Shiridi Sai Baba
-
New Year 2025: షిర్డీలో సంబరం.. రాత్రంతా దర్శనం
2024కి వీడ్కోలు పలుకుతూ, 2025కి స్వాగతం చెప్పే సమయం ఆసన్నమయ్యింది. ఈ నేపధ్యంలో నూతన సంవత్సరాన మహారాష్ట్రలోని షిర్డీలో కొలువైన బాబాను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే షిర్డీ చేరుకున్నారు. భక్తుల సౌకర్యార్థం డిసెంబర్ 31న రాత్రంతా బాబా ఆలయాన్ని తెరిచివుంచనున్నామని సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాలాసాహెబ్ తెలిపారు.షిర్డీ సాయిబాబా సంస్థాన్ ప్రస్తుతం నాలుగు రోజులపాటు షిర్డీ మహోత్సవ్(Shirdi Mahotsav)ను నిర్వహిస్తోంది. దీనిలో వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణం, సాయి ధర్మశాల తదితర ప్రాంతాల్లో ప్రత్యేక పండపాలను ఏర్పాటు చేశారు. దీనికితోడు దేశం నలుమూలల నుండి సుమారు 90 పల్లకీలు ఈ కార్యక్రమానికి తరలిరానున్నాయి.2025, నూతన సంవత్సరం వేళ భక్తులకు పంపిణీ చేసేందుకు సుమారు 120 క్వింటాళ్ల బూందీ ప్రసాదం ప్యాకెట్లు, సుమారు 400 క్వింటాళ్ల మోతీచూర్ లడ్డూ ప్యాకెట్లను సిద్ధం చేశారు. ఆలయ సముదాయం, దర్శనం క్యూ, సాయి కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో భక్తులకు ఈ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. మరోవైపు పోలీసు ఇన్స్పెక్టర్లు, క్విక్ యాక్షన్ టీమ్‌లు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్(Bomb Disposal Squad)లు షిర్డీలో అణువణువునా పహారా కాస్తున్నాయి. ఆలయ ప్రాంగణం, సాయి ఆశ్రమం, ప్రసాదాలయం తదితర ప్రదేశాలలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అంబులెన్స్‌లు, ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు.డిసెంబరు 31న భక్తులకు రాత్రంతా దర్శనాలు కల్పించనున్నందున 31న రాత్రి 10 గంటలకు జరిగే హారతి జనవరి 1న ఉదయం 5.15 గంటలకు జరిగే హారతి కార్యక్రమాలను రద్దుచేశారు. కాగా ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు షిర్టీకి చేరుకున్నారు. ఆలయానికి వెళ్లే రహదారులన్నీ కిక్కిరిసిపోవడంతో భక్తులు బాబా దర్శనం కోసం క్యూలలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది.ఇది కూడా చదవండి: New Year 2025: జనవరి ఒకటి.. ప్రపంచ జనాభా 809 కోట్లు.. టాప్‌లో భారత్ -
యాచకుడే దాతగా మారిన వేళ.. రూ.2 లక్షల విరాళం
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): యాచకుడే దాతగా మారాడు...ఆంధ్రా షిరిడీ ముత్యాలంపాడు శ్రీషిరిడీ సాయిబాబా మందిరంలో లోక కల్యాణార్ధం చేపట్టిన కోటి రుద్రాక్ష అభిషేక, అర్చనకు రూ.2లక్షల విరాళమిచ్చాడు. ఆలయంలో 2023 మార్చి 28న తలపెట్టిన ఈ కార్యక్రమానికి యాచకుడు యాదిరెడ్డి గురువారం రూ.2 లక్షల విరాళాన్ని మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డికి అందజేశాడు. యాదిరెడ్డి గతంలో మందిరంలో గోశాల, దత్తాత్రేయస్వామివారికి వెండి ఆభరణాలు, నిత్యాన్నదానం తదితర కార్యక్రమాలకు రూ.9 లక్షలు విరాళంగా ఇచ్చాడు. -
షిర్డీ ఆలయానికి భారీగా ఆదాయం.. మూడు రోజుల్లోనే రూ. 5 కోట్లు
షిర్డీ: ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలో ఇటీవల మూడు రోజులపాటు జరిగిన గురుపౌర్ణమి ఉత్సవాల్లో భక్తులు భారీగా విరాళాలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు హుండీలో నగదు, బంగారు, వెండి వస్తువులు, కౌంటర్లవద్ద చెక్కులు, వివిధ రకాల చెల్లింపుల ద్వారా బాబా ఆలయ సంస్ధాన్‌కు ఏకంగా రూ.5.57 కోట్లు విరాళాలు వచ్చాయి. ఏటా షిర్డీ పుణ్యక్షేత్రంలో గురుపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌వల్ల ఆలయం మూసి ఉంచడంతో వివిధ పండుగలకు, ఉత్సవాలకు భక్తులు రాలేకపోయారు. ఈ ఏడాది కరోనా వైరస్ నియంత్రణలోకి రావడంతో ప్రభుత్వం లాక్డౌన్ అంక్షలన్నీ ఎత్తివేసింది. ఆ తరువాత గురుపౌర్ణమి ఉత్సవాలు జరగడంతో భక్తులు పోటీపడుతూ షిర్డీకి చేరుకున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌సహా దేశంలోని వివిధ ప్రాంతాలు, నలుమూలల నుంచి సుమారు మూడు లక్షలకుపైగా భక్తులు వచ్చి బాబా సమాధిని దర్శించుకున్నారు. మూడు రోజులపాటు షిర్డీ పుణ్యక్షేత్రం భక్తులతో పులకించిపోయింది. ఈ సందర్భంగా బాబా సమాధి ఆలయంలో, పరిసరాల్లో ఏర్పాటు చేసిన హుండీలలో భక్తులు భారీగా విరాళాలు సమర్పించుకున్నా రు. గురుపౌర్ణమి ఉత్సవాలు ముగిసిన తరువాత హుండీలలో సమర్పించిన నగదు, బంగారు, వెండి వస్తువుల రూపంలో సమర్పించిన కానుకలు, విరాళాలు సేకరించే కౌంటర్లవద్ద భక్తులు చెల్లింపులను లెక్కించారు. అందులో సుమారు రూ.5.57 కోట్లు విరాళాలు వచ్చినట్లు బాబా సంస్ధాన్ తెలిపింది. ఇందులో హుండీలలో రూ.2,16,84,939 నగదు, విరాళాలు సేకరించే కౌంటర్లవద్ద రూ.1,59, 18,974 నగదు, అదేవిధంగా చెక్, డీ.డీ., మనీ అర్డర్, డెబిట్, క్రెడిట్ కార్డు, ఆన్లైన్ చెల్లింపుల ద్వారా రూ.1,36,38,000 మేర వచ్చాయి. విదేశీ కరెన్సీ రూపంలో రూ.19,80,094 వచ్చాయి. అలాగే రూ.22.14 లక్షల విలువచేసే 479.500 గ్రాముల బంగారం, రూ.3.22 లక్షలు విలువ చేసే 8,067.800 గ్రాముల వెండి వస్తువులున్నాయి. 1.35 లక్షల హెక్టార్లలో పంటనష్టం: ఫడ్నవీస్ నాగ్‌పూర్/చంద్రాపూర్: వరదల కారణంగా నాగ్‌పూర్ డివిజన్లో దాదాపు 1,35,000 హె క్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం తెలిపారు. హింగ్‌ఘాట్, చంద్రాపూర్ జిల్లాల్లో మంగళవారం వర్ష ప్రభావిత గ్రామాలను సందర్శించిన అనంతరం ఫడ్నవీస్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాగ్‌పూర్ డివిజన్లో ముఖ్యంగా చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని చెప్పారు. ప్రాథమిక పరిశీలన ప్రకారం నాగ్‌పూర్ డివిజన్లో వరదలతో 1,35,000 హెక్టార్ల భూమిలో పంటలు దెబ్బతిన్నాయని, పంట నష్టాలపై సర్వే జరుగుతోందని, వీలైనంత త్వరగా నష్టపరిహారం అందించేందుకు యంత్రాంగం కృషి చేస్తున్నదన్నారు. అలాగే జిల్లాలోని చిమూర్ తహసీల్‌లోని నవేగావ్ (పేథ్)లో పంట నష్టాన్ని కూడా ఫడ్నవీస్ పరిశీలించారు. -
ఆమె గళమే ఒక అర్చన...
Devotional Singer Kavita Paudwal Birthday Special: మీరు విఘ్నేశ్వరుని భక్తులా? నిన్న మొన్న విడుదలైన అనురాధా పౌడ్వాల్ భజన‘మంగళకర్త సుఖ్ కే దాతా’ వినండి. ఆదిశక్తిని స్తోత్రించాలా?‘అంబే తూహై జగదంబే కాళీ’ వినండి. సాయి బాబా భక్తులైతే అనురాధా పౌడ్వాల్ పాడిన ‘షిర్డీ సాయిబాబా అమృత్వాణి’ ఉంది. అనురాధా పౌడ్వాల్ సినీ గాయనిగా ఎంత ఉల్లాసాన్ని పంచిందో భక్తి గాయనిగా అంత ఆధ్యాత్మికతనూ పంచింది. ఆమె కుమార్తె కవితా పౌడ్వాల్ ఇప్పుడు దేశంలో ప్రఖ్యాత భక్తి గాయని. దేశం అభిమానించే ఈ గొప్పగాయని 68వ పుట్టినరోజు నేడు. తెలుగువారిలో సాయిభక్తులకు అనురాధా పౌడ్వాల్ పాడిన ‘సాయి అమృతవాణి’ సుపరిచితం. తెలుగులో ఆమె పాడిన భక్తి గీతం అది. తెలుగులోనే కాదు టి–సిరీస్ చొరవతో సాయి భక్తి గీతాలను ఆమె అనేక భాషల్లో పాడింది. హిందీలో పాడిన భక్తి సంగీతం ఉత్తరాదిలో ఆమెను ఇంటింటి గాయనిగా చేసింది. ప్రతి ఉదయం ఆమె పాటతో నిద్ర లేచే కోట్లాది కుటుంబాలు ఉన్నాయి. ఆమె ముఖచిత్రం ముద్రించిన సిడిలు, డివిడిలు నేటికీ అమ్ముడుపోతున్నాయి. యూట్యూబ్‌లో ఆమె భక్తి పాటలకు లక్షలాది హిట్స్ ఉంటాయి. శివుడు, వైష్ణోదేవి, హనుమంతుడు, గణేశుడు, లక్ష్మీదేవి... ప్రతి దేవుడివి, దేవతవి భక్తి గీతాలు అనురాధ పౌడ్వాల్ పాడింది. సినిమా సంగీతంలో కెరీర్ పీక్‌లో ఉండగా వాటి నుంచి విరమించుకుని తన జీవితాన్ని భక్తి సంగీతానికే అంకితం చేస్తానని ప్రకటించిన గాయని అనురాధా పౌడ్వాల్. జాతకంలో ఉంది అనురాధా పౌడ్వాల్‌కు పాటలంటే ఆసక్తి ఉన్నా పాడాలని అనుకునేది కాదు. లతా మంగేశ్కర్ పాటలంటే మాత్రం చెవి కోసుకునేది. సరదాకి కాలేజీల్లో, కొన్ని స్టేజ్ షోలలో మైక్ అందుకునేది. అయితే టీనేజ్‌లో ఉండగా ఆమెకు న్యుమోనియా వచ్చి 40 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఊపిరి తిత్తులు శక్తికోల్పోయి ఆమె గొంతు పూర్తిగా పోయింది. ఆ సమయంలో ఆమెకు ధైర్యం కోసం మేనమామ ఒక టేప్ రికార్డర్, లతా పాటలున్న కేసెట్లు ఇచ్చి వెళ్లాడు. 40 రోజులు ఆ పాటలు వింటూనే జబ్బు నుంచి బయటపడింది. ఆ తర్వాత ఆమె గొంతులో ఒక మెలొడీ వచ్చిందని అనురాధా చెప్పుకుంది. లతాలాగా ప్లేబ్యాక్ సింగర్ కావాలని ఆమెకు ఉండేది. 18 ఏళ్లకు సంగీత సహాయకుడు అరుణ్ పౌడ్వాల్తో పెళ్లవగా అతడు ప్రోత్సహించేవాడు. ఒకసారి అతడు ఆమెను రికార్డింగ్ స్టూడియోకి తీసుకెళితే అక్కడ లతా పాడుతున్న పాటను క్షుణ్ణంగా గమనించిన అనురాధా ఆ తర్వాతి వారం ఆల్ ఇండియా రేడియో యువవాణిలో యథాతథంగా పాడి శ్రోతలను ఆకర్షించింది. మ్యూజిక్ డైరెక్టర్స్ ఆ ప్రోగ్రామ్ విని ఆమె గురించి ఆరా తీశారు. ఎస్.