Models
-
హైదరాబాద్ : వస్త్ర దుకాణంలో సందడి చేసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
-
హై లైఫ్ ఎగ్జిబిషన్ కర్టెన్ రైజర్ ఈవెంట్ లో మెరిసిన మోడల్స్...
-
బంజారాహిల్స్ : ఆసియా జ్యువెలరీ ఎగ్జిబిషన్లో మెరిసిన మోడల్స్ (ఫొటోలు)
-
ఏం పెళ్లి రా అది..! ప్రస్తుతం ట్రెండ్..
ఇటీవల పారిశ్రామిక కుబేరుడు అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుక ఎంత ఆర్భాటంగా జరిగిందో అందరూ చూశారు. వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రపంచం నలుమూలల నుంచి దిగ్గజాల వంటి అతిథులను పిలిపించారు. కానీ స్థానిక ధనవంతులు అంత స్థాయిలో కాకపోయినా అబ్బో అనిపించేలా తమ పిల్లల వివాహాలను జరిపిస్తున్నారు. సిలికాన్ సిటీలో ఇటువంటి పెళ్లిళ్ల పరిశ్రమ ప్రముఖంగా మారిపోయింది.సాక్షి, బెంగళూరు: గతంలో పెళ్లి అనేది చాలా శాస్త్రోక్తంగా జరగాలని భావించేవారు. అయితే నేటి రోజుల్లో తమ తమ ఆడంబరాలను చాటుకోవడానికి సంపన్నులు, ఆఖరికి మధ్య తరగతివారు కోట్ల రూపాయలు వెదజల్లి వైభవోపేతంగా చేసుకుంటున్నారు. డబ్బులు ఉంటే చాలు.. ఇంద్ర భవనం వంటి ఫంక్షన్‌హాల్స్, టూరిస్టు ప్రదేశాలలో మూడుముళ్ల వేడుకలు జరుగుతాయి. అందులోనూ వెడ్డింగ్ ప్లానర్ల పాత్ర పెరిగిపోయింది. భారీ బడ్జెట్ సినిమాను తీసినట్లుగా పెళ్లి తంతును మహా ఆర్భాటంగా చేయడం సిలికాన్ సిటీలో ట్రెండ్ అయ్యింది.వెడ్డింగ్ ప్లానర్లుగతంలో పెళ్లి అంటేనే ముహూర్తం, ఆభరణాలు, బట్టల కొనుగోలు, ఆహ్వాన పత్రిక, ఫంక్షన్ హాల్, ఫోటో, వీడియో గ్రాఫర్లు తదితర ఎన్నో అంశాలు మదిలో మెదులుతాయి.. ఇలా హడావుడి పెళ్లిళ్ల ఒత్తిడిని వెడ్డింగ్ ప్లానర్లు తప్పిస్తున్నారు. పెళ్లి బాద్యతలను వెడ్డింగ్ ప్లానర్లకు అప్పగిస్తే పెళ్లి పనులు అన్నీ వారే చూసుకుంటారు. ఇలాంటి వెడ్డింగ్ ప్లానర్లు ప్రస్తుతం బెంగళూరు ఎంతో వేగంగా పెరిగిపోతున్నారు.అన్ని హంగులూ ఉండాలి మరిసాధారణంగా ధనవంతులు తమ కుటుంబంలోని పెళ్లిళ్ల ద్వారా తాము ఎంత శ్రీమంతులమో తెలియజేయాలని అనుకుంటారని, అందుకు అనుగుణంగానే ఎంతో గ్రాండ్‌గా పెళ్లిళ్లు జరిగిస్తారని కొందరు ప్లానర్లు తెలిపారు. ఈ గ్రాండియర్, రిచ్‌నెస్ కోసం భోజనాల దగ్గరి నుంచి అతిథులకు ఇచ్చే గిఫ్ట్‌ల వరకు రాజీ పడడం లేదు. కొంతమంది శ్రీమంతులు తమ పెళ్లిళ్లలో సెలబ్రెటీలు ఉండాలని కోరుకుంటారని ప్లానర్లు తెలిపారు. పెళ్లిలో సినిమా, టీవీ ప్రముఖ నటీనటులు, మోడల్స్ పాల్గొనేలా చూడమని కోరుతుంటారు. మధ్య తరగతి కుటుంబాల కోసం రూ. 15 లక్షల నుంచి ప్యాకేజీ ప్రారంభమవుతుంది. ఒకవేళ గ్రాండ్‌గా పెళ్లి జరగాలంటే ఫుల్ ప్యాకేజీ కింద కనీసం కోటి రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయినా ఎవరూ వెనుకాడకుండా లగ్జరీ పెళ్లిళ్లకు సరే అంటున్నారు.నెలరోజుల్లో రూ.900 కోట్లపైనే వివాహం ఎంతో గ్రాండ్‌గా జరగాలి... అందరూ మన పెళ్లి కూడా చర్చించుకోవాలి అనే క్రేజ్ కర్ణాటకలో పెరిగిపోతోంది. ఇతర జిల్లాల నుంచి బెంగళూరుకు విచ్చేసి ఘనంగా పెళ్లి ప్లాన్ చేసుకుంటున్నారు. బెంగళూరులో నవంబర్ 12 నుంచి డిసెంబర్ 16 మధ్య సుమారు 13 వేలకు పైగా పెళ్లిళ్లు ఉన్నట్లు ప్లానర్లు తెలిపారు. ఈ సమయంలో డెకరేషన్, సెట్డిజైనర్, షామియానాలు, మేకప్ కళాకారులు, ఫోటో, వీడియో గ్రాఫర్లు, బ్యాండ్ సెట్, లైటింగ్, కేటరింగ్, ఆర్కెస్ట్రా, ఆభరణాల కొనుగోలు ఇలా తదితర అంశాల కోసం రూ. 900 కోట్ల మేర లావాదేవీలు జరిగే అవకాశం ఉందని వెడ్డింగ్ ప్లానర్లు అంచనా వేస్తున్నారు. ఇక కొందరైతే సముద్ర తీరం, రాజ ప్యాలెస్, అందమైన పరిసరాలు, ఖరీదైన స్టార్ హోటళ్లలో కొద్దిపాటి సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడుతున్నట్లు వెడ్డింగ్ ప్లానర్లు చెబుతున్నారు. బెంగళూరు చుట్టుపక్కల గడిచిన నెల రోజుల్లో సుమారు 9 డెస్టినేషన్ వెడ్డింగ్‌లు జరిగాయి. మరో 17 పెళ్లిళ్లు నిశ్చమయ్యాయి. గతంతో పోలిస్తే ఈసారి డెస్టినేషన్ వెడ్డింగ్ సంఖ్య 10 శాతం పెరిగినట్లు ప్లానర్లు తెలిపారు. -
ఓల్డే..గోల్డు.. పాత మోడళ్లకు కొత్త హంగులు
వడ్డాణం, బంగారపు జడ.. ఓస్ ఈ పేర్లు నిన్నా మొన్నటివే కదా అంటారా? అయితే కంకణాలు, కంటెలు? ‘ఇవెక్కడో విన్న పేర్లలాగే ఉందే’ అనుకుంటున్నారా? కాసుల మాలలు, గుట్ట పూసలు? బాబోయ్ ఇవెక్కడి పేర్లు అంటూ ఆశ్చర్యపోతున్నారా? మీరు చాలా పాతకాలం నాటి మోడ్రన్ జ్యువెలరీ ట్రెండ్స్‌కి ఇంకా దూరంగానే ఉన్నారని అర్థం.. ‘పాత ఒక వింత.. కొత్త ఒక రోత’ అన్నట్టు.. ఆభరణాల ట్రెండ్ కనిపిస్తోంది. మరోవైపు బరువైనా వెరపులేదంటున్న మహిళలు.. వంటి నిండా దిగేసుకుంటున్న నగలన్నీ కలిపితే.. సగటు బంగారం బరువు రెండు కిలోలుగా చెప్పొచ్చు. – సాక్షి, సిటీబ్యూరో ‘ఏమిటలా వంటినిండా ఆభరణాలు దిగేసుకున్నావ్? గుళ్లో అమ్మవారిలా?’ అంటూ ఆభరణ ప్రియులైన మహిళల్ని ఆటపట్టించే రోజులు గతించనున్నాయి. నడుముకు వడ్డాణాలు, బంగారపు పూలజడలు, కంఠాన్ని కప్పేసే నెక్లెస్‌లు.. వగైరాలన్నీ ఒకనాటి ఫ్యాషన్లే కావచ్చు.. అయితే పాతే వింత అంటున్న ఆధునికులు మోటుగా ఉంటాయంటూ తీసి పారేసిన నగల్ని మోజుగా ఆదరిస్తున్నారు. అంతేకాదు.. మరింతగా వెనక్కు వెళ్లి శోధించి.. మరీ పురాతన ఆభరణశైలుల్ని అందుకుంటున్నారు. మన అమ్మమ్మలు, అవ్వల కాలం నాటి స్టైల్స్‌కు ప్రాణం పోస్తున్నారు.కొత్తవాటి ‘కంటె’ మిన్న.. ఒకప్పటి పూర్తి సంప్రదాయ ఆభరణం అయిన కంటెలు మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చాయి. రాజుల కాలంలో ధరించేవారట.. ఇటీవల మహానటి సినిమాలో సావిత్రి పాత్రధారిణి కీర్తి సురేష్ సైతం ధరించి కనిపిస్తుంది. కాళ్లకి పట్టీ టైప్‌లో ఉంటూ, మెడకి ధరించే ఈ కంటె చూడడానికి థిక్‌గా ఒక రాడ్డులా ఉంటుంది. దీనికే పెండెంట్స్, పెరల్ డ్రాప్స్ జోడించడం, అలాగే స్టోన్స్‌తో కార్వింగ్ చేయడం ద్వారా మరింత ఫ్యాషనబుల్‌గా మారుస్తున్నారు. రూ.2లక్షల నుంచి రూ.10లక్షల దాకా వీటి ధరలు ఉంటున్నాయి.కాసుల గలగల.. కాసుల పేర అంటూ తాతల కాలం నాటి సంప్రదాయం మరోసారి కొత్తగా చేస్తున్న సవ్వడి.. ఆధునిక మహిళల మెడలో గలగల మంటోంది. మెడలో వేసుకునే లక్ష్మీ కాసుల మాలలు ఇప్పుడు ట్రెండీ. మామిడి పిందెల రూపంలో ఉండే కాసులను కూడా తయారు చేస్తున్నారు. వీటిని మ్యాంగో మాలలని పిలుస్తున్నారు. కనీసం 25 పైసలంత సైజ్‌లో ఉండే కాసులతో తయారయ్యే మాల కనీసం 30 నుంచి 300 గ్రాముల దాకా బరువు ఉండేవి ధరిస్తున్నారు. వీటి ఖరీదు రూ.2లక్షల నుంచి రూ.10లక్షల దాకా ఉంటుంది.గుట్టలు గుట్టలుగా.. ఒకనాటి తెలంగాణ సనాతన సంప్రదాయ ఆభరణం గుట్ట పూసలు. ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యాయి. వీటిని షేప్‌లెస్ ముత్యాలతో చేస్తారు. ఏ వయసు వారైనా ధరించవచ్చు. రూ.3లక్షల నుంచి రూ.15లక్షల దాకా వివిధ ధరల్లో లభిస్తున్నాయి.కంకణం కట్టుకుంటున్నారు.. మోచేతి అందాన్ని పెంచే గాజులను.. దానికి ముందుగా బంగారు కంకణం ధరించడం అనేది చాలా పాత కాలం నాటి ఆభరణాల శైలి. అయితే ఆధునికులు కూడా ఈ తరహా ట్రెండ్‌ని అనుసరిస్తున్నారు. రెండు చేతులకూ గాజులతో పాటుగా ఒక్కో కంకణం తొడుగుతున్నారు. ఇవి చూసేందుకు లావుగా ఉంటాయి. ఒక్కోటి 30 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకూ బరువులో ఇవి రూ.1లక్ష నుంచి రూ.5లక్షల ధరల్లో లభిస్తున్నాయి.‘పాత’నగల.. జాతరలా.. మోటుగా ఉండే ఆభరణాలు అంటూ ఇప్పుడు ఎవరూ అభ్యంతరం పెట్టడం లేదు. ఓల్డ్ ట్రెండ్స్‌ని అడిగి మరీ చేయించుకుంటున్నారు. ఇక పెళ్లి వేడుకల్లో అయితే పాత కాలం నాటి ఆభరణాలు తప్పనిసరిగా మారాయి. ఇవి కాస్త ఖర్చుతో కూడుకున్నవే అయితే.. గతంలో ఉన్నత స్థాయి వాళ్లు మాత్రమే ధరించేవారు. ఇప్పుడు మిడిల్‌క్లాస్ కూడా వీటినే ఎంచుకుంటున్నారు. – శ్వేతారెడ్డి, ఆభరణాల డిజైనర్ -
దసరా ఉత్సవాల కోసం దాండియా సన్నాహక ఈవెంట్లో సినీ తారలు, మోడల్స్(ఫొటోలు)
-
ఇండియన్, వెస్ట్రన్ లుక్స్‌తో సందడి చేసిన మోడల్స్! (ఫొటోలు)
-
జూబ్లీహిల్స్ : మై పర్ఫెక్ట్ ఫిట్ డిజైనర్ స్టోర్‌లో మోడల్స్ సందడి (ఫొటోలు)
-
ఫ్యాషన్ హబ్‌గా మారబోతోన్న హైదరాబాద్
-
కేన్స్ ఫెస్టివల్లో హైలెట్‌గా 'కృష్ణ గువా నవరత్న హారం'!
ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకకు వివిధ సెలబ్రెటీలు, ప్రముఖులు విచ్చేసి రెడ్ కార్పెట్‌పై వివిధ రకాల డిజైనర్‌వేర్‌లు, గౌన్లు, వెస్ట్రన్ డ్రెస్‌లతో మెరిశారు. వారిలో అస్సాంకి చెందిన నటి మాత్రం భారతీయ సంప్రదాయ చీరలో మెరిసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇదే కోవలోకి ప్రస్తుతం వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త నిదర్శన గోవాని గావిన్ మిగ్యుల్ చేరిపోయారు. గోవాని కూడా అస్సాం నటి మాదిరి సంప్రదాయ చీరకట్టులో కనిపించారు. ఆమె కేన్స్ రెడ్ కార్పెట్‌పై జర్జోజీ ఎంబ్రాయిడరీ చీరతో స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకుంది. ఆమె ధరించిన చీరను వందమంది చేనేత వాళ్ళు తమ కళా నైపుణ్యంతో గ్లామరస్‌గా రూపొందించారు. అయితే ఈ వేడుకలో ఆమె చీర కంటే..గోవాని ధరించిన హారమే హైలెట్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందరూ తమదైన స్టైల్‌తో ఆకట్టుకోగా, గోవాని మాత్రం అత్యంత అరుదైన లగ్జరీయస్ జ్యువెలరీతో చూపురుల దృష్టిని తనవైపుకి తిప్పుకునేలా చేశారు. అయితే ఈ వేడుకలో ఆమె ధరించి జ్యువెలరీని కృష్ణ గువా నవరత్న హారం అని అంటారు. ఇది వందేళ్ల నాటి పురాతన నగ. దీన్ని మీనా జాదౌ జ్యువెలరీ వ్యాపారి ఘనాసింగ్ బిట్రూ రూపొందించారు. ఈ నెక్లెస్‌ని తయారు చేయడానికి సుమారు 200 మంది కళాకారులు తమ కళా నైపుణ్యంతో 1800 గంటలు శ్రమకు ఓర్చి మరీ రూపొందించారు. నిజానికి ఈ నగలో వజ్రాన్ని పాశ్చాత్య కట్టింగ్ పద్ధుతును పక్కన పెట్టి పురాతన కటింగ్ పద్ధతిలో పోల్కీ వజ్రాలతో రూపొందించారు.పోల్కీ వజ్రాల చరిత్ర..ఇవి దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం భారతదేశంలో ఉద్భవించాయి. ఈ వజ్రాలను నాటికాలంలో మహారాజులు బాకులు, ప్లేట్లు, చెస్ సెట్లు, అద్భుతమైన నెక్లస్లలో ఈ పోల్కీ వజ్రాలను ఉపయోగించేవారు. View this post on Instagram A post shared by Nidarshana Gowani (@nidarshana_gowani) (చదవండి: ప్రియాంక చోప్రా న్యూ లుక్! ఏకంగా 200 క్యారెట్ల డైమండ్ నెక్లెస్..) -
లాక్మే ఫ్యాషన్ వీక్ 2024: వయ్యారి భామల సందడి, ఫోటోలు
-
లాక్మే ఫ్యాషన్ వీక్ 2024: అందాల భామల సోయగాలు ఫోటోలు
-
జూబ్లీహిల్స్ : ఇండో కాటన్ ఫ్యాషన్‌షోలో అదరగొట్టిన మోడల్స్ (ఫొటోలు)
-
వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్‌లో ఆకట్టుకున్న మోడల్స్ ర్యాంప్ వాక్.. ఫోటోలు
-
ఐ బౌటిక్ లో సినీ ప్రముఖులు మరియు మోడల్స్ సందడి (ఫోటోలు)
-
హైదరాబాద్ : సూత్ర ఎగ్జిబిషన్లో మెరిసిన మోడల్స్ (ఫొటోలు)
-
సరికొత్త చరిత్ర.. మిస్ నెదర్లాండ్స్‌గా ట్రాన్స్‌జెండర్ మహిళ
అమ్‌స్టర్‌డ్యామ్: మిస్ నెదర్లాండ్స్ కిరీటాన్ని ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ రిక్కీ వలేరి కొల్లే గెలుచుకుంది. అందగత్తెల పోటీలో ట్రాన్స్‌జెండర్ మహిళ ఈ ఘనత సాధించడం నెదర్లాండ్స్‌లో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ విధంగా ఆమె సరికొత్త చరిత్ర సృష్టించింది. 22 ఏళ్ల రిక్కీ వలేరి కొల్లే ప్రముఖ మోడల్స్ నుంచి ఎదురైన పోటీని అవలీలగా అధిగమించింది. విజేతగా నిలిచింది. మిస్ నెదర్లాండ్స్ టైటిల్ సాధించడం గర్వంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేసింది. మహిళలకు ఆదర్శం కావాలన్నదే తన లక్ష్యమని పేర్కొంది. ఎల్సాల్వేడార్లో జరుగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో రిక్కీ నెదర్లాండ్స్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. -
హార్లే డేవిడ్సన్ ఎక్స్440 బుకింగ్స్ షురూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హార్లే డేవిడ్సన్ ఎక్స్440 బైక్ బుకింగ్స్‌ను ప్రారంభించినట్టు హీరో మోటోకార్ప్ మంగళవారం ప్రకటించింది. అక్టోబర్ నుంచి డెలివరీలు ఉంటాయి. హార్లే డేవిడ్సన్ షోరూంలు, ఎంపిక చేసిన హీరో మోటోకార్ప్ ఔట్లెట్స్, ఆన్లైన్లో రూ.5,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. 440 సీసీ ఇంజిన్‌తో కూడిన ఈ బైక్స్‌ను నీమ్రానా ప్లాంటులో హీరో మోటోకార్ప్ తయారు చేస్తోంది. 440 సీసీ విభాగంలోకి ఇరు కంపెనీలు ఎంట్రీ ఇవ్వడం ఇదే తొలిసారి. మూడు వేరియంట్లలో ఎక్స్440 లభిస్తుంది. ఎక్స్‌షోరూం ధర రూ.2.29 లక్షల నుంచి ప్రారంభం. 2020 అక్టోబర్‌లో హీరో మోటోకార్ప్, హార్లే డేవిడ్సన్ చేతులు కలిపాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత్‌లో హార్లే డేవిడ్సన్ బ్రాండ్ ప్రీమియం మోటార్‌సైకిళ్లను హీరో మోటోకార్ప్ అభివృద్ధి చేయడంతోపాటు విక్రయిస్తుంది. (తప్పుదోవ పట్టించే ప్రకటనలు బీమా బ్రోకరేజీలపై ఫిర్యాదు) -
మోడల్ ప్రాణం తీసిన ర్యాంప్ వాక్
-
ఐవోఎస్ 17 అదిరిపోయే అప్డేట్: ఈ పాపులర్ ఐఫోన్ యూజర్లకు మాత్రం
న్యూఢిల్లీ: WWDC 2023లో టెక్ దిగ్గజం యాపిల్‌కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసింది. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టం 17 లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ను ప్రకటించింది. దీంతోపాటు 16 ఆపరేటింగ్ సిస్టంపై మరిన్ని అప్డేట్స్ ప్రకటించింది. లేటెస్ట్ iOS సాఫ్ట్వేర్ నుంచి మల్టీ హార్డ్‌వేర్ ప్రొడక్టుల వరకు కంపెనీ మొట్టమొదటి మిశ్రమ రియాలిటీ హెడ్సెట్ విజన్ ప్రోగా పిలుస్తోంది. ఐవోఎస్ 17 అందుబాటులో ఉండే ఐఫోన్ల జాబితాను కూడా కంపెనీ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో 3 పాపులర్ ఐఫోన్ మోడల్స్ ను తొలగించింది. సంస్థ ప్రకటించిన అధికారిక జాబితా ప్రకారం యాపిల్ ఎక్స్ఎస్, తరువాత మోడల్స్‌ను దీనికి అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే ఐవోఎస్ 17 అప్డేట్ లేని ఐఫోన్లలో క్రిటికల్ లోపాన్ని సవరించేందుకు స్పెషల్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇది ప్రస్తుతం డెవలపర్ ప్రోగ్రామ్ సభ్యులకు అందుబాటులో ఉంది. అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ వెర్షన్ వచ్చే నెలలో ఈ ఏడాది సెప్టెంబరు నాటికి లాంచ్ కానుందని అంచనా. IOS 17 సపోర్ట్‌తో యాపిల్ మిక్స్డ్ రియాలిటీ హెడ్‌సెట్‌ను కూడా పరిచయం చేసింది. ఐవోఎస్ 17 అప్డేట్ను పొందని ఐఫోన్లు ఐఫోన్ X iPhone 8 ఐఫోన్ 8 ప్లస్ iPhone SE ఫస్ట్ జెన్ -
ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ‘గార్బేజ్ క్వీన్స్’ : వైరల్ ఫోటోలు
సాక్షి,ముంబై: ఆర్టిఫిషిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆర్ట్ ఇంటర్నెట్ను కుదిపేస్తోంది. ఎస్కే ఎండీ అబు సాహిద్ అనే అర్టిస్ట్ మిడ్‌జర్నీ ఏఐ టూల్‌తో సృజనాత్మక చిత్రాలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా గార్బేజ్ క్వీన్స్ పేరుతో కొన్ని అద్భుతమైన చిత్రాలను ఇన్‌స్టాలో షేర్ చేశారు.భయంకరమైన చెత్తలో అందమైన మోడల్స్‌ను సృష్టించిడం ఈ సిరీస్ ప్రత్యేకత. (సింపుల్ వన్: లాంగెస్ట్ రేంజ్ స్కూటర్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా?) కాగా ఏఐ ఆర్ట్‌తో సునామీ సృష్టిస్తున్న సాహిద్ ఇప్పటికే పలు పిక్స్‌తో ఆకట్టుకున్నారు. ప్రముఖ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ వృద్ధాప్యంలో, స్థూలకాయులుగా మారిపోతే ఎలాంటి ఉంటారనే చిత్రాలను పోస్ట్ చేశారు. అలాగే బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ముసలివాళ్లుగా ఎలా ఉంటారు? బిజినెస్ టైకూన్స్ జిమ్‌లో ఎలా ఉంటారనే ఊహకు ప్రాణం పోస్తూ మరికొన్ని పిక్స్‌ను షేర్ చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే ఇలాంటి ఆసక్తికరమైన, ఊహాజనిత చిత్రాలు చాలానే చూడొచ్చు సాహిద్ ఇన్‌స్టాలో. ఇదీ చదవండి: వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్, అందంగా సల్మాన్ ఖాన్ View this post on Instagram A post shared by SAHID (@sahixd) -
కూకట్‌పల్లిలో వస్త్ర దుకాణం ప్రారంభోత్సంలో మోడల్స్ సందడి (ఫొటోలు)
-
కర్టెన్‌రైజర్ ఈవెంట్లో మోడల్స్ సందడి
-
కర్టెన్‌రైజర్ ఈవెంట్లో మోడల్స్ సందడి
-
విజయవాడ : బంగారు ఆభరణాల ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్ (ఫొటోలు)
-
హైదరాబాద్ : పంజాగుట్టలోని నగల దుకాణంలో మెరిసిన మోడల్స్ (ఫోటోలు)
-
విజయవాడలో మోడళ్ల సందడి (ఫొటోలు)
-
మోడల్స్‌పై గ్యాంగ్ రేప్.. 67 మంది అరెస్ట్
జోహెన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో అక్రమ చొరబాటుదారులు పైశాచికానికి తెగబడ్డారు. మ్యూజిక్ వీడియో షూట్‌లోకి ఆయుధాలతో చొరబడి.. మోడల్స్‌పై గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు. అంతేకాదు.. మగవాళ్ల దుస్తులు ఊడదీసి.. వాళ్లతో డ్యాన్సులు చేయించి మరీ పైశాచిక ఆనందం పొందారు. దక్షిణాఫ్రికా జోహెన్నెస్‌బర్గ్ పశ్చిమంగా ఉన్న క్రూగర్స్‌డ్రాప్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు శుక్రవారం వెల్లడించారు. నిందితులను జామా జామాలుగా గుర్తించిన జోహెన్నెస్‌బర్గ్ పోలీసులు.. అక్రమ మైనింగ్ కోసం పొరుగు ప్రాంతాల నుంచి అక్రమంగా చొరబడతారని, తరచూ దోపిడీలకు పాల్పడతారని వెల్లడించారు. వాళ్లు దాడి చేసింది దోపిడీ కోణంలోనే అయినా.. మోడల్స్ కనిపించేసరికి అత్యాచారానికి తెగబడ్డారని, ఇలా జరగడం ఇదే మొదటి ఘటన అని పోలీసులు తెలిపారు. బాధితులంతా 35 ఏళ్ల లోపువాళ్లేనని తెలుస్తోంది. ఆపై మగవాళ్లతో నగ్న నృత్యాలు చేయించి.. వాళ్ల దగ్గర ఉన్న సొమ్ము, నగలను దోచుకెళ్లారు. గుంపుగా దుండగులు దాడి చేసినట్లు బాధితులు వెల్లడించగా.. 67 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లలో చాలామంది అక్రమ చొరబాటులేనని నిర్ధారించారు. ఇక ఘటనపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా స్పందించారు. అలాంటి మృగాలకు బతికే హక్కు లేదని, కఠిన శిక్ష విధించి తీరతామని తెలిపారు. -
బాయ్‌ఫ్రెండ్ నుంచి కాల్.. తర్వాత మోడల్ ఆత్మహత్య
Kolkata Model Pooja Sarkar Suicide After Boyfriend Call: ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో తరచుగా విషాదం నెలకొంటోంది. అనారోగ్య సమస్యలతో కొందరు మరణిస్తే, ఆత్మహత్యలకు పాల్పడుతూ పలువురు తనువు చాలిస్తున్నారు. వీరిలో కొందరు మోడల్స్ సైతం ఉంటున్నారు. తాజాగా కోల్‌కతాలో పూజా సర్కార్ (21) అనే మోడల్ విగతజీవిగా కనిపించింది. తను నివసిస్తున్న అద్దె ఇంట్లో ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూజా సర్కార్ నార్త్ 24 పరగణాస్ జిల్లాలో మొదటి సంవత్సరం చదువుతోంది. సౌత్ కోల్‌కతాలోని బాన్స్‌ద్రోని ప్రాంతంలో నివసిస్తోంది. శనివారం (జులై 16) సాయంత్రం తన ఫ్రెండ్స్‌తో కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది పూజా. రెస్టారెంట్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పూజాకు ఒక కాల్ వచ్చింది. దాని తర్వాత గదిలోకి పరిగెత్తి లోపలి నుంచి తాళం వేసుకున్న పూజా.. ఆమె ఫ్రెండ్స్ ఎంత ప్రయత్నించినా తలుపు తీయలేదు. దీంతో పూజా స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. రంగప్రవేశం చేసిన పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా పూజా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. అయితే ఆమె చనిపోవడానికి ముందు తన బాయ్‌ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చిందని పూజా స్నేహింతులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. చదవండి: ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు బికినీలో రచ్చ చేస్తున్న 'బ్యాచ్‌లర్' హీరోయిన్.. కాగా గత మూడు నెలల్లో ముగ్గురు మోడల్స్ బలవన్మరణం చెందారు. బిదిషా డే మజుందార్ అనే కోల్‌కతా మోడల్ మే 24న డమ్‌డమ్‌లోని తన ఫ్లాట్‌లో ఉరివేసుకుని చనిపోయింది. తర్వాత పరిశ్రమలోని బిదిషా స్నేహితురాలు మోడల్ మంజుషా నియోగి కూడా మే 27న పటులిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ మోడల్స్ ఇద్దరూ రిలేషన్షిప్తోపాటు సరైనా అవకాశాలు రాకపోవడం, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. చదవండి: పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర బ్యూటీ!.. ఫొటోలు వైరల్ పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. (మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com) -
తరాష్ ఎగ్జిబిషన్లో జిగేలుమన్న భామలు
-
Tolichowki: మినర్వా స్వీట్లో మోడల్స్ సందడి (ఫోటోలు)
-
ఫెస్టివల్ షో యగం
-
రెస్టారెంట్లో మోడల్స్ సందడి
సాక్షి,హైదరాబాద్: భోజన ప్రియులుకు రుచికరమైన పుడ్‌ని అందించేందుకు సివిల్ గ్రూప్ అతిధి దేవోభవ రెస్టారెంట్‌ని కొత్తపేట నుంచి నాగోల్ మార్గమధ్యంలో అందుబాటులోకి తీసుకువచ్చారు. అతిథి దేవో భవ రెస్టారెంట్‌ను డిప్యూటి స్పీకర్ పద్మారావు గౌడ్, కార్పొరేటర్స్ వెంకట నర్సింహ, పవన్ కుమార్, ప్రేమ్ మహేష్, సామల హేమ, కండి శైలజ, సినీనటులు సర్లీన్ కౌర్, ఫారీదా యూసఫ్ మోడల్స్ కలసి కొత్తపేటలో ప్రారంభించారు. ఈ సందర్భంలో సినీనటిలు మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులను అందించేందుకు హైదరాబాద్ కేరాఫ్ గా నిలుస్తుందని అన్నారు. తనకు మటన్, చికెన్ చాలా ఇష్టం అన్ని చెప్పారు. రెస్టారెంట్ నిర్వాహకులు మహిచంద్ మాట్లాడుతూ త్వరలో బ్యాంకుట్ హాల్, రూమ్స్ కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రెస్టారెంట్ డిజైన్ ధీమ్ ప్రత్యేకమని డైనింగ్ సెటఫ్లో కూర్చునే ఆహార ప్రియులకు ఫుడ్ సర్వ్ చేయనున్నట్లు తెలిపారు. -
Sabyasachi: ఏడుపుగొట్టు మొహాల్లా ఉన్నారు..వీళ్లు మోడల్సా?
Sabyasachi Trolled For Picking Unhappy Models In Jewellery Ad: ఫ్యాషన్ రంగంలో సబ్యసాబి డిజైన్స్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్టార్ హీరోహీరోయిన్ల పెళ్లిళ్లు, ఫంక్షన్లు సహా మరే ఇతర వేడుకలో అయినా సభ్యసాచి డిజైన్స్ ఉండాల్సిందే అనేంతగా ఈ డిజైన్స్ ప్రాచుర్యం పొందాయి. అయితే ఇటీవలి కాలంలో సబ్యసాచి కలెక్షన్స్ నెటిజన్ల ట్రోలింగ్కి గురవుతున్నాయి. మొన్నటికి మెన్న మంగళసూత్ర యాడ్‌లో సెమీ న్యూడ్‌గా తీయించిన ఫోటోషూట్ తీవ్ర వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి సబ్యసాచి డిజైన్స్ హెడ్ సబ్యసాచి ముఖర్జీ చేయించిన యాడ్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తాజాగా సబ్యసాచి డిజైన్స్ వింటర్ కలెక్షన్-2021 పేరిట కొత్త కలెక్షన్స్ రిలీజ్ చేశారు. దీనిలో భాగంగా మోడల్స్..సభ్యసాచి డిజైన్స్ ధరించి ఫోటోషూట్ చేశారు. జ్యువెలరీ చూడటానికి చాలా బాగున్నాయి కానీ వాటిని ధరించిన మోడల్స్ మొహంలో ఏమాత్రం చిరునువ్వు లేదు. దీంతో ..ఎవరో చచ్చిపోయినట్లు ఆ మొహాలు ఏంటి? చావుకు వెళ్తున్నట్లు అలా ఉన్నారేంటి? అంటూ నెటిజన్లు ఏకిపారేశారు. 'మోడల్స్ ముఖంలో చావు కళ స్పష్టంగా కనిపిస్తుందని, అసలు వీళ్లు మోడల్సేనా' అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. మోడల్స్ అంటే ఎక్స్ప్రెషన్ కనిపించకపోయినా పర్వాలేదు కానీ ఇలా ఏడుపుగొట్టు ముఖాలు ఎందుకు పెట్టారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. Sabyasachi Jewellery for dying, depressed ladies. https://t.co/omWN1geXvp — Sudeep 🇮🇳 (@Sudeep1211) November 27, 2021 Why waste money on something that makes you look like you are going to attend a funeral?! 🙇♀️#Sabyasachi pic.twitter.com/U70Lagd0Ba — Nidhi Sharma 🇮🇳 (@Little_tempest) November 28, 2021 -
బొమ్మ కాదు.. ముద్దుగుమ్మ
-
మాజీ మిస్ కేరళ, రన్నరప్ మృతి: ఆడి కారులో వెంటాడి మరీ
తిరువనంతపురం: మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్(25), రన్నరప్ అంజనా షాజన్(26)ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కావాలనే కొందరు వ్యక్తులు వీరిని ఆడి కారులో వెంబడించినట్లు పోలీసులు గుర్తించారు. కారులో వీరిని వెంబడించిన సైజు థంకచన్కు డ్రగ్ పెడ్లర్స్‌తో సంబంధాలున్నట్లు విచారణలో తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. 2021, నవంబర్ 1న మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్(25), రన్నరప్ అంజనాలు ప్రయాణిస్తున్న కారు ఓ ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో అన్సీ కబీర్, అంజనాలు అక్కడిక్కడే మృతి చెందారు. అయితే చనిపోవాడానికి ముందు వీరు ఫోర్ట్ కొచ్చి ప్రాంతంలో ఉన్న హైఎండ్ హోటల్ నంబర్.18లో ఓ పార్టీ హాజరయినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: రోడ్డు ప్రమాదంలో మాజీ మిస్ కేరళ, రన్నరప్ దుర్మరణం) పార్టీ ముగిసిన తర్వాత మోడల్స్ ఇంటికి వెళ్తుండగా.. పార్టీకి వచ్చిన కొందరు అతిథులు మోడల్స్ ఇంటికి వెళ్తుండగా ఆడి కారులో వారిని వెంబడించారు. సీసీటీవీ కెమరా ఫుటేజ్‌లో ఆడి కారు మోడల్స్‌ని ఫాలో అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆడి కారు డ్రైవ్ చేసిన వ్యక్తి సైజు థంక్‌చన్ అని.. అతడికి కొచ్చిలోని డ్రగ్ పెడ్లర్స్‌తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి కొచ్చికి మాదక ద్రవ్యాలు తెచ్చే గ్రూప్ కోసం సైజు పని చేసేవాడని పోలీసులు తెలిపారు. పార్టీ ముగిసిన తర్వాత తనతో రావాల్సిందిగా సైజు మోడల్స్‌ని ఆహ్వానించాడు. కానీ వారు అంగీకరించలేదు. ఈ క్రమంలో సైజు వారిని ఫాలో అయ్యాడు. ఈ క్రమంలో ప్రమాదం జరిగి అంజనా, అన్సీ మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే పార్టీ జరిగిన హోటల్ హోటల్ యజమాని రాయ్ వాయలత్‌తో పాటు కొందరు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: సుశాంత్ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం) మే 2021లో సైజు ఫోటో జత చేసిన ఇంటెలిజెన్స్ నివేదిక ఒకటి నంబర్ 18 హోటల్లో జరిగిన పార్టీలలో డ్రగ్స్ వాడినట్లు తెలుపుతోంది. అయితే, హోటల్ యజమాని రాయ్ వాయలత్కు పోలీసులతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఈ కేసు తదుపరి విచారణ ముందుకు సాగలేదు. చదవండి: ఆడి కారు యాక్సిడెంట్: ఎన్నో అనుమానాలు.. అసలు ఏం జరిగింది? -
కిర్రాక్ బ్యూటీ మాకు మేమే సాటి..
-
చాక్లెట్ డ్రెస్సుల్లో అందాల ముద్దుగుమ్మలు
-
లాక్మే ఫ్యాషన్ వీక్.. తారల తళుకులు
-
డైమండ్ ధగధగల సౌందర్య సోయగం
-
Ola Electric Scooter:వచ్చేసిందోచ్... ఓలా.. ఆసక్తికరమైన ఫీచర్లు ఇవే
హైదరాబాద్: నెల రోజులుగా ఊరిస్తున్న ఓలా ఎలక్ట్రిక్ ధర గురుంచి నేడు తెలిసిపోయింది. పెట్రోలు ధరల బాదుడు నుంచి ఉపశమనం కలిగించే ఈ స్కూటర్ ను సొంతం చేసుకోవాలంటే ఎంత సొమ్ము చెల్లించాలనే విషయం వెల్లడైంది. ఓలా వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. S1, S1 Pro ప్రొ పేరుతో ఓలా రెండు మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకొనివచ్చింది. ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 మోడల్ ధర రూ.99,999గా ఉంటే ఎస్1 ప్రో మోడల్ ధర రూ.1,29,999గా నిర్ణయించారు. ఆగస్టు 15 మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఓలా ఎలక్ట్రిక్ లాంఛింగ్ ఈవెంట్లో ఈ వివరాలు వెల్లడించారు. . ఔరా అనిపిస్తున్న ఓలా - ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ S1, S1 ప్రో అనే రెండు విభిన్న వేరియంట్లలో విడుదల అయ్యింది. - S1 ఎలక్ట్రిక్ స్కూటర్ 50-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్, ఎల్ఈడీ లైటింగ్ అధునాత ఫీచర్లు అందిస్తోంది. - ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పది రంగుల్లో లభిస్తోంది. - ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రివర్స్ మోడ్‌లో కూడా పరుగులు తీస్తుంది. - ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం 90, ఫుల్ ఛార్జ్ చేస్తే 121 కిమీల దూరం వెళ్లనుంది. - ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ 3.6 సెకన్లలో 0-40 వేగాన్ని అందుకుంటుంది. - ఓలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం 115 కి.మీ. ఫుల్ ఛార్జ్ చేస్తే 181 కి.మీ. దూరం వెళ్లనుంది. - ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ 3 సెకన్లలో 0-40 కిమీ/గం చేయగలదని పేర్కొంది. - స్కూటర్ ఎస్1లో 7 అంగుళాల డిస్ప్లే ఉంది. ఇది 3 జీబీ ర్యామ్‌తోపాటు ఆక్టా కోర్ చిప్సెట్తో పనిచేస్తుంది. - ప్రత్యేక అప్లికేషన్ ఉపయోగించి స్కూటర్‌ను ఆటోమేటిక్‌గా లాక్, లేదా అన్‌లాక్ చేయవచ్చు. - ఓలా ఎస్1 లోకల్ నావిగేషన్ అప్లికేషన్‌తో వస్తుంది. - ఓలా స్కూటర్ 3.9 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఇది 8.5 కిలోవాట్ పీక్ పవర్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ కు పవర్ అందిస్తుంది. - ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 18 నిమిషాల్లో 0 నుండి 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. - లక్షకు పైగా ప్రీ బుకింగ్స్‌ను సాధించి ప్రపంచ రికార్డు సృష్టించింది. కోటి స్కూటర్ల తయారీ - ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను హోం డెలివరీ పద్దతిలో కస్టమర్లకు అందివ్వనున్నారు. ఇప్పటికే టెస్లా ఇదే పద్దతిలో తన కార్ల అమ్మకాలు చేపడుతోంది. ఆన్లైన్లో స్కూటర్ బుక్ చేసుకుంటే నేరుగా ఇంటికి వచ్చేస్తుంది. షోరూమ్‌ల వ్యవస్థ ప్రస్తుతానికి అందుబాటులో లేనట్టే. - 2021 ఫిబ్రవరిలో మొదటి స్కూటర్ని తయారు చేయడం ప్రారంభించగా ఫస్ట్ స్కూటర్ తయారీకి ఆరు నెలల సమయం పట్టింది. - తమిళనాడులో ఉన్న ఓలా మెగా ఫ్యాక్టరీలో స్కూటర్లు తయారవుతున్నాయి. ప్రారంభ దశలో ఏడాదికి 20 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసే అవకాశం ఉంది. గరిష్టంగా ఏడాదికి కోటి స్కూటర్ల తయారీ లక్క్ష్యంగా ఇక్కడ విస్తరణ పనులు జరుగుతున్నాయి. - స్కూటర్ సింపుల్ వన్, బజాజ్ చేతక్, ఏథర్ 450X, TVS iQubeలు ఓలా కంటే ముందే ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో మార్కెట్లో ఉన్నాయి (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మారుతి బంపర్ ఆఫర్, ఏ కారు ఎంత డిస్కౌంట్ లో వస్తుందో తెలుసా?
