మందు కొడితే మాకుమేమే రౌడీలం | Alcohol Addicted People Clashed With Police On Main Road In Shapur Nagar | Sakshi
Sakshi News home page

మందు కొడితే మాకుమేమే రౌడీలం

Published Sat, Mar 12 2022 3:36 AM | Last Updated on Sat, Mar 12 2022 3:36 AM

Alcohol Addicted People Clashed With Police On Main Road In Shapur Nagar - Sakshi

షాపూర్‌నగర్‌ రహదారిపై పోలీసులతో వాదులాడుతున్న మందుబాబులు 

సూరారం: మందుబాబులు హల్‌చల్‌ సృష్టించారు. పూటుగా మద్యం సేవించి షాపూర్‌నగర్‌ ప్రధాన రహదారిపై అరగంట పాటు ముష్టి యుద్ధానికి దిగారు. షాపూర్‌నగర్‌లోని రంగ–భుజంగ థియేటర్‌ వద్దకు మ్యాట్నీ షోకి వచ్చిన ఇరువర్గాల మందుబాబుల మధ్య మాటామాట పెరిగింది. పోట్లాడుకుంటూ షాపూర్‌నగర్‌ ప్రధాన రహదారిపై దూసుకొచ్చారు. దీంతో అరగంట పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా పోలీసుల పైకి ఎదురుతిరిగారు. పరిస్థితి విషమించడంతో పెట్రోలింగ్‌ వాహనం రంగంలోకి దిగింది. అనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మిగతా వారు పరారయ్యారు. పట్టుబడిన ముగ్గురు మందుబాబులకు బ్రీద్‌ టెస్టింగ్‌ చేయగా మద్యం సేవించి ఉన్నట్లు తేలింది. వారి మీద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement