![iPhone 12 dummy models give a near final look at Apple first 5G phones - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/22/apple%20iphone12.jpg.webp?itok=LoHY_YLR)
సాక్షి, న్యూఢిల్లీ : డబ్ల్యూడబ్ల్యూడీసీ 2020 కార్యక్రమం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆపిల్ సంచలనానికి నాంది పలకనుందనే అంచనాల మధ్య ఆపిల్ తొలి 5జీ ఐఫోన్ 12కు సంబంధించి అనేక అంచనాలు మరోసారి హల్ చల్ చేస్తున్నాయి. ఐఫోన్ కు సంబంధించి తాజా డమ్మీ ఫోటోలు ఆసక్తిరంగా మారాయి. దాదాపు ఇదే ఫైనల్ డిజైన్ కావచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
తాజా లీకుల ప్రకారం 5.4, 6.1, 6.7 ఇంచ్‌ల భారీ డిస్‌ప్లేతో ఐఫోన్ 12ను లాంచ్ చేయనుంది. ట్రిపుల్ కెమెరాలతో దీన్ని తీసుకురానున్నట్టు భావిస్తున్నారు. 5జీ నెట్‌వర్క్ టెక్నాలజీని సపోర్ట్, నాచ్‌లెస్ డిస్‌ప్లేతో ఐఫోన్12కు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ నేడు (జూన్ 22 సోమవారం) రాత్రి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం పూర్తిగా వర్చువల్‌గా ఉండబోతున్న ఈ గ్రాండ్ మీట్ విశేషాలపై ఐఫోన్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్‌లో ఐఫోన్ 12ను విడుదల చేసేందుకు మొబైల్ దిగ్గజ సంస్థ ఆపిల్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Here are the first iPhone 12 dummies: 3 sizes (5.4, 6.1, 6.7). Flat edges, 3 cameras on the bump like recent molds. Notch, cameras should not be taken 100%, but chassis promising. pic.twitter.com/fcw3bLhVEF
— Sonny Dickson (@SonnyDickson) June 21, 2020
Comments
Please login to add a commentAdd a comment