abhishekam
-
సినిమాల్లో కూడా అవకాశాలొచ్చాయి.. కానీ: అభిషేకం సీరియల్ నటి
భార్యమణి సీరియల్ ఎంట్రి ఇచ్చిన నటి వందన. ఆమె పూర్తి పేరు వందన గొల్లు కాగా.. హైదరాబాద్‌లోనే జన్మించింది. ఆమె తల్లిదండ్రుల స్వస్థలం ఏపీలోని కాకినాడ. భీఫార్మసీ చదివిన వందన.. ఆ తర్వాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. భార్యమణి సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చి.. స్వాతి చినుకులు, అభిషేకం సీరియల్స్‌లో నటించింది. అయితే సాఫ్ట్వేర్ ఇంజినీర్ చంద్రశేఖర్‌ను పెళ్లి చేసుకున్న వందనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆమె అభిషేకం సీరియల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన వందన తన కెరీర్, కుటుంబం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. (ఇది చదవండి: టాలీవుడ్ సీరియల్ నటి నూతన గృహప్రవేశం.. ఎలా ఉందో చూశారా!) వందన మాట్లాడుతూ..'నా కెరీర్‌ను మొదట యాంకర్‌గా ప్రారంభించా. కానీ యాంకరింగ్ సరిగా చేయలేకపోయా. ఆ తర్వాత నన్ను సీరియల్లో నటిస్తావా అని అడిగారు. ఫస్ట్ భార్యమణి సీరియల్లో చేశా. ఆ తర్వాత అంతపురం, స్వాతి చినుకులు, ఎవరే మోహిని, సితాకోకచిలుక, అభిషేకం సీరియల్స్‌లో నటించా. ప్రస్తుతం శతమానంభవతిలో చేస్తున్నానని.' తెలిపింది. తన భర్త గురించి మాట్లాడుతూ.. 'మావారు నాకు చాలా సపోర్ట్‌గా ఉంటారు. నా పేరేంట్స్ కూడా నన్ను ప్రోత్సహించారు. క్యాస్టింగ్ కౌచ్ అనుభవం నాకైతే ఎదురు కాలేదు. ఏదైనా సరే మన నడవడికను బట్టే ఉంటుంది. ఇన్నేళ్లుగా నా వరకు ఎలాంటి ఫోన్స్ రాలేదు. నన్ను అర్థం చేసుకునే భర్త దొరకడం నా అదష్టం. కానీ కెరీర్ వల్ల నా పిల్లలకు, ఫ్యామిలీకి దూరంగా ఉండటం కాస్తా బాధగానే ఉంటుంది. నాపై ఏదైనా రూమర్స్ వచ్చినా నేను పట్టించుకోను. నా గురించి ఎవరో ఏదో అనుకుంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను సీరియల్స్ చేసేటప్పుడు సెకండ లీడ్ చేస్తున్నారని కొందరు అడిగేవారు. అలా సెకండ్ లీడ్స్ చేసినప్పుడు కాస్తా బాధపడేదాన్ని. ఇప్పుడైతే అలాంటి బాధ లేదు. మెయిన్ రోల్ పాత్రలు చేయొచ్చు కదా అనేవారు. కానీ ఎన్టీఆర్, నాని సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. కానీ ఇంట్లో వాళ్లు వద్దన్నారు.' అంటూ చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: షాపింగ్ మాల్ ప్రారంభానికి పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?) -
ఓవైపు విగ్రహాలకు అభిషేకం.. మరోవైపు ఈవో జలకాలాట
-
యాచకుడే దాతగా మారిన వేళ.. రూ.2 లక్షల విరాళం
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): యాచకుడే దాతగా మారాడు...ఆంధ్రా షిరిడీ ముత్యాలంపాడు శ్రీషిరిడీ సాయిబాబా మందిరంలో లోక కల్యాణార్ధం చేపట్టిన కోటి రుద్రాక్ష అభిషేక, అర్చనకు రూ.2లక్షల విరాళమిచ్చాడు. ఆలయంలో 2023 మార్చి 28న తలపెట్టిన ఈ కార్యక్రమానికి యాచకుడు యాదిరెడ్డి గురువారం రూ.2 లక్షల విరాళాన్ని మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డికి అందజేశాడు. యాదిరెడ్డి గతంలో మందిరంలో గోశాల, దత్తాత్రేయస్వామివారికి వెండి ఆభరణాలు, నిత్యాన్నదానం తదితర కార్యక్రమాలకు రూ.9 లక్షలు విరాళంగా ఇచ్చాడు. -
కాణిపాకం అభిషేకం టికెట్ ధరలపై దేవాదాయ శాఖ వివరణ
సాక్షి, చిత్తూరు: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి పంచామృత అభిషేకం టికెట్ల ధరలపై దేవాదాయ, ధర్మాదాయ శాఖ స్పందించింది. రూ. 700 ఉన్న టికెట్ రూ. 5000కు పెంచేశారని వార్తలు రావడంతో అభిషేకం టికెట్ ధర పెరగలేదని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న రూ.700 ధర యథాతథంగా కొనసాగనున్నట్లు తెలిపింది. ఆలయ అధికారుల అవగాహన రాహిత్యం వల్లే అభిప్రాయ సేకరణ పత్రము విడుదల చేసినట్లు పేర్కొంది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని దేవాదాయ కమిషనర్ వెల్లడించారు. -
మేల్ చాట్ వస్త్ర సేవ ఎప్పుడు ప్రారంభమైంది?
శ్రీవారి ఆలయంలో స్వామివారికి నిర్వహించే సేవలు అన్నింటిలోనూ విశిష్టమైనది ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేక సేవ. ఈ సేవలో పాల్గొనే భక్తులకు ఒక మరపురాని దివ్యానుభూతిని కలిగిస్తుంది అంటే అతిశయోక్తి కాదేమో. ఆలయంలో స్థలాభావం దృష్ట్యా ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేక సేవలో ప్రత్యక్షంగా పాల్గొనే మహద్భాగ్యం 130 నుంచి 140 మంది భక్తులకు మాత్రమే లభిస్తుంది. అభిషేకం జరిగే సమయంలో నిత్య కళ్యాణ శోభితుడైన స్వామివారి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది. సాధారణంగా స్వామివారిని పుష్పాలతో, ఆభరణాలతో, పట్టువస్త్రాలతో అలంకరణ చేసిన తర్వాతనే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అభిషేక సేవ సమయంలో మాత్రం ఇవేమీ లేకుండా స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునే భాగ్యం భక్తులకు లభిస్తుంది. అది శ్రీవారి భక్తులకు ఒక అద్భుతమైన అనుభూతి అని చెప్పుకోవచ్చు. 1980 కి పూర్వం స్వామి వారికి ఇప్పటిలా ప్రతి శుక్రవారం నూతన మేల్ చాట్ వస్త్రంతో అలంకరణ జరిగేది కాదు. ఏడాదికి నాలుగు సందర్భాలలో మాత్రమే స్వామివారికి నూతన పట్టువస్త్రాలను సమర్పించేవారట. దీనితో ప్రతి శుక్రవారం నూతన పట్టువస్త్రాన్ని స్వామి వారికి సమర్పించాలని అప్పటి ఈవో పీవీఆర్ కే ప్రసాద్ తలచారట. ఇది టీటీడీకి ఆర్థికంగా కాస్త భారమైన అంశం కావడంతో భక్తుల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారట. అప్పట్లోనే స్వామివారి అలంకరణకు వినియోగించే వస్త్రం విలువ ఎనిమిదివేల రూపాయలు కావడంతో టీటీడీ నూతనంగా 8 వేల రూపాయలు చెల్లించిన భక్తులు పాల్గొనేందుకు మేల్ చాట్ వస్త్రం టికెట్లను ప్రారంభించింది. మేల్ చాట్ వస్త్రం టికెట్లు కలిగిన భక్తులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడంతో పాటు అత్యంత సమీపం నుంచి స్వామివారి అభిషేక దర్శనం వీక్షించగలుగుతారు. ఈ సేవను ప్రవేశపెట్టిన మొదటి సంవత్సరంలో ప్రతి శుక్రవారం ఎవరో ఒక భక్తుడు మాత్రమే ముందుకు వచ్చే సంప్రదాయం ఉండగా అటు తర్వాత క్రమంగా మేల్ చాట్ వస్త్రానికి ఎనలేని డిమాండ్ ఏర్పడింది. ఎంతలా అంటే ఒకదశలో మేల్ చాట్ వస్త్రాన్ని ముందస్తుగా కొన్ని సంవత్సరాల ముందుగానే భక్తులు కొనుగోలు చేసేవారు. ఒకే కుటుంబానికి చెందిన వారే కొన్ని వందల టికెట్లను కొనుగోలు చేయడంతో టీటీడీ పునరాలోచనలో పడింది. దీంతో ఏడాదికి ఒక్కో కుటుంబానికి ఒక టికెట్నే పరిమితం చేస్తూ మిగిలిన టికెట్లను రద్దు చేసి వాటిని లక్కీడిప్ విధానంలో భక్తులకు కేటాయించే విధానాన్ని టీటీడీ 2009 నుంచి ప్రారంభించింది. (క్లిక్ చేయండి: ఆనతినీయరా స్వామీ... నిత్య హారతికి) -
Tirumala: తిరుమలలో అన్నీ ప్రత్యేకతలే...
ప్రపంచంలోనే అతి పెద్ద పుణ్యక్షేత్రం తిరుమల. కలియుగ దైవంగా ప్రఖ్యాతిపొందిన శ్రీవేంకటేశ్వర స్వామి వెలసిన తిరుమల కొండపై అన్ని విశేషాలే, అన్నీ ప్రత్యేకతలే. శ్రీవారి దర్శనార్థం ఏటా రెండున్నర కోట్ల మందికి పైగా భక్తులు వస్తూ ఉంటారు. స్వామి వారికి హుండీ ద్వారా ఏటా లభించే ఆదాయం రూ.800 కోట్లకు పైగానే ఉంటుంది. ఇక శ్రీవారికి ప్రపంచంలో మరే దేవుడికి చేయని విధంగా ప్రతిరోజూ ఏదో ఒక సేవ నిర్వహిస్తుంటారు. అలాగే, ప్రతివారం వారోత్సవాలు, ప్రతిమాసం మాసోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న శ్రీవారికి అలంకరణలోనూ అధిక ప్రాధాన్యం టీటీడీ ఇస్తుంది. శ్రీవారికి ఉన్నన్ని ఆభరణాలు మరే దేవునికీ లేవు. ఆ దేవదేవునికి ప్రతినిత్యం నిర్వహించే అలంకరణకు 1093 రకాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇన్ని ఆభరణాలతో అలంకరణలు చేస్తున్నా, స్వామి వారికి పుష్పాలంకరణ కూడా తక్కువగా ఏమీ ఉండదు. శ్రీవారికి ఉదయం ఓసారి, సాయంత్రం మరోసారి పుష్పాలంకరణ నిర్వహిస్తారు. భక్తుల పాలిట కొంగు బంగారు దేవుడైన శ్రీనివాసునికి ప్రతి ఏటా లక్షన్నర కిలోల పుష్పాలతో అలంకరణ చేస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరుడు వెలసిన వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం మరెక్కడా లేదు. శ్రీనివాసునికి సాటిరాగల దైవం ముల్లోకాలలో మరెక్కడా లేడు అని భక్తుల నమ్మకం. శ్రీవారి దర్శనార్థం ప్రతి రోజూ అరవై వేలు మొదలుకొని లక్ష మంది వరకు భక్తులు తరలివస్తుంటారు. ఇక శ్రీవారికి 1958లో హుండీ ద్వారా లభించే ఆదాయం లక్ష రూపాయల వరకు ఉంటే ఇప్పుడు స్వామివారికి ప్రతి రోజూ లభించే హుండీ ఆదాయం రెండున్నర కోట్ల పైమాటే. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు అలిపిరి నుంచి స్వామి వారిని కొలుచుకుంటూ ఎంతో ప్రయాసతో తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకున్న తరువాత వారి కష్టాలన్నీ ఒక్కసారిగా మరచిపోతారు. స్వర్ణ పుష్పాలంకరణలతో కూడిన స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు దివ్యానుభూతికి లోనవుతారు. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీనివాసుడు ఎంతటి నైవేద్య ప్రియుడో అంతటి అలంకరణ ప్రియుడట, ఎంతటి అలంకరణ ప్రియుడో అంతటి భక్తజనప్రియుడట! శ్రీవారి అలంకరణకు టీటీడీ అధిక ప్రాధ్యానం ఇస్తోంది. స్వామివారికి ఉన్నన్ని ఆభరణాలు మరే దేవుడికీ, మరే ఆలయంలోనూ ఉండవు. శుక్రవారం అభిషేక సేవ అనంతరం స్వామివారికి బంగారు ఆభరణాలను అలంకరిస్తే, తిరిగి గురువారం ఉదయం సడలింపు చేస్తారు– అంటే అలంకరణలను తీసివేస్తారు. మరో వైపు పుష్పాలంకరణ మాత్రం శ్రీనివాసునికి ప్రతిరోజూ రెండుసార్లు నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో తోమాలసేవలో స్వామి వారికి మూడువందల కిలోల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేస్తారు. శ్రీవారి ఆలయంలో స్వామివారికి అలంకరించే పుష్పాలను పూల అర అనబడే పుష్ప మండపంలో భద్రపరిచేవారు. అటు తరువాత రద్దీ పెరగడంతో ఈ కార్యక్రమాన్ని ఆలయం వెలుపలకు మార్చేశారు. శ్రీవారికి ప్రతినిత్యం సుగంధ పరిమళాలు వెదజల్లే చామంతి, లిల్లీ, మరువం, గన్నేరు, రోజాలు, దవనం, తులసి, తామరలు, కలువలు, మల్లెలు, కనకాంబరాలు వంటి పన్నెండు రకాల పుష్పాలతో రూపొందించిన మాలలను అలంకరిస్తారు. శ్రీవారి ఆలయంతో పాటు ఉపాలయాలైన బేడి ఆంజనేయస్వామి ఆలయం, వరదరాజ స్వామి ఆలయం, లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, వరాహస్వామి ఆలయాలకు కలిపి ప్రతిరోజూ 300 కిలోల పుష్పాలు అవసరమవుతాయి. తిరుమల కొండ మీద కేవలం ముప్పయి కిలోల పువ్వులే లభిస్తుంటే, మిగిలిన 270 కిలోల పుష్పాలను భక్తులు అందజేసే విరాళాలతో బయటి నుంచి తెప్పిస్తుంటారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవారికి పుష్పాలంకరణలో ముందుగా శిఖామణి అనబడే ఎనిమిది మూరల దండను స్వామివారి కిరీటం నుంచి రెండు భుజాల మీదుగా అలంకరిస్తారు. ఇక సాలగ్రామ మాలలను శ్రీవారి భుజాల నుంచి పాదాల వరకు రెండు వైపులా నాలుగు మూరలు ఉండే మాలలతో అలంకరిస్తారు. తరువాత మెడలో రెండు పొరలుగా రెండు భుజాల మీదకు అలంకరించే మూడున్నర మూరల పొడవుండే కంఠసరి మాలలను అలంకరిస్తారు. తర్వాత వక్షస్థల లక్ష్మీ మాలలను అలంకరిస్తారు. స్వామివారి వక్షస్థలంలో కొలువుండే శ్రీదేవి భూదేవులకు ఒకటిన్నర మూర ఉండే రెండు దండలను అలంకరిస్తారు. శంఖు చక్రాలకు ఒకొక్క మూర ఉండే రెండు దండలను అలంకరిస్తారు. ఇక స్వామివారి బొడ్డున ఉండే నందక ఖడ్గానికి కఠారి సరం అనే రెండు మూరల మాలను అలంకరిస్తారు. తావళాలు అనే హారాలను రెండు మోచేతుల కింద, నడుము నుంచి మోకాళ్లపైన, మోకాళ్ల నుంచి పాదాల వరకు వేలాడేలా మూడు దండలను అలంకరిస్తారు. వీటిలో ఒకటి మూడు మూరలు, రెండోది మూడున్నర మూరలు, మూడోది నాలుగు మూరలు ఉంటాయి. చివరిగా ఒక్కొక్క మూర ఉండే తిరువడి దండలను శ్రీవారి పాదాల చుట్టూ అలంకరిస్తారు. ఇవి కాకుండా భోగ శ్రీనివాసమూర్తికి ఒక దండ, కొలువు శ్రీనివాసమూర్తికి ఒక దండ, శ్రీదేవి భూదేవి సహిత మలయప్పస్వామికి మూడు దండలు, శ్రీదేవి భూదేవి సహిత ఉగ్రశ్రీనివాసమూర్తికి మూడు దండలు, సీతారామలక్ష్మణులకు మూడు దండలు, రుక్మిణీ శ్రీకృష్ణులకు రెండు దండలు, చక్రత్తాళ్వారుకు ఒక దండ, అనంత గరుడ విష్వక్సేనులకు మూడు దండలు, సుగ్రీవ అంగద హనుమంతులకు మూడు దండలు, ద్వార పాలకులకు రెండు దండలు, గరుడాళ్వర్, వరదరాజస్వామి, వకుళమాతలకు మూడు దండలు, రామానుజాచార్యులకు రెండు దండలు, యోగనరసింహస్వామి, విష్వక్సేనులతో, పోటు తాయారు, బేడి ఆంజనేయస్వామికి నాలుగు దండలు, వరాహస్వామి ఆలయానికి మూడు దండలతో ప్రతి నిత్యం అలంకరిస్తారు. ప్రతి గురువారం శ్రీవారికి కేవలం పుష్పాలతో మాత్రమే అలంకరణ చేస్తారు. పూలంగి సేవగా పేర్కొనే ఈ కార్యక్రమాన్ని శ్రీవారికి ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక శ్రీవారికి ప్రతినెలా నిర్వహించే ఉత్సవాలకు విశేష పుష్పాలంకరణలలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. విశేష పర్వదినాలలో శ్రీవారి ఆలయాన్ని కూడా ప్రత్యేక పుష్పాలతో అలంకరిస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి ఆలయాన్ని మూడు నుంచి ఐదు టన్నుల పుష్పాలతో అలంకరిస్తారు. వివిధ పుష్పాలతో ఆలయంలోని ధ్వజస్తంభం నుంచి ఆలయ ప్రాకారం వరకు అలంకరిస్తారు. ఇక వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తిథులలో మాత్రమే తెరిచి వుంచే వైకుంఠ ద్వారాన్ని రెండు టన్నుల పుష్పాలతో వైకుంఠాన్ని తలపించేలా చేసే అలంకరణ భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. తెలుగు వారి నూతన సంవత్సరాది రోజు అయిన ఉగాది పర్వదినాన కూడా శ్రీవారి ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో ముస్తాబు చేస్తారు. సాధారణ రోజులలో అలంకరణకు ఉపయోగించే చామంతి, తులసి, లిల్లి, మరువం, గన్నేరు, రోజాలు, దవనం, మల్లెలు, కలువలు, తామరలు, కనకాంబరాలు వంటివే కాకుండా కురివేరు, వట్టివేరు, తీగ సెంటు జాజులు, కట్ రోజెస్ వంటి పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేస్తారు. ఉగాది రోజున ఐదు టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. శ్రీనివాసునికి ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి మాసం ఏదో ఒక సేవ నిర్వహిస్తున్నా ప్రతి ఏటా శ్రావణ మాసం శ్రవణ నక్షత్రానికి పూర్తి అయ్యేలా తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. అందుకు అనుగుణంగానే పుష్పాలంకరణకు