డి.బర్మన్ ఆమెతో ‘అభిమాన్’ సినిమాలో ఒక శ్లోకం కూడా పాడించాడు. అయితే ఆ తర్వాతి ప్రయాణం సులువు కాలేదు. ఆమెకు అవకాశాలు రాలేదు. ఒక జ్యోతిష్యుడి దగ్గరకు వెళితే ‘నువ్వు భవిష్యత్తులో భక్తిగాయనివి అవుతావు’ అని చెప్పాడు. అది విని అనురాధ ఏడ్చింది. ఎందుకంటే ఆమెకు ప్లేబ్యాక్ సింగర్ కావాలని ఉంది. ప్రతి పాటా పెనుగులాట సుభాష్ ఘాయ్ తీసిన ‘హీరో’లో ‘తూ మేరా జానూ హై’ పాట అనురాధా పౌడ్వాల్ పాడింది. ఆ పాట హిట్ అయ్యింది. ఆ తర్వాత ‘ఉత్సవ్’లో పాడింది. కాని ఆమెకు అవకాశాలు రాలేదు. ఆమెతో పాడించుకుంటే మొత్తం పాడించుకోండి... ఒకటి రెండు పాటలు ఆమెకు ఇచ్చి మిగిలినవి మా చేత పాడించుకోవాలనుకుంటే మేము పాడము అని ఆశా, లతా హెచ్చరిస్తే సంగీత దర్శకులు వెనుకంజ వేసేవారని అంటారు. దాంతో అనురాధ కేవలం ట్రాక్ సింగర్‌గా మిగలాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమె విరక్తి చెంది భక్తి సంగీతంలోకి మళ్లుదామని ఎంత ప్రయత్నించినా మ్యూజిక్ కంపెనీలు ఆ సంగీతానికి మార్కెట్ లేదు అని తిరగ్గొట్టాయి. అప్పుడు అనురాధ పౌడ్వాల్ అప్పుడప్పుడే సంగీత రంగంలో ఎదుగుతున్న టి–సిరీస్ దగ్గరకు వెళ్లింది. దాని అధినేత గుల్షన్ కుమార్. అతడు ఆ సమయంలోనే నదీమ్– శ్రావణ్ చేత ఒక 30 పాటలు చేయించి (సమీర్ రాశాడు) వాటిని మూడు సినిమాలకు పంచి మహేశ్ భట్ చేత మూడు సినిమాలు తీయించాడు. అవే ఆషికీ, దిల్ హై కి మాన్తా నహీ, సడక్. ఆ పాటలన్నీ అనురాధా పౌడ్వాల్ చేత పాడించాడు. ఆ మూడు సినిమా లు సూపర్‌హిట్ అయ్యాయి. అనురాధ స్టార్‌గా అవతరించింది. మహా ప్రభావం అనురాధ పౌడ్వాల్, కుమార్ షాను, ఉదిత్ నారాయణ్ కలిసి ఆ సమయంలో సూపర్ హిట్స్ పాడారు. అనురాధ పాడిన ‘ధక్ ధక్ కర్నే లగా’ (బేటా) పాట మాధురి దీక్షిత్‌కు లైఫ్ ఇచ్చింది. ‘నజర్ కే సామ్నే జిగర్ కే పాస్’ (ఆషికీ) ‘ముఝె నీంద్ న ఆయే’ (దిల్), ‘కెహ్ దోకి తుమ్’ (తేజాబ్), ‘బహుత్ ప్యార్ కర్తేహై’ (సాజన్)... అనురాధా పౌడ్వాల్‌కు స్టార్‌డమ్‌ను తెచ్చి పెట్టాయి. గుల్షన్ కుమార్ సినిమాల మ్యూజిక్ రైట్స్ కొంటూ అనురాధా పౌడ్వాల్ చేతే పాడించాలని చెప్పడంతో లతా, ఆశాలు తెల్లముఖం వేయాల్సి వచ్చింది. మరోవైపు గుల్షన్ కుమార్ అనురాధా పౌడ్వాల్ ఫొటోతో భక్తి గీతాల క్యాసెట్లు రిలీజ్ చేసి ఆమెను ఇంటింటికి చేరువ చేశాడు. కాని 1997 లో కేవలం 41 