
ఈ ఫొటోలోని అమ్మాయిలు ఆఫ్రికా అందాల భామలు. నగరంలో చదువుకుంటున్న వీరు... మోడల్స్‌గా రాణిస్తున్నారు. ర్యాంప్‌లపై మెరుస్తున్నారు. ఈ బ్లాక్ బ్యూటీల అందచందాలకు సిటీ ఫిదా అవుతోంది. ప్రతి ఈవెంట్‌లో ఒక్కరైనా ఆఫ్రికన్ మోడల్ కనిపిస్తున్నారు. అంతర్జాతీయంగా మోడలింగ్‌లో అగ్రస్థానంలో ఉన్నఆఫ్రికన్ అమ్మాయిలకు... ఇప్పుడు దేశీయ ఫ్యాషన్ రంగం దాసోహమంటోంది. ఈ నేపథ్యంలో సిటీకీ నయా గ్లామర్ తోడైంది. బ్లాక్ బ్యూటీలకు అవకాశాలు కల్పించేందుకు నగరంలో ప్రత్యేకంగా ఈవెంట్లు కూడా నిర్వహిస్తున్నారు. ‘ఫేస్ ఆఫ్ ఆఫ్రికా’ పేరుతో తొలి ఈవెంట్ నిర్వహించగా, ఇప్పుడు ‘మిస్ ఇండియా ఆఫ్రికా’ కాంటెస్ట్‌కూ నగరం వేదికవుతోంది. ఈ కల్చర్‌తో సిటీ ఫ్యాషన్ రంగం కొత్తపుంతలు తొక్కగా... ఆఫ్రికన్ అమ్మాయిలకు ఉపాధి లభిస్తోంది. నగరంలోని ఈ నయా ట్రెండ్‌పై వీకెండ్ స్పెషల్.
సాక్షి, సిటీబ్యూరో : వెనకబడిన ప్రాంతానికి చిరునామాగా మారిన ఆఫ్రికా... అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి కూడాపేరొందింది. ఆఫ్రికన్‌ల గురించి మన దేశంలోని సాధారణ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం అయినా ఉండొచ్చు. కానీఅంతర్జాతీయ స్థాయిలో రాణించే టాప్ మోడల్స్‌లో ఆఫ్రికన్‌అమ్మాయిలదే అగ్రస్థానం. ఈ బ్లాక్ బ్యూటీలకు ఇటీవల మన దేశంలోనూ ర్యాంప్‌పై మెరిసే అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఫ్యాషన్ రంగం ఆఫ్రికన్ అమ్మాయిలకూ రెడ్‌కార్పెట్‌పరుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న మిస్ ఇండియా ఆఫ్రికా కాంటెస్ట్ పోటీలకు ఆడిషన్స్‌జరుగుతున్నాయి. ఇది నగరంలోని ఆఫ్రికా బ్యూటీలకు కొత్త గ్లామర్‌తీసుకొచ్చింది.
నల్లని ఒత్తయిన జుట్టు, తీరైన ఫిజిక్, చక్కని హైట్‌వెయిట్ ఉన్న ఆఫ్రికా అమ్మాయిలు మన ర్యాంప్‌లపై బాగా సందడి చేస్తున్నారు. ఆఫ్రికా అందచందాలకు అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచం ఫిదా అయిపోతుండడంతో సిటీ కూడా అదే బాట పట్టింది. ఈ ట్రెండ్ డిజైనర్లు, కొరియోగ్రాఫర్లు... ఆఫ్రికన్ బ్యూటీస్ కోసం జల్లెడ పట్టేలా చేసింది. ఇది సిటీలోని ఆఫ్రికన్ పీపుల్‌కి కొత్త అవకాశాలు అందిస్తోంది.
‘ఇంతింతైన ఇంటర్నేషనల్ ట్రెండ్...
నగరంలో జరిగే టాప్ ఫ్యాషన్ షోలలో ఒక్కరైనా ఆఫ్రికా మోడల్ ఉండడమనేది తప్పనిసరిగా మారింది. ‘సిటీలో అంతర్జాతీయ ఈవెంట్లు జరుగుతుండడంతో ఆఫ్రికా మోడల్స్ కోసం అడిగే డిజైనర్లు, కొరియోగ్రాఫర్లు ఎక్కువయ్యారు’ అని సిటీకి చెందిన మోడల్ కో–ఆర్డినేటర్ అహ్మద్ చెప్పారు. దీంతో నగరంలోని మెహదీపట్నం, టోలిచౌకి తదితర ప్రాంతాల్లో నివసించే ఆఫ్రికన్లకు చాన్స్‌లు పెరిగాయి. సూడాన్, నైజీరియా తదితర ఆఫ్రికా దేశాల నుంచి విద్య నిమిత్తం నగరానికి వచ్చే అమ్మాయిలకు ఇవి వరంగా మారాయి. ‘ఆఫ్రికా నుంచి అత్యధికులు బిజినెస్ మేనేజ్‌మెంట్, హోటల్ మేనేజ్‌మెంట్ తదితర కోర్సుల కోసం నగరానికి వస్తున్నారు. ఫారిన్ లాంగ్వేజెస్ అభ్యసించేవారూ ఎక్కువే. చాలామంది ఆఫ్రికన్లు వెస్ట్రన్ కల్చర్ అంటే బాగా మక్కువ చూపిస్తుంటారు. అందుకు అనుగుణంగానే ఫ్యాషన్ షోలలో పార్టిసిపేట్ చేయడానికి కూడా సై అంటారు. వీరికి పార్ట్‌టైమ్ జాబ్‌గా కూడా ఇది ఉపకరిస్తోంది’ అని అహ్మద్‌వివరించారు.
సిటీలోమరోఈవెంట్..
‘అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఆఫ్రికా మోడల్స్ ఎందరో ఉన్నారు. అదే విధంగా మన సిటీలోనూ వారికి తగినంత ప్రాధాన్యం కల్పించాలని గతంలో ‘ఫేస్ ఆఫ్ ఆఫ్రికా’ పేరుతో ఈవెంట్ నిర్వహించాం. అందులో విజేతగా నిలిచిన కాంగో దేశపు అమ్మాయి ఇప్పుడు అంతర్జాతీయ మోడల్‌గా రాణిస్తోంది’ అని చెప్పారు నగరానికి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జోసెఫ్ సుందర్. ఇప్పుడు తాను మరికొన్ని సంస్థలతో కలిసి ‘మిస్ ఇండియా ఆఫ్రికా’ ఈవెంట్ నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈ తరహా పోటీ నగరంలోనే తొలిసారి కావడం విÔశేషం. ఈ కాంటెస్ట్‌లో 18 మంది అమ్మాయిలు నగరం నుంచి పాల్గొంటున్నారని, వీరిలో చాలామంది కళాశాల విద్యార్థినులే ఉన్నారని చెప్పారు. ట్రెడిషనల్ వేర్‌తో సహా విభిన్న రకాల దుస్తులతో ర్యాంప్‌లపై వీళ్లుమెరవనున్నారు.
అందానికి చిరునామా...
ఆఫ్రికాను ఒక దేశంగా మాత్రమే చాలా మంది భావిస్తారు. కానీ అది 54 దేశాల ఖండం. మన నగరంలో విభిన్న జాతులు, భిన్న సంస్కృతి సంప్రదాయాలకు చెందిన ఆఫ్రికన్లు ఉన్నారు. వాళ్లందరినీ ఒక చోటకు తీసుకురావడం, వారి దేశాల గొప్పదనాన్ని, విశిష్టతలను ప్రతిబింబింపజేయడం, ఆ అమ్మాయిల అందచందాలను, ప్రతిభను ప్రపంచానికి వెల్లడి చేయడం... ఈ కార్యక్రమ ఉద్దేశం. ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఫైనల్స్‌ను నగరంలోనే నిర్వహించాలని అనుకుంటున్నాం. – జోసెఫ్ సుందర్, కొరియోగ్రాఫర్
అనుబంధాల వేదిక..
భారత్, ఆఫ్రికా దేశాల మధ్య ప్రేమానుబంధాలు పెంపొందించాలనే ప్రధాన లక్ష్యంతో మిస్ ఆఫ్రికా ఇండియా ఈవెంట్ నిర్వహిస్తున్నాం. ప్రతి ఏటా జూన్–సెప్టెంబర్ మధ్యలో ఈ పోటీ ఉంటుంది. కేవలం బాహ్య సౌందర్యానికి మాత్రమే కాకుండా అంతర్గత సౌందర్యానికి ప్రాధాన్యతనిస్తూ ఈ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాం. భారత్‌లోని ఆఫ్రికా మహిళలు తమ అనుభవాలు పరస్పరం పంచుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, మహిళా సాధికారత అంశాలపై అనుభవం పొందేందుకు ఈ వేదిక ఉపకరిస్తుంది. హైదరాబాద్ సహా ఢిల్లీ, పుణె, బెంగళూర్ తదితర నగరాల్లో రీజనల్ పోటీలు జరుగుతున్నాయి. ఫైనల్స్ హైదరాబాద్‌లోనే నిర్వహిస్తాం. – లారిస్కా, ఈవెంట్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment