former sarpanch
-
బిల్లులు రాక.. పంచాయతీ భవనం తాకట్టు!
మేడిపల్లి (వేములవాడ): చేసిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకపోవటంతో ఓ మాజీ సర్పంచ్ గ్రామ పంచాయతీ భవనాన్ని తాకట్టు పెట్టిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. మేడిపల్లి మండలం తొంబరావుపేట తాజా మాజీ సర్పంచ్ మామిడి సత్తమ్మ ధర్మారెడ్డి శుక్రవారం కట్లకుంట తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో పంచాయతీకి సంబంధించి దస్త్రాలను తాకట్టు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సుమారు రూ.18 లక్షలకు పైగా అప్పు చేసి తొంబరావుపేట పంచాయతీ భవనం నిర్మించామని, ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవటంతో అప్పుల ఊబిలో కూరుకుపోయామని వాపోయారు. అప్పు ఇచి్చనవారు రోజూ ఇంటికి వచ్చి వేధిస్తున్నారని తెలిపారు. దీంతో అప్పులు తీర్చేందుకు లోన్ కోసం పంచాయతీ భవనాన్ని తాకట్టు పెట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం బకాయిలు విడుదల చేసిన వెంటనే వడ్డీతో సహా బ్యాంకులో చెల్లిస్తానని సిబ్బందికి వివరించారు. తాకట్టు పెట్టేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. తమకు వెంటనే ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని లేకుంటే చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై బ్యాంకు అధికారిని సంప్రదించటానికి ప్రయతి్నంచగా అందుబాటులోకి రాలేదు. -
బురహాన్‌పల్లి మాజీ సర్పంచ్ హత్య కేసులో వీడిన మిస్టరీ
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన మాజీ సర్పంచ్ హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. సుఫారి గ్యాంగ్ సహాయంతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. రూ.30 లక్షల సుపారీ ఇచ్చి పథకం ప్రకారం దేవేందర్ హత్య జరిగిందని వర్ధన్నపేట ఏసీపీ నరసయ్య మీడియా సమావేశంలో వెల్లడించారు.రాయపర్తి మండలం బురహాన్‌పల్లిలో గతనెల 7న మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ హత్యకు గురయ్యాడు. భూ తగాదాలు, వ్యక్తిగత కక్షల కారణంగా ఈ హత్య జరిగిందని.. ఈ హత్యలో పల్లె మల్లేశం అతడి కుమారుడు మురళి కీలకంగా వ్యవహరించి హైదరాబాద్‌కు చెందిన సుంకర ప్రసాద్, మర్నేని రాజు అనే సుపారి గ్యాంగ్ ద్వారా హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు.ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది అరెస్ట్ కాగా, ఇందులో A1గా సుంకర ప్రసాద్ నాయుడు, A2 గా మర్నేని రాజు సహా మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు వర్ధన్నపేట ఏసీపీ తెలిపారు. -
పరువు తీశారని మాజీ సర్పంచ్ ఆత్మహత్య
సాక్షి, వరంగల్(శాయంపేట): తీసుకున్న అప్పు చెల్లించాలని ఒత్తిడి చేయడంతోపాటు పరువుతీశారని మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ మాజీ సర్పంచ్ చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయాడు. అతని మృతికి పీఏసీఎస్ చైర్మన్ దంపతులే కారణమని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన శుక్రవారం హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం..హుస్సేన్‌పల్లి గ్రామానికి చెందిన భూతాల సురేష్ (40) పత్తి, మక్కలు, వరిధాన్యం కొనుగోలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యాపార అవసరాల నిమిత్తం శాయంపేట గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్ కుసుమ శరత్ వద్ద 5నెలల క్రితం రూ.20లక్షలు అప్పుగా తీసుకున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో శాయంపేటలోని తన రెండు అంతస్తుల భవనాన్ని బ్యాంక్‌లో పెట్టి లోన్ తీసుకోవడానికి డాక్యుమెంట్స్ తయారు చేసుకున్నాడు. 20 రోజులనుంచి తన అప్పు చెల్లించాలని శరత్.. తరచూ సురేష్ ఇంటికి వెళ్లి దూషిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల శరత్.. సురేష్‌ను బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి ఇంటి పత్రాలు ఇవ్వాలని మూడు గంటలపాటు నిర్బంధించాడు. విషయాన్ని సురేష్ ఫోన్లో తన మిత్రులకు తెలియజేయడంతో వారు వచ్చి ఇంటి డాక్యుమెంట్స్ అప్పగించి అతన్ని తీసుకెళ్లారు. ఈ నెల 16న సురేష్ శాయంపేటలోని తన ఇంటికి అమ్మకానికి బోర్డు పెట్టాడు. విషయం తెలుసుకున్న శరత్ అతని భార్య రమాదేవి ఈ నెల 19న సురేష్ ఇంటికి వెళ్లి చుట్టుపక్కల వారి ముందు అప్పు విషయంలో దుర్భాషలాడుతూ సురేష్‌పై దాడి చేశారు. అవమానాన్ని భరించలేక సురేష్ అదేరోజు సాయంత్రం కొత్తగట్టుసింగారం శివారు వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. చైర్మన్ దంపతుల వేధింపుల వల్లే తాను మానసికంగా కుంగిపోయి పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని సురేష్‌ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. అప్పుగా తీసుకున్న రూ. 20లక్షలు చెల్లించాలని వేధింపులకు గురిచేయడం, ఇంటి ఒరిజినల్ దస్తావేజులు ఇవ్వాలని నిర్బంధించడం, కాలనీవాసుల ముందే పీఏసీఎస్ చైర్మన్ కుసుమ శరత్ దంపతులు దుర్భాషలాడుతూ కొట్టడంతో మనస్తాపం చెంది తన భర్త సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడని భార్య రాణి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కుసుమ శరత్, భార్య రమాదేవిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు. రోడ్డుపై ధర్నా .. పీఏసీఎస్ చైర్మన్, అతని భార్యపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు సాయంత్రం నాలుగు గంటల నుంచి పత్తిపాక–శాయంపేట ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. పరకాల ఏసీపీ శివరామయ్య ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గండ్ర సత్యనారాయణ రావు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు మద్దతు ప్రకటించారు. బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కాగా, సురేష్ మృతిపై బంధువులు చేసిన ఆరోపణలపై పీఏసీఎస్ చైర్మన్ శరత్‌ను వివరణ కోరేందుకు ఎంతసేపు ప్రయత్నించినా స్పందించలేదు. -
ములుగులో మావోయిస్టుల ఘాతుకం.. మాజీ సర్పంచ్ హత్య
సాక్షి, వరంగల్: ములుగు జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. కిడ్నాప్‌కు గురైన మాజీ సర్పంచ్ కురుసం రమేష్‌ను చంపేశామని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరించడంతోనే హత్య చేసినట్లు ప్రకటన విడుదల చేశారు. రమేష్ స్వగ్రామం ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు పంచాయతీ పరిధిలోని కే కొండాపురం. 2014లో సర్పంచ్‌గా ఎన్నికైన రమేష్.. ప్రస్తుతం లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య రజితకు ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలో ఏఎన్ఎం ఉద్యోగం రావడంతో ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ క్వార్టర్స్ సమీపంలో నివాసం ఉంటున్నారు. రమేశ్ వృత్తిరీత్యా డ్రైవర్ కావడంతో ఖాళీ సమయంలో ఎవరికైనా డ్రైవర్‌గా వెళ్లేవాడు. ఇదే క్రమంలో సోమవారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు పోయే పని ఉందని ఇంట్లో చెప్పి వెళ్లిన రమేష్ కిడ్నాప్‌కు గురయ్యాడు. చదవండి: ఒమిక్రాన్ దడ, థర్డ్‌వేవ్ హెచ్చరిక.. ‘బూస్టర్’ వైపు పరుగులు.. కాగా 2019లో రమేష్ పోలీస్ ఇన్ఫార్మర్గా మారి పాలపొడిలో విషం కలిపి ఇచ్చాడని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. విషం కలిపిన పాలపొడితో కామ్రేడ్ బిక్షపతి అలియాస్ విజేందర్ అమరుడయ్యాని పేర్కొన్నారు. అదే విధంగా రమేష్ ఒక ఎన్కౌంటర్ చేయించి రెండు లక్షలు తీసుకున్నాడని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. పార్టీకి, ప్రజలకు ద్రోహం తలపెట్టడంతోనే ప్రజాభిప్రాయం మేరకు రమేష్‌ను హత్య చేశామని తెలిపారు. పోలీసులు ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇన్ఫార్మర్గా మారితే రమేష్‌కు పట్టిన గతే పడుతుందని మావోయిస్ట్ పార్టీ వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత హెచ్చరించారు. చదవండి: క్రికెట్ టోర్నీలో చాన్స్ ఇస్తామని చెప్పి.. మహిళా క్రికెటర్‌ను.. -
మాజీ సర్పంచ్ దారుణ హత్య
‘పగ’ వినడానికి రెండక్షరాలే అయినా అది ఎంతటి పరిణామాలకైనా దారితీయిస్తుంది. అది స్నేహితుల మధ్య కావొచ్చు, రక్ష సంబంధీకుల మధ్య కావొచ్చు.. పగ పగే. అదే పగ ఒక్కసారి వచ్చిపోతే రక్త సంబంధాన్ని కూడా చూడదు. చిన్నా పెద్దా తేడా కూడా పట్టించుకోదు. ఆ పగే మాజీ సర్పంచ్‌ను పొట్టనపెట్టుకుంది. మన పైన కరోనా రూపంలో ప్రకృతే పగబట్టింది. ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సివస్తోందో తెలియని దారుణ పరిస్థితుల్లో.. మనుషులు ఒకరిపై ఒకరు పగ సాధించుకోవడం అవసరమా..! శ్రీకాకుళం రూరల్: పాతకక్షల కారణంగా శ్రీకాకుళం రూరల్ మండలం కనుగులవానిపేటకు చెందిన మాజీ సర్పంచ్ కను గుల కృష్ణారావు (76)ను అదే గ్రామానికి చెందిన కనుగుల సవరరాజు అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కు సంబంధించి శ్రీకాకుళం డీఎస్పీ మహేంద్ర, టౌన్ సీఐ అంబేద్కర్ గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. సవరరాజు కనుగులవానిపేట గ్రామంలో ఉన్నప్పుడు సారావ్యాపారం నిర్వహించేవాడు.కనుగుల కృష్ణారావు అప్ప ట్లో సర్పంచ్ కావడంతో గ్రామంలో జరుగుతున్న సారా వ్యాపారంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పలుమా ర్లు సవరరాజు అరెస్టు అయ్యాడు. అప్పటి నుంచి కనుగులవానిపేట గ్రామాన్ని వదిలిన సవరరాజు నరసన్నపేటలోని అత్తవారి గ్రామం నిడగాంకు భార్యాబిడ్డలతో వెళ్లిపోయి 15 ఏళ్లుగా అక్కడే ఉంటున్నాడు. అప్పటి నుంచి కృష్ణారావుపై కక్ష పెంచుకొని అదును కోసం ఎదురు చూస్తున్నాడు. దీనికితోడు కనుగులవానిపేటలోని సవరరాజు అన్నదమ్ముల ఆస్తుల విషయంలో కూడా తమ్ముడికే సపోర్ట్‌గా కృష్ణారావు మాట్లాడటంతో మరింత కక్ష పెంచుకున్నాడు. హత్య జరిగిందిలా.. కనుగులవానిపేటలో ఆస్తులను, పొలాలను చూసుకునేందుకు సవరరాజు గురువారం ఉదయం 10 గంటల సమయంలో గ్రామానికి వచ్చాడు. ఇప్పిలి, కనుగులవానిపేటకు మధ్య మామిడితోటను ఆనుకుని ఉన్న ఆలయం వద్ద చెట్టు కింద కృష్ణారావు కూర్చున్నాడు. సరవరరాజును చూసి మళ్లీ ఎందుకు వచ్చావురా అంటూ తిట్టాడు. అప్పటికే కోపంతో రగిలిపోతున్న సవర రాజు పదునైన కత్తవ(బల్లెం)తో మెడపై దాడి చేయగా అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసుల అదుపులో నిందితుడు? సంఘటన జరిగిన రెండు గంటల వ్యవధిలోనే హంతకుడు సవరరాజును, మారణాయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. రూరల్ ఎస్ఐ రాజేష్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు పంపించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: విషాదం: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య ఘోర ప్రమాదం: పోలీసులపై దూసుకెళ్లిన లారీ -
విషాదం: మాజీ సర్పంచ్ దంపతుల మృతి
సాక్షి, ఖమ్మం: రెండు రోజుల క్రితం కుటుంబంతో కలిసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన భార్య,భర్తలు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడియాతండా గ్రామంలో మాజీ సర్పంచ్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంగతి విధితమే.. గత శనివారం.. భార్య, భర్తలు వడ్య బాబురావు, రంగమ్మ పురుగులు మందు తాగి, ఇద్దరు పిల్లలకు కూడా కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి ఇచ్చారు. దీంతో వారిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం భార్య,భర్తలు మృతి చెందారు. ఇద్దరు పిల్లలు హనిస్వి, మహని పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. (చదవండి: ఉపసర్పంచ్ కుటుంబం ఆత్మహత్యాయత్నం) -
మద్యం మత్తులో పోలీస్ స్టేషన్లో వీరంగం
సాక్షి, నిజామాబాద్: మద్యం మత్తులో మాజీ సర్పంచ్ కుమారుడు ఎడపల్లి పోలీస్ స్టేషన్లో హల్చల్ చేశాడు. శంకర్ అనే వ్యక్తిపై బీరు సీసాతో దాడి చేసిన ఘటనలో పోలీసులు మాజీ సర్పంచ్ శంకర్ నాయుడు కుమారుడు రాజీవ్ నాయుడుని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. మద్యం మత్తులో స్టేషన్‌కు చేరుకున్న రాజీవ్ నాయుడు అక్కడ ఫర్నీచర్ ధ్వంసం చేసి వీరంగం సృష్టించాడు. చదవండి: ఐటీ ఉద్యోగినిపై పోలీసుల అసభ్య ప్రవర్తన -
వైఎస్సార్ సీపీ నేత దారుణ హత్య
తూర్పు గోదావరి /కొత్తపేట: కొత్తపేట మండలం బిళ్లకుర్రు మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకుడు దూనబోయిన సత్యనారాయణ (58) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. బిళ్లకుర్రు శివారు మాసాయిపేట గ్రామానికి చెందిన సత్యనారాయణ తన ఇంటికి సమీపంలోని తన పొలంలో కొబ్బరితోట పనులు చేయించి, సాయంత్రం కూలీలకు కూలీ డబ్బులు చెల్లించి, ఎవరో ఫోన్ చేశారు వెళ్లి వస్తానని అక్కడి పనివారికి చెప్పి తన మోటార్‌సైకిల్‌పై వెళ్లి రాత్రికి తిరిగి ఇంటికి రాలేదు. దానితో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో తన ఇంటికి వెనుకవైపు ఉన్న కొబ్బరితోటలో తలపై కత్తిగాట్లతో రక్తస్రావమై విగతజీవిగా పడి ఉండగా స్థానికులు గుర్తించారు. ఆ సమాచారం మేరకు 6 గంటల సమయంలో కొత్తపేట ఎస్సై జి.హరీష్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని బోర్లాగా పడి ఉన్న మృతదేహాన్ని వెల్లకిలా తిప్పి చూడగా కత్తితో దాడి చేయడం వల్ల తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్టు గుర్తించారు. నుదురు పైభాగం, తల నడి నెత్తిన మూడు నరుకుళ్లు, ఎడమ చెవి కొంతమేర, కుడి చేయి బొటనవేలి కింద కత్తి నరుకుళ్లు ఉన్నాయి. ఎడమ కాలికి చెప్పు ఉండగా కుడి కాలి చెప్పు ఆ సమీపంలోనే పడి ఉంది. కళ్లజోడు కూడా మృతదేహం సమీపంలో అద్దాలు ఊడిపోయి ఉంది. అనంతరం రావులపాలెం సీఐ బి.పెద్దిరాజు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని, ఆ పరిసరాలను పరిశీలించి, బంధువులను, స్థానికులను విచారించారు. పంచాయతీ శివారు యెలిశెట్టివారిపాలెం కాలనీ సమీపంలో వాడపాలెం ఓల్డ్ చానల్ (పిల్ల కాలువ)లో సత్యనారాయణ పల్సర్ పడి ఉండగా దానికి సుమారు 100 మీటర్ల దూరంలో ఆయన మృతదేహం ఉంది. దానికి సుమారు మరో వంద మీటర్ల దూరంలో ఆయన ఇల్లు ఉంది. ఆయన మోటార్ సైకిల్ ఉన్న ప్రాంతం, మృతదేహం ఉన్న ప్రాంతం, ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇది పథకం ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు మాటువేసి హత్యాయత్నం చేయగా, వారి నుంచి తప్పించుకునే క్రమంలో కాలువలో మోటార్‌సైకిల్ పడిపోగా కాలువ దాటి కొబ్బరితోటల్లోంచి ఇంటివైపు పరుగెత్తి ఉంటారని, హంతకులు కత్తితో వెంబడించి, ఇంటికి వెనుక సుమారు 100 మీటర్ల సమీపంలోనే హత్య చేశారని భావిస్తున్నారు. తలపైనే కత్తితో నరికి హత్య చేయాలనే దాడిచేసినట్టు పోలీసులు నిర్ధారించారు. వివాహేతర సంబంధం, ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా అని అనుమానిస్తూ దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ విలేకరులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మండలి డిప్యూటీ చైర్మన్ ఆర్ఎస్ దిగ్భ్రాంతి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం (ఆర్ఎస్) మాజీ సర్పంచ్ దూనబోయిన హత్యకు గురికావడంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంఘటనా స్తలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోలీసులను విచారించి, కుటుంబ సభ్యులను, బంధువులను ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రాష్ట్ర వైఎస్సార్సీపీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, రాష్ట్ర