ఏళ్ల వయసులో గుల్షన్ కుమార్ హత్యకు గురవడం అనురాధా పౌడ్వాల్ మానసిక స్థితిని గట్టి దెబ్బ కొట్టింది. అప్పటికే ఆమె కేవలం టి–సిరీస్‌కే పాడతాను అని ప్రకటించి ఉండటంతో అల్కా యాగ్నిక్ పుంజుకుంది. దాంతో అనురాధ మరోసారి భక్తి వైపు మనసు లగ్నం చేసి ఆ సంగీతానికి అంకితమైంది. మళ్లీ సినిమా సంగీతం వైపు రాలేదు. భర్త, కుమారుడు అకాల మరణం చెందడం అనురాధ జీవితంలో పెను విషాదం. ఆమె కుమార్తె కవిత పౌడ్వాల్ సినీ సంగీతం వైపు రాక తల్లిలాగే భక్తి సంగీతంలో కొనసాగుతూ ఉంది. అనురాధ అరాధనా స్వరం కొనసాగాలని కోరుకుందాం. -
శిరిడి సాయిబాబా ఆలయం మూసివేత
-
పిలిస్తే పలుకుతా..!
దైవం మానుష రూపేణా... అన్నదానికి నిలువెత్తు నిదర్శనం షిరిడీ సాయి జీవితం. బాబా బోధల్లో దానధర్మాలు చేయడం, ఇతరులకు ఆపద సమయంలో సాయం చేయడం ప్రధానమైనవి. ఎప్పుడూ సత్యం మాట్లాడాలి. ధర్మమార్గాన్ని అనుసరించాలి. దొంగతనం, వ్యభిచారం చేయరాదు. మూఢనమ్మకాలను, మూర్ఖపు ఆలోచనలు విడిచిపెట్టాలి. సమాజ శ్రేయస్సుకు తోడ్పడే శుభకార్యాలు ఆచరించాలి. అయితే మంచి చేయకుండా కొందరు అంతరాయాలు కల్పిస్తారు కాబట్టి కార్యం పూర్తయ్యే వరకూ గుప్తంగా ఉంచటం మంచిది. హింసతో చేసినది ఎంతటి మహత్కార్యమైనా అది శుభప్రదం కాదు. కనుక ఏ పనిలోనూ హింసకు తావివ్వరాదు. అహంకారాన్ని పరిత్యజించాలి. అహంకారాన్ని వదలిపెట్టకుండా షిరిడీ వచ్చినా ప్రయోజ నం శూన్యం. మంచిపనులకు ఫలం సుఖం రూపంలోనూ, చెడుపనులకు ఫలం కష్టం రూపంలోనూ అనుభవించవలసి ఉంటుంది. అయితే ఆయన చెప్పేది ఒకటే, జలతారు వస్త్రం ఇవ్వడానికి తాను సిద్ధపడితే గుడ్డపీలికలు కోరుకోవద్దంటాడు. అంటే ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో తనకు తెలుసునని, అల్పమైన కోరికలు కోరకుండా, ఆత్మజ్ఞానం కలగాలని కోరుకున్న వారికి తాను అన్నీ ఒసగుతానంటాడు. మొక్కులు మొక్కి, అది తీరగానే అది చేస్తాం యిది చేస్తాం అని ఆ తర్వాత ముఖం చాటేసేవారిని సాయినాథుడు వదలడు. వారినుంచి తనకు రావలసిన బాకీని బహుచక్కగా వసూలు చేసుకుంటాడు. సమాధి నుంచే తాను భక్తులు కోరిన కోరికలు తీరుస్తానని చెప్పిన సాయిభగవానుడు తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం ఒక్కనాటికి కూడా మరచిపోలేదు. ఆయన మహా సమాధి చెంది వందేళ్లు గడుస్తున్నా, ప్రశాంత చిత్తంతో మొరపెట్టుకుంటే చాలు... భక్తుల మొర ఆలకిస్తాడు. కోరినది ఇస్తాడు. అందుకు ఆయన భక్తులే సాక్షులు. సాయిబాటలో నడవాలంటే ముందుగా సాటి మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్చుకోవాలి. హింసతో కూడుకున్నది ఎంతటి మహత్కార్యమైనా అది శుభప్రదం కాదు. కనుక ఏ పనిలోనూ హింసకు తావివ్వరాదు. అహంకారాన్ని వదలిపెట్టకుండా షిరిడీ వచ్చినా ప్రయోజ నం శూన్యం. -
మెల్బోర్న్లో షిర్డీ సాయి ఆలయం
నిర్మించేందుకు సిద్ధమైన ఎన్ఆర్ఐలు సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియా మెల్బోర్న్ నగరంలో షిర్డీ సాయిబాబా ఆలయాన్ని భారీస్థాయిలో నిర్మించేందుకు తెలంగాణ ప్రవాసులు, ప్రవాసాంధ్రులు నడుం బిగించారు. ఈ నిర్మాణ కార్యక్రమానికి ఓంసాయి సంస్థాన్ ఆధ్వర్యంలో మెల్బోర్న్లో మంగళవారం ఫండ్ రైజింగ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. బాలీవుడ్ స్టార్ రణదీప్ హుడా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లిబరల్ పార్టీ ట్రెజరర్‌గా పని చేస్తున్న రాంపాల్రెడ్డి ముత్యాల, ఓం సాయి ట్రస్ట్ ప్రెసిడెంట్ అనిల్ కొలనుకొండతోపాటు తెలంగాణ కమ్యూనిటీ గ్లోబల్ అంబాసిడర్ పట్కూరి బసంత్‌రెడ్డి, ప్రముఖ కవి అంద్శైఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నా రుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
కోకిలమ్మ...
గాయనీమణి కోకిల పాడాలంటే వసంతం రావాలి. కానీ ఆమె ఏడాది పొడవునా పాడుతూ నిత్యం వసంతాన్ని గుర్తు చేస్తుంది. ఇప్పుడా కోకిల 77వ పుట్టిన రోజు వచ్చింది. నాకు పుట్టిన రోజు చేసుకునే అలవాటే లేదంటోంది. కానీ ఆమె పుట్టిన రోజును గుర్తు చేసుకోవడం సంగీతాభిమానులకు ఉషస్సులాంటిది. ఈ నెల 23వ తేదీ ప్రముఖ గాయని ఎస్. జానకి పుట్టిన రోజు సందర్భంగా... జానకిగారు డౌన్ టు ఎర్త్‌కి చిరునామా. ఎంత పేరు సంపాదించినా కించిత్తు గర్వం లేకపోగా అందరితో బాగా కలిసిపోతారు. నిర్మొహమాటంగా మాట్లాడతారు. ఎవరికీ భయపడరు. ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. పెద్దవారంటే ఎంతో గౌరవం. సంగీతమంటే ప్రాణం. ఆమెకు దేవుడంటే ఇష్టం. షిరిడీ సాయిబాబా భక్తురాలు. ఆవిడ బెడ్రూమ్లో దేవుళ్లు, దేవతల చిత్రపటాలు ఎన్నో ఉంటాయి. ఎంతోమంది బీదవాళ్లకు సాయం చేసారు. కానీ ఆ విషయాన్ని ఆమె చెప్పుకోరు. ఆవిడను దగ్గరి నుంచి చూసిన కొందరికే తెలిసిన సంగతి అది. ఎప్పుడూ సాదాసీదాగా, నవ్వుతూ ఉండడం ఆవిడకి ఇష్టం. ఆస్తమాను లెక్కచేయని గాయని... కొత్త గాయకులకు మీరిచ్చే సందేశం ఏమిటంటే... ‘‘చిన్న పిల్లలు చక్కగా పాడుతున్నారు, బాగా శిక్షణ పొంది పాడుతున్నారు. వారికి నేనిచ్చే సందేశం