
కాణిపాకం (చిత్తూరు): కాణిపాక శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి 21 రోజులపాటు నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో ఆలయ ప్రాకారం లోపల మాత్రమే ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 10వ తేదీ శుక్రవారం ఉదయం ప్రత్యేక అభిషేకం, సాయంత్రం పుష్పకావళ్ల కార్యక్రమంతో మొదలయ్యి, 30వ తేదీ గురువారం ఉదయం అభిషేకం, సాయంత్రం తెప్పోత్సవంతో ముగుస్తాయి. ఈ మేరకు ఉత్సవ ఏర్పాట్లలో దేవస్థానం అధికారులు తలమునకలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment