆపిల్ టీవీ 20 డేస్ ఇన్ మరియూపోల్ - అమెజాన్ ప్రైమ్ (ఇదీ చదవండి: ఆస్కార్ ఒరిజినల్ సాంగ్.. గతేడాది 'ఆర్ఆర్ఆర్'కి.. మరి ఇప్పుడు?) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు
డార్లింగ్ ప్రభాస్ అభిమానులు చాలారోజుల నుంచి ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఎందుకంటే ఈ శుక్రవారమే 'సలార్' మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతుంది. పెద్దగా ప్రమోషన్ లాంటి హడావుడి ఏం లేకుండానే వస్తున్నప్పటికీ.. అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. దీన్ని ఢీకొట్టడానికి షారుక్ 'డంకీ', హాలీవుడ్ మూవీ 'ఆక్వామన్ 2' కూడా ఇదే వీకెండ్లో బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ కానున్నాయి. (ఇదీ చదవండి: Bigg Boss 7: అమర్దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం) ప్రభాస్, షారుక్ మధ్య జరిగే బాక్సాఫీస్ ఫైట్‌లో ఎవరు గెలుస్తారా అనేది పక్కనబెడితే.. ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 30 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. అయితే ఓటీటీల్లో వచ్చే వాటిలో 'ఆదికేశవ', 'సప్త సాగరాలు దాటి సైడ్-బి', 'ఫలిమి' తదితర మూవీస్ ఆసక్తి కలిగిస్తున్నాయి. అలానే పలు హిందీ, ఇంగ్లీష్ సిరీసులు కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలో రానుందనేది చూద్దాం. ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ (డిసెంబరు 18-24 వరకు) నెట్‌ఫ్లిక్స్ హలో ఘోస్ట్ (మాండరిన్ మూవీ) - డిసెంబరు 18 ద రోప్ కర్స్ 3 (మాండరిన్ సినిమా) - డిసెంబరు 18 సిండీ లా రెజీనా: ద హై స్కూల్ ఇయర్స్ (స్పానిష్ సిరీస్) - డిసెంబరు 20 మ్యాస్ట్రో (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 20 ద టేమింగ్ ఆఫ్ ష్రూడ్ 2 (పోలిష్ సినిమా) - డిసెంబరు 20 అల్హమర్ H.A (అరబిక్ మూవీ) - డిసెంబరు 21 లైక్ ఫ్లవర్స్ ఇన్ సాండ్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 21 రెబల్ మూన్ పార్ట్ 1: ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 21 ఆదికేశవ (తెలుగు మూవీ) - డిసెంబరు 22 కర్రీ & సైనైడ్: ద జాలీ జోసెఫ్ కేస్ (హిందీ సిరీస్) - డిసెంబరు 22 యోంగ్సాంగ్ క్రియేచర్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 22 కుయికో (తమిళ మూవీ) - డిసెంబరు 22 ఏ వ్యాంపైర్ ఇన్ ద ఫ్యామిలీ (పోర్చుగీస్ సినిమా) - డిసెంబరు 24 పింక్ ఫాంగ్ సింగ్-అలాంగ్ మూవీ 3: క్యాచ్ ద జింజర్ బ్రెడ్ మ్యాన్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 24 హాట్‌స్టార్ ఫలిమి (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 18 BTS మాన్యుమెంట్స్: బియాండ్ ద స్టార్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 20 డ్రాగన్స్ ఆఫ్ వాండర్ హ్యాచ్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 20 పెర్సీ జాక్సన్ అండ్ ఒలింపియన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 20 వాట్ ఇఫ్..?: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 22 అమెజాన్ ప్రైమ్ మిషన్ స్టార్ట్ Ab (హిందీ సిరీస్) - డిసెంబరు 19 ద ఏసెస్ (ఇండోనేసియన్ మూవీ) - డిసెంబరు 21 డ్రై డే (హిందీ సినిమా) - డిసెంబరు 22 సాల్ట్ బర్న్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 22 సప్త సాగరాలు దాటి సైడ్-బి (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 22 జీ5 అడి (మలయాళ మూవీ) - డిసెంబరు 22 హోమోరస్లీ యూవర్స్: సీజన్ 3 (హిందీ సిరీస్) - డిసెంబరు 22 జియో సినిమా బార్బీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 21 హే కమీని (హిందీ మూవీ) - డిసెంబరు 22 బుక్ మై షో ద మిరాకిల్ క్లబ్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 19 లయన్స్ గేట్ ప్లే ఫియర్ ద నైట్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 22 (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ సీజన్ విన్నర్ నేనే.. శివాజీ తలతిక్క కామెంట్స్!) -
భళారే బార్బీ బుల్లెట్
