dummy
-
డమ్మీ కాన్సులేట్‌లో వీసా ఇంటర్వ్యూ
సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని ఓ స్టార్ హోట ల్లో అమెరికన్ కాన్సులేట్ సెట్ వేసిన ఓ ముఠా.. గుజరాత్‌కు చెందిన వ్యాపారిని మోసం చేసింది. వీసా ఇంటర్వ్యూల పేరిట రూ.41.5 లక్షలు కాజేసింది. బాధితుడి ఫిర్యాదుతో అహ్మదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ గ్యాంగ్‌లో కొందరు హైదరాబాద్‌కు చెందినవారు ఉన్నారని అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా కీలక ఆధారాలు సేకరించడానికి ఓ ప్రత్యేక బృందం అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు రానుంది. ట్రావెల్ ఏజెంట్‌తో పరిచయం.. అహ్మదాబాద్‌లో వస్త్ర వ్యాపారం చేసే వ్యాపారికి స్నేహితుల ద్వారా మీన్‌చంద్ పటేల్ అనే ట్రావెల్ ఏజెంట్‌తో పరిచయమైంది. తనతో సహా 19 మంది స్నేహితులు, కుటుంబీకులు అమెరికా విహారయాత్రకు వెళ్లాలని భావిస్తున్నట్టు మీన్‌చంద్‌కు చెప్పాడు. అందరి వీసాలు ప్రాసెస్ చేయడానికి అంగీకరించిన ఇతగాడు వారి నుంచి టూర్ ప్యాకేజీ కూడా సిద్ధం చేశారు. మొత్తం 19 మంది నుంచి పాస్‌పోర్ట్ కాపీలు తీసుకున్నాడు. అప్లికేషన్ ఫీజు పేరుతో రూ.1.5 లక్షలు వసూలు చేసిన మీన్‌చంద్ వారికి కొన్ని దరఖాస్తులు ఇచ్చి పూరించమని చెప్పాడు. వ్యాపారిని మోసం చేయాలని నిర్ణయించిన ఈ ఏజెంట్, దానికోసం మరికొందరితో కలిసి భారీ స్కెచ్ వేశాడు.హైదరాబాద్ కాన్సులేట్‌లో మాత్రమే తమకు కావాల్సిన సమయంలో వీసా స్లాట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పి నమ్మించాడు. వీసా ఇంటర్వ్యూ కోసం అంతా అక్కడకు వెళ్లాలంటూ ప్రత్యేక బస్సులో తీసుకొచ్చాడు. దీనికి ముందే తన అనుచురులు కొందరిని హైదరాబాద్‌కు పంపిన మీన్ చంద్ శివార్లలోని ఓ స్టార్ హోటల్లో బాంక్వెట్ హాల్ బుక్ చేయించాడు. అందులో ప్రత్యేకంగా టేబుళ్లు, కుర్చీలు ఉంచి యూఎస్ కాన్సులేట్ బ్రాంచ్ ఆఫీస్‌గా మార్చాడు. గుజరాత్‌కు చెందిన వారికి వీసాలు జారీ కావడం కష్టమంటూ అహ్మదాబాద్ వ్యాపారికి చెప్పిన మీన్‌చంద్... తనకు ఉన్న పరిచయాలు వినియోగించి ప్రాసెస్ పూర్తయ్యేలా చేస్తున్నానని నమ్మబలికాడు.అయితే భద్రతా కారణాల నేపథ్యంలో నానక్‌రామ్‌గూడలో ఉన్న అమెరికన్ కాన్సులేట్‌లోకి ఎక్కువ మందిని అనుమతించట్లేదని, గ్రూప్ వీసా ప్రాజెక్టులో భాగంగా ఓ హోటల్లో ఇంటర్వ్యూలు చేయడానికి కాన్సులేట్ అధికారులు అంగీకరించారని నమ్మించాడు. దాదాపు మూడు నెలల క్రితం అందరినీ హైదరాబాద్ తీసుకొచ్చిన మీన్‌చంద్ మరో హోటల్లో బస చేయించాడు. అక్కడ నుంచి వాళ్ల బస్సులోనే ఈ స్టార్‌హోటల్‌కు తీసుకొచ్చాడు. నేరుగా బాంక్వెట్ హాల్‌కు తీసుకెళ్లి... అప్పటికే సిద్ధంగా ఉన్న తన అనుచరుల్ని కాన్సులేట్ అధికారులు, ప్రతినిధులుగా నమ్మించాడు.అలా 19 మందికీ డమ్మీ ఇంటర్వ్యూలు చేయించి వారిని మీన్‌చంద్ తిరిగి అహ్మదాబాద్‌కు తీసుకెళ్లాడు. ఆపై వీసా ఫీజుల పేరుతో మరో రూ.40 లక్షలు వసూలు చేశాడు. ఎన్నాళ్లు వేచి చూసినా వీసాలు ప్రాసెస్ కాకపోవడంతో అనుమానించిన వ్యాపారి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ స్కామ్‌లో మీన్‌చంద్‌కు హైదరాబాద్‌కు చెందిన వారూ సహకరించి ఉంటారని అనుమానిస్తున్న అక్కడ పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కీలక ఆధారాల సేకరణ కోసం త్వరలో నగరానికి రానున్నారు. -
హైదరాబాద్: డమ్మీ బాంబుతో బ్యాంకులో హల్చల్
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల షాపూర్‌నగర్ ఆదర్శ్ బ్యాంక్ దగ్గర గురువారం డమ్మీ బాంబు బెదిరింపు ఘటన చోటు చేసుకుంది. బాడీ మొత్తానికి బాంబు తరహా సెటప్ చేసుకుని ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. మామూలుగా బ్యాంకులోకి ఎంట్రీ ఇచ్చిన ఆ వ్యక్తి.. హఠాత్తుగా తాను మానవబాంబునని, తన దగ్గర బాంబు ఉందంటూ బెదిరింపులకు దిగాడు. రూ.2 లక్షలు ఇవ్వాలని, లేకుంటే బ్యాంకును పేల్చేస్తానని బెదిరించాడు. దీంతో బ్యాంక్ సిబ్బంది భయపడ్డారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై జీడిమెట్ల పోలీసులకు అలర్ట్ వెళ్లింది. హుటాహుటిన సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు.. అది డమ్మీ బాంబుగా తేల్చారు. సదరు వ్యక్తిని జీడిమెట్లకే చెందిన శివాజీగా గుర్తించారు. అతను ఎందుకు అలా చేశాడన్నదానిపై తేల్చేందుకు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. -
నేనేం సోనియా రిమోట్‌ను కాను
అహ్మదాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల తర్వాత పార్టీకి డమ్మీ చీఫ్‌గా మల్లికార్జున ఖర్గే ఉండబోతారంటూ బీజేపీ చేస్తున్న విమర్శలకు ఆయన దీటైన సమాధానమిచ్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా శుక్రవారం అహ్మదాబాద్‌లో ఖర్గే మాట్లాడారు.‘ నేనేం సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్‌ను కాదు. బీజేపీలోనే అలాంటి వ్యవస్థ ఉంది. కాంగ్రెస్‌లో సర్వామోదంతోనే అన్నీ జరుగుతాయి. ఒకవేళ నేను పార్టీ పగ్గాలు చేపడితే నా రిమోట్ కంట్రోల్ నా వద్దే ఉంటుంది. కాంగ్రెస్‌లో పార్టీ కమిటీ, ఎన్నికైన సభ్యులు, వర్కింగ్ కమిటీ, పార్లమెంటరీ బోర్డు ఉమ్మడి, సమష్టి నిర్ణయాలే అమలవుతాయి. రిమోట్ కంట్రోల్ భావన బీజేపీదే. మీలోని వాళ్లే ఇలాంటివి సృష్టిస్తారు’ అని బీజేపీ నేతలపై ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘బీజేపీ అధ్యక్ష ఎన్నికలను ప్రధాని ఎన్నిసార్లు నిర్వహించారు? బీజేపీలో రిమోట్ కంట్రోల్ ఎక్కడుందో అందరికీ తెలుసు. మీరా మాకు హితబోధ చేసేది?’ అని ఎదురుదాడికి దిగారు. ‘చీఫ్‌గా ఎన్నికైతే పార్టీలో సగం సంస్థాగతమైన పదవులు 50 ఏళ్లలోపు వారికి దక్కేలా కృషిచేస్తా. మహిళలు, యువత, దళితులకు పార్టీలో సరైన ప్రాతినిధ్యం కల్పిస్తా. గాంధీ, నెహ్రూ సిద్ధాంతాలను పరిరక్షిస్తూ, పటేల్ ఐక్యతా పిలుపును బలపరుస్తా’ అని అన్నారు. -
