
గౌతంరెడ్డికి రూ.2లక్షల నగదు అందజేస్తున్న యడ్ల యాదిరెడ్డి
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): యాచకుడే దాతగా మారాడు...ఆంధ్రా షిరిడీ ముత్యాలంపాడు శ్రీషిరిడీ సాయిబాబా మందిరంలో లోక కల్యాణార్ధం చేపట్టిన కోటి రుద్రాక్ష అభిషేక, అర్చనకు రూ.2లక్షల విరాళమిచ్చాడు.
ఆలయంలో 2023 మార్చి 28న తలపెట్టిన ఈ కార్యక్రమానికి యాచకుడు యాదిరెడ్డి గురువారం రూ.2 లక్షల విరాళాన్ని మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డికి అందజేశాడు.
యాదిరెడ్డి గతంలో మందిరంలో గోశాల, దత్తాత్రేయస్వామివారికి వెండి ఆభరణాలు, నిత్యాన్నదానం తదితర కార్యక్రమాలకు రూ.9 లక్షలు విరాళంగా ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment