
సాక్షి, నిజామాబాద్: మద్యం మత్తులో మాజీ సర్పంచ్ కుమారుడు ఎడపల్లి పోలీస్ స్టేషన్‌లో హల్‌చల్ చేశాడు. శంకర్ అనే వ్యక్తిపై బీరు సీసాతో దాడి చేసిన ఘటనలో పోలీసులు మాజీ సర్పంచ్ శంకర్ నాయుడు కుమారుడు రాజీవ్ నాయుడుని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. మద్యం మత్తులో స్టేషన్‌కు చేరుకున్న రాజీవ్ నాయుడు అక్కడ ఫర్నీచర్ ధ్వంసం చేసి వీరంగం సృష్టించాడు. చదవండి: ఐటీ ఉద్యోగినిపై పోలీసుల అసభ్య ప్రవర్తన