ఊహించని విజయం.. డమ్మీ అభ్యర్థి విన్నర్
మామిడికుదురు: ఎన్నికల్లో పలు చిత్ర, విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎవరూ ఊహించని వ్యక్తులకు పదవులు వస్తుంటాయి. 2013 జూలై 31వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఇలాంటి ఘటనే జరిగింది. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం కరవాక సర్పంచ్ పదవిని ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. ఈ నేపథ్యంలో సిర్రా మణికుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అతడికి డమ్మీ అభ్యర్థిగా అతడి అన్నయ్య సిర్రా శ్రీనివాస్ నామినేషన్ వేశారు. పరిశీలన సమయంలో మణికుమార్ ఎమ్మార్సీ కార్యాలయంలో క్లస్టర్ రీసోర్స్ పర్సన్ (సీఆర్పీ)గా పనిచేస్తున్నందున అతడి నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీనిపై అప్పీల్‌కు వెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సిర్రా శ్రీనివాస్ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. -
ఆపిల్ ఐఫోన్12 ఫైనల్ లుక్?
సాక్షి, న్యూఢిల్లీ : డబ్ల్యూడబ్ల్యూడీసీ 2020 కార్యక్రమం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆపిల్ సంచలనానికి నాంది పలకనుందనే అంచనాల మధ్య ఆపిల్ తొలి 5జీ ఐఫోన్ 12కు సంబంధించి అనేక అంచనాలు మరోసారి హల్ చల్ చేస్తున్నాయి. ఐఫోన్ కు సంబంధించి తాజా డమ్మీ ఫోటోలు ఆసక్తిరంగా మారాయి. దాదాపు ఇదే ఫైనల్ డిజైన్ కావచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. తాజా లీకుల ప్రకారం 5.4, 6.1, 6.7 ఇంచ్‌ల భారీ డిస్ప్లేతో ఐఫోన్ 12ను లాంచ్ చేయనుంది. ట్రిపుల్ కెమెరాలతో దీన్ని తీసుకురానున్నట్టు భావిస్తున్నారు. 5జీ నెట్వర్క్ టెక్నాలజీని సపోర్ట్, నాచ్లెస్ డిస్ప్లేతో ఐఫోన్12కు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ నేడు (జూన్ 22 సోమవారం) రాత్రి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం పూర్తిగా వర్చువల్‌గా ఉండబోతున్న ఈ గ్రాండ్ మీట్ విశేషాలపై ఐఫోన్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్‌లో ఐఫోన్ 12ను విడుదల చేసేందుకు మొబైల్ దిగ్గజ సంస్థ ఆపిల్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. Here are the first iPhone 12 dummies: 3 sizes (5.4, 6.1, 6.7). Flat edges, 3 cameras on the bump like recent molds. Notch, cameras should not be taken 100%, but chassis promising. pic.twitter.com/fcw3bLhVEF — Sonny Dickson (@SonnyDickson) June 21, 2020 -
నిర్భయ దోషుల ఉరికి డమ్మీ పూర్తి
