మండ్య: స్కూటర్ పైన వచ్చిన యువతి, మహిళా ఎస్సైతో గొడవకు దిగింది. దీంతో ఆమెకు ఎస్సై చెంప చెళ్లుమనిపించింది. మండ్య నగరంలోని నోరడి రోడ్డులో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. కూడలిలో మహిళా ఎస్సై కవితాగౌడ పాటిల్ వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. స్కూటీపై వచ్చిన యువతిని రికార్డులు చూపించాలని పోలీసులు అడిగారు. నేను హెల్మెట్ పెట్టుకోలేదు, నా వద్ద డబ్బులు లేవు, డబ్బులు గూగుల్ పేలో పంపిస్తాను, మీ నంబర్ ఇవ్వండి అని యువతి పోలీసులను అడిగింది.
ఇందుకు ఒప్పుకోని పోలీసులు మొదట బండి దిగు , నీ పేరు, మీ నాన్న పేరు చెప్పు, మీ నాన్నను పోలీస్‌స్టేషన్‌కు పంపీ, అక్కడ బండిస్తాము అని చెప్పడంతో యువతి కోపంతో అరవసాగింది. నా బండి ముట్టుకోవద్దు అని గట్టిగా అరిచింది. దాంతో ఎస్సై కవితా వచ్చి పోలీసులనే బెదిరిస్తావా అని అమ్మాయికి చెంపదెబ్బ కొట్టడంతో యువతి మరింత రెచ్చిపోయి నీవు ఎవరు నన్ను కొట్టడానికి, నీకు ఏమి హక్కులు ఉన్నాయి, ఎనే మాడ్తియా రాస్కెల్ అని గోల చేసింది. పోలీసులు స్కూటీని పోలీస్‌స్టేషన్‌కు తీసుకుపోయారు. ఈ రగడ వీడియో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందింది. యువతిని ఎస్సై కొట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి:
స్టేజిపై మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లిన ఎంపీ
వైరల్: ఆకలేస్తే అంతేమరీ!
Comments
Please login to add a commentAdd a comment