shapur nagar
-
హైదరాబాద్: డమ్మీ బాంబుతో బ్యాంకులో హల్చల్
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల షాపూర్‌నగర్ ఆదర్శ్ బ్యాంక్ దగ్గర గురువారం డమ్మీ బాంబు బెదిరింపు ఘటన చోటు చేసుకుంది. బాడీ మొత్తానికి బాంబు తరహా సెటప్ చేసుకుని ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. మామూలుగా బ్యాంకులోకి ఎంట్రీ ఇచ్చిన ఆ వ్యక్తి.. హఠాత్తుగా తాను మానవబాంబునని, తన దగ్గర బాంబు ఉందంటూ బెదిరింపులకు దిగాడు. రూ.2 లక్షలు ఇవ్వాలని, లేకుంటే బ్యాంకును పేల్చేస్తానని బెదిరించాడు. దీంతో బ్యాంక్ సిబ్బంది భయపడ్డారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై జీడిమెట్ల పోలీసులకు అలర్ట్ వెళ్లింది. హుటాహుటిన సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు.. అది డమ్మీ బాంబుగా తేల్చారు. సదరు వ్యక్తిని జీడిమెట్లకే చెందిన శివాజీగా గుర్తించారు. అతను ఎందుకు అలా చేశాడన్నదానిపై తేల్చేందుకు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. -
మందు కొడితే మాకుమేమే రౌడీలం
సూరారం: మందుబాబులు హల్చల్ సృష్టించారు. పూటుగా మద్యం సేవించి షాపూర్‌నగర్ ప్రధాన రహదారిపై అరగంట పాటు ముష్టి యుద్ధానికి దిగారు. షాపూర్‌నగర్‌లోని రంగ–భుజంగ థియేటర్ వద్దకు మ్యాట్నీ షోకి వచ్చిన ఇరువర్గాల మందుబాబుల మధ్య మాటామాట పెరిగింది. పోట్లాడుకుంటూ షాపూర్‌నగర్ ప్రధాన రహదారిపై దూసుకొచ్చారు. దీంతో అరగంట పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా పోలీసుల పైకి ఎదురుతిరిగారు. పరిస్థితి విషమించడంతో పెట్రోలింగ్ వాహనం రంగంలోకి దిగింది. అనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మిగతా వారు పరారయ్యారు. పట్టుబడిన ముగ్గురు మందుబాబులకు బ్రీద్ టెస్టింగ్ చేయగా మద్యం సేవించి ఉన్నట్లు తేలింది. వారి మీద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. -
షాపూర్ నగర్ లో మహిళపై హత్యాయత్నం
హైదరాబాద్: నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. జీడిమెట్ల షాపూర్ నగర్ లో ఓ మహిళను హత్య చేసేందుకు యత్నించిన ఘటన స్థానికంగా కలకల సృష్టించింది. రోడ్డుపై వెళుతున్న మహిళను కొందరు వ్యక్తులు గొంతుకోసి హతమార్చాలని ప్రయత్నించి పరారయ్యారు. దీంతో మహిళకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఓటేసేముందు ఒక్కసారి ఆలోచించండి: షర్మిల
-
ఓటేసేముందు ఒక్కసారి ఆలోచించండి: షర్మిల
హైదరాబాద్: పన్నులు, ఛార్జీలు పెంచుతూ ప్రజల నడ్డి విరిచింది కిరణ్ సర్కారేనని వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జీడిమెట్లలోని షాపూర్లో నిర్వహించిన రోడ్ షోలో ఆమె ప్రసంగించారు. అధికారపక్షాన్ని కాలర్ పట్టుకుని ప్రశ్నించాల్సిన చంద్రబాబు తనకేమీ పట్టనట్టు వ్యవహరించారని విమర్శించారు. ఈ ఐదేళ్ల దుర్మార్గ కాంగ్రెస్ పాలనపై ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై పోరాడింది జగనన్న మాత్రమేనని గుర్తు చేశారు. ప్రజాసమస్యల పరిష్కారమే జగనన్న ముఖ్యమనుకున్నాడని, పదవులను సైతం లెక్కచేయలేదని అన్నారు. చివరికి జైలుకు కూడా వెళ్లాడని గుర్తు చేశారు. ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఓటేసేముందు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. వైఎస్ఆర్ సీపీకి ఓటేసి రాజన్న రాజ్యం తెచ్చుకోవాలని ఓటర్లకు షర్మిల విజ్ఞప్తి చేశారు. -
ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబం ఆత్మహత్య
జీడిమెట్లలోని షాపూర్ నగర్ సమీపంలోని న్యూ ఎల్.బి.నగర్లో గత అర్థరాత్రి ఇద్దరు చిన్నారులతో సహా దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెల్లవారినా ఇంకా తలుపులు తీయకపోవడంతో ఆ ఇంటి పక్కవారు కిటికిలో నుంచి చూడగా దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గమనించారు. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.