టీటీడీ అధిక ప్రాధాన్యమిస్తుంది. తొమ్మిది రోజులపాటు పద్నాలుగు రకాల వాహనాలపై స్వామివారు మాడ వీథులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చే ఈ ఉత్సవాలకు ముప్పయి టన్నుల పుష్పాలతో అలంకరణ చేస్తారు. బ్రహ్మోత్సవాలకు తిరుమలలో ఏర్పాటు చేసే ఫల, పుష్ప ప్రదర్శన భక్తులకు కనువిందు చేస్తుంది. వివిధ పుష్పాలతో చేసే దేవతా మూర్తుల ఆకృతులను తిలకించే భక్తులకు తిరుమల క్షేత్రమే ఇలలో వెలసిన వైకుంఠంగా అనిపిస్తుంది. బ్రహ్మోత్సవాల తరువాత నిర్వహించే పుష్పయాగం న భూతో న భవిష్యతి అన్నట్లుగా ఉంటుంది. పది టన్నుల పద్దెనిమిది రకాల పుష్పాలతో శ్రీవారికి పుష్పాభిషేకం నిర్వహిస్తారు. తరువాత ఆణివార ఆస్థానం సందర్భంగా శ్రీవారిని ప్రత్యేకంగా అలంకరించిన పూలపల్లకిలో ఉరేగిస్తారు. మూడు టన్నుల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో స్వామివారి ఉరేగింపు భక్తులకు కనువిందు చేస్తుంది. ఇన్నిరకాల పూలతో అలంకరిస్తే శ్రీవారికి దిష్టి తగలకుండా ఉంటుందా? దిష్టి తగిలితే తగులుతుందేమో నని, శ్రీవారికి అలా దిష్టి తగలకుండా ఉండటానికి అర్చకులు సన్నని వెంట్రుకలా ఉండే కురువేరు అనే వేరును ఉపయోగిస్తారు. ఈ కురువేర్లు తమిళనాడులోని కుంభకోణం ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయట! (క్లిక్ చేయండి: అప్పట్లో కొండ ఎక్కాలన్నా పన్ను కట్టాల్సిందే!) స్వామివారి పుష్పాలంకరణల కోసం తమిళనాడులోని చెన్నై, సేలం, శ్రీరంగం, కోయంబత్తూరు, దిండిగల్, కుంభకోణం తదితర ప్రాంతాల నుంచి 60 శాతం పుష్పాలు విరాళాలుగా అందితే, మిగిలిన 40 శాతం పుష్పాలను కర్ణాటకలోని బెంగళూరు ప్రాంతం నుంచి దాతలు విరాళాలుగా అందిస్తారు. ప్రత్యేక పర్వదినాలలో అలంకరించేందుకు ప్రత్యేక పుష్పాలను కూడా టీటీడీ... బెంగళూరు నుంచే తెప్పిస్తుంది. మన దేశం నుంచే కాకుండా సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ నుంచి కూడా భక్తులు స్వామి వారికి పుష్పాలను విరాళంగా అందిస్తున్నారు. శ్రీవారికి పుష్పాలు విరాళాలుగా అందించడానికి దాతలు ముందుకు వస్తే టీటీడీ ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుంది. మరోవైపు స్వామివారి పుష్ప కైంకర్యానికి వినియోగించే పుష్పాలను టీటీడీ ద్వారానే పండించేందుకు ఏర్పాట్లును మొదలు పెట్టింది. పలమనేరులో 750 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న గో సంరక్షణశాల ప్రాంతంలో 25 ఏకరాల స్థలాన్ని పూలతోటల కోసం టీటీడీ కేటాయిస్తోంది. (క్లిక్ చేయండి: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవ వైభవం) -
కాణిపాక గణపయ్యను దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-
కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో సందడి.. తెల్లవారుజాము 3గంటల నుంచే అభిషేకాలు
-
తిరుమల శ్రీవారికి అభిషేకం..
