సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల షాపూర్‌నగర్ ఆదర్శ్ బ్యాంక్ దగ్గర గురువారం డమ్మీ బాంబు బెదిరింపు ఘటన చోటు చేసుకుంది. బాడీ మొత్తానికి బాంబు తరహా సెటప్ చేసుకుని ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు.
మామూలుగా బ్యాంకులోకి ఎంట్రీ ఇచ్చిన ఆ వ్యక్తి.. హఠాత్తుగా తాను మానవబాంబునని, తన దగ్గర బాంబు ఉందంటూ బెదిరింపులకు దిగాడు. రూ.2 లక్షలు ఇవ్వాలని, లేకుంటే బ్యాంకును పేల్చేస్తానని బెదిరించాడు. దీంతో బ్యాంక్ సిబ్బంది భయపడ్డారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై జీడిమెట్ల పోలీసులకు అలర్ట్ వెళ్లింది.
హుటాహుటిన సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు.. అది డమ్మీ బాంబుగా తేల్చారు. సదరు వ్యక్తిని జీడిమెట్లకే చెందిన శివాజీగా గుర్తించారు. అతను ఎందుకు అలా చేశాడన్నదానిపై తేల్చేందుకు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.
Comments
Please login to add a commentAdd a comment