
ఫ్లోరిడా: అమెరికాలో సోమవారం (మే 15) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భారతీయ టెక్కీ దుర్మరణం చెందారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని తాంపాలో పాదచారుల క్రాస్ వద్ద రోడ్డు దాటుతున్న మరియప్పన్ సుబ్రమణియన్ (32)ను ఓ కారు రెడ్ సిగ్నల్‌ను జంప్ చేసి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
మరియప్పన్ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. ఆయన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీలో టెస్ట్ లీడ్‌గా పనిచేస్తున్నారు. మరియప్పన్‌కు భార్య, నాలుగేళ్ల కొడుకు ఉన్నారు. వీరు భారత్‌లో ఉంటున్నారు. కాగా మరియప్పన్ ఈ మధ్యనే జాక్సన్‌విల్లే నుంచి తాంపాకు వచ్చారు.
మరియప్పన్ కుటుంబానికి సహాయం అందించేందుకు ‘గో ఫండ్ మీ’ అనే పేజీ ద్వారా ఫండ్ రైజింగ్ చేపట్టారు. అలాగే తాంపా, జాక్సన్‌విల్లే ప్రాంతాల్లోని కమ్యూనిటీ గ్రూప్ సభ్యులు మరియప్పన్ మృత దేహాన్ని భారత్‌లోని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
ఇదీ చదవండి: అమెరికాలో అదృశ్యమైన ఎన్‌ఆర్‌ఐ లహరి మృతి
Comments
Please login to add a commentAdd a comment