kanipakam temple
-
కాణిపాకం ఆలయంలో మహా కుంభాభిషేకం కు సర్వం సిద్ధమైంది
-
Kanipakam: జనవరి 1న కాణిపాకంలో ప్రత్యేక ఏర్పాట్లు
యాదమరి(చిత్తూరు జిల్లా): జనవరి 1, 2 తేదీల్లో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తెలిపారు. స్వామివారి సమావేశపు మందిరంలో చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు అధ్యక్షతన ఆర్డీవో రేణుక, వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. జనవరి 1న ఆంగ్ల నూతన సంవత్సరం, జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనార్థం భక్తులు లక్ష మందికి పైగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. వీఐపీలు, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆ వివరాలను ఎమ్మెల్యే బాబు మీడియాకు వెల్లడించారు. వేకువజామున 2 గంటల నుంచి స్వామివారి దర్శనం కల్పించనున్నామన్నారు. 12 గంటల తర్వాత స్వామికి అభిషేకాలు, అలంకరణ, చందన అలంకరణ, ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆ రెండు రోజుల పాటు స్వామివారి అంతరాలయ దర్శనం, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతి, చిత్తూరు పీలేరు, మదనపల్లె, పలమనేరు, కుప్పం డిపోల నుంచి ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నిత్య అన్నదానం ఉంటుందని వివరించారు. (క్లిక్ చేయండి: టోకెన్ ఉంటేనే వైకుంఠ ద్వార దర్శనం) -
Kanipakam: కాణిపాకం ఇన్‌ఛార్జి ఈఓ సురేష్ బాబుపై బదిలీ వేటు
సాక్షి, చిత్తూరు: టికెట్ ధరల పెంపుపై కాణిపాకం ఇన్ ఛార్జి ఈఓ సురేష్ బాబు ఇచ్చిన ఉత్తర్వులపై దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఆయనపై బదిలీ వేటు వేసింది. సురేష్ బాబును కాణిపాకం ఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాణిపాకం ఇన్‌ఛార్జి ఈఓగా కర్నూలు డిసి రాణా ప్రతాప్ కి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ కమీషనర్ హరి జవహర్ లాల్ ఇప్పటికే సురేష్ బాబుకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. కాణిపాకంలో అభిషేకం టిక్కెట్ ధరని పెంచడానికి ప్రజాభిప్రాయం పేరుతో జారీ చేసిన ఉత్తర్వులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిక్కెట్ ధరని పెంచడం లేదంటూ ఇప్పటికే దేవాదాయ శాఖ స్పష్టమైన ప్రకటన చేసిందని ఆయన తెలిపారు. సురేష్ బాబుపై విచారణ చేపటనున్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. -
కాణిపాకం వివాదంపై మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందన
-
కాణిపాకం అభిషేకం టికెట్ ధరలపై దేవాదాయ శాఖ వివరణ
సాక్షి, చిత్తూరు: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి పంచామృత అభిషేకం టికెట్ల ధరలపై దేవాదాయ, ధర్మాదాయ శాఖ స్పందించింది. రూ. 700 ఉన్న టికెట్ రూ. 5000కు పెంచేశారని వార్తలు రావడంతో అభిషేకం టికెట్ ధర పెరగలేదని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న రూ.700 ధర యథాతథంగా కొనసాగనున్నట్లు తెలిపింది. ఆలయ అధికారుల అవగాహన రాహిత్యం వల్లే అభిప్రాయ సేకరణ పత్రము విడుదల చేసినట్లు పేర్కొంది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని దేవాదాయ కమిషనర్ వెల్లడించారు. -
కాణిపాకం వినాయకునికి స్వర్ణ రథం సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తిరుమల శ్రీవారి తర్వాత కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి బంగారు రథం సిద్ధమైంది. దాదాపు 15 కేజీలకు పైగా బంగారంతో రథాన్ని తయారు చేయించారు. ఈ నెల 16వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య నూతన స్వర్ణ రథం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించేందుకు దేవదాయ శాఖ నిర్ణయించింది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్‌లాల్ హాజరవుతారు. 2005లోనే ప్రతిపాదన 2005లోనే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి బంగారు రథం తయారు చేయించాలని అప్పటి ఆలయ పాలకమండలి తీర్మానించగా.. దేవదాయ శాఖ అనుమతి తెలిపింది. బంగారు రథం కోసం దాతల నుంచి ప్రత్యేక విరాళాలు సేకరించడంతో పాటు ఆలయంలో ప్రత్యేక హుండీని ఏర్పాటు చేశారు. 2005 నుంచి గత ఏడాది సెప్టెంబర్ వరకు హుండీ ద్వారా రూ.3,57,85,102.85 విరాళాలు వచ్చాయి. దాతల నుంచి రూపంలో మరో రూ.1,67,09,616 కలిపి మొత్తం రూ.5.25 కోట్ల వరకు అందాయి. బంగారు రథం తయారీ బాధ్యతలను దేవదాయ శాఖ 2009లోనే టీటీడీకే అప్పగించింది. ఇందుకు ఆలయ నిధుల నుంచి రూ.కోటి 2010 ఫిబ్రవరిలో టీటీడీకి చెల్లించారు. సిద్ధమైన వినాయకుని బంగారు రథం 2019 అక్టోబర్‌లో ఊపందుకుని.. 2019లో అక్టోబర్‌లో బంగారు రథం నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. 1,690 కేజీల చెక్క రథానికి బంగారం తాపడం చేయడానికి రూ.9.70 కోట్లు ఖర్చవుతుందని టీటీడీ తేల్చగా.. ఆలయ నిధుల నుంచి మరో రూ.5 కోట్లను కాణిపాకం ఆలయ అధికారులు 2019 అక్టోబర్‌లో టీటీడీకి చెల్లించారు. చెక్క రథానికి బంగారు తాపడం చేసే పనులు 2020 నవంబర్‌లో మొదలు కాగా, 2021 సెప్టెంబర్ నాటికి పూర్తయ్యాయి. ప్రతి నెలా ఊరేగింపు! ప్రతి గురువారం లేదా ప్రతి నెలా పౌర్ణమి తర్వాత నాలుగో రోజున ఆలయంలో నిర్వహించే సంకటహర గణపతి వ్రతం సందర్భంగా బంగారు రథంపై స్వామివారి ఊరేగింపు నిర్వహించాలనే ఆలోచన ఉందని.. దీనిపై ఆలయ పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఈవో వెంకటేష్ చెప్పారు. బ్రహ్మోత్సవాల సమయంలో బంగారు రథం ఉపయోగించనున్నట్టు వివరించారు. బంగారు రథం తయారీకి ఇప్పటివరకు టీటీడీకి రూ.6 కోట్లను చెల్లించామని, తుది బిల్లు టీటీడీ నుంచి అందాల్సి ఉందని వెంకటేష్ తెలిపారు. -
కాణిపాకం, అప్పన్న ఆలయాలకు ఐఎస్వో సర్టిఫికెట్లు
కాణిపాకం (యాదమరి)/సింహాచలం(పెందుర్తి): చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి, విశాఖ సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానాలకు ఐఎస్వో సంస్థ సర్టిఫికెట్లను అందజేసింది. శుక్రవారం వినాయక చవితి రోజు ఐఎస్వో సంస్థ ప్రతినిధి శివయ్య కాణిపాకం ఆలయానికి చేరుకుని సంస్థ నుంచి ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్‌కు ఒకటి, క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌కు మరో సర్టిఫికెట్ అందజేశారు. ఆయనకు ఆలయ ఈవో వెంకటేశు స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఐఎస్వో సంస్థ ప్రతినిధి సర్టిఫికెట్లను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి చేతుల మీదుగా ఆలయానికి అందించారు. కార్యక్రమంలో ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, తదితరులు ఉన్నారు. మరోవైపు అప్పన్న దేవస్థానానికి ఐఎస్వో 9001–2015 గుర్తింపు లభించింది. సింహగిరికి వచ్చే భక్తులకు నాణ్యమైన సేవలు, హిందూ ధర్మం, సంస్కృతిని ప్రచారం చేస్తున్నందుకు దేవస్థానానికి ఈ గుర్తింపు లభించింది. హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సింహాచలం దేవస్థానానికి ఈ గుర్తింపునిచ్చింది. ఆ సంస్థ జారీ చేసిన ఐఎస్వో ధ్రువీకరణ పత్రాన్ని శనివారం రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతులమీదుగా దేవస్థానం ఈవో ఎం.వి.సూర్యకళ అందుకున్నారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రసాద్ స్కీమ్‌లో భాగంగా దేవస్థానం అభివృద్ధికి త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. త్వరలోనే పంచగ్రామాల భూసమస్య పరిష్కారమవుతుందన్నారు. -
మహాకాయ.. అభయమీయవయా!