మీరు కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. కొనుగోలు దారులకు మారుతీ సుజుకీ ఇండియా కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. అరీనా, నెక్సా డీలర్ షిప్‌లలో మారుతి వాహనాలపై క్యాష్ డిస్కౌంట్, ఎక్సేంజ్ బోనస్ తో పాటు కార్పొరేట్ బెన్ ఫిట్స్ ను ఈ నెల చివరి వరకు సొంతం చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడమే కాదు భారీ ఆఫర్లు ప్రకటించి ఆటో మొబైల్ ఇండస్ట్రీలో తమకు సాటెవ్వరూ లేరని నిరూపిస్తుంది. తాజాగా మారుతీ తన కంపెనీ వాహనాలపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఆ ఆఫర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం? మారుతి సుజుకి ఆల్టో 800 మారుతి సుజికీ ఆల్టో 800పై ప్రస్తుత ప్రారంభ ధర రూ.2.99లక్షలు ఉండగా.. ఆ ధరపై (డిస్కౌంట్ వర్త్) క్యాష్ డిస్కౌంట్ తో కలిపి రూ.43,000వరకు తగ్గించనుంది. మారుతి సుజుకి ఎస్ - ప్రెస్సో మారుతి సుజుకి ఎస్- ప్రెస్సో ప్రారంభ ధర రూ.3.78 లక్షలు ఉండగా రూ. 48,000 వరకు బెన్ఫిషియల్ ఆఫర్‌ను అందిస్తుంది మారుతి సుజికి స్విఫ్ట్ మారుతి స్విఫ్ట్ ప్రారంభ ధర రూ.5.81లక్షలు ఉండగా.. ఆ కారుపై ఎక్ఛేంజ్ ఆఫర్‌ను కలుపుకొని రూ.49,000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తుంది మారుతి సుజికి ఎస్ క్రాస్ మారుతి సుజికీ ఎస్ క్రాస్ కారు ప్రారంభ ధర రూ.8.39లక్షలు ఉండగా ఆ కారుపై పర్చేస్ బెన్ఫిటిక్స్ కింద రూ.57,500వరకు డిస్కౌంట్ పొందవచ్చు. -
మోడల్ హంట్.. ఫ్యాషన్ ఈవెంట్
-
లాక్మే ఫ్యాషన్ వీక్ ఫోటోలు
-
లైఫ్‌స్టైల్ & బ్రైడల్ ఫ్యాషన్ షో..
-
బిజినెస్ ఉమెన్ ఎక్స్ పో
-
సౌత్ ఇండియా మోడలింగ్ మిస్టర్ & మిస్ హైదరాబాద్ 2021
-
'తలుక్' మనిపించిన మోడల్స్..
-
వజ్రం మెరిసె..మగువ మురిసె..
-
షేపవుట్..? ఫొటోషూట్..
‘నాకో మంచి పోర్ట్ ఫోలియో చేసిపెట్టండి’ అంటూ అభ్యర్థిస్తూ ఫొటో గ్రాఫర్లను కలిసేవారిలో సాధారణంగా గ్లామర్ రంగంలో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న ఔత్సాహిక యువతే ఎక్కువ.. అయితే ప్రపంచంలోని అందరి రూట్లనూ అన్ని సంప్రదాయాలనూ మార్చేసిన కరోనా దెబ్బకి ఇదీ మారిపోయింది. దీంతో ఇప్పటికే గ్లామర్ రంగంలో తమకంటూ ఒక ప్లేస్ ఉన్నవారు సైతం ఫిర్ ఏక్‌బార్ అంటూ ఫొటో షూట్స్ కోసం క్యూ కడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: ‘అవకాశాలు రావడం మొదలయ్యాక సదరు అవకాశాలు ఇచ్చిన వారి కోసం పాత్రలకు అనుగుణంగా ఫొటో షూట్స్ గ్లామర్ రంగంలో సర్వసాధారణం. అయితే ఇప్పుడు దాదాపు ప్రతి అప్‌కమింగ్ నటి/మోడల్ మళ్లీ తమని తాము మొదటి నుంచీ పరిచయం చేసుకోవాల్సి వస్తోంది. అందుకే మరోసారి పోర్ట్ ఫోలియో ప్లీజ్ అంటున్నారు’ అని చెప్పారు బంజారాహిల్స్‌లో స్టూడియో నిర్వహిస్తున్న ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ షరీఫ్ నంద్యాల. ఒత్తిడితో అధిక బరువు.. ⇔ అనూహ్యంగా వచ్చిపడిన మహమ్మారి దెబ్బకు అందాల తారల రొటీన్ మొత్తం తలకిందులైంది. మొదట్లో ఇది ఒక రోజో, ఒక వారమో ఉండిపోయేది అనుకుని తేలిగ్గా తీసుకున్న కొందరు.. రోజులు, నెలల తరబడి లాక్డౌన్ కొనసాగడంతో జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ⇔ నాలుగ్గోడల మధ్య ఉండటమనే అలవాటు లేని వారు, కొత్తగా వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకున్నవారు అంతలోనే ఈ దెబ్బ తగలడంతో ఒత్తిడికి లోనై, ఈటింగ్ డిజార్డర్‌కు గురై బరువు పెరిగిపోయారు. ⇔ యోగా వంటివి చేసినప్పటికీ జిమ్స్‌లో తప్పనిసరిగా చేయాల్సిన స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి బాడీ టోనింగ్ వ్యాయామాలు చేయకపోవడంతో మరికొందరిలో ఆ మేరకు కండరాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ‘రూపు’దిద్దుకోండి.. నగరంలో గ్లామర్ రంగం ఇప్పడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటోంది. వెబ్ సిరీస్, టీవీ సీరియల్స్, సినిమా షూటింగ్స్, యాడ్ షూట్స్.. నిదానంగానే అయినా పుంజుకుంటున్నాయి. దీంతో తారలు మళ్లీ తమ ‘పాత్ర’లు పోషించడం కోసం సిద్ధమవుతున్నారు. ⇔ సిద్ధమవుతున్న వారు.. తమలో ఎలాంటి మార్పులూ రాలేదని రుజువు చేసుకోవాల్సిందిగా నిర్మాతలు, రూపకర్తల నుంచి ఆదేశాలు అందుతున్నాయి. దీంతో వీరంతా.. జిమ్‌లలో కసరత్తుల టైమ్ పెంచడంతో పాటు సరికొత్త పోర్ట్ ఫోలియోలను రూపొందించమని ప్రముఖ ఫొటోగ్రాఫర్లను కలుస్తున్నారు. ⇔ విచిత్రం ఏమిటంటే.. తమను తాము పరిచయం చేసుకోవడానికి మంచి ఆల్బమ్ రూపొందించమని అడగాల్సిన ఔత్సాహికులు.. కోవిడ్ పుణ్యమాని ఇప్పుడు కొత్త అవకాశాలు దక్కించుకునే పరిస్థితి లేకపోవడం పోర్ట్ ఫోలియోలను వాయిదా వేసుకుంటున్నారు. ఈ చిత్రమైన పరిస్థితులు ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారాయి. కొలత.. కలత.. ⇔ నిత్యం తీసుకుంటున్న కార్బొహైడ్రేట్లను, కేలరీలను కొలుచుకుంటూ ఆ ప్రకారం ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాన్ని రోజువారీ పనుల్లో భాగంగా మార్చడం వగైరాలు గ్లామర్ రంగంలో పనిచేస్తున్న వారికి మరీ ముఖ్యంగా యువతులకు ఎంత ముఖ్యమో తెలియంది కాదు. ⇔ రూపురేఖలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే రంగం కాబట్టి.. అవకాశాలు అందించడంలో ఫిజికల్ ఫిట్నెస్, మెజర్మెంట్స్ కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే అంగుళాలతో సహా లెక్కించుకుని, శరీరపు కొలతల్లో ఎటువంటి తీవ్రమైన మార్పు చేర్పులూ చోటు చేసుకోకుండా కేర్ తీసుకుంటారు గ్లామర్ తారలు. పోర్ట్‌ఫోలియో తప్పదు.. కొత్తగా అవకాశాలు అందుకోవాలనుకున్నవారు మాత్రమే కాదు లాక్డౌన్ తర్వాత అందరూ కొత్త తారలే అయ్యారు. ఫ్రెష్ ఫొటోషూట్ ద్వారా మాత్రమే వారు తమ లుక్ మీద కాన్ఫిడెన్స్ తెచ్చుకోగలుగుతున్నారు. లాక్డౌన్ సడలింపుల తర్వాత నేను చేసిన వర్క్స్‌లో తారల పోర్ట్ఫోలియోలే ఎక్కువగా ఉన్నాయి. – షరీఫ్ నంద్యాల, ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ -
భాగ్యనగరంలో మోడల్స్ సందడి
-
బ్రాండ్ ఫ్యాక్టరీ అన్‌లాక్ సేల్ మోడళ్లు సందడి
-
టెస్లాకు పోటీగా లూసిడ్ మోటార్స్..
ముంబై: ఎలక్ట్రిక్ వెహికల్స్ స్టార్టప్ కంపెనీ లూసిడ్ మోటార్స్ ఆధునిక టెక్నాలజీకి, విలాసానికి పెట్టింది పేరు. స్పీడ్ డ్రైవింగ్ ఇష్టపడే వారికి లూసిడ్ శుభవార్త తెలిపింది. లూసిడ్ ఏయిర్ ఈవీ అనే మోడల్ కారు గంటకు 300 కిలోమీటర్లు వాయు వేగంతో ప్రయాణించనన్నట్లు పేర్కొంది. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రత్యేకతను చాటుకుంటున్న టెస్లాకు ధీటుగా కొత్త ఎలక్ట్రిక్ కారును లూసిడ్ మోటార్స్ ఆవిష్కరించనుంది. 1/7 లూసిడ్ మోటార్స్ సిలికాన్ వ్యాలీ ప్రధాన కార్యాలయం గ్లోబల్ వెబ్ నుంచి ఎయిర్ ఎలక్ట్రిక్ సెడాన్ ఉత్పత్తి వెర్షన్‌ను ఆవిష్కరించనుంది. 2/7 డ్యూయల్ మోడల్ ఆర్కిటెక్చర్లో 1,080 హార్స్‌పవర్‌ను లూసిడ్ మోటార్స్ అత్యాధునిక సాంకేతికతతో ఆకట్టుకోనుంది 3/7 లూసిడ్ ద్వారా వేగవంతమైన ఛార్జింగ్ ఎలక్ట్రిక్ వాహనంగా చరిత్ర సృష్టించనుంది. ఇది ఒకే చార్జిపై 832 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు 4/7 సెడాన్ హెడ్‌ల్యాంప్స్‌లో విభిన్నమైన మైక్రో లెన్స్ సిస్టమ్ ఉంది. ఇవి అత్యంత ఖచ్చితమైన, అధునాతన లైటింగ్ వ్యవస్థను అందిస్తాయి. 5/7 మోడల్‌కు డ్రైవర్ సీటు ముందు 34 అంగుళాల కాక్‌పిట్ గ్లాస్, 5కే డిస్ప్లేతో ఆకర్శించనుంది 6/7 మోడల్లో సెంట్రల్ పైలట్ ప్యానెల్ వాహన వ్యవస్థలు, విధులను లోతుగా నియంత్రించడానికి డ్రైవర్‌కు, ప్రయాణీకులకు ఎంతో ఉపయోగకరం 7/7 మోడల్లో ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్ అత్యాధునిక సాంకేతికతతో 2021 సంవత్సరంలో మార్కెట్లో విడుదల కానుంది. -
ఆపిల్ ఐఫోన్12 ఫైనల్ లుక్?
సాక్షి, న్యూఢిల్లీ : డబ్ల్యూడబ్ల్యూడీసీ 2020 కార్యక్రమం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆపిల్ సంచలనానికి నాంది పలకనుందనే అంచనాల మధ్య ఆపిల్ తొలి 5జీ ఐఫోన్ 12కు సంబంధించి అనేక అంచనాలు మరోసారి హల్ చల్ చేస్తున్నాయి. ఐఫోన్ కు సంబంధించి తాజా డమ్మీ ఫోటోలు ఆసక్తిరంగా మారాయి. దాదాపు ఇదే ఫైనల్ డిజైన్ కావచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. తాజా లీకుల ప్రకారం 5.4, 6.1, 6.7 ఇంచ్‌ల భారీ డిస్ప్లేతో ఐఫోన్ 12ను లాంచ్ చేయనుంది. ట్రిపుల్ కెమెరాలతో దీన్ని తీసుకురానున్నట్టు భావిస్తున్నారు. 5జీ నెట్వర్క్ టెక్నాలజీని సపోర్ట్, నాచ్లెస్ డిస్ప్లేతో ఐఫోన్12కు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ నేడు (జూన్ 22 సోమవారం) రాత్రి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం పూర్తిగా వర్చువల్‌గా ఉండబోతున్న ఈ గ్రాండ్ మీట్ విశేషాలపై ఐఫోన్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్‌లో ఐఫోన్ 12ను విడుదల చేసేందుకు మొబైల్ దిగ్గజ సంస్థ ఆపిల్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. Here are the first iPhone 12 dummies: 3 sizes (5.4, 6.1, 6.7). Flat edges, 3 cameras on the bump like recent molds. Notch, cameras should not be taken 100%, but chassis promising. pic.twitter.com/fcw3bLhVEF — Sonny Dickson (@SonnyDickson) June 21, 2020 -
సెల్ఫీ విత్ బ్యూటీ
-
‘సూత్ర’ బ్రోచర్ ఆవిష్కరణ
-
బార్బిక్యూ భామలు
-
మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్_ 2017
-
మిర్రర్స్ సెలూన్
-
కాదెవరూ ఫ్యాషన్‌కు అనర్హం
సాక్షి, హైదరాబాద్: మీరెప్పుడైనా లావుగా, బొద్దుగా ఉన్నవాళ్లు మోడల్స్‌గా ఉండటం చూశారా ? అన్నీ ప్రముఖ షాపింగ్ మాల్స్‌లోనూ, ఈ-కామర్స్ సంస్థల్లోనూ కాస్త సన్నగా, నాజూకుగా ఉన్నవారినే మోడల్స్‌గా తీసుకొని తమ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేసుకుంటారు. అయితే ఈ సాంప్రదాయ పద్దతికి మేము వ్యతిరేకం అంటోంది యునైటెడ్ కింగ్డామ్ (యూకే)కి చెందిన ‘ప్రిటీ లిటిల్‌థింగ్’ (పీఎల్టీ) అనే రిటైల్ సంస్థ. తమ ఉత్పత్తులను స్థూలకాయులకు చేరువ చేసేందుకు హెయిలీ బాల్డవిన్ అనే సంస్థతో ప్రిటీ లిటిల్‌థింగ్ జతకట్టింది. దీనికై నాజూకుగా ఉన్న మోడల్స్‌తో పాటు బొద్దుగా (ప్లస్ సైజ్) ఉన్న పలువురిని ఎంపిక చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు ట్విటర్లో ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. ఆన్లైన్ సంస్థలు స్థూలకాయులకు సరిపడా సైజు దుస్తులను సరిగా చూపలేకపోవడంతో దుస్తుల ఎంపికలో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడక్కడా దొరికినప్పటికీ అవి అంతగా సంతృప్తిని ఇవ్వడం లేదని అంటున్నారు. ఈ సందర్భంలో వెలుగులోకి వచ్చిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ, వారికి కావాల్సిన దుస్తులను విభిన్న సైజుల్లో ఉన్న మోడల్స్ ద్వారా చేరువ చేస్తామని అంటోంది. అంటే ఇకపై లావుగా కనిపించే మోడల్స్ ఫోటోలు సైతం ఆ సంస్థ వెబ్సైట్లో కనిపించనున్నాయి. బొద్దుగా ఉన్నవారు ఏ బెరుకు లేకుండా తమకు సరిపడా దుస్తులను ఎంపిక చేసుకోవచ్చు. నెటిజన్లంతా ఈ మార్పును ఆహ్వానించడమే గాక, ఈ నిర్ణయం తీసుకున్న పీఎల్టీ సంస్థను ప్రశంసిస్తున్నారు. మహిళలు దీన్ని ట్విటర్లో షేర్ చేస్తూ ఇదో మంచి ఉద్యమమని అభిప్రాయపడుతున్నారు. -
బ్యూటీ స్మైల్
-
హెయిర్ స్టైల్ గ్లో..కలర్‌ఫుల్ షో
-
నడిచొచ్చిన నల్లపిల్ల
ఈ ఫొటోలోని అమ్మాయిలు ఆఫ్రికా అందాల భామలు. నగరంలో చదువుకుంటున్న వీరు... మోడల్స్‌గా రాణిస్తున్నారు. ర్యాంప్‌లపై మెరుస్తున్నారు. ఈ బ్లాక్ బ్యూటీల అందచందాలకు సిటీ ఫిదా అవుతోంది. ప్రతి ఈవెంట్లో ఒక్కరైనా ఆఫ్రికన్ మోడల్ కనిపిస్తున్నారు. అంతర్జాతీయంగా మోడలింగ్‌లో అగ్రస్థానంలో ఉన్నఆఫ్రికన్ అమ్మాయిలకు... ఇప్పుడు దేశీయ ఫ్యాషన్ రంగం దాసోహమంటోంది. ఈ నేపథ్యంలో సిటీకీ నయా గ్లామర్ తోడైంది. బ్లాక్ బ్యూటీలకు అవకాశాలు కల్పించేందుకు నగరంలో ప్రత్యేకంగా ఈవెంట్లు కూడా నిర్వహిస్తున్నారు. ‘ఫేస్ ఆఫ్ ఆఫ్రికా’ పేరుతో తొలి ఈవెంట్ నిర్వహించగా, ఇప్పుడు ‘మిస్ ఇండియా ఆఫ్రికా’ కాంటెస్ట్కూ నగరం వేదికవుతోంది. ఈ కల్చర్‌తో సిటీ ఫ్యాషన్ రంగం కొత్తపుంతలు తొక్కగా... ఆఫ్రికన్ అమ్మాయిలకు ఉపాధి లభిస్తోంది. నగరంలోని ఈ నయా ట్రెండ్‌పై వీకెండ్ స్పెషల్. సాక్షి, సిటీబ్యూరో : వెనకబడిన ప్రాంతానికి చిరునామాగా మారిన ఆఫ్రికా... అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి కూడాపేరొందింది. ఆఫ్రికన్ల గురించి మన దేశంలోని సాధారణ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం అయినా ఉండొచ్చు. కానీఅంతర్జాతీయ స్థాయిలో రాణించే టాప్ మోడల్స్‌లో ఆఫ్రికన్అమ్మాయిలదే అగ్రస్థానం. ఈ బ్లాక్ బ్యూటీలకు ఇటీవల మన దేశంలోనూ ర్యాంప్‌పై మెరిసే అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఫ్యాషన్ రంగం ఆఫ్రికన్ అమ్మాయిలకూ రెడ్కార్పెట్పరుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న మిస్ ఇండియా ఆఫ్రికా కాంటెస్ట్ పోటీలకు ఆడిషన్స్జరుగుతున్నాయి. ఇది నగరంలోని ఆఫ్రికా బ్యూటీలకు కొత్త గ్లామర్తీసుకొచ్చింది. నల్లని ఒత్తయిన జుట్టు, తీరైన ఫిజిక్, చక్కని హైట్వెయిట్ ఉన్న ఆఫ్రికా అమ్మాయిలు మన ర్యాంప్‌లపై బాగా సందడి చేస్తున్నారు. ఆఫ్రికా అందచందాలకు అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచం ఫిదా అయిపోతుండడంతో సిటీ కూడా అదే బాట పట్టింది. ఈ ట్రెండ్ డిజైనర్లు, కొరియోగ్రాఫర్లు... ఆఫ్రికన్ బ్యూటీస్ కోసం జల్లెడ పట్టేలా చేసింది. ఇది సిటీలోని ఆఫ్రికన్ పీపుల్‌కి కొత్త అవకాశాలు అందిస్తోంది. ‘ఇంతింతైన ఇంటర్నేషనల్ ట్రెండ్... నగరంలో జరిగే టాప్ ఫ్యాషన్ షోలలో ఒక్కరైనా ఆఫ్రికా మోడల్ ఉండడమనేది తప్పనిసరిగా మారింది. ‘సిటీలో అంతర్జాతీయ ఈవెంట్లు జరుగుతుండడంతో ఆఫ్రికా మోడల్స్ కోసం అడిగే డిజైనర్లు, కొరియోగ్రాఫర్లు ఎక్కువయ్యారు’ అని సిటీకి చెందిన మోడల్ కో–ఆర్డినేటర్ అహ్మద్ చెప్పారు. దీంతో నగరంలోని మెహదీపట్నం, టోలిచౌకి తదితర ప్రాంతాల్లో నివసించే ఆఫ్రికన్లకు చాన్స్‌లు పెరిగాయి. సూడాన్, నైజీరియా తదితర ఆఫ్రికా దేశాల నుంచి విద్య నిమిత్తం నగరానికి వచ్చే అమ్మాయిలకు ఇవి వరంగా మారాయి. ‘ఆఫ్రికా నుంచి అత్యధికులు బిజినెస్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ తదితర కోర్సుల కోసం నగరానికి వస్తున్నారు. ఫారిన్ లాంగ్వేజెస్ అభ్యసించేవారూ ఎక్కువే. చాలామంది ఆఫ్రికన్లు వెస్ట్రన్ కల్చర్ అంటే బాగా మక్కువ చూపిస్తుంటారు. అందుకు అనుగుణంగానే ఫ్యాషన్ షోలలో పార్టిసిపేట్ చేయడానికి కూడా సై అంటారు. వీరికి పార్ట్‌టైమ్ జాబ్‌గా కూడా ఇది ఉపకరిస్తోంది’ అని అహ్మద్వివరించారు. సిటీలోమరోఈవెంట్.. ‘అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఆఫ్రికా మోడల్స్ ఎందరో ఉన్నారు. అదే విధంగా మన సిటీలోనూ వారికి తగినంత ప్రాధాన్యం కల్పించాలని గతంలో ‘ఫేస్ ఆఫ్ ఆఫ్రికా’ పేరుతో ఈవెంట్ నిర్వహించాం. అందులో విజేతగా నిలిచిన కాంగో దేశపు అమ్మాయి ఇప్పుడు అంతర్జాతీయ మోడల్‌గా రాణిస్తోంది’ అని చెప్పారు నగరానికి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జోసెఫ్ సుందర్. ఇప్పుడు తాను మరికొన్ని సంస్థలతో కలిసి ‘మిస్ ఇండియా ఆఫ్రికా’ ఈవెంట్ నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈ తరహా పోటీ నగరంలోనే తొలిసారి కావడం విÔశేషం. ఈ కాంటెస్ట్‌లో 18 మంది అమ్మాయిలు నగరం నుంచి పాల్గొంటున్నారని, వీరిలో చాలామంది కళాశాల విద్యార్థినులే ఉన్నారని చెప్పారు. ట్రెడిషనల్ వేర్‌తో సహా విభిన్న రకాల దుస్తులతో ర్యాంప్‌లపై వీళ్లుమెరవనున్నారు. అందానికి చిరునామా... ఆఫ్రికాను ఒక దేశంగా మాత్రమే చాలా మంది భావిస్తారు. కానీ అది 54 దేశాల ఖండం. మన నగరంలో విభిన్న జాతులు, భిన్న సంస్కృతి సంప్రదాయాలకు చెందిన ఆఫ్రికన్లు ఉన్నారు. వాళ్లందరినీ ఒక చోటకు తీసుకురావడం, వారి దేశాల గొప్పదనాన్ని, విశిష్టతలను ప్రతిబింబింపజేయడం, ఆ అమ్మాయిల అందచందాలను, ప్రతిభను ప్రపంచానికి వెల్లడి చేయడం... ఈ కార్యక్రమ ఉద్దేశం. ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఫైనల్స్‌ను నగరంలోనే నిర్వహించాలని అనుకుంటున్నాం. – జోసెఫ్ సుందర్, కొరియోగ్రాఫర్ అనుబంధాల వేదిక.. భారత్, ఆఫ్రికా దేశాల మధ్య ప్రేమానుబంధాలు పెంపొందించాలనే ప్రధాన లక్ష్యంతో మిస్ ఆఫ్రికా ఇండియా ఈవెంట్ నిర్వహిస్తున్నాం. ప్రతి ఏటా జూన్–సెప్టెంబర్ మధ్యలో ఈ పోటీ ఉంటుంది. కేవలం బాహ్య సౌందర్యానికి మాత్రమే కాకుండా అంతర్గత సౌందర్యానికి ప్రాధాన్యతనిస్తూ ఈ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాం. భారత్‌లోని ఆఫ్రికా మహిళలు తమ అనుభవాలు పరస్పరం పంచుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, మహిళా సాధికారత అంశాలపై అనుభవం పొందేందుకు ఈ వేదిక ఉపకరిస్తుంది. హైదరాబాద్ సహా ఢిల్లీ, పుణె, బెంగళూర్ తదితర నగరాల్లో రీజనల్ పోటీలు జరుగుతున్నాయి. ఫైనల్స్ హైదరాబాద్‌లోనే నిర్వహిస్తాం. – లారిస్కా, ఈవెంట్ ప్రతినిధి -
‘దెయ్యాల ఫ్యాషన్ షో’, ఆన్లైన్లో సెటైర్లు
ఇప్పుడిప్పుడే సౌదీ మహిళలు తరతరాలుగా తమకు విధించిన ఆంక్షల నుంచి బయటపడుతూ వస్తున్నారు. క్రీడా పోటీలను వీక్షించడానికి స్టేడియాలకు వెళ్లే అనుమతి, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఒక్కొక్కటిగా పొందుతూ వస్తున్నారు. ఈ సంచలనాత్మక నిర్ణయాలను సోషల్ మీడియా సైతం ఆహ్వానిస్తోంది. కానీ ఇప్పుడిప్పుడే ఆంక్షల నుంచి బయటపడుతున్నామని ఆశించిన సౌదీ మహిళలకు ఆ దేశం షాకిచ్చింది. మహిళలే సెంట్రాఫ్ అంట్రాక్షన్గా నిలిచే ఫ్యాషన్ షోల్లో, వారికి బదులుగా డ్రోన్లను ప్రవేశపెట్టింది. సౌదీ అరేబియా జిద్ధాలో జరిగిన ఫ్యాషన్ షోల్లో డిజైన్లను ప్రదర్శించడానికి ఒక్క మహిళా మోడల్ కూడా పాల్గొనలేదు. వారికి బదులుగా డ్రోన్ల ద్వారా వస్త్రాలను ప్రదర్శించారు. దీంతో ఈ ఫ్యాషన్ షో చాలా ఫన్నీగా ఉందంటూ కామెంట్లు వస్తున్నాయి. ఈ ఫ్యాషన్ షోపై సోషల్ మీడియాలో పలువురు పలు అభిప్రాయాలను వెలువరిస్తున్నారు. ఇది చాలా భయానకంగా ఉందని, అధునాతన దుస్తులను దెయ్యాలు ధరించి ప్రదర్శిస్తున్నట్టు ఉందంటున్నారు. దెయ్యాల ఫ్యాషన్ షోగా అభివర్ణిస్తున్నారు. మరికొంత మంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సౌదీ అరేబియా మహిళల సాంప్రదాయిక దృక్పధంపై ఇది ప్రభావం చూపనుందని పేర్కొంటున్నారు. అయితే ఈ మాదిరి రియాక్షన్ వస్తుందని నిర్వాహకులు అసలు ఊహించలేదట. రంజాన్ నెలను దృష్టిలో ఉంచుకుని ఈ షోను ప్లాన్ చేసినట్టు తెలిసింది. కాగ, ఏప్రిల్‌లో జరిగిన తొలి ఫ్యాషన్ వీక్‌లో కూడా కేవలం మహిళా ప్రేక్షకులను అనుమతించారు. ఫీమేల్ మోడల్స్ ప్రదర్శించే వాటిని వారు మాత్రమే చూసేలా ఆ ఫ్యాషన్ షోను నిర్వహించారు. This Saudi Arabian fashion show replaced all its models with drones, to eerie effect: https://t.co/bD4Z3xxWy6 pic.twitter.com/PR09QMbPBW — Dazed (@Dazed) June 7, 2018 I’m dying at this fashion show in Saudi😂😂 they weren’t allowed female models pic.twitter.com/gkMt9bKQI8 — WORLDSTARHIPHOP (@WORLDSTARRCLIPS) June 8, 2018 -
ఆడి కార్లపై భారీ డిస్కౌంట్లు
సాక్షి, న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ దారు ఆడి తన కార్ల ధరలపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్టు వెల్లడించింది. తన పాపులర్ మోడల్ కార్లపై మూడునుంచి పదిలక్షల దాకా తగ్గింపును అందిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. మార్కెట్లో సవాళ్లను అధిగమించేందుకు భారతదేశంలో ఎంపిక చేసిన మోడళ్లపై పరిమిత కాలానికి కస్టమర్ బెనిఫిట్ స్కీంను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా ఆడి క్యూ3 తో పాటు, ప్రముఖ మోడల్స్ ఏ3, ఏ4, ఏ6 సెడాన్ల కార్ల కొనుగోళ్లపై రూ.2.7 లక్షల నుంచి రూ .10 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని తెలిపింది. జూన్ వరకు ఈ తగ్గింపు ధరలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. దిగుమతి సుంకాలు , ప్రతికూలమైన పన్నులు తదితర కారణాలు కారును సొంతంచేసుకోవాలని కలలు కనే కస్టమర్‌కు ప్రతిబంధకం కాకూడదని తాము భావిస్తున్నామని ఆడి ఇండియా ప్రెసిడెంట్ రాహిల్ అన్సారీ చెప్పారు. ఈ పథకం కింద 2018లో కొనుగోలు చేసి 2019లో వినియోగదారులు చెల్లింపులు చేయవచ్చని తెలిపింది. మార్కెట్లో తాము ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి వ్యూహంలో భాగంగాగానే ఆ ఆఫర్ అని చెప్పింది. అంతేకాదు ఎంపిక చేసిన మోడల్‌కార్లపై ఆడి ఛాయిస్ పథకం కింద 57శాతం బై బ్యాక్ ఆఫర్‌ను కూడా అందిస్తున్నట్టు వెల్లడించింది. 2016లో 7,720 యూనిట్లు విక్రయించగా, 2017 నాటికి 2 శాతం వృద్ధితో 7,876 యూనిట్లు విక్రయించామని ఆదివారం ప్రకటించింది. అయితే గత సంవత్సరం మే, జూన్ అమ్మకాలు మందగించడం, జీఎస్టీ సందర్భంగా విలాసవంతమైన కార్లపై భారీగా డిస్కౌంట్ల ఫలితంగా పుంజుకున్న అమ్మకాల నేపథ్యంలో ఆడి ఇండియా ఈ ఏడాది కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోందని మార్కెట్ వర్గాల అంచనా. 2018-19 బడ్జెట్లో, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహమిచ్చే దిశగా దిగుమతి సుంకాన్నిపెంచారు. సీకేడీ కార్లపై 10నుంచి 15 శాతం సుంకం పెంచగా మోటారు వాహనాలు, మోటారు కార్లు, మోటారు సైకిల్స్‌కు చెందిన విడిభాగాలపై 7.5నుంచి 15 శాతానికి కస్టమ్స్ డ్యూటీని పెంచిన సంగతి తెలిసిందే. -
నగ ధగలు... నయా వగలు
నగల.. వగలు మారుతున్నాయి. కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. సిటీలో జ్యువెలరీ ప్రియులు ఇప్పుడు ‘లైట్’ ఆభరణాలను ఇష్టపడుతున్నారు. ఒంటి నిండా దిగేసుకునే నగలకు బదులుగా... హెవీగా కనపడుతూనే లైట్‌గా ఉండే జ్యువెలరీ ట్రెండ్‌గా మారింది. గ్రాండ్‌గా కనపడుతూనే శరీరానికి చిరాకు కలిగించని ఆభరణాలను ఎక్కువ మంది యువతులు కోరుకుంటున్నారు. వీరిఅభిరుచులకు అనుగుణంగా జ్యువెలరీ డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి. వేళ్లకు పెట్టుకునే ఉంగరాల నుంచి చెవి రింగులు, బుట్టాలు, మణికట్టు గొలుసులు, ముక్కు పుడకలు, వివిధ రకాలు హారాలు, వడ్డాణాలు కూడా ఇప్పుడు కొత్త రీతిలో తయారవుతున్నాయి. వేసవితోపాటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో సిటీలో లైట్ జ్యువెలరీకి ఆదరణ బాగా పెరిగింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌తో పాటు సమ్మర్ కూడా కలిసొచ్చింది. దీంతో వేడుకలు జరుపుకునే వారితో పాటు వాటికి హాజరయ్యే ఆభరణాల ప్రియులు సీజనల్ జ్యువెలరీ గురించిఅన్వేషిస్తున్నారు. గ్రాండ్‌గా కనపడుతూనే శరీరానికి చిరాకు కలిగించని, హెవీగాఅనిపించని ఆభరణాలను కోరుకుంటున్నారు. వీరి అభిరుచులకు అనుగుణంగా జ్యువెలరీ డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి. భారీ ఆభరణాలకు బదులుగా రూపుదిద్దుకుంటున్న ఇవి... ఒకనాటి చిన్న సైజ్ ఆభరణాలను భారీగా మార్చేయడం విశేషం. సాక్షి, సిటీబ్యూరో: అందాన్ని మెరిపించేందుకు కావొచ్చు.. హుందాగా కనిపించేందుకు కావొచ్చు.. స్టేటస్ సింబల్ కావొచ్చు... విభిన్న రకాలుగా ఆభరణాన్ని తమ ఆహార్యంలో భాగం చేసుకోవడం సిటీజనులకు సర్వసాధారణంగా మారింది. ఇక వెడ్డింగ్ సీజన్లో ఈ సరదా శిఖరాలను తాకుతోందని చెప్పడానికి ప్రస్తుతం జ్యువెలరీ షోరూమ్స్ దగ్గర కనపడే రద్దీ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అయితే ఇదే సమయంలో ఒంటి నిండా దిగేసుకునే ఆభరణాలకు బదులుగా... హెవీగా కనపడుతూనే లైట్‌గా ఉండే జ్యువెలరీ ఇప్పుడు సిటీలో ట్రెండ్‌గా మారింది. మాంగ్ టీకా.. బంగారు పూల జడల గురించి మర్చిపోండి. ఇప్పుడు తలపై భాగంలో పెట్టుకునే మాంగ్ టీకా అనే ఆభరణం దాని స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. గోల్డ్, డైమండ్ ఫ్లాట్, డైమండ్ కుందన్... ఇది రూ.30వేల నుంచి రూ.2లక్షల దాకా ఉంటుంది. ఫ్యాన్సీగా కూడా వాడతారు. హెవీ నుంచి లైట్‌కి.. కొన్ని ఆభరణాలు భారీగా ఉండాల్సినవి నాజుకుగా మారుతున్నాయి. ఒకప్పుడు మెడ అంటే భారీగా ఉండే బంగారు గొలుసులకు కేరాఫ్. అయితే ఇప్పుడు మెడలో ధరించేందుకు బీడ్స్‌తో రూపొందుతున్న నెక్లెస్‌లు వచ్చాయి. పచ్చలు, కెంపులు, పగడాలు, ముత్యాలతో సైడ్ పెండెంట్స్, మిడిల్ పెండెంట్స్ పెట్టి త్రీలైన్, ఫోర్‌లైన్ బీడ్స్‌తో డిజైన్ చేస్తున్నారు. చూడడానికి పెద్దగా కనపడతాయి.. కానీ ధరిస్తే హెవీగా అనిపించవు. ఇన్స్టాంట్ రిచ్ లుక్ అందించే ఇవి రూ.లక్ష నుంచి రూ.6 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. సైజ్ జీరో... ఒకప్పుడు వడ్డాణం ధరిస్తే.. దాని నుంచి ఇంకో ఆభరణం మీదకి దృష్టి మళ్లడానికి చాలా టైమ్ పట్టేది. అంత భారీగా ఉండేవి. అయితే ఇప్పుడు లైట్ వెయిట్ వడ్డాణం వచ్చేసింది. దీనిలో కండోలి స్టైల్ వడ్డాణం అనేదైతే.. ఒకవైపు మాత్రమే ఉంటుంది. అలాగే మెడలోకి, నడుముకి రెండు రకాలుగానూ ఉపయోగించుకునేంత నాజూకైన నెక్లెస్ కమ్ వడ్డాణం కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇది రూ.4లక్షల నుంచి ప్రారంభమై ఆపైన ఉంటుంది. మణికట్టు మెరిసె..మోచేయి మురిసె.. సన్నగా ఉన్నామా? లేమా అన్నట్టు ఉండే గాజులు, మణికట్టు గొలుసులు కూడా ఇప్పుడు హెవీగా మారిపోయాయి. వాటి స్థానంలో అందుబాటులోకి వచ్చిన బ్రాడ్ బ్రాస్లెట్ లేదా బ్రాడ్ బ్యాంగిల్.. చేతులకు సరికొత్త మెరుపుల్ని అందిస్తున్నాయి. మణికట్టు దగ్గర మొదలై మోచేయి దాకా వ్యాపిస్తూ అటు బ్రాస్లెట్ ఇటు గాజులు రెండింటిలాగా అమరిపోయే ఇవి రూ.లక్ష ఆపై ధరల్లో లభిస్తున్నాయి. వేళ్లకు వెలుగు... వేళ్లకు పెట్టుకునే రింగ్ అంటే బొటన వేలు, చూపుడు వేలు మధ్యలో చక్కగా అమరిపోయేది అనుకుంటున్నారేమో... అయితే ఇవి కాక్టెయిల్ రోజులు. రూపాయి కాయిన్ కన్నా కాస్త పెద్దగా పెండెంట్ సైజ్‌లో ఉండే కాక్టెయిల్ రింగ్ ఇప్పుడు ట్రెండ్. ఈవెనింగ్ పార్టీస్‌కి, రిసెప్షన్స్... తదితర వేడుకులకు వెళ్లేటప్పుడు ధరిస్తారు. కాబట్టి.. దీనిని కాక్టెయిల్ రింగ్ అని పిలుస్తారు. ఇవి డైమండ్, కుందన్ గోల్డ్‌తో తయారవుతాయి. గోల్డ్ అయితే రూ.50వేల నుంచి డైమండ్ అయితే రూ.లక్ష నుంచి అందుబాటులో ఉన్నాయి. ‘చెవులూరించే’..చెవులూగించే.. ఒకప్పుడు చెవి రింగులు అంటే ఎంత ఉండేవో తెలియంది కాదు. అంగుళం, అరంగుళం సైజ్‌కు మించేవి కావు. అయితే అదే ప్లేస్‌లో చెవులకు పెద్ద సైజ్‌లో వేలాడుతుండే షాండ్లియర్స్... ఇప్పుడు అమ్మాయిల హాట్ ఫేవరేట్. చెవి రింగుల స్వరూపాన్ని అమాంతం మార్చేసింది షాండ్లియర్స్ ట్రెండ్. చెవికి ఆభరణం ధరించామా? లేకపోతే ఆభరణానికి చెవిని ధరించారా! అన్నట్టు అనిపిస్తుంది. వేసవిలో చికాకు కలిగించే హెవీ జ్యువెలరీకి బదులుగా ఇవి బాగా ఆదరణ పొందుతున్నాయి. కలర్ స్టోన్స్ రూబీ, ఎమరాల్డ్, కుందన్లతో కళ్లు మిరుమిట్లు గొలిపేలా ముఖం మొత్తానికి అందాన్ని అందించే ఈ షాండ్లియర్స్లో బోలెడన్ని వెరైటీలు ఉన్నాయి. కనీసం ఒక షాండ్లియర్ జత రూ.లక్ష నుంచి రూ.6 లక్షల దాకా అందుబాటులో ఉన్నాయి. ఇవి 30ఏళ్ల లోపు వయసు వారికి మాత్రమే నప్పుతాయి. కాబట్టి యువతులే ఎక్కువగా వినియోగిస్తున్నారు. మధ్య వయస్కుల కోసం రూపాయి కాయిన్ సైజ్‌లో ఉండే పెద్ద స్టడ్స్ అందుబాటులో ఉన్నాయి. నట్ ఫర్ నోస్.. నాసిక ఎంత నాజూగ్గా ఉంటుందో ముక్కుకు పెట్టుకునే నోస్పిక్ లేదా ముక్కెర కూడా అంతకన్నా నాజూగ్గా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం అలా కాదు. ఉంగరం తరహాలో ఉండే నట్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అమ్మాయిల్లో విపరీతమైన ట్రెండీ ఆభరణం ఈ నట్. విభిన్న రకాల స్టోన్స్‌తో ముక్కును మెరిపించే ఈ నట్ రూ.10వేల నుంచి అందుబాటులో ఉంది. సౌకర్యమే ప్రధానం.. నగలు ధరించాలని కోరుకుంటూనే అదే సమయంలో సౌకర్యానికి కూడా సిటీజనులు ప్రాధాన్యమిస్తున్నారు. కొత్త కొత్త అభిరుచుల క్రమంలో డిజైనర్ల సత్తాకు నిత్యం పరీక్షలు ఎదురవుతున్నాయి. దీంతో ఆభరణాలు రకరకాల మార్పుచేర్పులకు లోనవుతున్నాయి. ఫంక్షన్లకు వెళ్లే సమయంలో హెవీగా కనిపిస్తూనే ఒంటికి మాత్రం లైట్‌గా అనిపించే ఆభరణాలను ధరించడానికి అమ్మాయిలు బాగా ఇష్టపడుతున్నారు. – శ్వేతారెడ్డి,జ్యువెలరీ డిజైనర్ -
కొత్త బార్బీ డాడీ!
బార్బీ కొత్త వెర్షన్.. లండన్, ప్యారిస్, న్యూయార్క్ అండ్ ఇంకొన్ని సెలెక్టెడ్ రీటెయిల్ దుకాణాల్లో ప్రపంచమంతా నిన్న సాయంత్రమే విడుదలయింది. ఇంకా కొన్నిచోట్ల ఇవాళ విడుదల అవబోతోంది. ఈ కొత్త బార్బీ పేరు జీజీ హాదీద్. ప్రఖ్యాత అమెరికన్ మోడల్ జీజీ హాదీద్ (22)ను ఈ బార్బీ తయారీకి మోడల్‌గా తీసుకున్నారు. మనదేశంలో కూడా కొన్నేళ్ల క్రితం ఐశ్వర్యారాయ్ లాంటి బార్బీ డాల్ని కూడా లాంచ్ చేశారు. ఇలా ఎప్పటికప్పుడు కొన్ని దేశాలల్లో ఉన్న అందగత్తెల ఫాలోయింగ్‌ని బట్టి బార్బీ డాల్ మోడల్స్ ప్రపంచమంతటా విడుదల అవుతుంటాయి. బార్బీ.. అందమైన అమ్మాయి. ఆత్మవిశ్వాసం గల అమ్మాయి. అందుకే ఇంటింటా అమ్మాయిలకు బార్బీ అంటే అంత ఆకర్షణ, ఆరాధన. బార్బీ డాక్టర్, బార్బీ ఆస్ట్రోనాట్, బార్బీ ఫైర్‌ఫైటర్, బార్బీ ఫిల్మ్‌స్టార్, బార్బీ పాప్ సింగర్.. ఇలా మోడళ్లతోనే అమ్మాయిలు ఎక్కువగా తమని తాము పోల్చుకుంటారట! రూత్ హ్యాండ్లర్ (1916–2002) అమెరికన్ మహిళ తొలిసారి 1959లో ఈ బార్బీ కాన్సెప్ట్‌కు పురుడు పోశారు. -
మోడల్స్ ట్రెండీ..
మోడల్స్ ట్రెండీ హెయిర్ స్టైల్స్‌తో సందడి చేశారు. శేరిలింగంపల్లి హుడా ట్రేడ్ సెంటర్ కాలనీలో వసుంధర సెలూన్, స్పాను శుక్రవారం ప్రారంభించారు. మోడల్స్ పాల్గొని వయ్యారి నడకతో హయలొలికించారు. స్పా డైరెక్టర్ అరుణకుమారి ఉన్నారు. -
ర్యాంప్ వాక్‌తో అదరగొట్టిన మోడల్స్
-
టీ షర్ట్‌కి కొత్తరూపు
న్యూలుక్ ఈ కాలపు అమ్మాయిల వార్డ్‌రోబ్‌లో లెక్కకుమించి టీషర్ట్లు.వాటిలో ఎన్నో మోడల్స్! వాటిలో కొన్ని కొటేషన్లతో అదరగొట్టేవి, ఇంకొన్ని రంగు డిజైన్లతో ఆకట్టుకునేవి, మరికొన్ని ప్లెయిన్‌గా మనసుకు హత్తుకునేవి. వీటికి కొన్ని హంగులు చేర్చితే... ‘కొత్త డిజైన్ టీ షర్ట్ ఎక్కడకొన్నావ్?’ అనే ప్రశ్న మిమ్మల్ని పలకరించాల్సిందే! ముందుగా కాలర్ లేని ప్లెయిన్ టీ షర్ట్‌ని ఎంచుకోవాలి. దానికి అదే రంగు బనియన్ క్లాత్‌ని ఎంచుకోవాలి. ఫొటోలో చూపిన విధంగా చిన్న చిన్న డిజైన్ ముక్కలుగా కట్ చేయాలి. వాటిని ప్లెయిన్ టీ షర్ట్‌కి ఛాతీ భాగంలో కుట్టాలి. దీంతో కొత్త టీ షర్ట్ రెడీ అవుతుంది. కాంట్రాస్ట్ బనియన్ క్లాత్ ఎంచుకోవాలి. పువ్వు డిజైన్‌కి అనుకూలంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి. వాటిని టీ షర్ట్‌కి ఛాతీ భాగంలో పువ్వు డిజైన్ వచ్చేలా మిషన్ మీద కుట్టేయాలి. అక్కడక్కడా తెల్లని లేదా రంగు పూసలను కుడితే ఇలా చూడముచ్చటైన టీ షర్ట్ మీదవుతుంది. టీ షర్ట్‌కి టాప్ భాగం అంటే చేతులు, నెక్ భాగాన్ని కత్తిరించాలి. ఈ ప్లేస్‌లో ఎంపిక చేసుకున్న లేస్‌ను కుట్టాలి. మరో ముచ్చటైన టీ షర్ట్ సిద్ధం అవుతుంది. -
బ్యూటీ లుక్స్..
కలర్‌ఫుల్.. బ్యూటిఫుల్ మోడల్స్ హయలు.. కలర్‌ఫుల్ డ్రస్సులు.. ఫ్యాషన్ ప్రియుల సందడితో బంజారాహిల్స్ సిటీ సెంటర్లోని మాక్స్ షోరూంలో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ ఫ్యాషన్ రిటైల్ స్టోర్ మాక్స్‌లో సరికొత్త స్ప్రింగ్ కలెక్షన్ –2017 ఆవిష్కరించింది. బంజారాహిల్స్ సిటి సెంటర్లోని మాక్స్ షోరూంలో బుధవారం మాక్స్ ఏవీపీ వివేక్‌శర్మ కొత్త కలెక్షన్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మోడల్స్ కొత్త కలెక్షన్స్ ప్రదర్శించారు. త్వరలో హిమాయత్‌నగర్‌లో కొత్త షోరూం ప్రారంభిస్తున్నామని, తెలంగాణ, ఏపీల్లో మరిన్ని షోరూంలు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. – జూబ్లీహిల్స్ -
మీరు మరీ పొడుగా?
బ్యూటిప్స్ సాధారణంగా పొడవుగా ఉండాలని, పొడవు లేకున్నా వేసుకునే డ్రస్ ద్వారానైనా పొడవుగాకనిపించాలని కోరుకోవడం సహజం. కానీ ఎక్కువ పొడవుగా ఉండడమే కొందరికి సమస్య అవుతుంది. అలాంటి సమస్యను ఎదుర్కొంటూ, నార్మల్‌గా కనిపించాలని ప్రయత్నిస్తుంటే ఇలా చేయండి... భుజాల నుంచి మోకాళ్ల వరకు ఉండే టాప్స్ వేస్తే మరీ పొడవుగా కనిపిస్తారు. చుడీదార్, సల్వార్ కమీజ్, జీన్స్ మీద టాప్... సింగిల్ కట్‌తో ఉన్నవి కాకుండా నడుము వరకు- నడుము నుంచి రెండు భాగాలుగా విడగొట్టినట్లుంటే బాగుంటాయి. సన్నగా, టైట్‌గా ఉండే బెల్టులను ధరించకూడదు. వెడల్పుగా ఉండి నడుమును వదులుగా చుట్టినట్లుండే మోడల్స్ బాగుంటాయి. వీలు అయినంత వరకు మిక్స్ అండ్ మ్యాచ్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. అలా మ్యాచ్ చేసేటప్పుడు ఒకటి డార్క్ కలర్ ఉండే రెండవది తప్పని సరిగా లైట్ కలర్ ఉండేటట్లు చూడాలి. -
ఆడిషన్స్ అదుర్స్
మిస్ కాకినాడ 2016కు తరలివచ్చిన మోడల్స్ బోట్‌క్లబ్ (కాకినాడ) : డ్రీమ్ మేకర్స్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిస్ కాకినాడ 2016 పోటీల్లో భాగంగా మంగళవారం స్థానిక ఎస్వీఎన్గ్రాండ్ హోటల్లో న్విహించిన ఆడిషన్స్ కార్యక్రమంలో మోడల్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. మోడల్స్ చేసిన క్యాట్‌వ్యాక్ అందరినీ అలరించింది. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా సినీ డైరక్టర్ క్రిష్, ఫ్యాషన్ డిజైనర్ అర్చన, శిరీషా వ్యవహరించారు. వారు మాట్లాడుతూ కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన ఫ్యాషన్ షోలు ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాలకు పరిచయం చేసేందుకు డ్రీమ్ మేకర్స్ ఈవెంట్ చేస్తున్న ప్రయత్నాన్ని వారు అభినందించారు. ఈవెంట్ ఆర్గనైజర్ శాంతి మాట్లాడుతూ డ్రీమ్ మేకర్స్ ఈవెంట్స్ ఎలాంటి ప్రతిఫలాపేక్షను ఆశించకుండా సామాజిక కార్యక్రమాలను నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈనెల 25న రెండో విడత ఆడిషన్స్ నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఆసక్తిగలవారు సెల్ :70322 31139ను సంప్రదించి, తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. -
జోయలుక్కాస్‌లో కిరాక్ షో
-
మిస్ పెర్ఫక్ట్ ఆంధ్రాగా నిషా
-
తారల తళుకులు..
