
సాక్షి, చిత్తూరు: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి పంచామృత అభిషేకం టికెట్ల ధరలపై దేవాదాయ, ధర్మాదాయ శాఖ స్పందించింది. రూ. 700 ఉన్న టికెట్ రూ. 5000కు పెంచేశారని వార్తలు రావడంతో అభిషేకం టికెట్ ధర పెరగలేదని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న రూ.700 ధర యథాతథంగా కొనసాగనున్నట్లు తెలిపింది. ఆలయ అధికారుల అవగాహన రాహిత్యం వల్లే అభిప్రాయ సేకరణ పత్రము విడుదల చేసినట్లు పేర్కొంది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని దేవాదాయ కమిషనర్ వెల్లడించారు.