దిల్లీ వీధుల్లో పరుగులు తీస్తున్న మినియేచర్ మోటర్ సైకిల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 4.6 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ‘మినీ బుల్లెట్ వోన్లీ ఫస్ట్ ఇన్ ఇండియా’ అనే కాప్షన్‌తో ఈ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సింగిల్ సీట్ ఉన్న ఈ బైక్‌కు టియర్ షేప్డ్ ఫ్యూయెల్ ట్యాంక్ ఆకర్షణ. తన కూతురు కోసం ఈ మోటర్‌సైకిల్‌ను రైడరే తయారు చేసి ‘పింకీ’ అని పేరు పెట్టాడు. నెటిజనులు మాత్రం దీనికి ‘బార్బీ బుల్లెట్’ అని పేరు పెట్టారు. ఇక రెండో వీడియోలో బార్బీ బుల్లెట్ రోడ్ల మీద పరుగులు తీస్తున్నప్పుడు జనాల రియాక్షన్ కళ్లకు కడుతుంది. -
‘బార్బీ’ ఫీవర్.. సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చిన వృద్ధ జంట.. చివరిలో
బార్బీ.. బార్బీ.. ప్రపంచవ్యాప్తంగా సీనీ అభిమానులను నోట ప్రస్తుతం ఇదే మాట. గ్రెటా గెర్విగ్ తెరకెక్కించిన బార్బీ చిత్రం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుని రికార్డ్ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా ‘బార్బీ’ మూవీ సూపర్ అంటూ కితాబు ఇవ్వడంతో విశేష స్పందన లభిస్తోంది. ఇక సోషల్ మీడియాలో బార్బీ ఫీవర్ మామూలుగా లేదనే చెప్పాలి. ఎక్కడ చూసిన పింక్ కలర్‌తో నింపుతున్నారు నెటిజన్లు. ఈ చిత్రాన్ని చూసేందుకు అన్ని వయసుల వారూ థియేటర్లకు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బార్బీ మూవీని చూసేందుకు వృద్ధ దంపతులు రాగా.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో.. ఓ వృద్ధ దంపతులు సినిమా పూర్తయిన తర్వాత ఒకరి చేతిలో ఒకరు చేయి వేసి థియేటర్ నుంచి బయటకు వస్తుండటం కనిపిస్తుంది. ఈ వీడియోని షకీనా అనే యూజర్ టిక్‌టాక్‌లో పోస్ట్ చేస్తూ.. బార్బీతో పాటు వీరిని చూసిన తర్వాత కంటనీరు రాకుండా ఉండదని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ క్లిప్ ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. "బార్బీ" చిత్రం జూలై 21న విడుదలైనప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్, దువా లిపా, సిము లియు, అరియానా గ్రీన్బ్లాట్, మైఖేల్ సెరా మరియు ఎమ్మా మాకీ నటించారు. The old couple after the Barbie movie by u/gamesofduty in MadeMeSmile -
బార్బీ కాస్త హిజార్బీ! నాలా లేదన్న ఆలోచనే.. ఈ సరికొత్త బార్బీ!
బార్బీ బొమ్మలను ఇష్టపడని వారు ఉండరేమో. బార్బీ అంత అందంగా ఉండాలని అమ్మాయిలంతా అనుకుంటారు. కానీ నాలాగా బార్బీలేదే? నాలాంటి డ్రెస్ వేసుకోలేదే అని అనుకున్న ఓ ఆర్టిస్ట్ ఏకంగా సరికొత్త బార్బీని రూపొందించింది. సంప్రదాయం ఉట్టిపడేలా తయారైన ఈ సరికొత్త బార్బీ అందర్నీ తెగ ఆకర్షిచేస్తోంది. రంగు రంగుల డ్రెస్‌లు, ప్రముఖుల రూపాలతో అందర్నీ ఆకర్షించే బార్బీ హిజాబ్ వేస్తే ఎలా ఉంటుంది అనుకుంది నైజీరియాకు చెందిన 32 ఏళ్ల హనీఫా ఆడమ్. మార్కెట్లో హిజాబ్ ధరించిన బొమ్మల కోసం వెతికింది. ఎంత గాలించినా హిజాబ్ ధరించిన ఒక్క బొమ్మ కూడా కనిపించలేదు. తనలా హిజాబ్ ధరించిన బార్బీ కనిపించలేదని బాధపడింది. దీంతో తనే... హిజాబ్ ధరించిన బార్బీని తయారు చేయాలని నిర్ణయించుకుంది. 2015 డిసెంబర్లో ..నేవీ మ్యాక్సి స్కర్ట్ కుట్టి, నీలం రంగు జాకెట్, నలుపు రంగు హిజాబ్‌ను బార్బీకి తొడిగి ఫోటో తీసింది. ‘హిజార్బీ’ పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచి...చక్కగా చూడముచ్చటగా ఉన్న తొలి హిజార్బీ ఫోటోను పోస్టు చేసింది. ఈ ఫోటో చూసిన వారంతా..‘‘ చాలా బావుంది. మా పిల్లలకు కూడా ఇటువంటి డ్రెస్సే కావాలని’’ అడిగారు. దీంతో హనీఫా మరింత ఉత్సాహంతో వివిధ రకాల హిజార్బీలను రూపొందించింది. డ్రస్లన్నింటిలోకి లైఫ్‌స్టైల్, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ హబీబీ డిసిల్వా ధరించిన బ్రిటిష్ స్టైల్ డ్రెస్ బాగా పాపులర్ అయ్యింది. మీడియా భారీ కవరేజ్‌తోపాటు, టీన్వోగ్ కూడా గుర్తించడంతో హిజార్బీకి మంచి ఆదరణ లభించింది. ఇప్పటిదాక హిజార్బీ అకౌంట్లో రెండు వందలకు పైగా ఫోటోలు పోస్టు చేసింది. ముస్లిం సాంప్రదాయం, ఫ్యాషన్‌ను ప్రతిబింబించేలా హనీఫా హిజార్బీలు తయారు చేయడం విశేషం. ఇటీవల విడుదలైన బార్బీ సినిమాతో బార్బీ మేనియా చూసి హనీఫా మరోసారి హిజార్బీని యాక్టివ్ చేసింది. ఈ క్రమంలోనే ..