clashed
-
యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తతలు..పలువురికి గాయాలు
లక్నో: అలహబాద్ యూనివర్సిటీ తీవ్ర హింసాత్మకంగా మారింది. సెక్యూరిటీ గార్డు, విద్యార్థుల మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో ఇరువురు ఘర్షణకు దిగడంతో యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విద్యార్థులు రాళ్లు రువ్వడం, మోటారు సైకిళ్లుకు నిప్పంటించడం వంటివి చేశారు. ఈ ఘర్షణలో ఇరువురు తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, విద్యార్థులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. యూనివర్సిటీలో ఫీజుల పెంపు విషయమై నెలల తరబడి నిరసన జరుగుతోంది. అందులో భాగంగా ఓ విద్యార్థి నాయకుడు క్యాంపస్‌లోని బ్యాంకుకు వెళ్లాలనుకున్నాడు. ఐతే గార్డు అందుకు అనుమతించ లేదు. దీంతో వాగ్వాదం ఏర్పడి అది కాస్త ఘర్షణకు దారితీసినట్లు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: జవాన్లకు ఆ పదం ఉపయోగించకూడదు! రాహల్‌పై విదేశాంగ మంత్రి ఫైర్) -
మందు కొడితే మాకుమేమే రౌడీలం
సూరారం: మందుబాబులు హల్చల్ సృష్టించారు. పూటుగా మద్యం సేవించి షాపూర్‌నగర్ ప్రధాన రహదారిపై అరగంట పాటు ముష్టి యుద్ధానికి దిగారు. షాపూర్‌నగర్‌లోని రంగ–భుజంగ థియేటర్ వద్దకు మ్యాట్నీ షోకి వచ్చిన ఇరువర్గాల మందుబాబుల మధ్య మాటామాట పెరిగింది. పోట్లాడుకుంటూ షాపూర్‌నగర్ ప్రధాన రహదారిపై దూసుకొచ్చారు. దీంతో అరగంట పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా పోలీసుల పైకి ఎదురుతిరిగారు. పరిస్థితి విషమించడంతో పెట్రోలింగ్ వాహనం రంగంలోకి దిగింది. అనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మిగతా వారు పరారయ్యారు. పట్టుబడిన ముగ్గురు మందుబాబులకు బ్రీద్ టెస్టింగ్ చేయగా మద్యం సేవించి ఉన్నట్లు తేలింది. వారి మీద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. -
వీడియో వైరల్: రాస్కెల్.. నన్నే కొడతావా?
మండ్య: స్కూటర్ పైన వచ్చిన యువతి, మహిళా ఎస్సైతో గొడవకు దిగింది. దీంతో ఆమెకు ఎస్సై చెంప చెళ్లుమనిపించింది. మండ్య నగరంలోని నోరడి రోడ్డులో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. కూడలిలో మహిళా ఎస్సై కవితాగౌడ పాటిల్ వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. స్కూటీపై వచ్చిన యువతిని రికార్డులు చూపించాలని పోలీసులు అడిగారు. నేను హెల్మెట్ పెట్టుకోలేదు, నా వద్ద డబ్బులు లేవు, డబ్బులు గూగుల్ పేలో పంపిస్తాను, మీ నంబర్ ఇవ్వండి అని యువతి పోలీసులను అడిగింది. ఇందుకు ఒప్పుకోని పోలీసులు మొదట బండి దిగు , నీ పేరు, మీ నాన్న పేరు చెప్పు, మీ నాన్నను పోలీస్‌స్టేషన్‌కు పంపీ, అక్కడ బండిస్తాము అని చెప్పడంతో యువతి కోపంతో అరవసాగింది. నా బండి ముట్టుకోవద్దు అని గట్టిగా అరిచింది. దాంతో ఎస్సై కవితా వచ్చి పోలీసులనే బెదిరిస్తావా అని అమ్మాయికి చెంపదెబ్బ కొట్టడంతో యువతి మరింత రెచ్చిపోయి నీవు ఎవరు నన్ను కొట్టడానికి, నీకు ఏమి హక్కులు ఉన్నాయి, ఎనే మాడ్తియా రాస్కెల్ అని గోల చేసింది. పోలీసులు స్కూటీని పోలీస్‌స్టేషన్‌కు తీసుకుపోయారు. ఈ రగడ వీడియో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందింది. యువతిని ఎస్సై కొట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: స్టేజిపై మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లిన ఎంపీ వైరల్: ఆకలేస్తే అంతేమరీ! -
మద్యం మత్తులో పోలీస్ స్టేషన్లో వీరంగం
సాక్షి, నిజామాబాద్: మద్యం మత్తులో మాజీ సర్పంచ్ కుమారుడు ఎడపల్లి పోలీస్ స్టేషన్లో హల్చల్ చేశాడు. శంకర్ అనే వ్యక్తిపై బీరు సీసాతో దాడి చేసిన ఘటనలో పోలీసులు మాజీ సర్పంచ్ శంకర్ నాయుడు కుమారుడు రాజీవ్ నాయుడుని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. మద్యం మత్తులో స్టేషన్‌కు చేరుకున్న రాజీవ్ నాయుడు అక్కడ ఫర్నీచర్ ధ్వంసం చేసి వీరంగం సృష్టించాడు. చదవండి: ఐటీ ఉద్యోగినిపై పోలీసుల అసభ్య ప్రవర్తన -
మూతపడ్డ ఈఫిల్ టవర్!
పారిస్ః అభిమానులు పోలీసుల మధ్య చెలరేగిన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. యూరో కప్ సాకర్ మ్యాచ్ సమయంలో రేగిన ఘర్షణలు పారిస్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఈఫిల్ టవర్ మూసివేతకు కారణమైంది. భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకొని పారిస్ లోని ఈఫిల్ టవర్ ను మూసివేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. పారిస్ లో జరిగిన ఫ్రాన్స్, పోర్చుగల్ జట్లకు మధ్య జరిగిన యూరోకప్ సాకర్ 2016 ఫైనల్ మ్యాచ్ లో పోర్చుగల్ చేతిలో ఫ్రాన్స్ ఓటిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో స్టేడియంలోకి అభిమానులు ప్రవేశించడానికి పోలీసులు నిరాకరించడంతో అసలు గొడవ మొదలైంది. అడ్డుకున్న పోలీసులపైకి అభిమానులు రాళ్ళు రువ్వడంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయువును, వాటర్ క్యాన్స్ సైతం ప్రయోగించారు. ఈఫిల్ టవర్ ప్రాంతం భాష్సగోళాల పొగతో నిండిపోయింది. ఆందోళనకు దిగిన 40 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనల్లో అక్కడి వాహనాలకు, చెత్తకు నిరసనకారులు నిప్పు పెట్టారు. ఈ సందర్భంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈఫిల్ టవర్ ను ఒక రోజంతా మూసివేస్తున్నట్లు ఈఫిల్ టవర్ నిర్వాహకులు వెల్లడించారు.