న్యూఢిల్లీ/ఔరంగాబాద్: నిర్భయ దోషుల ఉరికి సర్వం సిద్ధమవుతోంది. మీరట్ నుంచి తలారి పవన్ తీహార్ జైలుకు చేరుకొని బుధవారం డమ్మీ ఉరి వేసి తాళ్లను పరీక్షించారని జైలు అధికారులు తెలిపారు. దోషులకు ఉరి వేసేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన మనీలా తాళ్లను ఉపయోగిస్తారు. తలారి పవన్ వీటినే పరీక్షించారు. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన ఉరి, ఈ నెల 20న తెల్లవారుజామున 5:30 గంటలకు ఖరారైన సంగతి తెలిసిందే. నలుగురు దోషుల్లో ఒకరు ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను తాజాగా కోర్టు కొట్టేసింది. దక్షిణాసియాలోనే అతి పెద్దదైన తీహార్‌లో ఒకే నేరానికి సంబంధించి నలుగురిని ఉరి తీయడం ఇదే మొదటిసారి. నిర్భయ కేసు దోషుల్లో ఒకరైన అక్షయ్ ఠాకూర్ భార్య తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ ఔరంగాబాద్ కోర్టులో కేసువేశారు. రేప్ చేసిన వ్యక్తికి భార్యగా కొనసాగడం తనకు ఇష్టంలేదని పునీతా మంగళవారం పిటిషన్ దాఖలు చేయగా గురువారం దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది. -
డమ్మీ ఉరి పూర్తి, 20న ఉరి శిక్ష అమలు?
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 2012 నిర్భయ సామూహిక హత్యాచార కేసులో దోషుల ఉరి శిక్ష అమలుకు సర్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం తలారి పవన్ జల్లాద్ డమ్మీ ఉరి కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్చి 20 న ఉరి తీయడానికి రెండు రోజుల ముందే తీహార్ జైలులో నలుగురు మరణశిక్షకు సంబంధించి డమ్మీ ఉరిని నిర్వహించినట్టు తలారి పవన్ బుధవారం తెలిపారు. మంగళవారం మీరట్ నుండి వచ్చి తాడులను పరీక్షించడానికి డమ్మీ ఉరిశిక్షను అమలు చేశామన్నారు. తీహార్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో మరోసారి అన్ని సన్నాహాలతో, బుధవారం 'డమ్మీ ట్రయల్' జరిగినట్టు తీహార్ జైలు అదనపు ఇన్స్పెక్టర్ జనరల్ రాజ్ కుమార్ తెలిపారు. జైలు నెంబర్ -3 ఉరి గదిలో జైలు అధికారుల సమక్షంలో దీన్ని నిర్వహించామని, ఉరి శిక్ష అమలుకు ముందు ఇలాంటి పరీక్షలు సాధారణమైన విషయమని ఆయన తెలిపారు. తద్వారా ఉరి సమయంలోఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్ధారించుకునేందుకు డమ్మీ ట్రయల్ ఉంటుందన్నారు. ఇది అరగంట పాటు కొనసాగిందని సీనియర్ అధికారి చెప్పారు. మరోవైపు శిక్ష ఖరారైనప్పటినుంచి దోషులు నలుగురు న్యాయ పరమైన అవకాశాలను వినియోగించు కుంటూ, శిక్ష అమలుపై అవరోధాలతో మరణ శిక్షనుంచి విజయవంతంగా తప్పించుకుంటున్నారు. తాజాగా విడాకులు ఇప్పించాల్సిందిగా అక్షయ్ భార్య పిటిషన్ దాఖలు చేసింది. ఇది ఇలా వుంటే ఉరిశిక్ష అమలు పై స్టే విధించాలని కోరుతూ దోషులు మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వ న్యాయవాదికి నోటీసులు జారీ చేసిన కోర్టు, నిర్భయ దోషుల తాజా పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు గురువారం విచారించనున్నట్లు పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో మార్చి 20 ఉరి శిక్ష అమలవుతుందా? లేక మరోసారి వాయిదా పడుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ కేసులో ఆరుగురు దోషలుగా తేలగా, విచారణ ప్రారంభమైన కొన్ని రోజుల తరువాత తిహార్ జైలులో ఆరవ నిందితుడు రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మరో దోషి మైనర్ జువైనల్ హోంనుంచి విడుదలయ్యాడు. మిగిలిన దోషులు నలుగురు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31) లకు విధించిన ఉరిశిక్ష అమలు ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. కోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 20న ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులకు శిక్ష అమలు కావాల్సి వుంది. -
చూస్తే నిజం.. తాకితే డమ్మీ
జూబ్లీహిల్స్: గది నిండా తుపాకులు, మెషిన్గన్లు.. కుప్పలు తెప్పలుగా పడేసిన కత్తులు, కటార్లు, శిరస్త్రాణాలు.. ఇదేదో ఆయుధాల గోదాం కాదు.. కదనరంగం కోసం సిద్ధం చేసిన ఏర్పాట్లు అంతకంటే కాదు. అన్నీసినిమాల్లో వాడేందుకు సిద్ధం చేసిన డమ్మీఆయుధాలు. చిత్రాలకు ఎప్పటినుంచో సినీఆయుధాలు సరఫరా చేసే ‘శ్రీశైల మహానంది’ కార్యాలయంలోకి అడుగు పెడితే.. ఆయుధాల లోకంలోకి వెళ్లినట్టు ఉంటుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాషూటింగ్లకు కావాల్సిన రకరకాల పరికరాలు సరఫరా చేసే ‘మహానంది’ యూసుఫ్‌గూడ, కృష్ణానగర్‌లో అందరికి సుపరిచితుడే. కర్నూలు జిల్లాకు చెందిన మహానంది దాదాపు రెండు దశాబ్దాల క్రితమే ఉపాధి కోసం నగరానికి వలస వచ్చాడు. సినీరంగంలో చిన్నాచితకా పనులు చేస్తూ క్రమంగా సినిమా షూటింగ్‌ల్లో వినియోగించే పలు రకాల వస్తువులను అందించే సప్లయర్‌గా నిలదొక్కుకున్నాడు. రెండు దశాబ్దాలుగా వందలాది సినిమాలకు ఆయన పలురకాల వస్తువులు సరఫరా చేస్తున్నాడు. అదరహో ‘బాహుబలి’ తెలుగు చలనచిత్ర రంగంలో రికార్డులు తిరగరాసిన ‘బాహుబలి’ అంటే ప్రేక్షకులకే కాదు.. సినీరంగానికి చెందిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన క్రేజ్. ఆ చిత్రంలో ఒక్క చిన్న వేషం వేసినా చాలనుకున్న నటులు చాలామందే ఉన్నారు. అలాంటి చిత్రానికి రెండు భాగాల్లో వాడిన కత్తులు, యుద్ధ సామగ్రిని మహానందే సరఫరా చేశాడు. ‘ఈ సినిమా కోసం వందలాది కత్తులు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించాం. తాజాగా చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నర్సింహారెడ్డి’కి కావాల్సిన యుద్ధ సామగ్రిని సైతం మేమే సరఫరా చేస్తున్నాం’ అని గర్వంగా చెబుతాడు మహానంది. తాకితేనే తెలిసేది.. ‘డమ్మీ’ అని పోలీస్ ట్రైనింగ్‌లో భాగంగా కానిస్టేబుల్స్, హోంగార్డులకు డమ్మీ తుపాకులతో శిక్షణ ఇస్తారు. శిక్షణ ప్రారంభంలో నిజమైన తుపాకులతో శిక్షణ ఇస్తే ప్రమాదవశాత్తు పేలితే ప్రాణనష్టం. కాబట్టి ఈ ఏర్పాట్లు చేస్తారు. ఏ చిత్రం షూటింగ్లో పోలీసుల శిక్షణ ఉందంటే అందుకు అవసరమైన డమ్మీ తుపాకులను కూడా ఇక్కడి నుంచి సరఫరా చేస్తారు. చెక్క బరువుగా ఉంటే ఇబ్బందని.. తేలికైన బూరుగు చెక్కతో తుపాకులను రూపొందిస్తారు. వాటికి మధ్యలో ఇనుప ముక్కలు అమర్చి నిజమైన తుపాకుల్లా కనిపించేలా చేస్తారు. ఇక కత్తులనైతే పూర్తిగా రబ్బరుతో రూపొందించి రంగులు వేస్తారు. తాకితే అవి డమ్మీ అని చెప్పగలరు కానీ.. చూసినవాళ్లు మాత్రం అవి నిజమైనవే అని భ్రమపడతారు. వృత్తినే నమ్ముకున్నా.. ఈ నగరం నన్ను ఆదరించింది. రెండు దశాబ్దాలుగా సినిమాలకు అవసరమైన పరికరాలు సప్లయ్ చేస్తూ ఉపాధి పొందుతున్నాను. ‘బాహుబలి’ సినిమాకు పనిచేయడం జీవితంలో మర్చిపోలేను. దర్శకుడు రాజమౌళి ప్రత్యేక శ్రద్ధతో కత్తులు తయారు చేయించారు. కొన్ని వందల సినిమాలకు రకరకాల పరికరాలు అందించాను. ఈ వృత్తి సంతృప్తికరంగా ఉంది. – శ్రీశైలం మహానంది -
డమ్మీ కేబుల్ ఆపరేటర్‌కు సహకరిస్తున్న ఎస్సై
పోలీసు కమిషనర్‌ను కలిసిన ఆపరేటర్లు వరంగల్ : పర్వతగిరి మండలం నారాయణపురంలోని కేబుల్ ఆపరేటర్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్న డమ్మీ ఆపరేటర్‌పై ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ఆయనకే సహకరిస్తున్న ఎస్సైపై విచారణ జరపాలని తెలంగాణ రూరల్ ఎంఎస్ఓ, కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు వారు శనివారం పోలీసు కమిషనర్ సుధీర్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్స్ వెల్పేర్ అసోసియేషన్‌కు చెందిన ఓఎఫ్సీ కేబుల్‌ను నారాయణపురంలోని వాటర్ ట్యాంకు వద్ద మూడ్ రవి కట్ చేసి తన బంధువులకు కనెక్షన్ ఇచ్చాడని తెలిపారు. ఈ విషయమై పర్వతగిరి ఎస్సైకి ఫిర్యాదు చేయడంతో పాటు ఆధారాల సీడీ అందజేస్తే ప్రొబెషనరీ ఎస్సైతో విచారణ చేయించారని పేర్కొన్నారు. అనంతరం అక్రమంగా బిగించిన ఓఎఫ్సీ వైరు తొలగించారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మళ్లీ గత నెలలో వైర్ కట్ చేసి వేరే కనెక్షన్లు ఇస్తుండగా సూర రమేష్‌ను పట్టుకుని ప్రశ్నిస్తే ఎస్సై చెబితేనే చేస్తున్నట్లు తెలిపాడన్నారు. ఈ విషయమై ఎస్సైని కలిస్తే పట్టించుకోకపోగా పర్వతగిరి ఎంఎస్ఓకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు పూర్తిస్థాయిలో విచారణ జరిపిం చాలని పర్వతగిరి ఎంఎస్ఓ గోగినేని భవానీశంకర్రావుతో పాటు అసోసియేషన్ రూరల్ జిల్లా అధ్యక్షుడు పాల్వంచ కోటేశ్వర్, సెక్రటరీ బైరీ శ్రీనివాస్, వంగాల ఉమాశంకర్లింగం, రాజేష్ కోరారు. -
టీడీపీలో డమ్మి ప్రెసిడెంట్లు