దండేపల్లి : మండలంలోని ముత్యంపేట స్టేజీ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇదే మండలంలోని నర్సాపూర్ గ్రామ మాజీ సర్పంచ్, టీఆర్‌ఎస్ నాయకుడు పూరెళ్ల లక్ష్మణ్(44) దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మణ్ వ్యక్తిగత పనుల నిమిత్తం సోమవారం సాయంత్రం కారులో లక్సెట్టిపేటకు వెళ్లి రాత్రికి ఇంటికి తిరిగొస్తుండగా ముత్యంపేట సమీపంలో హైదరాబాద్ వెళ్తున్న ఉట్నూర్ ఆర్టీసీ డిపో బస్సు ఢీకొట్టింది. దీంతో కారు నడుపుతున్న లక్ష్మణ్‌కు తీవ్ర గాయూలు కావడంతో అక్కడికక్కడే చనిపోయూడు. ఆయనతోపాటు కారులో ఉన్న మరో నాయకుడు వెంగళ్‌రావుకు గాయూలు కాగా చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని స్థానిక నాయకులతో కలిసి బోరున విలపించారు. మంచి నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. లక్సెట్టిపేట సీఐ సతీశ్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య ఉమ, కూతుళ్లు అనూష, అపర్ణ, కుమారుడు సాయి ఉన్నారు. దండేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రెండుసార్లు సర్పంచ్‌గా..
లక్ష్మణ్ నర్సాపూర్ గ్రామ సర్పంచ్‌గా రెండు పర్యాయూలు పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ పార్టీలో మండల నాయకుడిగా కొనసాగుతున్నాడు. ఎమ్మెల్యేకు నమ్మిన బంటుల మంచి పేరు సంపాదించుకున్నాడు. మంగళవారం జరిగిన లక్ష్మణ్ అంత్యక్రియల్లో ఎమ్మెల్యే దివాకర్‌రావు, డీసీఎమ్మెస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ వసుంధర, దండేపల్లి, లక్సెట్టిపేట జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలియజేశారు.
రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ దుర్మరణం
Published Wed, Mar 4 2015 3:33 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement