NRIs
-
డేటా లీక్‌పై యూరప్ ఎన్ఆర్ఐల ఆగ్రహం
సాక్షి, అమరావతి: ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్‌కు ఎన్ఆర్ఐల డేటా లీక్ చేయడం కలకలం సృష్టిస్తోందని, ఒక రాజకీయ సంస్థకు తమ డేటాను ఎలా లీక్ చేస్తారని యూరోప్ ఎన్ఆర్ఐలు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పలువురు ప్రముఖులు వెల్లడించారు. ‘దావోస్ పర్యటన–రాష్ట్రానికి పెట్టుబడులు’ అనే అంశంపై బెటర్ ఆంధ్రప్రదేశ్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం వెబినార్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు యూరోప్ నుంచి పలువురు వాణిజ్య నిపుణులు, న్యాయవాదులు, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక రాజకీయ సంస్థ (ఎన్ఆర్ఐ టీడీపీ)కు డేటా లీక్ అయ్యిందని, ఈ సంస్థ ద్వారా యూరోప్‌లోని ఎన్ఆర్ఐలకు మెయిల్స్ రావడం చూసి అందరూ ఆందోళనకు గురయ్యారనే విషయం ఈ వెబినార్‌లో ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయమై జీడీపీఆర్ (జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్)కు ఫిర్యాదులు చేయనున్నారనే విషయం ఈ వెబినార్ ద్వారా బయట పడింది. ఈ వెబినార్‌లో ఎవరెవరు ఏం మాట్లాడారంటే..డేటా లీక్‌పై విచారణ జరపాలిఒక రాజకీయ సంస్థగా ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ అనే సంస్థ నుంచి మాకు మెయిల్స్ రావడం చాలా సీరియస్ అంశం. యూరోప్‌లోని మొత్తం తెలుగు ఎన్ఆర్ఐలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విచారణ జరగాలి. ఆయా దేశాల్లోని ఎన్ఆర్ఐలు జీడీపీఆర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు. దావోస్‌లో ఆంధ్రప్రదేశ్ గురించి కాకుండా రెడ్ బుక్ గురించి మాట్లాడారు. అక్కడ నో కార్ జోన్ ఉంటుంది. ఎంత పెద్ద వారు అయినా అక్కడ నడవాల్సిందే. దానిని కూడా గొప్పగా ప్రచారం చేసుకోవడం విడ్డూరం. జిందాల్ సంస్థ ఈ రాష్ట్రంలో పెట్టాల్సిన రూ.మూడు లక్షల కోట్ల పెట్టుబడి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. ఒక మహిళతో కేసులు పెట్టించడం చేటు చేసింది. – ఎల్లాప్రగడ కార్తీక్, ఆర్థిక నిపుణుడు, ఇంటర్నేషనల్ ట్రేడ్ దావోస్ ఎంవోయూలు చిత్తు కాగితాలా?దావోస్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు రిక్త హస్తాలతో తిరిగి వచ్చి, దావోస్ ఎంవోయూలు చిత్తు కాగితాలతో సమానం అని చెప్పడం దారుణం. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు రూ.లక్షల కోట్ల పెట్టుబడులను తమ రాష్ట్రాలకు తీసుకువస్తుంటే, చంద్రబాబు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. పైగా ప్రపంచ తీరు తెలుసుకునేందుకే దావోస్‌కు వెళ్లామని చెప్పడం ఆయన అసమర్థతకు నిదర్శనం. – వీవీఆర్ కృష్ణంరాజు, కన్వీనర్, బెటర్ ఆంధ్రప్రదేశ్ ఫోరంప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదురాష్ట్రానికి ప్రాజెక్ట్‌లు రావాలంటే ఎటువంటి ప్రోత్సాహకాలు, ఎటువంటి సహకారం ఇస్తామనే దానిపై సమగ్ర ప్రణాళికతో దావోస్‌కు వెళ్లాలి. అది జరగలేదు. ఇటీవల విజయవాడలో జరిగిన డ్రోన్ సమ్మిట్‌కు పలు సంస్థలు వచ్చాయి. కానీ చేసిన హడావుడికి, ఆచరణలో సంస్థల పట్ల వ్యవహరించిన తీరుకు మధ్య చాలా తేడా ఉంది. గతంలో సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో విశాఖలో నిర్వహించిన సదస్సులో భోజనాల కోసం తోపులాట జరగడం ఎవరూ మరచిపోలేదు. – జేటీ రామారావు, ఏపీ ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షుడుఏపీకి నిర్దిష్ట పారిశ్రామిక విధానం లేదుపెట్టుబడులు రావాలంటే రాష్ట్రంలో మానవ వనరులతో పాటు మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అనుకూల రాజకీయ ప్రభుత్వం, సులభతర వాణిజ్య విధానాలు ఉండాలి. దేశంలో బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను సాధించిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. తెలంగాణా రాష్ట్రం ఫార్మా, ఐటీ, హాస్పిటాలిటీ, టూరిజం వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చింది. ఏపీ మాత్రం దేనిపైనా ఫోకస్ పెట్టలేక పోయింది. నిర్దిష్ట పారిశ్రామిక విధానం లేదు. – చింతలపాటి సుబ్బరాజు, ఏపీ సివిల్ సొసైటీ కో కన్వీనర్పవన్ ప్రాధాన్యత తగ్గించేందుకేడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతను తగ్గించాలన్న లక్ష్యంతోనే దావోస్ పర్యటనను వినియోగించుకున్నారు. సీఎం చంద్రబాబు, లోకేశ్‌లు దావోస్‌కు వెళితే రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయనేది భ్రమ అని నిరూపితమైంది. ఎన్ఆర్ఐల డేటాను రాష్ట్ర ప్రభుత్వం లీక్ చేయడంపై న్యాయస్థానంలో కేసు నమోదు చేయబోతున్నాం. – పల్లి ప్రభాకర్ రెడ్డి, న్యాయ నిపుణుడు, సామాజిక ఉద్యమకారుడు అస్తవ్యస్తంగా చంద్రబాబు పాలనవైఎస్ జగన్ పాలనలో దావోస్ పర్యటనలో రూ.1.26 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకువచ్చారు. ఈరోజు చంద్రబాబు పర్యటన ద్వారా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఎందుకు తీసుకెళ్లలేదు? రేవంత్‌రెడ్డి రూ.1.79 లక్షల కోట్లు తెలంగాణాకు తీసుకువచ్చారు. చంద్రబాబు, లోకేశ్ మాత్రం ఉత్త చేతులతో రాష్ట్రానికి వచ్చారు. బాబు పాలనలో అప్పులు పెరిగాయి, రాబడి తగ్గింది. ఈ లెక్కన ఎవరిది సమర్థమైన పాలన? – బి.అశోక్ కుమార్, ఆంధ్రా అడ్వొకేట్స్ ఫోరం కన్వీనర్ -
కెనడా, భారత్ గొడవ.. మనోళ్ల పరిస్థితి ఏంటి?
Indians in Canada: ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్, కెనడా దేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతిన్నాయి. నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించి వివాదానికి తెరలేపారు. భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో కెనడా చేర్చడంతో వివాదం మరింత ముదిరింది. కెనడా చర్యలకు నిరసనగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. కెనడా నుంచి తమ రాయబారి, దౌత్యాధికారులను కూడా వెనక్కి రప్పించింది భారత్. దీంతో రెండు దేశాల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి.ఈ పరిణామాల నేపథ్యంలో కెనడాలో భారతీయుల పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కెనడాలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కెనడా ఇమ్మిగ్రెంట్స్‌లో భారతీయులు నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం. ముఖ్యంగా అధిక సంఖ్యలో ఉన్న సిక్కులు అన్ని రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు కెనడాలోని భారతీయులు అక్కడి ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య లావాదేవీలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో జరుగుతున్నాయి. కాగా, తాజా పరిస్థితులు తమపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని కెనడాలోని భారతీయులు ఆందోళన చెందుతున్నారు. విద్య, ఉద్యోగాల కోసం కెనడా వెళ్లాలనుకునే వారు ఆలోచనలో పడ్డారు.మనోళ్లే ముందు2021 అధికారిక లెక్కల ప్రకారం.. కెనడాలో నివసిస్తున్న భారత వలసదారుల సంఖ్య 28 లక్షలు. వీరిలో భారత సంతతికి(పీఐఓ) చెందిన వారు 18 లక్షలు, ఎన్నారైలు 10 లక్షల మంది ఉన్నారు. కెనడా పౌరుల్లో 7.3 లక్షల మంది హిందువులు, 7.7 లక్షల మంది సిక్కులు ఉన్నారు. కెనడాలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువగా (45 శాతం) ఉన్నారు. ప్రస్తుతం 4.27 లక్షల మంది విద్యార్థులు కెనడాలో విద్యనభ్యసిస్తున్నారు. తాత్కాలిక ఉపాధి పొందుతున్న విదేశీ కార్మికుల్లోనూ మనోళ్లే (22 శాతం) ముందున్నారు. శాశ్వత నివాసం ప్రకటించిన పీఆర్ పథకం కింద అత్యధికంగా 27 శాతం మంది భారతీయులు లబ్ది పొందారు. గత 20 ఏళ్లలో కెనడాలోని భారతీయుల సంఖ్య రెండింతలు పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఆ నగరాల్లోనే ఎక్కువకెనడా పౌరసత్వం తీసుకుంటున్న భారతీయుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2017లో 44.3 శాతం మంది, 2018లో 49.2, 2019లో 55.8, 2020లో 58.4, 2021లో 61.1 శాతం మంది ఇండియన్స్ కెనడా పౌరసత్వం దక్కించుకున్నారు. వాంకోవర్, టొరంటో, ఒట్టావా, వినీపెగ్, కాల్గారి, మాంట్రియల్ నగరాల్లో భారతీయులు అధికంగా నివసిస్తున్నారు. కెనడాలో ఉన్న భారతీయుల్లో 50 శాతం ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో మేనేజ్మెంట్ స్థాయి జాబుల్లో ఉన్నవారు కేవలం 19 శాతం మాత్రమే. కెనడాలోని వలస భారతీయుల్లో పన్నులు చెల్లిస్తున్నవారు 42 వేల మంది వరకు ఉన్నారు.చదవండి: ఇండియన్ రైల్వే నుంచి స్పేస్ఎక్స్ వరకు.. భారత ఇంజనీర్ ఘనతవాణిజ్యంపై ప్రభావంభారత్, కెనడా దేశాల మధ్య 2023-24 మధ్య కాలంలో 8.9 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులు, దిగుమతులు జరిగాయి. కెనడా భారత్ ఎగుమతులు 4.4 బిలియన్ డాలర్లు కాగా, కెనడా నుంచి ఇండియాకు దిగుమతులు 4.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కెనడా నుంచి భారత్‌కు ఎక్కువగా పప్పులు ఎగుమతి అవుతుంటాయి. తాజాగా రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో బయ్యర్లు ఆస్ట్రేలియా నుంచి దిగుమతులు పెంచారు. భారత్ నుంచి ఆభరణాలు, విలువైన రాళ్లు, రెడీమేడ్ దుస్తులు, ఫార్మా ఉత్పత్తులు కెనడాకు ఎగుమతి అవుతుంటాయి. కాఫీ చెయిన్ టిమ్ హార్టన్, ఫ్రోజోన్ ఫుడ్ కంపెనీ మెక్కెయిన్ సహా ఇండియాలో 600 పైగా కెనడా కంపెనీలు ఉన్నాయి. ఇండియాలో కెనడా పెన్షన్ ఫండ్స్ పెట్టుబడులు 75 బిలియన్ డాలర్లకు పైగా ఉంటాయని అంచనా. -
కన్నవారి ఆరోగ్యంపై బెంగ.. ఎన్ఆర్ఐల కోసం ఏఐ పరిష్కారం
ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా చాలా మంది భారతీయులు విదేశాల్లో ఉంటున్నారు. అయితే వారి బెంగ అంతా భారత్‌లో ఉంటున్న తమ తల్లిదండ్రుల ఆరోగ్యంపైనే ఉంటుంది. ఇలాంటి ఎన్ఆర్ఐల కోసమే డోజీ అనే కంపెనీ డోజీ శ్రవణ్ పేరుతో క్లినికల్-గ్రేడ్ ఏఐ ఆధారిత రిమోట్ పేరెంట్ మానిటరింగ్ సర్వీస్‌ను ఆవిష్కరించింది.డోజీ శ్రవణ్‌తో విదేశాలలో ఉన్న ఎన్ఆర్ఐలు భారత్‌లోని తమ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా ట్రాక్ చేయొచ్చు. డోజీ ఏఐ ఆధారిత, కాంటాక్ట్‌లెస్ రిమోట్ హెల్త్ మానిటరింగ్ టెక్నాలజీ వృద్ధులకు ఎటాంటి ఇబ్బంది లేకుండా వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించి కుటుంబ సభ్యులకు, వైద్యులకు చేరవేస్తుంది.ఏఐ ఆధారిత బలిస్టోకార్డియోగ్రఫీతో రూపొందించిన ఈ సిస్టమ్ బయోమార్కర్లను విశ్లేషించడానికి, ఏవైనా వ్యత్యాసాలుంటే సకాలంలో హెచ్చరికలను అందించడానికి అధునాతన ఏఐ అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించి సకాలంలో వైద్య సేవలు పొందేలా చేస్తుంది. ఈ సాంకేతికత యూఎస్ ఎఫ్‌డీఏ ఆమోదం పొందింది. డేటా గోప్యత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉంది. -
విదేశీయుల చూపు..ఏపీ సేంద్రియ సాగు వైపు
పిఠాపురం: రసాయన ఎరువులకు స్వస్తి పలికి సేంద్రియ సాగులో ముందడుగు వేసిన ఏపీ రైతులు పాటిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ఇతర దేశాల చూపు పడింది. రసాయనాలతో సహజత్వం కోల్పోయిన భూముల్లో తిరిగి సత్తువ పెంచేందుకు మన రైతులు ప్రకృతి మార్గాన్ని ఎంచుకున్నారు. రసాయనాల వాడకంతో పొంచి ఉన్న ప్రమాదాన్ని రైతులకు వివరించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లేలా వ్యవసాయ శాఖ అధికారులు చేసిన కృషి ఇతర దేశాలను సైతం ఆకర్షిస్తోంది. గడచిన ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రకృతి వ్యవసాయం కొత్త పుంతలు తొక్కింది. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాల ప్రతినిధులు, ఆయా దేశాల్లోని ఔత్సాహిక రైతులు మన రాష్ట్రానికి వచి్చన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలుసుకుంటున్నారు. వివిధ దేశాల నుంచి ఎన్ఆర్ఐల రాకతో కాకినాడ జిల్లాలో మారుమూల గ్రామమైన గొల్లప్రోలు మండలం దుర్గాడ వస్తున్నారు. ఇక్కడి రైతులు అన్ని రకాల సేంద్రియ ఎరువులు, మందులు తయారు చేస్తున్నారో తెలుసుకుని.. ఏయే సందర్భాల్లో వాటిని వినియోగించాలని, ప్రకృతి సాగు ఎలా చేయాలనే వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది మాది ఆంధ్రప్రదేశ్. నా చిన్నతనంలోనే అమెరికాలో సెటిలయ్యాం. అమెరికాలో ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో పండించిన పంటలకు మంచి గిరాకీ ఉంది. రసాయనాలు వాడని వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే కొనడానికి ఇక్కడివారు ఇష్టపడుతున్నారు. అందుకే ఇక్కడి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేసి అమెరికాలో ఈ తరహా పంటలను పండించేందుకు ప్రయతి్నస్తున్నాం. అందుకే.. దుర్గాడ గ్రామానికి వచ్చాం. ఇక్కడి రైతులు అన్ని రకాల సేంద్రియ ఎరువులు, మందులు తయారు చేస్తున్నారు. బయో ఇన్పుట్ సెంటర్లు నిర్వహిస్తూ ఇతర రైతులకు సేంద్రియ ఎరువులు, మందులు సరఫరా చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సైతం మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. గత ఐదేళ్ల నుంచే ప్రకృతి వ్యవసాయం పెరిగిందని రైతులు చెప్పారు. – ఎన్.దేవి, ఎన్ఆర్ఐ, కాలిఫోర్నియా, అమెరికాప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం పెరిగింది గత ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేయడంతో మా గ్రామంలో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాం. ప్రత్యేక వ్యవసాయ క్షేత్రాలు ప్రారంభించి వివిధ రకాల పద్ధతులతో నిత్యం ఆదాయం వచ్చేవిధంగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాం. శాస్త్రవేత్తలు, ఎన్ఆర్ఐలు మమ్మల్ని సంప్రదించి ప్రకృతి వ్యవసాయ సాగు వివరాలు తెలుసుకుంటున్నారు. మా గ్రామంలో బయో ఇన్పుట్ సెంటర్లు ఏర్పాటు చేసి అన్ని రకాల సేంద్రియ ఎరువులు, కషాయాలు తయారు చేసి ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నాం. మా ప్రాంతంలో చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు తెలుసుకునేందుకు విదేశీయులు రావడం గర్వకారణం. – గుండ్ర శిశచక్రం, ప్రకృతి వ్యవసాయ రైతు, దుర్గాడ విదేశీ ప్రతినిధులు వస్తున్నారు కాకినాడ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ఐదేళ్లలో భారీగా పెరిగింది. ప్రకృతి వ్యవసాయంలో ఏటీఎం, జీవ ఉ్రత్పేరకాలు, బీజామృతం, జీవామృతం, ఘన జీవామృతం, దశపర్ని కషాయం, పుల్లటి మజ్జిగ, పంచగవ్య, మీనామృతం, చిల్లీ స్పెషల్ కషాయం, లింగాకర్షణ బుట్టలు, ఎల్లో–బ్లూ స్టిక్కీ ప్లేట్స్, పీఎండ్స్ (నవధాన్యాల విత్తనాలు) ఎలా తయారు చేస్తారనే విషయాలపై ఎన్ఆర్ఐలు ఎక్కువగా సంప్రదిస్తున్నారు. స్వయంగా వచ్చి తెలుసుకుంటున్నారు. ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు దుర్గాడ వచ్చి ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలిస్తున్నారు. మరికొందరు విదేశీయులు త్వరలో రానున్నారు. – ఎలియాజరు, జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి, కాకినాడ -
ఎన్ఆర్ఐలకు ఫండ్స్ రూట్!
మెరుగైన ఆరి్థక వృద్ధితో భారత్ పెట్టుబడులకు ఆకర్షణీయమైన చిరునామాగా నిలుస్తోంది. దేశ, విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో పెట్టుబడులతో ముందుకు వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు (ఎన్ఆర్ఐలు) సైతం భారత ఈక్విటీ అవకాశాలు మెరుగైన ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. తమ పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవడంతోపాటు, ఆకర్షణీయమైన రాబడులు, పన్ను ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. తమ విశ్రాంత జీవనాన్ని స్వదేశంలో ప్రశాంతంగా, హాయిగా గడపాలని కోరుకునే వారు.. భారత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు. పెట్టుబడులకు అనుకూల విధానాలు, వాతావరణంతోపాటు, మెరుగైన నియంత్రణలు భద్రతకు హామీనిస్తున్నాయి. దీర్ఘకాలంలో సంపద సృష్టికి లేదా స్థిరమైన ఆదాయం కోసం ఎన్ఆర్ఐలు ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్లు (అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు/ఏఎంసీలు) విదేశీ మారకంలో పెట్టుబడులు స్వీకరించవు. అదే విధంగా ఎన్ఆర్ఐలు భారత్‌లో సాధారణ సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్‌కు విదేశీ మారకద్రవ్య చట్టం (ఫెమా) అనుమతించదు. రూపాయి మారకంలో పెట్టుబడులకే అనుమతి ఉంటుంది కనుక ఎన్ఆర్ఐలు భారత ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుగా ప్రత్యేక బ్యాంక్ ఖాతా ఉండాలి. నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్ (ఎన్ఆర్ఈ), నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ (ఎన్ఆర్వో), ఫారీన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ (ఎఫ్సీఎన్ఆర్) అకౌంట్ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక బ్యాంక్ ఖాతా అవసరం→ ఎన్ఆర్ఈ ఖాతా అయితే.. విదేశాల్లో ఆర్జించిన మొత్తాన్ని స్వదేశానికి పంపుకునేందుకు ఉపకరిస్తుంది. ఈ ఖాతాలో డిపాజిట్లపై వచ్చే వడ్డీపై పన్ను లేదు. → ఎన్ఆర్వో ఖాతా.. భారత్‌లో ఆదాయ వనరులను ఇక్కడే డిపాజిట్ చేసుకునేందుకు ఉపకరిస్తుంది. ఈ ఖాతా ద్వారా భారత్‌లో ఆదాయాన్ని భారత్‌లోనే ఇన్వెస్ట్చేసుకోవచ్చు. ఈ ఖాతాలోని డిపాజిట్లపై వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఒక ఆరి్థక సంవత్సరంలో గరిష్టంగా మిలియన్ డాలర్లనే ఈ ఖాతా నుంచి విదేశీ ఖాతాకు మళ్లించుకోగలరు.→ విదేశీ కరెన్సీ రూపంలో డిపాజిట్లు కలిగి ఉండేందుకు ఎఫ్సీఎన్ఆర్ ఖాతా అనుకూలిస్తుంది. ఈ ఖాతాతో కరెన్సీ మారకం రేట్ల రిస్క్ లేకుండా చూసుకోవచ్చు. ఎఫ్సీఎన్ఆర్ టర్మ్ డిపాజిట్ ఖాతా కాగా, ఎన్ఆర్ఈ పొదుపు/కరెంటు/రికరింగ్/ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాగా పనిచేస్తుంది. → చెక్, డీడీ, నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేస్తే.. ఈ నిధుల మూ లాలు తెలియజేసేందుకు వీలుగా ఫారిన్ ఇన్వార్డ్ రెమిటెన్స్ సర్టిఫికెట్ (ఎఫ్ఐఆర్సీ)ను సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఛానళ్లు, బ్రోకరేజీ సంస్థల సాయంతోనూ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.కేవైసీ కీలకంభారత మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందుకోసం పాస్‌పోర్ట్ కాపీ, పుట్టిన తేదీ ధ్రువీకరణ కాపీ, పాన్, ఫొటో, విదేశీ చిరునామా ధ్రువీకరణ కాపీలను సమరి్పంచాలి. ప్రస్తుత నివాసం అది శాశ్వతమైనా లేదా తాత్కాలికమైనా సరే రుజువులు సమరి్పంచాలి. ఫారిన్ పాస్‌పోర్ట్ కలిగిన వారు ఓసీఐ కార్డ్ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది.పెట్టుబడుల మార్గాలు.. ఎన్ఆర్ఐలు తామే స్వయంగా లేదంటే పవర్ ఆఫ్ అటార్నీ (పీవోఏ) ద్వారా ఇతరుల సాయంతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేరుగా అంటే ఎన్ఆర్ఈ/ఎన్ఆర్వో ఖాతాను తెరిచి వాటి ద్వారా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేయడం లేదా సిప్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది వీలు కానప్పుడు.. భారత్‌లో తాము విశ్వసించే వ్యక్తికి ఈ పని అప్పగిస్తూ పీవోఏ ఇవ్వొచ్చు. మీ తరఫున సంబంధిత వ్యక్తి పెట్టుబడుల వ్యవహారాలు చూస్తారు. ప్రతి లావాదేవీ నిర్వహణ సమయంలో పీవోఏ లేదా నోటరైజ్డ్ కాపీని సమరి్పంచాల్సి ఉంటుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఎన్ఆర్ఐ స్వయంగా హాజరు కావాలని కోరుతున్నాయి. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు యూఎస్ఏ, కెనడాలోని ఎన్ఆర్ఐల నుంచి పెట్టుబడులు అనుమతించడం లేదు. ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కాంప్లియన్స్ యాక్ట్ (ఫాక్టా) నిబంధనల అమలు ప్రక్రి య సంక్లిష్టంగా ఉండడమే దీనికి కారణం. ఎన్ఆర్ఐలు, యూఎస్ పౌరుల ఆర్థిక లావాదేవీల వివరాలను అమెరికా ప్రభుత్వంతో పంచుకోవాలని ఫాక్టా నిర్దేశిస్తోంది. విదేశీ ఆదాయంపై పన్ను ఎగవేతలను నిరోధించేందుకు ఈ నిబంధన పెట్టారు. పైగా అమెరికా, కెనడా నియంత్రణ సంస్థల వద్ద భారత అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే అన్నీ కాకుండా, కొన్ని అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు యూఎస్ఏ, కెనడా నుంచి ఎన్ఆర్ఐల పెట్టుబడులను కొన్ని షరతుల మేరకు అనుమతిస్తున్నాయి. కనుక అమెరికా, కెనడాలోని ఎన్ఆర్ఐలు అదనపు డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి రావ చ్చు. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్, నిప్పన్ ఇండియా, క్వాంట్ మ్యూచువల్ ఫండ్, సుందరం మ్యూచువల్, యూటీఐ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఎన్ఆర్ఐలు ప్రత్యక్షంగా హాజరు కాకుండానే ఆన్లైన్లో, ఎలాంటి పరిమితులు లేకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐలు ప్రత్యక్షంగా హాజరు కావాలనే సంస్థల్లో.. 360 వన్ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, డీఎస్పీ మ్యూచువల్ ఫండ్, ఐటీఐ మ్యూచువల్ ఫండ్, కోటక్ మ్యూచువల్ ఫండ్, నవీ మ్యూచువల్ ఫండ్, ఎన్జే ఇండియా మ్యూచువల్ ఫండ్, పీపీఎఫ్ఏఎస్ ఫండ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, టారస్ మ్యూచువల్ ఫండ్, వైట్ఓక్ క్యాపిటల్ ఉన్నాయి. మోతీలాల్ ఓస్వాల్, ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్, బంధన్ మ్యూచువల్ ఫండ్ కేవలం అమెరికాలోని ఇన్వెస్టర్ల నుంచే పెట్టుబడు లు స్వీకరిస్తున్నాయి. ఇవి కూడా ఫిజికల్ మోడ్‌లో నే (భౌతిక రూపంలో) పెట్టుబడులు అనుమతిస్తున్నాయి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మొదటి లా వాదేవీ భౌతిక రూపంలో, తదుపరి లావాదేవీలు అన్లైన్లో నిర్వహించేందుకు అనుమతిస్తోంది. https://mfuindia.com/usa-canada-residents నుంచి యూఎస్, కెనడాలోని ఎన్ఆర్ఐలు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. అవకాశాలు.. మ్యూచువల్ ఫండ్స్‌లో రెగ్యులర్, డైరెక్ట్ అని రెండు రకాల ప్లాన్లు ఉన్నాయి. రెగ్యులర్ ప్లాన్లు మధ్యవర్తుల ప్రమేయంతో పొందేవి. అంటే పంపిణీదారులకు ఈ ప్లాన్ల ద్వారా కమీషన్ ముడుతుంది. కేవైసీ, డాక్యుమెంటేషన్ ప్రక్రియ, ఎటువంటి పథకాలను ఎంపిక చేసుకోవాలి తదితర సేవలను వీరి నుంచి పొందొచ్చు. వీరికి కమీషన్ చెల్లించాల్సి రావడంతో రెగ్యులర్ ప్లాన్లలో ఎక్స్పెన్స్ రేషియో (ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే చార్జీ) ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్లు దీనికి విరుద్ధం. ఇందులో మధ్యవర్తులకు కమీషన్ చెల్లింపులు ఉండవు. దీంతో ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ ప్లాన్ల కంటే తక్కువగా ఉంటుంది. దీంతో దీర్ఘకాలంలో రెగ్యులర్ కంటే డైరెక్ట్ ప్లాన్లలో రాబడులు అధికంగా ఉంటాయి. ఒక పథకానికి సంబంధించి అది రెగ్యులర్ లేదా డైరెక్ట్ ప్లాన్ ఏది అయినా కానీ.. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో ఒక్కటే ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్లు ఎంపిక చేసుకునే ఎన్ఆర్ఐలు తమ పెట్టుబడులను తామే నిర్వహించుకోగల అవగాహన కలిగి ఉండాలి. అప్‌స్టాక్స్, కువేరా, ఎన్ఆర్ఐలకు సంబంధించి వాన్స్ తదితర ప్లాట్‌ఫామ్‌లు డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడులకు వీలు కలి్పస్తున్నాయి. ఉపసంహరణ – పన్ను బాధ్యత భారత మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే లాభంపై రెట్టింపు పన్ను చెల్లించాల్సి వస్తుందన్న భయం అక్కర్లేదు. భారత్‌తో ద్వంద పన్నుల నివారణ ఒప్పందం (డీటీఏఏ) కుదుర్చుకున్న దేశాల్లోని ఎన్ఆర్ఐలు ఒక చోట పన్ను చెల్లిస్తే సరిపోతుంది. యూఎస్, కెనడా, మధ్యప్రాచ్య దేశాలు సహా మొత్తం 80 దేశాలతో భారత్‌కు ఈ విధమైన ఒప్పందాలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లాభాలపై భారత పౌరులకు, ఎన్ఆర్ఐలకు ఒకే రకమైన నిబంధనలు అమలవుతున్నాయి. ఎన్ఆర్ఐలు తమ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను ఆన్లైన్లోనే విక్రయించుకోవచ్చు. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు లాభంపై పన్నును మినహాయించి మిగిలిన మొత్తాన్ని ఎన్ఆర్ఈ లేదా ఎన్ఆర్వో ఖాతాకు జమ చేస్తాయి. అన్ని ఏఎంసీలు ఎన్ఆర్ఐలు పెట్టుబడులు విక్రయించిన సందర్భంలో టీడీఎస్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్ అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు మించిన లాభంపై 12.5 శాతం, అంతకులోపు విక్రయించగా వచ్చిన లాభం (స్వల్ప కాల మూలధన లాభం)పై 15 శాతం టీడీఎస్ అమలు చేస్తాయి. అదే డెట్ ఫండ్స్‌లో లాభాలపై పన్ను ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. డీటీఏఏ కింద పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవాలనుకునే వారు తాము నివసిస్తున్న దేశం నుంచి ట్యాక్స్ రెసిడెన్సీ సరి్టఫికెట్ (టీఆర్సీ) సమరి్పంచాల్సి ఉంటుంది. భారత్‌లో పన్ను చెల్లించిన ఎన్ఆర్ఐలు తమ దేశంలో డీటీఏఏ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. గల్ఫ్ దేశాల్లోని ఎన్ఆర్ఐలు భారత మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా తమ విశ్రాంత జీవనానికి తగినంత నిధి సమకూర్చుకోవచ్చని రిటైర్మెంట్ విషయంలో సలహా, సూచనలు, పరిష్కారాలు అందించే ‘ద్యోత సొల్యూషన్స్’కు చెందిన కౌశిక్ రామచంద్రన్ సూచిస్తున్నారు. మధ్య ప్రాచ్య దేశాల్లో పౌరసత్వం పొందలేరు కనుక రిటైర్మెంట్ తర్వాత స్వదేశానికి రావాల్సిందేనని, అలాంటి వారికి భారత మ్యూచువల్ ఫండ్స్ అనుకూలమని పేర్కొన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
హింస ఆపు బాబు.. ఎన్నారైల నిరసన
-
ట్రంప్ ను చంపే కుట్ర.. సాక్షి టీవీతో ఎన్నారైలు
-
కిర్గిజ్‌స్థాన్‌లో తెలుగువారు సురక్షితం
సాక్షి, అమరావతి: కిర్గిజ్‌స్థాన్ (బిష్కెక్)లో తెలుగువారు సురక్షిత ప్రాంతాల్లో ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీఎన్ఆర్టీఎస్ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. కిర్గిజ్‌స్థాన్‌లో భారతీయ విద్యార్థులపై దాడుల జరుగుతున్న నేపథ్యంలో భారతీయ విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కిర్గిజ్‌స్థాన్‌లోని తెలుగువారి కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసినట్టు ఏపీఎన్ఆర్టీఎస్ చైర్మన్ వెంకట్ మేడపాటి తెలిపారు. ఏపీకి చెందిన ప్రజలు, విద్యార్థులు ఏపీఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్ లైన్ నంబర్లు +91 863 2340678, +91 8500027678 (డబ్ల్యూ)తో పాటు కిర్గిజ్‌స్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్ 0555710041ను సంప్రదించాలని సూచించారు. ఏపీఎన్ఆర్టీఎస్ ఈ–మెయిల్స్: info@apnrts.com; helpline@apnrts. com ద్వారా కూడా సంప్రదించొచ్చని పేర్కొన్నారు. భారత విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం ఏపీఎన్ఆర్టీఎస్ ఎప్పటికప్పుడు కేంద్రప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మెడిసిన్ చదివేందుకు వెళ్లిన నలుగురు తెలుగు విద్యార్థులు ఉన్నట్లు తెలిసిందని, వీరంతా క్షేమంగా సురక్షిత ప్రదేశాల్లో ఉన్నట్లు తెలిపారు. -
పవన్ పై ఏపీ NRIలు కౌంటర్
-
జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం
-
ఎన్ఆర్ఐ, ఓసీఐల కోసం కొత్త ఫామ్స్.. సులభమైన ఆధార్ ఎన్రోల్మెంట్
ఎన్ఆర్ఐలు, ఓసీఐ కార్డ్ హోల్డర్లు ఆధార్ కార్డ్‌ని పొందటానికి భారత ప్రభుత్వం కొత్త ఆధార్ నిబంధనలను తీసుకువచ్చింది. దీని కోసం UIDAI ప్రత్యేక ఫామ్‌లను ప్రవేశపెట్టింది. వీటిని ఉపయోగించి నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRI), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCI) వారు ఆధార్ ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐగా మీకు లేదా మీ మైనర్ పిల్లలకు ఆధార్‌ను కావాలనుకునే.. స్వదేశానికి తిరిగి వెళ్ళినప్పుడు అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవాలనుకునే వారు పాస్‌పోర్ట్‌ను ప్రూఫ్‌గా చూపించాల్సి ఉంటుంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం.. 2023 అక్టోబర్ 1 తర్వాత పుట్టిన దరఖాస్తుదారులకు జనన ధృవీకరణ పత్రం (Birth Certificate) తప్పనిసరి. ఆధార్ కార్డు పొందిన తరువాత కూడా వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం అవసరం. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎన్ఆర్ఐలు మాత్రమే కాకూండా ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ.. చిరునామాను డేటాబేస్‌లో తప్పనిసరిగా అప్డేట్ చేయాలి. దీన్ని ఆన్లైన్లో లేదా ఆఫ్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐల కోసం ఆధార్ ఎన్రోల్మెంట్ / అప్డేట్ ఫామ్‌లు యూఐడీఏఐ ఇప్పుడు విదేశీ భారతీయుల కోసం ఫామ్స్ ప్రవేశపెట్టింది. ఇందులో భారతదేశం చిరునామాగా ఉన్నవారికి, చిరునామా భారతదేశం వెలుపల ఉన్న వారికి, వయసును దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకించి ఫామ్స్ ఉన్నాయి. ఫారమ్ 1 అనేది 18 ఏళ్లు పైబడిన వారి కోసం.. ఫారం 3 అనేది 5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను నమోదు చేసుకోవడానికి. భారతదేశం వెలుపల చిరునామా కలిగిన వారి కోసం ఫామ్ 2, ఫామ్ 4 ప్రత్యేకంగా పరిచయం చేసారు. ఫారమ్ 2 అనేది 18 ఏళ్లు పైబడిన వారి కోసం.. ఫారం 4 అనేది 5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను నమోదు చేసుకోవడానికి. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు నమోదు చేసుకోవాలనుంటే.. ఫామ్ 5 (చిరునామా భారతదేశంలో ఉంటే), ఫామ్ 6 (చిరునామా భారతదేశం వెలుపల ఉంటే) ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్ల కోసం ఆధార్ ఫామ్‌లు నిజానికి ఇంతకుముందు భారతదేశంలోని విదేశీ పౌరులు ఆధార్ కార్డు పొందటానికి అర్హులు కాదు. ఆధార్ పౌరసత్వాన్ని ధృవీకరించదని ప్రభుత్వం స్పష్టం చేసిన తర్వాత, ఆధార్‌కు అర్హులైన విదేశీ భారతీయుల వర్గాలకు OCIలను యాడ్ చేశారు. వీరు ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి క్యాలెండర్ ఇయర్లో కనీసం 182 రోజులు భారతదేశంలో ఉండడం తప్పనిసరి. 18 ఏళ్లు పైబడిన దరఖాస్తుదారులు ఆధార్ ఎన్రోల్మెంట్ కోసం ఫామ్ 7ని ఉపయోగించాలి. 18 సంవత్సరాలకంటే తక్కువ వయసున్నవారు ఫామ్ 8 ఉపయోగించుకోవాలి ఉంటుంది. ఆధార్ కార్డు అప్లై చేసుకున్న వారు సరైన ఇమెయిల్ అందించాలి. చెల్లుబాటు కానీ ఇమెయిల్ పేర్కొంటే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. UIDAI అంతర్జాతీయ నంబర్లను అనుమతివ్వదు, కాబట్టి భారతీయేతర ఫోన్ నంబర్‌ను అందించినట్లయితే మీ ఆధార్‌కు సంబంధించి SMS/టెక్స్ట్ నోటిఫికేషన్‌ను అందుకోలేరు. ఇవన్నీ నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRI), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియన్స్ గమనించాలి. -
‘దేశం’లో ధనస్వామ్యం
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ పేదల కోసమే పుట్టిందంటూ తరచూ చెప్పే చంద్రబాబు ఎన్నికల్లో సీట్లు మాత్రం పెత్తందారులకే కట్టబెడుతున్నారు. ఇందుకోసం మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసి ఆ జెండానే నమ్ముకున్న వారిని పూచికపుల్లలా తీసిపారేస్తున్నారు. ధనబలం ఉన్న వారికే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇస్తామని, ఇందులో మరో ఆలోచనకే తావులేదని ఆయన కుండబద్దలు కొడుతున్నారు. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న సమావేశాల్లో ఆయన ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత ఇటీవల చంద్రబాబును కలిసి పార్టీని నిలబెట్టేందుకు తాను ఎంతలా కష్టపడ్డానో చెప్పి ఈసారి పోటీచేసే అవకాశం ఇవ్వాలని కోరినప్పుడు ఎవరికి పడితే వారికి సీట్లు ఇవ్వడం సాధ్యంకాదని ఆయన తెగేసి చెప్పారు. పోటీ చేసేవాళ్లు బయట వాళ్లా, పార్టీ వాళ్లా అనేది ముఖ్యం కాదని డబ్బు ఖర్చు పెట్టగలిగే వాళ్లకే సీట్లు ఇస్తానని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. పార్టీ వ్యూహ రచన సమావేశాల్లోనూ చంద్రబాబు, ముఖ్య నేతలు ఇదే సూత్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అభ్యర్థుల అన్వేషణ, ఎంపికలోనూ దీన్నే పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు చాలాచోట్ల కొత్త పెత్తందారుల ముఖాలే కనిపిస్తున్నాయి. ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చంద్రబాబు గేట్లు బార్లా తెరిచేశారు. పార్టీ ఫండ్ ఇవ్వండి, సీట్లు తీసుకోండని టీడీపీ సీనియర్లు బడాబాబులకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. వలలో పడిన వారిని చంద్రబాబు వద్దకు తీసుకెళ్తున్నారు. బాబు చేసే ఈ ధన యజ్ఞంలో పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్న నేతలూ కొట్టుకుపోయే పరిస్థితి దాపురించిందని పార్టీనే నమ్ముకున్న సీనియర్లు వాపోతున్నారు. డబ్బులేదని నానికి ఝలక్.. తమ్ముడికి ఛాన్స్.. ఇక విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని ప్రస్తుతం డబ్బు ఖర్చుచేసే పరిస్థితి లేదని తెలియడంతో చంద్రబాబు ఆయన్ను అవమానకర రీతిలో పక్కన పెట్టేశారు. ఎంపీగా ఉన్నా ఆయన్ను పార్టీ కార్యక్రమాలకు పిలవడంలేదు. చోటామోటా నేతలతో ఆయన్ను తిట్టిస్తున్నారు. పొమ్మనకుండా పొగబెట్టి పార్టీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి సృష్టించారు. నాని స్థానంలో ఆయన సోదరుడు కేశినేని చిన్నికి విజయవాడ ఎంపీ సీటు ఇస్తానని చంద్రబాబు ఇటీవల స్పష్టంచేశారు. రూ.100 కోట్లకుపైగా డబ్బును ఖర్చుపెట్టేందుకు ఆయన సిద్ధపడడంతో చిన్నికి అవకాశమిచ్చారు. రియల్ ఎస్టేట్‌లో బాగా డబ్బు సంపాదించి, సొంత అన్నతోనే విభేదించిన చిన్ని చివరికి ఆయనకే వెన్నుపోటు పొడిచి సీటు తెచ్చుకున్నారనే ప్రచారం టీడీపీలోనే విస్తృతంగా జరుగుతోంది. గుంటూరు బరిలో విద్యా సంస్థల అధినేత! గుంటూరు పశ్చిమ అసెంబ్లీ స్థానంలో పార్టీ కోసం ఇప్పటివరకూ పనిచేసిన నేతలను కాదని ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఆయన చంద్రబాబు చేతులు మీదుగా ప్రజలకు పండుగ కానుకలు ఇస్తామని మభ్యపెట్టి తొక్కిసలాటలో ముగ్గురి మృతికి కారణమయ్యారు. అలాగే, గుంటూరు ఎంపీ స్థానం నుంచి భాష్యం విద్యా సంస్థల యజమాని రామకృష్ణను పోటీచేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతోపాటు మరికొందరు బడా బాబుల కోసం చంద్రబాబు గేలం వేస్తున్నారు. ♦ కాకినాడ పార్లమెంట్ స్థానం కోసం మొదటి నుండి మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు జెడ్పీ మాజీ చైర్మన్ నవీన్‌కుమార్‌ను కాదని వ్యాపారవేత్త సానా సతీష్ కు సీటు ఇవ్వాలని చూస్తున్నారు. ♦ తుని అసెంబ్లీ స్థానంలో ఏళ్ల తరబడి టీడీపీ జెండా మోసిన కృష్ణుణ్ణి నిర్దాక్షిణ్యంగా పక్కనపెట్టి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు సీటు కట్ట బెడుతున్నారు. ♦రాజానగరంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్‌ను తప్పించి ఆర్థికంగా స్థితిమంతుడైన మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు తనయుడు వెంకటరమణను ఇన్‌ఛార్జిని చేశారు. ♦ అమలాపురం ఎస్సీ రిజర్వు స్థానంలో మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును కాదని ఆర్థికంగా ధన బలం ఉన్న అయితాబత్తుల సత్యశ్రీకి సీటు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ♦ చివరికి పెద్దాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పను కూడా కాదని కమ్మ సామాజికవర్గానికి చెందిన ధనవంతుడు, కాంట్రాక్టర్ చంద్రమౌళికి సీటు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సొంత కుటుంబానికే ఓటు.. ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ పెత్తందారులకే సీట్లు కట్టబెట్టేందుకు చంద్రబాబు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గండి బాబ్జి స్థానంలో తన కుటుంబానికి చెందిన ‘గీతం’ భరత్‌ను రంగంలోకి దించేందుకు చంద్రబాబు రంగం సిద్ధంచేసినట్లు తెలుస్తోంది. తెరపైకి ఎన్ఆర్ఐలు ♦ విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కోళ్ల అప్పలనాయుడు కుటుంబాన్ని కాదని ఎన్ఆర్ఐ కొంప కృష్ణను రంగంలోకి దించారు. తనదే సీటని చెప్పుకుంటూ ఆయన నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ♦ నెల్లిమర్లలో మాజీమంత్రి పతివాడ నారాయణస్వామిని కాదని బంగార్రాజు అనే వ్యక్తికి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ♦పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నుంచి మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు కుటుంబాన్ని పక్కనపెట్టి ఎన్ఆర్ఐ గోనెల విజయచంద్రను తెరపైకి తెచ్చారు. ♦ కృష్ణాజిల్లా గుడివాడలో రావి వెంకటేశ్వరరావు కుటుంబం ఎన్టీఆర్ నాటి నుంచి టీడీపీని అంటిపెట్టుకుని ఉంది. ఇప్పుడు డబ్బులేదనే కారణంతోనే రావిని పక్కకు నెట్టి ఎన్ఆర్ఐ వెనిగళ్ల రాముని ఇన్ఛార్జిగా ప్రకటించారు. రాముకున్న అర్హత కేవలం ధన బలం మాత్రమేనని, డబ్బు లేకపోవడంవల్లే తనను దూరం పెట్టారని రావి వెంకటేశ్వరరావు వాపోతున్నారు. -
అమెరికాలో ఎన్నారై ఘరానా మోసం.. రూ.183 కోట్లు టోకరా
అమెరికాలో ఎన్నారై ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. విలాసాలకు అలవాటుపడిన ఎన్నారై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.183 కోట్లు కొల్లగొట్టాడు. అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన అమిత్ పటేల్ ఈ మోసానికి పాల్పడ్డాడు. యూఎస్ ఫుట్‌బాల్ టీమ్ జాక్సన్విల్లే జాగ్వార్స్కు ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన అమిత్ పటేల్ ఆ టీమ్‌కు 22 మిలియన్ డాలర్లు అంటే ఇండియా కర్సెనీలో సుమారు రూ.183 కోట్లు టోకరా పెట్టాడు. ఈ డబ్బుతో జల్సా చేశాడు. ఫ్లోరిడాలో భారీ ఇంటిని కొనుగోలు చేయడంతో పాటు ఖరీదైన టెస్లా కారు, విలువైన వాచ్, క్రిప్టో కరెన్సీ కొన్నాడు. అలాగే చార్టెడ్ ఫ్లైట్స్ లో ఫ్రెండ్స్‌తో కలసి విహార యాత్రలు చేసేవాడు. ఇక ఈ విషయం బయటకు రావడంతో జాక్సన్విల్లే యాజమాన్యం అమిత్‌ను 2023 ఫిబ్రవరిలో ఉద్యోగం నుంచి తొలగించింది. ఫ్లోరిడాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో అతడిపై కేసు వేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. -
TS Elections: బరిలో ఎన్నారైలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నారైలు తమ ప్రత్యేకతను చాటుకునే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే గీతారెడ్డి, చెన్నమనేని రమేష్ లాంటి ఎన్నారై బ్యాక్‌డ్రాప్ ఉన్న సీనియర్లు పూర్తిగా పోటీకి దూరం కాగా.. ఇప్పుడు కొత్తగా బరిలోకి దిగుతూ చర్చనీయాంశంగా మారారు కొందరు. మామిడాల యశస్వినీరెడ్డి అమెరికాలో స్థిరపడిన ఝాన్సీరెడ్డి.. తెలంగాణ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పాలకుర్తి(జనగామ) నుంచి పోటీ చేయాలనుకున్నారు. అందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం చొరవ చూపి.. టికెట్ ఇప్పించే ప్రయత్నం చేశారు. కానీ, ఆమె అమెరికా పౌరసత్వ కారణంతో అది వీలుపడలేదు. బదులుగా తన కోడలు యశస్వినిరెడ్డి(26)ని పోటీలో నిలిపాలనుకోగా.. కాంగ్రెస్ అధిష్టానం అందుకు ఒప్పుకుంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత యువ అభ్యర్థి యశస్వినే కావడం విశేషం. ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి సీనియర్ మీద మామిడాల యశస్వినీరెడ్డి పాలకుర్తిలో పోటీకి దిగింది. యశస్వినీరెడ్డి హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసింది. ఆపై ఝాన్సీరెడ్డి కొడుకు రాజారామ్ మోహన్ రెడ్డిని వివాహం చేసుకుని అమెరికా వెళ్లింది. పాలకుర్తిలో సేవాకార్యక్రమాల ద్వారా ఝాన్సీరెడ్డికి మంచి గుర్తింపు ఉంది. ఆ కార్యక్రమాలనే తన కోడలి ప్రచారం కోసం ఝాన్సీరెడ్డి ఉపయోగించుకుంది. ఇటీవలే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా ఈ యువ అభ్యర్థి కోసం ప్రచారం కూడా చేశారు. గెలుపుపై యశస్విని ధీమాతో ఉంది. చల్లా శ్రీలత బీజేపీ హుజూర్ నగర్ అభ్యర్థిని చల్లా శ్రీలతారెడ్డి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ఆమె స్వస్థలం. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసించి.. ఆపై వివాహ తదనంతరం యూఏఈ వెళ్లిపోయారు. ఆమె భర్త విజయ భాస్కర్‌రెడ్డి అక్కడి ప్రభుత్వంలో సలహాదారుగా పని చేశారు. లాయర్‌గానే కాకుండా.. 2009 సమయంలో అబుదాబిలో తెలంగాణ ఉద్యమానికి మద్దతు కార్యక్రమాలు శ్రీలత నిర్వహించారు. ఉద్యమానికి మద్దతుగా యూఏఈలో ఎన్నారై కమ్యూనిటీని కూడగట్టి సంఘీభావ కార్యక్రమాలు రూపొందించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత.. స్వస్థలానికి వచ్చిన రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గానూ ఆమె పని చేశారు. ప్రస్తుతం ఆమె నేరేడుచర్ల వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో ఈ మధ్య చేరిన ఆమె.. ఈసారి హుజూర్నగర్ బరిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(కాంగ్రెస్), సైదిరెడ్డి(బీఆర్ఎస్)లతో పోటీ పడుతున్నారు. స్థానికతే తనను గెలిపిస్తుందని బలంగా నమ్ముతున్నారామె. ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సైదిరెడ్డి గతంలో విదేశాల్లో పనిచేస్తూ స్వదేశానికి వచ్చి రాజకీయ రంగప్రవేశం చేశారు. భూక్యా జాన్సన్ నాయక్ ఖానాపూర్(నిర్మల్) బీఆర్ఎస్ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్. ఈయన చదివింది నిజాం కాలేజీలో. ఆ సమయంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఈయన క్లాస్మేట్. అంతేకాదు.. గతంలో కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు.. అప్పటికే అక్కడ కంపెనీ నడుపుతున్న జాన్సన్ నాయక్ ఆతిథ్యం ఇచ్చారు. మొదటి నుంచి ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త.. జాన్సన్‌ను రాజకీయాల్లోకి రప్పించింది. అలా.. ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రేఖా నాయక్‌ను(సీటు రాలేని ఆమె కాంగ్రెస్‌లో చేరారు) కాదని బరిలోకి దించారు. ఈ సారి ఎన్నికల్లో తన ప్రియ మిత్రుడిని ఎలాగైనా గెలిపించుకోవాలనే లక్ష్యంతో కేటీఆర్ ఖానాపూర్ లో ఎన్నికల ప్రచారం సైతం చేశారు. మధుయాష్కీ గౌడ్ ఎన్నారైల లిస్ట్‌లో సీనియర్ మోస్ట్ లీడర్. హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన మధు యాష్కీ తొలిసారిగా.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎల్బీ నగర్(రంగారెడ్డి) నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డారు. గతంలో రెండుసార్లు(2004, 2009) నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడిగా ప్రజలు ఈయన్ని ఎన్నుకున్నారు. న్యాయ విద్యను అభ్యసించిన మధు యాష్కీ.. న్యూయార్క్‌లో లాయర్‌గా పని చేశారు. ఆయనకు న్యూయార్క్, అట్లాంటాలో లీగల్ కన్సల్టెన్సీలు ఉన్నాయి. దేశంలో రైతుల ఆత్మహత్యల పరిణామాలు తనను సొంత దేశానికి రప్పించాయని తరచూ చెప్తుంటారాయన. కాంగ్రెస్ సీనియర్ నేత అయినప్పటికీ.. ఎల్బీ నగర్ ఓటర్లను ఆయన ఏమేర ప్రభావితం చేస్తారనేది తెలియాలంటే కౌంటింగ్ దాకా ఆగాల్సిందే. ఈసారి తెలంగాణ ఎన్నికల కోసం 2,780 ఎన్నారైలు ఓటేయబోతున్నారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక.. 2014లో ఎన్నారై ఓటర్ల సంఖ్య కేవలం 05గా ఉంది. అదే 2018లో ఈ సంఖ్య 244కి పెరిగింది. ఇప్పుడు ఏకంగా 2,780కి చేరింది. వీరిలో 2,248 మంది పురుషులు, 531 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. -
కెనడాలో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సభ్యుల ఆత్మీయ సమావేశం (ఫొటోలు)
-
ఐఎఫ్ఎస్సీ–గిఫ్ట్ సిటీ బ్యాంక్‌లో అకౌంట్ ప్రారంభం ఈజీ
న్యూఢిల్లీ: గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్–సిటీ... ఇంటర్నేషన్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్స్ (ఐఎఫ్ఎస్సీ–గిఫ్ట్ సిటీ) బ్యాంకులో ఎటువంటి పాన్ లేకుండా విదేశీ కంపెనీలు, ఎన్ఆర్ఐలు, నాన్–రెసిడెంట్లు అకౌంట్ ప్రారంభించే వెసులుబాటును ఆర్థికశాఖ కలి్పంచింది. ఈ మేరకు ఆదాయపు పన్ను నిబంధనల మినహాయింపు కలి్పంచినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. దీనిప్రకారం బ్యాంక్ ఖాతాను తెరిచే నాన్–రెసిడెంట్ లేదా విదేశీ కంపెనీ ఫారమ్ 60లో డిక్లరేషన్‌ను దాఖలు చేస్తే సరిపోతుంది. అలాగే భారతదేశంలో ఎలాంటి పన్ను బకాయిలను కలిగి ఉండకూడదు. జీఐఎఫ్‌టీ–ఐఎఫ్ఎస్సీ ఆర్థిక రంగానికి సంబంధించి పన్ను–తటస్థ ప్రాంతంగా ఉంటుందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సడలింపు విదేశీ కంపెనీలు, ఎన్ఆర్ఐలు, ఇతర నాన్–రెసిడెంట్లు ఐఎఫ్ఎస్సీ బ్యాంక్‌లో బ్యాంక్ ఖాతాను తెరవడాన్ని సులభతరం చేస్తుందని నంగియా అండర్సన్ ఎల్ఎల్పీ భాగస్వామి ( ఫైనాన్షియల్ సర్వీసెస్) సునీల్ గిద్వానీ అభిప్రాయపడ్డారు. రుణాలు, డిపాజిట్లుసహా ఐఎఫ్ఎస్సీలో రిటైల్ వ్యాపార విభాగం పురోగతికి తాజా నిర్ణయం ఉపయోగపడుతుందని గిద్వానీ చెప్పారు. -
Chandrayaan-3: అబుదాబిలో భారత్ మాతా కీ జై
అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత అద్భుత ఘట్టంగా చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ నిలిచిపోయింది. ఈ అరుదైన ఘనతను చూడడానికి దేశవిదేశాల్లోనూ ప్రజలు ఆసక్తి కనబరిచారు. అలాగే.. విదేశాల్లో ఉంటున్న భారతీయుల కోసమూ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాయి అక్కడి ఇండియన్ కమ్యూనిటీస్. ఈ క్రమంలో.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో ఉంటున్న ప్రవాస భారతీయులందరు ఒక్క దగ్గర ఉండి వీక్షించేందుకు ఇండియా సోషల్ అండ్ కల్చర్ సెంటర్ ముఖ్య ప్రాంగణంలో LED స్క్రీన్ ద్వారా ఏర్పాట్లు చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వందలాది ప్రవాస భారతీయులు అక్కడికి చేరుకొని చంద్రయాన్ 3 చంద్రుని ఉపరితలం పై లాండ్ అవడం వీక్షించారు. ఎక్కువ మంది తెలుగు ప్రజలు.. అందునా తెలంగాణ ప్రజలు ఉండడం చెప్పుకోదగ్గ విశేషం. చంద్రయాన్ 3 లాండింగ్ చివరి క్షణాలలో ప్రాంగణం అంతా భారత్ మాతా కీ జై నినాదాలతో మారు మోగింది. ఈ క్షణాలు భారతీయలందరి హృదయాలలో ఒక గర్వం తో కూడిన ఆనందం చేకూర్చిందని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు రాజశ్రీనివాస రావు, గోపాల్ మరియు ఎట్టి రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. అలాగే ISC ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఇది ‘భారతీయలందరికి మరచిపోలేని అనుభూతి’గా పేర్కొన్నారు. -
ఐర్లాండ్‌లో ఆర్యవైశ్య సమ్మేళనం
ఐర్లాండ్ దేశంలోని డబ్లిన్ నగరంలో ఆర్యవైశ్య సమ్మేళనం ఘనంగా జరిగింది. 70 మందికి పైగా ఆర్యవైశ్యులు అక్కడ ప్రఖ్యాతిగాంచిన సెయింట్ కాథరిన్ పార్క్‌లో భగినీహస్త భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరూ తమ ఇంటి నుంచి మధురమైన వంటకాలను వండి తెచ్చారు. కార్యక్రమంలో బహుభాషా కోవిదులు డాక్టర్ అనూష పులవర్తి, చిన్నారి లక్ష్మి హాసిని భక్తి గీతాలు ఆలపించారు. తరువాత సంతోష్ ఆధ్వర్యంలో సాగిన విందుభోజన కార్యక్రమంలో మహేష్ అలిమెల్ల, గిరిధర్, శ్రీనివాస్, రామ మణికంఠ, అన్వేష్ సహకారంతో అందరూ విందుభోజనాన్ని ఆరగించారు. తరువాత జరిగిన కార్యక్రమాల్లో ప్రముఖ రేడియో జాకీ అంకిత పవన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా చిన్నపిల్లలకు పద్యాలు, శ్లోకాలు, తెలుగు భాష, సాంప్రదాయ దుస్తులు తదితర అంశాలలో పోటీలు నిర్వహించారు. వీటిలో అక్షద, చరిత, హాసిని, నీల్ అన్వయి, యజ్నశ్రీ విజేతలుగా నిలిచారు. అనంతరం వివిధ రకాల ఆటలు నిర్వహించారు. కుటుంబ అన్యోన్యతకి సంబంధించిన ఆటలో భాస్కర్ బొగ్గవరపు దంపతులు మొదటి బహుమతి అందుకొన్నారు. సాంప్రదాయ వస్త్రధారణ అంశంలో గ్రంధి మణి, లావణ్య దంపతులు బహుమతులు గెలుచుకున్నారు. తరువాత కార్యక్రమంలో పవన్, అంకిత సహాయంతో మహిళలందరికీ చిరు కానుకలు అందజేశారు. కార్యక్రమ నిర్వహణలో వీరమల్లు కళ్యాణ్, అనిత, మాధవి, హిమబిందు, దివ్య మంజుల, లావణ్య, గిరిధర్, సతీష్ మేడా కీలక పాత్ర పోషించారు. చివరిగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నరేంద్ర కుమార్ నారంశెట్టి మాట్లాడుతూ పురాణాల్లో ఆర్యవైశ్యుల విశిష్టతను వివరించారు. ఐర్లాండ్ లో మొట్టమొదటి కార్యక్రమం చాలా బాగా జరిగిందని, కార్యక్రమానికి సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమానికి స్పాన్సర్స్ గా వ్యవహరించిన సదరన్ స్పైస్ రెస్టారెంట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. -
బియ్యమో... రామచంద్రా!
గడచిన కొద్దిరోజులుగా అమెరికాలోని దుకాణాల వద్ద భారతీయుల భారీ క్యూలు ఓ హాట్ టాపిక్. రానున్న రోజుల్లో బియ్యానికి కొరత రావచ్చనే భయంతో, నిల్వ చేసుకొనేందుకు ప్రవాస భారతీయులు పెద్దయెత్తున కొనుగోళ్ళకు దిగడంతో తలెత్తిన దృశ్యమది. ఉరుము లేని పిడుగులా బాస్మతి బియ్యం మినహా మిగతా రకాల తెల్ల బియ్యం ఎగుమతుల్ని తక్షణమే నిషేధిస్తూ భారత సర్కార్ గత గురువారం తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో రేపు ఇలాంటి దృశ్యాలు ఇంకేం తలెత్తు తాయో తెలీదు. అది ఫలించక ఇప్పుడు నిషేధమే విధించారు.. ప్రపంచ బియ్యం మార్కెట్‌ను ఇది ఆశ్చర్యపరిచినప్పటికీ, పెరిగిపోతున్న ధాన్యం ధరలను నియంత్రించడం రానున్న ఎన్నికల దృష్ట్యా పాలకులకు అనివార్యమైంది. దేశీయంగా సరఫరా పెంచడానికీ, ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేసేందుకూ బియ్యం ఎగుమతులపై ఈ తక్షణ నిషేధం ఉపకరిస్తుందని సర్కార్ భావన. అందుకే, 10 నెలల క్రితం బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం వేసి, ఆంక్షలు పెట్టిన పాలకులు అది ఫలించక ఇప్పుడు నిషేధమే విధించారు. భారత్ మాటెలా ఉన్నా ఇది ప్రపంచానికి ప్రాణసంకటమే. ఇటీవలే నల్లసముద్రపు ఆహార ధాన్యాల ఒప్పందాన్ని రష్యా రద్దు చేసుకోవడంతో వివిధ దేశాల్లో గోదుమలు, మొక్కజొన్నల ధర నింగికెగసింది. ఇప్పుడు భారత బియ్యం ఎగుమతి నిషేధమూ తోడయ్యేసరికి, ప్రపంచ ఆహార ధరలు ఇంకా పెరగవచ్చని ఆందోళన రేగుతోంది. Rice bag NRIs standing in line to collect rice in the US,just like how they stand in front of a ration shop.pic.twitter.com/L0YqEwqrsa— Брат (@B5001001101) July 25, 2023 అత్యధిక బియ్యం ఎగుమతి మన దేశం నుంచే.. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా బియ్యం ఎగుమత య్యేది మన దేశం నుంచే! ప్రపంచ పామాయిల్ ఎగుమతుల్లో ఇండొనేసియా, మలేసియా ఎలాగో బియ్యానికి సంబంధించి మనం అలా! ఎగుమతుల్లో 40 శాతానికి పైగా మన దేశానివే! ఇప్పుడు మన ఉత్పత్తుల్లో ఉన్నతశ్రేణిదిగా భావించే బాస్మతి మినహా మిగతా రకాల బియ్యానికి తాజా నిషేధం వర్తిస్తుంది. పెరిగిన అంతర్జాతీయ అమ్మకాలు సైతం ఈ నిషేధానికి కారణం. గత ఆర్థిక సంవత్సరం భారత్ నుంచి బియ్యం ఎగుమతులు 23 శాతం పెరిగాయి. ఈ ఏడాదిలో జూన్ వరకు మన బియ్యం అంతర్జాతీయ అమ్మకాలు 35 శాతం హెచ్చాయి. వెరసి, గత నెల రోజుల్లో దేశంలో బియ్యం రేటు 3 శాతం పెరిగింది. ఏడాది క్రితంతో పోలిస్తే 11.5 శాతం పెరిగిందని సర్కారే చెబుతోంది. అదేసమయంలో, దేశీయంగా వరి ఉత్పత్తి పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఒకపక్క పంజాబ్, హర్యానా లాంటి చోట్ల వర్షాలతో వరి పంట దెబ్బతింది. మరోపక్క అదనులో తగినంత వర్షాలు పడక కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు వగైరాల్లో వరి నాట్లు ఆలస్యమయ్యాయి. దీంతో భవిష్యత్తులో బియ్యం సరఫరాకు కొరత రావచ్చు. అదే జరిగితే నింగినంటుతున్న ధరలు నేలకు రావడం కష్టమే. ఎన్నికల వేళ అది దెబ్బ తీస్తుందని భావించిన పాలకులు ఎగుమతులపై నిషేధాస్త్రం సంధించారు. మన దేశపు బియ్యం ఎగుమతుల్లో 25 నుంచి 30 శాతం ఇప్పుడు నిషేధానికి గురైన ఈ బాస్మతీయేతర తెల్ల బియ్యమే. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో మన దేశం 1.7 కోట్ల టన్నులకు పైగా బియ్యాన్ని భారత్ ఎగుమతి చేస్తోంది. నిషేధంతో ఈ ఎగుమతులు 40 శాతం పడిపోవచ్చు. ఈ నిషేధం తాత్కాలికమేనా? సహజంగానే దీనిపై దేశంలోని ఎగుమతిదారుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ నిషేధం తాత్కాలికమేననీ, మహా అయితే ఆరు నెలల వరకే ఉండచ్చనీ, ప్రపంచ వాణిజ్య సంస్థ బరిలోకి దిగాక పరిస్థితి చక్కబడుతుందనే ఆశ లేకపోలేదు. బంగ్లాదేశ్, అంగోలా, గినియా, కెన్యా, నేపాల్ సహా 140కి పైగా దేశాలకు మన దేశం బియ్యం ఎగుమతి చేస్తోంది. థాయిలాండ్, వియత్నామ్, పాకిస్తాన్, మయన్మార్ లాంటి ఇతర ఎగుమతి దేశాలూ ఉన్నా భారత నిర్ణయంతో ఏర్పడ్డ లోటును అవి భర్తీ చేయలేవు. ఫలితంగా, విపణిలో ఇతర ఆసియా దేశాల నుంచి వచ్చే బియ్యం ధరలూ పెరిగాయి. బియ్యం ఎగుమతిలో ప్రపంచంలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న థాయిలాండ్, వియత్నామ్‌ల బియ్యం రేటు హెచ్చింది. రష్యా యుద్ధంతో ఉక్రెయిన్ నుంచి ఎగుమతులకు ఆటంకం చాలదన్నట్టు అమెరికాలో ధాన్యం పండించే ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావంతో సతమతమవుతున్నాయి. ఈసారి అమెరికాలో గోదుమల దిగుబడి తగ్గవచ్చు. 16 ఏళ్ళలో ఎన్నడూ లేనంత తక్కువకు నిల్వలు పడిపోవచ్చు. గోదుమలు, బియ్యం – రెంటికీ అగ్రరాజ్యంలో కటకట రావచ్చు. గత ఏడాది మేలో గోదుమల ఎగుమతిపై నిషేధం, సెప్టెంబర్‌లో విరిగిన బియ్యంపైన నిషేధం, బాస్మతీయేతర బియ్యంపై 20 శాతం సుంకం విధింపు... ఆ వరుసలో వచ్చినదే భారత సర్కార్ తాజా ఉత్తర్వు. ఈ ఏడాది మే నుంచి పంచదార ఎగుమతుల్నీ ఆపారు. ఇవన్నీ తిరోగామి చర్యలైనా, దేశీయ సరఫరాలో ఇబ్బందులతో అనివార్యమైంది. ఇప్పుడిప్పుడే వర్షాలు పుంజుకుంటున్నా, నాట్లలో జరిగిన జాప్యం దెబ్బతీయవచ్చు. ఇక, ఎల్‌నినో పొంచి ఉండనేవుంది. So it begins. India has banned some rice exports and now people are panic buying up rice. pic.twitter.com/ujpm66ER3n— Ian Miles Cheong (@stillgray) July 23, 2023 జబ్బలు చరుచుకున్నాం.. మరి నిషేధం విధించాల్సి రావడమేమిటి? వీటన్నిటి మధ్య ఈ ఏటి దిగుబడి పరిస్థితి ఏమిటో ఇప్పుడే చెప్పలేం. కానీ, గత ఆర్థిక సంవత్సరం బియ్యం, గోదుమలు – రెండూ ఎన్నడూ లేనంత అధిక దిగుబడినిచ్చాయని జబ్బలు చరుచుకున్నాం. ప్రపంచానికి మనమే ఆహారం అందిస్తున్నామన్నాం. తీరా అప్పుడు గోదుమలు, ఇప్పుడు బియ్యంపై ఇలా నిషే«ధం విధించాల్సి రావడమేమిటి? ఇది బేతాళ ప్రశ్న. అలాగే, ఏళ్ళ తరబడి కష్టంతో ప్రపంచ విపణిలో ఎగుమతిదారుగా సంపాదించుకున్న పేరుకు ఈ నిషేధపుటుత్తర్వులు చేటు చేస్తాయి. గుండుగుత్తగా ఎగుమతులపై నిషేధమనే కన్నా, నిర్ణీత కనీస ధరకు తక్కువైతే ఎగుమతుల్ని అను మతించబోమని చెప్పవచ్చు. దేశీయంగా ఆహార ధరలు నియంత్రించాలంటే పాలకులు ప్రత్యామ్నా యాలు ఆలోచించక తప్పదు. వాణిజ్య విధానాన్ని ఘడియకోసారి మార్చడం మార్గం కానే కాదు! -
యూఎస్‌లో బియ్యం కష్టాలకు అసలు కారణం ఇదే..
ఢిల్లీ: విదేశాలకు బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి తీసుకున్న ఈ నిర్ణయం.. అమెరికాలో దావానంలా పాకింది. దీంతో ఎక్కడ బియ్యం కొరత.. సంక్షోభం తలెత్తుతాయనే భయంతో బియ్యం కోసం ఎగబడిపోతున్నారు మనవాళ్లు. ఈ క్రమంలోనే అమెరికాలో మునుపెన్నడూ కనిపించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికాలో బియ్యం స్టోర్ల ముందు నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండగా.. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రత్యేకించి సోనామసూరికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో భారతీయులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. అమెరికాలో బియ్యం కోసం భారతీయులు.. ఎక్కువగా తెలుగువాళ్లు ఎగబడుతున్నారు. మార్ట్ల బయట క్యూలు కడుతున్నారు. అగ్రరాజ్యంలో ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వీటికి తోడు ఎక్కడ బియ్యం సంక్షోభం వస్తుందనే భయంతో.. ఒక్కొక్కరు ఐదారు బాగ్యులకు మించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో పరిమితంగా కొనుగోలు చేయాలనే నోటీసులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఇప్పటికే నో స్టాక్ బోర్డులూ కనిపిస్తున్నాయి. ఇక అదే అదనుగా.. అధిక ధరలు వసూలు చేస్తున్నారు. After Banning Rice Exports From India, Indians situation in USA to buy rice bags🥲 Those who are living in USA Immediately go to your nearby Indian Store and get some Rice Bags Before its too late🚨🚨#RiceBanInUSA pic.twitter.com/vAumv6fedv — Prabhas Fans USA🇺🇸 (@VinayDHFprabhas) July 21, 2023 భారత్ బియ్యానికే అగ్రతాంబూలం ప్రపంచంలో.. 90 శాతం బియ్యం ఆసియా నుంచే ఉత్పత్తి అవుతుండగా.. అందులో 45 శాతం వాటా భారత్‌దే. ఇక బాస్మతి బియ్యం ఉత్పత్తిలోనూ 80 శాతం భారత్‌దే ఉంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారత్ ఉండగా.. 2012 నుంచి అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంటూ వస్తోంది. ఇక చైనా, థాయ్‌లాండ్, మెక్సికో తదితర దేశాల నుంచి బియ్యం ఎక్కువగా అమెరికా దిగుమతి చేసుకుంటుంది. అయితే.. మన బియ్యానికే అక్కడ క్రేజ్ ఎక్కువ. ఈ ప్రాధాన్యం ఇవ్వడంతోనే తాజా పరిస్థితి నెలకొంది. అందుకే నిషేధం ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది రుతు పవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. దీని వల్ల దేశంలో చాలా ప్రాంతాల్లో వరినాట్లు ఆలస్యమయ్యాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కురిసిన వర్షాల మూలంగా చాలా చోట్ల పంట నష్టం జరిగింది. దీని వల్ల ఈ సారి దిగుబడులపై ప్రభావం ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ధరల పెరుగుదల ప్రభావం ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీసుకుందని ప్రభుత్వం భావించింది. దీంతో బియ్యం ఎగుమతులపై నిషేధం విధించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. విదేశాలకు నాన్-బాస్మతి బియ్యం ఎగమతులపై నిషేధం విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజీఎఫ్టీ) గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. పాక్షికంగా మరపట్టిన, పూర్తిగా మరపట్టిన, తెల్లటి బియ్యంపై ఈ నిషేధం వర్తిస్తుంది. నోటిఫిికేషన్‌కు ముందే ఓడల్లోకి బియ్యాన్ని లోడ్ చేసి ఉంటే అలాంటి వాటిని అనుమతి ఇస్తామని తెలిపింది. ఆహార భద్రత కింద కేంద్ర ప్రభుత్వం అనుమతించిన దేశాలకు మాత్రం బియ్యం ఎగుమతులు యధావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది. తద్వారా దేశీయ మార్కెట్లో బియ్యం ధరలు కొంత మేర తగ్గుతాయని కేంద్రం భావిస్తోంది. అయితే.. మన దేశం నుంచి బియ్యం ఎగుమతులను నిషేధించడం వల్ల మన దేశం నుంచి దిగుమతులు చేసుకునే దేశాల్లో వీటి ధరలు భారీగా పెరుగుతాయని కేంద్రం ముందుగానే అంచనా వేసింది. అదే ఇప్పుడు నిజమవుతోంది. -
హైదరాబాద్ నుంచి నేరుగా విమానాలు ఏర్పాటు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికాకు విమానసర్వీసులు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి యూఎస్ఏ ఎన్నారైలు వినతిపత్రం సమరి్పంచారు. ఈ మేరకు అమెరికాలో పర్యటిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని తెలుగు ఎన్నారైలు కలిశారు. ఢిల్లీ, ముంబై వంటి అనేక ఇతర భారతీయ నగరాలు ఇప్పటికే అమెరికాలోని ప్రధాన నగరాలతో నేరుగా విమాన కనెక్షన్లు కలిగి ఉన్నాయని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం కోసం ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్ మరింత ఎదుగుతుందని పేర్కొన్నారు. కాగా ఎయిర్ ఇండియా కొత్త ఫ్లైట్లను ఆర్డర్ చేయటంతోపాటు, కొత్త రూట్లలో విమాన సర్వి సులను తెచ్చేందుకు కృషి చేస్తోందని, కేంద్ర అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా ప్రవాసుల కోరిక నెరవేరేలా చూస్తామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విలాస్ జంబుల, లక్ష్మణ్ అనుగు, సంతోష్ రెడ్డి, శ్రీకాంత్ తుమ్మల, ప్రదీప్ కట్టా, వంశీ యమజాల, మధుకర్ రెడ్డి, రామ్ వేముల, రఘువీర్ రెడ్డి తదితరులు ఉన్నారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ నేతలు భేటీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డితో అమెరికాలోని ప్రవాస తెలంగాణవాదులు, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీడీఎఫ్ మాజీ అధ్యక్షుడు మురళి చింతలపాని, లక్ష్మణ్ అనుగు, ఇతర కార్యవర్గసభ్యులు కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్ర సాధనలో ప్రవాస తెలంగాణవాసులు, టీడీఎఫ్ పోషించిన పాత్రను కిషన్‌రెడ్డి అభినందించారు. -
వరదలా విదేశీ డబ్బులు.. ప్రపంచంలోనే తొలి స్థానంలో ప్రవాస భారతీయులు
వంద బిలియన్ డాలర్లు.. మన రూపాయల్లో సుమారు 8 లక్షల కోట్లు! గతేడాది విదేశాల్లోని భారతీయులు స్వదేశానికి పంపిన మొత్తమిది! ఇలాంటి చెల్లింపుల్లో ప్రవాస భారతీయులు ప్రపంచంలోనే టాప్! అయితే ఏంటి? చాలా ఉంది! ఈ మొత్తం అనేక మందికి అన్నం పెడుతోంది! పేదరికం తగ్గేందుకు, ప్రజల ఆరోగ్యం మెరుగయ్యేందుకు, నవజాత శిశువులు పుష్టిగా ఉండేందుకూ కారణమవుతోంది..ఎలా? ప్రపంచ బ్యాంకు తాజా లెక్కల ప్రకారం 2022–23లో ప్రపంచం మొత్తమ్మీద అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న లేదా పేద దేశాలకు పంపిన మొత్తం 80,000 కోట్ల డాలర్లు. ఈ విషయంలో అన్ని దేశాల కంటే తొలి స్థానంలో ఉన్న భారత్‌కు విదేశాల్లోని భారతీయులు వంద బిలియన్ డాలర్లు పంపితే, అరవై బిలియన్ డాలర్లతో మెక్సికో రెండో స్థానంలో ఉంది. విదేశాల్లో ఉన్న మన బంధువులు లేదా మిత్రులు ఇంటికి పంపే డబ్బుల్ని ఇక్కడ రకరకాలుగా పెట్టుబడి పెడుతుంటారు. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ చక్రాలు కదులుతూ ఉంటాయి. పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయమూ లభిస్తుంటుంది. పైగా మధ్యవర్తి లేకుండా నేరుగా డాలర్లు భారత్‌కు వస్తుంటాయి. ఈ డాలర్లను ప్రభుత్వం ముడిచమురు, తదితర కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చు. ఎగువన ఉన్న వారికీ... దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారినే కాకుండా ఎగువన ఉన్న వారికీ ఈ చెల్లింపులు ఉపయోగపడతాయి. ఆర్థిక వ్యవస్థల్లో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు, లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దారిద్య్రరేఖకు కొంచెం ఎగువన ఉన్న వారు కూడా కిందకు పడిపోతారు. ఈ పరిస్థితుల్లో విదేశాల్లోని బంధుమిత్రులు పంపే అదనపు మొత్తాలు బాధితులు పుంజుకునేందుకు ఉపయోగపడతాయన్నది కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. 2018 ఆగస్టు నాటి భారీ వరదల సమయంలో భారత్‌కు చెల్లింపులు దాదాపు 14 శాతం వరకూ పెరిగాయి. అంతెందుకు 2008లో ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినా, విదేశీ పెట్టుబడులు తగ్గిపోయినా ఈ రకమైన చెల్లింపులు పెరగడం గమనార్హం. అంటే ప్రభుత్వాలకు నమ్మకంగా వచ్చిపడే విదేశీ మారక ద్రవ్యం ఇది. వ్యయం తడిసిమోపెడు! అంతాబాగానే ఉంది కానీ.. ఇటీవలి కాలంలో చెల్లింపుల కోసం అయ్యే వ్యయం తడిసిమోపెడు అవుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్ అధ్యక్షతన ప్రస్తుతం జరుగుతున్న జీ20 సమావేశాల్లోనూ ఈ అంశంపై విస్తృత చర్చ జరగడం గమనార్హం. డాలర్ మారకం విలువల్లోని తేడాలు, పంపేందుకు, అందుకునేందుకు చెల్లించాల్సిన కమీషన్లు ఎక్కువగా ఉండటం వల్ల చెల్లింపుల వల్ల కలిగే ప్రయోజనాలు పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నాం. ప్రస్తుతం ఈ కమీషన్లు, మారక విలువల్లోని తేడాలనీ కలిపి ప్రతి చెల్లింపునకూ 6.24 శాతం మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తోంది. చదవండి: మన డేటా ఎంత భద్రం? కేంద్రం ముసాయిదా బిల్లులో ఏముంది ? అయితే మూడేళ్ల క్రితం ఇది ఏడు శాతంగా ఉంది. సమీప భవిష్యత్తులో దీనిని మూడు శాతానికి తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డబ్బులు మార్పిడి చేసే కంపెనీలు మరిన్ని అందుబాటులో ఉండేలా చేసి వాటి మధ్య పోటీ పెంచాలన్నది ఈ దిశలో జరుగుతున్న ప్రయత్నాల్లో ఒకటి. ఆయా దేశాలు ఈ చెల్లింపులపై విధిస్తున్న పన్నులను తగ్గించేందుకు, వీలైతే పూర్తిగా మాఫీ చేసేలా కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యయం తగ్గించుకునేందుకు వలస కార్మికులు లేదా ఉద్యోగులు మధ్యవర్తులను ఆశ్రయించడం వల్ల కొన్నిసార్లు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుని ఈ వ్యయాన్ని వీలైనంతగా తగ్గిస్తే వినియోగదారులకు లాభం చేకూరడమే కాకుండా.. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. విదేశాలకూ పెరుగుతున్న చెల్లింపులు దశాబ్దాలుగా విదేశాల నుంచి భారత్‌కు ‘‘చెల్లింపులు’’ పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో విదేశాలకు వెళుతున్న మొత్తం కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం గత ఏడాది ఈ మొత్తం 2,710 కోట్ల డాలర్లకు చేరుకుంది. లిబరైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద భారతీయులు తమ వ్యక్తిగత అవసరాల కోసం (పర్యాటకం, విద్య, అనుమతులు అవసరం లేని పెట్టుబడులు) ఏటా దాదాపు రూ.2 కోట్లు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. 2004లో ఇది రూ.24 లక్షలు మాత్రమే. 2015లో ఈ పరిమితిని పెంచారు. దీంతో 2004లో విదేశాలకు వెళ్లే మొత్తం 460 బిలియన్ డాలర్లు కాగా 2022 నాటికి 2,710 కోట్ల డాలర్లకు చేరింది. 80 శాతం పేద, మధ్యాదాయ దేశాలే.. గత ఏడాది చెల్లింపుల్లో దాదాపు 80 శాతం పేద, మధ్యాదాయ దేశాలే అందుకున్నాయి. కొన్ని దేశాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కంటే ఎక్కువగా ఈ చెల్లింపులు ఉండటం గమనార్హం. కాగా ఈ డబ్బులు పేదరిక నిర్మూలనకు ఎలా ఉపయోగపడతాయన్న అంశంపై మూడేళ్ల క్రితం మారియా ఫాషోలిన్సే అనే శాస్త్రవేత్త ఒక అధ్యయనం నిర్వహించారు. కార్మికులను ఇతర దేశాలకు పంపే 25 ఆసియా దేశాలను ఎంచుకుని ఈ అధ్యయనం చేశారు. వలసలు, చెల్లింపులపై ప్రపంచబ్యాంకు వద్ద ఉన్న సమాచారం ఆధారంగా ఆయా దేశాల్లోని పేదల సంఖ్య, వారిలో ఉండే అంతరం (కటిక పేదలు.. ఓ మోస్తరు పేదలు) వంటి వివరాలు సేకరించారు. వీటిద్వారా ఆయా దేశాల్లో పేదరికం ఎంతమేరకు ఉందన్నది నిర్ధారించుకున్నారు. రోజుకు రెండు డాలర్లు లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న వారిని ప్రపంచబ్యాంకు పేదల కింద లెక్కవేస్తుంది. ఈ వివరాలను పొందుపరిచి గణితశాస్త్ర సూత్రాల ప్రకారం లెక్క వేస్తే విదేశాల నుంచి వీరికి అందే చెల్లింపుల ప్రభావం ఎక్కువగానే ఉన్నట్లు స్పష్టమైంది. ఒకొక్కరికి అందే డబ్బులు పది శాతం పెరిగినా ఆ దేశంలో పేదరికంలో ఉన్న వారి శాతం (వంద మందిలో పేదల సంఖ్య) 0.4 శాతం తగ్గుతుందని తేలింది. చెల్లింపుల డబ్బులతో పేదలు మంచి ఆహారం తీసుకోవడం మాత్రమే కాకుండా.. పిల్లలను చదివించుకునేందుకూ వీలేర్పడుతోంది. ఆపత్కాలాన్ని కూడా తట్టుకుని వీరు బతకగలుగుతున్నారు. - (కంచర్ల యాదగిరిరెడ్డి) -
వైట్‌హౌస్‌లో పాటలతో హుషారు! ఎవరీ కుర్రాళ్లు?
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్.. వేలాది మంది భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం ఎదురు చూస్తున్నారు. వైట్ హౌస్ మెట్ల వద్ద నలుపు రంగు కోట్లు ధరించిన కొందరు కుర్రాళ్లు "చయ్య చయ్య", "దిల్ సే", "జాష్న్-ఎ-బహారా" బాలీవుడ్ పాటలతో అక్కడున్నవారందరినీ ఉర్రూతలూగించారు. ఇంతకీ ఎవరీ కుర్రాళ్లు అంటే.. స్వరాలే వాద్యాలుగా.. ‘పెన్ మసాలా’.. ప్రపంచంలో మొట్టమొదటి దక్షిణాసియా ఎ క్యాపెల్లా (A Capella) గ్రూప్. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన 19 మంది విద్యార్థులతో ఇది ఏర్పాటైంది. ఎ క్యాపెల్లా అంటే వాద్య సహకారం లేకుండా పాటలు పాడే బ్యాండ్. స్వయంగా తమ స్వరంతోనే వాద్య శబ్ధాలను వీరు అనుకరిస్తారు. 1996 నుంచి ఈ బ్యాండ్ ఉనికిలో ఉంది. ఈ బృందం దేశాధినేతలు, ఇతర ప్రముఖులు పర్యటనలకు వచ్చినప్పుడు పాడటం ద్వారా పేరు తెచ్చుకుంది. ఇటీవల వైట్ హౌస్‌లో అధ్యక్షుడు బైడెన్ భారత ప్రధాని మోదీ కోసం ఇచ్చిన విందు సందర్భంగా ప్రదర్శన ఇవ్వడానికి తమకు అవకాశం, గౌరవం దక్కిందని పెన్ మసాలా గ్రూప్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. వైట్ హౌస్‌లో వేలాది మంది భారతీయుల సమక్షంలో ప్రదర్శన ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ బ్యాండ్ ఇంతకుముందు అప్పటి ప్రెసిడెంట్ ఒబామా కోసం వైట్ హౌస్‌లో, ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చింది. పిచ్ పర్ఫెక్ట్ 2 అనే హాలీవుడ్ చిత్రానికి సౌండ్‌ట్రాక్ అందించింది. దీనికి 2015లో ఉత్తమ సౌండ్‌ట్రాక్‌గా అమెరికన్ మ్యూజిక్ అవార్డు లభించడం విశేషం. -
ఎన్ఆర్ఐలకు గుడ్‌న్యూస్.. హెచ్–1బీ వీసా రెన్యువల్ ఇక అక్కడే!
వాషింగ్టన్: హెచ్–1బీ వీసా వంటి నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాలపై అమెరికాలో ఉపాధి పొందిన భారతీయులకు శుభవార్త!. వర్క్ వీసాల రెన్యువల్ కోసం ఆయా వీసాదారులు ఇకపై స్వదేశం(భారత్)కు వెళ్లిరావాల్సిన పనిలేకుండా వారికి అమెరికాలోనే పునరుద్ధరణ సేవలు పొందే సదావకాశం కల్పించాలని అమెరికా సర్కార్ యోచిస్తోంది. ఈ నిర్ణయం అమలైతే వేలాది మంది భారతీయులకు ఎంతో సమయం, విమాన ఖర్చులు ఆదా అవుతాయి. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా భారతీయులకు అగ్రరాజ్యం అందిస్తున్న కానుకగా ఆ దేశ ఉన్నతాధికారి ఒకరు అభివర్ణించారు. నైపుణ్య ఉద్యోగాల్లో నియామకాల కోసం అమెరికా కంపెనీలు విదేశీయులకు హెచ్–1బీ వీసాలిచ్చి అమెరికాకు రప్పించడం తెల్సిందే. ఇలా హెచ్–1బీ వీసాలు పొందుతున్న వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉండటం విశేషం. ‘వీసా రెన్యువల్ కోసం సొంత దేశానికి వెళ్లకుండానే అమెరికాలోనే ఆ పని పూర్తయ్యేలా మొదట పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానం అమలుచేస్తాం. త్వరలోనే ఇది మొదలుపెడతాం. హెచ్–1, ఎల్ వీసా దారులకు ఇది ఎంతో ఉపయోగకరం’ అని ఆ అధికారి వెల్లడించారు. 2004 ఏడాదికి ముందువరకు నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాల్లో కొన్ని విభాగాల వీసాలకు అమెరికాలోనే రెన్యువల్/స్టాంపింగ్ ఉండేది. తర్వాత పద్దతి మార్చారు. హెచ్–1బీ వంటి వీసాదారులు ఖచ్చితంగా సొంత దేశం వెళ్లి వీసా పొడిగింపు సంబంధ స్టాంపింగ్‌ను పాస్‌పోర్ట్‌పై వేయించుకోవాలి. ఈ ప్రయాస తగ్గించాలనే అమెరికా భావిస్తోంది. కాగా, గత కొద్దినెలలుగా వీసాల జారీ ప్రక్రియను అమెరికా ప్రభుత్వం మరింత సరళతరం, వేగవంతం చేయడం విదితమే. చదవండి: దేశ ఆయుధ పరిశ్రమలో నవశకం ! -
అమెరికాలో ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం కుదింపు
న్యూయార్క్: ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ప్రవాస భారతీయులతో సమావేశాన్ని కుదించారు. క్షణం తీరిక లేకుండా ప్రధాని షెడ్యూల్ ఉండడంతో ప్రవాస భారతీయుల్లో అత్యంత ముఖ్యులతో వాషింగ్టన్లో చిన్న సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి వెయ్యి మంది వరకు హాజరయ్యే అవకాశాలున్నాయి. తొలుత షికాగోలో భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేసినప్పటికీ ప్రధాని బిజీ షెడ్యూల్‌తో తగ్గించాల్సి వచ్చిందని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఫౌండేషన్ చైర్మన్ భరత్ బరాయ్ వెల్లడించారు. అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ తొలిసారిగా అధికారిక హోదాలో ఈ నెల 21 నుంచి 24 వరకు అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. -
వారి నిర్లక్ష్యంతోనే నా భార్య మృతి.. రిసార్ట్, బోట్ కెప్టెన్‌పై ఎన్ఆర్ఐ దావా
తన భార్య మరణానికి వారి నిర్లక్ష్యమే కారణమంటూ ఓ రిసార్ట్, బోట్ కెప్టెన్‌పై ఒక భారతీయ-అమెరికన్ దావా వేశారు. ఫ్లోరిడాలో గత ఏడాది పారాసెయిలింగ్ చేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో భారత్‌లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీనివాసరావు అలపర్తి భార్య మృతి చెందారు. ఆయన కొడుకు, మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ ప్రమాదానికి వాటర్ ఫ్రంట్ రిసార్ట్, బోట్ కెప్టెన్ల నిర్లక్ష్యమే కారణమంటూ తాజాగా ఆయన వారిపై దావా వేశారు. శ్రీనివాసరావు అలపర్తి మన్రో కౌంటీ సర్క్యూట్ కోర్టులో బోట్ కెప్టెన్, అతని సహాయకుడు, రిసార్ట్ యాజమాన్యంపై 68 పేజీల వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. 2022 మే 30న శ్రీనివాసరావు, ఆయన భార్య సుప్రజ (33), వారి పదేళ్ల కొడుకు, తొమ్మిదేళ్ల మేనల్లుడు ఫ్లోరిడా కీస్లో పారాసైలింగ్‌కు వెళ్లారు. ఈ సమయంలో వాతావరణం ప్రతికూలంగా మారింది. కొన్ని నిమిషాల తర్వాత బోట్ కెప్టెన్ డేనియల్ కౌచ్ పారాసైల్‌ను బోట్‌కి అనుసంధానించే టౌలైన్‌ను కత్తిరించాడు. దీంతో సుప్రజ, ఇద్దరు పిల్లలు రెండు మైళ్ల దూరం గాలిలో తేలుతూ కాంక్రీట్ వంతెనకు తగిలారు. ఈ ప్రమాదంలో సుప్రజ మృతి చెందగా పిల్లలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. బోట్ సిబ్బంది వాతావరణ సూచనను గమనించి, యూఎస్ కోస్ట్ గార్డ్‌కు సమాచారం అందించడంలో విఫలమయ్యారని శ్రీనివాసరావు తన దావాలో ఆరోపించారు. అంతేకాకుండా సిబ్బంది తమకు లైఫ్ జాకెట్లు వంటి తగిన భద్రతా పరికరాలను అందించలేదని, నియంత్రణ కోల్పోయిన తర్వాత పారాసైల్‌ను సరిగ్గా కిందికి తీసుకురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
విదేశాల్లోని భారతీయులకు ఓటు హక్కు!
న్యూఢిల్లీ: విదేశాల్లో నివసించే భారతీయులకు సైతం మన దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించాల్సిన సమయం వచ్చిందని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ చెప్పారు. ఇందుకోసం ఈ–పోస్టల్ బ్యాలెట్ వంటి టెక్నాలజీ ఆధారిత ఆధునిక విధానాలను ఉపయోగించాలని అన్నారు. మన దేశ ఎన్నికల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని హర్షం వ్యక్తం చేశారు. రాజీవ్ కుమార్ శుక్రవారం నిర్వాచన్ సదన్‌లో ‘భారత్–ప్రజాస్వామ్యాలకు మాతృమూర్తి, భారత ఎన్నికల సంఘం పాత్ర’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో 2022 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారుల(ట్రైనీలు)ను ఉద్దేశించి ప్రసంగించారు. ఇటీవలి కాలంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, కుట్రపూరిత ప్రచారం సాగుతున్నాయని అన్నారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులకు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్(ఈటీబీపీఎస్) ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనే ప్రతిపాదించింది. విదేశాల్లోని భారతీయుల్లో 1.15 లక్షల మంది అర్హులైన ఓటర్లు ఉన్నట్లు అంచనా. -
సింగపూర్‌లో తెలంగాణ బలగం అలయ్ బలయ్
సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో ఫ్యామిలీ డేను తెలంగాణ బలగం అలయ్ బలయ్ -2023 పేరిట ఇక్కడి సింగపూర్ పుంగ్గోల్ పార్క్ లో ఆదివారం (జూన్ 4) ఉత్సాహంగా నిర్వహించారు. ఈ ఫ్యామిలీ డేలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుమారు 400 మంది ప్రవాసులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని, ఆటలను భావి తరాలకు అందించడానికి TCSS సభ్యులు వివిధ రకాల భారతీయ సంప్రదాయ ఆటలైన సంచి దుంకుడు, అష్టాచెమ్మ, పచ్చీస్, కచ్చకాయలు, గోళీలాట, తొక్కుడు బిళ్ళ, చార్ పల్లి, కోకో, చిర్రగోనే వంటివి ఆడించి బహుమతులు అందజేశారు. ఈ అలయ్ బలయ్ లో సర్వపిండి, పచ్చి పులుసు, చల్ల చారు, బాగారా మొదలగు నోరూరించే తెలంగాణ వంటకాలను అందరికి రుచి చూపించారు. తెలంగాణ బలగం అలయ్ బలయ్ విజయవంతంగా జరగడానికి సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి TCSS అధ్యక్షుడు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, సదానందం అందె, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు తదితరులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా శశిధర్ రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు, రాధికా రెడ్డి నల్ల, కల్వ లక్ష్మణ్ రాజు, శ్రీకాంత్ కొక్కుల వ్యవహరించారు. కార్యక్రమంలో నాగ భూషణ్ రెడ్డి, రమాదేవి మల్లారెడ్డి, సందీప్. ఎమ్, ముశ్రమ్ మహేష్ తదితరులు తమ ఇంటి రుచులను అందరికీ రుచి చూపించారు. కార్యక్రమ స్పాన్సర్స్ ఏపిజే అభిరామీ జువెల్లర్స్, మై హోమ్ సయుక్, జోయాలుకాస్, ఎస్పీసిస్ నెట్, వైష్ణవి ఇన్ ఫ్, గరంటో ఎకాడమి వారికి సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఆస్ట్రేలియాలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను మెల్బోర్న్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ వింగ్ కన్వీనర్ వినయ్ గౌడ్, ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యులందరూ గత పదేళ్లలో కేసీఆర్ అమలు చేసిన పథకాలను ,అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శించారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పిలుపు మేరకు ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్ర, అడిలైడ్, బ్రిస్బేన్, జీలాంగ్, బల్లారాట్, పెర్త్, గోల్డ్ కోస్ట్, హోబర్ట్, డార్విన్ నగరాలలో పది రోజులు వేడుకలు జరిపి తెలంగాణ కీర్తిని, కేసీఆర్ రాష్ట్రంలో చేస్తున్న సర్వతోముఖాభివృద్ధి గురించి, దేశంలో తెలంగాణను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుపుతున్న తీరును ఎన్ఆర్ఐలందరికీ తెలియజేసేలా ఈ వేడుకలు జరుపుతున్నామని తెలిపారు. ఈ వేడుకలలో సాయిరాం ఉప్పు, విశ్వామిత్ర, సనిల్, సతీష్, ప్రవీణ్, అమిత్ , సురేష్, వినోద్, చైతన్య, సూర్యారావు , విక్రమ్ కందుల, సంజీవ్ రెడ్డి, శణ్ముఖ్, వేణు నాన్న, సాయి గుప్తా, రాకేష్, అరుణ్, నరేందర్, హరి పల్ల, విజయ్, డా.అర్జున్ తదితరులు పాల్గొన్నారు. -
సిలికానాంధ్ర ఆధ్వర్యంలో అన్నమయ్య జయంత్యుత్సవం
కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర వారి డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో శనివారం అన్నమయ్య 615వ జయంత్యుత్సవం వైభవంగా జరిగింది. గోవిందనామ సంకీర్తనలతో మిల్పిటాస్ నగరం మారుమోగింది. ఈ సందర్భగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గాయకులు గరిమెళ్ళ అనీల్ కుమార్, గాయత్రి అవ్వారి, పద్మిని సరిపల్లె, సుధా దూసిల నేతృత్వంలో రమేష్ శ్రీనివాసన్, వారి శిష్య బృందం మృదంగ వాద్య సహకారంతో జరిగిన గోష్టిగానం భక్తులను పరవశింపచేసింది. వీరి గానం సాగుతుండగా చిత్ర కళాకారుడు కూచి సద్యోజాతంగా వేసిన చిత్రం ఆశ్చర్యానందాలను కలిగించింది. అనంతరం సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు చిత్రాకారుడు కూచిని ఘనంగా సన్మానించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో గత 20 సంవత్సారాలుగా అన్నమయ్య ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. ఇక్కడే పుట్టి పెరుగుతున్న పిల్లలకు తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను పరిచయం చేసేందుకు సిలికానాంధ్ర చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. సాయంత్రం జరిగిన సంగీత కచ్చేరిలో వీణ విద్వాంసులు ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ, వారి కుమార్తె పద్మిని పసుమర్తి తమ వీణా నాదాలతో ఆకట్టుకున్నారు. వీరికి కలైమామణి రమేష్ శ్రీనివాసన్ మృదంగ సహకారం అందించారు. తరువాత జయప్రద రామమూర్తి వాయులీన గానంతో అలరించారు. వారికి అనూరాధ శ్రీధర్ వయలిన్, శ్రీరామ్ బ్రహ్మానందం మృదంగ సహకారాన్ని అందించారు. సిలికానాంధ్ర వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి సాంస్కృతిక కార్యవర్గ బృందం కళాకారులను సత్కరించారు. చివరిగా గరిమెళ్ళ అనీల కుమార్ గారి గాత్రంతో స్వామి వారికి పవళింపు సేవ నిర్వహించారు. అనంతరం అందరికీ భోజన ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమం విజయవంతం అవ్వడానికి కృషి చేసిన సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు కందుల సాయి, సంగరాజు దిలీప్, పరిమి శివ, సింహాద్రి కిరణ్, ఉద్దరాజు నరేంద్ర, కార్యకర్తలు వంశీ నాదెళ్ళ, సృజన నాదెళ్ళ, అనిరుధ్ తనుగుల, ప్రియ తనుగుల, కోట్ని శ్రీరాం, జయంతి కోట్ని, శాంతి కొండ, ఉష మాడభూషి, మమత కూచిభొట్ల, విజయసారథి మాడభూషి, యేడిది శర్మలకు కార్యదర్శి వేదాంతం మహతి కృతజ్ఞతలు తెలియజేశారు. -
సింగపూర్ పూరమ్ ఉత్సవాల్లో బతుకమ్మ ఆట
సింగపూర్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేరళ త్రిసూర్ పూరమ్ వార్షిక సాంస్కృతిక ఉత్సవాలు ప్రేరణగా సింగపూర్‌లోని 'గార్డెన్స్ బై ది బే' లోని 'ది మీడోస్' లో ఆదివారం (28 మే) 'సింగపూర్ పూరమ్' పేరిట సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించారు. 2019 నుంచే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ కోవిడ్ నిబంధనల కారణంగా గత రెండు సంవత్సరాలుగా నిర్వహించడం లేదు. కోవిడ్ నిబంధనలు తొలగించిన అనంతరం ఈ ఏడాది వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. సింగపూర్ లో నివసిస్తున్న వివిధ భారతీయ రాష్ట్రాలకు చెందిన వారు తమ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ కళలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) మహిళా విభాగం ఈ అంతర్జాతీయ వేదికపై తెలంగాణ గుండె చప్పుడు బతుకమ్మ ఆట పాటలను ప్రదర్శించారు. ప్రపంచంలో అందరూ పూలతో పూజిస్తే ఆ పూలనే పూజించే తెలంగాణ ప్రత్యేక సంప్రదాయానికి ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. ఈ వేడుకల్లో బతుకమ్మ ప్రదర్శనకు అవకాశం ఇచ్చిన సింగపూర్ పూరమ్ 2023 కార్యవర్గ సభ్యులకు తెలంగాణ కల్చరల్ సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకల్లో బతుకమ్మ ఆటను ప్రదర్శించిన వారిలో సొసైటీ ఉపాధ్యక్షురాలు సునీతా రెడ్డి, మహిళా విభాగ సభ్యులు గడప స్వాతి, బసిక అనితా రెడ్డి, జూలూరి పద్మజ, రాధికా రాణి నల్ల, దీప నల్లా, కాసర్ల వందన, నడికట్ల కళ్యాణి, సృజన వెంగళ, బొందుగుల ఉమా రాణి, సౌజన్య మాదారపు, గర్రెపల్లి కస్తూరి, కల్వ కవిత, రోహిణి గజ్జల, స్వప్న కైలాసపు, కీర్తి ముగ్దసాని, నాగుబండి శ్రీలత, మంచికంటి స్వప్న, బవిరిశెట్టి కృష్ణ చైతన్య, మడిచెట్టి సరిత, సుజాత తరిగొండ, శిల్ప రాజేష్ తదితరులు ఉన్నారు. పూరమ్ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ సాంస్కృతిక పండుగలో పాల్గొని ఈ కొత్త సంప్రదాయాన్ని తోటి ప్రవాస భారతీయులతో పాటు, సింగపూర్ స్థానికులకు పరిచయం చేయడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ సభ్యులను అభినందించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథి సింగపూర్ దేశ ఆర్థిక, జాతీయ అభివృద్ధి శాఖలకు ద్వితీయ మంత్రిగా సేవలందిస్తున్న భారతీయ మూలాలున్న ఇంద్రాణి రాజా పాల్గొని కార్యక్రమ నిర్వాహకులను, కళాకారులను అభినందించారు. -
కేరళలో కాలనీయే ఖాళీ ..!
కొచి: కేరళలోని కొట్టాయం జిల్లా కైపుజా గ్రామంలో ఒక కాలనీలో ఇళ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ కాలనీలో ఉన్న 100కి పైగా ఇళ్లు అమ్మకానికి పెట్టారు. ఇవన్నీ ఎన్నారైలకు చెందిన ఇళ్లే. ఒకప్పుడు ఈ ప్రాంతం నుంచి మెరుగైన జీవితం కోసం ప్రజలు వివిధ దేశాలకు వెళ్లిపోయారు. అక్కడ సంపాదించిన డబ్బులతో తమ ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలతో ఇళ్లు నిర్మించారు. రిటైర్మెంట్ జీవితం ఆ ఇళ్లల్లోనే గడిపారు. వారి తదనంతరం పిల్లలు విదేశాల్లో స్థిరపడడంతో ఆ ఇళ్లన్నీ ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. సకల సౌకర్యాలు ఉన్న ఆ కాలనీ ఒకేసారి ఖాళీ అయిపోయింది. అయితే అక్కడ మంచి సదుపాయాలు ఉండడంతో చాలా మంది ఆ ఇళ్లను కొనడానికి మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ పెరిగింది. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారతీయ టెక్కీ దుర్మరణం
ఫ్లోరిడా: అమెరికాలో సోమవారం (మే 15) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భారతీయ టెక్కీ దుర్మరణం చెందారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని తాంపాలో పాదచారుల క్రాస్ వద్ద రోడ్డు దాటుతున్న మరియప్పన్ సుబ్రమణియన్ (32)ను ఓ కారు రెడ్ సిగ్నల్‌ను జంప్ చేసి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మరియప్పన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. ఆయన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీలో టెస్ట్ లీడ్‌గా పనిచేస్తున్నారు. మరియప్పన్‌కు భార్య, నాలుగేళ్ల కొడుకు ఉన్నారు. వీరు భారత్‌లో ఉంటున్నారు. కాగా మరియప్పన్ ఈ మధ్యనే జాక్సన్విల్లే నుంచి తాంపాకు వచ్చారు. మరియప్పన్ కుటుంబానికి సహాయం అందించేందుకు ‘గో ఫండ్ మీ’ అనే పేజీ ద్వారా ఫండ్ రైజింగ్ చేపట్టారు. అలాగే తాంపా, జాక్సన్విల్లే ప్రాంతాల్లోని కమ్యూనిటీ గ్రూప్ సభ్యులు మరియప్పన్ మృత దేహాన్ని భారత్‌లోని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదీ చదవండి: అమెరికాలో అదృశ్యమైన ఎన్ఆర్ఐ లహరి మృతి -
ఘనంగా ‘మన అమెరికన్ తెలుగు అసొసియేషన్’ ప్రారంభోత్సవం
ఉత్తర అమెరికాలో స్థిరపడ్డ తెలుగు ప్రజల నుంచి మరో అసొసియేషన్ ప్రారంభమయింది. ‘మన అమెరికన్ తెలుగు అసొసియేషన్’ (మాట) పేరుతో న్యూజెర్సీలోని రాయల్ అల్బర్ట్ పాలెస్ వేదికగా లాంచింగ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. అమెరికాలో వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన 2500 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. 2 వేల మంది లైఫ్ మెంబర్లతో 20 నగరాల్లో చాప్టర్లను ప్రకటించారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను సంరక్షించడం, అమెరికాలో ఉంటోన్న తెలుగు వారికి అండగా నిలవడం, మహిళా సాధికారతతో పాటు యువతను ప్రోత్సహించడం, సీనియర్ సిటిజన్లకు మరింత మెరుగైన సంరక్షణను అందించడం లక్ష్యంగా మన అమెరికన్ తెలుగు అసొసియేషన్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మాట కోర్ టీంలో శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, శ్రీ అట్లూరి, శ్రీధర్ చిల్లర, దాము గెడల, స్వాతి అట్లూరి, జితేందర్ రెడ్డి, స్టాన్లీ రెడ్డి, పవన్ దర్శి, ప్రసాద్ కూనిశెట్టి, శేఖర్ వెంపరాల, హరి ఇప్పనపల్లి, గంగాధర్ ఉప్పల, కిరణ్ దుగ్గడి, విజయ్ భాస్కర్ కలాల్ తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో మాట ఫౌండర్లయిన శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల సంస్థ లక్ష్యాలను వివరించారు. అలాగే యూత్ టీంకు సంబంధించిన విజన్‌ను లక్ష్మీ మోపర్తి తెలియజేశారు. వడ్డేపల్లి కృష్ణ రాసిన ‘మాట’ స్వాగత గీతాన్ని స్వాతి అట్లూరి నేతృత్వంలోని బృందం ప్రదర్శించగా, పార్థసారథి మ్యూజిక్ అందించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ సునీత, అనిరుధ్ తమ సంగీతంతో ఆహుతులను అలరించారు. -
యూఏఈ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజాన్ నిత్యావసర సరుకుల పంపిణీ
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని దుబాయ్ లోని సోనాపూర్ లేబర్ క్యాంపులో ఆదివారం (ఏప్రిల్ 16) అక్కడి కార్మికులకు తెలుగు అసోసియేషన్ వారు (tauae.org) నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బియ్యం, పప్పు దినుసులు, నూనె, పండ్లు తదితర నిత్యావసర సరుకులతో కూడిన కిట్స్ అందజేశారు. తెలుగు అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ సహాయ కార్యక్రమం పట్ల కార్మికులు ఆనందాన్ని వ్యక్తపరుస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మున్ముందు కూడా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు అసోసియేషన్ తరఫున కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్లు రవి ఉట్నూరి, సాయి ప్రకాష్ సుంకు సంయుక్త ఆధ్వర్యంలో విజయ భాస్కర్, భీం శంకర్, శరత్ చంద్ర, శ్రీమతి ఉషాదేవి, శ్రీమతి లతానగేష్ కీలక బాధ్యతలు నిర్వహించారు. తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు దినేష్ కుమార్ ఉగ్గిన, ఉపాధ్యక్షుడు మసిఉద్దీన్, ప్రధాన కార్యదర్శి వివేకానంద బలుసా, వెల్ఫేర్ డైరెక్టర్ శ్రీనివాసరావు యండూరి, మార్కెటింగ్ డైరెక్టర్ అంబేడ్కర్, లీగల్ డైరెక్టర్ శ్రీధర్ దామర్ల, ఫహీమ్, మోహన కృష్ణ, సీహెచ్ శ్రీనివాస్, చైతన్య తదితరులు కార్యక్రమానికి హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఎన్నారైలు విదేశాల్లోనే ఓటు వేయొచ్చు.. వారి కోసం ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్
ప్రవాస భారతీయ (ఎన్నారై) ఓటర్ల కోసం ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీబీపీఎస్)ను అమలు చేసే ప్రతిపాదన పరిశీలనలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు సమాధానమిస్తూ.. 1 జనవరి 2023 నాటికి ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 20A ప్రకారం విదేశాల్లో నివసిస్తున్న 1,15,696 మంది భారతీయ పౌరులు భారతీయ ఓటర్ల జాబితాలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఎన్నారై ఓటర్ల కోసం ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేయడానికి ఎన్నికల ప్రవర్తన నియమాలు 1961ను సవరించే ప్రతిపాదనను భారత ఎన్నికల సంఘం చేపట్టిందని న్యాయ మంత్రి కిరణ్ రిజీజు తెలిపారు. ప్రతిపాదన అమలులో ఉన్న లాజిస్టికల్ సవాళ్లను పరిష్కరించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఈ విషయం చర్చిస్తున్నట్లు చెప్పారు. విదేశీ ఓటర్లు వ్యక్తిగతంగా లేదా ప్రాక్సీ (నామినేటెడ్ ఓటరు) ద్వారా ఓటు వేయడానికి వీలుగా ప్రజాప్రాతినిధ్య (సవరణ) బిల్లు, 2018 పేరుతో భారత ఎన్నికల సంఘం సిఫార్సు చేసిన బిల్లును ఆగస్టు 9, 2018న లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదించినట్లు న్యాయ మంత్రి తెలిపారు. అయితే 16వ లోక్‌సభ రద్దు కారణంగా ఈ బిల్లు కూడా రద్దయిందని పేర్కొన్నారు. -
బైడెన్ సలహా కమిటీలో ఇద్దరు భారతీయ అమెరికన్లు
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇద్దరు భారతీయ అమెరికన్లను తమ వాణిజ్య విధానం, చర్చల సలహా కమిటీలో నియమించారు. వారిలో ఒకరు ఫ్లెక్స్ సీఈవో రేవతి అద్వైతి, మరొకరు నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ సీఈవో మనీష్ బాప్నా. ప్రెసిడెంట్ నియమించిన యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ సిఫార్సు చేసినవారు 45 మంది వరకు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వాణిజ్యం, పెట్టుబడి, అభివృద్ధి అంశాలలో నైపుణ్యం కలిగి వారు, ఫెడరల్ ప్రభుత్వాలకు సంబంధం లేని కార్మిక, పరిశ్రమ, వ్యవసాయం, స్మాల్ బిజినెస్, సేవల ప్రతినిధులను ఇందులో సభ్యులుగా నియమిస్తారు. పరిశ్రమలు, రిటైలర్లు, ప్రభుత్వేతర పర్యావరణ, పరిరక్షణ సంస్థలు, వినియోగదారుల సంస్థలకు కూడా ఈ కమిటీలో భాగస్వామ్యం ఉంటుంది. వరుసగా నాలుగు సార్లు పవర్ఫుల్ బిజినెస్ వుమెన్ ఫ్లెక్స్ సీఈవో రేవతి అద్వైతి 2019లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కంపెనీ వ్యూహాత్మక దిశను రూపొందించి తయారీ రంగంలో కొత్త శకాన్ని నిర్వచిస్తున్నారని వైట్ హౌస్ పేర్కొంది. ఫ్లెక్స్‌కు ముందు అద్వైతి ఈటన్ కంపెనీ ఎలక్ట్రికల్ సెక్టార్ వ్యాపారానికి ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా చేశారు. అమెరికాస్, హనీవెల్‌లో కూడా పని చేసిన ఆమె ఉబెర్, కేటలిస్ట్ కంపెనీల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా సేవలందించారు. అద్వైతి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ సీఈవో కమ్యూనిటీకి ఉపాధ్యక్షత వహిస్తున్నారు, సీఈవో క్లైమేట్ లీడర్స్ డబ్ల్యూఈఎఫ్ అలయన్స్‌లో చేరారు. రేవతి వరుసగా నాలుగు సార్లు ఫార్చ్యూన్ అత్యంత శక్తివంతమైన వ్యాపార జాబితాలో చోటు దక్కించుకున్నారు. అలాగే భారత్‌లోని బిజినెస్ టుడే సంస్థ ప్రకటించిన అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా ఎంపికయ్యారు. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన ఆమె థండర్బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. పర్యావరణ రంగంలో విశేష అనుభవం దాదాపు అర్ధ శతాబ్ద కాలంగా అనేక ముఖ్యమైన పర్యావరణ మైలురాళ్లు, పర్యావరణ చట్టాల రూపకల్పన వెనుక మనీష్ బాప్నా ప్రెసిడెంట్, సీఈవోగా ఉన్న నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ (ఎన్ఆర్డీసీ) ఉందని వైట్ హౌస్ తెలిపింది. మనీష్ బాప్నా 25 ఏళ్ల అనుభవంలో పేదరికం, వాతావరణ మార్పుల మూలాలను కనుగొనేందుకు విశేష కృషి చేశారు. ఆయన వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆర్థికవేత్త కూడా అయిన మనీష్ బాప్నా బ్యాంక్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో న్యాయవాద వృత్తిని కొనసాగించే ముందు మెకిన్సే అండ్ కంపెనీ, ప్రపంచ బ్యాంక్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి బిజినెస్‌తో పాటు పొలిటికల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఆయన మాస్టర్ డిగ్రీలు పొందారు. అంతకుముందు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. -
మరింత తొందరగా అమెరికన్ వీసా.. భారతీయులకు అధిక ప్రాధాన్యత!