ఆరేళ్ల తరువాత పింక్ రంగు వేసిన గోడ ముందు పింక్ కలర్ డ్రెస్ వేసుకుని, హిజాబ్ ధరించి నిలుచున్న హిజార్బీ పోటోను ఇన్‌స్టా అకౌంట్లో ‘‘హిజార్బీ ఈజ్ బ్యాక్’’ అంటూ పోస్టు చేసింది. ఈ పోస్టుకు నెటిజన్లు ఫిదా అయిపోయి తెగ లైక్‌లు కొడుతున్నారు. మ్యాటెల్ హిజార్బీ.. హనీఫా తయారు చేసిన హిజార్బీ పాపులర్ కావడంతో 2017లో బార్బీ తయారీ సంస్థ కూడా హిజాబ్ దరించిన బార్బీని విడుదల చేసింది. అమెరికా ఒలింపిక్ ఫెన్సర్ ఇతిహాజ్ మహమ్మద్ రూపంతో హిజార్బీని విడుదల చేసింది. వ్యాపారిని కాదు.. ఆర్టిస్ట్ అవాలనుకోలేదు ‘‘ఫైన్ ఆర్ట్స్‌ను చదివాను. కానీ ఆర్టిస్ట్ అవ్వాలనుకోలేదు. డాక్టర్ అవాలనుకున్నాను. అదీ కుదరక ఫిజియాలజీ చదివాను. ఫార్మకాలజీలో మాస్టర్స్ చేసాను. చదువు పూర్తిచేసి యూకే నుంచి నైజీరియా వచ్చాక... నాకు తెలిసిన ఫ్యాషన్ ఐడియాలను ఆన్లైన్లో పోస్టు చేసేదాన్ని. వాటిని చూసిన వారంతా అభినందించేవారు. 2016లో ఫుడ్ ఆర్ట్ కాంపిటీషన్లో పాల్గొని విజేతగా నిలిచాను. అప్పుడు ఆర్టిస్ట్‌గా మారాలనుకున్నాను. అప్పటినుంచి నేను రూపొందించిన కళారూపాలను నైజీరియా, న్యూయార్క్ ఎగ్జిబిషన్లలో ప్రదర్శించడం మొదలు పెట్టాను. ఇలా చేస్తూ హిజార్బీని మీ ముందుకు తీసుకొచ్చాను. నేను వ్యాపారిని కాదు. నా స్నేహితురాళ్లు ప్రోత్సహించడంతో వివిధరకాల హిజార్బీని రూపొందించాను. ఈ నెలలో హిజార్బీ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించబోతున్నాను. బట్టల తయారీతోపాటు, నైజీరియా డిష్‌లకు ఫుడ్ ఆర్ట్‌ను జోడిస్తూ మా సంప్రదాయాలకు మరింత గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. నేను రూపొందించే హిజార్బీల్లో.. ఏసియన్, తెలుపు, నలుపు బొమ్మలు ఉన్నాయి. సెలబ్రెటీలను రోల్ మోడల్స్‌గా తీసుకునేందుకు వివిధ రంగుల్లో రూపొందిస్తున్నాను’’ అని చెబుతోంది హనీఫా. (చదవండి: కరోనాలో దొరికిన ఆ సమయమే..ఆ యువకుడుని కోటీశ్వరుడిగా చేసింది!) -
బాలీవుడ్ బార్బీ
ప్రపంచ వ్యాప్తంగా బార్బీయ మేనియా కమ్మేసింది. మన దేశం కూడా ఇందుకు మినహాయింపు కాదు. బాలీవుడ్ సినిమాల బార్బీఫైడ్ సీన్లు వైరల్ అవుతున్నాయి. తాజాగా ‘ఓంశాంతి ఓం’ సినిమాలోని ‘ఫిర్ మిలేంగే ఛల్తే ఛల్తే’ పాటను బార్బీఫైడ్ చేశారు. పింక్ కోర్టులో షారుఖ్‌ఖాన్, దీపిక పదుకొణె బ్యాడ్మింటన్ ఆడుతూ పాడుతుంటారు. అయితే అది ‘ఫిర్ మిలేంగే...’ పాట కాదు. ఇంగ్లీష్ సాంగ్ రైటర్, సింగర్ దువ లిపా ‘బార్బీ’ సినిమా సౌండ్ ట్రాక్ కోసం రాసిన ‘బేబీ, యూ కెన్ ఫైండ్ మీ అండర్ ది లైట్స్/డైమండ్స్ అండర్ మై ఐస్’ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంటుంది. ఈ పాట నేపథ్యంలో షారుఖ్, దీపికాలను ‘బార్బీ’ సినిమాలో లీడ్ రోల్స్ పోషించిన మార్గోవ్ రాబీ(బార్బీ), రెయాన్ గాస్లింగ్ (కెన్)లుగా ఊహించుకోవాలి. -
వైరల్‌గా సోనియా, రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ ఫోటోలు
ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI). ఈ టెక్నాలజీ చేస్తున్న పనులకు ఇది ఎంతగానో పాపులర్ అయ్యింది. ఇదిలా ఉండగా కొందరు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సెలబ్రిటీల ఫోటోలను మారుస్తూ నెట్టింట షేర్ చేయడం ట్రెండ్‌గా మారింది. ఈ క్రమంలో ఇప్పటికే తమ అభిమాన స్టార్ హీరోల ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి మార్చగా.. తాజాగా ఆ వరుసలో రాజకీయ నేతలు కూడా చేరారు. అంతా బార్బీ ఫీవర్.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ట్రెండింగ్‌లో ఏది నడుస్తుంటే వాటిని ఫాలో అవుతుంటారు సహజమే. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చిత్రం బార్బీ రికార్డ్ కలెక్షన్లను కొల్లగొడుతోంది. దీంతో అంతటా బార్బీ ఫీవర్ నడుస్తోంది. ప్రజలు, వ్యాపారాలు, బ్రాండ్లు ఇలా ప్రతి ఒక్కటీ గులాబీ రంగులో దూసుకుపోతోంది. తాజాగా ఓ ఏఐ ఆర్టిస్ట్ భారత్‌లోని ప్రముఖ రాజకీయ నేతలను ఏఐ సాయంతో వారందరిని పింక్ డ్రెస్లోకి మార్చాడు. హూ వోర్ వాట్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. "వీరిలో మీకు ఎవరు ఇష్టం? ఇక్కడ బార్బీ, అక్కడ బార్బీ! ప్రతిచోటా బార్బీ" అని ఆ ఫోటోల కింద ఈ క్యాప్షన్‌ను జోడించారు. ఏఐ ఉపయోగించి భారత్‌లోని 10 మంది రాజకీయ నాయకులు వీళ్లే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, భారత హోం వ్యవహారాల మంత్రి అమిత్ షా, లోక్‌సభ మాజీ ప్రతిపక్ష నేత సోనియా గాంధీ, ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ నేత నితిన్ గడ్కరీ. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు వావ్, సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Who Wore What (@whoworewhat.club) -
ఒక్క వీకెండ్లో వేలకోట్ల కలెక్షన్స్.. ఏ మూవీకి ఎక్కువ?
వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ దగ్గర హాలీవుడ్ సినిమాల హవా నడుస్తోంది. గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన 'ఓపెన్ హైమర్', 'బార్బీ' సునామీ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. జస్ట్ ఒక్క వీకెండ్లో అంటే శుక్ర-శని-ఆదివారాలు కలిపి వేల కోట్ల వసూళ్లు సాధించాయి. ఈ విషయంలో రెండింటి మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. మరి ఏ సినిమా టాప్‌లో నిలిచింది. హాలీవుడ్లో ఫాంటసీ కామెడీ సినిమాగా 'బార్బీ' విడుదలైంది. గ్రెటా గెర్విగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 'బార్బీ ఫ్యాషన్ డాల్స్' పుస్తకం ఆధారంగా తీశారు. దాదాపు రూ.1200 కోట్ల బడ్జెట్ తో దీన్ని నిర్మించారు. తొలి వీకెండ్లోనే ఆ మొత్తాన్ని రాబట్టేసుకుంది. కేవలం మూడు రోజుల్లో 337 మిలియన్ డాలర్ల వసూళ్లు దక్కాయి. మన కరెన్సీ ప్రకారం రూ.2763 కోట్లు అనమాట. (ఇదీ చదవండి: విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!) మరోవైపు అమెరికా న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడంలో కీలక పాత్ర పోషించిన రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితం ఆధారంగా తీసిన సినిమా 'ఓపెన్ హైమర్'. ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్, హిస్టరీలో అతి ముఖ్యమైన సంఘటనకు పాలిటిక్స్ తో లింక్ చేస్తూ తెరకెక్కించిన ఈ మూవీకి క్రిస్టోఫర్ నోలన్ దర్శకుడు. 100 మిలియన్ డాలర్స్‌తో నిర్మిస్తే తొలి వీకెండే 174 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. మన కరెన్సీ ప్రకారం రూ.1426 కోట్లు అనమాట. ఈ రెండింటి కంటే రెండు వారాల ముందు అంటే జూలై 12న థియేటర్లలోకి వచ్చిన 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్'.. తొలి వీకెండ్ లో 235 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధించింది. అంటే రూ.1931 కోట్లు. ఇలా ఈ మూడు చిత్రాలు దాదాపు ఆరు వేల కోట్ల వరకు వసూళ్లు సాధించినట్టే. అయితే భారత్‌లో 'ఓపెన్ హైమర్' హవా నడుస్తుండగా, మిగతా చోట్ల మాత్రం 'బార్బీ' టాప్‌లో ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే సినీ ప్రేక్షకులు యాక్షన్, డ్రామా కంటే 'బార్బీ'లో కామెడీకే పట్టం కట్టారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్) -
అడల్ట్ మూవీకి ఓకే చెప్పిన సెన్సార్ బోర్డ్.. ఆ సీన్స్ ఉన్నప్పటికీ!
లైంగిక పరమైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో గ్రెటా గెర్విగ్ తెరకెక్కించిన చిత్రం 'బార్బీ'. ఈ చిత్రంలో ర్యాన్ గోస్లింగ్‌తో పాటు మార్గోట్ రాబీ నటించారు. తాజాగా ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. యూఏ సర్టిఫికేట్కు అర్థం ఏమిటంటే ఈ చిత్రంలో అడల్ట్ కంటెంట్‌తో పాటు.. కొన్ని అసభ్యకరమైన సీన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని 12 ఏళ్ల వయసులోపు పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలోనే చూడాలని సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్‌ను బట్టి అర్థమవుతోంది. (ఇది చదవండి: టైగర్ కా హుకుం వచ్చేశాడు.. ఈ వీడియోతో ఫ్యాన్స్‌కు పండుగే) అంతే కాకుండా ఈ చిత్రంలో హస్తప్రయోగంతో పాటు లైంగిక వేధింపుల దృశ్యాలు ఉండడంతో హాలీవుడ్ మూవీ బార్బీకి యూఏ సర్టిఫికేట్ ఇచ్చినట్లు సెన్సార్ బోర్డు తెలిపింది. ఈ మూవీలో కొన్ని అసభ్యకరమైన పదాలు, లైంగిక వేధింపుల సన్నివేశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని లైంగిక పరమైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. గ్రెటా గెర్విగ్ దర్శకత్వం వహించిన బార్బీ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ కాగా.. జూలై 21, 2023న థియేటర్లలోకి రానుంది. కాగా.. ఈ చిత్రంలో విల్ ఫెర్రెల్, ఎమ్మా మాకీ, కానర్ స్విండెల్స్, నికోలా కాగ్లాన్, ఎమరాల్డ్ ఫెన్నెల్, కేట్ మెక్‌కిన్నన్, మైఖేల్ సెరా, సిము లియు, అమెరికా ఫెర్రెరా, కుటి గట్వా, ఇస్సా రే, కింగ్స్లీ బెన్-అదిర్, రియా పెర్ల్‌మాన్, షారన్ ఇవాన్స్ , అనా క్రజ్ కేన్, రీతు ఆర్య, జామీ డెమెట్రియో ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: హీరోయిన్ వైష్ణవి పక్కన నటించిన ఈ 'బేబీ' గురించి తెలుసా..?) -