సకల జీవకోటికీ వరాలను అనుగ్రహించవయా వరసిద్ధి వినాయకా.. శుభాలను కటాక్షించవయా పార్వతీప్రియసుతా.. విఘ్నాలను తొలగించవయా విఘ్నరాజా.. స్థితిగతులను మార్చవయా గణేశా.. ఐహిక సుఖాల నుంచి విముక్తి ప్రసాదించవయా మహాకాయా.. తెలియక చేసిన పాపాలను హరించవయా మూషిక వాహనా.. మొర ఆలకించి అభయమీయవయా సిద్ధి, బుద్ధి సమేత గణపయ్యా. కాణిపాకం(యాదమరి): కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం బ్రహ్మోత్సవశోభను సంతరించుకుంది. చవితి వేడుకలకు అంగరంగ వైభవంగా ముస్తాబైంది. కళ్లుమిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలు.. సుగంధ పరిమళాలను వెదజల్లే సుమమాలికలతో కనువిందు చేస్తోంది. 21 రోజులపాటు ఏకాంతంగా సాగే ఉత్సవాలకు ఆలయ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కోవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తోంది. భక్తులు భౌతికదూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకునేలా ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేసింది. కొరత లేకుండా గణనాథుని లడ్డూ ప్రసాదాలను తయారు చేసింది. ప్రత్యేక ఏర్పాట్లు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం వేర్వేరు క్యూలను ఏర్పాటు చేశారు. అందులో రూ.50, రూ.100 దర్శన టికెట్ కొనుగోలు చేసిన వారికి విడిగా ఆలయం వెలుపల నుంచి క్యూ నిర్మించారు. వీఐపీలు, చంటిబిడ్డ తల్లులు, వృద్ధులు, దివ్యాంగుల కోసం మరోవైపు క్యూ ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానికి వేచి ఉన్న భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. క్యూలో లైట్లు, ఫ్యాన్లు, శానిటైజర్, తాగునీటి సౌకర్యం కల్పించారు. భక్తులకు అన్నదానం బ్రహ్మోత్సవం సందర్భంగా ఆలయంలో 5వేల మంది భక్తులకు అన్నదానం నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. అయితే కోవిడ్ కారణంగా భక్తులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. సిద్ధంగా ప్రసాదం బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు కొరత లేకుండా స్వామివారి ప్రసాదం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు 60 వేల రూ.15 లడ్డూలు, 5వేల రూ.75 లడ్డూలు, 2వేల రూ.150 లడ్డూలను సిద్ధం చేశారు. భక్తుల సెల్ఫోన్లు భద్రపరిచేందుకు, పాదరక్షలు పెట్టుకునేందుకు పలుచోట్ల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానంతరం భక్తులకు పులిహోర, చక్కెర పొంగలిని పంపిణీ చేయనున్నారు. సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం చవితి రోజున కేవలం సామాన్య భక్తులనే స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. వీఐపీలు 11వ తేదీన దర్శనానికి రావాలని స్పష్టం చేశారు. కోవిడ్ కారణంగా వాహనసేవలు, అభిషేకాలకు 50 మంది ఉభయదారులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. గణేశ దీక్ష చేపట్టేవారి కోసం వరదరాజస్వామివారి ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. భారీ బందోబస్తు బ్రహ్మోత్సవాల సందర్భంగా డీఎస్పీ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు కలి్పంచారు. నలుగురు సీఐలు, 9 మంది ఎస్ఐలు, 130 మంది సిబ్బందిని బందోబస్తుకు నియమించారు. ఆలయ పరిసరాల్లో 32 సీసీ కెమెరాలను అమర్చారు. భక్తుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా చవితి వేడుకలు ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం తిరుపతిలోని వినాయక సాగర్‌లో నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయకూడదని స్పష్టం చేశారు. పూజా కార్యక్రమంలో ఐదుగురికి మించి పాల్గొనకూడదని చెప్పారు. చవితి మండపాల వద్ద డీజే సౌండ్స్‌కు అనుమతి లేదని తెలిపారు. -
వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు
-
రేపటి నుంచి వరసిద్ధుని బ్రహ్మోత్సవాలు
కాణిపాకం (చిత్తూరు): కాణిపాక శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి 21 రోజులపాటు నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో ఆలయ ప్రాకారం లోపల మాత్రమే ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 10వ తేదీ శుక్రవారం ఉదయం ప్రత్యేక అభిషేకం, సాయంత్రం పుష్పకావళ్ల కార్యక్రమంతో మొదలయ్యి, 30వ తేదీ గురువారం ఉదయం అభిషేకం, సాయంత్రం తెప్పోత్సవంతో ముగుస్తాయి. ఈ మేరకు ఉత్సవ ఏర్పాట్లలో దేవస్థానం అధికారులు తలమునకలయ్యారు. -
సెప్టెంబర్ 10 నుంచి కాణిపాక బ్రహ్మోత్సవాలు
కాణిపాకం (యాదమరి): చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 10 నుంచి 21 రోజుల పాటు వైభవంగా నిర్వహించడానికి ఆలయ ఉభయదారులు తీర్మానించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్వామివారి అనుబంధ ఆలయం శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ఉభయదారుల సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 10వ తేదీ శుక్రవారం చవితి రోజు నుంచి 21 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఉభయదారులు తీర్మానించారు. దీంతో అర్చక వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాల పత్రికను ఉభయదారులకు చదివి వినిపించారు. అనంతరం ఈవో వెంకటేశు మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాల వివరాలను దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులకు, జిల్లా కలెక్టర్‌కు వివరిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో వారు వాహనసేవలను ప్రాకారోత్సవం నిర్వహించమంటే ప్రాకారోత్సవం, గ్రామోత్సవం నిర్వహించమంటే గ్రామోత్సవం నిర్వహిస్తామని వివరించారు. అనంతరం ఉభయదారులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. -
ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన అధికారులు
-
శ్రీశైలం, కాణిపాక దర్శన వేళల్లో మార్పులు
శ్రీశైలం టెంపుల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ వేళల్లో చేసిన మార్పులకు అనుగుణంగా శ్రీశైల మల్లన్న దర్శన వేళలను మార్పు చేశారు. సోమవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. స్వామి అమ్మవార్ల ఆలయ ద్వారాలు తెరిచినప్పటి నుంచి రాత్రి మూసివేసే వరకు రోజువారీ కైంకర్యాలన్నీ యథావిధిగా కొనసాగుతాయి. వీటిని అర్చకులు ఏకాంతంగా నిర్వహించనున్నారు. 23న కాణిపాక దర్శన వేళల్లో స్వల్ప మార్పు కాణిపాకం (యాదమరి): చిత్తూరు జిల్లా కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 23న స్వామివారి దర్శన వేళలలో స్వల్ప మార్పు చేసినట్లు ఆలయ ఈవో వెంకటేశు ఆదివారం తెలిపారు. ఆ రోజు స్వామివారి ప్రధాన ఆలయ పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన ఉండటంతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనాలు నిలిపివేయనున్నట్లు చెప్పారు. పూజల అనంతరం దర్శనాలు ఉంటాయని వెల్లడించారు. శ్రీభోగ శ్రీనివాసునికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం తిరుమల: శ్రీవారి ఆలయంలో భోగ శ్రీనివాసమూర్తికి ఆదివారం ప్రత్యేకంగా సహస్ర కలశాభిషేకం చేశారు. ఉదయం 6 నుంచి 8.30 గంటల నడుమ ఆలయంలోని బంగారువాకిలి చెంత ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించారు. నేడు సుందరకాండ అఖండ పారాయణం కరోనా నుంచి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జూన్ 21న 15వ విడత సుందరకాండ అఖండ పారాయణం జరుగనుంది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు సుందరకాండలోని 59 నుండి 64వ సర్గ వరకు గల 174 శ్లోకాలను పారాయణం చేస్తారు. చదవండి: తిరుమల–తిరుపతి మధ్య విద్యుత్ బస్సులు -
కాణిపాకం దర్శన వేళల కుదింపు
కాణిపాకం (చిత్తూరు జిల్లా): కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తులకు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకే స్వామి వారి దర్శనాన్ని కల్పించనున్నట్లు ఆలయ ఈవో వెంకటేశు తెలిపారు. ఈవో కార్యాలయంలో ఆయన ఆలయంలోని అన్ని శాఖల అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్వామివారి దర్శన వేళల్లో మార్పు చేయనున్నట్లు తెలిపారు. దీనిపై అందరి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అధికారులంతా దర్శన వేళలను కుదించడానికి ఒప్పుకోవడంతో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉన్న దర్శన వేళలను సాయంత్రం 7 గంటలకు కుదించారు. క్యూ లైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, లడ్డు పోటులో, నిత్య అన్నదానం వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్క్‌లు లేని భక్తులను దర్శనానికి అనుమతించరాదని స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తులు విరాళాలు సేకరిస్తే సమాచారమివ్వండి కాణిపాక ఆలయాభివృద్ధికి ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు విరాళాలను అడిగితే వెంటనే సమాచారం అందించాలని ఈవో కోరారు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు స్వామివారి ఆలయ అభివృద్ధి పేరిట విరాళాలు సేకరిస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. ప్రైవేట్ వ్యక్తులు విరాళాలు అడిగిన వెంటనే స్థానిక పోలీసులకు, ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఇక్కడ చదవండి: ఏప్రిల్ 24 నుంచి తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు హన్మంతుని జన్మస్థలంపై ఆధారాలు ప్రకటించిన టీటీడీ -
వైభవంగా కాణిపాకం బ్రహ్మోత్సవాలు
సాక్షి, చిత్తూరు: కాణిపాకం వరసిద్ధివినాయకుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ధ్వజారోహణ కార్యక్రమం ఆదివారం సంప్రదాయం గా నిర్వహించారు. కోవిడ్ నిబంధనల కారణంగా ఆలయానికే పరిమితం అయ్యింది. ఈ రోజు సాయంత్రం హంస వాహన సేవ నిర్వహించనున్నారు. పరిమిత సంఖ్యల్లోనే భక్తులకు అనుమతి కల్పించనున్నారు. విద్యుత్ వెలుగులు, ప్రత్యేక పుష్పాలంకరణలతో గణనాథుని ఆలయం శోభాయమానంగా వెలిగిపోతోంది. శనివారం చవితి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేకువజామున మూలస్థానంలోని గణనాథునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. -
‘హైదరాబాద్.. ఢిల్లీలో ఉంటే ఏం తెలుస్తుంది’
సాక్షి, చిత్తూరు : కాణిపాకం ఆలయంలో శనివారం వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి.తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కారణమని, ఆయన మంత్రి పదవి ఇవ్వడం వల్లే ఈ అదృష్టం దక్కిందన్నారు. కాణిపాకం గుడిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. (‘చంద్రబాబు డైరెక్షన్లో రఘురామ కృష్ణంరాజు’) సెప్టెంబర్ 11 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని గుడిల అభివృద్దే తమ లక్ష్యమని తెలదిపారు. కాణిపాకానికి మాస్టర్ ప్లాన్ దృష్టిలో ఉందని, దానిని త్వరలోనే అమలు చేస్తామన్నారు. వినాయక చవితి ఉత్సవాల గురించి ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన చంద్రబాబు డైరెక్షన్లో మాట్లాడుతున్నారని, వినాయక చవితి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయో చంద్రబాబు, రఘురామ కృష్ణమ రాజులు కాణిపాకానికి వచ్చి చూడాలని సవాలు విసిరారు. చంద్రబాబు హైదరాబాద్, రఘురామ కృష్ణమ రాజులు ఢిల్లీలో ఉంటే ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. (ఏపీ: జిల్లాల పునర్విభజనపై కీలక ఆదేశాలు) -
సీఎం జగన్‌ను కలిసిన కాణిపాకం అర్చకులు
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కాణిపాకం ఆలయ అర్చకులు మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వినాయకచవితి పురస్కరించుకొని కాణిపాకంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సావాలకు హాజరు కావాలని సీఎం జగన్‌కు ఆహ్వనపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు జగన్‌కు ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎంఎస్ బాబు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
కాణిపాకం ఆలయం మూసివేత
సాక్షి, చిత్తూరు: కాణిపాకంలో కరోనా కలకలం సృష్టించింది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హోంగార్డుకు కరోనా వైరస్ సోకడంతో భక్తుల అనుమతిని నిషేధించారు. రెండు రోజుల పాటు దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మొత్తం 60 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,858కి చేరింది. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 1,068కాగా, విదేశాల నుంచి వచ్చిన వారు 202 మంది ఉన్నారు. (కరోనాకు వర్షం తోడు..) -
వినాయకుని విశిష్ట ఆలయాలు.. చుట్టేసొద్దాం
వినాయకుడు విఘ్నాలను తొలగిస్తాడని ప్రతీతి. అందుకే ఆయనను విఘ్నేశ్వరుడని అంటారు. ప్రమథగణాలకు అధిపతి గనుక గణపతి అంటారు. పెద్ద ఉదరంతో అలరారుతుంటాడు గనుక లంబోదరుడని అంటారు. మూషికాన్ని వాహనంగా చేసుకున్నందున మూషికవాహనుడని అంటారు. ఏనుగు తల కలిగి ఉండటం వల్ల గజాననుడని, ఒక దంతం విరిగి ఉండటం వల్ల ఏకదంతుడని అంటారు. వినాయకుడు ఎందరికో ఇష్టదైవం. దేశదేశాల్లో వినాయకుడి ఆలయాలు ఉన్నాయి, ఆరాధకులూ ఉన్నారు. సనాతన సంప్రదాయంలో వినాయకుడికి ప్రత్యేకమైన మతం కూడా ఉంది. వినాయకుడే ప్రధాన దైవంగా ఆరాధించే మతాన్ని గాణపత్యం అంటారు. వినాయకుడికి ఎన్నో నామాలు ఉన్నట్లే, ఎన్నో రూపాలు కూడా ఉన్నాయి. వినాయకుడి కథ, వినాయక చవితి పూజావిధానం దాదాపు అందరికీ తెలిసినదే. వినాయకుడికి గల అరుదైన ఆలయాల గురించి తక్కువ మందికి తెలుసు. వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి గల కొన్ని అరుదైన ఆలయాల విశేషాలు మీ కోసం... వరసిద్ధి వినాయక ఆలయం, కాణిపాకం, ఆంధ్రప్రదేశ్ శ్రీవరసిద్ధి వినాయక ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కాణిపాకం గ్రామంలో ఉంది. కాణిపాకం వినాయక ఆలయం ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. కాణి అంటే పావుఎకరా మాగాణి భూమి అనే అర్థం ఉంది. వరసిద్ధి వినాయకుడు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడు. కాణిపాకం స్థలపురాణం ప్రకారం వెనుకటి కాలంలో ఇక్కడ ముగ్గరు అన్నదమ్ములు ఉండేవారు. ముగ్గరిలో ఒకరు గుడ్డి, ఒకరు మూగ, ఒకరు చెవిటి. అవిటితనాలతో బాధపడుతూనే ఆ అన్నదమ్ములు ఉన్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ జీవితం గడిపేవారు. వారి పొలంలో ఒక బావి ఉండేది. బావిలోని నీరు ఏతంతో తోడి పొలానికి నీరు పట్టేవారు. ఒకసారి బావిలో నీరు పూర్తిగా ఇంకిపోయింది. మరింత లోతుగా తవ్వితే నీరు పడుతుందేమోననే ఆశతో అన్న దమ్ములు బావిలోకి దిగి తవ్వుతుండగా, గునపానికి గట్టిగా రాతిలాంటిదేదో తగిలింది. గునపం బయటకు తీసి చూడగా, దానికి నెత్తురు అంటుకుని ఉంది. కొద్దిసేపట్లోనే బావిలోని నీరు నెత్తుటి రంగులోకి మారింది. ముగ్గురు అన్నదమ్ముల అవిటితనం కూడా మాయమైంది. బావిని మరింత లోతుగా తవ్వడానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం పూర్తికాకుండానే బావిలోని నీటి నుంచి వినాయకుడి శిలావిగ్రహం బయటపడింది. ఈ మహిమ చూసిన జనాలు కొబ్బరినీళ్లతో విగ్రహానికి అభిషేకాలు చేశారు. అలా అభిషేకించిన కొబ్బరినీరు ఎకరంపావు దూరం కాలువలా ప్రవహించింది. అందువల్ల దీనిని తమిళంలో ‘కాణిపరకం’ అని పిలిచేవారు. రానురాను ఇది కాణిపాకంగా మారింది. ఈ ఆలయంలో వినాయకుని విగ్రహం నేటికీ బావిలోనే కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు తమకు ఇష్టమైన పదార్థాన్ని స్వామివారికి వదిలిపెడితే కోరికలు తీరుతాయని నమ్మకం. అలాగే, కాణిపాకం వినాయకుడు సత్యప్రమాణాల వినాయకుడిగా కూడా ప్రసిద్ధుడు. ఇక్కడ వినాయకుని ఎదుట ప్రమాణం చేసిన వారు సత్యమే పలకాలని, అసత్యం పలికిన వారికి అనర్థాలు తప్పవని కూడా భక్తులు నమ్ముతారు. చోళుల కాలంలో పదకొండో శతాబ్దిలో ఇక్కడ వినాయకునికి ఆలయం నిర్మించారు. పదమూడో శతాబ్దిలో కులోత్తుంగ చోళుడు ఇప్పుడు ఉన్న రీతిలో ఆలయాన్ని మరింత విశాలంగా నిర్మించాడు. మధుర మహాగణపతి, కేరళ కేరళలోని మధుర మహాగణపతి ఆలయం ఒకప్పుడు శివాలయం. పరమశివుడు మదరనాథేశ్వరునిగా ఇక్కడ వెలశాడు. అప్పట్లో ఇది తుళునాడు రాజ్యంలో ఉండేది. స్వయంభువుగా వెలసిన శివలింగానికి తుళురాజులు ఆలయం నిర్మించారు. మదరు అనే వృద్ధురాలు ఈ శివలింగాన్ని కనుగొనడంతో ఆమె పేరిట ఇక్కడి శివుడు మదరనాథేశ్వరునిగా ప్రసిద్ధి పొందాడని ప్రతీతి. ఒకనాడు స్థానిక తుళు బాలుడు ఒకడు ఆలయంలో ఆడుకుంటూ, గర్భగుడిలోని దక్షిణ గోడపై వినాయకుడి బొమ్మ గీశాడు. గోడలపై ఆ బాలుడు గీసిన వినాయకుడి బొమ్మ పరిమాణం నానాటికీ పెరగసాగింది. చూస్తుండగానే కొద్దిరోజుల వ్యవ«ధిలోనే భారీ స్థాయికి పెరిగింది. ఆలయంలోనే ఆటలాడుకునే ఆ బాలుడు ‘బొడ్డ గణేశ‘ (పెద్ద గణపతి) అనేవాడు. నాటి నుంచి ఇది మహాగణపతి ఆలయంగా ప్రసిద్ధి పొందింది. మూడంతస్తులతో నిర్మించిన ఈ ఆలయ వాస్తు, శిల్పకళా కౌశలం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బయటి నుంచి చూస్తే ఏనుగు వీపు ఆకారంలో కనిపిస్తుంది. ఆలయం లోపలి భాగంలో కలపపై చెక్కిన రామాయణ దృశ్యాలు కనువిందు చేస్తాయి. మైసూరు రాజ్యాన్ని పరిపాలించిన టిప్పు సుల్తాను చాలా ఆలయాలపై దాడులు చేసినట్లుగానే ఈ ఆలయంపైనా దాడి చేయడానికి వచ్చాడట. ఆలయ ప్రాంగణంలోని బావినీళ్లు తాగిన తర్వాత మనసు మార్చుకుని ఆలయాన్ని ధ్వంసం చేయకుండానే వెనుదిరిగాడట. తన వెంట ఉన్న సేనలను తృప్తిపరచడానికి ఆలయంపై దాడి చేసినట్లుగా లాంఛనప్రాయంగా బయటి వైపు గోడపై కత్తితో వేటు వేసి, వెనుదిరిగాడట. టిప్పు సుల్తాన్ గోడపై వేసిన వేటు గుర్తు ఇప్పటికీ కనిపిస్తుంది. మయూరేశ్వర ఆలయం, మహారాష్ట్ర మూషిక వాహనుడైన వినాయకుడు నెమలి వాహనంపై కనిపించే అరుదైన ఆలయం ఇది. అందుకే ఇక్కడ వెలసిన వినాయకుడు మయూరేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. స్థానికులు ‘మోరేశ్వర్’ అని కూడా అంటారు. మయూరేశ్వరుడు వెలసినందున ఈ క్షేత్రానికి ‘మోర్గాంవ్’ అనే పేరు వచ్చింది. ఇది మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఉంది. గాణపత్య మతం ప్రాచుర్యంలో ఉన్న కాలంలో మోర్గాంవ్ ఆ మతానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. ఈ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలియదు. ఇందుకు కచ్చితమైన ఆధారాలేవీ లేవు. మోరయ గోసావి అనే గాణపత్య సాధువు కారణంగా ఈ ఆలయం ప్రసిద్ధిలోకి వచ్చింది. ఆయన శిష్యులైన పీష్వా ప్రభువుల హయాంలో ఈ ఆలయం వైభవాన్ని సంతరించుకుంది. మహారాష్ట్రలో ప్రాచీన వినాయక క్షేత్రాలు ఎనిమిది ఉన్నాయి. వీటిని అష్ట వినాయక క్షేత్రాలని అంటారు. అష్ట వినాయక క్షేత్రాలకు తీర్థయాత్రగా వెళ్లేవారు మోర్గాంవ్‌లోని మయూరేశ్వరుడి దర్శనంతో యాత్రను ప్రారంభించడం ఆనవాయితీ. మయూరేశ్వరుడిని దర్శించుకోకుంటే, అష్టవినాయక యాత్ర పూర్తి కానట్లేనని అంటారు. ‘సింధు’ అనే రాక్షసుడిని చంపడానికి త్రేతాయుగంలో వినాయకుడు ఇక్కడ మయూరవాహనుడిగా షడ్భుజాలతో అవతరించాడని ‘గణేశ పురాణం’ చెబుతోంది. పీష్వాల కాలంలో ఈ ఆలయాన్ని దర్శించుకున్న సమర్థ రామదాసు ఆశువుగా ‘సుఖకర్తా దుఃఖహర్తా’ అనే కీర్తనను ఆలపించాడు. మయూరేశ్వరుడికి హారతి ఇచ్చేటప్పుడు ఈ గీతాన్ని ఆలపించడం అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తోంది. గణపతిపులే, మహారాష్ట్ర మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఉన్న ఆలయం ఇది. రత్నగిరి పట్టణానికి పాతిక కిలోమీటర్ల దూరంలో కొంకణతీరంలో ఉన్న గణపతిపులే గ్రామంలో లంబోదరుడు పడమటి కనుమల దిగువన స్వయంభువుగా వెలశాడు. మిగిలిన ఆలయాల్లోని దేవతామూర్తులు తూర్పుదిక్కుగా ఉంటే, ఇక్కడి వినాయకుడు మాత్రం పశ్చిమాభిముఖుడై కనిపిస్తాడు. పశ్చిమాభిముఖుడైన స్వామి పడమటి కనుమలకు నిరంతరం రక్షణ కల్పిస్తూ ఉంటాడని భక్తులు విశ్వసిస్తారు. గణపతిపులే గ్రామంలో స్వయంభువుగా వినాయకుడు ఆవిర్భవించడం వెనుక ఒక స్థలపురాణం ఉంది. గతంలో బలభిత్ భిడే అనే బ్రాహ్మణుడు గ్రామకరణంగా ఉండేవాడు. ఒకసారి అతను గడ్డు సమస్యల్లో చిక్కుకున్నాడు. సమస్యల నుంచి బయటపడటానికి గ్రామం వెలుపల ఉన్న మొగలివనంలో కూర్చుని తన ఇష్టదైవమైన వినాయకుని ధ్యానిస్తూ తపస్సు చేయడం ప్రారంభించాడు. నాయకుడు కరుణించి, అతనికి కలలో కనిపించి, ఇక్కడ తాను స్వయంభువుగా ఆవిర్భవిస్తానని, తనకు ఆలయం నిర్మిస్తే అన్ని సమస్యలూ తీరిపోతాయని చెప్పాడు. ఇది జరిగిన తర్వాత భిడేకు చెందిన పశువుల మందలోని ఆవులు పాలివ్వడం మానేశాయి. పశువులకు కాపలాగా వెళ్లే మహిళ వాటిని నిశితంగా గమనించగా, మొగలివనంలోని ఒక పుట్ట వద్ద ఆవులన్నీ పాలను ధారగా కార్చేస్తుండటం కనిపించింది. ఇదే విషయాన్ని భిడేకు చెప్పడంతో, మనుషులతో చేరుకుని పుట్టగా పేరుకుపోయిన మట్టిని తొలగించగా, వినాయకుని విగ్రహం కనిపించింది. దాంతో ఆయన ఇక్కడ చిన్న ఆలయం నిర్మించి, గణపతిని పూజించడం ప్రారంభించాడు. అయితే, ఇప్పుడున్న ఆలయాన్ని పీష్వా ప్రభువులు నిర్మంచారు. త్రినేత్ర గణేశ ఆలయం, రాజస్థాన్ త్రినేత్ర గణేశయ ఆలయంలో వినాయకుడు మూడు కన్నులతో భక్తులకు కనువిందు చేస్తాడు. రాజస్థాన్‌లోని రణ్‌థాంబోర్ కోటలో ఉన్న ఈ ఆలయంలోని వినాయకుడిని ‘ప్రథమ గణేశ’ అని కూడా అంటారు. దేశంలో ఇదే మొట్టమొదటి వినాయక ఆలయంగా భావిస్తారు. ఈ ఆలయంలో వెలసిన త్రినేత్ర గణేశ విగ్రహం దాదాపు ఆరున్నర వేల ఏళ్ల కిందటిదని అంచనా. రుక్మిణీ కృష్ణుల వివాహం జరిగినప్పుడు వారు తొలి ఆహ్వాన పత్రికను ఇక్కడి ప్రథమ గణేశునికే పంపారని స్థలపురాణ కథనం. ఇప్పుడు ఈ ఆలయం వెలసిన కోట రణ్‌థాంబోర్ జాతీయ పార్కు పరిధిలో ఉంది. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని పదమూడో శతాబ్దిలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు హమీర్ నిర్మించినట్లు చెబుతారు. హమీర్ వినాయకుడికి పరమభక్తుడు. హమీర్ ఇక్కడ ఆలయం నిర్మించడం వెనుక కూడా ఒక గాథ ప్రచారంలో ఉంది. అప్పట్లో రణ్‌థాంబోర్ కోటపై అల్లాఉద్దీన్ ఖల్జీ దాడి చేశాడు. యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగింది. యుద్ధానికి సిద్ధపడి ముందుగా కోటలోని గోదాముల్లో నిల్వచేసిన తిండి గింజలు, ఇతర నిత్యావసరాలు నిండుకున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఉన్న రాజు తనను, తన రాజ్యాన్నీ, ప్రజలనూ కాపాడాలంటూ గణపతిని ప్రార్థించాడు. రాజు హమీర్‌కు గణపతి కలలో కనిపించాడు. ‘రేపటి నుంచి నీ సమస్యలన్నీ మటుమాయమైపోతాయి’ అని పలికాడు. మర్నాటికల్లా ఖిల్జీ సేనలు వెనక్కు మళ్లడంతో యుద్ధం ముగిసిపోయింది. గోదాముల్లో తిండి గింజలు వచ్చి చేరాయి. కోట గోడ నుంచి త్రినేత్ర గణపతి విగ్రహం ఆశ్చర్యకరంగా బయటపడింది. ఈ అద్భుత సంఘటనతో గణపతిపై రాజు హమీర్ భక్తివిశ్వాసాలు రెట్టింపయ్యాయి. గణపతిని వృద్ధి సిద్ధి సమేతంగా, గణపతి కొడకులైన శుభ లాభాల విగ్రహాలను, గణపతి వాహనమైన మూషిక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడు. ఇప్పటికీ చాలామంది ఇళ్లల్లో శుభకార్యాలు జరిపేటప్పుడు ఇక్కడి ప్రథమ గణపతికి తొలి ఆహ్వాన పత్రికలు పంపిస్తూ ఉంటారు. ప్రథమ గణపతికి తొలి ఆహ్వానం పంపితే, శుభకార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయని నమ్ముతారు. కర్పక వినాయక ఆలయం, తమిళనాడు వినాయకుని అరుదైన ఆలయాల్లో తమిళనాడులోని కర్పక వినాయక ఆలయం ఒకటి. శివగంగై జిల్లాలోని పిళ్లయ్యార్‌పట్టి గ్రామంలో ఉంది ఈ పురాతన ఆలయం. దీనిని స్థానికులు పిళ్లయ్యార్ ఆలయం అని కూడా అంటారు. ఇది గుహాలయం. గుహలో దేవతామూర్తుల పురాతన శిలా విగ్రహాలు కనిపిస్తాయి. ఈ ఆలయం గర్భగుడిలోని గుహలో కనిపించే పద్నాలుగు శిల్పాలు పదో శతాబ్ది నుంచి పదమూడో శతాబ్ది మధ్య కాలానికి చెందినవని అంటారు. పిళ్లయ్యార్‌పట్టి కొండల నడుమ గుహలో వెలసిన కందర్ప వినాయకునికి పాండ్య రాజులు ఆలయాన్ని నిర్మించారు. ఇందులోని మూలవిరాట్టుగా ఉన్న పిళ్లయ్యార్– కందర్ప వినాయకుడి విగ్రహం నాలుగో శతాబ్దికి చెందనదిగా చరిత్రకారుల అంచనా. మిగిలిన చోట్ల వినాయకుడి విగ్రహాలకు తొండం ఎడమ వైపు తిరిగి ఉంటే, ఇక్కడ మాత్రం కుడి వైపు తిరిగి ఉండటం విశేషం. ఈ ఆలయంలోని కాత్యాయనిని, పశుపతీశ్వరుడిని, నాగలింగాన్ని కూడా భక్తులు పూజిస్తారు. ప్రస్తుతం చెట్టియార్లలోని నాగరదర్ వంశీయులు ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో ఏటా వినాయక నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. చింతామన్ గణపతి, మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్‌లోని పురాతన నగరమైన ఉజ్జయినిలో వెలసిన గణపతి ఆలయం ఇది. శైవక్షేత్రంగా, శక్తిపీఠంగా పేరుపొందిన ఉజ్జయినిలో వెలసిన ఈ గణపతి భక్తుల చింతలను తీర్చుతాడని, అందుకే ఇక్కడి గణపతిని చింతాహరణ గణపతి అని, చింతామణి గణపతి అని కూడా అంటారు. ఈ ఆలయంలోని గణపతి స్వయంభువుగా వెలిశాడు. వృద్ధి, సిద్ధి సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ వినాయకుడు స్వయంభువుగా ఎప్పుడు వెలశాడో తెలిపే కచ్చితమైన ఆధారాలేవీ లేవు. అయితే చరిత్రపూర్వయుగం నుంచే ఇక్కడ స్వయంభూ గణపతి వెలసి ఉండవచ్చని కొందరి అంచనా. మాల్వా రాజ్యాన్ని పాలించిన పరమార్ రాజులు పదకొండు–పన్నెండు శతాబ్దాల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఉజ్జయినిలోని మహాకాలేశ్వరుడిని, మహాకాళిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు మహాకాళేశ్వర ఆలయానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతామన్ గణపతి ఆలయాన్ని కూడా తప్పనిసరిగా దర్శించుకుంటారు. ఈ ఆలయంలో గణపతి ఎదుటనే మహావిష్ణువు విగ్రహం కూడా ఉంటుంది. విష్ణువుకు గల సహస్రనామాలలో ‘చింతామణి’ కూడా ఒకటి. అందువల్ల కూడా ఇక్కడ వెలసిన గణపతిని చింతామణి గణపతి అంటారని చెబుతారు. ఇక్కడకు వచ్చే భక్తులు గణపతితో పాటు విష్ణువుకు కూడా పూజలు చేసి వెళుతుంటారు. మహావినాయక ఆలయం, ఒడిశా ఐదుగురు దేవతలను ఏక దైవంగా పూజించే అరుదైన ఈ ఆలయం ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా చండిఖోల్‌లో ఉంది. శివుడు, విష్ణువు, దుర్గ, సూర్యుడు, వినాయకుడు– ఈ ఐదుగురినీ వినాయకుడి రూపంలోనే ఇక్కడ ఆరాధిస్తారు. ఇంకో విశేషమేమిటంటే, ఈ ఆలయంలో పవళింపు సేవ ఉండదు. సాధారణంగా అన్ని ఆలయాల్లోనూ ఆలయాలను మూసివేసే ముందు పవళింపు సేవ చేస్తారు. ఐదుగురు దేవతలూ ఏకరూపంలో కొలువుదీరడం వల్లనే ఇక్కడ పవళింపు సేవ చేయరని చెబుతారు. ఐదుగురు దేవతల్లో శివ కేశవులు ఉండటం వల్ల ప్రసాదంలో బిల్వపత్రిని, తులసి ఆకులను రెండింటినీ ఉపయోగిస్తారు. అలాగే, ఈ ఆలయంలో అన్న ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు. చండిఖోల్ పట్టణం రెండు కొండల నడుమ వెలసింది. మొదటి కొండ దిగువన చండీ ఆలయం, రెండో కొండ దిగువన మహావినాయక ఆలయం వెలశాయి. రెండు ఆలయాల వద్ద రెండు విశాలమైన తటాకాలు కనిపిస్తాయి. కళింగ రాజ్యాన్ని తొమ్మిదో శతాబ్ది నుంచి పన్నెండో శతాబ్ది వరకు పరిపాలించిన కేసరి వంశ రాజులు ఇక్కడి మహాగణపతి ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడి కొండలను వరుణుడి కొండలు అంటారు. ధర్మరాజు వరుణుడి కొండల ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని కొంతకాలం పాలించాడనే కథనాన్ని కూడా స్థానికులు చెబుతుంటారు. ఇక్కడి ధర్మరాజు కోటను ‘తెలిగఢ్’కోట అంటారు. మహా వినాయకుడి ఆలయానికి చేరువలో కనిపించే కోట శిథిలాలు ధర్మరాజుకి చెందినవేనని చెబుతారు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయం సాధించిన తర్వాత కుంతీదేవి ఈ కోట నుంచే బంగారు సంపెంగను శివునికి కానుకగా సమర్పించిందని చెబుతారు. -
సత్య ప్రమాణాల స్వామికే శఠగోపం..