వీసాల జారీలో భారతీయులకు అమెరికా ప్రథమ ప్రాధాన్యత ఇస్తోంది. కోవిడ్‌కు ముందు కంటే ఈ ఏడాది ఇప్పటి వరకు 36 శాతం అధికంగా భారతీయులకు వీసాలు జారీ చేసినట్లు అమెరికా తెలిపింది. కోవిడ్ తర్వాత భారతీయులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడంతో వారికి వీసాల కోసం వేచిచూసే సమయం చాలా తగ్గిపోయిందని పేర్కొంది. ముఖ్యంగా మొదటిసారి వచ్చే వారికి వీసా కోసం వేచిచూసే సమయం 1000 రోజుల నుంచి 580 రోజులకు తగ్గిపోయింది. తరచూ వచ్చే వారికి ఇంటర్వ్యూ ప్రక్రియను మినిహాయించడం, కాన్సులర్ విధుల్లో అదనపు సిబ్బందిని నియమించడం, సూపర్ సాటర్డే వంటి చర్యలు ఇందుకు మేలు చేశాయి. అంతేకాకుండా వచ్చే వేసవి నుంచి కొన్ని కేటగిరీల్లో స్టేట్‌సైడ్ వీసాల రెన్యూవల్‌ను పైలట్ విధానంలో అమలు చేయనున్నట్లు అమెరికా పేర్కొంది. వీసాల జారీలో భారత్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు అమెరికా కాన్సులర్ ఆపరేషన్స్ విభాగం సీనియర్ అధికారి జూలీ స్టఫ్ తెలిపారు. వీసాల జారీలో జాప్యంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ పరిస్థితిని మార్చడానికి తాము పట్టుదలతో పనిచేస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా చేపట్టిన పలు చర్యలతో కోవిడ్‌కు ముందు కంటే ఇప్పుడు 36 శాతం ఎక్కువగా వీసాలను జారీ చేసినట్లు చెప్పారు. ఇది ఇంకా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్ కాలంలో అమెరికా ప్రపంచవ్యాప్తంగా తమ కాన్సులర్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయడంతో వీసాల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో భారత్‌లో అధిక సంఖ్యలో వీసా దరఖాస్తులు పేరుకుపోయాయి. టూరిస్టులకు ఇచ్చే బీ1, బీ2 వీసాలతో పాటు హెచ్1బీ, ఎల్ వర్క్ వీసాలు నిలిచిపోయాయి. గత సెప్టెంబర్‌లో జరిగిన ద్వైపాక్షిక విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. వీసాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండటాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. (ఇదీ చదవండి: వాట్సాప్ యూజర్లను తెగ విసిగిస్తున్న కాల్స్, మెసేజ్‌లు!) -
డల్లాస్‌లో గాంధీ స్మారకాన్ని సందర్శించిన డా.సతీష్ రెడ్డి
డల్లాస్: భారత రక్షణశాఖ శాస్త్రీయ సలహాదారు, ఇస్రో మాజీ ఛైర్మన్ డా.సతీష్ రెడ్డి.. అమెరికా డల్లాస్‌లోని మహాత్మా గాంధీ స్మారకాన్ని సందర్శించారు. బాపూ విగ్రహానికి పుష్పగుచ్చం సమర్పించి నివాళులు అర్పించారు. సతీష్ రెడ్డికి గాంధీ మెమోరియల్ సెక్రెటరీ కల్వల రావు స్వాగతం పలికారు. డా.ప్రసాద్ తోటకూర స్ఫూర్తితోనే గాంధీ స్మారకాన్ని నిర్మించినట్లు అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. ఏటా నిర్వహించే కార్యక్రమాల్లో చాలా మంది పాల్గొంటున్నట్లు చెప్పారు. డా.సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర పోరాటంలో మహాత్ముని పాత్ర ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. ప్రపంచ దేశాల నాయకులు ఆయన నుంచి ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు అజయ్ కలవల, రంగారావు, గోపి చిలకూరి, ప్రవీణ్ రెడ్డి, బీమ పెంట, జీవీఎస్ రామకృష్ణ, కృష్ణారెడ్డి కోడూరు, శరత్ రెడ్డి యర్రం, శ్రీకాంత్ పోలవరపు, ఇతరులు పాల్గొన్నారు. చదవండి: టర్కీ భూకంపం లైవ్ వీడియో.. పేకమేడలా కూలిన భవనాలు.. భయానక దృశ్యాలు.. -
ఫోను నుంచే ‘ఫారిన్’ మనీ.. ఇక విదేశాల నుంచి కూడా డిజిటల్ చెల్లింపులు
డిజిటల్ చెల్లింపులు చేయాలంటే.. విదేశాల నుంచి డిజిటల్ చెల్లింపులు చేయాలనుకునే ఎన్నారైలకు భారత్‌లో ఏదైనా బ్యాంకులో నాన్ రెసిడెంట్ ఎక్స్టెర్నల్ (ఎన్ఆర్ఈ) అకౌంట్ లేదా నాన్ రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్వో) అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్ల నుంచి యూపీఐ ద్వారా డబ్బులు పంపించవచ్చు. ఈ–కామర్స్ పోర్టళ్లకూ చెల్లింపులు చేయొచ్చు. సాక్షి, అమరావతి: ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) భారత్‌లోని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు డబ్బులు పంపించడం ఇక సులువు కానుంది. విదేశాల నుంచి కూడా చేతిలో ఉన్న సెల్‌ఫోన్ నుంచే డిజిటల్ (యూపీఐ) చెల్లింపుల ద్వారా నిధులు పంపొచ్చు. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, భారత్ పే తదితర యూపీఐ పేమెంట్ మాధ్యమాల ద్వారా క్షణాల్లో డబ్బులు పంపొచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ 30 నుంచి డిజిటల్ చెల్లింపులను అనుమతిస్తారు. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విధి విధానాలను ఖరారు చేసింది. ఈ తాజా విధాన నిర్ణయం 1.35 కోట్ల మంది ఎన్నారైలకు సౌలభ్యంగా మారనుంది. తొలి దశలో 10 దేశాలకు అనుమతి తొలి దశలో ఎన్నారైలు అధికంగా ఉన్న 10 దేశాల నుంచి చెల్లింపులకు ఎన్పీసీఐ అనుమతి మంజూరు చేసింది. అమెరికా, బ్రిటన్, యూఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంగ్‌కాంగ్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా నుంచి డిజిటల్ చెల్లింపులు చేయొచ్చు. విదేశాల నుంచి యూపీఐ చెల్లింపుల కోసం ఎన్పీసీఐ 2020లోనే ప్రత్యేకంగా ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ అనే అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. విదేశాల్లోని డిజిటల్ పేమెంట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఇప్పటికే నేపాల్, యూఏఈ, యూకే, ఫ్రాన్స్‌లలోని సంస్థలు భారతీయ యూపీఏ చెల్లింపులను అనుమతించేలా ఒప్పందాలు చేసుకుంది. మన యూపీఐని సింగపూర్ పేనౌ సంస్థతో అనుసంధానించేందుకు సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పుడు నేరుగా భారతీయ బ్యాంకు ఖాతాల ద్వారానే చెల్లింపులకు అనుమతించింది. ప్రస్తుతం నగదు బదిలీకి 48 గంటలు ప్రస్తుతం ఎన్నారైలు భారత్‌లోని బంధువులకు అక్కడి బ్యాంకు ఖాతా నుంచి భారత్‌లోని బ్యాంకు ఖాతాకు నగదు పంపిస్తున్నారు. దీన్ని వైర్ ట్రాన్స్ఫర్ అంటారు. ఈ విధానంలో నగదు బదిలీకి 48 గంటల సమయం పడుతుంది. ఇక వెస్ట్రన్ యూనియన్, యూఏఈ ఎక్సే్ఛంజ్ వంటి మనీ ట్రాన్స్ఫర్ కంపెనీల ద్వారా పంపాలంటే విదేశాల్లోని మనీ ట్రాన్స్ఫర్ కంపెనీ ఆఫీసుకు వెళ్లి ఆ దేశం కరెన్సీని చెల్లించాలి. ఆ రోజుకు మనీ ట్రాన్స్ఫర్ కంపెనీ నిర్దేశించిన మారక విలువనుబట్టి భారత్‌లో ఉన్న వారికి భారత కరెన్సీలో నగదు చెల్లిస్తారు. ఇవి కాకుండా మరికొన్ని ఆన్లైన్ చెల్లింపు కంపెనీలు కూడా ఉన్నాయి. ఇవి డబ్బులు పంపేవారు, పొందేవారు ఇద్దరి నుంచి ఎక్కువ మొత్తంలో సర్వీస్ చార్జి వసూలు చేస్తాయి. మనీ లాండరింగ్‌కు అవకాశం లేకుండా.. విదేశాల నుంచి డిజిటల్ చెల్లింపులపై భారత్‌లోని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఫారిన్ ఎక్సే్చంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)కు కట్టుబడిన బ్యాంకు అకౌంట్లకే డిజిటల్ చెల్లింపులకు అనుమతించాలని స్పష్టం చేసింది. డబ్బులు చెల్లించే ఖాతా ఉన్న బ్యాంకు, డబ్బులు తీసుకునే ఖాతా ఉన్న బ్యాంకు కచ్చితంగా విదేశాల నుంచి డిజిటల్ చెల్లింపు లావాదేవీలు దేశంలోని మనీ లాండరింగ్ నిరోధక చట్టానికి అనుగుణంగా ఉన్నాయనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఆర్థిక ఉగ్రవాద నిరోధక చట్టాన్ని కూడా కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. డిజిటల్ చెల్లింపులకు మరింత ఊపు.. ఎన్పీసీఐ తాజా నిర్ణయంతో దేశీయ బ్యాంకుల ద్వారా డిజిటల్ పేమెంట్లు మరింతగా పెరగనున్నాయి. దేశంలో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. కానీ 2016లో పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) తరువాత నుంచి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తోంది. అప్పటి నుంచి ఇవి భారీగా పెరిగాయి. 2000లో దేశంలో రూ.4.2 లక్షల కోట్ల డిజిటల్ చెల్లింపులు జరగ్గా, 2022లో ఏకంగా రూ.12.8 లక్షల కోట్ల చెల్లింపులు జరగడం విశేషం. విదేశాల నుంచి కూడా డిజిటల్ చెల్లింపులు మొదలైతే వీటి పరిమాణం మరింతగా పెరుగుతుంది. విదేశాల నుంచి నిధుల్లో భారత్‌దే అగ్రస్థానం విదేశాల్లో ఉన్న వారి నుంచి స్వదేశానికి వస్తున్న నిధుల్లో ప్రపంచంలో భారత్‌దే మొదటిస్థానం. 2021లో ఎన్నారైలు భారత్‌లో ఉన్న కుటుంబ సభ్యులకు రూ.7.15 లక్షల కోట్లు పంపించగా.. 2022లో రూ.8 లక్షల కోట్లు పంపించారు. అందులో 25 శాతం గల్ఫ్ దేశాల నుంచి, 20 శాతం అమెరికా నుంచి వచ్చాయి. డిజిటల్ చెల్లింపులకు అనుమతించడంతో ఈ నిధుల వరద మరింతగా పెరగనుంది. -
వొరే సీనయ్యా, యాడికి బోతుండవా?; అమెరికాలో నెల్లూరోళ్ల కబుర్లు
అబ్బయ్యా నువ్వేందిరా జెప్పేది? ఆనేక వస్తానని జెప్పి మద్దినాల దాక మంచం దిగలా? వొరే సీనయ్యా, యాడికి బోతుండవా? బిన్నా రారా శానా పనుంది. ఆయమ్మి ఈరోజుగూడా పప్పుల్సు జేసిందా? పిల్లకాయల్ని అల్లాడిస్తుందిరా రోజూ అదే కూర బెట్టి. సరేగాని పెద్దబ్బయ్య రాధా మహల్ దగ్గర దోసె కని బొయ్యి ఇంకా రాలేదే. అందరం మూడాళ్ళలో కొత్త సిల్మా వచ్చుళ్ళా, బొయ్యి జూడాల. అదేన్దిరా ఆ మిడిమేళమా? బైకు దోలేది నువ్వోక్కడివేనా? ఈ ఎచ్చులుకు బోతే ప్రమాదం అబ్బయ్యో. నువ్వు కిండలు బడకుండా చెప్పిన మాట విను. రేపట్నించి రిక్షాలో బోరా. ఒరేయ్! చిన్నబ్బయ్యా. నువ్వింకా ఐస్కూల్లోనేరా సదివేది. అప్పుడే ఇంత తుత్తర ఎందుకురా? అయ్యేరమ్మ కూతురితో నువ్వేందిరా జేసింది? ఎం బాగాలే. మీ నాయనకు జాబు రాస్తా రేపు. ఒక తూరి ఈడకు నాయనోస్తే నీకుంటయ్. జాగర్త!నీపాసుగాలా, ఏందిరా ఇంత పిసినారోడీవే. నడిపోడు కష్టాల్లో ఉళ్ళా. రొవంత అప్పు ఇస్తే నీ సొమ్ము ఏమ్బోయిన్దిరా!. ఈ పై మాటలు వింటుంటే మీకేమని పిస్తుంది?. నెల్లూరు భాష, యాసతో నెల్లూరోళ్ళ మధ్యలో నెల్లూరులో ఉన్నట్లు లేదూ?. అదే జరిగింది. నెల్లూరోళ్ళ మధ్యే కాని నెల్లూరులో కాదు. పదివేల మైళ్ళ దూరంలో ఉన్న అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలోని డాలస్ మహానగరంలో నెల్లూరుకు చెందిన దాదాపు వందమంది ప్రవాసీయులు సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన అపూర్వ ఆత్మీయ సమ్మేళనం. నెల్లూరీయుడు క్రష్ణారెడ్డి ఉప్పలపాటి చొరవదీసుకొని ఫ్రిస్కోలో ఉన్న “శుభం ఇవంట్ సెంటర్”లో శుక్రవారం సాయంత్రం ఈ మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహించారు. డాలస్ మహానగర పరిసరాలలో పది, ఇరవై, ముప్పై ఏళ్లకు పైగా స్థిరపడ్డ నెల్లూరుకు సంబందించిన అనేక రంగాల ప్రముఖులు, నాయకులు, సేవకులు ఒక చోట చేరారు. ఎన్నాళ్లగానో తమ మదిలో దాచుకొన్న నెల్లూరు ప్రేమను ప్రతి ఒక్కరూ మిగతా వాళ్ళతో పంచుకోవడం విశేషం. ముఖ్యంగా విద్య, కుటుంబ నేపద్యం, ప్రస్తుతం చేస్తున్న వృత్తి, ప్రవృత్తుల సమాహారాన్ని ప్రతి ఒక్కరూ వినిపించారు. అవకాశమిస్తే ప్రతి ఒక్కరూ గంటల తరబడి నెల్లూరుకు సంబంధించిన అనుభూతులను పంచుకునేలా అనిపించింది. అలనాటి నెల్లూరు చేపల పులుసు, కమ్మరకట్లు, బాబు ఐస్‌క్రీం, రాధామాధవ్ కారం దోస, గాంధీబొమ్మ చెరుకు రసం, నెల్లూరు సుగంధపాలు, కోమల, వెంకటరమణ, మురళీకృష్ణ రుచులు, నెల్లూరు కోచింగ్ సెంటర్ అనుభవాలు, సినిమాలు, తదితర అపురూపమైన విశేషాలను పంచుకున్నారు. పెళ్ళిళ్లలో నెల్లూరోళ్ల ఆలోచనలు,హైస్కూలు, కాలేజి అనుభావాలకు సంబంధించిన అనేక అంశాలు అందరినీ ఆకట్టుకొన్నాయి. మెత్తని నూలును తయారు చెయ్యడంలో ప్రసిద్ధి చెందిన నెల్లూరును ‘మాంచెస్టర్ ఆఫ్ ఇండియా’ అనే వారని గుర్తుచేశారు. నిర్వాహకులు విందుభోజనం వడ్డించినప్పటికీ, నెల్లూరు కబుర్లతో సగం కడుపు నిండింది అనే చెప్పాలి. అందరూ ఒకరిని ఒకరు వీడ్కోలు పలుకులతోప్రతి సంవత్సరం మూడు లేదా నాలుగు సార్లు కార్యక్రమాలు కావాలని విచ్చేసిన నేల్లూరీయులు కోరడంతో ఆత్మీయ సమ్మేళనానికి తేరపడింది. (క్లిక్ చేయండి: ఉపేంద్ర చివుకుల ప్రజాసేవకు గుర్తింపు) -
Pravasi Bharatiya Divas: రవి అస్తమించని ప్రవాస భారతీయం
ప్రపంచ నలుమూలలా భారతీయులు నివసిస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 210 దేశాలలో భారతీయ మూలాలున్న వారు, ఎన్నారైలు కలిపి 3.2 కోట్లకు పైగానే ఉన్నారు. ప్రవాస భారతీయ జనాభా కంటే తక్కువ జనాభా కలిగిన దేశాలు 150 పైనే ఉన్నాయి. నేడు అనేక దేశాల్లో రాజకీయంగా కూడా భారతీయులు కీలక పదవుల్లో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవిని కమలా హారిస్ అలంకరించిన సంగతి తెలిసిందే. అలాగే హైదరాబాద్‌లో జన్మించిన తెలుగింటి బిడ్డ అరుణ మిల్లర్ (కాట్రగడ్డ అరుణ) మేరీలాండ్ రాష్ట్రానికి గత నవంబర్‌లో లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వివిధ దేశాల్లో భారతీయ మూలాలున్న వ్యక్తులు వివిధ దేశాలకు అధినేతలుగా వ్యవహరిస్తున్నారు. రిషి సునాక్ (బ్రిటన్ ప్రధాని), అంటో నియ కోస్టా (పోర్చుగల్ ప్రధాని), మహ్మద్ ఇర్ఫాన్ అలీ (గయానా ప్రెసిడెంట్), పృథ్వీరాజ్ రూపన్ (మారిషస్ అధ్యక్షులు), చంద్రిక పెర్సద్ శాన్ టోఖి (సురినామ్ ప్రెసిడెంట్) లతోపాటు 200 మందికి పైగా భారతీయులు 15 దేశాల్లో వివిధ హోదాల్లో ప్రజాసేవలో ఉన్నారు. వీరంతా అమెరికా, యూకే, కెనడా, గయానా, సురినామ్, ఫిజీ, ట్రినిడాడ్ అండ్ టుబాగో, సింగపూర్, మారిషస్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, మలేసియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో పనిచేస్తున్నారు. వీరు కాకుండా వివిధ దేశాల్లో, కేంద్ర, రాష్ట్ర చట్టసభల్లో సభ్యులుగా ఉన్నవారు చాలామందే ఉన్నారు. గతంలో సింగపూర్ ప్రెసిడెంట్‌గా ఉన్నఎస్.ఆర్.నాథన్ (1999–2011), దేవన్ నాయర్ (1981 –1985)లు, ఫిజీ ప్రధానిగా పనిచేసిన మహేంద్ర చౌదరి, మలేసియా ప్రధానిగా పని చేసిన మహతీర్ బిన్ మహ్మద్ వంటి వారు భారతీయ మూలాలున్నవారే. ప్రపంచంలోని అగ్రస్థానాల్లో ఉన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ, ఈ మధ్య వరకు ట్విట్టర్ సీఈఓగా కొనసాగిన పరాగ్ అగర్వాల్, పెప్సికోలా ఒకప్పటి సీఈఓ ఇంద్రనూయి వంటి వారెందరో భారతీయ మూలలున్నవారే. నేడు ప్రపంచంలో వివిధ దేశాల్లో ప్రముఖపాత్ర వహిస్తున్న ప్రవాస భారతీయులు బ్రిటిష్ రాజ్ కాలంలో, తదనంతరం విదేశాలకు వెళ్ళినవారే. ముఖ్యంగా వ్యవసాయం పనుల కోసం వెళ్ళిన భారతీయులు అక్కడ స్థిరపడ్డారు. మారిషస్, గయానా, ట్రినిడాడ్ అండ్ టుబాగో, కెనడా, దక్షిణాఫ్రికా మలేసియా, ఫిజీ వంటి కామన్వెల్త్ దేశాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నవారు వీరే! స్వాతంత్య్రానంతరం ప్రపంచ కలల దేశమైన అమెరికాకు భారతీయ వలసలు ప్రారంభమై, నేడు సుమారు 45 లక్షల మంది ఆ గడ్డపై తమవంతు పాత్ర నిర్వహిస్తున్నారు. 10 దేశాల్లో భారతీయుల జనాభా 10 లక్షలు దాటితే మరో 22 దేశాల్లో లక్షకు పైగా వున్నారు. డర్బన్ నగరాన్ని మినీ ఇండియాగా అభివర్ణిస్తారంటే ఆ నగరంలో భారతీయుల హవాని అర్థం చేసుకోవచ్చు. ప్రతీ ఏడు 25 లక్షల భారతీయులు విదేశాలకు వలస వెళ్తున్నారు. భారతీయ వలసల్లో ఇదే పంథా కొనసాగితే ఈ శతాబ్దం అంతానికి భారతీయ పరిమళాలు ధరణి అంతా మరింత వ్యాపించి రవి అస్తమించని ‘భారతీయం’ సాక్షాత్కరిస్తుంది. (క్లిక్ చేయండి: నా జీవితంలో మర్చిపోలేని భయానక ఘటన అది..! - కోరాడ శ్రీనివాసరావు ప్రభుత్వాధికారి, ఏపీ (జనవరి 8–10 ప్రవాసీ భారతీయ దివస్ ఉత్సవాల సందర్భంగా) -
టీడీపీలో ప్రవాస వేదన
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ప్రవాస వేదన మొదలైంది. ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్న నేతలను కాదని, డబ్బు సంచులతో విమానం దిగుతున్న ప్రవాసాంధ్రుల(ఎన్ఆర్ఐ)కు పార్టీ అధినేత చంద్రబాబు పెద్దపీట వేయడం ఆ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. పార్టీ అధికారం కోల్పోయిన అనంతరం మూడున్నరేళ్లుగా పలువురు నాయకులు అన్నీ తామై సొంత డబ్బులు ఖర్చు చేసుకుని మరీ పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ పదవులు అనుభవించిన నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ప్రజా ప్రతినిధులు పలు చోట్ల మూడున్నరేళ్లుగా పత్తాలేకుండా పోయారు. \ అయినా సరే పార్టీనే నమ్ముకొని పనిచేసిన నాయకులు 2024 ఎన్నికల్లో పార్టీ టికెట్లపై ఆశలు పెంచుకున్నారు. ఎన్నికలు మరో ఏడాదిన్నరలో వస్తున్నాయనగా ఎన్ఆర్ఐలు డబ్బు సంచులతో హఠాత్తుగా ఊడిపడ్డారు. ఇది స్థానిక నాయకులకు మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో స్థానిక నేతలు, ఎన్ఆర్ఐల మధ్య విభేదాలు తీవ్రతరం అవుతున్నాయి. పార్టీని నమ్ముకున్న స్థానిక నేతలు అందుబాటులో ఉన్న కార్యకర్తలతో కలిసి పనిచేస్తున్నారు. విమానం దిగిన ఎన్ఆర్ఐలు మాత్రం నేరుగా కరకట్టలో చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆధిపత్యం చెలాయిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్ అంటూ వారు ప్రచారం చేసుకుంటున్నారు. స్థానిక నాయకులకు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ వ్యవహారం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. పలు చోట్ల ఎన్ఆర్ఐ చిచ్చు తిరువూరు నియోజకవర్గంలో సైతం మాజీ ఎమ్మెల్యేను కాదని, ఓ ఎన్ఆర్ఐని టీడీపీ ఇన్చార్జిగా నియమించడాన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గన్నవరంలో టీడీపీ ఇన్చార్జిగా బచ్చుల అర్జునుడును నియమించినప్పటికీ, వచ్చే ఎన్నికల్లో అతనికి టికెట్ ఇవ్వకుండా, ఎన్ఆర్ఐల కోసం వెదుకుతున్నారని, నియోజకవర్గ పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది. ఇప్పటికే గ్రూపు తగాదాలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ట పూర్తిగా దిగజారింది. తాజాగా ఉన్న గ్రూపులను కాదని, టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఎన్ఆర్ఐల కోసం వెదుకులాట ప్రారంభించడం హాట్ టాపిక్‌గా మారింది. పెనమలూరులో కూడా గ్రూపు తగాదాలను సాకుగా చూపి, ఎన్ఆర్ఐ ప్రయోగం చేసే దిశగా అధిష్టానం పావులు కదుపుతోందని ఆ పార్టీ వర్గాలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి. కంట్లో నలుసుగా.. విజయవాడ ఎంపీ కేశినేని నానిని కాదని, ఎన్ఆర్ఐ అయిన ఆయన తమ్ముడి చిన్నిని పార్టీ అధిష్టానం ప్రోత్సహించడాన్ని సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. చిన్ని ప్రస్తుతం అన్నా క్యాంటీన్లు, కిస్మస్ కానుకల పేరుతో హడావుడి చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో గ్రూపులు కడుతున్నారు. ఆయన విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో పార్టీకి కంట్లో నలుసుగా మారారనే భావన టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే వరుస పరాజయాలను మూట కట్టుకున్న టీడీపీ పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లాలో రోజు రోజుకు మరింత దిగజారుతోందన్న భావన సొంత పార్టీలోనే వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులుగా ఎన్ఆర్ఐలను తెచ్చే ప్రయత్నాలు పార్టీ పరిస్థితిని మరింతగా దిగజార్చడం తప్ప ఉపయోగం ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన వారిని కాదని, ఎన్ఆర్ఐలకు ప్రాధాన్యం ఇవ్వడం చంద్రబాబు నైజాన్ని మరోసారి గుర్తు చేస్తోందని పార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. గుడివాడలో రావికి సెగ గుడివాడ నియోజకవర్గంలో వరుస పరాజయాలు ఇప్పటికే టీడీపీ క్యాడర్‌ను కుంగదీశాయి. ఓటమి పాలైనా కష్ట కాలంలో పార్టీకి అండగా నిలిచిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావుకు 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా, ఎసరు పెట్టే కార్యక్రమానికి అధినేత చంద్రబాబు శ్రీకారం చుట్టినట్లు చర్చ సాగుతోంది. దీనిని బలపరిచేలా గుడివాడలో ఓ ఎన్ఆర్ఐ క్రిస్మస్ కానుకలు పంచి, ఫౌండేషన్ ట్రస్టు ఏర్పాటు చేసి హడావుడి చేస్తున్నారు. చంద్రబాబు తనకే సీటు ఇస్తానని చెప్పారని, నియోజకవర్గంలో పనిచేసుకోవాలని సూచించారని రావి వెంకటేశ్వరావు చెబుతూ తన ఉనికి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు ఎన్ఆర్ఐ కూడా పార్టీ టికెట్ తనదేనని, చినబాబు సైతం హామీ ఇచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసేది తానేనని అంతర్గతంగా సన్నిహితుల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ గ్రూపు తగాదాలతో టీడీపీ పరిస్థితి పూర్తిగా దిగజారింది. కష్ట కాలంలో పార్టీ జెండా మోసిన వారిని కాదని, తాజాగా వచ్చిన ఎన్ఆర్ఐకి పార్టీ అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. -