బార్బీరేఖ.. పిక్స్ వైరల్
అమెరికా బొమ్మల కంపెనీ ‘మ్యాటల్’ 1959లో ఫ్యాషన్ డాల్ ‘బార్బీ’ని లాంచ్ చేసింది. జర్మన్ అందాల బొమ్మ ‘బిల్డ్’ను స్ఫూర్తిగా తీసుకొని సృష్టించిన ‘బార్బీ’ తరాలకు అతీతంగా చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటూనే ఉంది. ఈ నెల 21న హాలీవుడ్ లైవ్–యాక్షన్ మూవీ ‘బార్బీ’ విడుదల కానుంది. దీనికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ ప్రచారంతో సంబంధం లేకపోయినా ‘మింత్ర’ సృష్టించిన చిత్రాలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. 68 సంవత్సరాల రేఖను ఏఐ వపర్‌తో అందాల బార్బీ బొమ్మగా మార్చి నెటిజనులను అబ్బుర పరిచింది ఇండియన్ ఫ్యాషన్ ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ మింత్ర. pic.twitter.com/4oeHzPU0Lm — Myntra (@myntra) July 5, 2023 -
ఇండియన్ బిజినెస్ ఉమెన్‌గా 2022 బార్బీ: తొలిసారి సరికొత్తగా
Indian Barbie Doll: కాలానుగుణంగా, ప్రమాణాలకు అనుగుణంగా మారుతూ వస్తున్న బార్బీ బొమ్మలు తాజాగా మరో కొత్త రూపును సంతరించుకున్నాయి. కేవలం అందానికే పరిమితమైన బార్బీ బొమ్మ తొలిసారి కొత్తగా ముస్తాబైంది. ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా, భారతీయ వ్యాపార మహిళగా 2022 బార్బీని తీసుకొచ్చామని కంపెనీ వెల్లడించింది. బార్బీ బొమ్మల తయారీ సంస్థ మాట్టెల్, మేకప్ బ్రాండ్ లైవ్ టింటెడ్ వ్యవస్థాపకురాలు, సీఈఓ దీపికా ముత్యాల సహకారంతో ఈ లేటెస్ట్ బార్బీ బొమ్మ రూపుదిద్దుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను దీపిక ముత్యాల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. లాంగ్ జుంకీలు, బ్యాంగిల్స్‌తో ప్యాంట్‌సూట్‌ను ధరించిన బార్బీ బొమ్మలను ఆమె పోస్ట్ చేశారు. లేత రంగు చర్మం, పెద్ద పెద్ద కళ్లు, చక్కగా తీర్చిదిద్దిన కనుబొమ్మలు, పవర్ సూట్‌తో హుందాగా ఉన్న 2022 బార్బీని కలవండి. సాంస్కృతిక అడ్డంకులను తొలగించుకని, సరికొత్త తీరాలనే లక్క్ష్యంతో, దయా దాక్షిణ్యాలతో, ప్రపంచాన్ని జయించాలనే గాఢమైన కోరికతో నిర్భయమైన సీఈఓ మా ఈ కొత్త బార్బీ అని ఆమె పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Deepica Mutyala (@deepica) -
ఎలిజబెత్ బార్బీ రాణి!
చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా ఆడుకునే బొమ్మల్లో బార్బీ చాలా ముఖ్యమైనది. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టపడేటట్టుగా ఉంటుంది బార్బీ. ఏడాదికేడాది సరికొత్త మెరుగులు దిద్దుకుంటూ వస్తోన్న బార్బీ ఇప్పుడు మహారాణి అయ్యింది. బొమ్మేంటీ మహారాణి అవడమేంటీ అనుకుంటున్నారా? ఎప్పుడూ అందంగా కనిపించే బార్బీ ఇప్పుడు మహారాణి డ్రెస్‌లో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న మహారాణులందరిలోకి బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ ఎంత ప్రత్యేకంగా ఉంటారో అందరికీ తెలిసిందే! అయితే ‘ఆమెకు నేనేమి తీసుకుపోను’ అన్నట్టుగా ఎలిజబెత్ రాణి గెటప్‌తో రెడీ అయ్యింది మన చిట్టి బార్బీ. మామూలు బార్బీ బొమ్మగా కంటే క్వీన్ ఎలిజబెత్ రూపంలో ధగధగా మెరిసిపోతూ దర్పం వెలిబుచ్చుతోంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 ఇటీవల 96వ పుట్టిన రోజు జరుపుకున్నారు. క్వీన్ ఎలిజబెత్–2 బ్రిటన్ రాజవంశంలో డెబ్బైఏళ్లుగా విజయవంతంగా పాలన కొనసాగిస్తూ ప్లాటినం జూబ్లి జరుపుకోబోతున్న మొదటి వ్యక్తిగా నిలవడంతో ఆమె రూపంతో బార్బీని రూపొందించారు. ఈ పుట్టినరోజుకు