సాక్షి, తిరుమల: సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం గురువారం నుంచి ప్రారంభం కాగా, నిన్న స్వామివారిని 6,998 మంది భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీవారికి అర్చకులు అభిషేకం నిర్వహించారు. మొదటిరోజు దర్శనానికి ఎనిమిది రాష్ట్రాల నుంచి భక్తులు విచ్చేశారు. తెలంగాణ నుండి 143, తమిళనాడు నుండి 141, కర్ణాటక నుండి 151 మందితోపాటు మహారాష్ట్ర, న్యూఢిల్లీ, అరుణాచల్‌ప్రదేశ్, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల నుండి భక్తులు దర్శించుకున్నారు. ఉదయం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి దర్శనం కొనసాగుతుంది. గంటకు 500 మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. దర్శనానికి భౌతిక దూరం తో పాటు, మాస్కులు తప్పనిసరిగా ధరించేవిధంగా టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. అలిపిరి వద్ద భక్తులకు కరోనా ర్యాండమ్ పరీక్షలు.. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అవకాశాన్ని బట్టి దర్శనాల టికెట్ల సంఖ్య పెంచుతామని తెలిపారు. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోమని ఆయన స్పష్టం చేశారు. అలిపిరి వద్ద భక్తులకు కరోనా ర్యాండమ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సన్నిధి గొల్లలకు వంశపారంపర్యం కొనసాగిస్తూ తీర్మానం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.(తిరుమల శ్రీవారి దర్శనం ప్రారంభం) -
శనీశ్వరాభిషేకం టిక్కెట్‌కు రెక్కలు
సాక్షి, శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రతిరోజూ నిర్వహించే శనీశ్వరాభిషేకం పూజలను రూ.150 నుంచి రూ.300కు పెంచారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పూజలు నిర్వహిస్తారు. శనివారం ఈ పూజను ఎక్కువ మంది భక్తులు చేయించుకుంటారు. ఇటీవల రూ.300 టిక్కెట్ ద్వారా నిర్వహించే రాహుకేతు సర్పదోష నివారణ పూజలు రూ.500కు పెంపుదల చేశారు. ఇక ఆరు నెలల క్రితం రూ.600 టిక్కెట్ ద్వారా నిర్వహించే రుద్రాభిషేకం టిక్కెట్‌ను రూ.1000కి పెంచిన విషయం తెలిసిందే. అదే క్రమంలో సోమవారం శనీశ్వరస్వామి అభిషేకం టిక్కెట్లు రెట్టింపు చేశారు. ఇదే తరహాలో మరికొన్ని పూజా టిక్కెట్లు పెంపుదల చేస్తారని చర్చ సాగుతుంది. ఇలా పూజా టిక్కెట్లు పెంపుదల చేయడంతో సామాన్య భక్తులు పూజలు చేయించుకోవడం భారంగా మారుతుందని పలువురు విమర్శలు చేస్తున్నారు. -
వాయుపుత్రుడికి భారీ వడమాల
సేలం: నామక్కల్ ఆంజనేయ స్వామి ఆలయంలో జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భారీ వడల మాలతో విశేషంగా అలంకరించారు. నామక్కల్ కోటలోని అతి పురాతనమైన ఈ ఆలయంలో 18 అడుగుల ఎత్తులో నిలుచున్న భంగిమలో ఏక శిలా విగ్రహంగా ఉన్న ఆంజనేయ స్వామికి ఏటా మార్గళి నెల తొలి నక్షత్రం రోజున జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. వేకువజామున 3 గంటలకు ప్రత్యేక అభిషేకాలు, 5 గంటలకు 1,00,008 వడల మాలను అలంకరించి కర్పూర హారతులు ఇచ్చారు. 11 గంటలకు పసుపు, కుంకుమ, నూనె, షీకాయ్, 1008 లీటర్ల పాలు, పెరుగు, వెన్న, తేనె వంటి వస్తువులు(పంచామృతాలు)తో విశేష అభిషేకం చేశారు. తర్వాత ప్రత్యేక అలంకరణ, మహా దీపారాధన నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు ముత్తంగి అలంకరణ చేశారు. లక్ష మందికిపైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి రీతిలో అలంకరణ ఏడు కొండలవాడికి బ్రహ్మోత్సవాల సమయంలో నామక్కల్‌కు చెందిన శ్రీ తిరుమల తిరుపతి శ్రీమాన్ నారాయణ నిత్య పుష్ప కైంకర్య సభ ఆధ్వర్యంలో టన్నుల కొలది పుష్పాలను కైంకర్యంగా సమర్పిస్తారు. అదేమాదిరి నామక్కల్ ఆంజనేయుడికి తొలిసారిగా మూడు టన్నుల పుష్పాలు, పండ్లు వంటి వాటిని ఈ సభ కైంకర్యంగా అందించింది. వీటితో శ్రీవారికి మాదిరి ఆంజనేయ స్వామికీ అలంకరించారు. -