-
ట్యూనిక్... ‘ట్యూన్’ మార్చేయచ్చు...
న్యూలుక్ అమ్మాయిలు జీన్స్ మీదకు ధరించే ట్యూనిక్స్లో ఎన్నో విభిన్న మోడల్స్ వచ్చాయి. అయితే అవన్నీ ఒకే తరహా డిజైన్ని పోలి ఉంటాయి. కొంత సృజనను జోడిస్తే మీ పాత ట్యూనిక్‌ను ఇలా అందంగా, అధునాతనంగా మార్చేయవచ్చు. ప్లెయిన్ లాంగ్ స్లీవ్స్ లేదా షార్ట్ స్లీవ్స్ ట్యూనిక్‌ను తీసుకోవాలి. పెద్దా, చిన్న ప్రింట్లు ఉన్న మల్టీకలర్ క్లాత్‌ను తీసుకోవాలి. దీంతో పాటు మరొక గ్రే కలర్ లేస్‌ను ఎంచుకోవాలి. ట్యూనిక్ నెక్ నుంచి కింద వరకు సైడ్ స్ట్రిప్‌గా మల్టీకలర్ ప్రింట్ క్లాత్‌ను కత్తిరించి, బెల్ట్‌లా కుట్టి జత చేయాలి. అదే విధంగా నెక్ డిజైన్ చేయాలి. మల్టీకలర్ క్లాత్‌ని కుచ్చులుగా పెట్టి టాప్‌కి ట్యునిక్ కింది భాగాన జత చేయాలి. దీని కింద గ్రే కలర్ లేస్‌ను పెద్ద పెద్ద కుచ్చులు పెట్టి జత చేయాలి. పాత సాదా సీదా నలుపురంగు టాప్ ఆకర్షణీయమైన పార్టీవేర్‌గా మారిపోయింది. -
మోడల్స్ క్యాట్వాక్లో నవ్వకూడదా?
సరికొత్త ఫ్యాషన్లను, డిజైన్లను మార్కెట్లో పరిచయం చేయడానికి ప్రత్యేక వారధులు ఫ్యాషన్ మోడల్స్. ఓ కొత్త ట్రెండ్ ను సెట్ చేయడంలోనూ వారిది ప్రధాన పాత్రగా కనిపిస్తుంది. అటువంటి మోడల్స్.. క్యాట్ వాక్ చేసేటప్పుడు ఎందుకు గంభీరంగా ఉండాలి అన్నది కొందరి ప్రశ్న. నవ్వడం వల్ల నష్టం ఏముంది అంటూ కొందరు వాదించడం కూడ కనిపిస్తుంది. అయితే మోడల్స్ గుంభనంగా, గంభీరంగా ఉండాలన్న నిబంధన కొత్తగా వచ్చినది కాదు. అటువంటి నిబంధనవెనుక ఎంతో చరిత్రే ఉందంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. ఫ్యాషన్ ప్రపంచంపై ఎవరి అభిప్రాయం వారిది. అయితే క్యాట్ వాక్ చేసేటప్పుడు మోడల్స్ ఎందుకు నవ్వకూడదు అన్న వాదన అప్పుడప్పుడు తెరపైకి వస్తుంటుంది. ఒక్కో వృత్తిలోనూ ఆ వృత్తికి సంబంధించిన కొన్ని నిబంధనలు ఉంటాయి. అలాగే ఫ్యాషన్ మోడల్స్ ప్రదర్శన సమయంలోనూ పాటించాల్సిన నిబంధనలు ఉన్నాయి. క్యాట్ వాక్ సమయంలో మోడల్స్ ముఖంలో కనీసం చిరునవ్వు కనిపించకూడదు అన్నది ఏళ్ళుగా కొనసాగుతున్న నిబంధన. మోడల్స్ కథాంశంగా నిర్మించిన జూలాండర్ వంటి హాస్య కధా చిత్రాల్లో కూడా అదే నిబంధనను పాటించడం కనిపిస్తుంది. అయితే క్యాట్ వాక్ ను స్మైల్ ఫ్రీ జోన్ గా పరిగణంచడంపై వస్తున్న అనేక విమర్శలను మాత్రం ఫ్యాషన్ నిపుణులు తిప్పి కొడుతున్నారు. వేదికపై క్యాట్ వాక్ ముగిసిన తర్వాత... డిజైనర్ పరిచయ సమయంలో మాత్రమే మోడల్స్ నవ్వే అవకాశం ఉంది. ఇతర సందర్భాల్లో వారు ఎంత గంభీరంగా ఉంటే... వారు పరిచయం చేసే ఫ్యాషన్ కు అంతటి విలువ లభిస్తుందంటున్నారు కొందరు అనుభవజ్ఞులు. క్యాట్ వాక్ సమయంలో మోడల్స్ నవ్వకూడదన్న నిబంధన వారసత్వంగా వస్తోంది. అందుకు ఎన్నో ఆసక్తికరమైన ఉదాహరణలు ఉన్నాయి. 19వ శతాబ్దం నాటి చిత్రలేఖనాలను చూస్తే అదే విషయం వెల్లడవుతుంది. 20వ శతాబ్దంలో కనిపించన ఫ్యాషన్ ఫొటోగ్రఫీని చూసినా మోడల్స్ హాటీ లుక్, వారు ధరించిన దుస్తులు వారి స్థితిని తెలిపేట్లుగానే ఉంటాయన్నది ఫ్యాషన్ నిపుణుడు హాస్ట్ పి హాస్ట్ ఉద్దేశ్యం. ముఖం గంభీరంగా, గర్వంగా కనిపించడం, ఇతరులను తిరస్కరించే విధంగా ఉన్నా... మోడల్స్ విషయంలో మాత్రం ఆ స్వభావం వారి స్వీయ నియంత్రణను తెలుపుతుందని చెప్తున్నారు. పూర్వ కాలంలో ఉన్నత కుటుంబీకుల్లో, రాచరికంలోని వ్యక్తుల ప్రవర్తనా విధానంపై ప్రత్యేక శిక్షణ ఉండేది. ముఖ్యంగా ఇది యూరోపియన్ ఉన్నత కుటుంబీకుల్లో కనిపించేది. అయితే ఆధునిక ప్రపంచంలో గాంభీర్యాన్ని ప్రదర్శించడం ఓ ప్రత్యేక సామర్థ్యంగా గుర్తిస్తున్నారు. గంభీరంగా ఉండటం మరింత ఆకట్టుకునేదిగా ఉంటుందని సిద్ధాంతకర్త ఇర్వింగ్ గోఫ్మాన్ అంటున్నారు. ఇటువంటి ప్రదర్శన వారి వారి స్థాయిని తెలుపుతుందని చెప్తున్నారు. యుద్ధ పైలెట్లలో, డైహార్డ్ వంటి సినిమా విలన్లను చూసినప్పుడు అదే లక్షణం కనిపిస్తుందని... అది వారి సామర్థ్యాన్నితెలుపుతుందని అంటున్నారు. ముఖ్యంగా మనసు కన్నా శరీరం అధీనంలో ఉండటం ఎంతో అవసరమని, ఆసక్తిని కలిగిస్తుందని గోఫ్మాన్ చెప్తున్నారు. మోడల్స్ విషయంలో వారి గాంభీర్య స్వభావం వారి వ్యక్తిగత గౌరవాన్ని నిలబెట్టేదిగా ఉంటుందని... నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రాముఖ్యతను కోల్పోతారని చెప్తున్నారు. క్యాట్ వాక్ పై నవ్వడం, అసహనాన్ని వ్యక్తం చేయడం వల్ల ఆ ప్రభావం డిజైనర్ పై కూడ పడుతుందని... అందుకే మోడల్స్ వేదికపై నవ్వకూడదు అన్న నియమాన్ని శతాబ్దాలుగా కొనసాగిస్తున్నట్లు చెప్తున్నారు. -
జీన్స్ మళ్లీ మళ్లీ కొత్తగా!
► అత్యంత ప్రజాదరణ పొందిన వస్త్రం డెనిమ్. జీన్స్ పేరుతో ప్యాంట్లు, ఓవర్ కోట్స్ ఎన్నో మోడల్స్‌లో మన నట్టింటికి వచ్చాయి. కాలేజీలకు వెళ్లే అబ్బాయిలు, అమ్మాయిల తప్పనిసరి వస్త్ర జాబితాలో జీన్స్ ముందుంటుంది. అంతేకాదు మన్నికలోనూ జీన్స్ అన్ని ఫ్యాబ్రిక్స్లలో ఫస్ట్‌న ఉంటుంది. అయితే, కొన్నాళ్లుగా వేసుకున్న జీన్స్ బోర్ కొట్టినా, లేక కొద్దిగా పాడైనా, ఔట్‌డేటెడ్ అయినా వాటిని తిరిగి ఉపయోగించుకునే సదుపాయమూ ఉంది. అదెలాగో ఈ వారం చూద్దాం.. ► ప్యాంట్‌ను రెండు భాగాలు చేసి యాప్రాన్గా తయారుచేసుకోవచ్చు. వంట చేసేటప్పుడు ఛాతి భాగానికి వేడి తగలకుండా కిచెన్‌లో చాలా వరకు కాటన్ యాప్రాన్లను ధరిస్తుంటారు. వాటి బదులుగా జీన్స్‌ను ఇలా యాప్రాన్గా మార్చేసి వాడుకుంటే ఉపయోగాలు తెలుస్తాయి. ► నాలుగైదు రంగు జీన్స్ ప్యాంట్లు విప్పదీసి, డిజైన్‌గా మలచి కుడితే పొడవాటి కుచ్చుల గౌన్ సిద్ధం. ► పిల్లల ప్యాంట్లు కొన్నాళ్లయ్యాక పొట్టిగా అయిపోతాయి. అలాంటి వాటిని రెండింటిని తీసుకొని పిల్లలకు గౌన్ని తయారుచేయవచ్చు. ► జీన్స్‌తో హ్యాండ్ బ్యాగులు, దుస్తుల అలంకరణకు పువ్వులను తయారుచేసుకోవచ్చు. ప్రయత్నించడం మొదలుపెడితే ఇలాంటి ఎన్నో సృజనాత్మక ఆలోచనలు మీకూ రావచ్చు. వాడిన దుస్తులతో కొత్త తరహా డ్రెస్సులను రూపొందిస్తే వాటిని సాక్షి ఫ్యామిలీ చిరునామాకు ఫొటోలు తీసి పంపించండి. -
డాక్టర్ సర్టిఫికెట్ ఉంటేనే..
మోడలింగ్ ప్రపంచంలో ముందుకు దూసుకుపోవాలంటే అందం, శరీర లావణ్యం ఉంటే సరిపోదని, ఆరోగ్యం కూడా ఎంతో అవసరం అని అంటున్నాయి ఫ్రాన్స్ చట్టాలు. జీరోసైస్ కోసం తిండీ తిప్పలూ మానేసి బక్క చిక్కిపోవడం అందంలోకి రాదని, మోడలింగ్ లో పాల్గోవాలంటే ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉన్నట్లుగా డాక్టర్ సర్టిఫికెట్ కూడ తప్పనిసరి అంటూ ఫ్రాన్స్ కొత్త బిల్లును పాస్ చేసింది. మోడలింగ్ వృత్తిలోకి అడుగు పెట్టేవారు వారి శరీరాకృతికి తగ్గ బరువు కలిగి ఉండాలని సూచించింది. అంతేకాదు చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆరు నెలల జైలు శిక్షతోపాటు 75 వేల యూరోల జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది. శరీరాకృతిని బట్టి బరువు ఉండాలంటూ పెట్టిన నిబంధనలపై గతంలో ఫ్యాషన్ ఇండస్ల్రీ... తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అయితే అప్పటినుంచీ ఆ విషయంపై చర్చలు కొనసాగుతుండగా... చివరికి శరీరాకృతిని బట్టి ఆ మోడల్ ఎంత బరువు ఉండాలి అనే విషయాన్ని డాక్టర్లే నిర్ణయించాల్సిందిగా చట్టసభ్యులు తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీలో ప్రవేశించాలంటే అందంతోపాటు ఆరోగ్యం... ఎత్తుకు తగ్గ బరువు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అతి సన్నగా ఉండి... అనోరెక్సియా, బులీమియాలకు ప్రచారం చేస్తున్నట్లుగా ఉండే కొలతలను ప్రోత్సహించడం నేరం అని, అలా చేసిన వారికి ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తామని గత బిల్లులో కూడ పొందుపరిచిన విషయం తెలిసినదే. అయితే ఫ్రాన్స్ లో సుమారు 30 నుంచి 40 వేల మంది ప్రజలు, కౌమార దశలో అనోరెక్సియా నెర్వోసా, ఈటింగ్ డిజార్డర్ వంటి వాటితో బాధపడుతున్నారు.దీంతో మరణాల రేటు కూడ తీవ్రంగా పెరుగుతోంది. ఇటువంటి అనేక కారణాలను పరిధిలోకి తీసుకున్న ప్రాన్స్ చట్టాలు ఇప్పుడు మోడల్స్ కూ డాక్టర్ సర్టిఫికెట్ అవసరమని తేల్చి చెప్పాయి.