బార్బీ బొమ్మను ఎలిజబెత్ రాణిలా రూపొందించి విడుదల చేసింది బార్బీ బొమ్మల కంపెనీ. గత డెభ్బై సంవత్సరాలుగా ఏడాదికో థీమ్, ప్రత్యేకతలతో బార్బీ సంస్థ మ్యాటెల్ సందర్భానుసారం బార్బీ బొమ్మలను విడుదల చేస్తోంది. ఈ ఏడాది ఎలిజబెత్ రాణి–2 పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆమె రూపాన్ని బార్బీలో ప్రతిబింబించేలా చేసింది. చూబడానికి ఈ బార్బీ నిజమైన క్వీన్‌లాగే కనిపిస్తుంది జూన్ 2–5 వరకు నాలుగురోజుల పాటు ప్లాటినం జూబ్లి సెలబ్రేషన్స్‌ను నిర్వహించబోతున్నారు. బ్రిటన్ మహారాణిగా డెబ్బై ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్లాటినం జూబ్లి వేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలు ఉన్నందున ఏప్రిల్ 21న మహారాణి పుట్టిన రోజు వేడుకలు ప్రైవేటు ప్లేసులో కొంతమందితో మాత్రమే నిర్వహించారు. ఈ వేడుకల్లో క్వీన్ బార్బీని విడుదల చేశారు. మ్యాటెల్ విడుదల చేసిన క్వీన్ బార్బీ బొమ్మ ఐవరీ తెలుపు గౌన్ వేసుకుని నీలం రంగురిబ్బన్, తల మీద మిరుమిట్లు గొలిపే అంచున్న తలపాగ ధరించడం విశేషం. అచ్చం రాయల్ కుటుంబ సభ్యులు ధరించే గౌను, రిబ్బన్‌తో బార్బీ ఎలిజబెత్ రాణిగా మెరిసిపోతుంది. ఈ గౌనుకు సరిగ్గా నప్పే యాక్సెసరీస్‌తోపాటు ఎలిజబెత్–2 కు తన తండ్రి జార్జ్–4 ఇచ్చిన పింక్ రిబ్బన్, తలకు అలంకరించిన కిరీటంతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ‘‘మహారాణి ఏ ఈవెంట్లో కనిపించినా ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆమె మార్క్ కనిపించేలా ఈ డిజైన్‌ను రూపొందించాము. భవిష్యత్ ప్రపంచం కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మహిళామణులకి గుర్తుగా ఈ సీరిస్‌ను మొదలుపెట్టాం. ఈ క్రమంలోనే క్వీన్ బార్బీని కూడా రూపొందించాం’’ అని బార్బీ సీనియర్ డిజైన్ డైరెక్టర్ రాబర్ట్ బెస్ట్ చెప్పారు. -
ఫ్రంట్‌లైన్ వారియర్.. బార్బీ
ప్రస్తుతం ప్రపంచమంతా... ఒలింపిక్స్ క్రీడలు, క్రీడాకారులు ఎవరు బాగా ఆడుతున్నారు? ఏ దేశానికి ఏయే మెడల్స్ ఎన్నెన్ని వస్తున్నాయి వంటి అంశాలపై ఆసక్తిగా గమనిస్తోంది. మరోపక్క పతకాలు సాధించిన క్రీడాకారులను భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలిచేలా ఆయా దేశాల ప్రభుత్వాలు ఉన్నత సత్కారాలతో స్వదేశానికి ఆహ్వానిస్తున్నాయి. క్రీడాకారులకు ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహకాలు, గౌరవ మర్యాదలతో వారు రాబోయే తరాలకు స్పూర్తిగా నిలుస్తారు. వీరిని చూసి మరెంతోమంది ఆ స్థాయికి ఎదగాలని కలలు కంటుంటారు. సరిగ్గా ఇదే విషయాన్ని బొమ్మల రూపంలో చెబుతోంది బార్బీ బొమ్మల తయారీ సంస్థ. ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బొమ్మలలో బార్బీ డాల్ ఒకటి. చిన్న పిల్లలను ముఖ్యంగా అమ్మాయిలను ఎంతగానో ఆకట్టుకునే ఈ బార్బీ బొమ్మలు సరికొత్తగా రాబోతున్నాయి. ఇప్పటిదాకా వ్యోమగామిగా, ఫైర్ ఫైటర్‌గా, గేమ్ డెవలపర్‌గా అనేక రకాలుగా రూపాంతరం చెంది పెద్దల నుంచి పిల్లల వరకు అందర్నీ ఆకట్టుకునే బార్బీబొమ్మలు ఈసారి సరికొత్త రూపంలో సందడి చేయనున్నాయి. దాదాపు రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కోవిడ్–19ను ఎదుర్కోవడంలో ధైర్యసాహసాలతో ముందుండి ప్రజారోగ్యం కోసం పోరాడుతున్న వారి రూపాలతో బార్బీ సంస్థ బొమ్మలను తీర్చిదిద్దింది. కోవిడ్ మహమ్మారి కోరలు చాస్తోన్న సమయంలో ముందుండి పోరాడిన ఆరుగురు మహిళల రూపాలతో బార్బీలను తయారుచేసింది. ఈ ఆరుగురి రూపాలను వారి వృత్తికి తగినట్లుగా డ్రెస్‌లు వేసి ఆకర్షణీయమైన బొమ్మలుగా మలిచింది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ రూపకల్పనలో కృషిచేసిన సారా గిల్బర్ట్ ఆరుగురిలో ఒకరుగా నిలవడం విశేషం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన గిల్బర్ట్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించారు. గిల్బర్ట్ బార్బీ బొమ్మగా మరింత ఆకర్షణీయంగా కనిపించారు. కురులను వదులుగా వదిలి, నేవీ బ్లూ రంగు ప్యాంట్ సూట్, తెల్లని జాకెట్‌తో సరికొత్త బార్బీ డాల్‌గా మెరిసిపోతున్నారు. గిల్బర్ట్తోపాటు న్యూయార్క్‌లో తొలి కోవిడ్ రోగికి వైద్యం అందించిన ఎమర్జెన్సీ రూమ్ నర్స్ అమీ ఓ సల్లివాన్, లాస్వేగాస్లో వివక్షకు గురైన డాక్టర్ ఆడ్రిక్రుజ్, హెల్త్‌కేర్‌లో జాత్యహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన కెనడాకు చెందిన మానసిక వైద్య నిపుణురాలు చిక స్టేసీ ఒరివ్వా, కోవిడ్ జన్యుక్రమాన్ని గుర్తించిన బ్రెజిల్ బయోమెడికల్ రీసెర్చర్ జాక్వెలిన్ గోస్డిజెస్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్కోసం ‘ఉతికి మళ్లీ వేసుకోగల’ సర్జికల్ గౌనును రూపొందించిన ఆస్టేలియా డాక్టర్ కిర్బి వైట్లు బార్బీ బొమ్మల్లో ప్రేరణాత్మకంగా ఒదిగిపోయారు. మహమ్మారి కోరలు చాస్తోన్న సమయంలో తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి, ధైర్యంగా ముందుండి పోరాడిన హెల్త్ వర్కర్స్ కృషిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బార్బీ సంస్థ మాట్టె్టల్ తెలిపింది. ‘‘ఫ్రంట్‌లైన్ వారియర్స్ పడ్డ ఆందోళన, చేసిన కృషిని భవిష్యత్ తరాలకు అందించడానికి సరికొత్త బార్బీడాల్స్ను తీసుకొచ్చాము. మా ప్రయత్నం కొంతమంది చిన్నారుల్లోనైనా స్పూర్తి తీసుకురాగలిగితే ఆ దిశగా వారు ఎదుగుతారని ఆశిస్తున్నాం’’ అనిÐ ] ూట్టెల్ యాజమాన్యం చెప్పింది. ‘‘బార్బీ బొమ్మను నా రూపంలో రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దడం చాలా సంతోషంగా ఉంది. టీకా నిపుణిరాలిగా నా ప్రతిమను బార్బీలో చూసిన అమ్మాయిల్లో కొంతమంది అయినా సైన్స్‌ను కెరియర్‌గా ఎంచుకుని అద్భుతాలు సాధించాలి’’ అని గిలబర్ట్ చెప్పింది. -
బార్బీలకు న్యూ లుక్
కొత్త సంవత్సరంలో కొత్త కొత్త ప్రొఫెషన్లలో బార్బీడాల్స్ కనిపించబోతున్నాయి! మెరైన్ బయాలజిస్ట్, ఆస్ట్రోఫిజిసిస్ట్, ఫొటోజర్నలిస్ట్, కన్సర్వేషనిస్ట్, ఎంటోమాలజిస్ట్ బార్బీలను డిజైన్ చేయడం కోసం ఆ బొమ్మల తయారీ సంస్థ.. నిజ జీవితంలోని సంబంధిత వృత్తి నిపుణుల సలహాలను తీసుకుంటున్నాయి. చూడగానే ఫలానా ప్రొఫెషన్ అని పిల్లలు గుర్తుపట్టే వి«ధంగా ఈ బార్బీలు ఉంటాయి. భారతీయ సంతతికి చెందిన ఫారెస్ట్ ఎకాలజిస్ట్ నళినీ నాదకర్ణి.. ‘సైంటిస్ట్ ఎక్స్‌ప్లోరర్’ (అన్వేషించే శాస్త్రవేత్త) బార్బీని డిజైన్ చేసేందుకు ఆ సంస్థకు తోడ్పడుతున్నారు. ఆరేళ్ల తన కుమార్తె తనకు సైంటిస్ట్ బార్బీ కావాలని కోరినప్పుడు సైటిస్ట్ అని గుర్తుపట్టేందుకు అవసరమైన డిజైనింగ్ గురించి అప్పటినుంచే ఆమె ఆలోచిస్తూ ఉండగా ఇప్పుడీ అవకాశం వచ్చింది. అమ్మే స్వయంగా డిజైన్ చేసిన బార్బీ కొద్ది రోజుల్లోనే కూతురి చేతుల్లోకి రాబోతోందన్న మాట. -
కొత్త బార్బీ డాడీ!
బార్బీ కొత్త వెర్షన్.. లండన్, ప్యారిస్, న్యూయార్క్ అండ్ ఇంకొన్ని సెలెక్టెడ్ రీటెయిల్ దుకాణాల్లో ప్రపంచమంతా నిన్న సాయంత్రమే విడుదలయింది. ఇంకా కొన్నిచోట్ల ఇవాళ విడుదల అవబోతోంది. ఈ కొత్త బార్బీ పేరు జీజీ హాదీద్. ప్రఖ్యాత అమెరికన్ మోడల్ జీజీ హాదీద్ (22)ను ఈ బార్బీ తయారీకి మోడల్‌గా తీసుకున్నారు. మనదేశంలో కూడా కొన్నేళ్ల క్రితం ఐశ్వర్యారాయ్ లాంటి బార్బీ డాల్ని కూడా లాంచ్ చేశారు. ఇలా ఎప్పటికప్పుడు కొన్ని దేశాలల్లో ఉన్న అందగత్తెల ఫాలోయింగ్‌ని బట్టి బార్బీ డాల్ మోడల్స్ ప్రపంచమంతటా విడుదల అవుతుంటాయి. బార్బీ.. అందమైన అమ్మాయి. ఆత్మవిశ్వాసం గల అమ్మాయి. అందుకే ఇంటింటా అమ్మాయిలకు బార్బీ అంటే అంత ఆకర్షణ, ఆరాధన. బార్బీ డాక్టర్, బార్బీ ఆస్ట్రోనాట్, బార్బీ ఫైర్‌ఫైటర్, బార్బీ ఫిల్మ్‌స్టార్, బార్బీ పాప్ సింగర్.. ఇలా మోడళ్లతోనే అమ్మాయిలు ఎక్కువగా తమని తాము పోల్చుకుంటారట! రూత్ హ్యాండ్లర్ (1916–2002) అమెరికన్ మహిళ తొలిసారి 1959లో ఈ బార్బీ కాన్సెప్ట్‌కు పురుడు పోశారు. -
తల చుట్టూ దుపట్టాతో కొత్త మేకోవర్!
