
బార్బీ కొత్త వెర్షన్.. లండన్, ప్యారిస్, న్యూయార్క్ అండ్ ఇంకొన్ని సెలెక్టెడ్ రీటెయిల్ దుకాణాల్లో ప్రపంచమంతా నిన్న సాయంత్రమే విడుదలయింది. ఇంకా కొన్నిచోట్ల ఇవాళ విడుదల అవబోతోంది. ఈ కొత్త బార్బీ పేరు జీజీ హాదీద్. ప్రఖ్యాత అమెరికన్ మోడల్ జీజీ హాదీద్ (22)ను ఈ బార్బీ తయారీకి మోడల్‌గా తీసుకున్నారు. మనదేశంలో కూడా కొన్నేళ్ల క్రితం ఐశ్వర్యారాయ్ లాంటి బార్బీ డాల్‌ని కూడా లాంచ్ చేశారు. ఇలా ఎప్పటికప్పుడు కొన్ని దేశాలల్లో ఉన్న అందగత్తెల ఫాలోయింగ్‌ని బట్టి బార్బీ డాల్ మోడల్స్ ప్రపంచమంతటా విడుదల అవుతుంటాయి.
బార్బీ.. అందమైన అమ్మాయి. ఆత్మవిశ్వాసం గల అమ్మాయి. అందుకే ఇంటింటా అమ్మాయిలకు బార్బీ అంటే అంత ఆకర్షణ, ఆరాధన. బార్బీ డాక్టర్, బార్బీ ఆస్ట్రోనాట్, బార్బీ ఫైర్‌ఫైటర్, బార్బీ ఫిల్మ్‌స్టార్, బార్బీ పాప్ సింగర్.. ఇలా మోడళ్లతోనే అమ్మాయిలు ఎక్కువగా తమని తాము పోల్చుకుంటారట! రూత్ హ్యాండ్లర్ (1916–2002) అమెరికన్ మహిళ తొలిసారి 1959లో ఈ బార్బీ కాన్సెప్ట్‌కు పురుడు పోశారు.
Comments
Please login to add a commentAdd a comment