నిర్మించేందుకు సిద్ధమైన ఎన్‌ఆర్‌ఐలు
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ నగరంలో షిర్డీ సాయిబాబా ఆలయాన్ని భారీస్థాయిలో నిర్మించేందుకు తెలంగాణ ప్రవాసులు, ప్రవాసాంధ్రులు నడుం బిగించారు. ఈ నిర్మాణ కార్యక్రమానికి ఓంసాయి సంస్థాన్ ఆధ్వర్యంలో మెల్‌బోర్న్‌లో మంగళవారం ఫండ్ రైజింగ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.
బాలీవుడ్ స్టార్ రణదీప్ హుడా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లిబరల్ పార్టీ ట్రెజరర్‌గా పని చేస్తున్న రాంపాల్‌రెడ్డి ముత్యాల, ఓం సాయి ట్రస్ట్ ప్రెసిడెంట్ అనిల్ కొలనుకొండతోపాటు తెలంగాణ కమ్యూనిటీ గ్లోబల్ అంబాసిడర్ పట్కూరి బసంత్‌రెడ్డి, ప్రముఖ కవి అంద్శైఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నా రుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
మెల్‌బోర్న్‌లో షిర్డీ సాయి ఆలయం
Published Thu, Mar 3 2016 4:17 AM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM
Advertisement
Advertisement