లాగోస్, (నైజీరియా): అందమైన కుందనాల బొమ్మ.. చూడగానే ముద్దొచ్చే చక్కని బొమ్మ. మోడ్రన్ దుస్తులు ధరించినా.. సంప్రదాయబద్ధమైన వస్త్రాలతో ముస్తాబైన ఆ బొమ్మ మగువకు ప్రతిరూపంగా నిలుస్తుంది. ఆ బొమ్మే పిల్లలకు ఎంతో ఇష్టమైన బార్బీ డాల్. ఈ కుందనాల బొమ్మ ఇప్పుడు సరికొత్త రూపుతో సోషల్ మీడియలో హల్చల్ చేస్తోంది. తలచుట్టూ దుపట్టా కప్పుకొని అచ్చమైన ముస్లిం సంప్రదాయ యువతి రూపులో బార్బీ బొమ్మ తాజాగా హల్చల్ చేస్తోంది. నిజానికి బార్బీ బొమ్మ రూపురేఖల్లో గత నెలకాలంలో ఎంతోమార్పు వచ్చింది. శరీర వర్ణంతోపాటు దుస్తులు, డిజైన్ విషయంలో పలు మార్పులు చేసింది. ఈ నేపథ్యంలోనే ఓ నైజీరియన్ వైద్య విద్యార్థిని హానీఫా ఆదం బార్బీ బొమ్మకు సంప్రదాయబద్ధమైన ముస్లిం రూపురేఖలు అద్దింది. తలచుట్టూ దుపట్టా కప్పుకొని ముస్లిం యువతిలా సంప్రదాయబద్ధంగా కనిపించే బార్బీ బొమ్మలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ వచ్చింది. ఈ ఫొటోలతో సోషల్‌మీడియలో హల్చల్ చేస్తుండటంతో హనీఫా ఇప్పుడు స్టార్‌గా మారిపోయింది. బ్రిటన్‌లో ఫార్మాకాలజీలో మాస్టర్స్ చదువుతున్న నైజీరియన్ విద్యార్థిని హానీఫా బార్బీ బొమ్మ తనకెంతో స్ఫూర్తినిచ్చిందని, అందుకే ఆ కుందనాల బొమ్మకు అచ్చమైన ముస్లిం సంప్రదాయబద్ధమైన రూపు ఇవ్వడం అవసరంగా తాను భావించానని, అందుకే బురఖాతోపాటు వివిధ ముస్లిం సంప్రదాయ దుస్తుల్లో బార్బీని తీర్చిదిద్ది పోస్టు చేస్తున్నానని ఆమె చెప్తోంది. -
బొమ్మలు... కాదు భామలు!
అందం ఇనుమడించడం కోసం సినీతారలు, సెలబ్రిటీలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవటం సర్వసాధారణమై పోయింది. సహజ సిద్ధమైన శరీరాకృతిని భిన్నంగా తీర్చి దిద్దుకుని ప్రత్యేకాకర్షణగా నిలిచేందుకు తాపత్రయ పడుతుంటారు. మనదేశంలో హీరోయిన్లు అందం కోసం ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించడం సర్వ సాధారణమైపోయింది. కొందరు ముక్కు, మరికొందరు పెదాలకు ఇలా శరీరభాగాలకు సర్జరీ చేయించుకొని అందాలను ఆరబోస్తున్నారు. అయితే సర్జరీ అవసరం లేకుండానే బార్బీ బొమ్మల్లా కనిపిస్తున్నారు వివిధ దేశాల్లోని కొందరు అమ్మాయిలు. అదెలాగో చూద్దాం. సహజ శరీరాకృతిని, ముఖ వర్చస్సును మార్చుకుని బార్బీల్లా కనిపించేందుకు కొందరు యువతులు తీవ్రంగానే కృషి చేస్తున్నారు. ఉక్రెయిన్ కు చెందిన ష్పాజినా అనే యువతి ప్లాస్టిక్ సర్జరీ లేకుండానే బార్బీ బొమ్మలా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. అందుకు కేవలం బరువు తగ్గి, మేకప్ వేసుకోవడంలో ఎంతో శ్రద్ధ చూపిస్తోందట. సన్నని తీగలాంటి శరీరం, బొమ్మలాంటి ఆకృతిలో ఏకంగా తన స్వరూపాన్నే మర్చేసుకొని కదిలే బార్బీలా మారిపోయింది. సర్జరీల్లేకుండానే ప్లాస్టిక్ డాల్స్ లా మారిన ఆరుగురు అమ్మాయిల్లో మరొక యువతి లక్యానోవా. ఉక్రెయిన్ కు చెందిన ఆమె అసలు ఏమాత్రం సర్జరీ జోలికి పోకుండానే బార్బీలా మారింది. కేవలం మేకప్ తో పాటు, కలర్ లెన్స్ వాడుతూ తన రూపాన్నే మార్చేసుకొందట ఆ బార్బీ గాల్. అలాగే రష్యన్ బార్బీగా పిలిపించుకుంటున్న అంజెలికా కెనోవా కనీసం ఆపరేటింగ్ రూమ్ దరిదాపులకు కూడ వెళ్ళకుండానే ప్లాస్టిక్ బొమ్మలా దర్శనిమిస్తోందట. ఉక్రెయిన్ కు చెందిన పదహారేళ్ళ లోలితా రిచి, పదమూడేళ్ళ అలినా కోవలేవ్సాయ కూడా శస్త్ర చికిత్సల్లేకుండానే కదిలే బార్బీ బొమ్మల్లా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక బ్రిటిష్ వీనస్ పలెర్మో అయితే తన బొమ్మలాంటి లక్షణాలతో జపాన్ లోని జనాన్ని ముగ్ధులను చేస్తోందట. -
ప్రేమంటే పడని కుర్రాడి కథ
ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర కథానాయకునిగా రూపొందుతోన్న చిత్రం ‘ప్రేమా గీమా జాన్తా నై’. బార్బీ కథానాయిక. సుబ్బు ఆర్వీ దర్శకుడు. మద్దాల భాస్కర్, బాల భాస్కర్ నిర్మాతలు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ-‘‘నవ్యమైన ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రమిది. యూత్‌ని ప్రభావితం చేసే అంశాలు ఇందులో ఉంటాయి. ప్రియాంక చోప్రా మేనకోడలు బార్బీహండ హీరోయిన్గా, మహానటుడు ఎస్వీరంగారావు మనవడు జూనియర్ ఎస్వీఆర్ విలన్‌గా ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతుండటం విశేషం. వచ్చే నెలలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ప్రేమంటే పడని ఓ కుర్రాడు ప్రేమలో పడ్డాక తన అభిప్రాయాన్ని ఎలా మార్చుకున్నాడు? అనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిదని, ఇందులోని ప్రేమ సన్నివేశాలు కొత్తగా ఉంటాయని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కార్యనిర్వాహక నిర్మాత: ఎం.ఎస్.కుమార్.