టీడీపీ నాయకులు సత్య ప్రమాణాల స్వామిగా ప్రసిద్ధి చెందిన కాణిపాకం వినాయకుడికే శఠగోపం పెట్టారు. గత ఐదేళ్లలో కాణిపాకం దేవస్థానం సము దాయంలో దుకాణాల నిర్వహణకు అడ్డదారిలో టెండర్లు దక్కించుకున్నారు. రుసుం చెల్లించకుండా చేతులెత్తేశారు. టెండరు పాడుకున్న సమయంలో ఇచ్చిన చిరునామాకు వెళ్లిన అధికారులు.. ఆ పేర్లతో ఎవరూ లేరని చెప్పడంతో వెనుదిరుగుతున్నారు. సాక్షి, కాణిపాకం: వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం దేశంలోనే ప్రముఖ పుణ్య క్షేత్రం గా విరాజిల్లుతోంది. నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలో ఆలయం వద్ద భక్తుల అవసరం మేరకు దుకాణ సముదాయాలను ఏర్పాటుచేసింది. వీటికి ఏడాది, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాల కాలవ్యవధిలో టెండర్ల ద్వారా కేటాయిస్తారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో టీడీపీ నాయకులు బినామీ పేర్లతో దేవస్థానంలో దుకాణాలు దక్కించుకొని.. టెండరు పలికిన మొత్తం చెల్లించకుండా దేవస్థాన ఖజానాకు భారీగా గండి కొట్టారు. చివరికి రూ.2 కోట్ల రూపాయల మేర అప్పులుగా మిగిల్చారు. వీటిని వసూలు చేసుకునేందుకు దేవస్థాన అధికారులు తలలు పట్టుకుంటున్నారు. చేసేదిలేక న్యాయస్థానాలకు ఆశ్రయిస్తున్నారు. దేవస్థానం అధికారులు విడుదల చేసిన లెక్కల ప్రకారం దాదాపు రూ.2 కోట్ల మేరకు బకాయిలు రావాల్సి ఉంది. తప్పుడు చిరునామాతో టెండర్లు కాణిపాకం దేవస్థానం దుకాణ సముదాయాల్లో షాపులను టెండర్లు నిర్వహించి ఏడాది పాటు కేటాయిస్తారు. 6 నెలల క్రితం వరకు మొదట్లో డిపాజిట్ కట్టించుకోకుండా కేటాయించేవారు. ప్రతి నెలా అధికారులు దుకాణదారుల వద్దకు వెళితే మొక్కుబడిగా కొంత మొత్తం చెల్లించేవారు. గడువు పూర్తయ్యే సరికి పెద్ద మొత్తంలో బకాయి మిగిలిపోవడంతో అధికారులు ఒత్తిడి చేయకుండా మభ్య పెడుతూ వచ్చారు. గడువు పూర్తయ్యాక ముఖం చాటేస్తున్నారు. వారిచ్చిన చిరునామాకు అధికారులు వసూళ్ల కోసం వెళితే వారు ఇచ్చిన చిరునామా తప్పని తేలుతోంది. బినామీలకు సహకరిస్తూ లక్షలు వెనకేసుకుంటూ.. బినామీ పేర్లతో దుకాణాలు దక్కించుకున్న టీడీపీ నాయకులు వాటిద్వారా లక్షలు గడించారు. వీరికి ఐదేళ్లుగా ఎలాంటి ఒత్తిడి రాకుండా పరిపాలన కార్యాలయంలోని ఓ కీలక అధికారి కొమ్ము కాసేవాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. లక్షలు, కోట్లు బినామీ పేర్లతో ఎగవేతలు వేస్తుంటే దేవదాయ శాఖ, ఆశాఖ అధికారులు ఏంచేస్తున్నారో అర్థం కావడం లేదని వారికి సహకరిస్తూ లక్షలు వెనకేసుకున్న అధికారులు ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మేల్కొన్న అధికారులు ఈ మోసాలను పసిగట్టిన అధికారులు ఆరు నెలల నుంచి టెండర్లు దక్కించుకున్న వారి వద్ద నుంచి ముందుగానే డిపాజిట్ వసూలు చేస్తున్నారు. న్యాయస్థానంలో తేల్చుకుంటాం.. కాణిపాకం దేవస్థానంలో 2014 నుంచి 2019 వరకు టెండరు తాలూకు అప్పులు ఉన్న వారిపై న్యాయస్థానంలో కేసులు వేశాం. ఎక్కువ బాకీ ఉన్న వారి ఆస్తులను జప్తు చేసుకునేందుకు, అప్పులు వసూలు చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాం. 2017–19 మధ్య దుకాణ సముదాయాలు తీసుకున్న వారికి నగదు చెల్లింపులు చేయాల్సిందిగా నోటీసులు ఇచ్చాం. 2014లో కోటి రూపాయలకు పైగా అప్పులు మిగిలాయి. బాధ్యులపై చర్యలు తప్పవు. – పి.పూర్ణచంద్రరావు, కాణిపాకం ఈఓ -
వినాయకా...ఏమిటీ పొగ కష్టాలు
సాక్షి, కాణిపాకం: కాణిపాకం దేవస్థానం వద్ద ప్రతిరోజూ చెత్త కుప్పలకు నిప్పు పెడుతుండటంతో వచ్చే దుర్వాసనకు భక్తులు, వృద్ధులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయానికి కూతవేటు దూరంలోని నిత్యాన్నదాన కేంద్రం, కల్యాణకట్ట సమీపంలో నుంచి వచ్చే దట్టమైన పొగలతో జనం అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. నిత్యం కాణిపాక దేవస్థానం, పరిసరాల నుంచి వచ్చే చెత్తను (ప్లాస్టిక్ వ్యర్థాలను) సమీపంలోని బాహుదా నది ఒడ్డున ఆలయ అధికారులు పడేస్తున్నారు. ఆ చెత్త కుప్పలు పేరుకుపోయిన తరువాత సిబ్బంది వాటికి అక్కడే నిప్పుపెడుతున్నారు. ఈ సందర్భంగా వచ్చే తీవ్రమైన దుర్వాసనతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాణిపాకం దేవస్థానం, పంచాయతీ పరిధిలో నలభైకిపైగా చిన్న, పెద్ద తరహా హోటళ్లు ఉన్నాయి. వీటి నుంచి నిత్యం వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను పారిశుద్ధ్య సిబ్బంది ఇక్కడ పడవేస్తున్నారు. వాటి నుంచి వచ్చే కాలుష్యంతో అనర్థాలు తప్పడం లేదు. డంపింగ్ యార్డు వినియోగం ఎప్పటికో ? కాణిపాకం పంచాయతీ లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు ప్రస్తుతం పూర్తి స్థాయిలో వినియోగానికి నోచుకోవడంలేదు. ప్రభుత్వం సరఫరా చేసిన బ్యాటరీ వాహనాలు ఉన్నప్పటికీ పంచాయతీ సిబ్బంది చెత్తను ఎక్కడబడితే అక్కడ పడేస్తున్నారు. దేవస్థానానికి సైతం డంపింగ్ యార్డు వినియోగించుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ దేవస్థానం సైతం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఆలయం వద్ద చెత్త కుప్పలను ఎక్కడబడితే అక్కడ పడేస్తున్నారు. తక్షణం ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని భక్తులు, ప్రయాణికులు కోరుతున్నారు. -
కాణిపాకంలో భద్రత గాలికేనా..?
చిత్తూరు ,కాణిపాకం: ప్రసిద్ధ కాణిపాకం ఆలయం వద్ద భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నాలుగు వందల మందికి పైగా పోలీసులు పహరా కాశా రు. ఈక్రమంలో పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న లాడ్జిలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణిస్తే కనీస సమాచారం కూడా ఇవ్వకుండా లాడ్జి యజమాని ఆ మృతదేహాన్ని తీసుకు వెళ్లి సమీపంలోని ఓ చెరువులో ఖననం చేశారు. దారి పొడవునా సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు ఉన్నా నాలుగు రోజుల వరకు పోలీసులకు లాడ్జిలో వ్యక్తి మరణించిన ఘటన తెలియకపోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది. సీసీ కెమెరాల్లో ఫుటేజీ ఎలా తొలగించారు? కాణిపాకం గ్రామంలో పోలీసు స్టేషన్‌ను అనుసంధానం చేస్తూ నలభైకి పైగా సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటితో పాటూ చుట్టుపక్కల ఉన్న లాడ్జిల్లో సైతం మరో రెండు వందల వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని అనుక్షణం పోలీసు సిబ్బంది పహారా కాసే విధంగా అనుసంధానం చేశారు. వీటిలో ఎప్పటికప్పుడు దృశ్యాలు రికార్డు చేస్తుంటారు. అయినా భద్రత మాత్రం గాలిలో దీపంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫుటేజీ కూడా కనిపించకుండా పోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతన్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో.. వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు 40 వేల నుంచి 50 వేల మంది వరకు భక్తులు ఆలయానికి వచ్చారు. ఇలాంటి తరుణంలో పగడ్బందీగా రక్షణ చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సుబ్బారావు సమీక్ష సమావేశంలో వెల్లడించారు. రథోత్సవం, పుష్పపల్లకి, తెప్పోత్సవం వంటి కార్యక్రమాలకు రెండువందల మందికి పైగా పోలీసులను ఇక్కడ బందోబస్తుకు నియమించారు. ఇక రథోత్సవం రోజున.. అత్యాధునిక సదుపాలయాలతో కూడిన కమాండ్ కంట్రోల్ వాహనంతో అడుగడుగునా పోలీసులు పహారా కాశారు. అయితే పోలీసు స్టేషన్‌కు ఐదువందల మీటర్లు దూరంలో ఉన్న ఒక ప్రైవేటు లాడ్జిలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందితే.. ఆ మృతదేహాన్ని పట్టపగలు బైక్‌పై తరలిస్తే.. గుర్తించలేకపోయారు. దీనిపై తీవ్ర స్థాయి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లాడ్జిల్లో నిబంధనలకు పాతర కాణిపాకం కేంద్రంగా 50కి పైగా ప్రయివేటు లాడ్జి్జలు ఉన్నాయి. వీరికి అడపాదడపా పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తూ.. నిబంధలను గుర్తు చేస్తున్నా ఏమాత్రం ప్రయోజనం కనిపించడం లేదు. లాడ్జిలో రూం కేటాయించే ముందు ప్రతి వ్యక్తి ఫొటో, ఆధార్ నంబర్లను కచ్చితంగా పోలీసు యాప్‌లో అప్ లోడ్ చేయాల్సి ఉంది. అలాగే అధికారుల కోసం ఒక రిజిస్టర్.. ప్రత్యేకంగా మరో రిజిస్టర్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంది. అయితే ఇవేమీ లాడ్జి యజమానులు పాటించడం లేదు. దీనిపై పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిశీలించి చర్యలు తీసుకుంటాం స్థానికంగా లాడ్జిలో వ్యక్తి మరణించగా అతడిని గుట్టు చప్పుడు కాకుండా బహుదా నది పరివాహక ప్రాంతంలో పూడ్చి వేసిన విషయంపై కేసు నమోదైంది. దీనిపై స్థానిక వీఆర్ఓకు సమాచారం అందింది. వెంటనే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాం. ఉన్నతాధికా రుల ఆదేశాల మేరకు శవ పంచనామ నిర్వహించి చర్యలు తీసుకుంటాం.– ఆదినారాయణ, చిత్తూరు వెస్ట్ సీఐ -
ఆ నేతకు నిబంధనలు వర్తించవా?
కాణిపాకం: ఆయన అధికార పార్టీ నేత. కాణిపాకం ఆలయంలో నిబంధనలు తనకు వర్తించవు అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. గర్భగుడిలోనైనా నిబంధనలు అడ్డురావు. యథేచ్ఛగా సెల్‌ఫోన్ వినియోగిస్తుంటారు. అది సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుందని తెలిసినా పట్టించుకోడు. టీడీపీ నేత ఈశ్వరబాబు (బుజ్జినాయుడు) కాణిపాకం ట్రస్టుబోర్డు చైర్మన్ రేసులో ఉన్నారు. తనకు నిబంధనలేమీ వర్తించవన్నట్లు ప్రవర్తిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. గర్భగుడిలో అభిషేకం జరుగుతుంటే సెల్ఫోన్లో మాట్లాడుతుండడం సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఆలయ భద్రత దృష్ట్యా సెల్ఫోన్లు ఆలయంలో నిషేధించినా బుజ్జినాయుడు వ్యవహరించిన తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కాణిపాకం గర్భగుడిలో అగ్నిప్రమాదం
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఆలయ గర్భగుడిలో ఏసీలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్‌సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఆలయ అధికారులు తెలిపారు. -
సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న జగన్