అయ్యప్పకు క్షీరాభిషేకాలు
అనంతపురం కల్చరల్ : సుబ్రమణ్య షష్టిని పురస్కరించుకుని మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వరాలయంలో కొలువైన అయ్యప్ప దేవాలయంలో క్షీరాభిషేకాలు జరిగాయి. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అదేవిధంగా చెరువుకట్టపై వెలసిన సుబ్రమణ్యస్వామి ఆలయంలోనూ షష్టి వేడుకలు జరిగాయి. -
గోదావరి జలాలతో వైఎస్‌కు అభిషేకం
మేడ్చల్ రూరల్: మేడ్చల్ నగరానికి నేడు వస్తున్న గోదావరి జలాలను తీసుకువచ్చిన ఘనత వైఎస్సార్‌దేనని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నీటిసమస్యతో బాధపడుతున్న నగర ప్రజల దాహార్తి తీరాలంటే గోదావరి జలాలు నగరానికి తరలించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అబ్దుల్ కలాం సుజల స్రవంతి పథకంతో గోదావరి జలాలకు తీసుకొచ్చే పనులు చేపట్టారన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద ఆయన విగ్రహానికి గోదావరి జలాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గోదావరి జలాలను తాము తీసుకొచ్చామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకోవడం సరికాదని, గోదావరి జలాలలను తీసుకొచ్చిన ఘనత వైఎస్సార్‌దేనన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలతో చాలామందికి ప్రయోజనం కలిగించారన్నారు. వైఎస్సార్ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడు వెంగళ్రావు, నాయకులు మోహన్‌రెడ్డి, నారాయణరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జటాజూటేశ్వరుడిగా రుద్రేశ్వర స్వామి..
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో రుద్రేశ్వర స్వామి వారికి మహా అన్నపూజ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ , వేదపండితులు మణికంఠశర్మ , అర్చకులు ఉదయం 5 గంటల నుంచి మూల మహా గణపతికి నవరస అభిషేకం చేశారు. స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపారు. మధ్యాహ్నం స్వామివారిని జటాజూటేశ్వరుడిగా అలంకరించి 51 కిలోల పెరుగు అన్నంతో అన్నసూక్త మంత్ర పఠనం చేశారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ సతీమణి రేవతి, హన్మకొండ సీఐ సంపత్‌రావు, చిరంజీవి అసోసియేషన్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
వైభవంగా పద్మావతీ అమ్మవారి తెప్పోత్సవాలు
తిరుచానూరు (చిత్తూరు): తిరుచారూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ తెప్పోత్సవంలో తొలిరోజు రుక్మిణి, సత్యభామ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పపై పుష్కరిణిలో విహరించారు. అందులో భాగంగా రెండో రోజైన శనివారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత సుందరరాజస్వామికి అభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు తెప్పోత్సవం, రాత్రి 7.30 గంటల నుంచి తిరుచ్చి వాహనసేవ జరుగుతుంది. -
యాదగిరీశుడికి చక్రస్నానం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం అర్చకులు స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, పట్టు వస్త్రాలను ధరింపచేశారు. పుష్పాలతో శోభాయమానంగా అలంకారించి, మహా పూర్ణాహుతి నిర్వహించారు. 10 రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలను వీక్షించిన దేవతలకు హవనం ద్వారా నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బి.నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భీమవరం సోమేశ్వరుడి అభిషేకాలు నిలిపివేత