ఏముంటుంది’’ అని సందేశం అనే మాటనే కొట్టిపారేస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా, జీవితంలో ఎలాంటి ఒడుదొడుకులు ఎదురైనా గాయకులు పాటకు దూరం కాకూడదని మాత్రం చెబుతారు. ‘‘నాకు 24 ఏళ్ల వయసులో ఆస్తమా వచ్చింది. ఆ జబ్బుని లెక్కచేయకుండా పాడాను. గాయకులకు అంతటి నిగ్రహశక్తి ఉండాలి. పాడగలగడం దేవుడిచ్చిన వరం. పాటే దైవం. ఓంకారమే దైవనాదం. గానం గాయకులకూ, శ్రోతలకూ ప్రాణదీపం’’ అంటారు. అభిమానమే అవార్డు! ఆమె చిన్నప్పటి నుంచి లతామంగేష్కర్, మహమ్మద్ రఫీ పాటలను ఇష్టంగా వినేది. ఈ ఫీల్డులోకి వచ్చిన తర్వాత జిక్కి, లీల, సుశీల, బాలసరస్వతి పాటలను గానామృతాన్ని గ్రోలుతున్నంత శ్రద్ధగా వినేది. అవార్డుల ప్రస్తావన వస్తే... ‘‘ప్రభుత్వాలు ఇచ్చే పురస్కారాలన్నీ ఆ రోజు పేపర్లో చదివి మర్చిపోయేవే. నా పాటను విని ఆనందించే అభిమానుల ప్రేమ, వారి ఆత్మీయతలను మించిన అవార్డు మరొకటి ఉండదు. అది నాకు సమృద్ధిగా అందింది’’ అంటారు. యువ గాయనీ గాయకులతో ఆవిడ ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు, ఆదరిస్తారు. ఒకరి పాటలో తప్పులు పట్టడం ద్వారా తనకు ఎక్కువ తెలుసనే భావాన్ని ధ్వనింప చేయడం ఆవిడకు తెలియదు. చిన్న పిల్లలు పాడుతున్నా... శ్రద్ధగా వింటూ తన్మయత్వంలో మునిగిపోతారామె. నా సంగీత దర్శకత్వంలో ‘నరుడా ఓ నరుడా (భైరవద్వీపం)’ పాటకి ఆమెకి నంది అవార్డు వచ్చింది. ‘అనుబంధం’ టీవీ సీరియల్లో ‘ఇది దీపాలు పెట్టేవేళ’ పాటకి కూడా నంది అవార్డు వచ్చింది. ఆరున్నర దశాబ్దాల అనుబంధం... జానకిగారితో మాది 65 ఏళ్ల అనుబంధం. మా బాబాయిగారి (మాధవపెద్ది సత్యంగారు) పెళ్లిలో జానకిగారు, ఆవిడ అక్కయ్య రాధగారు మా అమ్మగారి కోరిక ప్రకారం కచేరీ చేశారు. ఆ ఫొటో మా దగ్గర ఇంకా పదిలంగా ఉంది. ఇన్నేళ్ల మా అనుబంధంలో ఎప్పుడూ వివాదాలు రానేలేదా అంటే వచ్చాయి. ఎక్కువ సార్లు సంగీతం మీదనే వాదులాడుకున్నాం. మా అక్కాతమ్ముళ్ల మధ్య నిష్టూరాలు, అలకలు వస్తూ ఉంటాయి. అవే సమసిపోతూ ఉంటాయి. అనుబంధం, ఆప్యాయతలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. - మాధవపెద్ది సురేష్ (సంగీత దర్శకులు) నాకు తెలిసిన జానకిగారు... ⇒ ఆమెకు ‘కారం’ మీద ‘మమకారం’ ఎక్కువ. ⇒ ఆవిడకు మా నిర్మల ఆస్థాన వంటమనిషి. నేనప్పుడప్పుడు డ్రైవర్ని. ⇒ ప్రఖ్యాత సినీనటులు రజనీకాంత్, కమలహాసన్, రాజబాబు, కన్నడ హీరో రాజ్‌కుమార్ వంటి ప్రఖ్యాత నటులు ఆమెతో పాటలు పాడారు. ⇒ ప్రఖ్యాత షెహనాయ్ వాద్యకారుడు భారతరత్న బిస్మిల్లాఖాన్, ప్రముఖ వేణుగాన విద్వాంసులు శ్రీ హరిప్రసాద్ చౌరాసియా, విఖ్యాత నాదస్వర విద్వాంసులు కారుమంచి అరుణాచలం, విశ్వవిఖ్యాత వాయులీన విద్వాంసుడు ఎం.