లగ్జరీ విల్లాలకు ఊపు: ఎన్ఆర్ఐ, బడాబాబులే తోపు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి తర్వాత విల్లాలకు ఊపొచ్చింది. సామాన్య, మధ్యతరగతితో పోలిస్తే కరోనా మహమ్మారి లగ్జరీ గృహ కొనుగోలుదారుల మీద పెద్దగా ప్రభావం చూపించలేదు. ఫలితంగా ఈ విభాగం గృహ విక్రయాలలో వృద్ధి నమోదవుతుంది. ఎక్స్ఛేంజ్ రేటు తక్కువగా ఉండటం మూలంగా ప్రవాసులు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ) లగ్జరీ గృహాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు డెవలపర్లు అందించే డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా ఆయా వర్గాల కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ♦ ఈ ఏడాది తొలి ఆర్ధ సంవత్సరంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 1.84 లక్షల గృహాలు విక్రయం కాగా.. ఇందులో 14 శాతం అంటే 25,680 ఇళ్లు లగ్జరీ గృహాలే అమ్ముడుపోయాయని అనరాక్ గ్రూప్ సర్వే వెల్లడించింది. అదే కరోనా కంటే ముందు 2019 ఏడాది మొత్తం చూస్తే.. 2.61 లక్షల యూనిట్లు విక్రయం కాగా.. కేవలం 3 శాతం అంటే 17,740 యూనిట్లు మాత్రమే లగ్జరీ గృహాలున్నాయని పేర్కొంది. లాంచింగ్‌లోనూ లగ్జరే.. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉంటుందన్న సూత్రం ప్రకారమే.. డెవలపర్లు కూడా ప్రాజెక్ట్ లాంచింగ్‌లలో లగ్జరీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. 2019లో 28,960 విలాసవంతమైన ఇళ్లు ప్రారంభం కాగా.. ఈ ఏడాది తొలి ఆర్ధ సంవత్సరం నాటికే ఏకంగా 28 వేల లగ్జరీ గృహాలను లాంచింగ్ చేశారు. పశ్చిమంలో హవా.. హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో పశ్చిమాది ప్రాంతాలదే హవా కొనసాగుతోంది. గత మూడు త్రైమాసికాల నుంఇచ కొత్త ప్రాజెక్ట్స్ లాంచింగ్స్ పశ్చిమ హైదరాబాద్‌లో 57 శాతం జరిగాయి. ఉత్తరాదిలో 18 శాతం, తూర్పులో 15 శాతం, సెంట్రల్లో 8 శాతం, సౌత్ హైదరాబాద్‌లో 2 శాతం లాంచింగ్స్ జరిగాయి. వెస్ట్ హైదరాబాద్‌లో తెల్లాపూర్, బాచుపల్లి, సౌత్‌లో అత్తాపూర్‌లు రియల్టీ హాట్‌స్పాట్స్‌గా మారాయి. ఓపెన్ ప్లాట్లలో పెట్టుబడులు పెట్టే బదులు సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు చాలా మంది కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. వృద్ధి కారణాలివే.. 2019 నుంచి 2022 హెచ్1తో పోలిస్తే రూ.1.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ గృహాల విక్రయాలలో రెండింతల వృద్ధి నమోదయింది. 2022 హెచ్1లో అత్యధిక లగ్జరీ గృహాలు అమ్ముడుపోయింది ముంబైలోనే. ఇక్కడ 13,670 యూనిట్లు సేలయ్యాయి. ఆ తర్వాతి ఎన్సీఆర్లో 4,160 ఇళ్లు అమ్ముడుపోయాయి. 2019లో ఈ రెండు నగరాలలో 11,890 విలాసవంతమైన ఇళ్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది తొలి ఆర్ధ సంవత్సరంలోనే 17,830 యూనిట్లు విక్రయమయ్యాయి. 2019 నుంచి 2022 హెచ్ 1తో పోలిస్తే ముంబైలో లగ్జరీ గృహాల అమ్మకాలు 13 శాతం 25 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో ఎన్సీఆర్లో 4 శాతం నుంచి 12 శాతానికి వృద్ధి చెందాయి. -
ఎన్నారైలు రాష్ట్రంలో ఐటీ కంపెనీలు పెట్టాలి
సాక్షి, ఆదిలాబాద్/కైలాస్‌నగర్: ‘‘విదేశాల్లో ఉన్న మనవాళ్లు ఇక్కడ ఐటీ కంపెనీల ఏర్పాటుకు ముందుకు రావాలి. రాష్ట్రంలోని ఐటీ పార్కుల్లో కంపెనీలు పెట్టాలి. వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నిరకాల ప్రోత్సాహకాలు ఇస్తాం..’’ అని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ద్వితీయశ్రేణి నగరాలకూ ఐటీ పరిశ్రమలను విస్తరించాలన్నది ప్రభుత్వ విధానమని.. ఆదిలాబాద్ వంటి మారుమూల ప్రాంతంలో ఐటీ కంపెనీ ఏర్పాటవడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. సోమవారం మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఇటీవల మాతృమూర్తిని కోల్పోయిన ఎమ్మెల్యే జోగు రామన్న నివాసానికి వెళ్లి పరామర్శించారు. తర్వాత ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీడీఎన్టీ ల్యాబ్ ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సెమినార్లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో రూరల్ టెక్నాలజీ పాలసీ అమలు సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని కేటీఆర్ చెప్పారు. ఒకప్పుడు ఆదిలాబాద్ అంటే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేదని, అటువంటి పరిస్థితి నుంచి ఐటీ మ్యాప్‌లోకి వచ్చిందని పేర్కొన్నారు. వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ తదితర ద్వితీయశ్రేణి పట్టణాల్లోనూ ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయని.. స్థానిక యువతకు అవకాశాలు కల్పిస్తే హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలతో పోటీపడతారని చెప్పారు. ఎమ్మెల్యే జోగు రామన్న విజ్ఞప్తి మేరకు ఆదిలాబాద్‌లో ఐటీ పార్క్‌ను ఐదెకరాల్లో ఏర్పాటు చేస్తామని, త్వరలో దానికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. గుట్టలు, వాగులు, వంకలు, పచ్చని మైదానాలు, జలపాతాలు, అద్భుత సాంస్కృతిక సంపదలు ఆదిలాబాద్ సొంతమని.. ఇక్కడి ప్రదేశాలను ప్రమోట్ చేయడంపై దృష్టిపెట్టాలని పర్యాటక మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కోరుతున్నానని చెప్పారు. సిమెంట్ కార్పొరేషన్‌పై స్పందించట్లేదు ఆదిలాబాద్‌లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను తిరిగి తెరిపించేందుకు చాలా ప్రయత్నాలు చేశామని, కానీ స్పందన లేదని కేటీఆర్ చెప్పారు. సీసీఐని తెరిపించేందుకు జోగు రామన్న నాయకత్వంలో జేఏసీ ఉద్యమం చేసిందని గుర్తు చేశారు. అంతకుముందు ఆదిలాబాద్‌లో చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాగా ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన మంత్రులకు నిరసన సెగ తగిలింది. 317 జీవో బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులు మంత్రుల కార్యక్రమ వేదిక ఎదుట ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకునే యత్నం చేశారు. తమను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ఆరు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
వైద్య రంగంలో ఎన్నారై డాక్టర్ల సహకారం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వాస్పత్రులను అన్ని మౌలిక వసతులతో తీర్చిదిద్దడంతోపాటు ఒకేసారి పెద్ద ఎత్తున వైద్య కళాశాలలను నిర్మిస్తున్న నేపథ్యంలో వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించేందుకు అమెరికాకు చెందిన ప్రవాస వైద్యులు ముందుకొచ్చారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విలేజ్ క్లినిక్స్, టెలి మెడిసిన్ సేవల్లో పాలుపంచుకునేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. డాక్టర్ రవి కొల్లి ఆధ్వర్యంలో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (ఏఏపీఐ)కి చెందిన ఎన్నారై వైద్యుల బృందం శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకుని పలు అంశాలపై చర్చించింది. వచ్చే ఏడాది జనవరి 6, 8వ తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న ఏఏపీఐ గ్లోబల్ హెల్త్‌కేర్ 16వ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా సీఎంను ఆహ్వానించారు. ఈ సదస్సులో మధుమేహం, గుండె జబ్బులు, మహిళలు–పిల్లలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నట్లు ఏఏపీఐ ప్రెసిడెంట్ డాక్టర్ రవి కొల్లి ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. వైద్య ఆరోగ్య రంగంలో సీఎం జగన్ తెస్తున్న సంస్కరణలను ఎన్నారై డాక్టర్లు ప్రశంసించారు. టెలీ కన్సల్టేషన్, శిక్షణ కార్యక్రమాలు, స్పెషాల్టీ వైద్యంలో అనుసరించాల్సిన విధానాలు తదితరాలపై ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన ట్రైన్ అండ్ బేబీ ఆర్గనైజేషన్ (టీఏహెచ్బీ) మాతా శిశుమరణాలను తగ్గించడంపై రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు సంసిద్ధత తెలిపింది. సంస్థ లక్ష్యాలను డాక్టర్ ప్రకాశ్ వివరించారు. శిక్షణలో సహకారం.. విలేజ్ క్లినిక్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లకు మెరుగైన శిక్షణ అందించడంలో ఎన్నారై వైద్యులు, సంఘాలు సహకారం అందించాలని సీఎం జగన్ కోరారు. వర్చువల్ శిక్షణ ఇవ్వడం 15,000 మందికిపైగా ఆశా కార్యకర్తల నైపుణ్యాలను పెంపొందించేందుకు దోహదం చేస్తుందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనిని కూడా ఎన్నారై డాక్టర్ల బృందం కలసినట్లు ఏపీఎన్ఆర్టీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. సమావేశంలో ఏపీఎన్ఆర్టీ చైర్మన్ వెంకట్ మేడపాటి, విదేశీ వైద్య వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు డాక్టర్ ఎన్.వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. -
ఇక్కడ అంతగా బాగాలేదు.. మన ఇండియాలో జాగాలు ఉంటే చూడు!
న్యూఢిల్లీ: ఎన్ఆర్ఐలు భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఇటీవలి కాలంలో క్షీణించడం, భౌగోళిక ఉద్రిక్తతలు, పెరిగిపోయిన ద్రవ్యోల్బణం తదితర అంశాలు ఎన్ఆర్ఐలను భారత మార్కెట్లో పెట్టుబడులకు ప్రోత్సహిస్తున్నాయి. రియల్ ఎస్టేట్‌లోని అన్ని విభాగాల్లోనూ ఎన్ఆర్ఐల భాగస్వామ్యం పెరుగుతున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మధ్యస్థాయి, ప్రీమియం, లగ్జరీ విభాగాల్లో వారు పెట్టుబడులకు మందుకు వస్తున్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు ఎన్నో సవాళ్లను విసురుతున్నాయి. కానీ, వృద్ధి పరంగా భారత్ మార్కెట్ సురక్షితమైనది’’అని రియల్ ఎస్టేట్ సంఘం నరెడ్కో వైస్ చైర్మన్, హిరనందాని గ్రూపు ఎండీ అయిన నిరజంన్ హిరనందాని తెలిపారు. 2022లో ఇప్పటి వరకు రూపాయి డాలర్‌తో 5.2 శాతం విలువను కోల్పోయింది. సెంటిమెంట్‌కే పరిమితం కాకుండా ఎన్ఆర్ఐలకు భారత్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సంపద వృద్ధికి మంచి మార్గంగా ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ కల్లోల పరిస్థితుల్లో పెట్టుబడుల పరంగా భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ సురక్షితమైనదే కాకుండా, పెట్టుబడుల వృద్ధికి, చక్కని అద్దె ఆదాయానికి వీలు కల్పిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు పెట్టుబడుల ప్రక్రియ డిజిటైజేషన్ కావడం వారికి అనుకూలిస్తున్నట్టు పేర్కొన్నాయి. పెరిగిన విచారణలు.. గత కొన్ని నెలలుగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల అవకాశాలపై ఎఆర్‌ఐల నుంచి విచారణలు పెరిగినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా పెద్ద సంస్థలు, సకాలంలో డెలివరీ చేసే ట్రాక్ రికార్డు ఉన్న వాటికి ఎక్కువ విచారణలు వస్తున్నాయి. ‘‘రూపాయి విలువ క్షీణించడం భారత రియల్టీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్ఆర్ఐలకు లభించిన మంచి అవకాశం. అందుకనే వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐల నుంచి పెట్టుబడులకు సంబంధించి విచారణలు వస్తున్నాయి. ముఖ్యంగా మిడిల్ఈస్ట్ నుంచి ఎక్కువ స్పందన వస్తోంది’’అని కే రహేజా కార్ప్ హోమ్స్ సీఈవో రమేశ్ రంగనాథన్ తెలిపారు. భారత జనాభా ఎక్కువగా ఉండే యూఏఈ, సౌదీ అరేబియా దేశాల నుంచి ఎక్కువ మంది పెట్టుబడులకు ముందుకు వస్తున్నట్టు చెప్పారు. ‘‘గల్ఫ్‌దేశాల్లోని ఎన్ఆర్ఐల నుంచి మాకు ఎక్కువగా విచారణలు వస్తున్నాయి. సంప్రదాయంగా మాకు ఇది బలమైన మార్కెట్. దీనికి అదనంగా సింగపూర్, హాంగ్‌కాంగ్ నుంచి సైతం పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మేము నమోదు చేసిన వ్యాపారంలో 30 శాతం ఈ దేశాల్లోని ఎన్ఆర్ఐల నుంచే వచ్చింది. అలాగే, లండన్, మాల్టా నుంచి సైతం పెట్టుబడులు వచ్చాయి’’అని ఇస్ప్రవ గ్రూపు వ్యవస్థాపకుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ దిమాన్‌షా తెలిపారు. -
ఎన్ఆర్ఐలకు హైదరాబాద్ పోలీసుల షాక్
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగం సోషల్ మీడియాపై డేగకంటి నిఘా ఏర్పాటు చేస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా సైబర్ స్పేస్ పోలీసింగ్ చేపడుతోంది. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కొత్వాల్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌తో పాటు ప్రతి ఠాణాలోనూ వీటిపై కేసులు నమోదు చేయనున్నారు. అనేక మందికి ఇబ్బందులు.. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ఎవరికి వారు తమ ఆలోచనలను అందులో పొందుపరుస్తున్నారు. కొందరైతే కొన్ని వర్గాలను, రాజకీయ పార్టీలను టార్గెట్‌గా చేసుకుంటున్నారు. మరికొందరు మహిళలు, యువతులను కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. కుప్పలుకుప్పలుగా పుట్టుకువస్తున్న యూట్యూబ్ చానళ్లలో కూడా కొన్ని ఇదే పంథాలో వెళ్తున్నాయి. ఈ పరిణామాలతో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి లో అతితక్కువ మంది మాత్రమే పోలీసులకు ఫిర్యా దు చేస్తున్నారు. దీన్ని అలుసుగా తీసుకుంటున్న అనేక మంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అవసరమైతే సుమోటో కేసులు.. వీటన్నింటినీ గమనించిన నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తీవ్రంగా పరిగణించారు. ప్రతి ఒక్క పోలీసు అధికారి, సిబ్బంది సోషల్‌మీడియాపై కన్నేసి ఉంచేలా సైబర్ స్పేస్ పోలీసింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు సోషల్‌మీడియా వ్యవహారాలపై కేవలం సైబర్ క్రైమ్ ఠాణాలోనే కేసులు నమోదయ్యేవి. ఇకపై నగరంలోని అన్ని పోలీసుస్టేషన్లలో ఈ కేసులు నమోదు చేస్తారు. బాధితులు ఎవరూ ముందుకు రాకుంటే సుమోటోగా కేసులు నమోదు చేసే అధికారులు దర్యాప్తు చేపడతారు. ఈ వ్యవహారంలో పారీ్టలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుల తీరుతెన్నులను ఆయనే స్వయంగా పర్యవేక్షించనున్నారు. పాస్‌పోర్టులు సైతం రద్దుకు సిఫార్సు.. సోషల్‌మీడియాలో ప్రత్యక్షమవుతున్న అభ్యంతరకరమైన, అశ్లీల, కించపరిచే పోస్టుల్లో కొన్ని ఇతర దేశాల నుంచి పోస్టు అవుతున్నాయి. వీటిని సృష్టిస్తున్న వ్యక్తుల్లో విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు ఉండటంతో ఇప్పటి వరకు పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. కొన్ని కేసుల్లో మాత్రం అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) మాత్రమే జారీ చేస్తున్నారు. దీంతో ఆ వ్యక్తులు దేశానికి వస్తేనే పట్టుకునే ఆస్కారం ఉంటోంది. ఇలాంటి వారికీ చెక్ చెప్పడానికి సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ తరహా కేసుల్లో నిందితులు ఎన్నారైలు ఉంటే వారి పాస్‌పోర్టులు రద్దు చేయాల్సిందిగా ఆర్పీఓకు సిఫార్సు చేస్తారు. దీంతో ఆయా వ్యక్తులను వారు ఉంటున్న దేశాలు బలవంతంగా తిప్పి పంపడానికి ఆస్కారం ఏర్పడుతుంది. శిక్షలు పడే వరకు పర్యవేక్షణ.. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సోషల్‌మీడియాల్లో అవాంఛనీయ పోస్టులపై కేసుల నమోదుతో సరిపెట్టవద్దని ఆనంద్ స్పష్టం చేశారు. ప్రతి కేసునూ చట్ట ప్రకారం దర్యాప్తు చేసి, నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్ కంటే వాట్సాప్, ట్విట్టర్ల ద్వారానే ఇలాంటివి ఎక్కువ సమస్యలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వాట్సాప్‌లో ఉండే గ్రూపులే వదంతులు విస్తరించడానికి కారణమవుతున్నా యని వివరిస్తున్నారు. ఏ సమాచారం అయినా పూర్తిగా నిర్ధారించుకోకుండా ప్రచారం, షేరింగ్ చేయవద్దని అలా చేస్తే చట్ట ప్రకారం నేరమే అవుతుందని, అభ్యంతరకర కామెంట్లు చేసినా బాధ్యులేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. -
రాధిక మంగిపూడి 'భారతీయ తత్త్వ శతకము'ను ఆవిష్కరించిన డాక్టర్ మేడసాని మోహన్
ఆధ్యాత్మిక విలువలకు నెలవైన ప్రాచీన భారతీయ దర్శనంలోని తాత్త్విక ఆలోచనలు, తత్త్వశాస్త్ర సారం ఇతివృత్తంగా భారతీయతత్త్వ శతకం పుస్తకాన్ని రచించినట్లు శతక కవయిత్రి రాధిక మంగిపూడి చెప్పారు. రాధిక మంగిపూడి రాసిన ‘భారతీయ తత్త్వ శతకము’ పుస్తకాన్ని ‘తటవర్తి గురుకులం’ ఆస్ట్రేలియా శాఖ ప్రచురించింది. ‘సింగపూర్ తెలుగు టీవీ’ వారి సాంకేతిక సహకారంతో ఇంటర్నెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అద్వితీయంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ వీడియో సందేశం ద్వారా ఆశీస్సులు అందించగా.. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, వంశీ ఆర్ట్ థియేటర్స్ అధ్యక్షులు డాక్టర్ వంశీ రామరాజు, ప్రముఖ సినీకవి రచయిత భువనచంద్ర, కళారత్న డాక్టర్ మీగడ రామలింగస్వామి గౌరవ అతిథులుగా పాల్గొని ఈ పుస్తక విశిష్టతను మెచ్చుకున్నారు. 18 రోజులలో ఈ శతకాన్ని పూర్తి చేసిన రచయిత్రి రాధికకు ఆశీస్సులు తెలియజేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొని పుస్తక ఆవిష్కరణ చేసిన డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ.. "మధువచోరూఢి రాధికా మంగిపూడి" అంటూ ఆశువుగా పద్య రూపంలో ఆమెకు ఆశీస్సులు అందించారు. తొలి పుస్తక ప్రతిని విజయనగరంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలోని అమ్మవారి చరణాలకు అర్పించి అంతర్జాలం లోనే అందరికీ అమ్మవారి దర్శనం కల్పించారు. "తమ గురుకులం నిర్వహిస్తున్న 'కావ్య గురుదక్షిణ' కార్యక్రమ పరంపరలో భాగంగా, రాధిక ఈ శతకాన్ని తాను చదువుకున్న విజయనగరం విద్యాసంస్థలకు, చిన్ననాటి గురువులకు అంకితం చేయడం, ఆ గురువుల సమక్షంలోనే ఈ ఆవిష్కరణ గావించడం ఎంతో ప్రశంసనీయమని" 'తటవర్తి గురుకులం' అధ్యక్షులు తటవర్తి కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. శతక కవయిత్రి రాధిక మంగిపూడి మాట్లాడుతూ "ఆధ్యాత్మిక విలువలకు నెలవు అయిన ప్రాచీన భారతీయ దర్శనంలోని తాత్త్విక ఆలోచనలను, తత్త్వశాస్త్ర సారాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఈ శతకాన్ని రచించే ప్రయత్నం చేశానని, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు తన రచనను దీవించి 'ముందు మాట' రూపంలో ఆశీస్సులు అందించడం, కవిపండితులు డా. మేడసాని మోహన్ వంటి పంచసహస్రావధాని చేతుల మీదుగా తన పుస్తకం ఆవిష్కరించబడడం తన పురాకృత పుణ్యంగా, భగవంతుని అనుగ్రహంగా భావిస్తున్నానని" ఆనందం వ్యక్తం చేసి అతిథులకు, గురువులకు, నిర్వాహకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. న్యూజిలాండ్ నుండి సంగీత భారతి పాఠశాల అధ్యక్షులు మల్లెల గోవర్ధన్ గారు, వారి విద్యార్థినులు విచ్చేసి శతకంలోని పద్యాలను రాగయుక్తంగా ఆలపించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సింగపూర్ సంస్థ అధ్యక్షులు శ్రీ కవుటూరు రత్న కుమార్, అమెరికా నుండి శతకం డిజైనింగ్ చేసిన "స్వర మీడియా" సంస్థ అధ్యక్షులు యక్కలి రాజేష్, రాచకొండ శాయి, ఆంధ్ర విశ్వవిద్యాలయం తత్త్వశాస్త్ర విభాగాధిపతి డా. వానపల్లి వెంకట్రావు, ఆస్ట్రేలియా నుండి డా. చింతలపాటి, న్యూజిలాండ్ నుండి తంగిరాల నాగలక్ష్మి, హాంగ్ కాంగ్ నుండి జయ పీసపాటి మలేషియా నుండి డాక్టర్ వెంకట ప్రతాప్, కాకినాడ నుండి డా. దీక్షితులు మరియు వివిధ దేశాల తెలుగు సాహిత్యాభిమానులు, రాధిక కుటుంబ సభ్యులు, గురువులు శ్రేయోభిలాషులు, ఈ కార్యక్రమంలో పాల్గొని రాధికకు అభినందనలు తెలియజేశారు. సింగపూర్ నుండి గుంటూరు వెంకటేష్ వ్యాఖ్యాతగా కార్యక్రమాన్ని నడిపించగా గణేశ్న రాధాకృష్ణ సాంకేతిక నిర్వాహకులుగా వ్యవహరించారు. -
తెలుగు వారి పరువు తీస్తున్న చంద్రబాబు
సాక్షి,అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజాదరణ కోల్పోయి, టీడీపీ ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు ప్రజల పరువు తీస్తున్నారని ఎన్నారైలు ధ్వజమెత్తారు. అమెరికాలోని చికాగోలో తెలుగు ఎన్నారైలు మంగళవారం జనాగ్రహ దీక్ష చేపట్టారు. దీక్షలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎన్నారై నేత కొండపల్లి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ నేతలు రకరకాల పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్ పరువును గంగలో కలుపుతున్నారని మండిపడ్డారు. ఏపీ గంజాయి రాష్ట్రం అంటూ దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ముద్ర వేసే ప్రయత్నం ఢిల్లీ వేదికగా మొదలు పెట్టారని ఆయన దుయ్యబట్టారు. పట్టాభితో సీఎం వైఎస్ జగన్‌ను బూతులు తిట్టించడం, తర్వాత జరిగిన పరిణామాలను ఒక ఉద్యమంగా మార్చటం, ఆ ఉద్యమాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేయటం అంతా ఏపీకి చేటు చేసేందుకేనని ఆయన విమర్శించారు. ప్రజల సాక్షిగా సీఎం జగన్‌కు ఇప్పటికైనా చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బోసిడీకే అన్న పదంతో సీఎంను దూషించిన టీడీపీ నేత పట్టాభిని తెలుగు జాతి క్షమించదన్నారు. చికాగోలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో యత్తపు శరత్, యారసాని పరమేశ్వర్, పూల కిషోర్, నరసింహారెడ్డి, పిచాలా వెంకటేశ్వర్, వెంకట్, శ్రీధర్ అలవాలా, విజయ్ సంకెపల్లి, రమేష్ తమ్మూరి, రామిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు.
నల్లరాజుపాలెం(అనంతసాగరం): ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యం లో దసరా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయని అధ్యక్షులు పార్లపల్లి రఘునాధ్ రెడ్డి గారు తెలియజేసారు. విదేశాల్లో ఉన్నప్పటికి మన సంస్కృతి సంప్రదాయాలకు విలువ నిచ్చి మన తెలుగు వాళ్లు అక్కడ ఎంతో ఆనందంగా ఈ పండుగలని జరుపుకున్నారని అన్నారు. దాదాపు రెండు వందల మందికి పైగా ఈ వేడుకలకు హాజరై వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. రెండు సంవత్సరాలు పాటు కరోనా మహమ్మారితో ఇబ్బంది పడిన జనాలకి ఈ కార్యక్రమం మంచి మానసిక ఉల్లాసాన్నిచ్చిందని అన్నారు. దసరా పాటలతో, నృత్యాలతో కూడిన ఈ కార్యక్రమం దాదాపు ఏడు గంటల పాటు కొనసాగిందని అన్నారు. కార్యక్రమం కొనసాగటానికి సంస్థ నిర్వాహకులు సింగపురం వినయ్ , అడబాల శ్రీవల్లి, రోజా రమణి మోలుపోజు, శృతి కొట్రిక్, స్పందన ఈచూరి తదితరులు కృషిచేశారని తెలిపారు. తెలంగాణలో ఎంతో ప్రాముఖ్యత సాధించినటువంటి బతుకమ్మ పండుగ సందర్బంగా వివిధ రకాల పూల అలంకరణతో బతుకమ్మని తయారు చేయించి, పిల్లలు, ఆడపడుచులందరు పాల్గొని బతుకమ్మ కోలాటం ఆడించేందుకు బజ్జురి లచ్చిరెడ్డి, దాసరి వాసు, వెన్నెల శివశంకర్, గంధం అభిషేక్ , పంగనామాల వంశి కృష్ణ, వారణాసి వెంకట రాకేష్ ఎంతో కృషి చేశారని తెలిపారు. కాగా, ఇక ముందు కూడా ఫిన్లాండ్లో మరిన్నికార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇక్కడున్న మన తెలుగు వాళ్లకి అండగా ఉంటామని తెలుగు సంఘం ఉపాధ్యాక్షులు ఓలేటి సుబ్రమణ్య మూర్తి గారు, జ్యోతిస్వరూప్ అనుమలశెట్టి గారు, సత్యనారాయణ గారు తెలియజేశారు. -
డల్లాస్‌లో.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీప్యాడ్) ఆధ్వర్యంలో బిగ్బ్యారెల్ రాంచ్ ఇన్ ఆర్బేలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో 550 మందికి పైగా పాల్గొన్నారు. వీరిలో ఇండియన్లతో పాటు వివిధ దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని ఆడపడుచులు అందరూ స్వయంగా బతుకమ్మలు పేర్చారు. వీటితో పాటు టీప్యాడ్ తరఫున 14 అడుగుల బతుకమ్మను ప్రత్యేకంగా తయారు చేయించారు. బతుకమ్మ ఆటపాటల మధ్య సందడిగా ఈ వేడుకలు జరిగాయి. గతంలో టీ ప్యాడ్ ఆధ్వర్యంలో ఏకంగా 10 వేల మందితో బతుకమ్మ పండగ నిర్వహించారు. అయితే కోవిడ్ కారణంగా ఈ సారి వేడుకులను చెరువులు, పచ్చిక బయళ్ల మధ్యన ఉన్న 60 ఎకరాల ఫార్మ్ హౌస్‌లో పూర్తిగా గ్రామీణ వాతావరణంలో నిర్వహించారు. దుర్గాపూజ, జమ్మిపూజలను ప్రత్యేకంగా నిర్వహించారు. అనంతరం శ్రీరాముల వారి పరివారాన్ని ఎడ్లబండిలో ఉంచి ఊరేగించారు. బతుకమ్మల చుట్టూ చేరి ఆడిపాడారు. చివరకు స్థానికంగా ఉన్న చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఈ వేడుకలు ఘనంగా నిర్వహించడంలో టీప్యాడ్ ఫౌండేషన్ కమిటీ చైర్మన్ రావు కల్వలతో పాటు మాధవి సుంకిరెడ్డి, రవికాంత్ మామిడి, గోలి బుచ్చిరెడ్డి, బండారు రఘువీర్, పీ ఇంద్రాణి, రూపా కన్నయగారి, అనురాధ మేకల తదితరులు కృషి చేశారు. చదవండి : లండన్‌లో కన్నులపండువగా బతుకమ్మ వేడుకలు -
వలస కార్మికులకు కువైట్ సర్కార్ ఊరట
మోర్తాడ్ (బాల్కొండ): తమ దేశంలో ఉన్న విదేశీ వలస కార్మికుల సంఖ్యను తగ్గించుకోవడానికి 60 ఏళ్ల వయసు పైబడిన వారిని స్వదేశాలకు పంపిన కువైట్ ఇప్పుడు ఆ నిబంధనను ఎత్తివేసింది. వలస కార్మికులను బలవంతంగా పంపించడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడటంతో 60 ఏళ్ల పైబడిన వారిని మళ్లీ విధులలో కొనసాగించాలని కువైట్ నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో తమ దేశ పౌరులకు ఉపాధి కల్పించే బాధ్యత కువైట్ ప్రభుత్వంపై పడటంతో 2020 డిసెంబర్లో విదేశీ వలస కార్మికులను తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో వ్యాపార, వాణిజ్య రంగాలు మళ్లీ పుంజుకున్నాయి. కువైట్ పౌరులలో ఎక్కువ మందికి వ్యాపార, సాంకేతిక రంగాల్లో అనుభవం లేక పోవడం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న వ్యాపారాలకు ప్రతిబంధకంగా మారింది. దీంతో వృత్తి నైపుణ్యం ఉన్న విదేశీ వలస కార్మికులను వయసుతో సంబంధం లేకుండా పనుల్లోకి తీసుకోవాలని కువైట్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జనవరి 1 నాటికి 60 ఏళ్లు నిండిన వలస కార్మికులను స్వదేశాలకు పంపించగా ఆ తర్వాత కూడా 60 ఏళ్లు నిండిన వారికి వీసాలను రెన్యూవల్ చేయలేదు. 60 ఏళ్ల వయసు నిబంధనను ఎత్తివేయడంతో తెలుగు రాష్ట్రాల కార్మికులకు ఊరట లభించింది. కువైట్‌లో ఉపాధి పొందుతున్న తెలుగు రాష్ట్రాల వలస కార్మికుల సంఖ్య దాదాపు 3.5 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇదిలా ఉండగా కరోనాతో నిలిపివేసిన కువైట్ ప్రభుత్వం నిలిపివేసిన వీసాలను ఇప్పుడు జారీచేయడానికి ఆమోదం తెలిపింది. (చదవండి: ఆ విషయంలో దేశానికే ఆదర్శం.. హైదరాబాద్) -
ప్రవాసీల కోసం జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు
హైదరాబాద్: అంతర్గత, అంతర్జాతీయ వలసదారుల హక్కులు, సంక్షేమం కోసం ప్రవాసీ జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సోమవారం (సెప్టెంబర్ 13) ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇటీవల ఢిల్లీలో పలు రాష్ట్రాల ప్రతినిధులతో చర్చలు జరిపామని, లాక్ డౌన్ సమయంలో 45 కోట్ల మంది వలస కార్మికులు నడుచుకుంటూ తమ స్వస్థలాలకు వెళ్లారని, ఒక కోటి యాభై లక్షల మంది భారతీయులు విదేశాలలో నివసిస్తుండగా వారిలో 88 లక్షల మంది గల్ఫ్ దేశాలలో ఉన్నారని ఆయన అన్నారు. స్వదేశంలో, విదేశంలో పనిచేస్తూ భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రవాసీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని దేవేందర్ రెడ్డి అన్నారు. వివిధ ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలతో కలిసి వలస కార్మికుల జాతీయ వేదికల నిర్మాణం కోసం 'నేషనల్ నెట్ వర్క్ ఫర్ మైగ్రంట్ వర్కర్స్', 'నేషనల్ ఫెడరేషన్ ఫర్ మైగ్రంట్ వర్కర్స్' ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా నంగి దేవేందర్ రెడ్డి బిజెపికి, మంద భీంరెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. జాతీయ స్థాయిలో ప్రవాసీ రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా తాము ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తమ పార్టీలకు సోమవారం రాజీనామా చేసినట్లు వారు వివరించారు. -
ఎన్ఆర్ఐల ఈక్విటీ పెట్టుబడులకు ఇన్వెస్ట్ 19 వేదిక
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) భారత ఈక్విటీ మార్కెట్లలో నేరుగా ఇన్వెస్ట్ చేసేందుకు వీలుగా ఒక గేట్‌వేను ఆవిష్కరించనున్నట్టు ఇన్వెస్ట్ 19 ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్–డిసెంబర్ నాటికి ఈ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ కంపెనీ ఇప్పటికే ఆన్లైన్ మల్టీబ్రోకింగ్ సేవలు అందిస్తోంది. ఒకే క్లిక్‌తో భారత ఈక్విటీల్లో పెట్టుబడుల అవకాశాలను ఎన్ఆర్ఐలకు కలి్పంచాలన్న ప్రణాళికతో ఉన్నట్టు వివరించింది. నిరీ్ణత శాతం మేర దేశ పౌరులు విదేశాల్లో నివసిస్తున్నారని.. వారు భారత ఈక్విటీ మార్కెట్లలో సులభంగా ఇన్వెస్ట్ చేసుకునే మార్గం లేదని ఇన్వెస్ట్19 వ్యవస్థాపకుడు, సీఈవో కౌసలేంద్రసింగ్ సెంగార్ తెలిపారు. యూఎస్, బ్రిటన్, ఆ్రస్టేలియాలో ఒక శాతానికిపైనే భారత సంతతి ప్రజలున్నట్టు.. కెనడాలో అయితే 4 శాతానికి పైనే ఉన్నట్టు పేర్కొన్నారు. -
అమెరికాలో భారతీయుల హవా.. సంపాదనలో సూపర్
-
అమెరికాలో ఇండియన్స్ హవా.. సంపాదనలో సూపర్
అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల హవా కొనసాగుతోంది. ఉన్నత చదువులు, ఉద్యోగాల్లోనే కాదు సంపాదనలోనూ మనోళ్లు దూసుకుపోతున్నారు. న్యూయార్క్ టైమ్స్ తాజా అధ్యయనం ప్రకారం సంపాదనలో అమెరికన్ల కంటే భారతీయులే ముందున్నారు. ఎన్నారైల సగటు వార్షిక ఆదాయం అమెరికన్ల కంటే దాదాపు రెట్టింపు ఉందని తేలింది. అటు జనాభా కూడా పరంగా కూడా భారతీయులు అగ్రరాజ్యంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారని తాజాగా వెల్లడైంది. మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి. -
ప్రవాసాంధ్రుల్లారా ఆపత్కాలంలో ఏపీకి అండగా నిలవండి
సాక్షి, అమరావతి: ప్రస్తుతం కరోనా కష్టకాలంలో ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలవాలని ఏపీ స్పెషల్ రిప్రజంటేటివ్ రత్నాకర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి సాధ్యమైనంత సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం సహాయ నిధికి చేసే సహాయంతో ఏపీలో మరిన్ని మెరుగైన వసతులు ఏర్పాటు చేసుకోవచ్చు అని గుర్తుచేశౠరు. మరింత వేగంగా ఎక్కువ మందికి వాక్సినేషన్ ఇవ్వొచ్చు అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. మీరు చేసే సహాయం మరిన్ని ఆస్పత్రులకు ఆక్సిజన్, వెంటిలేటర్, ఎక్మో సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావచ్చు అని రత్నాకర్ చెప్పారు. ప్రవాసాంధ్రులు ముందుకు వస్తే ఏపీలో ఆరోగ్య సౌకర్యాల కల్పన వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి శక్తికి మించి ప్రజలకు కరోనా నుంచి సేవలు చేస్తున్నారని గుర్తుచేశారు. మనం బాధ్యతగా ఏపీవాసులకు అండగా నిలుద్దామని ప్రవాసాంధ్రులకు ఏపీ స్పెషల్ రిప్రజంటేటివ్ రత్నాకర్ చెప్పారు. చదవండి: రాబోయే 3, 4 వారాలు చాలా కీలకం.. మరింత జాగ్రత్త చదవండి: లాక్డౌన్ పెట్టాలా లేదా అన్నది సీఎం నిర్ణయం -
అసీం మహాజన్‌కు తెలుగు సంఘాల ఘన సన్మానం
డల్లాస్, టెక్సాస్: కాన్సల్ జెనరల్ అఫ్ ఇండియా అసీం మహాజన్‌తో ప్రముఖ ప్రవాస భారతీయ నాయకులు డా. ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో ఇర్వింగ్ బావర్చి రెస్టారెంట్లో గురువారం ఆతిధ్య సమావేశం జరిగింది. వివిధ తెలుగు సంఘాల ప్రముఖ నాయకులు - రఘువీర్ బండారు – తెలంగాణా పీపుల్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టిపాడ్); డా. శ్రీధర్ కొర్సపాటి – నా ర్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ (నాటా); డా. సంధ్యా రెడ్డి గవ్వ – అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా); లక్ష్మి పాలేటి - తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (టాన్టేక్ష్); మురళి వెన్నం - తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా); శేఖర్ అన్నే- నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్); మహేంద్ర రావు – డల్లాస్ ఏరియా తెలంగాణా అసోసియేషన్ (డాటా)లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్థానికంగాను, జాతీయ స్థాయిలోను, మాతృ దేశంలోను చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను కాన్సల్ జెనరల్‌కు వారు వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ తెలుగు సంఘాల ప్రతినిధుల తరపున డా. ప్రసాద్ తోటకూర కాన్సల్ జెనరల్ అఫ్ ఇండియా అసీం మహాజన్‌ను దుశాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. తనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ అభినందనకు కాన్సల్ జెనరల్ మహాజన్ కృతజ్ఞతలు తెలియజేస్తూ – “అమెరికాలో తెలుగు వారి విజ్ఞానం, ఆధిక్యత - విద్యా, వైద్య, శాస్త్ర, సాంకేతిక, వ్యాపారంలాంటి అన్ని రంగాలలోను విశేష ప్రభావం చూపుతోంది. అవసరమైనప్పుడు వీలైన సహాయం చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నా’’నని అన్నారు. -
అందుబాటు గృహాలపై ఎన్నారైల ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: దేశీయ రియల్టీ మార్కెట్లో ప్రవాస భారతీయులు చాలా ముఖ్యమైనవాళ్లు. వాణిజ్య, నివాస సముదాయాల వృద్ధిలో ఎన్నారైలే కీలకం. మరీ ప్రత్యేకించి అఫర్డబుల్ గృహాల విభాగంలో పెట్టుబడులకు ఎన్నారైలు విపరీతమైన ఆసక్తిలో ఉన్నారని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. ‘బడా నిర్మాణ సంస్థలు, బ్రాండ్ డెవలపర్లు అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లను చేపడుతుండటం ఎన్నారైల విశ్వసనీయ పెట్టుబడులకు హామీలను అందిస్తున్నాయి. మరోవైపు లగ్జరీ, ఇతరత్రా గృహాల అద్దెల కంటే అఫర్డబుల్ ఇళ్ల రెంట్స్ మెరుగ్గా ఉండటం, దీర్ఘకాలం పాటు అందుబాటులో ఉండటం ఎన్నారైలకు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయని’ ఆయన వివరించారు. అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లకు ఏడాది పాటు ట్యాక్స్ హాలిడే పొడిగింపుతో ఎన్నారైలతో పాటు దేశీయ కొనుగోలుదారులకు సరసమైన గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులకు ఆసక్తి పెరుగుతుంది. మరోవైపు కొత్త ప్రాజెక్ట్‌ల ధరలు కూడా అదుపులో ఉంటాయి. ప్రస్తుతం దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో కొత్త గృహాల సప్లయిలో 35 శాతం అఫర్డబుల్ హౌసింగ్సే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఎన్నారైల రియల్టీ పెట్టుబడులు చాలావరకు క్షీణించాయి. చాలా దేశాల్లో పరిస్థితులు క్రమంగా మెరుగవుతుండటం అఫర్డబుల్ రియలీ్టకి కలిసొచ్చే అంశం. చదవండి: సొంతిల్లు కొనేందుకు వయసూ ముఖ్యమే! బెంగళూరు కంటే హైదరాబాదే చాలా కాస్లీ -
భారత్ బంద్‌కు విపక్షాల మద్దతు
న్యూఢిల్లీ/ముంబై: రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో రైతు సంఘాలు ప్రకటించిన రేపటి ‘భారత్ బంద్’కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ దేశవ్యాప్త బంద్‌కు ఆదివారం కాంగ్రెస్, శివసేన, డీఎంకే, ఆప్ పార్టీలు తమ మద్దతు తెలిపాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, 10 కార్మిక సంఘాల ఐక్య కమిటీ బంద్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. సత్వరం పరిష్కారం చూపనట్లయితే.. ఈ ఉద్యమం ఢిల్లీ నుంచి దేశం నలుమూలలకు విస్తరిస్తుందని ఎన్సీపీ నేత శరద్ పవార్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డిసెంబర్ 9న పవార్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి రైతు ఉద్యమ తీవ్రతను వివరించి, జోక్యం చేసుకోవాలని కోరుతారని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ వెల్లడించారు. పవార్‌తో పాటు రాష్ట్రపతిని కలిసే ప్రతినిధి బృందంలో సీతారాం ఏచూరి (సీపీఎం), డీ రాజా (సీపీఐ), టీఆర్ బాలు(డీఎంకే) ఉంటారన్నారు. రైతు ఆందోళనలపై కేంద్రం తీవ్రంగా యోచిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించే విషయం కూడా పరిగణిస్తోందని తెలిపాయి. మరోవైపు, రేపటి(డిసెంబర్ 8, మంగళవారం) బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి 250 మందికి పైగా రైతులు ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వస్తున్నారని తెలిపాయి. ‘ఇది కేవలం పంజాబ్ రైతుల నిరసన కాదు. ఇది దేశవ్యాప్త నిరసన. కేంద్రం త్వరగా స్పందించనట్లయితే.. ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం. మేం భారత్ బంద్‌కు పిలుపునివ్వడంపై నిన్నటి(శనివారం) చర్చల సందర్భంగా మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు’ అని రైతు నేత బల్దేవ్ సింగ్ యాదవ్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. బంద్ నుంచి అంబులెన్స్‌లకు, అత్యవసర విభాగాలకు మినహాయింపు ఇచ్చామన్నారు. బంద్‌లో అంతా శాంతియుతంగా పాల్గొనాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ హింసాత్మక చర్యలకు దిగవద్దని విజ్ఞప్తి చేశారు. భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని కాంగ్రెస్ ప్రకటించింది. బంద్‌కు మద్దతుగా అన్ని రాష్ట్రాలు, జిల్లాల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపింది. నటుడు కమల్‌హాసన్ పార్టీ ‘ఎంఎన్ఎం’ కూడా బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ..తదితర 10 కార్మిక సంఘాలు కూడా బంద్‌కు మద్దతు తెలిపాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సహా పలు బ్యాంక్ యూనియన్లు భారత్ బంద్‌కు మద్దతు తెలిపాయి. ఎన్ఆర్ఐ కుటుంబాల మద్దతు ఈ ఉద్యమంలో అన్ని విధాలుగా సాయం చేసేందుకు విదేశాల్లోని తమ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారని కొందరు రైతులు వెల్లడించారు. దీర్ఘకాలం ఉద్యమం సాగించేందుకు వీలుగా రైతులు సిద్ధమై వచ్చిన విషయం తెలిసిందే. పళ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను వారు సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఢిల్లీ శివార్లకు భారీగా చేరుకున్న రైతులకు స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక గురుద్వారా సభ్యులు కూడా ఇతోధిక సాయం అందిస్తున్నారు. కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ సహా పలు యూరోప్ దేశాల్లో పంజాబ్ మూలాలున్న ప్రవాస భారతీయులున్నారు. వారు వివిధ మాధ్యమాల ద్వారా ఇప్పటికే రైతు ఉద్యమానికి మద్దతు తెలిపారు. విపక్ష నేతల ఉమ్మడి ప్రకటన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ప్రకటించిన భారత్ బంద్‌కు మద్దతుగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, పీఏజీడీ చైర్మన్ ఫరూఖ్ అబ్దుల్లా తదితరులు ఆదివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రైతుల న్యాయబద్ధ డిమాండ్లను కేంద్రం అంగీకరించాలని అందులో వారు కోరారు. ఈ ప్రకటనపై తేజస్వీ యాదవ్(ఆర్జేడీ), అఖిలేశ్‌యాదవ్(ఎస్పీ), డీ రాజా(ఆర్జేడీ), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐఎంఎల్) తదతరులు సంతకాలు చేశారు. లండన్‌లోని భారత దౌత్య కార్యాలయం ఎదుట ప్లకార్డులతో ఎన్ఆర్ఐల నిరసన -
ట్రంప్ ఓటమి భారత్‌కు మంచిదేనా!?
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో డెమోక్రట్ల అభ్యర్థి జో బైడన్ విజయం సాధించడానికి బిహార్ ఎన్నికల ఫలితాలకు ఏమైనా సంబంధం ఉంటుందా ? అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఓ పక్క కొనసాగుతుండగానే బిహార్‌లో ఆఖరి విడత పోలింగ్ జరిగింది. ఆ సందర్భంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోతుందని, ఆర్జేడీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తేలిందంటే అమెరికా ఎన్నికల ప్రభావం ఉన్నట్లేగదా! అని కొంతమంది ట్విటర్లో ప్రశ్నిస్తున్నారు. (టార్గెట్ బైడెన్ వయా చైనా!) బిహార్ ఆఖరి విడత పోలింగ్ రోజున అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉందని, డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ల మధ్య ‘నువ్వా, నేనా’ అన్నట్లుగా హోరాహోరీ పోరు నడుస్తోంది. అలాంటప్పుడు అమెరికా ఎన్నికల ఫలితాలు బిహార్ పోలింగ్‌పై ఉండే ఆస్కారమే లేదు. కాకపోతే అమెరికాలోని భారతీయుల్లో మోదీ అభిమానులు, విధేయులు ఎక్కువ మంది ఉన్నందున వారి ఓటు బ్యాంక్‌ను కొల్లగొట్టడం ద్వారా తిరిగి అధికారంలోకి రావాలని ఆశించి ట్రంప్ బోల్తా పడ్డారు. (వైట్‌హౌస్ నుంచి వెళ్దాం: ట్రంప్‌తో భార్య మెలానియా) అమెరికాలో ‘హౌడీ మోడీ, భారత్‌లో నమస్తే ట్రంప్’ పేరిట ఇరువు దేశాధినేతలు ప్రజలనుద్దేశించి మాట్లాడడం వెనక ఎన్నికల వ్యూహం ఉందనడంలో సందేహం లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగడానికి కొన్ని రోజుల ముందర, నవంబర్ 3వ తేదీన అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రలు అనూహ్యంగా భారత్‌కు వచ్చి ‘2ప్లస్2’ చర్చల్లో భారత్‌తో భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం తెల్సిందే. ప్రవాస భారతీయ ఓట్లను ఆకర్షించడం కోసం ట్రంప్ చేసిన ఆఖరి ప్రయత్నంగా దాన్ని పేర్కొనవచ్చు. బైడన్, కమలా హ్యారిస్లకు ఓటేసిన ప్రవాస భారతీయులందరిని భారత వ్యతిరేకులుగా మోదీ విధేయులు సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తున్నారు. వాస్తవానికి మోదీ విధేయులైన భారతీయులు కూడా అమెరికా ఎన్నికల్లో విడిపోయినట్లు, వారిలో ఎక్కువ మంది బైడెన్‌కు ఓటేయగా, తక్కువ మంది ట్రంప్‌కు వేసినట్లు అమెరికా ముందస్తు ఎన్నికల సందర్భంగా పలు మీడియా సంస్థలు నిర్వహించిన పోల్ సర్వేల్లో చెప్పారు. వచ్చే తరం ప్రవాస భారతీయులకు హెచ్ 1 బీ వీసాలు రాకపోయినా, వచ్చినా తమకు సంబంధం లేదని, తమకు పన్నులు తగ్గితే చాలనుకున్న మోదీ విధేయుల్లో ఓ వర్గం ట్రంప్‌కు ఓటేయగా, బైడెన్ అధికారంలోకి వస్తే భారతీయులపై శ్వేత జాతీయులు దాడులు తగ్గుతాయని, పైగా ప్రవాస భారతీయులుకు హెచ్ 1 బీ వీసాలు పెరగుతాయని భావించిన మోదీ విధేయుల్లో మరో వర్గం బైడెన్‌కు ఓటేశారు. బైడెన్ వస్తే అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ను కాకుండా పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తారంటూ మత విద్వేషకుల్లో ఓ వర్గం చేసిన ప్రచారం కూడా వారి ముందు పనిచేయలేదు. బైడెన్ కూడా అంతర్జాతీయ వ్యవహారాల్లో పాకిస్థాన్‌కు మద్దతిస్తానని చెప్పలేదు. కశ్మీర్ విషయంలో తన వైఖరి ఏమిటో చెప్పాల్సి వచ్చినప్పుడు తాను కశ్మీరీల పక్షమని బైడెన్ తెలిపారు. అంతమాత్రాన అది పాకిస్థాన్‌కు మద్దతివ్వడం ఎంతమాత్రం కాదు. (‘యునైటెడ్ స్టేట్స్’కు అధ్యక్షుడిని..!) డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవడం వల్ల భారతీయులుగానీ, ప్రవాస భారతీయులు బాధ పడాల్సిన అవసరం లేదని, ప్రవాస భారతీయులకుగానీ, భారతీయులకుగానీ జో బైడెన్ వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని, ఆయన ప్రవాస భారతీయులకిచ్చిన హామీలను మరచిపోరాదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భరోసా ఇస్తున్నారు. అయితే బైడెన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే అమెరికాలోని కొన్ని చట్టాలను సవరించాలి. అందుకు అవసరమైన బలం సెనేట్‌లో బైడెన్‌కు లేదు. అలాంటప్పుడు అయన తన హామీలను ఎల నెరవేరుస్తారన్నది మరికొందరి విశ్లేషకుల అనుమానం. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. (ద్వైపాక్షిక బంధాలు బలపడతాయ్) -
‘హెచ్1బీ’ కేసులో ట్రంప్‌కు ఊరట
వాషింగ్టన్: హెచ్1బీ వీసా నిషేధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి తాత్కాలికంగా ఉపశమనం లభించింది. ట్రంప్ జూన్ 22న ప్రకటించిన హెచ్1బీ వీసా ఆంక్షలను సవాల్ చేస్తూ 169 మంది ఎన్ఆర్ఐలు అమెరికా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ని అక్కడి కోర్టు తిరస్కరించింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికే అమెరికాలోని కంపెనీలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయని, కోవిడ్ నేపథ్యంలో స్థానికులకు ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతున్నాయని ట్రంప్ హెచ్1బీ వీసాలపై నిషేధాజ్ఞలు జారీ చేశారు. దీని ప్రకారం ట్రంప్ హెచ్1బీ వీసాలపై విధించిన ఆంక్షలు ఈ యేడాది చివరి వరకు అమల్లో ఉంటాయి. హెచ్1బీ, వీసాల రద్దు నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకు, వ్యాపార, వాణిజ్యాలకు తీవ్రమైన నష్టం చేకూరుస్తుందని, ఇది దిద్దుకోలేని తప్పిదమని అమెరికాలోని సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థలు హెచ్చరించాయి. అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ, ఇటీవల భారత్‌కు వచ్చిన 169 మంది భారతీయులు తిరిగి అమెరికా వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు. వీసాలపై నిషేధం ఏకపక్షమని, తక్షణం తమ వీసాలను పునరుద్ధరించాలని భారతీయులు ఆ పిటిషన్లో కోరారు. అయితే వీసాపై ఆంక్షలు వి«ధించకుండా అడ్మినిస్ట్రేషన్‌ని నియంత్రించలేమని వాషింగ్టన్ జిల్లా జడ్జి అమిత్ మెహతా ట్రంప్‌కి అనుకూలంగా తీర్పునిచ్చారు. ఈ తీర్పుని పై కోర్టులో అప్పీల్ చేయనున్నట్టు భారతీయ పౌరుల తరఫు లాయర్ తెలిపారు. -
పది లక్షల మంది భారతీయులు వెనక్కి!
న్యూఢిల్లీ : వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన వందేభారత్ మిషన్‌లో భాగంగా దాదాపు 10 లక్షల మందిని భారత్‌కు తిరిగితెచ్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. కరోనా సంక్షోభ నేపథ్యంలో ప్రవాస భారతీయుల కోసం ఈ మిషన్‌ను మే 7న ఆరంభించారు. ఇదే సమయంలో భారత్ నుంచి దాదాపు 1.3 లక్షల మంది వివిధ దేశాలకు విమానాల ద్వారా వెనక్కు వెళ్లారని పౌరవిమానయాన శాఖ తెలిపింది. ప్రస్తుతం వందేభారత్ మిషన్‌లో 5వ దశ నడుస్తోంది. ఇందులో దాదాపు 1.3 లక్షల భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. (చదవండి : మానవాళికి మంచిరోజులు! ) -
భారతీయులకు షాకిచ్చిన కువైట్
కువైట్: గల్ఫ్ దేశాల్లో ఉన్న విదేశీ కార్మికుల సంఖ్యను తగ్గించాలని కోరుతూ కువైట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రవాసీ కోటా డ్రాఫ్ట్ బిల్లుకు ఆదేశ జాతీయ అసెంబ్లీ కమిటీ ఆమోదం తెలిపింది. దీని ప్రభావం గల్ఫ్ దేశాలలో ఉన్న 8 లక్షల మంది భారతీయులపై పడనుంది. ఈ బిల్లు ప్రకారం గల్ప్ దేశాలలో భారతీయుల జనాభాలో 15 శాతానికి మించకూడదు. గల్ఫ్‌లో ఉన్న విదేశీయుల జనాభాలో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. ప్రస్తుతం కువైట్ జనాభాలో 4.3 మిలియన్లు అయితే అందులో 3 మిలియన్లకు పైగా (30 లక్షలు) ప్రవాసీయులే ఉన్నారు. అంటే దాదాపు 8 లక్షల మంది భారతీయులను కువైట్ నుంచి తిరిగి స్వదేశానికి పంపనున్నారు. (కువైట్ నుంచి సొంత రాష్ట్రానికి..) కరోనా వైరస్ కారణంగా అక్కడి ప్రధాన వ్యాపారమైన చమురు ధరల క్షీణించడంతో కువైట్‌లో ఉన్న విదేశీయుల సంఖ్యను తగ్గించాలని స్థానిక ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి చట్టసభ సభ్యులు, ప్రభుత్వ అధికారులు మద్దతు తెలపడంతో సునాయాసంగా ఆమోదం లభించింది. గత నెలలో కువైట్ ప్రధాన మంత్రి షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబా విదేశియుల జనాభాను 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. అంతేగాక కువైట్‌లో ప్రవాసియుల సంఖ్యను క్రమంగా తగ్గించాలని కోరుతూ సమగ్ర ముసాయిదా బిల్లు చట్టాన్ని తాను శాసనసభ్యుల బృందంతో కలిసి అసెంబ్లీకి సమర్పించనున్నట్లు అసెంబ్లీ స్పీకర్ మార్జౌక్ అల్-ఘనేమ్ కువైట్ పేర్కొన్నారు. ఈ బిల్లులో తాము వైద్యులను, నైపుణ్యం కలిగిన మానవశక్తిని మాత్రమే నియమించుకుంటామని, నైపుణ్యం లేని కార్మికులను తిరిగి పంపించేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకారం.. ప్రభుత్వానికి నర్సులు, జాతీయ చమురు కంపెనీలలో వివిధ విభాగాల్లో ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నవారు సుమారు 28 వేల మంది ఉన్నారు. మెజారిటీ భారతీయులు 5.23 లక్షల మంది ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్నారు. అదనంగా, సుమారు 1.16 లక్షల మంది డిపెండెంట్లు ఉన్నారు. వీరిలో దేశంలోని 23 భారతీయ పాఠశాలల్లో 60,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. తాజా బిల్లు వీరందరి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో అక్కడున్న కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
ఆక్స్‌ఫర్డ్‌కు ఎన్నారై సోదరుల భారీ విరాళం
లండన్: భారతీయ సంతతికి చెందిన రూబేన్ సోదరులు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పార్క్ కాలేజీకి దాదాపు రూ.770 కోట్లు (8 కోట్ల పౌండ్లు) విరాళమిచ్చారు. స్కాలర్ షిప్ కార్యక్రమానికి ఈ నిధులను వెచ్చిస్తారు. డేవిడ్, సీమోన్ రూబేన్లు ముంబైకి చెందిన వారు. ది సండే టైమ్స్ గణాంకాలప్రకారం వీరిద్దరూ 16 బిలియన్ పౌండ్ల సంపదతో బ్రిటన్ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. రూబెన్ ఫౌండేషన్ ఇచ్చిన విరాళం చారిత్రాత్మకమని, పార్క్ కళాశాల ఇప్పుడు రూబెన్ కాలేజీగా మారిందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం తెలిపింది. (అలసిపోయాం.. ఇక ఆపండి: జార్జ్ సోదరుడి ఆవేదన) రత్తన్లాల్కు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ న్యూయార్క్: ప్రముఖ భారత సంతతి అమెరికన్ శాస్త్రవేత్త రత్తన్‌లాల్(75)ను ప్రతిష్టాత్మక వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వరించింది. 2020 సంవత్సరానికి సుమారు రూ.1.90 కోట్ల విలువైన ఈ బహుమతికి ఆయన్ను ఎంపిక చేసినట్లు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ పేర్కొంది. ‘రత్తన్‌లాల్ 50 ఏళ్లుగా నాలుగు ఖండాల్లో భూసార పరిరక్షణకు, 50 కోట్ల మంది రైతుల జీవనోపాధి పెంపునకు కృషి చేశారు. 200 కోట్ల ప్రజలకు ఆహార భద్రత కల్పించారు. వేలాది హెక్టార్ల భూమిలో సహజ ఉష్ణమండల పర్యావరణ వ్యవస్థలను కాపాడారు’ అని వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఆర్గనైజేషన్ కొనియాడింది. -
లోకమణికి డబ్బులు పంపిస్తున్న ఎన్నారైలు
సాక్షి, విశాఖపట్నం : ఆమె సేవ డీజీపీని కదిలించింది. సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. ఎన్నారైలు స్పందించారు. మరిన్ని సేవాకార్యక్రమాలు కొనసాగించేలా ఆర్థికసాయం అందించారు. పాయకరావుపేట శ్రీప్రకాష్ విద్యాసంస్థల్లో ఆయాగా పనిచేస్తున్న లోకమణి ఈనెల 15న వేతనం తీసుకుని ఇంటికి వెళ్తూ పాయకరావుపేట వై జంక్షన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు రెండు డ్రింక్ బాటిళ్లు కొనిచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి : మనసున్న మహిళకు డీజీపీ అభినందనలు) ఇది సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అయింది. డీజీపీ ప్రసంశలు అందుకోవడమే కాకుండా, కళాశాల యాజమాన్యం, స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబూరావులు ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ రెండు ఘటనలు చూసిన ఎన్నారైలు స్పందించారు. కాలిఫోర్నియాకు చెందిన ఎన్నారై రూ.37 వేలు, మరో ఎన్నారై సత్యప్రకాష్ రూ.40 వేలు ఆర్థిక సాయం అందించారు. ఫోన్‌నంబరు తెలుసుకుని తనతో మాట్లాడి బ్యాంకు ఖాతాలో ఈ నగదు మొత్తాన్ని జమ చేసినట్లు లోకమణి తెలిపింది. -
అధైర్యపడొద్దు .. నేనున్నా
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికాలో ఉన్న తెలుగువారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. అమెరికా ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని, అధైర్యపడొద్దని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ప్రఖ్యాత ‘న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో’ ప్రత్యేక స్క్రీన్ ఏర్పాట్ల ద్వారా సీఎం సందేశాన్ని వినిపించారు. ► ఏపీలో ఉన్న మీ కుటుంబసభ్యుల గురించి కలత చెందవద్దు. మా ప్రభుత్వం వారి ఆరోగ్య పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కోవిడ్– 19 నివారణకు ప్రభుత్వ యంత్రాంగం అంతా నిరంతరం శ్రమిస్తోంది. ► ఎక్కడ ఏ చిన్న ఘటన వెలుగులోకి వచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందించి ఉత్తమ వైద్యం అందిస్తోంది. తమ వారి కోసం ప్రవాసాంధ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ► ప్రవాసాంధ్రులకు భరోసా కల్పిస్తూ టైమ్ స్క్వేర్‌లో ముఖ్యమంత్రి జగన్ సందేశం ఇవ్వడంపై హర్షం వ్యక్తమవుతోందని నార్త్ అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ పండుగాయల తెలిపారు. -
విదేశాల్లో నేరుగా లిస్టింగ్..
న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు విదేశీ ఎక్సే్చంజీల్లో నేరుగా లిస్టయ్యే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇందుకు అనుగుణంగా కంపెనీల చట్టం, 2013కి సవరణలు చేయనుంది. మరోవైపు, ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో ప్రవాస భారతీయులు (ఎన్నారై) 100 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అనుమతులివ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం కొన్ని భారతీయ సంస్థల షేర్లు విదేశీ ఎక్సే్చంజీల్లో ట్రేడవుతున్నప్పటికీ.. అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్), గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) రూపంలో లిస్టయి ఉంటున్నాయి. నేరుగా విదేశాల్లో లిస్టింగ్ అవకాశం లభించిన పక్షంలో ఆయా సంస్థలు విస్తృత స్థాయిలో నిధులు సమీకరించుకునేందుకు మరిన్ని మార్గాలు లభించడంతో పాటు.. దేశంలోకి మరింతగా పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉండగలదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. దేశీ లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలు కూడా విదేశాల్లో లిస్టయ్యేందుకు వెసులుబాటునిచ్చేలా కంపెనీల చట్టంలో తగు మార్పులు చేయనున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ తెలిపారు. ఇది పూర్తిగా అమల్లోకి వచ్చేందుకు కొన్ని నెలలు పడుతుందని.. త్వరలో నియమ, నిబంధనలను నోటిఫై చేస్తామన్నారు. అటు కంపెనీల చట్టంలో 72 సవరణలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జైలు శిక్షల్లాంటి క్రిమినల్ చర్యల నిబంధనలను తొలగిస్తామని, పెనాల్టీల పరిమాణాన్ని కూడా తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎయిరిండియాలో 49%గానే విదేశీ ఎయిర్‌లైన్స్ వాటాలు.. భారీ రుణాలు, నష్టాల భారంతో అమ్మకానికి వచ్చిన ఎయిరిండియాలో ఎన్నారైల పెట్టుబడుల పరిమితిని 100%కి పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో విదేశీ ఎయిర్‌లైన్స్ సహా ఇతరత్రా విదేశీ సంస్థలు.. ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎయిరిండియాలో 49%కి మించి వాటాలు కొనుగోలు చేయడానికి ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. తద్వారా ఎయిరిండియా నియంత్రణాధికారాలు భారతీయుల చేతుల్లోనే ఉండేలా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్‌లో ఇతరత్రా ప్యాసింజర్ ఎయిర్‌లైన్స్‌లో ఎన్నారైలు ఆటోమేటిక్ పద్ధతిలో 100% వాటాలు కొనుగోలు చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ.. ఎయిరిండియాలో మాత్రం 49%కి మాత్రమే అనుమతులు న్నాయి. ఎయిరిండియా విషయంలో ఇదొక మైలురాయిలాంటి నిర్ణయంగా జవదేకర్ చెప్పారు. కంపెనీ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లినా.. ప్రయాణికులకు యథాప్రకారం మెరుగైన సేవలు అందిస్తుందని, పెట్టుబడి అవకాశాలు పెంచుకోగలదని ఆయన తెలిపారు. ఏప్రిల్ నుంచి బ్యాంకుల విలీనం అమల్లోకి.. ప్రభుత్వ రంగంలోని 10 బ్యాంకులను నాలుగు కింద విలీనం చేసే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. భారీ స్థాయికి చేరడం ద్వారా మెగా బ్యాంకులు.. ఇటు దేశీయంగాను, అటు అంతర్జాతీయంగాను మరింతగా పోటీపడగలవని, వ్యయాలు తగ్గించుకోగలవని ఆమె పేర్కొన్నారు. విలీనంతో ప్రభుత్వ రంగంలో ఏడు భారీ బ్యాంకులు, అయిదు చిన్న స్థాయి బ్యాంకులు మిగలనున్నాయి. కన్సాలిడేషన్ ప్రణాళిక ప్రకారం ఆంధ్రా బ్యాంకు.. కార్పొరేషన్ బ్యాంకును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయనున్నారు. అలాగే, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ .. యునైటెడ్ బ్యాంక్‌ను పంజాబ్ నేషనల్ బ్యాంకులో, సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకులో, అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకులో కలపనున్నారు. -
ప్రతిభకు పట్టం కడదాం..
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ ఏదైనా పట్టం కట్టేందుకు ‘సాక్షి’సిద్ధమైంది. రంగం ఏదైనా ప్రతిభే కొలమానంగా అవార్డులను అందించనుంది. త్యాగం, నైపుణ్యం, ప్రతిభ, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వెలికితీస్తోంది. ‘సాక్షి’ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ పేరిట సత్కరిస్తోంది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ‘సాక్షి’ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 6వ ఎడిషన్‌కు ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. మార్చి 31న సాయంత్రం 6 గంటల వరకు ఎంట్రీలను పంపవచ్చు. ఈసారి ఎంట్రీలను ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేయవచ్చు. ప్రతిభను గుర్తెరిగిన ఇతరులెవరైనా.. ఆయా వ్యక్తులు, సంస్థల తరఫున ఎంట్రీలను పంపవచ్చు. కొన్ని అంశాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకు కూడా అవార్డులు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ‘జ్యూరీ ప్రత్యేక ప్రశంస’కూడా లభించవచ్చు. సమాజహితం కోరే ముఖ్యులతో ఏర్పాటైన ‘జ్యూరీ’సాక్షికి లభించిన ఎంట్రీల నుంచి విజేతలను నిర్ణయిస్తుంది. నైపుణ్యాలను ప్రశంసించడం, సేవలను కొనియాడడం, సాధనను అభినందించడం ఎవరైనా చేయదగినదే. ఈ భావన కలిగిన వారంతా తమకు తెలిసిన ప్రతిభామూర్తుల్ని గుర్తించి, వారి పేర్లను ప్రతిపాదిస్తూ అవార్డుల కోసం ఎంట్రీలను పంపుతారని ‘సాక్షి’అభిలషిస్తోంది. సాక్షి చేస్తున్న ఈ కృషికి అందరూ చేయూతనివ్వండి. నామినేషన్ల ఎంట్రీలను నేరుగా అప్లికేషన్ ఫామ్‌లో ఇచ్చిన చిరునామాకు పంపవచ్చు. లేదా ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు www. sakshiexcellenceawards.com వెబ్‌సైట్‌కు లాగిన్ కావచ్చు. పూర్తి వివరాల కోసం ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు (వర్కింగ్ డేస్‌లో) 040–23322330 నంబరు ద్వారా లేదా sakshiexcellenceawards2019 @sakshi.com మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. -
కోరుకున్న గుడిలో.. నచ్చిన పూజ
సాక్షి, అమరావతి: ఆస్ట్రేలియాలో ఉంటున్న వెంకటేశ్వరరావుకు సింహాచలం లక్ష్మీ నర్సింహస్వామిపై ఎంతో గురి.. గతంలో విశాఖపట్నంలో ఉన్నప్పుడు ప్రతి ఏటా పుట్టినరోజున కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్లి పూజ చేయించేవాడు. అలా చేయకపోతే.. ఆ ఏడాది పనులు సజావుగా సాగవని అతని నమ్మకం. ఇప్పుడు విదేశాల్లో ఉంటున్నందున పుట్టినరోజ నాడు ప్రతి ఏటా సింహాచలం వచ్చి పూజ చేయించడం సాధ్యం కాని పని. ఇలాంటి వారి కోసం రాష్ట్ర దేవదాయ శాఖ ఎన్నారై సేవలు ప్రారంభించాలని నిర్ణయించింది. ఎన్నారైలే కాదు.. దేశంలో ఎక్కడున్నా సరే.. మీపుట్టిన రోజు నాడో, ఇతర ప్రత్యేక సందర్భాల్లోనే తమ ఇష్టదైవం ఆలయంలో పూజ, ఇతర సేవలు చేయించుకునే అవకాశాన్ని దేవదాయ శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. భక్తుడు దేశ, విదేశాల్లో ఎక్కడ ఉన్నా.. వారి పేరిట కోరుకున్న తేదీన ఎంచుకున్న పూజను ఆలయ పూజారి జరిపిస్తారు. ఇందుకోసం అన్ని దేవాలయాల సేవల్ని ఒకచోట అందుబాటులోకి తెస్తూ.. ప్రత్యేక వెబ్సైట్ రూపకల్పనకు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ ప్రక్రియలో గుళ్లలోని వివిధ పూజల టికెట్ ధరకు అదనంగా కొంత మొత్తాన్ని సర్వీసు చార్జ్ రూపంలో వసూలు చేస్తారు. పూజ అనంతరం భక్తుడికి ప్రసాదం వంటివి పంపేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు దేవదాయ శాఖ అధికారులు తెలిపారు. -
జనరంజకంగా వైఎస్ జగన్ పాలన
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు, ఏపీ హిందీ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సోమవారం సాయంత్రం డాలస్ ఎన్నారై వైఎస్సార్సీపీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన జనరంజకంగా సాగుతోందని, అన్ని వర్గాల ప్రజలు తమ జీవన స్థితిగతులు మెరుగుపడుతున్నాయని ఆనందం వెలిబుచ్చుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా రూపొందించిన ‘‘నవరత్నాల’’ పథకాలను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలనే ధృఢసంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనిచేస్తున్నారని యార్లగడ్డ పేర్కొన్నారు. ఎన్నారై వైఎస్సాసీపీ శ్రేణులు ఈ పథకాలకు సామాజిక మాధ్యమాల ద్వారా, వారి వారి సాంకేతిక విజ్ఞానం ద్వారా విస్తృత ప్రాచుర్యం కల్పించాలని కోరారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆమోదించిన ఆంగ్ల మాధ్యమ జీవోను యార్లగడ్డ విశ్లేషించారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ పాఠశాలల్లో తెలుగు కనపడి, వినపడి, నేర్పబడి, నేర్చుకోబడుతుందని అన్నారు. ఈర్ష్యా అసూయలకు పోకుండా, అసభ్యత అశ్లీలతలకు తావులేకుండా హుందాగా వ్యవహరిస్తూ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందించాలని ఈ సందర్భంగా యార్లగడ్డ విజ్ఞప్తి చేశారు. అనంతరం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను డాలస్ ఎన్నారై వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా సత్కరించాయి. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మాజీ ఎంపీ డాక్టర్ ఆత్మచరణ్‌రెడ్డి, కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి, వై.శ్రీనివాసరెడ్డి, క్రిస్టపాటి రమణ్‌రెడ్డి, పుట్లూర్ రమణ తదితరులు పాల్గొన్నారు. -
‘దిశ’కు ప్రవాసుల నివాళి
డల్లాస్ : అమెరికాలోని ప్రవాసులు ‘దిశ’కు శ్రద్ధాంజలి ఘటించారు. డల్లాస్ నగరంలోని జాయి ఈవెంట్ సెంటర్ ఫ్రిస్కోలో శోకతప్త హృదయాలతో ‘దిశ’ బంధువులు అభినవ్ రెడ్డి, సింధూరిలతో కలిసి డల్లాస్ ఫోర్టువర్థ్ కమ్యూనిటీ నాయకులు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా దిశ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ఇంతటి ఘాతుకానికి కారకులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇలాంటి ఆకృత్యాలు దేశవ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నా న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల పునరావృతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.రాజకీయ స్వలాభం కోసం, రాజ్యాంగ సవరణలు చేయకుండా నాయకులు ఇలాంటి సంఘటనలను ఖండిస్తారే కానీ, దోషులను శిక్షించడానికి ఎన్నో సంవత్సరాలు కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో పాఠ్యాంశాలతో పాటు సందర్భానుసారంగా, ఆపదలో ఉన్నప్పుడు పోలీస్ సిబ్బందికి ఆసుపత్రి సిబ్బందికి, దగ్గరలో ఉన్నవారికి సమాచారం అందజేసే విధంగా తగిన శిక్షణ ఇవ్వాలని కోరారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ముక్తకంఠంతో పలికారు. ఈ కార్యక్రమంలో డా. ప్రసాద్ తోటకూర, అజయ్‌రెడ్డి, శ్రీధర్ కొరసపాటి, రావ్ కలవల, గోపాల్ పొన్నంగి, జానకి మందాడి, రఘువీర్ బండారు, పవన్ గంగాధర, చిన్న సత్యం వీర్నపు, పోలవరపు శ్రీకాంత్, చంద్ర పోలీస్, శారద సింగిరెడ్డి, మాధవి సుంకిరెడ్డి, ఇంద్రాణి పంచార్పుల, మాధవి లోకిరెడ్డి, అనురాధ మేకల, సుధాకర్ కలసాని, మామిడి రవికాంత్ రెడ్డి, రామ్ అన్నాడి, అశోక్ కొండల, వేణు భాగ్యనగర్, సుంకిరెడ్డి నరేష్, తెలకపల్లి జయ, మధుమతి వ్యాసరాజు, దీప్తి సూర్యదేవర, లింగారెడ్డి అల్వా తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రాభివృద్ధి కోసం పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ పురపాలిక పరిధిలోని ఎదిర శివారులో 500 ఎకరాలలో ఐటీ టవర్, మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, ఇందులో పెట్టుబడులు పెట్టాలని ఎన్నారైలకు పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. పెట్టుబడులే లక్ష్యంగా మలేసియా, సింగపూర్ దేశాలలో పర్యటిస్తున్న మంత్రికి, తెలంగాణ సింగపూర్ కల్చరల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ వారితో పలు విషయాలపై చర్చించారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభు త్వం క్రియాశీల విధాన చర్యలు చేపట్టిందని, ఇందుకోసం పలు నిర్ధిష్టమైన విధానాలు తెచ్చిందని వివరించారు. -
థాయిలాండ్‌లో మరో ‘హౌడీ మోదీ’
-
థాయిలాండ్‌లో మరో ‘హౌడీ మోదీ’
బ్యాంకాక్ : అమెరికాలోని ఎన్నారైలో గత సెప్టెంబర్‌లో నిర్వహించిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఎన్నారైలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హ్యూస్టన్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి దాదాపు 50 వేల మంది ఎన్నారైలు హాజరవగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇలాంటి కార్యక్రమాన్నే థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నిర్వహించనున్నారు. థాయ్‌లాండ్‌లోని ఎన్నారైలో ప్రధాని మోదీతో సమావేశమయ్యేందుకు ‘సవస్దీ పీఎం మోదీ’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. భారత ఎంబసీ పర్యవేక్షించే ఈ కార్యక్రమం ఈరోజు (శనివారం) సాయంత్రం 6 గంటలకు బ్యాంకాక్‌లో జరుగుతుంది. సవస్దీ అంటే థాయ్ భాషలో శుభాకాంక్షలు చెప్పడం లేదా వీడ్కోలు చెప్పడం. ఈ సవస్దీ అనే పదం సంస్కృతంలోని ‘స్వస్థి’ అనే పదం నుంచి వచ్చిందని చెబుతారు. స్వస్థి అంటే శ్రేయస్సు అని అర్థం. ఈ సందర్భంగా సిక్కుల మత గురువు గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకార్థం నాణేన్ని విడుదల చేస్తారు. మరోవైపు థాయ్ భాషలో అనువదించిన ప్రసిద్ధ తమిళ గ్రంథం తిరుక్కురల్‌ను ఆవిష్కరిస్తారు. ఆదివారం థాయ్ ప్రధాని ప్రయూత్ చాన్ ఒ చా తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇదిలాఉండగా.. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్సీఈపీ) కార్యక్రమం నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం ఉదయం థాయ్‌లాండ్ బయల్దేరి వెళ్లారు. -
ప్రాజెక్టులతో ఏపీకి రండి సహకారమందిస్తాం
సాక్షి, తిరుమల: ఎన్ఆర్ఐలు ఉద్యోగాలు కల్పించేలా ప్రాజెక్టులతో ఏపీకి రావాలని ఇందుకు తమ వంతు సహకారం ఉంటుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శనివారం సింగపూర్‌లో జరిగిన శ్రీనివాస కల్యాణానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అక్కడి ఎన్ఆర్ఐలతో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు వైవీ సుబ్బారెడ్డి సమాధానమిచ్చారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి వారికి వివరించారు. మౌలిక సదుపాయాలు, పాలనలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి తెలియజేశారు. రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాల వ్యవస్థ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి దోహదపడుతుందన్నారు. ఆర్థిక మాంద్యంలోనూ రాష్ట్రం వెనుకబడకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సింగపూర్‌లో గాని తమ గ్రామాల్లో గాని ఏ సమస్య అయినా ఉందని చెబితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువచ్చి పరిష్కరిస్తామని ఆయన భరోసానిచ్చారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు బి.శ్రీనివాసరెడ్డి, కన్వీనర్ డి.ప్రకాష్‌రెడ్డి, సభ్యులు మహేష్‌రెడ్డి, వేణుగోపాలరెడ్డి, సత్య, నాగరాజు, సంతోష్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, వీరారెడ్డి పాల్గొన్నారు. -
జగనన్న దయతో సొంతూళ్లకు వచ్చాం
ఎన్ఏడీ జంక్షన్ (విశాఖ): దేశంకాని దేశం. వీసా గడువు తీరిన తరువాత అక్కడ దొంగచాటుగా బతకాల్సి వచ్చింది. మంచి ఉపాధి అని నమ్మించి ఏపీకి చెందిన వారిని బోగస్ ఏజెంట్లు మలేసియా తీసుకెళ్లి బానిసలుగా మార్చేశారు. అక్కడికి వెళ్లిన తరువాత వారి పాస్‌పోర్టులు తీసుకుని కూలి పనుల్లో చేర్పించారు. చివరికి అక్కడి ప్రభుత్వ దృష్టిలో వారు నేరస్తులుగా మారిపోయారు. అలాంటి దయనీయ స్థితిలో ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ ఫలితంగా మలేసియా ప్రభుత్వ క్షమాభిక్ష లభించింది. దానికి వారధిగా నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఎన్ఆర్టీసీ) నిలిచింది. దీంతో తొలి విడతగా 18 మంది ఆదివారం రాత్రి విశాఖ చేరుకున్నారు. వీరు విశాఖ చేరుకోగానే తమ బాధలు సాక్షితో చెప్పుకున్నారు. సీఎం జగనన్న మాకు మళ్లీ పునర్జన్మ ఇచ్చారని కన్నీటి పర్యంతమయ్యారు. మొత్తం ఖర్చులన్నీ భరించిన ఏపీ ప్రభుత్వం... మలేసియాలో బాధితుల్ని రప్పించడానికి ఆంధ్రప్రదేశ్, మలేసియా ప్రభుత్వ అధికారులతో ఎన్ఆర్టీసీ సమన్వయం చేసి అన్ని అనుమతులు సాధించింది. తొలి విడతలో వచ్చిన వారిలో కడప జిల్లా వారు ఆరుగురు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో ఆరుగురు, శ్రీకాకుంళ జిల్లా వాసులు ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లా వారు ముగ్గురు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ సొసైటీ చైర్మెన్ మేడపాటి వెంకట్ తెలిపారు. మలేసియా నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకు రావడానికి ఫీజులు.. జరిమానాలు.. చార్జీలు మొత్తం కలిపి ఒక్కొక్కరికి రూ. 32 వేలు చొప్పున ఏపీ ప్రభుత్వం భరించిందని పేర్కొన్నారు. తమను రక్షించాలని ఇప్పటి వరకూ 250 మంది బాధితులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. విశాఖ చేరుకున్న బాధితులు సాక్షితో మాట్లాడుతూ.. అక్కడ తమను చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరిగి ఇళ్లను చేరుకుంటామని అనుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు. కూలీలుగా మార్చేశారు మంచి ఉద్యోగమని ఏజెంట్లు చెప్పారు. కాని అక్కడికి వెళ్లిన తరువాత కూలీలుగా మార్చేశారు. చాలా ఇబ్బందులు పడ్డాం. సుమారు 12 నెలలనుంచి జీతాలు ఇవ్వలేదు. – పలిమెల మేరి, తూర్పుగోదావరి జిల్లా కార్ వాషింగ్ షెడ్డులో పెట్టారు... మంచి పరిశ్రమలో పని కల్పిస్తామని తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత కార్లు కడిగే పనిలో పెట్టారు. ఊరుకాని ఊరు వచ్చి ఏంచేయాలో తెలియని దుస్థితి. 8 నెలలుగా నరకంలో బతికాం. – వెంకటేష్, కడప -
ప్రభుత్వాసుపత్రికి 20 కోట్లు ఇచ్చిన పూర్వవిద్యార్థులు
సాక్షి, అమరావతి: అమెరికాలో స్థిరపడిన రంగరాయ వైద్యకళాశాల పూర్వ విద్యార్థులు (రంగరాయ మెడికల్ కాలేజీ అలుమిని ఆఫ్ నార్త్ అమెరికా–రాంకానా) రూ.20 కోట్లతో మాతాశిశు ఆరోగ్యకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం సచివాలయంలోని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) సమక్షంలో ఎంవోయూ కుదిరింది. దాదాపు రూ.20 కోట్లతో నిర్మించే మూడంతస్తుల నిర్మాణాలను 2020 డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్టు ఆర్ఎంసీఏఎన్ఏ ప్రతినిధులు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేంద్రంలో జీ ఫ్లస్ 1 నిర్మాణం దాదాపు పూర్తయింది. దీన్ని నిర్మించేందుకు గతంలోనే ఆర్ఎంసీఏఎన్ఏ ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖకు ప్రతిపాదనలు పెట్టుకున్నారు. ఆర్ఎంసీఏఎన్ఏ ప్రతిపాదనలో భాగంగా 2,3,4 అంతస్తుల నిర్మాణానికి తాజాగా ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. ఇక్కడ 2, 3, 4 అంతస్తుల్లో ప్రసూతి, చిన్నారుల పడకలు, ఎన్ఐసీయూ, ఫ్యాకల్టీ రూమ్‌లు, కాన్ఫరెన్స్ హాల్స్ నిర్మిస్తారు. కార్యక్రమంలో ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డా. కేఎస్ జవహర్‌రెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్తికేయ మిశ్రా, డీఎంఈ డాక్టర్ వెంకటేష్, ఆర్ఎంసీఏఎన్ఏ యాక్టింగ్ ప్రెసిడెంట్ ఏవీ సుబ్బారాయ చౌదరి, ముఖ్య దాత నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, ఓ.కృష్ణమూర్తి తదితరులున్నారు. -
ఆ విషయంలో మనోళ్లే ముందున్నారు!
ఐక్యరాజ్యసమితి: దేశం వలసబాట పడుతోంది. బతుకుదెరువుకోసమో, చదువుకోసమో, ఉపాధి కోసమో కారణమేదైనా కావచ్చు ప్రపంచ దేశాలతో పోలిస్తే అత్యధిక మంది భారతీయులు వివిధ దేశాల్లో వలసలుగా జీవిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 27.2 కోట్ల మంది ప్రజలు వివిధ దేశాల్లో వలస జీవనం సాగిస్తోంటే, ఒక్క భారత దేశంలోనే అత్యధికంగా 1.75 కోట్ల మంది ప్రజలు ప్రవాసజీవితాన్ని గడుపుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ సోషల్ ఎఫైర్స్ జనాభా విభాగం విడుదల చేసిన ఇంటర్నేషనల్ మైగ్రెంట్ స్టాక్ 2019 వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ప్రాంతాల వారీగా, స్త్రీ పురుషుల, వయసునుబట్టి వలసబాటపట్టిన వారి వివరాలను ఈ రిపోర్టు వెల్లడించింది. అంతర్జాతీయంగా అత్యధికమంది వలసబాటపట్టిన టాప్ టెన్ దేశాల్లోనే మూడొంతుల మంది ప్రవాసులు ఉన్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేశాయి. 1.75 కోట్లమంది మన దేశ ప్రజలు వివిధ దేశాల్లో వలసజీవితం సాగిస్తోన్న వారిలో అగ్రభాగాన ఉంటే మెక్సికో ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. ♦ 2015లో భారత దేశం వివిధ దేశాల నుంచి వచ్చిన 52 లక్షల మందికి ఆశ్రయం కల్పిస్తే, 2019కి ఆ సంఖ్య కొద్దిగా తగ్గి 51 లక్షలకు చేరింది. అంతర్జాతీయంగా 2010 నుంచి 2019 వరకు 0.4 శాతం మందికి భారత్ ఆశ్రయంకల్పిస్తూ నిలకడగా ఉంది. ♦ 207,000 మంది శరణార్థులకి మన దేశం ఆశ్రయమిస్తోంది. మన దేశంలో నివసిస్తోన్న అంతర్జాతీయ శరణార్థుల సంఖ్య 4 శాతం. ఇందులో మహిళా శరణార్థులు 48.8 శాతం. భారతదేశంలో ఆశ్రయంపొందుతోన్న శరణార్థుల్లో అత్యధిక మంది బాంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ నుంచి వచ్చినవారేనని ఈ రిపోర్టు వెల్లడించింది.