బీజేపీ కిసాన్‌మోర్చా కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం తదితరులు దూనబోయిన మృతదేహాన్ని సందర్శించి హత్యను తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ నుంచి హుటాహుటిన వచ్చిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి దూనబోయిన హత్య సమాచారం తెలిసిన వెంటనే హైదరాబాద్‌లో ఉన్న ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హుటాహుటిన మాసాయిపేట చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి చలించిపోయారు. సంఘటనను తీవ్రంగా ఖండించారు. సంఘటనపై పోలీసులను ఆరా తీశారు. దర్యాప్తు వేగవంతం చేసి హంతకులను అరెస్టు చేయాలని ఆదేశించారు. కుటుంబ సభ్యులను, బంధువులను ఓదార్చారు. వివాదరహితునికి శత్రువులా? సత్యనారాయణకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సంతానం అందరూ ఉన్నత చదువులు చదివి ఉన్నతోద్యోగాల్లో, వివిధ ప్రాంతాల్లో స్థిరపడగా ఇక్కడ సత్యనారాయణ దంపతులు ఇద్దరే ఉంటున్నారు. 1996లో గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన ఆయన 2001 వరకూ ఆ పదవిలో ఉన్నారు. గతంలో కాంగ్రెస్ నాయకునిగా వివిధ పార్టీ పదవులు చేపట్టారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో క్రియాశీలక కార్యకర్తగా, ఆ పార్టీ జిల్లా బీసీ విభాగం సభ్యుడిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాగా గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా, ఒక గ్రామపెద్దగా హాజరవుతారు. వివాదరహితుడిగా పేరున్న సత్యనారాయణ హత్యకు గురికావడం మండలంలో తీవ్ర సంచలనం కలిగించింది. -
ఫిరాయించిన ఎమ్మెల్యేపై న్యాయపోరాటం
-
మాజీ సర్పంచ్ బలవన్మరణం
వంగూరు (కల్వకుర్తి) మహబూబ్‌నగర్ : నాలుగేళ్లుగా పంట దిగుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయిన మాజీ సర్పంచ్ మానసిక వేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా.. వంగూరు గ్రామ మాజీసర్పంచ్ గందం కౌసల్యమ్మ భర్త లింగయ్యతో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది. బుధవారం సాయంత్రం భర్త పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయాడు. సాయంత్రానికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఊరంతా వెతికినా ఎక్కడా అతని జాడ కనిపించలేదు. ఓ ప్రాంతంలో అతని బైక్, చెప్పులు కనిపించడంతో ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని అందరు భావించారు. ఆ క్రమంలో మానసిక వత్తిడికి గురైన భార్య కౌసల్యమ్మ భర్తను వెతికేందుకు వెళ్లి తెల్లవారుజామున పొలంలో పురుగుల మందుతాగి శవమై కనిపించింది. అంత్యక్రియల సమయానికి వచ్చిన భర్త కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న లింగయ్య మంగళవారం రాత్రి శ్రీశైలం వెళ్లి బుధవారం దైవదర్శనం చేసుకుని సాయంత్రానికి వంగూరుకు చేరుకున్నాడు. ఆయన ఇంటికి వచ్చి న సమయంలో చనిపోయిన భార్యకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్ని చూసిన ఆయన ఒక్కసారిగా భార్య మృతదేహంపై పడి రోదించాడు. కుటుంబసభ్యులు కూడా కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తులంతా పోగై ఈ ఘటన గురించి చర్చించుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదుచేసినట్టు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పరామర్శించారు. -
మాజీ సర్పంచ్ మృతికి ఆర్.నారాయణమూర్తి సంతాపం
విజయనగరం పూల్‌బాగ్ : విజయనగరం మండల పరిధిలోని సారిక పంచాయతీ మాజీ సర్పంచ్ మామిడి భవానీ మృతిపై సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి సంతాపం తెలిపారు. సారిక గ్రామానికి శుక్రవారం చేరుకుని భవానీ భర్త, ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి అప్పలనాయుడును పరామర్శించారు. పిల్లలు హాసిని, గ్రీష్మాలను ఓదార్చారు. ఆమె ఫొటోకు పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. -
మహిళా వీఆర్వోపై మాజీ సర్పంచ్ దౌర్జన్యం
గొల్లపల్లి(ధర్మపురి): రికార్డుల్లో పేరు పొందుపర్చనందుకు ఓ మాజీ సర్పంచ్ మహిళా వీఆర్వోను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో జరిగింది. మల్లన్నపేట గ్రామంలో కొద్దిరోజులుగా రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణ జరుగుతోంది. మాజీ సర్పంచ్ మానుక బక్కయ్య తన సోదరుడికి విక్రయించిన భూమి వివాదంలో ఉంది. ఆ భూమిని తన పేరిట రికార్డుల్లో పొందుపర్చాలని బక్కయ్య కొద్ది రోజులుగా వీఆర్వో శ్రీలత వద్దకు వచ్చి కోరుతున్నాడు. అలా చేయడం తన పరిధి కాదని, ఉన్నతాధికారులకు అప్పీలు చేసుకుని సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. గురువారం మరోసారి వీఆర్వో వద్దకు వచ్చి తన పేరు చేర్చాలని ఒత్తిడి చేశాడు. వినకపోవడంతో పంచాయతీ గదిలో ఉంచి తాళం వేశాడు. వీఆర్వోపై దౌర్జ్జన్యానికి పాల్పడి విధులకు ఆటంకం కల్గించినందుకు బక్కయ్య పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు. -
నక్సల్స్ పేరిట మాజీ సర్పంచ్‌పై కాల్పులు
-
నక్సల్స్ పేరిట మాజీ సర్పంచ్‌పై కాల్పులు
ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి నక్సల్స్ పేరిట మాజీ సర్పంచ్ సుంకె రాజన్న(55)పై కొందరు కాల్పులు జరిపారు. శుక్రవారం రాత్రి 11.15 గంటలకు నక్సల్స్ పేరుతో మాజీ సర్పంచ్ సుంకె రాజన్న ఇంటికి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. ఒకరు ఇంటి బయట కాపలా ఉండగా.. మిగిలిన ఇద్దరు ఇంటి లోపలికి ప్రవేశించారు. ‘మేం నక్సలైట్లం.. గ్రామంలో రాజన్న అందరిని బెదిరిస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు.. ఏడి వాడు’ అంటూ తీవ్ర స్వరంతో కుటుంబీకులను మందలించారు. ఆ తర్వాత రాజన్న నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి షార్ట్ వెపన్తో ఓ రౌండ్ కాల్చి పారిపోయారు. మెట్పల్లి పోలీసులు వచ్చి రాజన్నను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భూవివాదమే కారణమా? గ్రామానికి చెందిన చెదలు రాజేందర్, ఆయన తండ్రి చెదలు భూమన్నతో గ్రామ శివారులోని 3.03 ఎకరాల భూమిపై రాజన్నకు 15 ఏళ్ల నుంచి భూవివాదం ఉంది. సుంకె రాజన్న ఆ భూమి కోసం హైకోర్టును ఆశ్రయించగా.. ఏడాది క్రితం భూమి రాజన్నకే చెందుతుందని తీర్పు వచ్చింది. చికిత్స పొందుతున్న రాజన్న తనపై చెదలు రాజేందర్, భూమన్నలే దాడి చేయించారని ఆరోపించాడు. వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని గతంలో రాజన్న పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రాజన్న కుమారుడు దివాకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్‌నాయక్ తెలిపారు. -
మాజీ సర్పంచ్ కుటుంబంపై దాడి
రాయచోటి: వైఎస్ఆర్ జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం పాలెం గ్రామంలో మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. పాలెం మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీకి చెందిన చంద్ర కుటుంబంపై టీడీపీకి చెందిన ప్రస్తుత సర్పంచ్ వెంకటాద్రి, ఎంపీటీసీ గంగయ్య, మల్లేష్లు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, చంద్ర స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించగా అడ్డుకోవడంతో ఈ దాడి జరిగింది. -
గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి
సిద్దిపేట రూరల్: గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి చెందిన సంఘటన మండలంలోని వెంటాపూర్లో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. వెంకటాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ యాదమ్మ (50) సిద్దిపేట పట్టణంలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది. సోమవారం అర్ధరాత్రి గుండెనొప్పి రావడంతో కుటుంబీకులు ఆమెను పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె అంత్యక్రియలను వెంకటాపూర్‌లో నిర్వహించారు. రెండు దశాబ్దాల పాటు ఆమో వెంకటాపూర్ సర్పంచ్‌గా పని చేశారు. -
శ్రీపాద విగ్రహం ఎదుట శవ దహనానికి యత్నం!
- ఆత్మహత్య చేసుకున్న మాజీ సర్పంచ్ తల్లి? - శ్రీధర్‌ను నమ్ముకొని ఆస్తులు అమ్ముకున్నాం:మాజీ సర్పంచ్ కరీంనగర్: ఓ మాజీ సర్పంచ్ కరీంనగర్ నడిబొడ్డున మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు విగ్రహం వద్ద బుధవారం రాత్రి తన తల్లి శవాన్ని దహనం చేసేందుకు యత్నించాడు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కారణంగా తాము ఆస్తులు అమ్ముకున్నామనీ, అందుకే తన తల్లి ఆత్మహత్య చేసుకుందంటూ ఈ చర్యకు పాల్పడ్డాడు. బెజ్జంకి మండలం పారువెల్లికి చెందిన మాజీ సర్పంచ్ రెడ్డవేణి వినోద్ తల్లి లచ్చవ్వ(55) బుధవారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా శవపంచనామా చేసిన అధికారులు.. కొడుకు మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లమన్నారు. దీంతో వినోద్ టాటాఏస్ వాహనంలో తల్లి మృతదేహంతోపాటు వాహనాల టైర్లు, పెట్రోల్ తీసుకుని బయల్దేరాడు. అక్కడ బస్టాండ్ఎదురుగా ఉన్న మాజీ స్పీకర్ శ్రీపాదరావు విగ్రహం వద్దకు చేరుకోగానే వాహనం ఆపాలని డ్రైవర్ అజీమ్‌ను కోరాడు. దీంతో అజీమ్ వాహనాన్ని నిలపగా అందులో ఉన్న టైర్లను శ్రీపాద విగ్రహం వద్ద వేసి వాటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. శ్రీపాద విగ్రహం గద్దెకు ఉన్న శిలాఫలకాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత వాహనంలో ఉన్న తన తల్లి శవాన్ని ఆ మంటల్లో వేసి దహనం చేయడానికి ప్రయత్నించాడు. ఇంతలోనే ట్రాఫిక్ పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. దీంతో వినోద్ ఆమె శవాన్ని అక్కడే వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడిని పట్టుకుని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తాను మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును నమ్ముకోవడం వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిం దని పోలీసుల విచారణలో వినోద్ తెలిపాడు. తాను అన్నివిధాలా నష్టపోవడం వల్లే తన తల్లి వేదనతో ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. అందుకే శ్రీధర్‌బాబు తండ్రి శ్రీపాదరావు విగ్రహం వద్ద తల్లి శవాన్ని దహనం చేయూలనుకున్నానని వెల్లడించాడు. -
ఈ కంప్యూటర్ బామ్మ ఇదివరకు రాళ్లు కొట్టేది!
జైపూర్: కంప్యూటర్ నేర్చుకోవడం ఈ రోజుల్లో బ్రహ్మ విద్యేమి కాదు. కానీ కొంత మంది రాజకీయ నాయకులకు ఇప్పటికీ అది కొరకుడు పడని విద్యే. అలాంటి వారికి ఈ కంప్యూటర్ బామ్మ ఒక ప్రేరణ. ఒక స్ఫూర్తి. ఈ బామ్మ పేరు నౌరోతి దేవి. 74 ఏళ్లు. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లా, హర్మడా గ్రామం మాజీ సర్పంచ్. ఒక్క కంప్యూటర్ విద్యలోనే కాదు. గ్రామ సర్పంచ్‌గా గ్రామాన్ని ఎలా తీర్చిదిద్దవచ్చో చేసి చూపించిన ధీరవనిత. ఆమె వద్ద కంప్యూటర్ శిక్షణ పొందిన అనేక మంది గ్రామస్థులు ఇప్పుడు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. విద్యార్హతల కారణంగా ఈసారి మళ్లీ సర్పంచ్‌గా పోటీ చేయడానికి అవకాశం దొరక్కపోవడంతో ఆమె నిరాశ నిస్పృహలకేమి గురికాలేదు. తనకు తెలిసిన కంప్యూటర్ విద్యను ఊరిలోని పిల్లలు, పెద్దలకు నేర్పుతూ నూతనోత్సాహంతో జీవిస్తోంది. ఈ బామ్మకు కంప్యూటర్ను ఎలా ఉపయోగించాలో 15 ఏళ్ల క్రితం వరకు తెలియను కూడా తెలియదు. అది తెలియడానికి కనీసం అక్షరాలు కూడా రావు. దళిత కుటుంబానికి చెందిన ఈ బామ్మ ఎన్నడూ బడికి పోలేదు. చదువుకోలేదు. తోటి కార్మికుల వలే రాళ్లు కొట్టి జీవించేది. ఎక్కువ వరకు రోడ్డు పనులకు రాళ్లు కొట్టేది. 1980వ దశకం వరకు ఆమె జీవనం ఇలాగే కొనసాగింది. అప్పట్లో ఆమెతోపాటు ఆడవారికి రోజుకు నాలుగు రూపాయలు కూలీ ఇచ్చేవారు. మగవాళ్లకు మాత్రం ఏడు రూపాయల కూలీ ముట్టేది. మగవాళ్లతో సమానంగా కష్టపడి పనిచేస్తున్నా ఈ వివక్ష ఏమిటని ఆమె కాంట్రాక్టర్‌ను, ప్రభుత్వ ఇంజనీరును ప్రశ్నించింది. మగవాళ్లు కష్టపడినంతగా ఆడవాళ్లు కష్టపడలేరని వారి నుంచి జవాబు వచ్చేది. ఎందుకు కష్టపడలేమంటూ ఆమె తోటి ఆడవాళ్లను ఉత్సాహపరిచి మగవాళ్లకన్నా ఎక్కువ రాళ్లు కొట్టి చూపించింది. అయితే దినసరి వేతనాల్లో ఈ వ్యత్యాసం కొనసాగుతూ వచ్చింది. తోటి మహిళలతో కలసి జిల్లా కోర్టులో, ఆ తర్వాత హైకోర్టులో న్యాయపోరాటం జరిపింది. అప్పటికీ న్యాయం జరగలేదు. దాంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అవిశ్రాంతంగా పోరాటం జరిపింది. సుప్రీం కోర్టులో గెలిచింది. మగవారితో సమానంగా వేతనాలను అందుకొంది. న్యాయపోరాటంలో ఆమెకు ఎన్నో విషయాలు తెలిసివచ్చాయి. కంప్యూటర్ ప్రపంచంలో వేలి ముద్ర వేయడం ఆమెకు నామోషి అనిపించింది. ఎలాగైనా తాను చదువుకోవాలనుకుంది. 60 ఏళ్ల ప్రాయంలో చదువుకోవడం ఏమిటని ప్రశ్నించిన వాళ్లు లేకపోలేదు. అయినా ఆమె పట్టించుకోకుండా స్వగ్రామమైన హర్మడాకు నాలుగు కిలోమీటర్ల దూరంలోవున్న టిలోనియాలోని ‘బేర్‌ఫుట్ కాలేజ్’కు వెళ్లి ఆరు నెలల కోర్సు చదివారు. అక్కడే అక్షర మాల నుంచి ప్రపంచ విజ్ఞానం వరకు తెలుసుకున్నారు. కంప్యూటర్ నేర్చుకుంటేగానీ జ్ఞానం సంపూర్ణం కాదని భావించిన బామ్మ కంప్యూటర్ తెలిసిన పిల్లల ద్వారా కంప్యూటర్ విద్య నేర్చుకున్నారు. న్యాయపోరాటంలో భాగంగా తోటి మహిళలతోపాటు గ్రామంలోను ఆమె నాయకురాలిగా ఎదిగారు. గ్రామస్థుల సలహామేరకు ఆమె 2010లో గ్రామ సర్పంచ్‌గా పోటీచేసి గెలిచారు. ఆ వెంటనే సర్పంచ్ కార్యాలయంలో తాను శిక్షణ పొందిన బేర్‌ఫుట్ కాలేజ్ సహకారంతో ఓ కంప్యూటర్ని ఏర్పాటు చేశారు. అన్ని పనులు తానే స్వయంగా కంప్యూటర్ ద్వారా నిర్వహించడమే కాకుండా పంచాయతీ కార్యదర్శికి కూడా ఆమె కంప్యూటర్ నేర్పించారు. కంప్యూటర్ ద్వారానే తనకు మహిళల హక్కులేమిటో, గ్రామ పౌరుల హక్కులేమిటో, సర్పంచ్‌గా తాను నిర్వహించాల్సిన బాధ్యతలేమిటో తెలుసుకున్నారు. ఆ విజ్ఞానంతో ఆమె గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ‘వర్డ్’పైనా, ‘ఎక్సెల్’పైనా ఎలా పనిచేయాలో, ఇంటర్నెట్ను ఎలా ఉపయోగించుకోవాలో తనకు బాగా తెలుసుని ఈ బామ్మ గర్వంగా చెబుతారు. ఇలాంటి బామ్మకు 2015లో సర్పంచ్‌గా మళ్లీ పోటీ చేయాలనుకున్న విద్యార్హతల కారణంగా వీలు కాలేదు. సర్పంచ్ పదవికి పోటీచేసే వారు కనీసం 8వ తరగతి, జిల్లా పరిషద్, పంచాయతి సమితికి పోటీచేసే వారికి కనీసం పదవ తరగతి పాసైన విద్యార్హతలు ఉండాలని నిర్దేషిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం 2015లోనే బిల్లు తీసుకొచ్చింది. ఆ కారణంగా ఇప్పుడు బామ్మ కంప్యూటర్ శిక్షణకే పరిమితమయ్యారు. -
మాజీ సర్పంచ్ హత్యతో ఉద్రిక్తత
మానవపాడు: మహబూబ్‌నగర్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మానవపాడు మండలం చెన్నిపాడు మాజీ గ్రామ సర్పంచ్‌ను గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపారు. కురుమన్న గ్రామ శివారులో బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా... కొందరు కత్తులతో దాడి చేసి నరకడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో కురుమన్న బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గ్రామంలో మూడు ఇళ్లకు నిప్పు పెట్టారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారి వాహనాన్ని ధ్వంసం చేశారు. అతికష్టం మీద పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం అలంపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మాజీ సర్పంచ్ దారుణ హత్య
జీకేవీధి: బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వకూడదని పులుమార్లు హెచ్చరించినా.. లెక్క చేయకుండా జన్మభూమి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన టీడీపీ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్‌ను మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ సంఘటన విశాఖపట్నం ఎజెన్సీ ప్రాంతంలోని జీకేవీధి మండలం జర్రెల గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎస్. వెంకటరమణ(36) మంగళవారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొందరు సాయుధులైన మావోలు ఆయన ఇంట్లోకి ప్రవేశించి ఆయనను బయటకు తీసుకొచ్చి గ్రామస్థులంతా చూస్తుండగా.. కాల్చి చంపారు. బాక్సైట్ జోలికి ఎవరు వచ్చినా వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ఈ ఘటనలో సుమారు 500 మంది మావోలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. మావోల భయంతో గత కొంత కాలంగా చింతపల్లిలో ఉంటున్నారు. బందువుల ఇంట్లో వివాహానికి హాజరైన నేపథ్యంలో ఆయన మావోల చేతిలో హత్యకు గురయ్యారు. -
బావా బాగున్నావా అని పలకరించినందుకు..
మాజీసర్పంచ్ను స్తంభానికి కట్టేసికొట్టిన ప్రత్యర్థులు గ్రామంలో ఉద్రిక్తవాతావరణం పోలీస్ పికెట్ ఏర్పాటు హాలియా : బావా బాగున్నావా అంటూ పలకరించినందుకు మండలంలోని పులిమామిడి గ్రామంలో మాజీ సర్పంచ్ ఎల్లేశంను అదే గ్రామానికి చెందిన వైరివర్గం వారు విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పులిమామిడి గ్రామంలో మే31న దైదగిరి అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన నకిరేకంటి నగేశ్ అనే యువకుడు కత్తితో పొడిచి హత్య చేయడంతో గ్రామంలో ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. దీంతో గ్రామంలో శాంతిభద్రతలు కాపాడేందుకు 10 రోజుల పాటు గ్రామంలో పోలీస్‌పికెట్ ఏర్పాటు చేశారు. ఈ హత్య కేసులో మాజీ సర్పంచ్ ఎల్లేశం.. నరికేకంటి నగేశ్ వైపు పెద్దమనిషిగా వ్యవహరించాడు. గురువారం రాత్రి గ్రామ ప్రధాన సెంటర్లో దైదగిరి తండ్రి వెంకటయ్య.. ఎల్లేశానికి ఎదురుపడటంతో.. బావా బాగున్నావా అంటూ ఎల్లేశం.. వెంకటయ్యను మర్యాదపుర్వకంగా పలుకరించి ఇంటికి వెళ్లిపోయాడు. ఇంతలో వెంకటయ్య తన ఇంటికి వెళ్లి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. మనోన్ని చంపినవారి వైపు పెద్దమనిషిగా ఉండడంతో పాటు చేసిందంతా చేసి తమకేమీతెలియదన్నట్లు బావా బాగున్నావా అంటూ పలకరిస్తాడా అంటూ దైదగిరి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. వారు ఎల్లేశం వద్దకు అతనిపై దాడి చేసి గ్రామ సెంటర్‌కు తీసుకువచ్చిమోకులతో కట్టేసి చితకబాదారు. ఈ విషయమై గ్రామస్తులు పోలీసుకు సమాచారం అందించారు. దీతో ఎస్ఐ సురేష్‌కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి విద్యుత్ స్తంభానికి కట్టేసి ఉన్న ఎల్లేశం కట్లు విప్పారు. ఎల్లేశానికి తీవ్ర గాయాలయ్యాయి. ఎల్లేశాన్ని కట్టేసిన వారు పరారయ్యారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. గ్రామంలో పోలీస్‌పికెట్ ఏర్పాట్లు చేశారు. సీఐ పార్థసారథి, ఎస్ఐ సురేష్‌కుమార్ మాట్లాడుతూ గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్లేశం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్‌కుమార్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ దుర్మరణం
దండేపల్లి : మండలంలోని ముత్యంపేట స్టేజీ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇదే మండలంలోని నర్సాపూర్ గ్రామ మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ నాయకుడు పూరెళ్ల లక్ష్మణ్(44) దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మణ్ వ్యక్తిగత పనుల నిమిత్తం సోమవారం సాయంత్రం కారులో లక్సెట్టిపేటకు వెళ్లి రాత్రికి ఇంటికి తిరిగొస్తుండగా ముత్యంపేట సమీపంలో హైదరాబాద్ వెళ్తున్న ఉట్నూర్ ఆర్టీసీ డిపో బస్సు ఢీకొట్టింది. దీంతో కారు నడుపుతున్న లక్ష్మణ్‌కు తీవ్ర గాయూలు కావడంతో అక్కడికక్కడే చనిపోయూడు. ఆయనతోపాటు కారులో ఉన్న మరో నాయకుడు వెంగళ్‌రావుకు గాయూలు కాగా చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని స్థానిక నాయకులతో కలిసి బోరున విలపించారు. మంచి నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. లక్సెట్టిపేట సీఐ సతీశ్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య ఉమ, కూతుళ్లు అనూష, అపర్ణ, కుమారుడు సాయి ఉన్నారు. దండేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెండుసార్లు సర్పంచ్‌గా.. లక్ష్మణ్ నర్సాపూర్ గ్రామ సర్పంచ్‌గా రెండు పర్యాయూలు పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో మండల నాయకుడిగా కొనసాగుతున్నాడు. ఎమ్మెల్యేకు నమ్మిన బంటుల మంచి పేరు సంపాదించుకున్నాడు. మంగళవారం జరిగిన లక్ష్మణ్ అంత్యక్రియల్లో ఎమ్మెల్యే దివాకర్‌రావు, డీసీఎమ్మెస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ వసుంధర, దండేపల్లి, లక్సెట్టిపేట జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలియజేశారు. -
రాజీవ్ రహదారిపైఘోర ప్రమాదం
సిద్దిపేట అర్బన్, న్యూస్‌లైన్: సిద్దిపేట సమీపంలోని రాజీవ్ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వరంగల్ జిల్లా చేర్యాల మండలం చిట్యాల గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్ల భర్తలు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిట్యాల గ్రామ సర్పంచ్ సుజాత భర్త మల్లేశం(40), ఆ గ్రామ మాజీ సర్పంచ్ మంగోల్ విజయలక్ష్మి భర్త చిన్న వెంకటయ్యగౌడ్(45)లు ఆదివారం సాయంత్రం ఓ పనిపై సిద్దిపేటకు వచ్చారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో హోండా యాక్టివా(ఏపీ28 ఎహెచ్7720 )పై తిరిగి చిట్యాలకు వెళుతున్నారు. ఈక్రమంలో పొన్నాల డాబాల సమీపంలో వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న భారీ కంటైనర్ లారీ(హెచ్ఆర్ 74-7716) వేగంగా వచ్చి ఢీకొంది. ఈ సంఘటనలో ద్విచక్రవాహనం ధ్వంసమైంది. వాహనంపై ప్రయాణిస్తున్న మల్లేశం, వెంకటయ్యగౌడ్ తలలు పగిలి తీవ్రంగాయాలు కావడంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సమాచారం అందుకున్న సిద్దిపేట రూరల్ సీఐ ప్రసన్నకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడే వస్తానంటివి... వెంకటయ్యగౌడ్ కొడుకు రోదన సంఘటన స్థలంలో మరణించిన వెంకటయ్యగౌడ్ మృతదేహం పక్కన పడి ఉన్న అతని సెల్‌ఫోన్‌ను సేకరించిన పోలీసులు కొన్ని నిమిషాల ముందు డయల్ చేసిన నంబర్‌కు తిరిగి ఫోన్ చేయగా వెంకటయ్యగౌడ్ కుమారుడు ఫోన్లో మాట్లాడాడు. పోలీసులు అతనికి సమాచారం అందించడంతో హుటాహుటిన అతను సంఘటనా ప్రదేశానికి చేరుకున్నాడు. తండ్రి మృతదేహంపై పడి గుండె పగిలేలా ఏడ్చాడు. ఇప్పుడే వస్తనంటివి...ఇట్లయిపోయిందని అతను ఆక్రోశించిన తీరు చూసి అక్కడున్న వారు కూడా కన్నీరుమున్నీరయ్యారు.