ఎస్.గోపాలకృష్ణన్, కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, కె.జె.ఏసుదాస్ లాంటి హేమాహేమీలతో మంచి పాటలు పాడారు. ‘మౌనపోరాటం’ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. భారతీయ భాషలలో సుమారు 20 వేల పాటలు పాడారు. -
'షిర్డిసాయి' రక్షణ కోసం సుప్రీం కోర్టుకు!
ఢిల్లీ: షిర్డిసాయి విగ్రహాల రక్షణ కోసం సాయిధామ్ చారిటబుల్ ట్రస్ట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సాయిధామ్ చారిటబుల్ ట్రస్ట్ మహారాష్ట్రలోని అన్ని దేవాలయాలతోసహా సాయి ఆలయ వ్యవహారాలు చూస్తోంది. షిర్డిసాయికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిరోధించాలంటూ ఈ ట్రస్ట్ దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసింది. ద్వారక శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యలను ట్రస్ట్ కోర్టు దృష్టికి తీసుకు వెళ్లింది. దేశంలో ఏ దేవాలయంలో కూడా షిర్డి సాయి విగ్రహాలు తొలగించకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని ట్రస్ట్ కోరింది. స్వరూపానంద సరస్వతి ఏమన్నారు? షిర్డీ సాయిబాబా దేవుడు కాదని, మనిషిని దేవుడిగా పూజించవద్దని స్వరూపనంద సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా షిర్డీసాయి బాబాకు ఆలయాలు కట్టడం సరికాదని సెలవిచ్చారు. పనిలో పనిగా హిందువులను విభజించేందుకే అంతర్జాతీయ శక్తులు బాబాను సీన్లోకి తెచ్చాయన్నారు. అల్లాను కొలుస్తూ మాంసం తినే సాయి బాబా హిందూ దేవుడు ఎలా అవుతారని స్వరూపానంద సరస్వతి అన్నారు. సాయి భక్తులు సనాతన దేవుళ్ల బొమ్మలతో సొమ్ము చేసుకున్నారని విమర్శించారు. వాళ్లు మన దేవుడి బొమ్మలు ఉపయోగించకపోతే వాళ్లకు ఎవరూ ఏమీ ఇవ్వరని చెప్పారు. ప్రజలకు ఎవరిని కావాలంటే వారిని కొలుచుకునే హక్కు, స్వేచ్ఛ ఉన్నాయని, అయితే సాయిబాబా తనను తాను దేవుడిగా చెప్పుకొనే ప్రయత్నం చేయడం మాత్రం తమకు ఆమోదయోగ్యం కాదని స్వరూపానంద పేర్కొన్నారు. నాగా సాధువులు కూడా శంకరాచార్యకు మద్ధతుగా నిలిచారు. శంకరాచార్యను ఎవరైనా అవమానిస్తే తాము వీధుల్లో నిరసనకు దిగుతామని హెచ్చరించారు. ఈ అంశాన్ని వారు ఆధ్యాత్మిక యుద్ధంగా కూడా చెప్పారు. ** -
'షిర్డీ' పేల్చివేస్తామన్న బెదిరింపులపై కర్నూలు భక్తుల భయాందోళనలు